క్రూ మాడ్యూలు వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
CARE
మిషన్ రకంసాంకేతికత
ఆపరేటర్ఇస్రో
మిషన్ వ్యవధి20 నిముషాలు
పరిథి1,600 kilometres (990 mi)
అపోజీ126 kilometres (78 mi)
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి3,735 kilograms (8,234 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ18 December 2014, 04:00 (2014-12-18UTC04Z) UTC
రాకెట్ఎల్‌విఎమ్‌3
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
మిషన్ ముగింపు
ల్యాండింగ్ తేదీ18 December 2014, 04:15 (2014-12-18UTC04:16Z) UTC
ల్యాండింగ్ ప్రదేశంబంగాళాఖాతం
 

క్రూ మాడ్యూలు వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం (The Crew Module Atmospheric Re-entry Experiment  -CARE) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి కక్ష్యా వాహనం యొక్క ప్రయోగాత్మక పరీక్షా వాహనం. 2014  డిసెంబరు 8 న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్‌విఎమ్‌3 రాకెట్టు ద్వారా దాన్ని విజయవంతంగా  ప్రయోగించారు.[1][2]

వాహనం వివరాలు[మార్చు]

క్రూ మాడ్యూలు ఇస్రో తలపెట్టిన మానవ సహిత యాత్రలో ఉపయోగించే గగన్‌యాన్లోని ఒక భాగం.[3] గగన్‌యాన్‌లో రెండు మాడ్యూళ్ళుంటాయి - క్రూ మాడ్యూలు, సర్వీసు మాడ్యూలు. క్రూ మాడ్యూల్లో వ్యోమనాట్లు ప్రయాణిస్తారు.

కేర్‌ను జిఎస్‌ఎల్‌వి మార్క్3 పేలోడ్ ఫెయిరింగులో తల్లకిందులుగా అమర్చారు. అది అల్యూమినియం మిశ్రమంతో తయారైంది. పైకి లేచేటపుడు దాని బరువు 3,735 కిలోలు. దాని వ్యాసం 3100 మిమీ, ఎత్తు 2678 మిమీ. మాడ్యూలుకు ఊడదీయగలిగే ఉష్ణ కవచపు తొడుగు ఉంది. ఈ తొడుగు పార్శ్వాల్లో మధ్యమ సాంద్రత కలిగిన పలకలు ఉండగా, ముందు వైపున కార్బన్ ఫెనాలిక్ ఫలకాలను అమర్చారు. దానికి బ్యాటరీల నుండి పవరు వస్తుంది. 100 న్యూటన్ల థ్రస్టును ఇచ్చే 6 ద్రవ ఇంధన థ్రస్టర్లు కూడా దానికి అమర్చారు.

ప్రాథమిక పరీక్షలు[మార్చు]

మాడ్యూలు రికవరీ విధానాన్ని 2014 అక్టోబరు 31 న ప్రయోగాత్మకంగా జరిపారు. ఇందులో భారతీయ తీర రక్షక దళపు సముద్ర పహ్రీదార్ నౌక పాల్గొంది.[4]

యాత్ర వివరాలు[మార్చు]

మాడ్యూలును 2014 డిసెంబరు 18 న ఉదయం 9:30 కు ఎల్‌విఎమ్‌3 ద్వారా ప్రయోగించారు. 126 కి.మీ.ఎత్తున 5.3 కిమీ/సె వేగం వద్ద  మాడ్యూలు విడిపోయింది. కొంతసేపు అదే వేగంతో ప్రయాణించింది. ఈ దశలో మూడు అక్షాల నియంత్రణ మెనూవర్లు జరిపి పునఃప్రవేశ సమయంలో యాంగిల్ ఆఫ్ ఎటాక్ సున్నా డిగ్రీలు ఉండేలా జాగ్రత్త తీసుకుంది.

80 కి.మీ.ఎత్తున బాలిస్టిక్ పథంలో పునఃప్రవేశం మొదలైంది. ఈ ఎత్తులో చోదనం ఆపేసారు. ఉష్ణ కవచం 1,000 డిగ్రీ C ఉష్ణోగ్రతకు గురైంది. మాడ్యూలు 13 g వరకూ త్వరణాన్ని (వ్యతిరేక త్వరణం) చవి చూసింది.[5]

పునఃప్రవేశం తరువాత మాడ్యూలు అవనతమౌతూ, నీటిలో పడే వరకూ పారాచూట్ వ్యవస్థ ఆమూలాగ్రం పరీక్షలకు గురైంది. అపెక్స్ కవరు విడిపోవడం, క్లస్టరుగా పారాచూట్లు తెరుచుకోవడం వంటివి కూడా ఈ పరీక్షల్లో ఉన్నాయి. మాడ్యూలు వేగం 233 మీ/సె కు తగ్గినపుడు పారాచూట్లు తెరుచుకోవడం మొదలైంది. క్రూ మాడ్యూల్లో మూడు రకాల పారాచూట్లున్నాయి. అవన్నీ జతలుగా ఉన్నాయి. ముందుగా, 2.3 మీ వ్యాసం గల పైలట్ పారాచూట్ జత తెరుచుకుంది. ఆ తరువాత 6.2 మీ డ్రోగ్ పారాచూట్లు తెరుచుకున్నాయి. దీనితో మాడ్యూలు వేగం 50 మీ/సె కు తగ్గింది. 5 కి.మీ.ఎత్తున ప్రధాన పారాచూట్ల జత తెరుచుకున్నాయి. ఒక్కొక్కటి 31 మీ వ్యాసం గల ఈ పారాచూట్లు భారత్‌లో తయారైన వాటిలో అతి పెద్దవి.[6]

బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్‌కు 600 కి.మీ., శ్రీహరికోట నుండి 1600 కి.మీ.దూరంలో కేర్ మాడ్యూలు దిగింది.[7] ఆ వెంటనే ప్రధాన  పారాచూట్లను తొలగించుకుంది. మాడ్యూలులోని సిగ్నలును వెతుక్కుంటూ భారతీయ తీర రక్షక దళం దాన్ని చేరుకుంది. పైకి లేచినప్పటి నుండి, నీటిలో దూకే దాకా మొత్తం ప్రయోగానికి 20 నిముషాల 43 సెకండ్లు సమయం పట్టింది.[8]

రికవరీ చేసిన మాడ్యూలును 2014 డిసెంబరు 22 న చెన్నైకి తీసుకువచ్చారు. అక్కడి నుండి శ్రీహరికోటకు పంపి ప్రాథమిక పరీక్షలు చేస్తారు.[9] ఆ తరువాత మరిన్ని పరిశీలనల కోసం దాన్ని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు.[9]

ఇస్రో ద్వారా టెలిమెట్రీ[మార్చు]

దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో కింది టెలిమెట్రీ డేటా కనిపించింది:[10]

సమయం (సెకండ్లు) ఘటన గమనింపులు
0.1 S200 జ్వలనం భూమిపై మండడం మొదలయ్యే 2 స్ట్రాపాన్ ఘన బూస్టర్లు
120 L110 జ్వలనం గాలిలో మండడం మొదలయ్యే L110 ద్రవ ఇంధన కోర్
153.5 S200 విడిపోవడం 2 ఘన బూస్టర్లు విడిపోవడం
163.4 CLG మొదలైంది CLG = Closed-Loop Guidance
237.2 ఉష్ణ కవచం విడిపోయింది సాధారణం
324.6 L110 ఆగింది సాధారణం: సాపేక్ష వేగం 4.92 కిమీ/సె, రేంజి 565.6 కిమీ, ఎత్తు 125.6 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు
325.7 L110 విడిపోయింది సాధారణం: సాపేక్ష వేగం 4.95 కిమీ/సె, రేంజి 570.5 కిమీ, ఎత్తు 125.4 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు
330.8 CARE మాడ్యూలు విడిపోయింది సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 599.5 కిమీ, ఎత్తు 125.1 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు
341.0 CARE మాడ్యూలు CLG మొదలైంది సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 633.1 కిమీ, ఎత్తు 125.2 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు
385.5 బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 4.93 కిమీ/సె, రేంజి 858.8 కిమీ, ఎత్తు 116.6 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు
399.5 బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది  సాధారణం: సాపేక్ష వేగం 4.94 కిమీ/సె, రేంజి 926.6 కిమీ, ఎత్తు 111.8 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు
419.5 బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 1023.5 కిమీ, ఎత్తు 103.1 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు
440.5 బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 4.98 కిమీ/సె, రేంజి 1125.6 కిమీ, ఎత్తు 91.8 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు
460.6 CARE మాడ్యూలు పునఃప్రవేశం సాధారణం
468.5 బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 5.00 కిమీ/సె, రేంజి 1262.4 కిమీ, ఎత్తు 73.3 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు
573.0 CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 0.244 కిమీ/సె, రేంజి 1534.5 కిమీ, ఎత్తు 18.1 కిమీ
584.0 CARE మాడ్యూలు 15.5 కి.మీ.ఎత్తున సాధారణం: సాపేక్ష వేగం 0.210 కిమీ/సె, రేంజి 1535.6 కిమీ, ఎత్తు 15.9 కిమీ
584.3 APEX కవరు విడిపోయింది సాధారణం
584.5 CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 0.209 కిమీ/సె, రేంజి 1535.7 కిమీ, ఎత్తు 15.8 కిమీ
589.4 పైలట్ పారాచూట్ తెరుచుకుంది సాధారణం
596 CARE మాడ్యూలు దిగుతోంది సాధారణం: సాపేక్ష వేగం 0.086 కిమీ/సె, రేంజి 1536.0 కిమీ, ఎత్తు 14.2 కిమీ
740.6 CARE మాడ్యూలు 5 కి.మీ.ఎత్తున ఉంది సాధారణం
741.4 ప్రధాన పారాచూట్ తెరుచుకుంది CARE మాడ్యూలు దిగే వేగం నీటిని తాకే ముందు విపరీతంగా పెరిగిపోయింది
751.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.431 కిమీ/సె, రేంజి 1508.2 కిమీ, ఎత్తు 0.9 కిమీ
755.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.443 కిమీ/సె, రేంజి 1506.6 కిమీ, ఎత్తు 0.6 కిమీ
760.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.459 కిమీ/సె, రేంజి 1504.7 కిమీ, ఎత్తు 0.1 కిమీ
761.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.462 కిమీ/సె, రేంజి 1504.3 కిమీ, ఎత్తు 0.0 కిమీ
779.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.518 కిమీ/సె, రేంజి 1496.7 కిమీ, ఎత్తు -1.7 కిమీ
833.0 CARE మాడ్యూలు దిగుతోంది చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.689 కిమీ/సె, రేంజి 1468.7 కిమీ, ఎత్తు -7.8 కిమీ
940.0 CARE మాడ్యూలు దిగుతోంది అంతిమంగా చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 1.014 కిమీ/సె, రేంజి 1406.3 కిమీ, ఎత్తు -21.0 కిమీ

పాల్గొన్న సంస్థలు[మార్చు]

  • హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
  • Aerial Delivery Research and Development Establishment, Agra - parachute
  • Valeth Hightech Composites

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. "ISRO All Set to Launch its 'Mini Orion' GSLV Mark III Mission on Dec. 18 (Photos)". Archived from the original on 2014-12-10. Retrieved 2016-08-29.
  2. Isro successfully test-fires GSLV Mark III carrying unmanned crew module Times of India 18 December 2014
  3. "క్రూ మాడ్యూలు గురించిన ఇస్రో పేజీ". Archived from the original on 2016-09-03. Retrieved 2016-08-29.
  4. "LVM 3 X launch with crew module between Dec 15 & 20". Archived from the original on 2016-03-04. Retrieved 2016-08-29.
  5. Unmanned crew module to be tested 10 December 2014 The Hindu
  6. http://www.indiatimes.com/news/india/7-reasons-why-the-successful-launch-of-india%E2%80%99s-largest-rocket-gslv-mark-iii-is-a-huge-deal-228975.html
  7. First Experimental Flight of India's Next Generation Launch Vehicle GSLV Mk-III Successful Archived 2014-12-18 at Archive.today - ISRO Press Release - December 18, 2014
  8. http://www.ibtimes.co.uk/india-successfully-launches-heaviest-rocket-gslv-mk-iii-1480025
  9. 9.0 9.1 ISRO Module Heads Home After Sojourn Archived 2014-12-25 at the Wayback Machine The New Indian Express 22 December 2014
  10. "The Launch of GSLV-M-III X from Sriharikota". YouTube. Doordarshan. Retrieved 5 November 2015.