Jump to content

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్

వికీపీడియా నుండి

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) భారత ప్రభుత్వం స్థాపించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 2019 మార్చి 6 న స్థాపించారు. భారత అంతరిక్ష విభాగం అధీనంలో ఈ సంస్థ ఉంటుంది. ఇస్రో, భారత అంతరిక్ష విభాగాల పరిశోధన ఫలాలను వ్యాపారాత్మకంగా వినియోగించుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించింది. భారత అంతరిక్ష కార్యక్రమపు అవసరాలను తీర్చేందుకు, అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో వ్యాపారాన్ని అందిపుచ్చుకునేందుకూ ఈ సంస్థను ఏర్పాటు చేసారు. ఎన్‌ఎస్‌ఐఎల్ ఏర్పాటు అంతరిక్ష రంగంలోని భారతీయ పరిశ్రమలు ఎదగడానికి, పరిశ్రమలు తమ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికీ దోహద పడుతుంది.[1]

2019 జూలై 5 న లోక్‌సభలో చేసిన బడ్జెట్ ప్రసంగంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంస్థ ఏర్పాటును ప్రస్తావించింది.[2][3]

ఉద్దేశాలు

[మార్చు]

కింది లక్ష్యాలను ఉద్దేశించి సంస్థను స్థాపించినట్లుగా భారత ప్రభుత్వం వెల్లడించింది.[1]

  1. చిన్న ఉపగ్రహ సాంకేతికతను పరిశ్రమకు బదిలీ చెయ్యడం: అంతరిక్ష విభాగం/ఇస్రో ల నుండి సంస్థ లైసెన్సు పొంది, దాన్ని పరిశ్రమలకు బదిలీ చేస్తుంది.
  2. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం తయారీ, ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంతో
  3. భారత ప్రైవేటు రంగ సంస్థలతో పిఎస్‌ఎల్‌వి ని తయారు చేయించడం
  4. అంతరిక్షానికి సంబంధించిన సేవలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగు
  5. ఇస్రో, ఇతర అంతరిక్ష విభాగపు సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చెయ్యడం
  6. ఉప సాంకేతికతలు, ఉత్పత్తులు,సేవల మార్కెటింగు - భారత్‌లోను, బయటా
  7. భారత ప్రభుత్వం ఆదేశించే ఇతర విషయాలేమైనా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్". ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, భారత ప్రభుత్వం. 24 Jul 2019. Archived from the original on 26 ఆగస్టు 2019. Retrieved 26 Aug 2019.
  2. "అంతరిక్ష రంగంలో ఆర్థిక ఫలాలు - ఇస్రో ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక సంస్థ". ఈనాడు. 6 Jul 2019. Archived from the original on 26 ఆగస్టు 2019. Retrieved 26 ఆగస్టు 2019.
  3. "బడ్జెట్ 2019: ఎఫ్‌ఎమ్ హైక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఔట్‌లే, పుషెస్ ఫర్ కమర్షియలైజేషన్". బిజినెస్ స్టాండర్డ్. 5 Jul 2019.