ఆర్యభట్ట ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్యభట్ట ఉపగ్రహం
India's First indigenously built Satellite Launched into Space
మిషన్ రకంAstrophysics
ఆపరేటర్ISRO
COSPAR ID1975-033A Edit this at Wikidata
SATCAT no.7752
మిషన్ వ్యవధి4 days achieved
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి360 kg (794 lb)[1]
శక్తి46 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ19 April 1975, 07:30 (1975-04-19UTC07:30Z) UTC[2]
రాకెట్Kosmos-3M
లాంచ్ సైట్Kapustin Yar 107/2
మిషన్ ముగింపు
చివరి పరిచయం24 April 1975 (1975-04-25)
Decay date12 February 1992
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentricq
రెజిమ్Low Earth
Perigee altitude568 kilometres (353 mi)
Apogee altitude611 kilometres (380 mi)
వాలు50.6 degrees
వ్యవధి96.46 minutes
ఎపోచ్19 May 1975[3]
 

ఆర్యభట్ట భారతదేశం తయారుచేసిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం.[1] ప్రాచీన భారత ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడూ అయిన ఆర్యభట్ట[4] జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేసారు.

ప్రయోగం[మార్చు]

1975 సంవత్సరం నాటికి భారతదేశానికి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం అందుబాటులో లేదు.అందువలన అప్పటికి భారతదేశానికి మిత్రదేశమైన సోవియట్ యూనియన్ సహకారంతో వారి దేశంలోని అతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అంతరిక్ష విజ్ఞానంలో పరిణతి, అభివృద్ధి సాంధించటం కోసం, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తయారు చేసింది.[5] ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ లోని కాపుస్తిన్న్ యార్ (Kapustin Yar) లోని అంతరిక్ష వాహన ప్రయోగ కేంద్రం నుండి కాస్మోస్ -3M అనే ఉపగ్రహ వాహక రాకెట్ సహాయంతో 1975 ఏప్రిల్ 19 న విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.[1]

ఈ ఉపగ్రహ ప్రయోగం నిమిత్తమై ఇండియా, సోవియట్ యూనియన్ మధ్య యు ఆర్ రావు సారథ్యంలో 1972 లో అంగీకారం కుదిరింది. ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతి ఫలంగా సోవియట్ యూనియన్ భారత రేవుల నుండి, ఓడల నుండి లాచింగ్ వాహనాల జాడలు పట్టుటకు (ట్రాకింగు) వారికి భారతదేశం అనుమతి ఇచ్చింది[6]

ఉపగ్రహం సాంకేతిక వివరాలు, కక్ష్య వివరాలు[మార్చు]

96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టు కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ (భూమినుండి ఎక్కువదూరం), 568 కిలోమీటర్ల పెరిజీ (భూమినుండి దగ్గరిదూరం) ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహ ప్రయోగ ఉద్దేశం ఎక్సు కిరణాల అధ్యయనం (ray astronomy), భౌతిక, రసాయనిక విధానాధ్యయనం (aeronomics), సూర్య సంబంధిత విజ్ఞాన అధ్యాయనం. ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల వ్యాసంతో, 26 పార్శాలు కలిగి ఉంటుంది. ఉపగ్రహపు పైని, క్రింది భాగాలు మినహాయించి అన్ని పార్శాల మీద సౌర ఫలకాలు అమర్చారు. ప్రయోగించిన నాలుగు రోజుల తరువాత, 60 ప్రదక్షణలు పూర్తయిన తరువాత, ఉపగ్రహంలో విద్యుదుత్పత్తిలో లోపం వలన, ఇది పనిచెయ్యడం మానివేసింది. సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది. ఈ ఉపగ్రహం తిరిగి 1992 ఫిబ్రవరి 11 న భూవాతావరణంలో ప్రవేశించింది.

వారసత్వం[మార్చు]

1984 లో సోవియట్ యూనియన్ విడుదల చేసిన స్టాంపుపై భాస్కర-1, -2, ఆర్యభట్ట ఉపగ్రహాల చిత్రాలు

ఈ ఉపగ్రహం యొక్క చిత్రాన్ని 1976, 1997 భారతదేశపు 2రూపాయల కరెన్సీనోట్ల పై,, P-79a-m.సంఖ్య గల 1 రూపాయి నోట్లపై ముద్రించారు.[7]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Aryabhata" in The New Encyclopaedia Britannica. Chicago: Encyclopaedia Britannica Inc., 15th edn., 1992, Vol. 1, p. 611.
  2. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 22 January 2014.
  3. McDowell, Jonathan. "Satellite Catalog". Jonathan's Space Page. Retrieved 22 January 2014.
  4. "Aryabhata - The first indigenously built satellite".
  5. "Aryabhatta - India's First Satellite". 27 October 2009. Archived from the original on 27 అక్టోబరు 2009. Retrieved 22 October 2011.
  6. Harvey, Brian (2000). The Japanese and Indian space programmes : two roads into space. London [u.a.]: Springer [u.a.] p. 133. ISBN 1-85233-199-2.
  7. Cuhaj, George S. (ed.). Standard Catalog of World Paper Money. Vol. 3 (10 ed.). Krause Publications.