Jump to content

భాస్కర –II ఉపగ్రహం

వికీపీడియా నుండి
Bhaskara-II
మిషన్ రకంExperimental Remote Sensing
Earth Obsservation Satellite
మిషన్ వ్యవధి10 years (Re-Entered in 1991)
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌక రకంUnmanned
తయారీదారుడుISRO
లాంచ్ ద్రవ్యరాశి444 కిలోగ్రాములు (979 పౌ.)
శక్తి47 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ20 November 1981 (1981-11-20Z) IST
రాకెట్C-1 Intercosmos Launch Vehicle
లాంచ్ సైట్Volgograd Launch Station
 

1979 లో ప్రయోగించిన భాస్కర-I ఉపగ్రహం తరువాత భారతీయ అంతరిక్ష పరిషోధన సంస్థ ఇస్రో (ISRO) వారు ప్రయోగించిన మరో ఉపగ్రహం పేరుభాస్కర –II.భాస్కర-I ఉపగ్రహంకన్న ఈఉపగ్రహం యొక్క పేలోడ్ పెంచబడింది. ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు.

మొదటి భాస్కరుడు

[మార్చు]

మొదటి భాస్కరుడు సా.శ. 7వ శతాబ్దికి చెందిన భారతీయ గణితవేత్త.శూన్య విలువని సూచించడానికి "0"అనే గుర్తుని మొట్టమొదటగా వాడినవాడు,మొదటి భాస్కరుడు.ఆర్యభటీయంపైన రాసిన భాష్యంలో, సైన్ సంబంధానికి చేసిన ఉజ్జాయింపులు అద్వితీయమైనవి.ఈ ఆర్యభటీయభాష్యం సా.శ. 629లో సంకలితమైంది.ఇది సంస్కృతభాషలోని గణిత, ఖగోళ, జ్యోతిషాలకి సంబంధించి,అత్యంత ప్రాచీనమైన వచనగ్రంథం.ఇతను మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం అనే రెండు ఇతర గ్రంథాలను కూడా రాసాడు.భిన్నాల మీద అధ్యయనంలో గణనీయమైన పాత్ర పోషించిన భారతీయ గణితవేత్తలు, భాస్కరుడు, బ్రహ్మగుప్తులు.

భాస్కర –II ఉపగ్రహం

[మార్చు]

1979 లో ప్రయోగించిన భాస్కర-I ఉపగ్రహంకన్న ఈ ఉపగ్రహం యొక్క పేలోడ్ పెంచబడినది.భాస్కర -II ఉపగ్రహం బరువు 444 కిలోలు.ఈ ఉపగ్రహన్నిఅంతరిక్షములో 54 1కిలోమీటర్ల పెరిజీ,557 కిలోమీటర్ల అపోజి ఎత్తులో, 50.7°డిగ్రీల ఏటవాలుతలంతో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని 1981 వ సంవత్సరం, నవంబరు నెల,శుక్రవారం,20 తారిఖున రష్యాలోని దేశంలోని కాపుస్ యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక (Volgograd Launch Station)నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ అను ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో ప్రవేశపెట్టారు. భాస్కర-I, భాస్కర-II రెండు కూడా భారత దేశపు ఇండియన్ స్పేస్ రిసెర్చిఅర్గనైజేసన్ (ISRO) తయారు చేసిన రెండు ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహం యొక్క పని చెయ్యుకాలం ఒకసంవత్సరం కాగా,ఇది పది సంవత్సరాలు కక్ష్యలో తిరిగింది. 1991లో తిరిగి సపర్కంలోకి వచ్చినది.భాస్కర-I, భాస్కర-II రెండు ఉపగ్రహాలు కూడా లోఎర్తు ఆర్బిట్(LEO)ఉపగ్రహాలు.ఈ ఉపగ్రహామలో రెండు టెలివిజన్ కెమరాలు ఉండగా,ఒకటి విసిబుల్ రకం(600 నానో మీటర్లు), రెండవది నియర్ ఇఫ్రారేడ్(800 నానో మీటర్లు),ఈ ఉపగ్రహం జలవాతావరణం సంబంధించిన సాంకేత విజ్ఞానసమాచారం, అటవీ శాస్త్రవిజ్ఞాన సమాచారాన్ని, భూవిజ్ఞానంకు సంబంధించిన సమాచారాన్ని అందించినది.[1]

ఉపగ్రహం వివరాలు
లక్ష్యం Experimental Remote Sensing
బరువు 444 కిలోలు
onboard power 47 వాట్స్
కమ్యూనికేసన్ VHFబ్యాండ్
Stabilization Spin stabilized (spin axis controlled)
Payload TV cameras, three band Microwave Radiometer (SAMIR)
ప్రయోగ తేది 1981 నవంబరు 20
ప్రయోగ వేదిక Volgograd Launch Station (ప్రస్తుతం రష్యాలోనిది)
వాహక నౌక C-1 Intercosmos
ఎటవాలుతలం 50.7o
పనిచేయు జీవిత కాలం ఒక సంవత్సరం (సాధారణ)
కక్ష్య జీవితం కక్ష్యలో పది సంవత్సరాలు ఉన్నది (1991లో పున కక్ష్యలో ప్రవేశించినది )

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bhaskara-II". isro.gov.in. Archived from the original on 2017-07-30. Retrieved 2015-08-31.