Jump to content

శివశక్తి పాయింట్

వికీపీడియా నుండి
శివశక్తి పాయింట్
శివ శక్తి పాయింట్‌పై చంద్రయాన్-3 ల్యాండర్; ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఫోటో తీయబడింది
చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని OHRC కెమెరా ద్వారా బంధించబడిన చంద్రయాన్-3 ల్యాండర్ చిత్రం
రకంగ్రహాంతర ల్యాండింగ్ సైట్
ప్రదేశంమాంజినస్ సి, సింపెలియస్ ఎన్ బిలాలు, చంద్రుడు మధ్య ప్రాంతం[1]
అక్షాంశ,రేఖాంశాలు69°22′23″S 32°19′08″E / 69.373°S 32.319°E / -69.373; 32.319
స్థాపించబడింది
  • ప్రకటించిన తేదీ: 2023 ఆగస్టు 26
  • ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ (IAU) ఆమోదించబడిన తేదీ: 2024 మార్చి 19
Founderచంద్రయాన్-3

శివశక్తి పాయింట్ (ఆంగ్లం: Statio Shiv Shakti), భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడవ చంద్ర మిషన్ అయిన చంద్రయాన్-3 చంద్రునిపై దిగిన చోటుకు పెట్టిన పేరు. మిషన్ ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్ 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువం నుండి 600 కి.మీ దూరంలో దిగాయి.[2] [3] [4] దీంతో భారతదేశం చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా అవతరించింది. అలాగే, చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగానూ అవతరించి గుర్తింపు తెచ్చుకుంది.[5] 2023 ఆగస్టు 26న బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) ప్రధాన కార్యాలయంలో ల్యాండింగ్ సైట్‌కు ఆ పేరు పెట్టారు.[6] ఇది 69.367621°S 32.348126°E నిర్దేశాంకాల వద్ద, మంజినస్ సి, సింపెలియస్ ఎన్ క్రేటర్స్ మధ్య ఉంది.

భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్-4 కూడా ఈ బిందువు దగ్గరే ల్యాండ్ అవుతుందని ప్రతిపాదించబడింది.[7]

నేపథ్యం

[మార్చు]

శివశక్తి అనే మాటను హిందూధర్మంలో చంద్రునితో సంబంధం ఉన్న దేవతలైన శివుడు, పార్వతి దేవి పేర్ల నుండి తీసుకున్నారు.[8]

2023 ఆగస్టు 26న బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమైనప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పేరును ప్రకటించాడు.[9] ఆయన, ఈ సందర్భంలో మహిళా శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించాడు.[10][11]

2024 మార్చి 19 న ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెటరీ సిస్టమ్ నోమెన్‌క్లేచర్, చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ కోసం స్టాటియో శివ శక్తి అనే పేరును ఆమోదించింది.[12][13][14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India launches Chandrayaan-3 mission to the lunar surface". Physicsworld. 14 July 2023. Archived from the original on 17 July 2023. Retrieved 15 July 2023.
  2. Koshy, Jacob (August 25, 2023). "Explained | Why did Chandrayaan-3 land on the near side of the moon?". The Hindu – via www.thehindu.com.
  3. Kumar, Sanjay (23 August 2023). "India makes history by landing spacecraft near Moon's south pole". Science.org. Archived from the original on 24 August 2023. Retrieved 24 August 2023.
  4. "Chandrayaan-3 launch on 14 July, lunar landing on 23 or 24 August". The Hindu (in Indian English). 6 July 2023. ISSN 0971-751X. Archived from the original on 11 July 2023. Retrieved 14 July 2023.
  5. "Modi in Bengaluru Live Updates: Touchdown point of Vikram lander will be known as 'Shivshakti', says PM". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-25. Retrieved 2023-08-26.
  6. "Modi in Bengaluru Live Updates: Touchdown point of Vikram lander will be known as 'Shivshakti', says PM". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-25. Retrieved 2023-08-26.
  7. "Chandrayaan-4's landing site on the Moon revealed". India Today (in ఇంగ్లీష్). 2024-05-13. Retrieved 2024-05-14.
  8. "PM addresses Team ISRO on success of Chandrayaan-3". 26 August 2023.
  9. "Chandrayaan-3's Touchdown Point To Be Called Shiv Shakti: PM Modi At ISRO". NDTV. 26 August 2023. Retrieved 28 August 2023.
  10. "What is 'Shivshakti Point'? India's lunar landing site on moon's South Pole". Live Mint. 28 August 2023. Retrieved 28 August 2023.
  11. Sharmila Kuthunur (2023-08-29). "India to name Chandrayaan-3's moon landing site 'Shiv Shakti Point'". Space.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  12. Kumar, Chethan (2024-03-24). "It's official: Chandrayaan-3 landing site name 'Shiva Shakti' gets IAU nod". The Times of India. Archived from the original on 25 March 2024. Retrieved 2024-03-24.
  13. "Chandrayaan-3's landing site name 'Statio Shiv Shakti' approved by IAU". Mint. 2024-03-24. Archived from the original on 25 March 2024. Retrieved 2024-03-24.
  14. "'Statio Shiv Shakti': IAU approves Chandrayaan-3 Vikram's landing site name". The Economic Times. 2024-03-24. ISSN 0013-0389. Retrieved 2024-03-24.