వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీలో వికీపీడియాలో ఏదైనా యాంత్రికంగా చేయించాలనుకుంటున్న పనులకు బాటు సహాయం కోరటానికి అభ్యర్ధనలను చేర్చండి. బాటు స్క్రిప్టులను వ్రాసి నడపగల సభ్యులు ఈ అభ్యర్ధనలను నెరవేర్చుదురు.

వాడుకరి పేజీలలో ఖాళీగా వున్న Infobox person మూస తొలగించు[మార్చు]

Infobox person మూసను పేజీ స్వంతదారైన వాడుకరి మార్చని పేజీలు.

పాత చర్చ లింకు, మూకుమ్మడి తొలగింపు చర్చ
http://quarry.wmflabs.org/query/3737
3854 పేజీలు, 2015-05-23న

పనిచేపట్టే బాట్ యజమాని క్రింద సంతకం చేయండి మరియు పనిగురించి చర్చించండి. @user:వైజాసత్య మరియు User:రహ్మానుద్దీన్ స్పందించవలసినదిగా మనవి. --అర్జున (చర్చ) 09:17, 1 జూన్ 2015 (UTC)

 • ఇతర బాట్ సభ్యులు స్పందించనందున ఈ పని నేను చేపడతాను. --అర్జున (చర్చ) 08:33, 8 జూన్ 2015 (UTC)
Command
$python pwb.py replace.py -v -file:"/home/arjun/tewp.txt" -regex "\{\{Infobox person\n(.+\n)+\}\}" ""

పని పురోగతి[మార్చు]

 • దాదాపు 1000 పేజీలు User:HXXXX... వరకు పూర్తయినవి.--అర్జున (చర్చ) 12:34, 8 జూన్ 2015 (UTC)
 • క్వేరీలో దోషం వలన కొన్ని వాడుకరి మార్చిన పేజీలలో కూడా సమాచారపెట్టె తొలగించబడే అవకాశముందని గమనించబడింది. క్వెరీని మెరుగుపరచి మరల బాట్ మిగిలిన వాటిపై నడపబడుచున్నది. అక్షరక్రమంలో వాడుకరి:Ksreedhar1993 కంటె ముందుగల సభ్యులు ఎవరికైనా ఆసౌకర్యం కలిగితే క్షమించవలసినది. మరియు సంబంధించిన బాట్ దిద్దుబాటు రద్దుచేయవలసినది. --అర్జున (చర్చ) 06:45, 9 జూన్ 2015 (UTC)
 • పని పూర్తయినది, ఐదారు మానవీయంగా తొలగించాను. --అర్జున (చర్చ) 13:29, 9 జూన్ 2015 (UTC)

నెలవారీ మొలకల జాబితా ప్రచురణ, తాజాకరణ[మార్చు]

నెలవారీ మొలకల జాబితా ప్రచురించడం, తాజాకరించడం గతంలో బాట్ల ద్వారా జరిగేది. ఇటీవల కాలంలో క్వైరీలు రాసి కొన్నిమార్లు ప్రచురిస్తున్నా, ఆ ప్రచురించిన పేజీని తాజాకరించడం మాత్రం మానవీయంగా సాధ్యం కావడం లేదు. ఇది యాంత్రికంగా చేయదగ్గ పని కనుక, సాంకేతికంగా అవగాహన కలిగి బాట్ హోదా కలిగిన వాడుకరులు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వారంతా సెలవుపై ఉన్నట్టైతే నేను కొత్తగా వస్తూన్న, సాంకేతిక అవగాహన కలిగిన వాడుకరులను ఎవరినైనా వ్యక్తిగతంగా అభ్యర్థించే ప్రయత్నం చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:39, 26 ఫిబ్రవరి 2017 (UTC)

తొలగింపు చర్చలు - నిర్ణయానంతర చర్యలు[మార్చు]

తొలగింపు ప్రతిపాదనలపై చర్చ జరిపి నిర్ణయం చేసిన తరువాత చెయ్యాల్సిన పనులను యాంత్రికంగా చెయ్యాలనే ప్రతిపాదన ఇది. దీని వివరాలివి:

తొలగింపు ప్రతిపాదనపై జరిపిన చర్చపై ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఈ కింది పనులు చెయ్యాలి:

 1. చర్చ జరిపిన ఉపపేజీలో (ఉదా: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) చర్చకు పైన {{వ్యాతొలపైన}} అనే మూసను రాసి దాని పక్కనే ఒక్క స్పేసు తరువాత నిర్ణయం ఏంటో అది రాసి దాని పక్కన సంతకం పెట్టాలి. అంటే {{వ్యాతొలపైన}} తొలగించాలి ~~~~ అని గానీ {{వ్యాతొలపైన}} ఉంచెయ్యాలి ~~~~ అని గానీ రాయాలి.
 2. చర్చ ఉపపేజీలో అడుగున, {{వ్యాతొలకింద}} అనే మూసను ఉంచాలి.
 3. పేజీని భద్రం చెయ్యాలి. {{వ్యాతొలకింద}}మూస ఉంచడంతో ఈ పేజీ వర్గం:ముగిసిన తొలగింపు చర్చలు అనే వర్గం లోకి చేరుతుంది.
 4. తదుపరి పనులు..
  1. ఈ చర్చ ఉపపేజీని (అంటే, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-2 లేదా ప్రస్తుతం చేతనంగా ఉన్న పాత పేజీ (పాతవి-3, పాతవి-8, పాతవి-11 ఇలాగ) లో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. అంటే {{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ}} అని చేర్చాలి (అపెండ్ చెయ్యాలి).
  2. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు#తాజా చేర్పులు విభాగంలో ఉన్న ఈ ఉపపేజీ లింకును తీసెయ్యాలి.
 5. ఇక నిర్ణయాన్ని అమలు చెయ్యడం.. (దీన్ని యాంత్రికంగా చెయ్యడం వద్దనుకుంటే, సంబంధిత నిర్వాహకునికి సందేశం పెట్టాలి, తొలగించమని)
  1. నిర్ణయం తొలగించడం అయితే వ్యాసం పేజీని తొలగించాలి.
  2. నిర్ణయం ఉంచెయ్యడం అయితే, వ్యాసం పేజీ లోని తొలగింపు మూసను తీసెయ్యాలి.

వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:MSG17 - పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:58, 19 జనవరి 2020 (UTC)

మంచి వ్యాసం గణన క్రమంలో యంత్ర సహాయం[మార్చు]

మంచి వ్యాసాల మూల్యాంకన కోసం తెవికీలో ఒక పద్ధతి ఉంది. అందులో యాంత్రికంగా చెయ్యదగ్గ పనులు కొన్ని ఉన్నాయి. వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు పేజీలో మంచి వ్యాసం మదింపు ఎలా చేస్తామో వివరించారు. అందులో కొన్ని పనులను "ఈ పని బాట్ చేస్తుంది|" అని సూచించారు. ఆయా పనులను చేసేందుకు ఒక యాంత్రిక సహాయకాన్ని రాయాలి. వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:MSG17 -పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:06, 19 జనవరి 2020 (UTC)