Jump to content

వికీపీడియా:బాటు చేయగలిగే పనులు

వికీపీడియా నుండి

ఈ పేజీ బాటు చేయగలిగే పనులను ఉదహరిస్తుంది. ఇందులోని మచ్చుకు ఇచ్చిన ఉదాహరణలు మాత్రమే. బాటు యొక్క రూపకర్త యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని బట్టి బాటు సరళమైన పనులనుండి మరింత సంక్లిష్టమైన పనుల వరకు చేయగలదు. సాధారణంగా మనుషులకు బాగా బోరుకొట్టేవి, మళ్లీ మళ్లీ చేయాల్సిన మార్పులను, బాటు ద్వారా చేపిస్తారు

ఒక పనిని బాటుతో చేయించాలంటే, బాటు స్క్రిప్టును వ్రాయటానికి, పరీక్షించటానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని సార్లు ఉపయోగించే అవకాశం ముంది, చేత్తోనే ఇంకా సులభంగా చెయ్యగలిగే అవకాశముందా అన్న అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఒక పనిచెయ్యగలదా లేదా అన్నది కేస్-బై-కేస్ పరిశీలించిగానీ ఖచ్చితంగా నిర్ధారించలేరు. అదీకాక ఒక సాంకేతిక నిపుణుడు చేయలేననుకున్నది మరో సాంకేతిక నిపుణుడు చేయవచ్చు అని అనుకునే అవకాశం ఉన్నది.

ప్రత్యేక స్క్రిప్టులతో ఇప్పటి వరకు చేసిన కొన్ని పనులు

[మార్చు]
ప్రదీపు బాటు చేసిన కొన్ని పనులు
  1. మొదటి దశ పనులు మరియు దానికి సంబందించిన ప్రోగ్రాము.
  2. కొన్ని బొమ్మలకు లైసెన్సు పట్టిలు తగిలించాను.
  3. కొన్ని గ్రామాల పేజీలను అయోమయనివృత్తి పరచాను.
  4. వివిధ ప్రాజెక్టుల గణాంకాలను సేకరించగలను. అందుకు ప్రోగ్రాము - గణాంకాల ప్రోగ్రాము.
  5. అప్పుడప్పుడూ సినిమా పేజీల గణాంకాలను తాజాకరిస్తుంటాను.
  6. నెలకొక సారి తెలుగు వికీపీడియాలో ఉన్న ఆని పేజీలనూ పరిశీలించి, వాటి గణాంకాలు సృష్టించి, నాణ్యమైన వ్యాసాలను ఎంపిక చేయటంలో సహాయపడతాను.
  7. విక్షనరీలో బ్రౌను పదకోశాన్ని చేర్చిన ప్రోగ్రాము.
  8. అప్పుడప్పూడూ భారతీయ భాషలలో ఉన్న ఎనిమిది వికీపీడియాలలో ఉన్న అన్ని వ్యాసాలను చదివి వాటి గణాంకాలను తయారు చేస్తాను. (ప్రోగ్రాము)
  9. సంవత్సరం వారీగా మరియూ పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాను తయారు చేస్తాను. ఈ ప్రోగ్రామును ఇతర బాషల సినిమాల వర్గాలకు కూడా జాబితాలను తయారు చేయడాని ఉపయోగించుకోవచ్చు.
  10. మండలాల మూసలను గ్రామాల పేజీలో చేర్చే ప్రోగ్రాము.
వైజ్‌ బాటు చేసిన కొన్ని పనులు
  • Stublist_updater.py - వికీపీడియా:మొలకల జాబితాలో మొలకస్థాయిని దాటిన వ్యాసాలను తీసివేసే స్క్రిప్టు
  • vyzpagefromfile.py - ఒక టెక్స్ట్ ఫైలులో నిర్ణీత పద్ధతిలో రాసిన సమాచారాన్ని తీసుకొని వికీపీడియాలో పేజీలు సృష్టిస్తుంది (సినిమా వ్యాసాలు సృష్టించడానికి ఇలాంటి స్క్రిప్టే ఉపయోగించబడింది)
  • vyzreplace.py - వికీపీడియాలో అన్ని పేజీలు తిరగేసి కొన్ని పదాలు మార్చడానికి (ఇలాంటి దాన్నే అచ్చుతప్పులు దిద్దటానికి కూడా ఉపయోగించవచ్చు.
  • Villagepages.py - ఒక్కొక్క జిల్లాలోని గ్రామాలన్నింటికీ పేజీలు తయారుచెయ్యటానికి ఉపయోగించిన బాటు