Jump to content

వికీపీడియా:తొలగింపు చర్చలు

వికీపీడియా నుండి

వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు

[మార్చు]

కొంతమంది సభ్యులు, సభ్యుల గోప్యత వికీ విధానాలపై అవగాహన లేక వ్యక్తి సమాచారపెట్టెలు వాడుకరి పేజీలలో చేర్చడం జరిగింది. వాటిని తొలగించడం గురించి రచ్చబండలో చర్చకు వచ్చినా, మూకుమ్మడి తొలగింపు చేయబోయేముందు సభ్యుల స్పందనలు పద్దతి ప్రకారం తెలుసుకొనుటకు ఈ చర్చ ప్రారంభించడమైనది. సభ్యులు 2015-05-30 లోపల తమ అభిప్రాయాన్ని తెలియచేయండి. తొలగించేమూసలు గల పేజీలకొరకు, http://quarry.wmflabs.org/query/3737 చూడండి. పాత చర్చ: వికీపీడియా:రచ్చబండ#సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు, -- 2015-05-23T17:36:51‎ Arjunaraoc

సమ్మతి
  1. ఎవరి సమాచారపెట్టె వారే తమకు తోచిన విధముగా తయారుచేసుకుంటే బావుంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎంత సమాచారము పొందు పరచాలనుకున్నారో వారి ఇష్టమునకు వదిలి వేయాలి. వ్యక్జ్తిగత సభ్యతగల సమాచారం పెట్టెల విషయములో వేరొకరు జోక్యం అనవసరం అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 01:43, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. వాడుకరి పేజీ లో వాడుకరి ప్రైవసీని గౌరవించాలి.తనకు నచ్చిన విధంగా తయారుచేసుకొనే అవకాశం కల్పించాలి. వాడుకరిపేజీలలో సమాచారపెట్టెలను వేలాదిగా చేర్చడం జరిగినది. అందులో సమాచారం చేర్చని వాడుకరుల సమాచార పెట్టెలను తొలగించాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 03:32, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నా కారణాలను పైన ఉదహరించిన రచ్చబండ చర్చలో ఇదివరకే తెలియజేశాను --వైజాసత్య (చర్చ) 05:01, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ఎవరికి వారు తమ ఇష్టా ఇష్టాలతో వివరాలు ఇవ్వాలి. ఈ పెట్టెలు ఇవ్వడం ద్వారా వివరాలు తప్పని సరిగా ఇవ్వాలేమో అనుకొనే అవకాశం ఉంది. కనుక తొలగించాలి. ఇకపై పెట్టరాదు...--విశ్వనాధ్ (చర్చ) 05:49, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. సభ్యులకు నియమాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడం, ఇతర సభ్యుల చర్చలను అస్సలు పట్టించుకోకపోవడం, ఏ విధంగానైనా దిద్దుబాట్లను పెంచుకోవాలనే బలమైన తాపత్రయం తదితర కారణాలే ఇలాంటి అనవసర దిద్దుబాట్లకు మరియు అనవసర పేజీల సృష్టికి ఉపక్రమించాయి. హుందాగా దిద్దుబాట్లు చేసి, విలువైన సమాచారం చేర్చుతూ పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన మనల్ని చిలిపి పనులు చేస్తున్నవారిగా వీక్షకులు మమ్ముల్ని పరిగణించే దశ రావడం శోచనీయమైన విషయంగా చెప్పవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:14, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  6. వివరాలు చేర్చని సభ్యుల పెట్టెలను తొలగించడం మంచిది. అయినప్పటికీ ఇవి బాటుద్వరా తొలగించడం మంచిది. --t.sujatha (చర్చ) 10:20, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  7. సమాచారం చేర్చకుండా ఖాళీగా వున్న సమాచార పెట్టెల్ని తొలగించండి.--Rajasekhar1961 (చర్చ) 14:18, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  8. సభ్యుల వ్యక్తిగత పేజీ, ప్రయోగశాల వంటి అతికొద్ది పేజీలే వారి ఇష్టానుసారం తయారుచేసుకునేందుకు వీలున్నవి. అటువంటి వాటినీ సముదాయం ఓ సమాచార పెట్టె పెట్టి నిర్దేశించడం తగదు. పైగా కొందరు సభ్యులకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా వికీలో వివరాలు పెట్టడం ఇష్టం లేకపోవచ్చు. ఈ పెట్టె చూసి ఇది తప్పకుండా నింపాల్సినదేమోనని భ్రమించి విముఖులయ్యే ప్రమాదమూ ఉండనే వుంది. వీటన్నిటినీ పరిగణించి ఈ ప్రయత్నం సరైనదని భావిస్తున్నాను. అలానే సుజాత గారు అన్నట్టు బాట్ ద్వారా తొలగించడం ఉత్తమం. --పవన్ సంతోష్ (చర్చ) 17:44, 26 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  9. ఇవి బాటుద్వరా తొలగించడం మంచిది.Palagiri (చర్చ) 09:48, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  10. <పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
తటస్థం
  1. <పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
వ్యతిరేకం
  1. <పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
వోటు ఫలితం

స్పందించిన 8 మంది సభ్యులందరికి ధన్యవాదాలు. వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడినది.--అర్జున (చర్చ) 09:13, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అమలు

వికీపీడియా:బాటు_సహాయానికి_అభ్యర్ధనలు#వాడుకరి పేజీలలో ఖాళీగా వున్న Infobox person మూస తొలగించు ప్రకారం బాట్ సహాయానికి అభ్యర్ధన చేయడమైనది. --అర్జున (చర్చ) 09:16, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]