వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెండు క్రొత్త జిల్లాలకు సంబంధించిన మార్పులు[మార్చు]

2019లో ఏర్పాటైన రెండు క్రొత్త జిల్లాల కొరకు మార్పుల స్థితి User:యర్రా రామారావు‎ లేదా ఇతరులు తెలియచేయవలసింది. అలాగే ప్రాజెక్టు పేజీలో ఇంకొక విభాగం చేర్చి వివరాలు పొందుపరచితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:58, 5 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట రెండు జిల్లాల పని పూర్తైంది.ప్రాజెక్టు పేజీలో స్థితి వివరాలు పొందుపర్చాను. గ్రామ వ్యాసాలకు మండలం లింకులు కూడా కలిపాను.కాకపోతే సంబందిత ఉత్తర్వులు మూలాలు లంకె కూర్పు చేయవలసిఉంది.సంబందిత ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వనరులు విభాగంలో అన్నిజిల్లాలవి కూర్పు చేసాం.ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:47, 5 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:17, 5 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అనుభవాలు[మార్చు]

చదువరి,అజయ్, నాయుడు గారి జయన్న,యర్రా రామారావు గార్లకు ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి చేసినందులకు అభివందనాలు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇటువంటిదే ఆంధ్రప్రదేశ్ కి కూడా చేపట్టవలసిరావచ్చు. మీ అనుభవాలను అంటే, ప్రాజెక్టు వివిధ కోణాలనుండి అనగా ప్రణాళిక మరియు అమలులో సాధకబాధకాలు, అనుకున్న పనిగంటలు, అవసరమైన పనిగంటలు, వనరులలో లోటుపాట్లు, నాణ్యత, బాగా చేసినవి, ఇంకా చేయాల్సినవి పంచుకుంటే ముందు ప్రాజెక్టులకు ఉపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 23:15, 5 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సారధ్యం వహించిన ప్రాజెక్టుకు ఇలాంటి విశ్లేషణ మాదిరిగా ఉపయోగపడుతుందేమో చూడండి.--అర్జున (చర్చ) 23:19, 5 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావుగారికి, మీరింకా ఈ ప్రాజెక్టు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు గమనించాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు#ఇంకనూ_చేయవలసినది లో చేయవలసిన పని చేరిస్తే, ఆసక్తి గల సభ్యులు సహకరించటానికి వీలుంటుంది. వికీ వ్యాసాల నాణ్యత ఎక్కువమంది పాల్గొంటేనే మెరుగవుతుందికదా.--అర్జున (చర్చ) 03:33, 11 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ చిన్న చిన్న పనులు ఉన్నాయి.నేను దీనిమీద సమాచారం రేపు ఇవ్వగలను--యర్రా రామారావు (చర్చ) 03:40, 11 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారికి నమస్కారం. ఈ ప్రాజెక్టులో జోగులాంబ గద్వాల జిల్లా, ఆ జిల్లాకు చెందిన కొత్త మండలం ఉండవెల్లికి పేజీలు సృష్టించి, కొంత మేరకు పని చేయడం మినహా నేను చేసింది ఏమీలేదు. ఆ క్రెడిట్ అంతా మిగతా సభ్యులదే. వారికి ధన్యవాదాలు. --నాయుడు గారి జయన్న (చర్చ) 03:59, 19 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@నాయుడు గారి జయన్న గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు ఎక్కువ కృషి చేయలేకపోయినా, మీరు సమీక్షించి ఇంకా ఎలా అభివృద్ధిచేయాలో చెప్పవచ్చు.--అర్జున (చర్చ) 04:12, 19 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@వాడుకరి:యర్రా రామారావు మరియు ప్రాజెక్టులో పాలుపంచుకున్న సభ్యులకు, త్వరలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు దానిలో భాగంగా మండలాలు పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మీ అనుభవాలు ముందు వికీ కృషికి ఉపయోగపడతాయి. దానిగురించి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. --అర్జున (చర్చ) 05:46, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ త్వరలో ఈ ప్రాజెక్టు మీద పూర్తి నివేదిక అందిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 05:53, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తగా ఏర్పడిన 5 కొత్త మండలాలు వివరాలు[మార్చు]

  1. నడికూడ (ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య అందుబాటులో లేదు) ఆధారం వేరే లింకు: https://www.youtube.com/watch?v=lnLbeiwHVOw
  • ఈ మండలం వరంగల్ గ్రామీణ మండలం నుండి 12 గ్రామాలతో 2018 ఆగష్టు 27న ఏర్పాటు చేయబడింది.
  1. మూడుచింతలపల్లి మండలం
  • ఈ మండలం మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, కీసర రెవెన్యూ డివిజను పరిధిలోని శామీర్‌పేట్‌ మండలం నుండి 18 గ్రామాలు విడగొట్టి ఏర్పాటు చేయబడింది.(అందులో రెండు నిర్జన గ్రామాలు) - (GO. Ms. No. 29, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019)  
  1. నారాయణరావుపేట్
  1. చందూర్
  2. మొస్రా
  • ఈ రెండు మండలాలు నిజామాబాద్ జిల్లా, భోధన్ రెవెన్యూ డివిజను పరిధిలోని, వర్ని మండలం నుండి కొన్ని గ్రామాలు విడగొట్టి ఏర్పడినవి.-(GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019)
అర్జున గారూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 5 మండలాలు ఏర్పాటు చేసింది.పటాలు మార్పులు ఏమైనా ఉంటాయేమోనని పరిశీలనకొరకు తెలియపర్చుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:38, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి, ప్రస్తుతం నేను పాల్గొన్న పటాల ప్రాజెక్టు కృషి జిల్లాల స్థాయి ఆ పై వరకు మాత్రమే సంబంధించినది. మండల, రెవిన్యూ డివిజన్ల పటాలు, User:Adityamadhav83 మరియు ఇతరులు గతంలో చేర్చారు. వాటిలో కొన్ని దోషాలుండడంతో సరిచేయమని వారిని కోరడమైనది. OSM లో మండల స్థాయి హద్దుల పని పూర్తిగా జరగలేదు. కృషికి తగ్గం ఉపయోగం దృష్ట్యా మండలాల పటాలపై ఇప్పట్లో నేను దృష్టి పెట్టదలచుకోలేదు.రాష్ట్ర ప్రభుత్వ జాలస్థలిలో తగుమార్పులు చేసినట్లు లేరు. ఆక్కడ అందుబాటులోకి వస్తే ఆసక్తిగలవారు తెరపట్టుల ద్వారా తెవికీలో చేర్చవచ్చు. ప్రస్తుతమున్న కామన్స్ పటాలలో సవరణలు అవసరమని తెలియచెప్పటానికి,దస్త్రం పేజీలో Add note అనే అదేశాన్ని ఉపయోగించ కావలసిన సవరణలను సూచించవచ్చు. ఉదాహరణకు commons:File:Wanaparthy District Revenue division.png చూడండి. తెలుగులో ఈ స్క్రిప్ట్ ఇంకా పనిచేయటంలేదు కావున, చర్చాపేజీలో దోషాలు చేర్చండి.--అర్జున (చర్చ) 08:24, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు పనిలో చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు[మార్చు]

పునర్య్వస్థీకరణ ప్రకారం ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు ప్రాజెక్టు పేజీలోని విభాగంలో తగిన వివరాలతో పట్టిక పొందుపర్చబడినది. ఇక్కడ పరిశీలించ వచ్చును పట్టిక పొందుపర్చబడినది. --యర్రా రామారావు (చర్చ) 17:33, 29 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారికి, ప్రాజెక్టు పని వివరాలు సమగ్రంగా పట్టిక రూపంలో చేర్చినందులకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు సమీక్ష చేయటం ఇంకా మిగిలివున్నది. అదికూడా త్వరలో చేపడతారని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 04:06, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ఈ ప్రాజెక్టు సమీక్ష ఇంకా చేయటం ఇంకా మిగిలివున్నది అని తెలిపారు.సవివరంగా తెలుపగోరుచున్నాను--యర్రా రామారావు (చర్చ) 11:51, 10 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, మీరు జరిగిన పని నివేదించారు, ఆ పని చేయటంలో తెలుసుకున్న మెలకువలు, ఎదుర్కొన్న సాధక బాధకాలు, ఇటువంటి పని ఇంకొకసారి చేయవలసివస్తే మరింత మెరుగుగా చేయటానికి సూచనలు, ఇటువంటివి సమీక్షలో భాగాలు. నివేదిక ఉదాహరణలకు m:Grants:IEG/Making telugu content accessible/Final, రెండో_దశాంత_సమీక్ష, వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య,_ఉపాధి/ప్రణాళిక-1/సమీక్ష-1 లాంటివి చూడండి.--అర్జున (చర్చ) 11:58, 14 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పని నిర్వహణలో యర్రా రామారావు అనుభవాలు, గుర్తించిన విషయాలు, లోపాలు సూచనలు[మార్చు]

ప్రాజెక్టు పని పూర్వాపరాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు పని చేపట్టాలనే ఉద్దేశ్యంతో చదువరి గారు 2017 నవంబరు 15న 'వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు' అనే పేరుతో ప్రాజెక్టు పేజీ సృష్టించారు.అంటే 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ అమలులోకి వచ్చిన 13 మాసాలు తరువాత ఈ ప్రాజెక్టుపనికి అంకురార్పణ జరిగింది.ఈ ప్రాజెక్టు పేజీ సృష్టించేనాటికి 6 వారాలు ముందు అనగా 2017 అక్టోబర్ 3న 'వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం' అనే ప్రాజెక్టు పేజీ కూడా సృష్టించిబడి, గౌరవ వికీపీడియన్స్ 10 మందితో పని ప్రారంభించబడింది.ఎందుకో దీనిలో ఎక్కువమంది పాల్గొనటానికి ముందుకు వచ్చారుగానీ, తెలంగాణ జిల్లాల మండలాల పునర్య్వస్థీకరణ పనులు చేపట్టటానికి కేవలం ప్రాజెక్టు పేజీ సృష్టికర్త @చదువరి, మరో ఇద్దరు @అజయ్, @నాయుడు గారి జయన్న, నాతో కలిపి 4గురు మాత్రమే ముందుకు వచ్చారు.మిగతా గౌరవ వికీపీడియన్స్ బహుశా అంతకుముందే జనన గణన డేటా ఎక్కించే పనిలో పాల్గొనుట మొదలు పెట్టినందున ఉత్సాహం చూపలేదనుకుంటాను. చదువరిగారు ప్రాజెక్టుపేజీలో ఎలా పని చేయాలి? అనే దానిపై తగు సూచనలు వివరంగా తెలుపుతూ, వనరులు విభాగంలో కొన్ని జిల్లాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు తుది నోటిఫికేషన్లు ఉంచారు. ఈ పని ముందు అసలు ప్రభుత్వ ఉత్తర్వులుతో ముడిపడి ఉందని, అవి లేకపోతే ప్రాజెక్టు పని పూర్తి చేయుట అసాధ్యమని భావించి, నేను ఒక వారం రోజులు అన్ని రకాలుగా అంతర్జాలంలో శోధించి మిగిలిన జీవోలు కూడా సేకరించి, ప్రాజెక్టు పేజీలోని వనరులు విభాగంలో కూర్పు చేసినాను. ఆ తరువాత మాత్రమే ఈ ప్రాజెక్టు పని చురుకుగా సాగింది.ఈ ప్రాజెక్టు పనికి ముందు భారత జనగణన డేటాను పేజీలో చేర్చే ప్రాజెక్టు పని 2017 అక్టోబరు 3న  ప్రారంభంకాగా, నేను 4న పాల్గొనటానికి సమ్మతిని తెలియచేయగా, నాకు గుంటూరు జిల్లాలోని 12 మండలాల టెక్స్టు ఫైల్స్ పంపగా అవి 15 రొజులలో పూర్తిచేసి, తూర్పుగోదావరి జిల్లా పనిని చేపట్టి, ఖమ్మం జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లాకు బదలాయించిన మండలాలలోని గ్రామాల డేటా కూడా ఎక్కించి ఒక మాసం లోపు పూర్తి చేసాను. నాకు వచ్చిన ఆలోచనను బట్టి ఖమ్మం జిల్లా చేపడితే అది సంపూర్తి కాగలదని భావించి, ఆసందర్బంగా నేను తెలంగాణ జిల్లాల నందు ప్రవేశించాను.జనన గణన డేటా ఎక్కించే పనిలో కూడా తెలంగాణ గ్రామాలుకు నాతో కలిపి ఒకటి రెండు జిల్లాలలో భాస్కరనాయుడు గారు మాత్రం నామ మాత్రంగా పాల్గొన్నారు.అయితే కేవలం ఈ ప్రాజెక్టు పని దాదాపు పూర్తిగా నా చేతులుమీదగా నిర్వహించబడిందని చెప్పటానికి ఒకింత గర్వపడుతున్నాను. ఈ ప్రాజెక్టు పని ఒక్కటే నేను కంటిన్యూగా ప్రత్వేకంగా చేయలేదు. ఒక్కొక్క జిల్లా తీసుకొని జనన గణన డేటా ఎక్కించే పని, పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం మార్పులు, చేర్పులు రెండు పనులు సమన్యయం చేసుకుంటూ 32 జిల్లాల పని నేను సుమారు 22 మాసాలపాటు నిర్విరామంగా నిర్వహించి ఈ పని దిగ్విజయంగా పూర్తిచేసాను.

ప్రాజెక్టు పనిలో గుర్తించిన ముఖ్య విషయాలు, అనుభవాలు[మార్చు]

  • పునర్య్వస్థీకరణలో హైదరాబాదు జిల్లానందు ఎటువంటి మార్పులు జరగలేదు.మిగిలిన 9 జిల్లాలలో మాత్రమే మార్పులు, చేర్పులు జరిగినవి.ఆ తొమ్మిది  జిల్లాలనుండి కొన్ని పాత మండలాలను విడగొట్టి, కొత్తగా 125 మండలాలు ఏర్పాటుతో 2016 అక్టోబరు 11 నుండి 21 కొత్త జిల్లాలు ఏర్పడినవి.
  • పునర్య్వస్థీకరణ చివరి నోటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడకముందే సి.చంద్రకాంతారావు గారు కొత్తగా ఏర్పడిన 18  జిల్లాలకు, ఒక అజ్ఞాత వాడుకరి నిర్మల్ జిల్లాకు వ్యాస పుటలు సృష్టించారు
  • పునర్య్వస్థీకరణ చివరి నోటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడిన తరువాత నాయుడుగారి జయన్న గారు జోగులాంబ గద్వాల జిల్లాకు , ప్రణయరాజ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు వ్యాస పుటలు సృష్టించారు.
  • 2019 లో తిరిగి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా నుండి నారాయణపేట జిల్లా విడదీసి ఫిబ్రవరి 17న రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసారు.ఈ రెండు జిల్లాల వ్యాస పుటలు చదువరి గారు సృష్టించారు.
  • పునర్య్వస్థీకరణ మార్పులు, చేర్పులు ముందు లోగడ కొన్ని మండలాలకు గ్రామ వ్యాసమే మండల వ్యాసంగా ఉంది.ఇలాంటి వాటికి మండలంలోని గ్రామాలు మూస, జిల్లాలోని మండలాల మూస రెండు తగిలించబడినవి. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్నవాటికి కూడా అలానే తగిలించబడినవి. దాని వలన మండలంలోని గ్రామాలు వర్గం సంఖ్య, జిల్లాలోని మండలాల సంఖ్య పరిశీలించినప్పుడు సంఖ్యా పరంగా  ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం సరిచూసినప్పుడు తేడాలు కనపడి మొదట కొంత గందరగోళానికి గురికావలసి వచ్చింది.
  • ఈ గందరగోళాన్ని అధిగమించటానికి చదువరి, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్ గారల దృష్టికి తీసుకువెళ్లి, దీనికి మార్గం మండలాలకు ప్రత్యేక వ్యాసం సృష్టించి దానికి మాత్రమే జిల్లాలోని మండలాల మూస, గ్రామ వ్యాసానికి మండలంలోని గ్రామాల మూస ఎక్కించి, మండల వ్యాసంలో మండలంలోని రెనెన్యూ గ్రామాలు విభాగంలో గ్రామాలు కూర్పు చూపించి, మండలంలోని గ్రామాలు మూసకు మండలం లంకె ఇస్తే సరిపోతుంది అనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చాం.
  • ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని తలెత్తిన సమస్యలు ఆధారంగా కొన్ని మార్గదర్శకాలు తయారుచేసి రచ్చబండలో చర్చకు పెడితే ఎప్వరూ స్పందించకపోవటం ఒక రకంగా నాకు భాధకలిగించింది.అదే మార్గదర్శకాలు నేను పాటించి ఈ ప్రాజెక్టుపని పూర్తిచేసాను.
  • మండల వ్యాసం ప్రధాన కేంద్రంగల వ్యాసాలలలోని మండలంలోని గ్రామాలు విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో అవగాహనలేక లోగడ రెవెన్యూ గ్రామాలు కాని వాటిని కూడా కూర్పు చేయబడినవి.వీటిని ప్రభుత్వ ఉత్తర్వులుతో సరిపోల్చుకొని మండల వ్యాసంలో మండలంలోని రెవెన్యూ గ్రామాలు విభాగంలో రెవెన్యూ గ్రామాలు కాని వాటిని, అలాగే మండలంలోని గ్రామాలు మూస నుండి తొలగించుట జరిగింది.
  • కొన్ని జిల్లాలలోని ప్రభుత్వ ఉత్తర్వులు నందు మండలంలోని గ్రామాల వరుస సంఖ్య  సక్రమంగా లేదు. అందువలన జి.ఓల లోని ప్రతి మండలంలోని గ్రామాలు వరుస సంఖ్య సరిగా ఉందా, లేదా అనేది పరిశీలించ వలసివచ్చింది.ఉదా:నిర్మల్ జిల్లాకు చెందిన జి.ఓలో నిర్మల్ గ్రామీణ మండలంలో వ.సంఖ్య చివరిగా 32 అని ఉంది. కానీ పరిశీలించగా 27,28,29 వరుస సంఖ్యలు మిస్సింగ్. ఆ ఉత్తర్వులు కాపీ ఇక్కడ పరిశీలించవచ్చును.
  • ఒకటి రెండు జిల్లాలకు మాత్రమే జి.ఓల నందు నిర్జన గ్రామాలకు (DP) De-populated  అని ప్రత్యేకంగా  చూపబడింది. మిగిలిన జిల్లాలలోని నిర్జన గ్రామాలుకు ఎటువంటి ఆధారాలు లేవు. జనన గణన డేటా ఆధారాలను బట్టి అవి నిర్జన గ్రామాలుగా గుర్తించి మండల వ్యాస విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో తొలగించుట జరిగింది.
  • ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం కొన్ని రెవెన్యూ  గ్రామాలకు పేజీలు సృష్టించబడలేదు.అయితే వాటిలో జనన గణన డేటా ఉన్న వాటికి సృష్టించి, డేటా లేని వాటిని మండల వ్యాసంలోని మండలంలోని రెవెన్యూ గ్రామాల విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో ఎరుపు లింకుతో కలిగి కూర్పు చేయుట జరిగింది,. ఇవి రాష్ట్రంలో అన్ని కలిపి 228 ఉన్నవి. వాటి జాబితా ఇక్కడ పరిశీలించవచ్చును. వీటిలో నిర్జన గ్రామాలు కూడా ఉండటానికి అవకాశముంది. అందువలన తొందరపడి వ్యాస పేజీలు సృష్టించబడలేదు.సరియైన ఆధారాలు లభ్యమైనప్పుడు లేదా ఏదైనా ఒక సర్యేలాగా చేపట్టి సృష్టించవలసి ఉంది.ఇందులోని కొన్ని గ్రామాలు నగరాలు, పురపాలకసంఘాల నందు మిళితమై ఉన్నట్లుగా తెలుస్తుంది.
  • హైదరాబాదు జిల్లాకు జిల్లా వ్యాసం పేజీ తప్ప, దానికి సంభందించిన మండలాలు,రెవెన్యూ గ్రామాలు వివరాలు అస్తవ్యస్తంగా జిల్లా వ్యాస పుటలో మాత్రమే ఉన్నవి. ఈ ప్రాజెక్టు పనికి పరిపూర్ణత చేకూరాలని హైదరాబాదు జిల్లాలోని మండలాలు, రెవెన్యూ గ్రామాలు వివరాలు సరియైన రూపంలో 16 మండలాలు, 66 రెవెన్యూ గ్రామాలు గుర్తించి ఆధారాలతో వికీపీడియాలో చేర్చబడినవి.
  • అవగాహనలేని కొంతమంది కొత్త వాడుకరులు, అజ్ఞాత వాడకరులు రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలను మండలంలోని గ్రామాలు మూసలో చేర్చటం, వ్యాస పుటలలోని విభాగంలో చేర్చటం.అనవసరమైన వర్గాలు చేర్చటం, ఇలాంటి ఎడిట్లు చేసినప్పుడు నాకు వచ్చే మెయిల్సు ద్వారా పరిశీలించి వెంటనే వెంటనే సరి చేయవలసి వచ్చేది.
  • వర్గం:తెలంగాణ మండలాలు, వర్గం: తెలంగాణ గ్రామాలు వర్గాలు రెండూ ఈ రోజు సరియైన స్థితిని చూపబడుచున్నవి.
  • గ్రామాల లంకెలు లోగడ సరియైన గ్రామాలకు కలపబడినవా? లేదా అనేది కలపబడిన తరువాత పరిశీలనలేదు.కొన్ని అయోమయ నివృత్తి పేజీలకు కలపబడినవి.అక్కడ ఈ గ్రామం కూర్పు ఉండేదికాదు. కొన్ని వేరే జిల్లాలలోని గ్రామాలకు, మండలాలకు కలపబడినవి.వాటిని సరిగా కలపటానికి అదే పేరుగల కొన్నిగ్రామాలకు బ్రాకెట్ లో ఏ జిల్లా, ఏ మండలం అనేది లేనందున సరియైన గ్రామాన్ని గుర్తించి లంకెలు కలపటానికి కొద్దిగా శ్రమ పడవలసి వచ్చింది.ఉదాహరణకు మాదిరి లంకె గాంధారి అనే గ్రామం లంకె మహభారతంలోని దృతరాష్ట్రుడి భార్య, కౌరవుల తల్లి గాంధారి కి కలుపబడింది.
  • చదువరి గారు గ్రామాలకు లింకులు ఇచ్చేటపుడు అనే విభాగం చర్చకు పెట్టిన సందర్బంగా స్పందించి తిరిగి ప్రత్యేకంగా 33 జిల్లాలలోని,589 మండలాలలోని 10104 గ్రామాల లంకెలు ఎటువంటి ఎడిట్లు పనిపెట్టుకోకుండా 100 శాతం సరిగా ఉండటానికి స్పెషల్ డ్రైవ్ గా మూడు రోజులు పరిశీలించి సుమారు 20 గ్రామాల లంకెలు తప్పుగా ఉన్నవాటిని సవరించుట జరిగింది.

ప్రాజెక్టు పనిలో గమనించిన ముఖ్య లోపాలు, సూచనలు[మార్చు]

  • కొంత మంది గౌరవ వికీపీడియన్స్  ఏవరైనా,ఏదైనా పని చేపట్టినప్పుడు చేపట్టేనాటి ఉత్సాహం తరువాత కనపడుట లేదనిపిస్తుంది. చేపట్టిన పని పూర్తి అయ్యేవరకు చేయకుండా, మరియొక పనిని చేపట్టుచున్నట్లుగా నాకు అనిపిస్తుంది.
  • ఇంత భారీ ప్రాజెక్టు పని జరుగుచున్నప్పుడు చదువరి గారు, పవన్ సంతోష్ గారు తప్ప నాకు ఇతర గౌరవ వికీపీడియన్స్ ఎవరైనా సూచనలు ఇవ్వటంగానీ, నా తప్పులు ఎత్తి చూపటంగానీ, ప్రోత్సహించుటగానీ దాదాపుగా ఏమి లేదనే చెప్పాలి.
  • మిగిలిన వ్యాసాల మీద ఉన్నంత ఆసక్తి గ్రామ వ్యాసాల అభివృద్ధి మీద కొంతమంది గౌరవ వికీపీడియన్లకు లేదనిపిస్తుంది.
  • గ్రామాలు వ్యాస పుటలు లోగడ సృష్టించేటప్పుడు ఆ వ్యాసం పుటలను లోగడ ఎవరైనా సృష్టించారోమోనని సరియైన సెర్చ్ చేయకుండానే కొన్ని గ్రామాలకు కొద్దిపాటి అక్షరభేదాలుతో రెండు, కొన్ని గ్రామాలకు మూడు వ్యాస పుటలు సృష్టించబడినవి.వాటిని గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టబడినవి.
  • మండల వ్యాసలకు, గ్రామ వ్యాసాలకు ఇప్పుడు ఉన్న సమాచార పెట్టెలు సమూలంగా మార్పులు,చేర్పులు జరుగవలసిఉంది. వ్యాసాన్ని సమాచారపెట్టె మింగి వేస్తున్నట్లు అనిపిస్తుంది.వీటి విషయంలో నేను సూచించిన మార్గదర్శకాలు పాటించవలసి ఉందని అభిప్రాయపడుతున్నాను.
  • కొన్ని మండల కేంద్రంగా ఉన్న గ్రామాలు కేవలం ఆ మండలాలకు మండల కేంద్రాలేగానీ, అవి రెవెన్యూ గ్రామాలుగా లేవు.
  • గ్రామ వ్యాస పుటలు పేరుబరులు లోగడ ఆంగ్లం నుండి తర్జుమా చేసి సృష్టించినందున చాలా గ్రామాల వ్యాస పేజీలు కొంత గందర గోళంగా ఉన్నవి.ఏది సరియైన పేరు అనేది నిర్థారణ కొంత కష్టమనిపించింది.కొన్ని గ్రామాలకు సరియైన పేరుబరి నిర్థారించుకొని తరలింపు ద్వారా సవరించాను.అయినప్పటికీ ఈ పని ఒక ప్రాజెక్టుపనిగా చేపట్టి పూర్తిచేయవలసి ఉంది.
  • సమాచారపెట్టెలు అవగాహనలేనివారు వారి ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి వాటి సారూప్యతను దెబ్బతీస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి పరిష్కార మార్గం కనుగొనాలి.
  • తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలంలోని గ్రామాలు మూసలు ఇక ఎల్లప్పుడూ సవరించేపని ఉండదు. వాటిని సవరించేపని ఎదైనా జిల్లాలోగానీ, మండలంలోగానీ, లేదా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోగానీ ఇప్పుడు జరిగిన మాదిరిగా పునర్య్వస్థీకరణ జరిగినప్పుడు మాత్రమే వాటిని సవరించాల్సిన పని ఉంటుంది. వీటి విషయలో సముదాయం చర్చించి అన్నింటిని నిర్వాహకులు మాత్రమే మార్పులు చేర్పులు చేసేలాగున సంరక్షణచర్యలు లేదా ఇతరత్రా చర్యలు చేపట్టకపోతే, కొద్దికాలంలోనే పునర్య్వస్ఖీకరణ మార్పులు,చేర్పులు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందనేది నూటికి నూరుపాళ్లు నిజమని నా అభిప్రాయం. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఏది రెవెన్యూ గ్రామమో చెప్పలేని పరిస్థితి కలిగిందనేది వాస్తవం.
  • మండల ప్రత్యేక వ్యాసాలలో ప్రాధమిక సమాచారం అనగా మండల గణాంకాలు,మండలంలోని విశేషాలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆ మండలంలోని గ్రామాల నుండి సేకరించి పొందుపర్చాలి.దీనిని మానవీయంగా చేయుట చాలా కష్టమైనపని అయినందున అవకాశం ఉంటే ఎదైనా బాటు, లేదా యంత్రం ద్వారా చేపట్టవలసి ఉంది.
  • పునర్య్వస్థీకరణ ప్రకారం జిల్లా వ్యాస పుటల నందు సవరణ చేపట్టవలసి ఉంది.అలాగే ఇతర వ్యాసాలలో లోగడ ఇచ్చిన జిల్లా,మండల, లింకులు సవరించాల్సి ఉంది.
  • పునర్య్వస్థీకరణ జరిగిన తొమ్మిది పాత జిల్లాల నందు పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు విభాగంలోని పాత మండలాలు అవి ఏ కొత్త జిల్లాకు విడగొట్టబడిందీ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం సవరించాను. పరిశీలన కొరకు కరీంనగర్ జిల్లా విభాగం ఇక్కడ పరిశీలించ వచ్చును
  • పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు అన్నీ http://web.archive.org నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఉందని గ్రహించాను.

చివరిగా నాకొక సందేహం.ఇది అంతా చదవగలుగుతారా అనే సందేహం నన్ను వెంటాడుతుంది.--యర్రా రామారావు (చర్చ) 14:41, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారికి, మీ సుదీర్ఘ వ్యాఖ్యలు పూర్తిగా చదివాను. మీ సుదీర్ఘకృషికి, నాణ్యతపై శ్రద్ధని అభినందిస్తున్నాను. మీరిచ్చిన సమాచారం ముందు ప్రాజెక్టులకు చాలా ఉపయోగం. మీరు సూచించిన కొన్ని లోపాలకు తగిన పరిష్కారాల దిశగా నేను కొంత కృషిచేశాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:43, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ సమయం వెచ్చించి ఓపికతో చదివి, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:50, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు మీ ప్రశంస అందుకోవడం చాలా గొప్ప గౌరవం. మీ కృషి చాలా గొప్పది. మీరు లేవనెత్తిన అంశాల్లో తక్షణం పరిష్కారానికి అవకాశం ఉన్నది "తెలంగాణ మండలాల మూసలను సంరక్షణ చేయడం". ఈ ప్రాజెక్టులోని ప్రతీ చిన్న అంశంలానే ఇదీ వేలాది పేజీలపై ప్రభావం చూపే నిర్ణయం కాబట్టి దయచేసి విడిగా చర్చకు లేవనెత్తగలరు. ఈ అంశంలో మీరు సూచిస్తున్నది సబబని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇతర సభ్యులతో చర్చించి ఏకాభిప్రాయంతో ఈ సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:01, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ మీరు కొత్త ఉద్యోగంలో చేరి బాగా పనుల వత్తిడిలో ఉన్న సమయంలో కూడా, లోగడ మాదిరిగానే వికీపీడియా చర్చలలో స్పందించినందుకు, నేను లెవనెత్తిన అంశాలు సహృదయంతో అర్దం చేసుకొని మీరు ఇచ్చిన సూచనలకు ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 06:25, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు తెలంగాణ గ్రామాల పేజీలు, సంబంధిత పేజీలపై సమగ్రమైన కృషి చేసారని నేను భావిస్తున్నాను. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాను. విలువైన సూచనలు కూడా చేసారాయన - గ్రామాల పేర్ల సవరణ, గ్రామాల మూసల సంరక్షణ, మండల పేజీల విస్తరణ, జిల్లాపేజీల సవరణలు మొదలైనవి. వీటిలో గ్రామాల పేర్ల సవరణ అన్నిటి కంటే ముఖ్యమైనది అని నా ఉద్దేశం. మండల పేజీల విస్తరణ కోసం ఒక నమూనా వ్యాసాన్ని తయారు చేసుకోవాలి మనం. ఈ సరికే ఒకటి తయారై ఉంటే దాన్నే అనుసరించవచ్చు.
"కొన్ని మండల కేంద్రంగా ఉన్న గ్రామాలు కేవలం ఆ మండలాలకు మండల కేంద్రాలేగానీ, అవి రెవెన్యూ గ్రామాలుగా లేవు." అని అన్నారు. అవును, మా మండలం కథ ఇదే - చెరుకుపల్లి మండలం ఉంది గానీ చెరుకుపల్లి గ్రామం జనగణన వారి జాబితాలో లేదు.
"వ్యాసాన్ని సమాచారపెట్టె మింగి వేస్తున్నట్లు" అనిపిస్తోందన్నారు. సమాచారపెట్టెలకు తాను కొన్ని సవరణలను సూచించానని ఆయన రాసారు. అవి ఏమిటో నేను చూసిన గుర్తు లేదు. ఇప్పుడు మళ్ళీ వెతికి చూస్తాను, నా అభిప్రాయం రాస్తాను. రామారావు గారూ వీలైతే ఆ లింకు ఇవ్వగలరు. __చదువరి (చర్చరచనలు) 04:39, 11 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

YesY సహాయం అందించబడింది


రచ్చబండ చర్చలో ఈ మూలాలను ఏం చేయలని దాని గురించిన చర్చ ఇక్కడ కొనసాగిస్తున్నాను. జూన్ 2020 నాటికి 1877 సార్లు ఈ మూలాలు వాడారు. ఈ మూలాల నిర్ధిష్ట సంఖ్య 30 అని ప్రాజెక్టు పేజీనుండి తెలుస్తున్నది. ఇవి ప్రతి గ్రామం పేజీలో వాడినందున సంఖ్య ఎక్కువైనదేమో పరిశీలించాలి. user:యర్రా రామారావు గారు తనకు తెలిసిన వివరాలు, ఇతర స్పందనలు చేర్చమని కోరుతున్నాను. ఇప్పటిదాకా తెలిసిన వివరాలను బట్టి అనుకూలాలు, ప్రతికూలాలు క్రింద చేర్చాను. సహసభ్యులు క్రింది విభాగాలలో మరియు ఇక్కడ స్పందించండి.--అర్జున (చర్చ) 06:00, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

/మార్పులు చేయవలసిన పేజీలు 1668

జాబితా చేర్చాను. --అర్జున (చర్చ) 06:48, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ http://ourtelugunadu.com లో తెలంగాణ 33 జిల్లాలకుగాను 32 జిల్లాల జి.ఓ.లు ఉన్నాయి. అవే లింకులు ఇదే ప్రాజెక్టు పేజీలో రిఫెరెన్సు నిమిత్తం కూర్పు చేయబడినవి.వాటిని వికీ నియమాల ప్రకారం ఉండటానికి అవకాశంలేకపోతే తొలగించివచ్చు. తరువాత http://ourtelugunadu.com నుండి ఈ లింకులు తప్ప ఇతరత్రా లింకులు ఏవీ నేనుగా వికీపీడియా వ్యాసాలుకు కూర్పు చేయలేదు. గ్రహించగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:12, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూడవ ఆప్షన్‌తో ఉన్న సమస్యలు రెండు - కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్, శాశ్వతత్వం. కానీ, ఎప్పుడైతే ఒక పనిలో వాణిజ్య ప్రయోజనాలు కానీ, ఉద్యోగాభివృద్ధి కానీ, ఇలాంటి లాభాలు స్నేహితులకో, కుటుంబానికో ఇప్పించడం కానీ ఉండవో అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్టు వర్తించదన్నది మనకు తెలిసిన విషయమే. (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్టు గురించి మరింత చదవండి) కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ కింది లెక్కకు రాదు. ఉన్న సమస్యల్లా శాశ్వతత్వం. అందుకు ఈ వెబ్‌సైట్ కన్నా (ఎప్పుడైనా రామారావు గారు సైట్ స్థలం కొనుక్కోకపోతే వెబ్‌సైట్ పోతుంది) ఆర్కైవ్ పదిలం కాబట్టి మొదటి ఆప్షన్ అత్యుత్తమం. అయితే, ఆ పనిని రామారావు గారి మీదే పెట్టడానికి నేను వ్యతిరేకం. ఆసక్తి ఉన్నవారెవరైనా ఆయన చేసినంత పనినీ చేసేట్టయితే, అది పూర్తయ్యాకా మాత్రమే లింకులు మార్చాలి. ముందు ఇల్లు కూలగొట్టి తర్వాత సగం కట్టే ధోరణిలో అయితే అసలు చేయనే అక్కరలేదు. ఇక, అసాధ్య కృత్యమేమీ కాదు. రామారావు గారు ఇన్నిటిని వింగడించి, వెతికి, అర్థం చేసుకుని, రాసి, తెచ్చి తన వెబ్‌సైట్‌లో స్వంత డబ్బు పెట్టి పెట్టుకుని, ఇంతా చేయగలిగినప్పుడు - ఆసక్తి ఉంటే, మండలం మండలంగా చేసుకుంటూ వెళ్ళేవారు వెళ్లవచ్చు. ఇక రెండవ ఆప్షన్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంత చక్కగా పరిశీలించు చూసుకోగలిగేలా లింకులు ఇచ్చినప్పుడు మొదట చెప్పినట్టు ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్టూ లేదని తేలినప్పుడు ఉన్న లింకులు తీసేయడం సరికాదు, వద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 09:34, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కొంత పరిశోధన చేసినతరువాత ఇంకొక ఐచ్ఛికం చేర్చాను. దానిని పరిశీలించి సభ్యులు స్పందించవలసినది. --అర్జున (చర్చ) 07:00, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహకులైన చదువరి,వీవెన్, రాజశేఖర్, వాడుకరి:విశ్వనాధ్.బి.కె., రవిచంద్ర, t.sujatha, కె.వెంకట రమణ, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, యర్రా రామారావు గార్లు, ఇతర సభ్యులు క్రింది ఐచ్ఛికాలగురించి ఏమైనా సందేహాలుంటే వారంరోజులలోగా (2020-08-05) చర్చించండి. ఆ తరువాత సముదాయ నిర్ణయానికి వోటు వేయడం జరుగుతుంది. --అర్జున (చర్చ) 10:23, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా గ్రామ, మండల వ్యాసాలలో ఉన్న లింకుల గురించి బాగా పరిశీలించిన అర్జున గారికి కృతజ్ఞతలు. ప్రారంభంలో అంతగా తెవికీ పరిజ్ఞానం లేనప్పుడు ఇచ్చిన మూలాలు ఇప్పుడు తొలగించవచ్చని అభిప్రాయపడిన రామారావు గారికి కూడా కృతజ్ఞతలు. కొందరు సభ్యులు అభిప్రాయపడినట్లుగా ఇవి రాజపత్రాలు (గెజిట్లు) కావు, ఇవి ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) మాత్రమే. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రిజిష్టరు (GOIR)లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సైటులో Dept పేరు Revenue గా, Section పేరు DA-CMRFగా, GO Typeను MSగా, తేది From & To రెండు చోట్ల 11102016గా చేర్చి 30 జిల్లాలకు చెందిన ఉత్తర్వులు చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఉత్తర్వులకు ఇదే సైట్ మూలం. ప్రభుత్వ ఉత్తర్వులన్నింటికీ కాపీరైట్ ఉంటుంది. ఈ ఉత్తర్వులను కాపీ చేసుకొని తమ సైట్లలో అప్లోడ్ చేసినవారు కాపీరైట్ హక్కులు ఉల్లంఘించినట్లే కాబట్టి అలాంటి సైటులకు గాని బ్లాగులకు కాని తెవికీ వ్యాసాలలో లింకులివ్వడం సమంజసం కాదు. ఇలాంటి విషయాలలో ఓటింగ్ కూడా పనిచేయదు. ఓటింగ్ చేసిననూ 3, 4 ఐచ్ఛికాలను వదిలేయాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం రెండో ఐచ్ఛికమే మేలైనది. ఎందుకంటే మూలమంటే మూలమే, ఖచ్చితంగా లింకు ఉండాలని ఏమీ లేదు. ఒక కాపీరైట్ పుస్తకానికి సంబంధించి ఎవరో స్కాన్ చేసి ఏదో వెబ్‌సైట్‌లో పెట్టుకున్నంత మాత్రానా మనం ఆ కాపీరైట్ ఉల్లంఘించిన సైటుకు లింకులివ్వలేము కదా! ISBN స్టాండర్డ్ పుస్తకాలకు సంబంధించి పుస్తకం పేరు, రచయిత, ప్రచురణ, పేజీ సంఖ్య ఇస్తున్నట్లుగా ఈ ఉత్తర్వులకు కూడా ఉత్తర్వు సంఖ్య, శాఖ, తేది సరిపోతుంది. బాటు ద్వారా మూలాలను మార్చవచ్చు. ఒకవేళ లింకే కావాలంటే ఉత్తర్వు వివరాల చివరన సైటు లింకు కూడా ఇవ్వవచ్చు (ఉదా:కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248, రెవెన్యూ (DA-CMRF) శాఖ, తేది 11-10-2016 (goir.telangana.gov.in) లేదా మూలం మొత్తానికి కలిపి లింకు ఇవ్వవచ్చు (ఉదా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248, రెవెన్యూ (DA-CMRF) శాఖ, తేది 11-10-2016). అవసరమైన వారు లింకు ద్వారా సైటును సందర్శించి పూర్తి ఉత్తర్వును చూసే అవకాశం ఉంటుంది. నిబంధనలననుసరిస్తూ ఉత్తర్వులకు మూలం/లింకులివ్వాలంటే ఇంతకంటే మేలైన మార్గం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:09, 31 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుడు:C.Chandra Kanth Rao గారు, సరియైన ప్రభుత్వ జాలస్థలి లింకు వెతకటానికి వివరాలు చక్కగా తెలిపినందులకు ధన్యవాదాలు. మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. మూలం మొత్తానికి లింకు {{Cite web}} తో ఇవ్వడం మెరుగు అని నా అభిప్రాయం. ఇవి ముఖ్యంగా జిల్లా, మండలానికి సంబంధించినవి కావున గ్రామాల పేజీలలో ఈ లింకుల అవసరం గురించి మీ అభిప్రాయం తెలపమని కోరుతున్నాను. ఇతరుల స్పందనలు కూడా చూద్దాం.--అర్జున (చర్చ) 09:16, 1 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు, లింకు {{Cite web}} తోనే ఇవ్వవచ్చు. నేను ఇటీవలి కాలంలో వ్యాసాలలో దిద్దుబాట్లు చేయడం లేదు కాబట్టి అలవాటుగా పాత పద్దతే ఉపయోగించాను. ఇక గ్రామాల పేజీలలో ఇతర గ్రామాలలో ఉన్నట్లుగా ఉత్తర్వు సంఖ్య, శాఖ, తేది సరిపోతుంది. ఉదా: జానంపేట గ్రామవ్యాసం) సి. చంద్ర కాంత రావు- చర్చ 20:44, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇతర స్పందనలు లేనందున, పై చర్చ ప్రకారం మార్పులు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 04:15, 8 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పులకొరకు బాటు సహాయ అభ్యర్ధనపేజీ విభాగం చూడండి, సహాయం చేయండి. --అర్జున (చర్చ) 05:33, 8 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఐచ్ఛికం 1: రాజపత్రాలు ఆర్కైవ్. ఆర్గ్ లో చేర్చే ప్రాజెక్టులో వున్నవా అని వెతకటం అట్లాంటి మూలాలతో మార్చడం[మార్చు]

అనుకూలాలు
  • పూర్తి మూలం అందుబాటులో వుంటుంది.
ప్రతికూలాలు
  • మూలాలు ఇప్పటికే ఆర్కైవ్ లో అందుబాటులో లేకపోతే అవి అందుబాటులోకి వచ్చేదాకా వేచిచూడాలి.
పరిశోధన

ఆర్కైవ్.ఆర్గ్ లో వెతికాను కాని అవసరమైనవి కనబడలేదు. కాని అసలైన రాజపత్ర మూలాలు వున్నాయి. అలాగే అసలైన రాజపత్రమూలాల వెబ్సైటు https://tsgazette.cgg.gov.in/eGaze లో కూడా వెతికాను కాని దొరకలేదు. ఆ వెబ్సైట్ కు అభ్యర్ధన పంపిచవచ్చు. కాని త్వరిత స్పందన ఆశించలేము.--అర్జున (చర్చ) 06:59, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఐచ్ఛికం 2: మూలాలు, లింకులు కాకుండా, కేవలం సంఖ్య, తేదీ, శాఖ లాంటివి ప్రస్తావించడం[మార్చు]

అనుకూలాలు
  • సులభంగా మార్పులు చేయవచ్చు.
  • మూలంలో సమాచారం కేవలం ఏ మండలంలో ఏ ఊరు వుందనే కాబట్టి, లింకు వలన పెద్ద ఉపయోగంలేదు.
ప్రతికూలాలు
  • మూలం లింకు కోల్పోతున్నాం.

ఐచ్ఛికం 3: మూలాలు కొనసాగించడం[మార్చు]

అనుకూలాలు
  • ఏమి చేయనవసరంలేదు కావున అత్యంత సులభం
ప్రతికూలాలు
  • మూలాలు కొనసాగించడం వికీపీడియా నియమాలకు విరుద్ధం. దీనిని ముందు ముందు దృష్టాంతంగా వాడుకొని ఇటువంటి పనులు కొనసాగే అవకాశముంది.

ఐచ్ఛికం 4: వాడిన మూలాలను పరిమితంగా జిల్లా,మండల పేజీలో వాడటం, ఇతర చోట్ల తొలగించడం[మార్చు]

ఈ మూలాలు అసలైన రాజపత్రాలు కావు కేవలం రెవిన్యూ శాఖ రాజపత్ర ముద్రణ అధికారులకు తెలియచేసిన సమాచారం మాత్రమే. అందువలన అధికారిక మూలం కాజారదు, పరిమిత సంఖ్యలో జిల్లాలో, మండలంలో వాడితే సరిపోతుంది.

అనుకూలాలు
  • లింకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కావున మూలాల గణాంకాలలో స్థానం తగ్గుతుంది. తక్కువ చోట్ల వాడితే వాటిని తొలగించటం గురించి అభ్యంతరం వుండదు
ప్రతికూలాలు
  • మార్పులు చేయటంలో జాగ్రత్త వహించాలి.

మండలం పేజీ, "మండలం లోని గ్రామాలు" వర్గం పేజీ పేర్లలో తేడా[మార్చు]

తెలంగాణ లోని మండలాల విషయంలో కింది విషయాన్ని గమనించాను: మండలం పేజీ పేరు, మండలంలోని గ్రామాలు అనే వర్గపు పేరు లోనూ ఉండే మండలం పేరు ఒకేలా లేదు. మొత్తం మండలాల్లో దాదాపు సగానికి ఇలా ఉంది. ఎక్కువగా పేజీ పేరులో పెట్టే క్వాలిఫయర్లలోనే ఉంది. అలాంటి మండలాల జాబితా ఇది


షేక్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)

టేకులపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా)

వీపన్‌గండ్ల మండలం

నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)

సికింద్రాబాద్ మండలం (హైదరాబాదు జిల్లా)

మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా)

న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా)

శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా)

ఆదిలాబాద్ పట్టణ మండలం

ఆదిలాబాద్ పట్టణ మండలం

అలంపూర్ మండలం

మనోహరాబాద్ మండలం

ఆసిఫాబాద్‌ మండలం (కొమరంభీం జిల్లా)

ఇబ్రహీంపట్నం మండలం (జగిత్యాల జిల్లా)

ఇల్లందకుంట మండలం (కరీంనగర్)

అంబర్‌పేట మండలం (హైదరాబాదు జిల్లా)

దామెరచర్ల మండలం

బైంసా మండలం

అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)

కరీంనగర్ గ్రామీణ మండలం

కల్లూరు మండలం (ఖమ్మం జిల్లా)

మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

ఆసిఫ్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)

కొమురవెల్లి మండలం (సిద్దిపేట జిల్లా)

కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం

మామడ మండలం (నిర్మల్ జిల్లా)

ఆత్మకూరు (ఎం) మండలం

ఎడపల్లి మండలం

బయ్యారం మండలం (మహబూబాబాద్ జిల్లా)

నారాయణరావుపేట్ మండలం (సిద్ధిపేట జిల్లా)

మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా)

కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)

కొడిమ్యాల మండలం

ఖానాపూర్ మండలం (వరంగల్ జిల్లా)

భద్రాచలం మండలం

కొత్తపల్లి మండలం (కరీంనగర్)

లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

బాల్కొండ మండలం

బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా)

బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా)

వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా)

ఎర్గట్ల మండలం

మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా)

ఖమ్మం మండలం (అర్బన్)

ఖమ్మం మండలం (రూరల్)

సంగెం మండలం (వరంగల్)

లక్ష్మణ్‌చాందా మండలం

ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)

పెన్‌పహాడ్‌ మండలం (సూర్యాపేట జిల్లా)

గాంధారి మండలం (కామారెడ్డి జిల్లా)

అడ్డాకల్ మండలం

కొట్‌పల్లి మండలం

గుడిహత్నూర్ మండలం

రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా)

నాంపల్లి మండలం (నల్గొండ జిల్లా)

గొల్లపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)

ఘనపూర్‌ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

గీసుగొండ మండలం

ములకలపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

నిడమనూరు మండలం (నల్గొండ జిల్లా)

లక్ష్మీదేవిపల్లి మండలం

వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

చింతకాని మండలం (ఖమ్మం జిల్లా)

పెద్ద అడిశర్ల పల్లి మండలం

చిట్యాల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

మద్దిరాల మండలం (సూర్యాపేట జిల్లా)

చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)

మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)

కొడంగల్ మండలం

ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా)

జగిత్యాల గ్రామీణ మండలం

చిన్న కోడూరు మండలం (సిద్దిపేట జిల్లా)

రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)

మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)

జాఫర్‌గఢ్‌ మండలం (జనగామ జిల్లా)

జుక్కల్ మండలం (కామారెడ్డి జిల్లా)

టేకుమట్ల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

తరిగొప్పుల మండలం (జనగామ జిల్లా)

కురవి మండలం (మహబూబాబాదు జిల్లా)

ఊట్కూరు మండలం (నారాయణపేట జిల్లా)

తాడ్వాయి మండలం (కామారెడ్డి జిల్లా)

కృష్ణ మండలం (నారాయణపేట జిల్లా)

తిమ్మాపూర్ మండలం

మర్రిగూడ మండలం (నల్గొండ జిల్లా)

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం

కోస్గి మండలం (నారాయణపేట జిల్లా)

మాడుగుల పల్లె మండలం (నల్గొండ జిల్లా)

కేసముద్రం మండలం (మహబూబాబాదు జిల్లా)

సారంగపూర్ మండలం (నిర్మల్ జిల్లా)

దహేగాం మండలం

కమ్మర్‌పల్లి మండలం (నిజామాబాదు జిల్లా)

ఖైరతాబాద్ మండలం (హైదరాబాద్ జిల్లా)

సిద్దిపేట గ్రామీణ మండలం

చెన్నూర్ మండలం (మంచిర్యాల జిల్లా)

దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)

యాలాల్‌ మండలం

సిద్దిపేట పట్టణ మండలం

అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

ధర్మపురి మండలం (జగిత్యాల జిల్లా)

గోల్కొండ మండలం (హైదరాబాద్ జిల్లా)

అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

వేములపల్లి మండలం (నల్గొండ జిల్లా)

చార్మినార్ మండలం (హైదరాబాద్ జిల్లా)

తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా)

నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా)

దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట)

దోమ మండలం

నసురుల్లాబాద్ మండలం

కొత్తగూడ మండలం (మహబూబాబాదు జిల్లా)

అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

సైదాబాద్ మండలం (హైదరాబాదు జిల్లా)

ఆత్మకూరు మండలం (హన్మకొండ జిల్లా)

ఆమన‌గల్ మండలం

నారాయణరావుపేట్ మండలం (సిద్ధిపేట జిల్లా)

జక్రాన్‌పల్లి మండలం

ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)

అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

అల్వాల్ మండలం

ఎలిగేడు మండలం

మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా)

దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా)

గంగారం మండలం (మహబూబాబాద్ జిల్లా)

నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)

బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా)

ఐనవోలు మండలం (హన్మకొండ జిల్లా)

నేలకొండపల్లి మండలం (ఖమ్మం జిల్లా)

హత్నూర మండలం

తిరుమలగిరి మండలం (హైదరాబాద్ జిల్లా)

ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా)

పల్మెల మండలం

కాప్రా మండలం

ఇల్లెందు మండలం

పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)

జన్నారం మండలం (మంచిర్యాల జిల్లా)

పెంచికల్‌పేట్ మండలం (కొమరంభీం జిల్లా)

పెగడపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

పెద్ద కొడపగల్ మండలం

కరకగూడెం మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

కొల్లాపూర్ మండలం

పెనుబల్లి మండలం (ఖమ్మం జిల్లా)

కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా)

కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా)

బచ్చన్నపేట మండలం (జనగామ జిల్లా)

బజార్‌హత్నూర్ మండలం

మహబూబ్ నగర్ మండలం (అర్బన్)

తుర్కపల్లి మండలం

రేంజల్ మండలం

తాడ్వాయి మండలం (సమ్మక సారక్క)

నారాయణపూర్ మండలం

ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)

బిక్నూర్ మండలం

మద్దూర్ మండలం (నారాయణపేట జిల్లా)

కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా)

బీబీపేట మండలం

బుగ్గారం మండలం (జగిత్యాల జిల్లా)

తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)

బోనకల్ మండలం

ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా)

ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా)

వేల్పూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)

నాంపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)

గూడూర్ మండలం (మహబూబాబాదు జిల్లా)

ధర్మారం మండలం

ఇల్లంతకుంట మండలం (రాజన్న సిరిసిల్ల)

కొత్తగూడెం మండలం

దామెర మండలం

ధర్‌పల్లి మండలం (నిజామాబాద్ జిల్లా)

మద్నూర్ మండలం (కామారెడ్డి జిల్లా)

మహబూబ్ నగర్ మండలం (రూరల్)

చింతలపాలెం మండలం

కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

మల్యాల మండలం (జగిత్యాల జిల్లా)

మల్లాపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

మహమ్మదాబాద్ మండలం

ములుగు మండలం (ములుగు జిల్లా)

సిద్దిపేట గ్రామీణ మండలం

మహదేవ్‌పూర్ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

సిరికొండ మండలం (నిజామాబాదు జిల్లా)

గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

మానకొండూరు మండలం

కొమురవెల్లి మండలం (సిద్దిపేట జిల్లా)

పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా)

చిలుకూరు మండలం

కడం పెద్దూర్ మండలం

గుండాల మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

ముత్తారం మహదేవ్‌పూర్ మండలం

ముదిగొండ మండలం (ఖమ్మం జిల్లా)

నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా)

సిద్దిపేట పట్టణ మండలం

కొందుర్గు మండలం

బీబీనగర్ మండలం

కుబీర్‌ మండలం

మెట్‌పల్లి మండలం (జగిత్యాల జిల్లా)

మేడిపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా)

ఖానాపూర్ మండలం (నిర్మల్ జిల్లా)

తానూర్‌ మండలం (నిర్మల్ జిల్లా)

పాన్‌గల్‌ మండలం

తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల)

దస్తూరబాద్ మండలం

దిలావర్ పూర్ మండలం (నిర్మల్ జిల్లా)

రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)

రఘునాథపాలెం మండలం (ఖమ్మం జిల్లా)

రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)

ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా)

రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

చిన్న కోడూరు మండలం (సిద్దిపేట జిల్లా)

రామడుగు మండలం

చౌదర్‌గూడెం మండలం

రాయికల్ మండలం

నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా)

నిర్మల్ గ్రామీణ మండలం

రేగొండ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

లింగంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)

లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)

లింగాల ఘన్‌‌పూర్‌ మండలం (జనగామ జిల్లా)

ముత్తారం మండలం (పెద్దపల్లి జిల్లా)

వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

పరిగి మండలం (వికారాబాదు జిల్లా)

తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

నార్సింగి మండలం

గుండ్లపల్లి మండలం (నల్గొండ జిల్లా)

వి.సైదాపూర్ మండలం

వరంగల్ మండలం

నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా)

వెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా)

మదనాపురం మండలం (వనపర్తి జిల్లా)

బండ్లగూడ మండలం (హైదరాబాద్ జిల్లా)

బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా)

ముస్తాబాద్ మండలం (రాజన్న సిరిసిల్ల)

బహదూర్‌పుర మండలం (హైదరాబాద్ జిల్లా)

సదాశివనగర్ మండలం (కామారెడ్డి జిల్లా)

సారంగపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

రామగిరి మండలం (సెంటనరీ కాలనీ)

తుంగతుర్తి మండలం (సూర్యాపేట జిల్లా)

సిరికొండ మండలం (ఆదిలాబాద్ జిల్లా)

దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట)

సిర్పూర్ (యు) మండలం

సిర్పూర్ పట్టణ మండలం

భీమారం మండలం (మంచిర్యాల జిల్లా)

హిమాయత్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)

చింతపల్లి మండలం (నల్గొండ జిల్లా)

మారేడుపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)

ముషీరాబాద్ మండలం (హైదరాబాద్ జిల్లా)

శాయంపేట మండలం (హన్మకొండ జిల్లా)

నాగారం మండలం (సూర్యాపేట జిల్లా)

చిట్యాల మండలం (నల్గొండ జిల్లా)

ఈ పేర్లు ఒకేలా ఉంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 01:35, 28 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]