Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు/రెండవ దశ

వికీపీడియా నుండి

రెండవ దశ

[మార్చు]

వికీపీడియా:2012 లక్ష్యాలు సమీక్షించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ప్రాధాన్యతను గుర్తించి రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించి 2012 జనవరి నుండి మే వరకు అమలు చేయటం జరిగింది.

రెండో దశాంత సమీక్ష

[మార్చు]

జనవరి 2012 నుండి మే 2012 వరకు ఈ దశ పనిజరిగింది. ఐదుగురు వికీపీడియన్లు స్వచ్ఛందంగా ఈప్రాజెక్టులో సభ్యులవడం మరియు ఇంకా కొంతమంది వికీపీడియన్లు(పేరుగల, మరియు పేరులేని) సంతోషించదగిన విషయం. అలాగే వారి వారి ఆసక్తిని బట్టి మార్పులు చేశారు.

గణాంకాలు

మొత్తం 1909మార్పులలో, కృష్ణా_జిల్లా, ప్రకాశం_జిల్లా ,కరీంనగర్_జిల్లా లో అత్యధిక మార్పులు జరుగగా, కర్నూలు_జిల్లా , నిజామాబాదు_జిల్లా, నల్గొండ_జిల్లా వ్యాసాలలో అత్యల్పంగా మార్పులు చేయబడ్డాయి. మే లో అత్యధికంగా 1000పైగా ఆ తరువాత జనవరిలో 500 కి పైగా మార్పులు, మార్చిలో అత్యల్పంగా 66 మార్పులు జరిగాయి.

వ్యాసం మార్పులు(జనవరి-మే)
అనంతపురం_జిల్లా 52
ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు 9
ఆదిలాబాదు_జిల్లా 103
కరీంనగర్_జిల్లా 138
కర్నూలు_జిల్లా 37
కృష్ణా_జిల్లా 194
ఖమ్మం_జిల్లా 71
గుంటూరు_జిల్లా 109
చిత్తూరు_జిల్లా 62
తూర్పు_గోదావరి_జిల్లా 78
నల్గొండ_జిల్లా 30
నిజామాబాదు_జిల్లా 36
పశ్చిమ_గోదావరి_జిల్లా 46
ప్రకాశం_జిల్లా 152
మహబూబ్_నగర్_జిల్లా 75
మెదక్_జిల్లా 47
రంగారెడ్డి_జిల్లా 119
వరంగల్_జిల్లా 52
విజయనగరం_జిల్లా 127
విశాఖపట్నం_జిల్లా 76
వైఎస్ఆర్_జిల్లా 95
శ్రీ_పొట్టి_శ్రీరాములు_నెల్లూరు_జిల్లా 109
శ్రీకాకుళం_జిల్లా 53
హైదరాబాదు_జిల్లా 39
మొత్తం 1909
వాడుకరుల మార్పులు

90శాతం మార్పులు ప్రాజెక్టు సభ్యులు చేశారు. మరిన్ని వివరాలు క్రింది పట్టిక లో చూడగలరు.

వాడుకరి వివరం(గోప్యత కోసం గుర్తించగలిగే పేరు ఇవ్వలేదు) మార్పులు (జనవరి -మే)
వాడుకరి అ 895
వాడుకరి ఆ 457
వాడుకరి ఇ 156
వాడుకరి ఈ 114
వాడుకరి ఉ 52
ప్రాజెక్టు సభ్యులుగా నమోదు కానివాడుకర్లు, బాట్లు 117
అనామక వాడుకరులు 64
మొత్తం 1909

వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నాణ్యత గణాంకాలు

[మార్చు]
ముందు (2008)
ఆంధ్రప్రదేశ్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 1 3 0 0 2 6
ఆరంభ 1 7 2 0 33 43
మొలక 0 3 1 0 22 26
విలువకట్టని . . . . . 68
మొత్తం 2 13 3 0 57 143
తర్వాత (2012 జూన్)
ఆంధ్రప్రదేశ్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 1 0 0 0 0 1
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 10 6 0 0 1 17
ఆరంభ 12 6 2 0 16 36
మొలక 0 3 2 0 23 28
విలువకట్టని . . . . . 68
మొత్తం 23 15 4 0 40 150
ఈ దశ బలాలు
  • ఐదుగురు సభ్యులు గా చేరటం.
  • ఇతరులను చేరమని ప్రోత్సహించడం.
  • ఈ వారం సమిష్ఠి కృషిలో ప్రచారం చేయడం
  • ఉపయోగపడే వనరులను పంచుకోవడం (బ్రిటీష్ కాలంనాటి చరిత్ర, ఈనాడు పేజీలు లాంటివి)
  • మధ్యంతర సమీక్ష చేసి ధ్యాసపెట్టవలసిన వాటిని గుర్తించడం. ముఖ్యంగా పటములలో లోపాలు. అలాగే పేరు మార్పుకుసంబంధించిన మార్పులు
  • ఒక సభ్యుడు pywikipediabot ద్వారా వేలకొలది పేరు మార్పులు, అలాగే వర్గ మార్పులు చేయగలగటం.
  • జిల్లాల పటములో జిల్లాల లింకులను నొక్కుటకు అనుగుణంగా చేర్చుట.
  • జిల్లా పేజీలను ఆకర్షణీయంగా సూచీ పటములను బొమ్మలను చేర్చుట
  • పుస్తకం తయారు చేయగా 328 పేజీల పుస్తకం తయారైంది. (చూడండి వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#వికీపేజీలనుండి పుస్తకాల తయారీకి కలెక్షన్ పొడిగింపు స్థాపన ప్రతిపాదన)
  • గణాంకాలు పొందడానికి తగిన ఖాతా అర్జునరావు పొందాడు.
ఈ దశ లోపాలు (ముందు దశలో దీనిని అధిగమించటానికి చర్యలు తీసుకొనటం మంచిది)
  • ప్రాజెక్టు చర్చలో, మధ్యంతర సమీక్షలో పాల్గొనే సభ్యులు తక్కువ. ( చర్చలలో పాల్గొనని వారికి ప్రాజెక్టులో పాల్గొనడంపై బలమైన ఆసక్తి లోపమా అవగాహనా లోపమా లేక ఇతరత్రా కారణాలా?)
  • మార్పుల గణాంకాలు నెల నెలా పంచలేకపోవడం.
  • ఇంగ్లీషు వికీలో ఆంధ్ర ప్రదేశ్ విషయాలపై పనిచేసేవారితో సహకరించకపోవడం

సభ్యులు,చేరిన తేది

[మార్చు]
  1. --అర్జున 11:16, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  2. జె.వి.ఆర్.కె.ప్రసాద్
  3. రాజశేఖర్ 9 జనవరి 2012
  4. t.sujatha 7:55pm, 9 జనవరి 2012 (utc)
  5. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:37, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లాల భాధ్యత

[మార్చు]
జిల్లా బాధ్యత వహించే వికీ సభ్యులు స్థితి (సమీక్షకు తయారు లేక పనిజరుగుతున్నది) వ్యాస బాధ్యులు రాయవలసినది సమీక్షకుల పేరు,క్లుప్తంగా చేయవలసిన పెద్దమార్పులు (వివరాలు వ్యాస చర్చాపేజీలో, చిన్న మార్పులు సమీక్షచేసేటప్పుడు పూర్తిచేయండి) సమీక్షసూచించిన పెద్దమార్పుల స్థితి(అయింది, పనిజరుగుతున్నది)
అనంతపురం జిల్లా t.sujatha
ఆదిలాబాదు జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి
కరీంనగర్ జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి
కర్నూలు జిల్లా
కృష్ణా జిల్లా జె.వి.ఆర్.కె.ప్రసాద్
ఖమ్మం జిల్లా t.sujatha
గుంటూరు జిల్లా అర్జున, సమీక్షకు తయారు
చిత్తూరు జిల్లా సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి, సమీక్షతేది 28-జూన్-2012
తూర్పు గోదావరి జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి
నల్గొండ జిల్లా t.sujatha ‌ సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి
నిజామాబాదు జిల్లా వైజాసత్య
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి, సమీక్షతేది 27-జూన్-2012
పశ్చిమ గోదావరి జిల్లా
ప్రకాశం జిల్లా అర్జున, Sridhar1000 సమీక్షకు తయారు
మహబూబ్ నగర్ జిల్లా సి.చంద్ర కాంత రావు
మెదక్ జిల్లా t.sujatha . సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి, సమీక్షతేది 28-జూన్-2012
రంగారెడ్డి జిల్లా సి.చంద్ర కాంత రావు
వరంగల్ జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి, సమీక్షతేది 28-జూన్-2012
విజయనగరం జిల్లా రాజశేఖర్
విశాఖపట్నం జిల్లా రాజశేఖర్
వైఎస్ఆర్ జిల్లా రహ్మానుద్దీన్, అర్జున సమీక్షకు తయారు
శ్రీకాకుళం జిల్లా రాజశేఖర్
హైదరాబాదు జిల్లా t.sujatha సమీక్షకు తయారు అర్జున,చర్చాపేజీలోని మూసలోకల లింకు చూడండి, సమీక్షతేది 28-జూన్-2012

రెండో దశ మధ్యంతర సమీక్ష

[మార్చు]
సాధారణ గమనికలు (ఏప్రిల్ 6, 2012)
  • చాలావరకు జిల్లా వ్యాసాలు మెరుగయ్యాయి.
చేయవలసిన పని
  • జనాభా ‌వివరాలు 2011 చేర్చాలి
  • ఉపశీర్షికలు ఈ పేజీలో చూపించిన వరుసక్రమంలో చేర్చాలి., ఉపశీర్షికలకు సమాచారం దొరకకపోతే అచేతనం చెయ్యాలి.
  • ఎవరూ బాధ్యత చేపట్టని వాటిని ఇతర క్రియాశీలక సభ్యులు చేపట్టాలి.
  • మార్పులు చేసినతరువాత జిల్లా దర్శిని అన్న పుస్తక ప్రాజెక్టు చేపట్టితే, మరింత మెరుగు చేయటానికి అవకాశముంటుంది.
  • మండలం పటములలో తెలుపుగా వున్న ప్రదేశం చుట్టు పక్కల వున్న మండలంలో చేర్చాలి. ఉదా: ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, ఈ పటములను వర్గం:దోషాలున్న పటములు వర్గంలో చేర్చడమైనది
  • ప్రతిజిల్లా పేజీలోప్రాతినిధ్యంగా వుండే బొమ్మను సరియైన స్థానాన్ని సూచించే మెరుగైన పటాన్ని చూపాలి. చూడండి ప్రకాశం జిల్లా
  • తోటి వికీపీడియన్లతోసమీక్షలు జరిపి నాణ్యత పెంచటానికి సలహాలను వీలైనంతవరకు పాటించాలి.

చేసిన పని

[మార్చు]
  • జిల్లా పేజీలు ప్రధానంగా చేసి, పట్టణ వ్యాసాలను (వేరే వ్యాసం లేనప్పుడు) దారి మార్పులు గా చేయటం
  • కడప జిల్లా ను వైఎస్ఆర్ జిల్లాగా వికీలో దాదాపు పూర్తిగా(1000 పై) చోట్ల పేరు మార్చటం(arjunaraocbot) ద్వారా
  • జిల్లాపేజీ ఆధారంగా వర్గాలను సరిచేయడం. జిల్లా పేజీని అదే పేరుగల వర్గంలోవుంచవచ్చు.

ప్రాజెక్టు వనరులు

[మార్చు]

మొదటి దశ

[మార్చు]

మొదటి దశ 2007 సెప్టెంబరు 19నుండి 2011డిసెంబరు 31. ఈ దశలో ప్రాజెక్టుకు కావలసిన మూసను (క్రింద భాగాలు), వ్యాస స్వరూపాన్ని తయారుచేయటం అలాగే వ్యాసాలు చేర్చటం జరిగింది. సమన్వయం గురించిన చర్చలు అంతగా లేవు కాబట్టి, పనిచేసినవారు వారి ఆలోచనల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళారు అనుకోవాలి. దీనిలో పాల్గొన్న వాళ్లు ఈ భాగాన్ని విస్తరించితే బాగుంటుంది.

ప్రాజెక్టు మూసలు

[మార్చు]

{{ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు-ప్రాజెక్టు సభ్యులు}} సభ్య పేజీలలో మరియు {{వికీప్రాజెక్టు ఆంధ్ర_ప్రదేశ్}} జిల్లా పేజీల చర్చా పేజీలలో వుంచండి.

వికీపీడియా లొ వ్యాసాలు ప్రామాణికరణ కోసం పాటించవలసిన నియమాలు

[మార్చు]
  • వ్యాసాలలొ కొలమానం కి సంబంధించిన వివరాలు అందించినప్పుడు మెట్రిక్ పద్ధతి ని పాటించాలి. ఉదాహరణ కు కి.మి. అని వ్రాయాలి కాని మైళ్ళు అని వ్రాయరాదు. మైళ్ళు అని వ్రాయదలిస్తే కి.మి అని వ్రాసి బ్రాకెట్లలొ మైళ్ళని వ్రాయాలి.
  • భారత దేశములొ ప్రాచుర్యములొ ఉన్న సంఖ్యలు లెక్కపెట్టే వ్యవస్థని మాత్రమే వినియోగించాలి. ఉదాహరణకు జనాభా చెప్పడానికి 10 లక్షలు అని వ్రాయలి కాని ఒక మిలియను అని వ్రాయరాదు.కాని అవసరం అనుకొంటే మిలియను అని బ్రాకెట్లలొ వ్రాయవచ్చు.
  • రొక్కం కి సంభంధించిన వివరాలు అందించేటప్పుడు రూపాయలలొ వ్రాసి అవసరం అనుకొంటే బ్రాకెట్లలొ అమెరికన్ డాలర్లలొ వ్రాయాలి.

అయోమయం

[మార్చు]

చాలా చోట్ల జిల్లా పేరు జిల్లా కేంద్రం పేరు ఒకటిగా నే ఉంటుంది. అప్పుడూ వ్యాసము మొదట్లొ ఒక చిన్న లింకు అమర్చాలి . జిల్లా వ్యాసాన్ని ప్రధానంగా చేసి పట్టణ వ్యాసాన్ని దారి మార్పు చేయాలి. అవసరమైతే అదే ఈ జిల్లాలొని పట్టణం వ్యాసానికి వెళ్ళవలసిన లింకు సూచించాలి. పట్టణ వ్యాసాన్ని వేరుచేస్తే మరీ మంచిది.

జిల్లా వ్యాసములో ఉండవల్సిన విభాగాలు

[మార్చు]

ఈ క్రింది విభాగాలు జిల్లా వ్యాసములో ఉండేటట్లు , ఈ వరసలో ఉండేటట్లు చూడాలి. అప్పుడూ చదివేవారికి అనువుగా ఒక క్రమ పద్ధతిగా ఉంటుంది.

ప్రవేశిక

[మార్చు]

శీర్షిక లేని వ్యాస తొలి పేరాయే ప్రవేశిక. ఈ ప్రవేశికలో వ్యాసం సారాంశం లాగా వుండాలి. ఉపవిభాగాలలో తగిన మూలాలున్నప్పుడు, ఇక్కడ మరల మూలాలు పేర్కొనవలసిన పనిలేదు.

చరిత్ర

[మార్చు]

తొలి పేరాలో జిల్లా పేరు ఎలా పుట్టిందో వివరించవచ్చు. తరువాత జిల్లా చరిత్ర గురించి విఫులంగా వ్రాయాలి. పూర్వకాలం నుండి ఇప్పటి వరకు పరిపాలించిన రాజులు వారు అభివృద్ధి పరచిన విషయాలు విఫులంగా ఆధారాల్తో వ్రాయాలి.ఈ విభాగం నాలుగు నుండి ఐదు పేరా లతో ఒక్కో పేరా 4-6 వాక్యాలతో వచ్చేటట్లు ఉండాలి.

వనరులు

భౌగోళిక స్వరూపము

[మార్చు]

వ్యాసము లో ఇది మరొక ముఖ్య విభాగము. ఏ ప్రాంతములొ ఉన్నది. ఉదాహరణకు విశాఖపట్టాణం జిల్లా ఉత్తర కోస్తా జిల్లా లొ కోరమాండల్ తీరం లొ ఉన్నది అనే వాక్యము లొ ప్రారంభించి. సరిహద్దులు , కొండలు, నదులు, మైదానాలు, పీఠభూములు, అడవులు, దీవులు, గురించి విఫులంగా వ్రాయాలి.

శీతోష్ణస్థితి గురించి తప్పక వ్రాయాలి. సగటు ఉష్ణోగ్రతల వివరాలు పొందు పరిస్తే మరిమంచిది. వరదలు తుఫానులు,అనావృష్టి గురించి. చరిత్రలో జరిగిన విషయాల గురించి వ్రాయాలి. ఈ విభాగం రెండు-నాలుగు పేరాలుగా వస్తే మంచిది.

ఆర్థిక స్థితిగతులు

[మార్చు]

జిల్లా ప్రధానంగా ఆదాయం గురించి అధారా పడే విషయాలు వ్రాయాలు. జిల్లాలోని ప్రధాన వ్యాపార కేంద్రాల గురించి వ్రాయాలి. వ్యవసాయం ప్రధాన ఆదాయం అయితే వ్యవసాయంలో ఏరకమైన పంటలు పండిస్తారో వ్రాయాలి.

రెవిన్యూ డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

[మార్చు]

ఈ విభాగములో ముఖ్యముగా ఎన్ని మండలాలు ఉన్నాయి ప్రక్కన పటం చూపిస్తూ చెప్పాలి. జిల్లాలొ ఉన్న అసెంబ్లి నియోజక వర్గాలు, పార్లమెంటు నియోజక వర్గాలు వ్రాయాలి.

రవాణా వ్యవస్థ

[మార్చు]

జిల్లాలొ ముఖ్య రవాణా వ్యవస్థ గురించి సృశించాలి. విశాఖపట్టణం వంటి జిల్లా లొ నౌకాశ్రయం గురించి వ్రాయాలి. ఈ విభాగం సూక్ష్మంగా వ్రాస్తేనే మంచిది.

జనాభా లెక్కలు

[మార్చు]

ఈ విభాగం చాలా ముఖ్యమైనది. జనాభా, అక్షరాస్యత, స్త్రీ:పురుషుల నిష్పత్తి, పిల్లలశాతం , మాట్లాడే భాషలు,

సంస్కృతి

[మార్చు]

జిల్లాలోని ప్రజల సంస్కృతి గురించి వ్రాయాలి. ఉన్న మతాల గురించి జరుపుకొనే పండగల గురించి వ్రాయాలి. ఉదాహరణ కు తెలంగాణా జిల్లాలలొ బోనాలు జరుపుకొంటారు అటువంటి విషయాలు ప్రస్ఫుటంగా తెలుపవలెను.

పశు పక్ష్యాదులు

[మార్చు]

జిల్లాలొ ఉండే పశు పక్ష్యాదుల గురించి వ్రాయలి. ఉదాహరణకు ఒంగోలు జిల్లా కోడెల ప్రసిద్ధి అటువంటి విషయాలు తెలుపవలెను. జిల్లాలో ఉన్న ప్రధాన వన్యసంరక్షణా కేంద్రాలు గురించి వ్రాయాలి.

విద్యా సంస్థలు

[మార్చు]

ముఖ్య విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాల గురించి, వైద్యకళాశాల గురించి, ఇంజనీరింగ్ కళాశాల గురించి వ్రాయాలి. ప్రాథమిక విద్యా సంస్థలలో ఉపయోగపడే గణాంకాలు చేర్చవచ్చు.

ఆకర్షణలు

[మార్చు]

జిల్లాలో ఉన్న ముఖ్య ఆకర్షణలు, దేవలయాలు, చర్చీలు, మసీదులు, సంగ్రహాలయాలు, చారిత్రక స్థలాల గురించి స్పృశించాలి. ఆ ఆకర్షణ ఉన్న పట్టణం వ్యాసములో మరింత విఫులంగా వ్రాయాలి

క్రీడలు

[మార్చు]

జిల్లాలో జరిగే క్రీడల గురించి వ్రాయాలి. క్రీడా ప్రాంగణాల గురించి వివరించాలి.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

జిల్లా నుండి ఉద్భవించిన ప్రముఖ వ్యక్తుల పేర్లు, క్లుప్తంగా ఎందుకు ప్రముఖులో వివరాలతో తెలుపాలి.

బయటి లింకులు

[మార్చు]

జాతీయ సూచన కేంద్రం వారి లింకులు,పర్యాటక కేంద్రం వారి లింకులు ఇవ్వాలి. ముఖ్యమైన సమాచారం అందించే లింకులు మాత్రమే ఇవ్వాలి. వ్యాపార ధృక్పథంతో నడిపే సైట్ల లింకులు ఇవ్వరాదు.

వనరులు

[మార్చు]
  • జిల్లా కి సంబంధించిన మన్ని విషయాలు తెలుసుకొనేందుకు చదవవలసిన పుస్తకాల లింకులు ఇవ్వవచ్చు.

మూలాలు

[మార్చు]

పైన పేర్కొన్న విషయాలకు మూలాలు పాఠ్య వరుసలోనే అనుకూలమైన మూస {{Cite web}} లేక అటువంటివి వాడాలి, ఆవి ఈ విభాగంలో కనబడతాయి.