వికీపీడియా:2012 లక్ష్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2011 సమీక్ష ఆధారంగా లక్ష్యాలు నిర్ణయించబడ్డాయి.

2012 లక్ష్యాలు[మార్చు]

 • వీక్షణలను 2010 ఫిబ్రవరి స్థాయికి (నెలకి 4.5 మిలియన్లు) తీసుకువెళ్లడం, డిసెంబర్ 2011లో 2.4 మిలియన్లు వున్నాయి.

వ్యూహాలు (వికీమీడియా దీర్ఘకాలిక వ్యూహలకు అనుగుణంగా), సమీక్ష[మార్చు]

 • పేజీ వీక్షణలు మార్చి 2012 లో 2.05 మిలియన్లు, సెప్టెంబరు 2012 లో 2.3 మిలియన్లు
దీర్ఘకాలిక వ్యూహం వార్షిక వ్యూహం పురోగతి వ్యాఖ్యలు, బాధ్యత తీసుకొనే సభ్యులు
వ్యవస్థాపన స్థిరీకరణ
 1. తెవికీ మొబైల్ పేజీ స్థిరీకరణ
 2. తెలుగు టైపింగ్ పద్ధతుల స్థిరీకరణ (అన్ని వికీ ప్రాజెక్టులలో)
 3. వికీ సాంకేతికాలు తెలిసిన వికీ సభ్యులని పెంపొందించటం
  1. ఫిభ్రవరి లో పూనా లో జరిగే హాకథాన్ కి తెలుగు వికీ సభ్యుడు హాజరయ్యేలా చూడడం.
 1. మొబైలు మొదటి పేజిసరిదిద్దబడింది
 2. తెవికీ లో నరయం ఆధారంగా టైపింగ్ పద్ధతి ప్రవేశపెట్టబడింది(మే2012)
 3. ఆసక్తిగల వారిని ప్రోత్సహించవలసివుంది.
  1. వీలవలేదు.

 1. చూడండి వికీపీడియా చర్చ:2012 లక్ష్యాలు#తెలుగు టైపింగ్ పద్ధతుల స్థిరీకరణ (అన్ని వికీ ప్రాజెక్టులలో)
క్రియాశీలక సభ్యులను పెంచడం
 1. ఈ వారం సమిష్టి కృషి
  1. ఈ వారం వ్యాసాలను ప్రదర్శనకు ముందు సమిష్టి కృషితో మెరుగు పరచడం
  2. ఈ వారం వ్యాసాల ఎంపిక కేలండర్లోని లేక వార్తలకు అనుగుణంగా ఎంపిక చేయడం
 2. వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం
  1. మూడు నెలలు ప్రతి వారం నిర్వహించి, సమీక్ష చేసి తదుపరి సమావేశ అంతరాన్ని నిర్ణయించడం
  2. క్రియాశీలక సభ్యులు ఎక్కువగా వుంటే 24x365 వెబ్ ఛాటింగ్ వాడటం ప్రారంభించడం
 3. ఒక సమిష్టి ప్రాజెక్టుని సమర్థవంతంగా మూడు నెలలు నిర్వహించడం.
  1. వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
 4. వికీపీడియన్ల కలయిక నెలవారీగా ప్రముఖ నగరాల్లో నిర్వహించండి.
  1. ప్రదేశాల వారీగా వాడుకరుల జాబితా తయారు చేయడము
 5. వికీ అకాడమీలు నెలకొకటి చొప్పున కళాశాలలో లేక ఇతర సంస్థలలో నిర్వహించడం
 6. వికీ కళ్లతో నా ప్రదేశం నిర్వహించడం ( మూడు నెలలకొకసారి)
 7. క్రియాశీలక సభ్యుల గుర్తింపు, గౌరవింపు
  1. తెలుగు వాడుకరులందరకు అర్హతను (దిద్దుబాట్లు ప్రకారము) బట్టి, వీలయినంత మంది పతకాలు అందజేయటము.
  2. వాడుకరులకు దిద్దుబాట్లు సంఖ్యను బట్టి పతకాలు అందుకోగలరు అని తెవికీ మొదటి పుటలో స్థిరముగా (చిరస్థాయిగా) ఉండే విధముగా నిర్ణయము తీసుకోవటము.
 1. పాటించడం జరుగుతున్నది
 2. 12 సమావేశాలు జరిగాయి.
 3. వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు విజయవంతమైంది.

  1. చూడండి వర్గం:వికీపీడియనులు
 4. వికీ జన్మదినం 2012 హైద్రాబాదులో నిర్వహించబడింది. మే నెల నుండి ప్రతినెల మూడవ ఆదివారం హైద్రాబాదు కలయిక ప్రారంభమైంది. వికీ అకాడమీలు కుప్పంలో ( 6 ఆగష్టు) మరియు ఐఐటి మద్రాసులో (అక్టోబరు 6)నిర్వహించబడ్డాయి


  1. వికీ జన్మదినం 2012 సందర్భంగా హైద్రాబాదులో 2011 లో అత్యధిక మార్పులను చేసినవారిని గౌరవించారు.
  2. జనవరి గణాంకాలు ఆధారంగా 25 మార్పులు, 100 మార్పులు దాటిన వారికి ప్రశంస వ్యాఖ్యను 500 దాటిన వారికి తెలుగు మెడల్ ఇవ్వడం జరిగింది.
నాణ్యతను పెంచడం
 1. వికీపీడియా మొదటి పేజీ నాణ్యతను మెరుగుపర్చడం
 2. నిర్వహణ మెరుగు
  1. కొత్తగా నిర్వాహకులని ఎంపిక చెయ్యడం
 1. మొదటిపేజీకికొత్త రూపంలోకి మార్చబడింది

  1. సుజాత, జెవిఆర్కె ప్రసాద్ నిర్వాహకులుగా , అర్జున అధికారిగా ఎంపికయ్యారు.
 1. సంప్రదింపు పేజీలో కొన్ని వ్యాసాలు తెలుగు అనువాదం చేయాలి.
వికీ వీక్షణలు వృద్ధి చేయడం
 1. తెవికీ ప్రచారానికి జట్టుని తయారుచేయడం
 2. ఫేస్బుక్ గ్రూపు, ఈమెయిల్ ఇతరత్రా వాటి ద్వారా మాధ్యమాలలో తెవికీ ప్రచారం పెంచడం
 3. రాష్ట్ర స్థాయి వికీ సమావేశం నిర్వహణం
 1. ఫేస్బుక్ పేజీ ప్రారంభించబడింది. క్రియాశీలత పెంచాలి.
 1. జట్టులో పాలుపంచుకోండి, మీ సభ్యనామం ఇక్కడ చేర్చవచ్చు. Cbrao
సృజనాత్మకతను పెంపొందించడం
 1. ఆఫ్లైన్ సిడి లేక ఇతరత్రా ప్రయోగాల చేపట్టడం

సహాయం కావాల్సినవి[మార్చు]

 • మూస ల సమస్యలను పరిష్కరించి ఇతర వికీలలోని మంచి మూసలను తెలుగులోకి తెచ్చుట
 • నాణ్యత పెంపుకోసం బాట్ల నిర్మాణం
 • మొదటి పేజీ శీర్షికల వ్యాసాల మెరుగుకై మరింత సమిష్టికృషి
 • వికీ నిర్వహణ వ్యాసాలను మెరుగు
 • నెలకొకటి చొప్పున వికీ అకాడమీ నిర్వహణ
 • తెవికీ వార్త నిర్వహణ

నివేదిక[మార్చు]

తెవికీ 2012 సమీక్ష ప్రదర్శనాపత్రము (ఇంగ్లీషు)

ఆఫ్లైన్లో సమావేశాలు జరిపి 2012 లక్ష్యాలను అందరి ఆలోచనలతో సమన్వయం చేసి నిర్ణయించడం జరిగింది. తెవికీలో చాలా సంవత్సరాల తర్వాత కొత్త నిర్వాహకులను, అధికారులను నియమించడం జరిగింది. ఈ లక్ష్యాలను అప్పుడప్పుడు సమీక్షించి వీటి అమలుకి ఆలోచించిన చర్యలపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కాగా ఫలితాల్లో పెద్ద పెరుగుదల కనబడలేదు. 78 మంది కొత్తగా చేరి దిద్దుబాట్లు చేసినా క్రియాశీలక సభ్యుల సంఖ్యలో మరియు అతిక్రియాశీలక సభ్యుల సంఖ్యలో పెద్ద తేడా రాలేదు.

డిసెంబర్ 2012 కు పేజీవీక్షణలు 20,08,988, పేజీలసంఖ్య 52,035 (గతసంవత్సరంతో పోలిస్తే 3% పెరుగుదల) మరియు రోజుకి కొత్త వ్యాసాల సంఖ్య 6 గాను, నెలలో మార్పుల సంఖ్య 6,166 గాను, క్రియాశీలం సభ్యుల సంఖ్య 34, అతిక్రియాశీల సభ్యుల సంఖ్య 8 గాను, కొత్త సభ్యుల సంఖ్య 3 గా నమోదైంది. డిసెంబరు 2011 లో రోజుకి కొత్త వ్యాసాల సంఖ్య 7 గాను, నెలలో మార్పుల సంఖ్య సుమారు 6800గాను, క్రియాశీలక సభ్యుల సంఖ్య 25, అతిక్రియాశీలక సభ్యుల సంఖ్య 5 గాను, కొత్త సభ్యుల సంఖ్య 2 గా నమోదైంది.

వీక్షణలు.
TeluguWP-PageViews-2012.png

వీక్షణలలో గత సంవత్సరంతో పోల్చితే పెద్ద తేడాలు లేవు. నెలకి 2.1 నుండి 2.8 మిలయన్లుగా ఉన్నాయి. ఈ స్థాయి నాలుగు సంవత్సరాల క్రితానికి సరిపోలుతుంది. వీక్షణలను 2010 ఫిబ్రవరి స్థాయికి (నెలకి 4.5 మిలియన్లు) తీసుకువెళ్లాలన్న లక్ష్యం నెరవేరలేదు. నెలకి మొబైల్ పరికరాలనుండి వీక్షణలు 40K నుండి 634K మధ్యనమోదయ్యాయి. ఇవి మొత్తము వీక్షణలలో 12.9శాతం (డిసెంబరు 2012) గావున్నాయి. ఈ సంఖ్య మొత్తం వికీపీడియాల మొబైల్ వీక్షణకు దగ్గరగా నున్నది.

వీక్షకులు

వికీ గణాంకాలు[1] భారతదేశం నుండి 22.19 మిలియన్ల మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు. ప్రపంచమొత్తంగా 484.49 మిలియన్ల మంది వికీ వాడుతుండగా20.17 బిలియన్ల పేజీ వీక్షణలు వున్నాయి. అనగా ఒక వ్యక్తి నెలలో 42 పేజీవీక్షణలనుకలిగివున్నట్లు. తెలుగు వికీ పేజీవీక్షణలు డిసెంబరు 2012 లో20,08,988 కాబట్టి, 47,833 మంది తెలుగువారు తెలుగు వికీని వీక్షిస్తున్నట్లు అనుకోవచ్చు. ఇంతకన్న మెరుగైన వీక్షకుల సంఖ్య కనిపెట్టే పద్దతి ప్రస్తుతము కనబడలేదు. అయితే ఈ సంఖ్యను ఇతర గణాంకాలతో పోల్చి చూడవచ్చు. భారత జనగణన 2011[2] ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తము 2,10,24,534 నివాసాలలో 8.4 శాతం(17,66,061) కంప్యూటర్లు కలిగి వున్నట్లు 2.6 శాతం(5,46,638) ఇంటర్నెట్ తో పాటు కంప్యూటర్ కలిగివున్నట్లు తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ సంపర్కంగల నివాసాలు 5,46,638 కాబట్టి, కనీసం ఇంటికి ఒక్కరి చొప్పున వీరిలో 31.80శాతం మాత్రమే వికీ వాడుకరులైతే 1,63,991 మంది వాడుతుండవచ్చు. అనగా తెవికీ వాడుకరులు 47,833 -1,63,991 అనుకోవచ్చు.

సభ్యుల కృషి
TeluguWPEditorActivity2012.png

ఎక్కువ మార్పులు చేసిన సభ్యుల కృషి చిత్రంలో చూపబడింది. వ్యాసమార్పులలో మొదటి 10 స్థానాలలో ఉన్నవారి వాడుకరి పేర్లు:-Bhaskaranaidu, Rajasekhar1961, YVSREDDY, Arjunaraoc, T.sujatha, Palagiri, C.Chandra Kanth Rao, Redaloes, సుల్తాన్ ఖాదర్, Kvr.lohith. వీరు అత్యధికంగా 4588 అత్యల్పంగా 585 మార్పులు చేశారు. వ్యాసేతర మార్పులలో మొదటి 10 స్థానాలలో ఉన్న వాడుకరి పేర్లు:- Arjunaraoc, విశ్వనాధ్.బి.కె., C.Chandra Kanth Rao, Rajasekhar1961, Bhaskaranaidu, JVRKPRASAD, T.sujatha, Palagiri, YVSREDDY, Veeven. వీరు అత్యధికంగా 3595 అత్యల్పంగా 196మార్పులు చేశారు.

సభ్యులు విశ్వనాథ్ మరియు వైజాసత్య మరల క్రియాశీలమయ్యారు. మొదటిపేజీని చాలా కాలం నిర్వహించిన కాసుబాబు కృషి తగ్గిపోయింది. మొదటిపేజీని మెరుగుపరచి ( 'చరిత్రలో ఈ రోజు' పైకి చేర్చుట, , రచ్చబండ సహాయం తదితర పేజీలు ఇంగ్లీషు వికీకు సమాంతరంగా వుండేటట్లు చేయుట, 'మీఊరు ఉందా' శీర్షిక ని స్వాగతం పేజీలోకి మార్చడం మీకు తెలుసాను పునరుద్దరించి వ్యాసకర్తలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. మొదటిపేజీ నిర్వహణని అర్జునరావు మరియు రాజశేఖర్ తోటి సంపాదకుల సహాయంతో నిర్వహించారు. ' ఈ వారం వ్యాసం' శీర్షికకి వారానికి సంబంధించిన పండుగ లేక ఇతర అనుబంధ విషయాలకి అనుగుణంగా ఎంపిక చేయడం జరిగింది. అయితే కొన్ని మొదటిపేజీ సవరణలు కొంత మంది సభ్యులకు నచ్చకపోవడం, వాటిని పరిష్కరించడానికి ఇతర సభ్యులుచర్చలలో పాల్గొనకపోవడంవలన కొన్ని మార్పులు రద్దుచేయడం జరిగింది. మరింత సమాచారానికి ఈ నివేదికలో చర్చలు విభాగం చూడండి.

సమావేశాలు, గుర్తింపులు
వికీ పుట్టినరోజు సమావేశం, హైద్రాబాదు
సహకరించిన నిపుణులు: సౌమ్యన్, అర్జున, సుజాత, రమేష్ రామయ్య, రాజాచంద్ర

వెబ్ ఛాట్ ద్వారా వికీపీడియన్ల సమావేశాలు సంవత్సరం మొదటిలో మూడు నెలలపాటు జరిగాయి. వీటి వలన సంవత్సరం ప్రణాళిక నిర్ణయించడం జరిగింది. ఆఫ్లైన్ లో హైదరాబాదులో రాజశేఖర్ గారి కార్యాలయంలో నెలవారీ సమావేశాలు కొన్ని జరిగాయి. కుప్పం మరియు చెన్నయ్ లలో వికీ అకాడమీలు, వికీ పుట్టినరోజుని హైద్రాబాదులో జరపబడినవి. ఎక్కువ కృషి చేసిన సభ్యులను గౌరవించడం జరిగింది. నెలకొకసారి తెవికీలో కృషి చేస్తున్న వారిని గమనించి ప్రోత్సహించే వ్యాఖ్యలు లేక గుర్తింపు ఇవ్వడం జరిగింది. పాత వికీపీడియన్లకి ఆహ్వానాలు పంపడం, ఒకే ఊరిలో ఉన్న వికీపీడియన్లని గుర్తించడం జరిగింది. రాజశేఖర్ గారు అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో జరిగిన వికీమానియా 2012కు హాజరయ్యారు. ప్రముఖ పత్రికల్లో తెవికీ గురించిన వ్యాసాలు అప్పుడప్పుడు ప్రచురితమయ్యాయి. ఫేస్బుక్ పేజీ సృష్టించబడింది కాని ప్రాచుర్యం కల్పించడం విజయవంతంకాలేదు.

సాంకేతికం

మొబైల్ పేజీ (ప్రస్తుత రూపం సాధారణ మొదటి పేజీ లోనే) స్థిరపరచడం మరియు తెలుగు టైపుకి లోగడగల విహరిణిలో పనిచేసే స్క్రిప్టు కి బదులుగా సర్వర్ ఆధారిత నరయం అనే పద్ధతిని పరీక్షించి అమలు పరచడం జరిగింది. అయితే సాంకేతికంగా ఆసక్తి కలిగిన వికీపీడియన్లని తయారుచేయడంలో పురోగతి లేదు. వికీపేజీలనుండి పుస్తకాల తయారీకి కలెక్షన్ పొడిగింపు స్థాపించడం జరిగింది.

పథకాలు

జిల్లా పేజీలు పథకం ప్రకారం విస్తరించబడినవి. దీనిలో ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు.

చర్చలు

ఇక చర్చా విషయాలకొస్తే మొదటిపేజీ విషయంలో , వర్గాల విషయంలో మరియు ఉద్యోగిస్వామ్యంలో ఉన్న వ్యక్తుల వ్యాసాల విషయంలో క్రియాశీలంగా వున్న ముగ్గురు నలుగురు సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కనీసం ఐదు మందికూడా స్థిరంగా చర్చలలో పాల్గొనకపోతుండడంతో వీటిని పరిష్కరించడం వీలవలేదు.

ఇవీచూడండి[మార్చు]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. వికీ గణాంకాలు పరిశీలనతేది జనవరి 17,2012
 2. రాష్ట్రాలవారీగా కంప్యూటర్ గల నివాసాలు