వికీపీడియా:2011 సమీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీదశవర్షపూర్తి వేడుక, వెబ్ పేజి

వికీపీడియా లో ఎవరికి వారు మార్పులు చేసే అవకాశమున్నా, మంచి నాణ్యతగల విజ్ఞాన సర్వస్వానికి అందరు సమిష్టిగా ప్రాధాన్యతల ప్రకారం సమన్వయం చేసుకుని తమకు ఇష్టమైన వాటిని వృద్ధిచేయవలసిన అవసరం వుంది. 2004 చివరలో తెలుగు వికీపీడియాలో ఎక్కువ సంఖ్యలో వ్యాసాల చేర్పు మొదలైంది. 2008 సంవత్సరాంత లో సమిష్టిగా లక్ష్యాలను నిర్దేశించాలన్న అలోచన వైజాసత్యతో మొదలైంది. అయితే దానికి స్పందన కరువైంది. ఆ తరువాత 2009 సంవత్సరాంతంలో అర్జున ప్రయత్నము సఫలం కాలేదు. ఇక 2011 సంవత్సరాంతంలో మరల ఇంకో ప్రయత్నం జరుగుతున్నది.

వికీపీడియా చరిత్రని పరిశీలిస్తే నెలలో 5 కి పైగా మార్పులు చేసే వారి సంఖ్య 25-30 దాకా వుంటున్నది. ఇది క్రితం సంవత్సరం తో పోల్చితే పెద్ద మార్పు లేదు. ఫిభ్రవరి 2010 లో 45 లక్షల వీక్షణలు కల తెవికీ తరువాత క్షీణించటం ప్రారంభించి డిసెంబరు 2011 కి 22లక్షలుగా నమోదైంది. దీనినిసమర్థవంతంగా ఎదుర్కోటానికి, ప్రతి ఒక్క వికీ సభ్యుడు వ్యాస మార్పులతో పాటు, నిర్వహణ పై ధ్యాసవుంచాలి. తెవికీ లక్ష్యాలను, వ్యూహాలను, వికీమీడియా ఫౌండేషన్ దీర్ఘకాలిక వ్యూహాలతో సమన్వయం చేసుకొని, వికీమీడియా భారతదేశం తోడ్పాటుతో కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి. అలాచేస్తే తెవికీ బాగా అభివృద్ధి చెంది తెలుగు ప్రజల సమాచార అవసరాలనుతీర్చటంలో ప్రథమ స్థానంలో వుండగలదు.


గణాంకాలు[మార్చు]

తెవికీ 2011 సమీక్ష ప్రదర్శన పత్రం చూడండి.

మూలాలకు చూడండి

గణాంకాలు పరిశీలిస్తే 2011 లో చెప్పుకోదగిన మార్పు కనబడలేదు.

మొబైల్ గణాంకాలు[మార్చు]

మొబైల్ గణాంకాలు జూన్ 2010 నుండి అందుబాటులో వున్నాయి. నవంబర్ 2011 లో అత్యధికంగా 48k నమోదు అయ్యాయి. డిసెంబర్ 2011 లో 43k డిసెంబర్ 2010 లో 108. అంటే ప్రస్తుతం నిముషానికి ఒక వీక్షణ మొబైల్ నుండి అన్నమాట. ఇది ముందు ముందు అతివేగంగా పెరిగే అవకాశముంది.


అత్యధిక మార్పులు చేసిన సభ్యులు[మార్చు]


తెవికీ వ్యాసాలు, ప్రాజెక్టులు[మార్చు]

ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు(అన్నా హజారే), సమకాలీన వార్తలకు సంబంధించిన వ్యాసాలు ( జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు ). సినిమా వ్యాసాలు ముఖ్యంగా చేర్చబడినవి లేక మార్చబడినవి. ప్రాజెక్టులలో పురోగతి లేదు. ప్రణాళిక ప్రకారం నడిచిన విద్య,ఉపాధి ప్రాజెక్టు అరుకొత్త వ్యాసాలు మాత్రమే సృష్టించగలిగింది.

తెవికీ ప్రచారం[మార్చు]

తెవికీ దశాబ్ది వుత్సవాలు హైద్రాబాదు మరియు బెంగుళూరులో జరిగాయి. దీని గురించి పత్రికలలో ప్రముఖంగా వార్తలొచ్చాయి. ఆ తరువాత సాంప్రదాయిక అకాడమీ , ఇ-అకాడమీ ఒకసారి జరిగింది. ఈ సారి కూడా హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే ఈ-తెలుగు స్టాలు నిర్వహించి కరపత్రాలు పంచి,తెలుగు వికీపీడియా ప్రచారం చేసింది. వికీమీడియా భారతదేశం తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టుకి నాయకత్వ బాధ్యతలు రహ్మనుద్దీన్ చేపట్టారు.

2012 లక్ష్యాలు[మార్చు]

 • వీక్షణలను 2010 పిభ్రవరి స్థాయి 4.5 మిలియన్లు నెలకి తీసుకువెళ్లడం, డిసెంబర్ 2011 లో 2.4 మిలియన్లు వున్నాయి.

వ్యూహాలు (వికీమీడియా దీర్ఘకాలిక వ్యూహలకు అనుగుణంగా)[మార్చు]

వ్యవస్థాపన స్థిరీకరణ[మార్చు]

 • తెవికీ మొబైల్ పేజీ స్థరీకరణ
 • తెలుగు టైపింగ్ పద్ధతుల స్థిరీకరణ (అన్ని వికీ ప్రాజెక్టులలో)
 • వికీ సాంకేతికాలు తెలిసిన వికీ సభ్యులని పెంపొందించటం
  • ఫిభ్రవరి లో పూనా లో జరిగే హాకథాన్ కి తెలుగు వికీ సభ్యుడు హాజరయ్యేలా చూడడం.

క్రియాశీలక సభ్యులను పెంచడం[మార్చు]

 • ఈ వారం సమిష్టి కృషి
  • ఈ వారం వ్యాసాలను ప్రదర్శనకు ముందు సమిష్టి కృషితో మెరుగు పరచడం
  • ఈ వారం వ్యాసాల ఎంపిక కేలండర్లోని లేక వార్తలకు అనుగుణంగా ఎంపిక చేయడం
 • వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం
  • మూడు నెలలు ప్రతి వారం నిర్వహించి, సమీక్ష చేసి తదుపరి సమావేశ అంతరాన్ని నిర్ణయించడం
  • క్రియాశీలక సభ్యులు ఎక్కువగా వుంటే 24x365 వెబ్ ఛాటింగ్ వాడటం ప్రారంభించడం
 • ఒక సమిష్టి ప్రాజెక్టుని సమర్థవంతంగా మూడు నెలలు నిర్వహించడం.
 • వికీపీడియన్ల కలయిక నెలవారీగా ప్రముఖ నగరాల్లో నిర్వహించండి.
  • ప్రదేశాల వారీగా వాడుకరుల జాబితా తయారు చేయడము
 • వికీ అకాడమీలు నెలకొకటి చొప్పున కళాశాలలో లేక ఇతర సంస్థలలో నిర్వహించడం
 • వికీ కళ్లతో నా ప్రదేశం నిర్వహించడం ( మూడు నెలలకొకసారి)
 • క్రియాశీలక సభ్యుల గుర్తింపు, గౌరవింపు
  • తెలుగు వాడుకరులందరకు అర్హతను (దిద్దుబాట్లు ప్రకారము) బట్టి, వీలయినంత మంది పతకాలు అందజేయటము.
  • వాడుకరులకు దిద్దుబాట్లు సంఖ్యను బట్టి పతకాలు అందుకోగలరు అని తెవికీ మొదటి పుటలో స్థిరముగా (చిరస్థాయిగా) ఉండే విధముగా నిర్ణయము తీసుకోవటము.

నాణ్యతను పెంచడం[మార్చు]

 • వికీపీడియా మొదటి పేజీ నాణ్యతను మెరుగుపర్చడం
 • నిర్వహణ మెరుగు
  • కొత్తగా నిర్వాహకులని ఎంపిక చెయ్యడం
  • అసంపూర్ణ వ్యాసములు, తదితరమయిన మొలకలు తగ్గించటము.

వికీ వీక్షణలు వృద్ధి చేయడం[మార్చు]

 • తెవికీ ప్రచారానికి జట్టుని తయారుచేయడం
 • ఫేస్బుక్ గ్రూపు, ఈమెయిల్ ఇతరత్రా వాటి ద్వారా మాధ్యమాలలో తెవికీ ప్రచారం పెంచడం
 • రాష్ట్ర స్థాయి వికీ సమావేశం నిర్వహణం

సృజనాత్మకతను పెంపొందించడం[మార్చు]

 • ఆఫ్లైన్ సిడి లేక ఇతరత్రా ప్రయోగాల చేపట్టడం

ఇదీ చూడండి[మార్చు]