హైదరాబాదు పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) ప్రతి సంవత్సరం హైదరాబాదు నగరంలో జరుగుతుంది.[1] దీనిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వహిస్తుంది.

2015 పుస్తక ప్రదర్శనలో ఒకదృశ్యము

హైదరాబాదు బుక్ ఫెయిర్ సొసైటీని ప్రముఖ ప్రచురణకర్తలు, దుకాణదారులు మరియు పంపిణీదారులు కలిసి 1985 సంవత్సరంలో ఏర్పాటుచేశారు.[2] మొదటి ప్రదర్శన అశోక్ నగర్ లోని సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగింది.[3] దీనికి ప్రజల భారీ స్పందనను దృష్టిలో ఉంచుకొని ప్రదర్శనను నిజాం కళాశాల ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ మెమోరియల్ గ్రౌండ్స్ లో జరుపుతూ వస్తున్నారు. ఈ ప్రదర్శన ముఖ్య ధ్యేయం ప్రజలలో పుస్తకాల పట్ల అవగాహన కలిగించడం. దీనిని 1987 లో రిజిస్టర్ చేశారు. (Regd. No. 230/1987 Under A.P. Public Societies Registration Act 1350 Fasli)

2015 పుస్తక ప్రదర్శనలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చెక్క బజన కళాకారుల ప్రదర్శన

2008[మార్చు]

తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేసిన క్రింది ప్రముఖులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వారు సన్మానించారు.

 1. పద్యం : బేతవోలు రామబ్రహ్మం
 2. సినిమా: రావి కొండలరావు
 3. ఉర్దూ సాహిత్యం: నస్రత్ మొహియుద్దీన్
 4. నవల: యద్దనపూడి సులోచనారాణి
 5. చరిత్ర పరిశోధన: వకుళాభరణం రామకృష్ణ
 6. తెలుగు భాష: సి. ధర్మారావు
 7. కవిత్వం: శివారెడ్డి
 8. అనువాదరచన: ఆర్.వెంకటేశ్వరరావు
 9. బాలసాహిత్యం: రెడ్డి రాఘవయ్య

2009[మార్చు]

2009 సంవత్సరంలో 24వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన పీపుల్స్ ప్లాజాలో డిసెంబరు 17 నుండి 27 తేదీల మధ్య జరిగింది.

2015[మార్చు]

2015 వ సంవత్సరములో హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఎన్.టి.ఆర్.స్టేడియంలో జరిగింది.

2018[మార్చు]

320పైగా పుస్తక దుకాణాతో డిసెంబర్‌ 15 నుంచి 25 వరకు 32వ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాదులోని తెలంగాణ కళాభారతి వేదికగా జరిగింది. 15వ తేది శనివారంనాడు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరిగిన పుస్తకమహోత్సవ ప్రారంభ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. [1]
 2. [2]
 3. సాక్షి, తెలంగాణ, హైదరాబాదు (13 December 2018). "వేడుకలా పుస్తక ప్రదర్శన". Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.
 4. సాక్షి, తెలంగాణ, హైదరాబాదు (16 December 2018). "పుస్తక పఠనంతోనే చైతన్యం". Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.