యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)
యన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి మైదానం) తెలంగాణ రాజధాని హైదరాబాదులోని లోయర్ ట్యాంకుబండ్ ప్రాంతంలో ఉన్న స్టేడియం. ఇది ఇందిరా పార్కుకు ప్రక్కన, 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రతిరోజు యువత పెద్దసంఖ్యలో ఇక్కడికి వచ్చి వివిధ ఆటలు ఆడుతారు, అలాగే ఉదయం సాయంకాలం వేళల్లో వాకర్స్ వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తుంటారు.
చరిత్ర
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఇక్కడే ఘనంగా నిర్వహించేవారు.[1] తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం దీనిని తెలంగాణ కళాభారతి మైదానంగా పేరు మార్చింది.[2]
కార్యక్రమాలు
[మార్చు]- ప్రతి ఏటా ఈ క్రీడా ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరుగుతోంది.[3][4]
- హైదరాబాదు మహానగరపాలక సంస్థ క్రికెట్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది
- ఈ విశాలమైన స్థలంలో ఆధ్యాత్మిక సభలు, ఇతర ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తుంటారు.
ఇతర వివరాలు
[మార్చు]ఈ ప్రాగణంలోని 11 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా తెలంగాణ కళాభారతి భవనాన్ని నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీనికి సంబంధించిన భవన డిజైన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశాడు.[5][6] కళాభారతి నిర్మాణ ప్రతిపాదనకు కొంతమంది నుండి వ్యతిరేకత వచ్చింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "NTR Stadium paves way for Telangana Kalabharathi". Deccan Chronicle. 2015-04-20. Retrieved 2 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "KCR Approves Design for Telangana Kalabharathi". The New Indian Express. Retrieved 2 May 2021.
- ↑ సాక్షి, తెలంగాణ, హైదరాబాదు (16 December 2018). "పుస్తక పఠనంతోనే చైతన్యం". Archived from the original on 17 December 2018. Retrieved 2 May 2021.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ India, The Hans (2019-12-23). "Governor Tamilisai Soundararajan to launch Hyderabad Book Fair today". www.thehansindia.com. Retrieved 2 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telangana State Portal Telangana Kalabharati Building". www.telangana.gov.in. Retrieved 2 May 2021.
- ↑ "KCR approves design for new Telangana Kalabharati to come up at NTR stadium". The News Minute. 2015-04-20. Archived from the original on 2021-05-02. Retrieved 2 May 2021.
- ↑ Nanisetti, Serish (2016-02-01). "NTR stadium set for a change". The Hindu. ISSN 0971-751X. Retrieved 2 May 2021.