31వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన
31వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 18 జనవరి 2018 నుంచి 28 జనవరి 2018 వరకు నిర్వహించారు.[1]
నిర్వహణ
[మార్చు]31వ జాతీయ పుస్తక ప్రదర్శన 18 జనవరి 2018 నుంచి 28 జనవరి 2018 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. 350 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభించగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. దళిత చైతన్యానికి ప్రతీకైనా భాగ్యరెడ్డి వర్మ పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రముఖ కవి రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [2]
పుస్తకావిష్కరణ
[మార్చు]31వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన సాహిత్య సమాలోచనలో భాగంగా వర్తమాన వచన కవిత్వం వేదికపై తొలితరం తెలంగాణ రచయిత బరారు శ్రీనివాస్ శర్మ రచించిన తొలి తెలంగాణ నవల ఆశాదోషం నవలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ పగడాల నాగేందర్, ఎం.నారాయణ శర్మ, మెర్సీ మార్గరెట్, కార్యక్రమం సమన్వయకర్త ,పుస్తక సంపాదకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ లు పాల్గొన్నారు. సినీనటుడు ప్రకాశ్ రాజ్ రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (18 January 2018). "జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ Sakshi (19 January 2018). "పుస్తకం..ప్రపంచాన్ని మార్చే ఆయుధం". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ Andhrabhoomi (25 December 2018). "ప్రకాశ్‌రాజ్ 'దోసిట చినుకులు' ఆవిష్కరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.