ఘంటా చక్రపాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రోఫ్. ఘంటా చక్రపాణి
Ghanta Chakrapani.jpg
జననం (1965-01-04) 1965 జనవరి 4 (వయసు 58)
జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్ , రాజకీయ విశ్లేషకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) మాజీ ఛైర్మన్‌ (2014 - 2020)
తల్లిదండ్రులుఘంటా మొగులయ్య [1]
వెబ్‌సైటుghantapatham.blogspot.in

ఘంటా చక్రపాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, అధ్యాపకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) మొదటి ఛైర్మన్‌గా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఘంటా చక్రపాణి కరీంనగర్ జిల్లాలో 1965లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, సోషియాలజీ), (మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం) , పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

ఘంటా చక్రపాణి 1985లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన జీవగడ్డ పత్రికలో చాలాకాలం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో కలిసి పనిచేశాడు.ఆయన 1990లో జర్నలిజం నుండి టీచింగ్ వైపు మర్లాడు. ఆయన కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా చేరాడు. ఆయన 1994లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫసర్ గా చేరి, 2009లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాడు. ఆయన బోధన రంగంలో విశిష్ట సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2014లో తెలంగాణ ప్రభుత్వ అవార్డు అందుకున్నాడు.[3] తెలంగాణ ఉద్యమకాలంలో టీవీ చర్చాగోష్ఠుల్లో పాల్గొనేవాడు. చక్రపాణి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయనను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ 17 డిసెంబర్ 2014న జీవో 169ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. [4]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (10 January 2020). "ఘంటా చక్రపాణికి పితృవియోగం". m.andhrajyothy.com. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  2. Sakshi (18 December 2014). "టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి". Sakshi. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  3. Telangana State Public Sercice Commission (23 May 2021). "Telangana State Public Sercice Commission". tspsc.gov.in. Archived from the original on 22 December 2020. Retrieved 23 May 2021.
  4. Jagranjosh (18 December 2014). "తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియామకం". Jagranjosh.com. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.