Jump to content

29వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి

29వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్‌ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 18 డిసెంబర్ 2015 నుంచి 27 డిసెంబర్‌ 2015 వరకు నిర్వహించారు.[1]

నిర్వహణ

[మార్చు]

29వ జాతీయ పుస్తక ప్రదర్శన 18 డిసెంబర్ 2015 నుంచి 27 డిసెంబర్‌ 2015 వరకు మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.00 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌, పేరు పెట్టారు. వేదికకు ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదికగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బుక్‌ఫెయిర్‌ నిర్వహణకు ఎన్టీఆర్‌ స్టేడియంను ఉచితంగా కేటాయించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Telugu Books (2015). "29th Hyderabad Book Fair". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
  2. Telangana (6 June 2016). "పుస్తక ప్రియుల జాతర". Retrieved 27 December 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)