Jump to content

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

← 2022
2024 →

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) హైదరాబాద్‌, దోమల్‌గూడ>లోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో[1] 2022 డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 1 వరకు జరిగింది.[2][3] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాదు బుక్ ఫెయిర్ ట్రస్టు నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపు 15 రాష్ట్రాల నుంచి 340 స్టాళ్లను ఏర్పాటు చేశారు.[4]

నిర్వహణ

[మార్చు]

35వ జాతీయ పుస్తక ప్రదర్శన 2022 డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 1 వరకు మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 01.00 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరిట, సాహిత్య వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరిట పేర్లు పెట్టారు.[5] ఈ పుస్తక ప్రదర్శనలో 340 స్టాళ్లును ఏర్పాటుచేశారు.[6] ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంది.[7]

ప్రారంభోత్సవం

[మార్చు]

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను పర్యాటక, సాంసృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌, హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్‌, నమస్తే తెలంగాణ సంపాదకుడు తిగుళ్ళ కృష్ణమూర్తి, నవతెలంగాణ సంపాదకుడు సుధా భాస్కర్, ప్రజాపక్షం సంపాదకుడు కె. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.[8]

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

సాంస్కృతిక కార్యక్రమాలు

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ ఫెయిర్ కు తెలంగాణ కళాభారతి స్టేడియాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, పలు కార్యక్రమాల నిర్వహణకు కూడా నిధులు కేటాయిస్తుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు.[9]

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పుస్తకావిష్కరణలు

[మార్చు]
నెనరు పుస్తక ఆవిష్కరణ
  • ‘తొడిమలేని మొగ్గ’ - 2022 డిసెంబరు 23
  • నేను ఇకడి భూమిని శిలా లోలిత - 2022 డిసెంబరు 23
  • కొండపల్లి నీహారిణి ‘కాల ప్రభంజనం’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ - 2022 డిసెంబరు 23[10]
  • మార్పు - 2022 డిసెంబరు 24
  • తెలంగాణ భాషానుశీలన - 2022 డిసెంబరు 24[11]
  • రాళ్లకుచ్చే - 2022 డిసెంబరు 25
  • వాయుసేన విజయసాధన - 2022 డిసెంబరు 25
  • కొంచెం నిప్పు కొంచెం నీరు - 2022 డిసెంబరు 25[12][13]
  • గ్రామర్ తో పనిలేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం ఏలా..? - 2022 డిసెంబరు 26
  • నెనరు (తెలంగాణ కథ 2021) - 2022 డిసెంబరు 26[14]
  • గజల్స్ సారాలు - 2022 డిసెంబరు 26
  • ప్రేమమృదంగం - 2022 డిసెంబరు 26
  • తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల సమగ్ర సమాచారం - 2022 డిసెంబరు 27
  • తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల,కళాశాలల విద్యార్థుల పుస్తకాలు - 2022 డిసెంబరు 27
  • అరుణతార అరిబండి, అఖిలభారత కిసాన్ సభ సంక్షిప్త చరిత్ర  - 2022 డిసెంబరు 28[15]
  • చెదిరిన స్వప్నం - 2022 డిసెంబరు 28
  • కలనేత  - 2022 డిసెంబరు 29
  • వెన్నెల కల జంబూద్వీపతత్వ కవిత్యం - 2022 డిసెంబరు 29
  • చిందునెల - 2022 డిసెంబరు 29
  • గంగెద్దు కథసంపుటి   - 2022 డిసెంబరు 29[16]
  • సహస్ర ఫణాహ - 2022 డిసెంబరు 30
  • విరిసిన వసంతం - 2022 డిసెంబరు 30
  • ఆద్యాంతాలు - 2022 డిసెంబరు 30
  • తెలంగాణ చరిత్ర తొవ్వల్లో - 2022 డిసెంబరు 31
  • 40 సెకండ్స్  - 2022 డిసెంబరు 31[17]

పుస్తక సమీక్షలు

[మార్చు]
  • ఒదిగిన కాలం[18]
  • అశుద్ధ భారత్‌[19]
  • ఒదిగిన కాలం[20]
  • ‘వల్లంకి తాళం’[21]

పలు స్టాళ్లు

[మార్చు]

ప్రముఖుల సందర్శన

[మార్చు]

డిసెంబరు 26న పుస్తక వేడుకకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరై పలు పుస్తకాల స్టాళ్ళను సందర్శించాడు.[24]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 December 2022). "ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబ‌ర్ 22 నుంచి బుక్ ఫెయిర్‌". Archived from the original on 2022-12-06. Retrieved 7 December 2022.
  2. Andhra Jyothy (18 November 2022). "పుస్తకాల పండగ వచ్చేస్తోంది". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  3. Namasthe Telangana (2 January 2023). "ముగిసిన బుక్‌ఫెయిర్‌". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  4. "తెలంగాణ పుడమిపై పుస్తక జాతర". www.ntnews.com. విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ (పర్యాటక భాషా సాంస్కృతిక మంత్రి). 20 December 2022. Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
  5. Sakshi (23 December 2022). "పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించాయి". Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  6. ETV Bharat News (20 December 2022). "పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో బుక్ ఫెయిర్". Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
  7. A. B. P. Desam (20 December 2022). "22 నుంచే హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ - స్థలం, టైమింగ్స్ వివరాలివీ". Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
  8. Namaste Telangana (23 December 2022). "పుస్తక పఠనం జ్ఞాన సాధనం". Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  9. Nava Telangana (20 December 2022). "22 నుంచి హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌..." Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
  10. Andhrajyothy (23 December 2022). "పుస్తకాలపండగొచ్చింది." Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  11. Namaste Telangana (24 December 2022). "అక్షరానికి నీరాజనం". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022. అక్షరానికి నీరాజనం
  12. Andhrajyothy (25 December 2022). "కొంచెం నిప్పు- కొంచెం నీరు పుస్తకావిష్కరణ చేసిన ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా..!". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  13. Disha (25 December 2022). "ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలి : ఎమ్మెల్సీ కవిత". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  14. Disha (26 December 2022). "పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువ : Bandaru Dattatreya". Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  15. Namasthe Telangana (29 December 2022). "పుస్తక ప్రపంచం". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
  16. Namasthe Telangana (30 December 2022). "పుస్తకాల పూదోట.. 8వ రోజు భారీగా తరలివచ్చిన సందర్శకులు". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
  17. Namasthe Telangana (1 January 2023). "తెలంగాణ చరిత్ర పరిరక్షణకు ప్రభుత్వం కృషి". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  18. Namaste Telangana (25 December 2022). "సాహితీ పూదోటలో ఆబాలగోపాలం". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  19. Andhrajyothy (24 December 2022). "పుస్తకానికి పట్టం". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  20. Andhrajyothy (24 December 2022). "పుస్తకం మురిసింది." Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  21. Andhrajyothy (25 December 2022). "చిన్న చిన్న పదాలతో అల్లిన అద్భుతం వల్లంకి తాళం రచన..!". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  22. Andhrajyothy (26 December 2022). "పుస్తక పఠనం నిర్మాణాత్మకంగా కొనసాగాలి." Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  23. Eenadu (25 December 2022). "అక్షరాన్ని హత్తుకుంటున్నారు". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
  24. telugu, NT News (2022-12-27). "కళాభారతి.. సాహితీవనం". www.ntnews.com. Archived from the original on 2022-12-27. Retrieved 2022-12-27.