Jump to content

కె. శ్రీనివాస్

వికీపీడియా నుండి
కె. శ్రీనివాస్
కె. శ్రీనివాస్
జననంకండ్లకుంట శ్రీనివాసాచార్యులు
జూలై 24, 1961
కండ్లకుంట, నల్లగొండ జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
విద్యఎం.ఏ., ఎం.ఫిల్, పి.హెచ్ డి.
వృత్తిఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు
ప్రసిద్ధిసీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు
తండ్రిఅళహ సింగరాచార్యులు
తల్లిరంగనాయకమ్మ

డా. కె. శ్రీనివాస్ సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు. 2008 నుండి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా ఉన్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

1961, జూలై 24వ తేదీన నల్గొండ జిల్లాలోని కండ్లకుంట గ్రామంలో శ్రీనివాస్ జన్మించాడు. అళహ సింగరాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకి శ్రీనివాస్ రెండవ సంతానం. ఈయన తండ్రి సంస్కృతాంధ్ర భాషా పండితుడు, ‘ఒక అధ్యాపకుని ఆత్మకథ’ అనే గ్రంథాన్ని రాసాడు.

శ్రీనివాస్ ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీలో బిఏ చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, 1989లో ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో చర్చలు, వాదోపవాదాలు’ అన్న అంశం మీద ఎం.ఫిల్‌ చేసాడు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం’ (తెలంగాణలో సాహిత్య పునర్వికాసం – 1919 – 1939) అనే అంశం మీద పి. హెచ్ డి చేసారు. జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ పొందాడు.[1]

పాత్రికేయరంగం

[మార్చు]

విద్యార్థి దశలో కళా సౌరభం వంటి చిన్న పత్రికలకి ప్రత్యేక సంచికలు రూపొందించిన శ్రీనివాస్, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికల్లో పనిచేసాడు. ఆంధ్రజ్యోతిలో 2002–2008 వరకూ సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేసి, 2008లో ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కె. శ్రీనివాస్ సంపాదకీయాలతో సంభాషణ పుస్తకం, ప్రజాత్రంత్రలో రాసిన కాలమ్స్‌తో కొత్తవంతెన పుస్తకం, ఆంధ్రజ్యోతిలో రాసిన కాలమ్స్‌తో అనేక సందర్భాలు పుస్తకం, తెలంగాణ ఉద్యమ కాలంలో రాసిన వ్యాసాలతో జూన్ 2 పుస్తకాలు కె. శ్రీనివాస్ పాత్రికేయ కృషిని తెలుపుతాయి.[2]

సాహిత్యరంగం

[మార్చు]

కవిత్వం, చిన్నకథలు, అనువాదాలు, పేరడీలతో పదవ ఏట నుంచే శ్రీనివాస్ తన రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు. సాహిత్య విమర్శ, కవిత్వం, ప్రత్యేక వచన రచన, అనువాద ప్రక్రియల్లో విశిష్టమైన కృషి చేసాడు. ‘తెలంగాణ సాహిత్య వికాసం (1900-1940 వరకు)’ ఈయన ప్రసిద్ధ విమర్శ గ్రంథం.[3] 1995–97 మధ్యకాలంలో ‘సంభాషణ’ కాలమ్ ద్వారా చేసిన రచనలు ఒక కొత్త వచన రచనా శైలిని సాహిత్యలోకానికి అందించాయి. తెలుగు భాష, అస్తిత్వ ఉద్యమాలు, స్థానికతా భావనలను తెలుగు సాహిత్య రంగానికి అన్వయించి మౌలికమైన విమర్శ చేసిన అతి కొద్దిమందిలో ఈయన ఒకరు. ఈయన రాసిన వందలాది సాహిత్య వ్యాసాలు అనేకమంది పరిశోధకులకి మార్గదర్శకంగా ఉన్నాయి.

పురస్కారాలు

[మార్చు]
  1. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం 2015 - 20 డిసెంబరు, 2O16.[4][5]
  2. సర్ సివై చింతామణి పురస్కారం – 2016
  3. చందూరు పురస్కారం – 2016
  4. త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం – 2017
  5. అరుణ్ సాగర్ విశిష్ట పాత్రికేయ అవార్డు – 2019 (2 జనవరి, 2020)[6]
  6. తాపీ ధర్మారావు స్మారక పురస్కారం
  7. సృజన పాత్రికేయ పురస్కారం -2020

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సారంగ, ముఖాముఖి (15 July 2018). "బహుళ అస్తిత్వాలే మేలు: కె. శ్రీనివాస్ – సారంగ". magazine.saarangabooks.com. గుర్రం సీతారాములు. Retrieved 24 July 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 January 2015). "కె. శ్రీనివాస్‌ పుస్తకాల పరిచయ సభ - పాలమూరు అధ్యయన వేదిక". www.andhrajyothy.com. Archived from the original on 24 July 2020. Retrieved 24 July 2020.
  3. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "చరిత్రకు ప్రామాణికం 'తెలంగాణ సాహిత్య వికాసం'". lit.andhrajyothy.com. Archived from the original on 26 January 2018. Retrieved 24 July 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 24 July 2020.
  5. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 24 July 2020.
  6. నవ తెలంగాణ, స్టోరి (3 January 2020). "అరుణ్‌సాగర్‌ ఆలోచనలు చిరస్థాయిగా నిలిచేలా." NavaTelangana. Archived from the original on 24 July 2020. Retrieved 24 July 2020.

ఇతర లంకెలు

[మార్చు]