నెనరు (తెలంగాణ కథ 2021)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెనరు (తెలంగాణ కథ 2021)
నెనరు (తెలంగాణ కథ 2021) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2022 డిసెంబరు 26
పేజీలు: 148


నెనరు (తెలంగాణ కథ 2021) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం.[1] తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన తొమ్మదవ పుస్తకం ఇది. 13 కథలున్న ఈ పుస్తకంలోని కథలు 2021 నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అనేక కోణాల్లో, ఎంతో సమర్థవంతంగా చిత్రించాయి. ప్రస్తుతం అంబేడ్కరిజం విస్తృతంగా ప్రచారమవుతుండడంతో ఈ అన్ని విషయాలు చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నాయి. ప్రజలకు అర్థంగాకున్నా దార్శనికులైన రచయితలకు అర్థమయింది. అందుకే ఈ సంకలనంలో చదువు, అంబేడ్కరిజం, వృత్తి జీవితాల గురించి ఎక్కువగా కథలున్నాయి. ఈ సంకలనంలోని కథలు మారుతున్న తెలంగాణ ముఖచిత్రాన్ని అద్దం పట్టాయి.[2]

సంపాదకులు[మార్చు]

కథల నేపథ్యం[మార్చు]

'కుక్క సద్ధి' (కాలువ మల్లయ్య), 'అర్బన్ అన్‌టచబిలిటీ' (గాదె వెంకటేశ్) కథలు విద్యద్వారానే తెలంగాణ సమాజంలో మెరుగైన, మేలైన మార్పులు వస్తాయని, విద్యద్వారానే కుల వివక్షను అధిగమించవచ్చని చేప్తూ అంబేడ్కరిజం, స్వేరోఇజాన్ని ఈ కథలు చిత్రికపట్టాయి. 'గోధుమరంగు పాము' (చిత్తలూరి సత్యనారాయణ) కథ సమకాలీనంలో జరుగుతున్న ఈ విష సంస్కృతిని, తెలంగాణలో కూడా నయారిచ్ మూలంగా డ్రగ్స్ పెరుగుతున్న తీరుని, దాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకతను చిత్రించింది. నీటి పారుదలరంగంలో తెలంగాణ ప్రభుత్వం మెరుగైన ప్రగతి సాధించిందని తాయమ్మ కరుణ లాంటి కథకులు గుర్తించారు. ‘తక్కెడ’ (చందు తులసి) కథ ఒంటరి స్త్రీలను వేధించే దుర్మార్గులకు బుద్ధిచెప్పడమే గాదు, దైన్యతను కూడా ధైర్యంగా ఎదుర్కొనే సాహస మహిళ గురించి రాయబడింది.

'మోకుదెబ్బ' (జాలిగామ భానుప్రసాద్) కథ దొరల దౌర్జన్యానికి బలయిన గౌడ్‌ల జీవితాలను, 'అంగడి' (డా. వెల్దండి శ్రీధర్) కథ ఆధునిక అభివృద్ధి మాయాజాలంలో ఆగమైతున్న బతుకుల గురించి, 'ఏం జరిగింది?' (తాయమ్మ కరుణ) కథ నేతన్నల మగ్గం బతుకులను, ‘దూరం’ (పెద్దింటి అశోక్ కుమార్) కథ ఆగమైతున్న బహుజన జీవితాలతోపాటు మతఉన్మాదం పెరగడం గురించి, ‘కేటి’ (మన్‌ప్రీతం) కథ ఆధునికత వైపు పయనిస్తూ ఐటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌ గురించి, 'ఆమె పేరు హంపి' (కిరణ్ చర్ల) కథ అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్న రూరల్ లైఫ్‌ గురించి రాయబడ్డాయి.[2]

ఆవిష్కరణ[మార్చు]

నెనరు పుస్తక ఆవిష్కరణ

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా 2022, డిసెంబరు 26న ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. డా. సంగిశెట్టి శ్రీనివాస్‌ సభాధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి పుస్తకావిష్కరణ చేశాడు.[3] ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌, గౌరవ అతిథిగా కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డా. గడ్డం మోహన్‌ రావు, ఆత్మీయ అతిథులుగా కవులు డా. యాకూబ్‌, సమ్మెట ఉమాదేవి పాల్గొన్నారు.[4]

విషయసూచిక[మార్చు]

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 కొత్త దొరలు తమ్మెర రాధిక
2 అంగడి డా. వెల్దండి శ్రీధర్
3 కుక్క సద్ధి కాలువ మల్లయ్య
4 ఏం జరిగింది? తాయమ్మ కరుణ
5 ఆమె పేరు హంపి కిరణ్ చర్ల
6 అఫ్సర్
7 తక్కెడ చందు తులసి
8 గోధుమరంగు పాము చిత్తలూరి సత్యనారాయణ
9 చెల్లని మొహం కొట్టం రామకృష్ణారెడ్డి
10 కే.టీ. మన్ ప్రీతం
11 దూరం పెద్దింటి అశోక్ కుమార్
12 మోకుదెబ్బ జాలిగామ భానుప్రసాద్
13 అర్బన్ అన్‌టచబిలిటీ డా. గాదె వెంకటేశ్

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-12-27). "కళాభారతి.. సాహితీవనం". www.ntnews.com. Archived from the original on 2022-12-27. Retrieved 2022-12-27.
  2. 2.0 2.1 "మారుతున్న తెలంగాణ ముఖచిత్రం 'నెనరు'". Mana Telangana (in ఇంగ్లీష్). 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.
  3. Disha (26 December 2022). "పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువ : Bandaru Dattatreya". Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  4. "నేడు 'నెనరు' ఆవిష్కరణ | దర్వాజ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.