తుమ్మేటి రఘోత్తమరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుమ్మేటి రఘోత్తమరెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన కథా రచయిత.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

తుమ్మేటి రఘోత్తమరెడ్డి 1959లో వరంగల్ జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసాడు. కథరచనలో ప్రవేశించి సాహిత్య ప్రపంచంలో చర్చలకవకాశం యిచ్చిన మంచి కథలను రాసాడు.

అతని కథలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉత్తర తెలంగాణా ఉద్యమచిత్రం నేపధ్యంగా సాగినవి. ఇది ప్రజాపోరాటాలు తెచ్చిన పరిస్థితులకు ప్రతిస్పందనలనదగిన కథలు. రెండవ రకమైనవి వర్తమాన సామాజిక పరిణామ క్రమంలో విచ్ఛిన్నమవుతున్న మానవీయ విలువలు, మానవ సంబంధాల చిత్రణ. ఈ రెండు తరహా కథల్లోనూ గోచరించే ఒక ప్రత్యేక గుణం - కథా వస్తువుకు సంబంధించిన రచయిత చైతన్యం. [3]

రచనలు[మార్చు]

  1. జీవించు - నేర్చుకో - అందించు (రెండు సంపుటాలు)
  2. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు[4]
  3. ఒక కథకుడు - నూరుగురు విమర్శకులు
  4. పర్వతాలు చెప్పిన ఆధునిక జానపదకథలు
  5. సాహితీ సౌరభం

మూలాలు[మార్చు]

  1. ""శ్రీ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి"". www.maganti.org. Archived from the original on 19 April 2018. Retrieved 30 March 2018.
  2. "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
  3. "Sujanaranjani Monthly Telugu E-Magazine". www.siliconandhra.org. Retrieved 2020-07-11.[permanent dead link]
  4. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు(Tummeti Raghottama Reddy Kathalu) By Tummeti Raghottama Reddy - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.[permanent dead link]