36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన
స్థలంతెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం), దోమల్‌గూడ, హైదరాబాద్‌
ప్రదేశంహైదరాబాద్‌
దేశంభారతదేశం
క్రియాశీల సంవత్సరాలు38
ప్రారంభించినది1985
ఇటీవలి2022
నిర్వహణహైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ
36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన
← 2022
2025 →

36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) హైదరాబాదు, దోమల్‌గూడలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో 2024 ఫిబ్రవరి 9 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు జరిగింది.[1][2]

నిర్వహణ[మార్చు]

36వ జాతీయ పుస్తక ప్రదర్శన 2024 ఫిబ్రవరి 9 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 01.00 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి గద్దర్ పేరిట, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్‌ మాజీ యండీ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ పేరిట, సాహిత్య వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రవ్వా శ్రీహరి పేరిట పేర్లు పెట్టారు.[3] ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంది.[4] ఈ పుస్తక ప్రదర్శనలో 365 స్టాళ్లును ఏర్పాటు చేసామని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ప్రకటించాడు.[5]

ప్రారంభోత్సవం[మార్చు]

36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తకాల ప్రదర్శనను పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్‌, నవతెలంగాణ సంపాదకుడు సుధా భాస్కర్, ప్రజాపక్షం సంపాదకుడు కె. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.[6][7]

సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ ఫెయిర్ కు తెలంగాణ కళాభారతి స్టేడియాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, పలు కార్యక్రమాల నిర్వహణకు కూడా నిధులు కేటాయిస్తుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు.

చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న చిన్నారులు

పుస్తకావిష్కరణలు[మార్చు]

  • ‘పాలపిట్ట ప్రత్యేక సంచిక ఆవిష్కరణ - ఫిబ్రవరి 10[8]
  • ‘పంజరం’ పుస్తకావిష్కరణ - ఫిబ్రవరి 11[9]
  • హార్మ్‌లెస్‌ క్రిమినల్స్‌ పుస్తకావిష్కరణ - ఫిబ్రవరి 11[9]
  • కథల పుస్తకం ‘ద స్టోరీస్‌ ఆఫ్‌ యాపల్‌ గుడా చిల్డ్రన్‌’ పుస్తకావిష్కరణ - ఫిబ్రవరి 11[9]
  • హరివిల్లు కవితా సంపుటి - ఫిబ్రవరి 13 [10]
  • తదేక - ఫిబ్రవరి 13 [10]
  • విద్యకు విముక్తి - ఫిబ్రవరి 14[11]
  • హమీద్‌ దల్వాయ్‌ - ఫిబ్రవరి 14[11]
  • పిలుపు పుస్తక - ఫిబ్రవరి 14[11]
  • శాస్త్రీయమైన స్వార్థ్యకారక దివ్యసంకల్పాలు - ఫిబ్రవరి 14[11]
  • హృదయ రాగం - ఫిబ్రవరి 14[11]
  • కొత్త తెలంగాణ శాసనాలు - ఫిబ్రవరి 15[12]
  • ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు - ఫిబ్రవరి 15[12]
  • డాక్టర్‌ కత్తి పద్మారావు రచించిన ‘ఈ దేశం మాది’ కవితా సంపుటి - ఫిబ్రవరి 15[12]
  • డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి ''వినిర్మాణం' &  'తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వా పరిణామం'  పుస్తకాలు ఆవిష్కరణ  - ఫిబ్రవరి 15[13]
  • గాదె వెంకట్ కవిత్వ ఆవిష్కరణ - ఫిబ్రవరి 15[13]
  • 13 (స్వర్ణ కిలారి, దిలీప్ కొణతం రాసిన 'థాయ్‌లాండ్ బాలల ఫుట్ బాల్ టీ రెస్క్యూ ఆపరేషన్ కథ') ఫిబ్రవరి 15

గద్దర్‌ సంస్మరణ సభ[మార్చు]

''పాటతో ఓ సాయంకాలం'' పేరుతో గద్దర్‌ సంస్మరణ సభ జరిగింది.  డా. పసునూరి రవీందర్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో గద్దర్‌ పోరాట జీవితంపై ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ అల్లం నారాయణ, రచయిత సుద్దాల అశోక్‌ తేజ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జయరాజు, విమలక్క, ఏపూరి సోమన్న, ప్రొఫెసర్‌ కాశీం, మానుకోట ప్రసాద్, హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్‌, మిట్టపల్లి సురేందర్ ప్రసంగించారు.[8]

సెమినార్‌[మార్చు]

పలు స్టాళ్లు[మార్చు]

ప్రముఖుల సందర్శన[మార్చు]

ముగింపు వేడుకలు[మార్చు]

36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తకాల ప్రదర్శన 2024 ఫిబ్రవరి 19న ముగిసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన వహించగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, ప్రొఫెసర్‌ రమామెల్కోటే, ఓయూ వీసీ డి. డి.రవీందర్ యాదవ్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి ఆర్‌, వాసు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కోయ చంద్రమోహన్‌, కోశాధికారి పి. రాజేశ్వర్‌ రావు, బుక్‌ ఫెయిర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శృతికాంత్‌ భారతి, శోభన్‌ బాబు, జనార్దన్‌గుప్తా, సూరిబాబు, బాల్‌ రెడ్డి, కవి యాకూబ్‌, మెర్సీ మార్గరెట్, ట్రాన్సజెండెర్ కార్యకర్త రచన ముద్రబోయిన తదితరులు పాల్గొన్నారు.[17]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (8 January 2024). "ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. R Tv (8 January 2024). "ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
  3. Hindustantimes Telugu (5 February 2024). "ఈ నెల 9 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
  4. Namaste Telangana (4 February 2024). "9 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
  5. Namaste Telangana (9 February 2024). "నేటి నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఎన్టీఆర్‌ స్టేడియంలో 365 స్టాల్స్‌". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  6. Eenadu (10 February 2024). "ఘనంగా 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం". Archived from the original on 10 February 2024. Retrieved 20 February 2024.
  7. Namasthe Telangana (10 February 2024). "హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  8. 8.0 8.1 Namasthe Telangana (11 February 2024). "పాటతో ఓ సాయంకాలం". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  9. 9.0 9.1 9.2 Namasthe Telangana (12 February 2024). "బుక్‌ ఫెయిర్‌ ఎంతో హుషార్‌.. పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే విజయానికి బాటలు వేసుకున్నట్టే". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  10. 10.0 10.1 Namasthe Telangana (14 February 2024). "పుస్తకాలు.. విజ్ఞాన మంత్రాలు". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 Namasthe Telangana (15 February 2024). "మరో నాలుగు రోజులే..బుక్‌ఫెయిర్‌". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  12. 12.0 12.1 12.2 12.3 Namasthe Telangana (16 February 2024). "శాసనాలే చరిత్రకు శ్వాస". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  13. 13.0 13.1 Namasthe Telangana (19 February 2024). "నేటితో ముగియనున్న బుక్‌ ఫెయిర్‌". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  14. Namasthe Telangana (17 February 2024). "ఎల్లుండితో బుక్‌ ఫెయిర్‌ ఆఖరు". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  15. The Hindu (9 February 2024). "Reading key to understanding human life: Telangana Minister" (in Indian English). Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  16. [1]
  17. Eenadu (20 February 2024). "సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలే". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.

వెలుపలి లంకెలు[మార్చు]