మిట్టపల్లి సురేందర్
మిట్టపల్లి సురేందర్ | |
---|---|
![]() | |
జననం | జనవరి 9,1985 వెలంపల్లి గ్రామం, చిట్యాల మండలం,టేకుమట్ల వరంగల్ జిల్లా |
వృత్తి | కవి, గీతరచయిత, గాయకుడు |
మతం | హిందూ |
భాగస్వాములు | సుజిత |
తండ్రి | నర్సయ్య, |
తల్లి | మధునమ్మ |
మిట్టపల్లి సురేందర్, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గీతరచయిత.తెలంగాణ ఉద్యమానికి పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి సురేందర్. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని తన పాటల ద్వారా బోధించినోడు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాల మీద అతను రాసిన "రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట" బహుళ ప్రజాదారణ పొందింది. దర్శకులు ఆర్.నారాయణమూర్తి ఆ పాటను తన పోరు తెలంగాణ (2011) చిత్రంకోసం వాడుకున్నారు. అదే పాటకుగానూ 2011లో సురేందర్ నంది అవార్డును అందుకున్నాడు. సురేందర్ ఇప్పటివరకు దాదాపు 300ల పాటలు రాశారు.అందులో 20 పాటలు తొమ్మిది సినిమాలకు రాసిినవి ఉన్నాయి..
జీవిత విశేషాలు[మార్చు]
మధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం, వెల్లంపల్లి గ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. అతను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటాడు సురేందర్. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్ఫూర్తిని అంటాడు. సురేందర్ సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటా ఆదరణ పొందాయి. సురేందర్ ప్రైవేట్ సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా పాటలు రాసాడు. నాన్స్టాప్, ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి చిత్రాల్లో సినీగీతాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నాడు[1].
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-14. Retrieved 2017-07-11.