తుపాకి రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుపాకి రాముడు
తుపాకి రాముడు సినిమా పోస్టర్
దర్శకత్వంటి. ప్రభాకర్
రచనకవి సిద్ధార్థ - రవి ఆదేశ్ (మాటలు)
స్క్రీన్ ప్లేటి. ప్రభాకర్
కథటి. ప్రభాకర్
రసమయి బాలకిషన్ (మూలకథ)
నిర్మాతరసమయి బాలకిషన్
తారాగణంబిత్తిరి సత్తి, ప్రియ
ఛాయాగ్రహణంటి. సురేంద్ర రెడ్డి
కూర్పుపి. జానకి రామారావు
సంగీతంటి. ప్రభాకర్
నిర్మాణ
సంస్థ
రసమయి ఫిల్మ్స్
విడుదల తేదీ
25 అక్టోబరు 2019
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తుపాకి రాముడు 2019, అక్టోబరు 25న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ నిర్మాణ సారథ్యంలో టి. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిత్తిరి సత్తి, ప్రియ జంటగా నటించారు.

కథ[మార్చు]

అనాథైన రాముడు (బిత్తిరి సత్తి) మంచి మనసున్న మనిషిగా ఎదుటివారి కష్టాల్ని తనవిగా భావించి అండగా నిలుస్తుంటాడు. బతుకుతెరువు కోసం తుపాకిరాముడిగా అవతారమెత్తి కోతలు కోస్తూ అందరికి ఆనందాన్ని అందిస్తున్న రాముడు, ఈ సాంకేతిక యుగంలో సామాజిక మాధ్యమాల వల్ల బతకడం కష్టమై జీవనోపాధికోసం వేరే వృత్తికోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తనకు చదువు, ఆస్తులు లేకపోవడంతో పెళ్లిచేసుకోవడానికి అమ్మాయిలెవరూ అంగీకరించపోవడంతో రాముడు చదువుకోవాలని అనుకుంటాడు. ఊరిలో ఉన్న అనిత (ప్రియ) రాముడికి చదువు నేర్పిస్తుంది. అనిత తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ముచ్చచపడిన రాముడు అనితను ప్రేమిస్తుంటాడు. ఆమె అవిటితనంతో బాధపడుతుందనే నిజం తెలుసుకున్న రాముడు ఏంచేశాడన్నది మిగిలిన కథ.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి దర్శకుడు టి. ప్రభాకర్ సంగీతం అందించాడు.

  1. నా సిన్ని రామయ్య - 03:54 (గానం: గాయత్రి; రచన: అభినయ శ్రీనివాస్)
  2. స్వాతి ముత్యపు జల్లు - 03:08 (గానం: హరిణి ఇవటూరి; రచన: అభినయ శ్రీనివాస్)
  3. బతుకమ్మ - 04:03 (గానం: కౌసల్య; రచన: మిట్టపల్లి సురేందర్ )
  4. ఎల్లమ్మ ఎల్లమ్మ - 04:18 (గానం: రసమయి బాలకిషన్, వరం; రచన:అభినయ శ్రీనివాస్)
  5. డమ్ డమ్ బోల్ బాజే - 04:13 (గానం: రాహుల్ సిప్లిగంజ్; రచన:అభినయ శ్రీనివాస్)
  6. ఓ పిల్లా ముట్టుకుంటే - 04:03 (గానం: గీతా మాధురి, బిత్తిరి సత్తి; రచన: అభినయ శ్రీనివాస్) (సినిమాలో లేదు)

విడుదల - స్పందన[మార్చు]

2019, అక్టోబరు 25న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.[3]

ప్రీ రిలీజ్‌[మార్చు]

2019, అక్టోబరు 20న హైదరాబాదులోని జె.ఆర్.సి. కన్వెన్షన్ హాల్ లో తుపాకి రాముడు ప్రీ రిలీజ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ బిగ్‌ సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఎన్.శంకర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్, నటులు రాజ్ తరుణ్, ప్రియదర్శి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (25 October 2019). "రివ్యూ: తుపాకి రాముడు". www.ntnews.com. Archived from the original on 25 అక్టోబరు 2019. Retrieved 31 October 2019.
  2. Namasthe Telangana (15 September 2023). "ఓట్‌ ఫర్‌.. పటాస్‌ రతిక!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  3. myfirstshow, Review (25 October 2019). "Tupaki Ramudu Movie Review". www.myfirstshow.com. Archived from the original on 31 అక్టోబరు 2019. Retrieved 31 October 2019.
  4. సాక్షి, సినిమా (23 October 2019). "తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి". Sakshi. Archived from the original on 24 అక్టోబరు 2019. Retrieved 31 October 2019.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తుపాకి రాముడు