కర్నె ప్రభాకర్
కర్నె ప్రభాకర్ | |||
| |||
ఎమ్మెల్సీ - ఆగస్టు 2014 నుండి ఆగష్టు 2020
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 20 జులై 1969 సంస్థాన్ నారాయణపూర్, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
నివాసం | సాయి నగర్ కాలనీ, అల్కాపురి, నాగోల్, హైదరాబాద్. | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
కర్నె ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యుడు.[1] ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కర్నె ప్రభాకర్ 1969, జూలై 20న నల్గొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ గ్రామంలో జంగప్ప, శివలీల దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు సంస్థాన్ నారాయణపూర్ లో పూర్తిచేసి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హైదరాబాదులో, రెండవ సంవత్సరం భువనగిరిలో చదివాడు. కర్నె ప్రభాకర్ 1991లో ఎస్.ఎల్.ఎన్.ఎస్ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో బిఎ పూర్తి చేశాడు. ఆయన తరువాత జర్నలిజంలో డిప్లొమా, హైదరాబాద్ వివేకా వర్దిని కాలేజ్ నుండి బి.యి.డి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కర్నె ప్రభాకర్ విద్యార్థి దశలో తెలంగాణ విద్యార్థి సంఘంలో పనిచేశాడు. 1996లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ తెలంగాణ మహాసభలో చేరాడు. ఆయన కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేసి, వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాడు. కర్నె ప్రభాకర్ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి, టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కర్నె ప్రభాకర్ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. ఆయన 2019, సెప్టెంబరు 24న తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[2]
చిత్రమాలిక
[మార్చు]-
2018 ఉగాది వేడుకల్లో పాల్గొన్న కర్నె ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 August 2020). "'గవర్నర్ కోటా' కసరత్తు షురూ!". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ The Hans India (24 September 2019). "Karne takes charge as government whip". www.thehansindia.com. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.