ప్రసేన్ బెల్లంకొండ
Jump to navigation
Jump to search
ప్రసేన్ బెల్లంకొండ | |
---|---|
జననం | ప్రసేన్ బెల్లంకొండ 1960, ఏప్రిల్ 23 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, పాత్రికేయుడు, సినీ విశ్లేషకుడు |
జీవిత భాగస్వామి | ఇంద్రాణి |
పిల్లలు | ఇద్దరు కుమారులు (శశాంక, యోగి) |
ప్రసేన్ కవి, విమర్శకుడు, పాత్రికేయుడు, సినీ విశ్లేషకుడు.[1] ఆయన అనేక పత్రికలలో సాహిత్య, రాజకీయ, సినీ విశ్లేషణా వ్యాసాలు[2] వందల సంఖ్యలో రాసాడు. ఉదయం, ఆంధ్రభూమి దినపత్రికలలో సాహిత్య పేజీలను విజయవంతంగా నిర్వహించాడు. వందకు పైగా కవితా, కథా సంకలనాలకు ముందుమాటలు రాసాడు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు.[3]
జననం
[మార్చు]ప్రసేన్ 1960 ఏప్రిల్ 23న ఖమ్మంలో జన్మించాడు.
వివాహం
[మార్చు]ప్రసేన్ కు ఇంద్రాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు శశాంక, యోగి.
పాత్రికేయరంగం
[మార్చు]34 సంవత్సరాలు జర్నలిస్టుగా ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త టీవీ5 లలో బాధ్యతలు నిర్వహించాడు.
- 1986-89 ఉదయం హైదరాబాద్
- 1989-95 ఆంధ్రభూమి విజయవాడ
- 1995-2000 ఆంధ్రభూమి ఖమ్మం
- 2001-2002 ఆంధ్రజ్యోతి విజయవాడ
- 2002-2004 ఆంధ్రజ్యోతి వరంగల్
- 2004-2007 వార్త ఖమ్మం
- 2007-2021 టీవీ5, ఖమ్మం
- పి5 న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ
ప్రచురణలు
[మార్చు]- 1983: రక్తస్పర్శ (కవితా సంకలనం)
- 1995: ఇంకావుంది (కవిత్వ సంపుటి)
- 2001: ఏదీకాదు (కవిత్వ సంపుటి)
- 1991: క్రితం తర్వాత (దీర్ఘకవిత)
- 1991: గద్దరు రాజ్యము మనము (దీర్ఘ కవిత)
- 2006: ప్రసేన్ సర్వస్వం (సమగ్ర రచనల సంపుటి)
- 2009: ప్రసేన్ సర్వస్వం (పునర్ముద్రణ)
- 2018: క్షమ కావ్యం (పోయెట్రీ ఆల్బమ్)
- 2021: ఎవరికి వర్తిస్తే వారికి (కవిత్వ సంపుటి)
- 2021: సిక్స్టిపూర్తి (వ్యాస సంపుటి)
- 2021: టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ (కవిత్వ ఆంగ్లానువాదం)
- 2023: ప్రసేన్ ఎట్ సినిమా (సమీక్షా సంపుటి)
- 2024: సాహిత్య విమర్శా వ్యాసాల సంపుటి ఇన్ ప్రెస్
పురస్కారాలు
[మార్చు]- 2015: తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ సాహితీవేత్త అవార్డు (ఖమ్మం జిల్లా)
- 2010: సాహితీ మాణిక్యం అవార్డు
- 2016: తానా పురస్కారం[4]
- 2016: అరుణ్ సాగర్ అవార్డు
- 2020: నెల నెలా వెన్నెల అవార్డు
- 2023: కవిసంధ్య పురస్కారం
- 2023: రొట్టమాకు రేవు పురస్కారం
- 2024: అక్షరం పురస్కారం
- 'ఆరోతనం' కథకు ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ ABN (2020-03-21). "సమాజ దివిటీ.. కవిత్వం". Andhrajyothy Telugu News. Archived from the original on 2024-02-13. Retrieved 2024-02-13.
- ↑ prasen (2023-01-01). prasen@cinema (in Telugu). creative links publications.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Mana Telangana (30 May 2021). "అందరికీ వర్తించే కవి ప్రసేన్". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ India, The Hans (29 December 2016). "Khammam poet bags TANA award". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-12-30. Retrieved 26 February 2024.