ప్రజా పక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజా పక్షం
రకముదినపత్రిక
ఫార్మాటుఅచ్చు పత్రిక

యాజమాన్యం:అంవ చేతన విజ్ఞాన సమితి
సంపాదకులు:కే.శ్రీనివాస్ రెడ్డి
స్థాపన2018
రాజకీయ పక్షమువామపక్షాలు
భాషతెలుగు
ప్రధాన కేంద్రముహైదరాబాదు

వెబ్‌సైటు: "Official website". Archived from the original on 2021-09-23. Retrieved 2021-10-03.

ప్రజా పక్షం భారతదేశంలో తెలంగాణ లో ప్రచురితవవుతున్న ఒక తెలుగు దినపత్రిక. [1] [2] ఈ పత్రికను భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అధికారికంగా నడుపుతుంది. దీని సంపాదకుడు కె.శ్రీనివాస్ రెడ్డి.[3] ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐకి 'విశాలాంధ్ర' దినపత్రిక ఉండేది. సీపీఎంకు 'ప్రజాశక్తి' ఉండేది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సి.పి.ఐ విశాలాంధ్ర పత్రికను ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసి తెలంగాణలో "నవ తెలంగాణ" పత్రికను, సి.పి.ఎం విశాలాంధ్ర పత్రికను ఆంధ్ర ప్రదేశ్ కు పరిమితం చేసి తెలంగాణలో "మన తెలంగాణ" పత్రికలను ప్రారంభించాయి. ప్రజాదరణ లేక నష్టాలు రావడంతో "మన తెలంగాణ" పత్రిక చేతులు మారింది. తరువాత సి.పి.యం "ప్రజా పక్షం" పత్రికను ప్రారంభించింది.

'ప్రజాపక్షం' పత్రిక తన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ పత్రికలోనే ఎడిటోరియల్‌ కూడా రాసింది. తాము అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పత్రికను నడుపుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని సి.పి.యం పార్టీ తెలియజేసింది. [4]

మూలాలు[మార్చు]

 

  1. "New Telugu daily 'Praja Paksham' launched". catchnews.com.
  2. "New Telugu daily launched". Business Standard.
  3. "New Telugu daily launched". The Hindu.
  4. November 25; Ist, 2019 | Updated 21:56. "నిధుల కొరత...ఓ పత్రిక ప్రయోగం...!". telugu.greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)