రెడ్డి రాఘవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలసాహిత్య రచనకే జీవితాన్ని అంకితం చేసిన రచయితల్లో రెడ్డి రాఘవయ్య ఒకరు. వీరు 1940లో గుంటూరు జిల్లా, తెనాలి తాలుకా, ప్యాపర్రు గ్రామంలో జన్మించారు. నిడుబ్రోలు బోర్డు హైస్కూలులో ఎస్‌.ఎస్‌.యల్‌.సి. వరకు చదివారు. ప్రభుత్వ 'పారిశ్రామిక శిక్షణ సంస్థ'లో శిక్షణానంతరం - బెంగుళూరులోని హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్సులో 'మెకానిక్‌'గా చేరి.... అదే సంస్థ హైదరాబాదు శాఖలో 'ఇంజనీరు'గా రిటైరై ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు.

తొలికథ 'సలహా' (పిల్లల కథ) విశాలాంధ్ర దినపత్రిక లోని 'చిన్నారిలోకం'లో 1955 డిసెంబరులో ప్రచురించబడింది. నాటినుండి బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్‌కథలు... బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో వ్రాసిన 32 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మణిదీపాలు అనే పుస్తకం ఆంగ్లంలోకి అనువదింపబడింది.

రచనలు[మార్చు]

 1. గాలిలో ప్రయాణం
 2. చిరుదివ్వెలు
 3. చాచా నెహ్రూ
 4. జ్ఞానులు - విజ్ఞానులు
 5. విజ్ఞానతరంగాలు
 6. విజ్ఞానవిజయాలు
 7. విజ్ఞానోదయం
 8. ఎందుకు?
 9. దివ్యమాత థెరిసా
 10. బాలలబొమ్మల ఇందిరాగాంధీ
 11. వేలంత వీరుడు
 12. మణిదీపాలు
 13. పూలపొట్లాలు[1]
 14. నేతాజీ సుభాష్ చంద్రబోస్
 15. చంద్రశిలానగరం
 16. పిల్లల బొమ్మల తెనాలి రామకృష్ణ సంపూర్ణ హాస్యకథలు
 17. పిల్లల బొమ్మల భారతం
 18. యూరీ అలెక్స్‌యేవిచ్‌ గగారిన్‌
 19. స్వామి వివేకానంద
 20. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్
 21. మంచిపూలు
 22. లాల్ బహదూర్ శాస్త్రి
 23. భారతరత్న రాజేంద్రప్రసాద్
 24. బాలసాహిత్య నిర్మాతలు
 25. పిల్లల బొమ్మల ప్రపంచ అద్భుతకథలు
 26. పిల్లల బొమ్మల అక్బర్-బీర్బల్ కథలు
 27. పిల్లల బొమ్మల పరమానందయ్య శిష్యుల కథలు
 28. పిల్లల బొమ్మల విక్రమ్‌ భేతాళ కథలు
 29. పిల్లల బొమ్మల రామాయణం
 30. పిల్లల బొమ్మల పంచతంత్రం
 31. పిల్లల బొమ్మల గలివర్ సాహసయాత్రలు
 32. పిల్లల బొమ్మల బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు
 33. పిల్లల బొమ్మల మర్యాదరామన్న కథలు
 34. బాల నీతిమాల

మూలాలు[మార్చు]