Jump to content

వికీపీడియా:2009 సమీక్ష

వికీపీడియా నుండి

వికీపీడియా:2009 ప్రణాళికని వైజాసత్య తయారుచేశారు. 2009 లో జరిగిన ప్రగతిని సమీక్ష చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

లక్ష్యాలు- సంవత్సరాంత స్థితి

[మార్చు]
  • 50 (కిలో )వ్యాసాలకు చేరటం ( 2008 లో 37 కిలో, జనవరి 2009 లో 41 కిలో)-44 కిలో
  • రెండు కేబీలపైబడిన వ్యాసాలను 25% కు చేర్చటం (2008 చివరిలో6%)- 8%
  • మొలకలను 35 శాతానికి తగ్గించటం (ప్రస్తుతం 51%) - 47%(16-6-2010 నాడు)
  • 1000 విశేష వ్యాసాలను అభివృద్ధి చేయటం- 1069 (10 కిబై పైబడిన వ్యాసాలని విశేష వ్యాసంగా పరిగణించితే, జూన్ 6, 2010న)

పురోగతి నమోదైనా, లక్ష్యాలను చేరుకోలేకపోయాం. లక్ష్యాలు ఆశావహంగా, పాత గణాంకాల పురోగతి పై ఆధారపడినవికాకపోవచ్చు.

ఇతర గణాంకాలు

[మార్చు]
తెవికీ మార్పుల సూచిక
మూడు నెలల వారీ గణాంకాలు
  • 2009 లో సాధారణంగా రోజుకి 3 నుండి 16 వ్యాసాలు సృష్టించబడుతున్నాయి. ఇది 2008 లో 6 నుండి 14 గా నమోదైంది
  • 2009 లో నెలలో 5 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 24 నుండి 46 మధ్య వుంది. ఇది 2008 లో 24 నుండి 37 గా నమోదైంది
  • 2009 లో నెలలో 100 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 5 నుండి 8 మధ్య వుంది. ఇది 2008 లో 6 నుండి 9 గా నమోదైంది
  • వ్యాసపు సగటు మార్పులు 8కి ,పరిమాణం 883 బైట్లుకి, రెండు కిలోబైట్ పరిమాణంగల వ్యాసాలు 8 శాతానికి చేరాయి. ఇది జనవరిలో 6.6, 617, 6గా వున్నాయి.
  • వ్యాసంలో పదాల సంఖ్య , లింకులు, బొమ్మలు , దారి మళ్ళింపులు సుమారు ఒకటే వేగంతో పెరుగుతున్నాయి. ఇవి వ్యాసాల సంఖ్య కన్నా నాణ్యత మెరుగుని సూచిస్తాయి.
  • సంవత్సరపు పేజి వీక్షణలు 2009 లో 47.51 మిలియన్లు కాగా 2008 లో 22.5మిలియన్లు ( పిభ్రవరిలనుండి గల దత్తాంశం ఆధారంగా సంవత్సరపు అంచనా). అత్యధిక స్థాయిలో డిసెంబరు 2009 లో 4.1 మిలియన్లు (అనగా 1.6 సెకండ్లకి ఒకటి). ఇది డిసెంబరు 2008 తో పోల్చితే, 111 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 16 వ స్థానంలో వుంది. ఇది ఇ-తెలుగు ద్వారా జరిగిన ప్రచారం పత్రికలలో రావడం వలన కావచ్చు.

ఇవన్నీ (పేజి వీక్షణలు తప్ప) 2008 తో పోల్చితే చెప్పుకోదగ్గ మార్పు లేదు. వ్యాసాల పెరుగుదల 2008 తో పోల్చితే ముప్పావు వంతుకి పడిపోయింది. తెవికీ మార్పుల సూచిక పరిశీలిస్తే, నమోదైన సభ్యుల మార్పులు (చిత్రంలో (నీలం రంగు గీత) 2009 రెండవ అర్ధ భాగంనుండి తగ్గుముఖంలో వున్నాయి.

తెవికీ వ్యాసాలు, ప్రాజెక్టులు

[మార్చు]

ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు, సమకాలీన వార్తలకు సంబంధించిన వ్యాసాలు ఉదా: వై.యస్. రాజశేఖరరెడ్డి , తెలంగాణ , చంద్రయానం ముఖ్యంగా చేర్చబడినవి. వికీపీడియా:WikiProject/ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు, వికీపీడియా:WikiProject/భారతదేశం, వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు , వికీపీడియా:WikiProject/పుస్తకాలు ప్రాజెక్టులలో కొంత పురోగతి కనిపించింది, అయితే వైజాసత్య 2009 ప్రణాళికలో చెప్పినట్లు, ప్రాజెక్టులకి అవసరమైనంత క్రియాశీలక సభ్యులు లేరు అన్నది నిజం అనిపించింది.

తెవికీ ప్రచారం

[మార్చు]

తెవికీ అకాడమీ సాంప్రదాయిక అకాడమీ 6 అక్టోబర్ 2009 న ప్రారంభమయ్యాయి. 3 సార్లు (చీరాల, ఒంగోలు, నరసరావుపేట లలో )జరిగింది. వీటికి కావల్సిన కరపత్రాలు, ప్రదర్శన పత్రాలు తయారయ్యాయి. ఇ-అకాడమీ అనగా ఐఆర్సి ఛాట్ 19 సెప్టెంబరు 2009 న జరిగింది. డిసంబరు నెల 17 నుండి 27 వరకు జరిగిన 24 వ హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే e-తెలుగు స్టాలు నిర్వహించి కరపత్రాలు పంచి,తెలుగు వికీపీడియా ప్రచారం చేసింది. దీని గురించి పత్రికలలో ప్రముఖంగా వార్తలొచ్చాయి.

2010 గణాంకాల అంచనాలు

[మార్చు]

2009 లో పెరుగుదల ఆధారంగా, 2010 సంవత్సరాంతానికి అంచనాలు

  • వ్యాసాలు: 47.2కిలో(k)
  • రెండు కేబీలపైబడిన వ్యాసాల శాతం: 8.29%
  • పేజి వీక్షణలు: 100.3 మిలియన్లు

భవిష్యత్ కార్యక్రమాలు/ముగింపు

[మార్చు]

తెవికీ పరిస్థితి ( పేజీ వీక్షణల, విశేష వ్యాసాల పురోగతి తప్ప) ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే బాగా లేదు. ఈ పరిస్థితిని చక్కబెట్టటానికి కొన్ని సూచనలు.

సూచనలు

[మార్చు]
  • తెవికీ 2007 ప్రణాళిక మార్పులకు ఒక్క స్పందన (అహ్మద్ నిసార్) మాత్రమే వుంది. మిగిలిన 12 నిర్వాహకులనుండి స్పందన లేక పోవడం చింతించాల్సిన విషయం. తెవికీ ని అభివృద్ధి చేయడానికి నిర్వాహకులు ఇలాంటి విషయాలలో క్రియాశీలకంగా వుండటం చాలా కీలకం.
  • అభివృద్ధి కుంటుబడటానికి, ప్రణాళికానుగుణంగా, తోటి సభ్యుల, నిర్వాహకుల తోడ్పాటు లభించకపోవటం ముఖ్య కారణం. తెనికీ 5 సంవత్సరాలు పైబడింది కాబట్టి, ప్రణాళికకి అనుగుణంగా 50 శాతం పని జరిగితే బాగుంటుంది. దీనికి వికీప్రాజెక్టులు కీలకం.
  • నిర్వాహకులు క్రియాశీలమై, సభ్యులను చేర్చటం, వారికి శిక్షణ, సహాయం ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో వుంది. దీనికోసం, ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలు, వికీ అకాడమీలు నిర్వహించాలి.
  • వికీలో సభ్యులు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తారు కాబట్టి చురుగ్గా పని చేసే సభ్యులు వ్యక్తిగత పనుల్లో బిజీ కావడం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇందుకు విరుగుడు ఎక్కువ మందిని వికీలోకి తీసుకురావడం, అంతకంటే ముఖ్యంగా వాళ్ళను మార్పులు చేసేలా ప్రోత్సహించడం. ఎందుకంటే ప్రస్తుతం సభ్యత్వ నమోదు బాగానే ఉన్నా ఓసారి సభ్యులైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవారు చాలా తక్కువగా ఉన్నారు.
  • కొత్తగా సభ్యులైన వారికి సహయం ఇవ్వటానికి, ఐఆర్సి ఛాట్ ద్వారా ఇతర సభ్యులు అందుబాటులో వుంటే మంచిది.
  • కొత్త సభ్యులని, సాధ్యమైనంతవరకు, నెలకొకసారి, ముఖాముఖీ కలిసే అవకాశం మంచిది. బెంగుళూరులో ఇలా అన్ని వికీ సభ్యుల సమావేశాలు జరుగుతున్నాయి. హైద్రాబాద్ లో జరిగే ఈ-తెలుగు మాసిక సమావేశంలో, వికీ కి సగం సమయం కేటాయిస్తే బాగుంటుంది.
  • తమిళనాడు ప్రభుత్వం సహాయంతో, తమిళ వికీ, వ్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. మళయాలీ వికీ వారు, పాఠశాలలో, స్వంత వికీ ద్వారా విద్యార్థులకి, తెలియచేస్తున్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకొని, మనం కొత్త కార్యక్రమాలు చేపట్టాలి.
  • బ్లాగర్లు టపాలు రాసేటపుడు కొన్ని పదాలకు వికీలకు లింకులివ్వడం ద్వారా కొద్దిమందిని ఇటువైపు ఆకర్షించవచ్చు. ఇది రవిచంద్ర ప్రత్యక్షంగా పరీక్షించారు.
  • మీరు ఎలెక్ట్రానిక్ వార్తల ద్వారా, సమావేశాలు, కళల గురించి పంచుకుంటుంటే, వాటిలో వికీ లింకులను వాడితే బాగుంటుంది. ఇది bangalore-telugu-culture గూగుల్ గుంపులో అర్జున వాడి చూశారు.
  • అంతే కాక ఈ వారం సమైక్య కృషిలో ఉన్న వ్యాసాలను బ్లాగుల్లో సైడ్ విడ్జెట్ లాగా పెడితే వాటిని చూసి ఇటు వచ్చే వారు కూడా ఉంటారు.

ఇదీ చూడండి

[మార్చు]