వికీపీడియా:2007 సమీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీ ఆరోగ్యకరంగా ముందుకు సాగుతున్నది. వికీ శ్రామికులకు నా అభినందనలు. 50,000 వ్యాసాలను త్వరలోనే చూస్తామనిపిస్తుంది. పట్టు విడవకండి. 50వేలుకు ముందు, ప్రధానంగా నాణ్యతను పెంచే దృష్టిలో, కొన్ని చేయవలసిన పనులను సూచిస్తున్నాను. (కాసుబాబు) పెద్ద ఎత్తున గ్రామాల వ్యాసాలు జోడించే పనులు దాదాపు అయిపోయినట్లే కాబట్టి 50,000 చేరటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈలోగా వ్యాసాలన్నింటినీ వర్గీకరించి బేరీజు వెయ్యటం, అక్షర దోషాలు దిద్దటం, వ్యాసాలను శుద్ధి (క్లీనప్) చెయ్యటం, మిగిలిన ప్రాజెక్టులతో పాటు వీలైనన్ని గ్రామాల పేజీలను అభివృద్ధి పరచటం చెయ్యటానికి మంచి సమయం (వైజాసత్య)

  • ఈ ప్రాజెక్టులో మొదటిదశగా అన్ని గ్రామాలకు ప్రాథమిక సమాచారంతో పేజీలు సృష్టించడం పూర్తయ్యింది. తత్ఫలితంగా 280 దాకా తనిఖీ చెయ్యాల్సిన గ్రామాలు యేర్పడ్డాయి. వీటిని ఒక వారంలో తనిఖీ చేయవచ్చు.
  • తనిఖీ పూర్తయిన తర్వాత రెండవదశగా బాటు సహాయముతో అయోమయ నివృత్తి చేసి ఆయా లింకులు సవరించబడతాయి. (అంటే మొదటి దశలో అయోమయ నివృత్తి పేజీలు సృష్టించబడినవి కానీ చాలా మటుకు ఆయా ప్రభావితమైన పేజీలలో లింకులు మార్చలేదు). ఇది బాటు సహాయంతో చేసినా పక్కన మనిషి లేనిదే పనిజరగదు (కావలసిన సమయం: 1 నెల)
ఈ లింకులు సవరించటం ఒక తడవ పూర్తయ్యింది. రెండో తడవలో త్వరగా అన్నీ ఒక లుక్కెయ్యాలి (కావలసిన సమయం: 3-4 రోజులు)
  • మూడవ దశలో గ్రామాల పేజీలలో గణాంకాలు చేర్చటం, బాటు సహాయంతో అన్ని గ్రామాల మరియు మండలాల పేజీలలో సమాచారము యొక్క మూలాలు చేర్చడం జరుగుతుంది. దీనిని బాటు ద్వారానే నిర్వహించినా. గణాంకాల సమాచారం ఆంగ్లములో ఉండటం వలన గణంకాల ఎక్సెల్ షీటులోని ఆంగ్ల పేరు పక్క గడిలో తెవికీ ఆ గ్రామం పేజీ పేరును గుర్తించి అతికించాలి. ఇది చేత్తో చేయవలసిన పని. (ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కువ సహాయం కావలసిన పని ఇదేనని గుర్తించబడినది). ఈ పనిని రెండవదశ క్షుణ్ణంగా పూర్తి అయితేకానీ ప్రారంభించలేము. (కావలసిన సమయం: 2 నెలలు)
  • ఈ ప్రాజెక్టులో వర్గీకరణ గురించి పట్టించుకోవలసిన అవసరంలేదు. కానీ వ్యాసం చర్చాపేజీలో వ్యాసం ప్రగతి సాధించే కొద్దీ నాణ్యత బేరీజు వేస్తే మంచి వ్యాసాలను ఏరి చూపించే వీలు కలుగుతుంది.

ఉదాహరణకి (మీ స్వగ్రామం వ్యాసం మీరు విస్తరించి అది మొలక స్థాయి దాటితే..అంటే రెండు పేరాలకు మించితే తరగతి=ఆరంభ అని బేరీజు వెయ్యండి). మొదట వీటన్నింటిని సైజునుబట్టి బాటుతో యాంత్రికంగా మొలకలుగా వర్గీకరింపజేద్దాం.

  • కాసుబాబు గారన్నట్టు దీర్ఘకాలికంగా తెవికీకి వన్నె తెచ్చె ప్రాజెక్టు ఇది. (పశ్చిమగోదావరి జిల్లా ఊపందుకున్నట్టే మిగిలిన జిల్లాలు కూడా ఊపందుకోవాలి).
  • బొమ్మలు - వికీలో ఉచిత లైసెన్సు గల బొమ్మల కొరత స్పష్టంగా ఉన్నది. ఈ సారి మీవూరు వెళ్ళినపుడు స్కూటరుపై మీ మిత్రునితో ఏదైనా దారిలో వెళుతుంటే, ప్రతివూరికీ ఒకో ఫొటో తీసి ఆయా వూరి వ్యాసాలలో ఎక్కించండి.
  • మీ స్నేహితులు, సహోద్యోగులనుండి వారి గ్రామాల గురించి సమాచారం సేకరించవచ్చు (విశ్వనాధ్)
  • కొంత కాలం పరుగులెత్తిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిదానించింది. (నవీన్ ఇప్పుడు స్వకార్యాలపై బిజీగా ఉన్నట్లున్నాడు). మీరు టీవీలో ఏదైనా సినిమా చూసినప్పుడల్లా ఆ సినిమా వివరాలు ఇక్కడ వ్రాస్తూ ఉండండి. మీ వూళ్ళో సినిమా పోస్టర్లు ఫొటో తీసి "ఫెయిర్ యూజ్" క్రింద ఆయా పేజీలలో అతికించండి.
  • ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా 30-40దాకా చెప్పుకోదగ్గ వ్యాసాలను అందించిందని అంచనా.
  • వ్యాసాల విస్తరణ కాక ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులు - పేజీలు లేని సినిమాల జాబితా ఒకటి తయారుచెయ్యటం ప్రారంభించబడినది. దాన్ని విస్తరిస్తూ..ఆ జాబితాలోని సినిమాల గురించి సమాచారము తెలిస్తే, పేజీ సృష్టించి, దానిపేరును జాబితాలో నుండి తొలగించండి.
  • సినిమా గణాంకాలు పేజీలో ఎక్కడికీ లింకులేని సినిమా పేజీల జాబితా ఉన్నది. వాటికి సరైన పేజీలనుండి లింకులియ్యాలి.
  • అదే పేజీలో ఒకటికంటే ఎక్కువ సినిమాల సమాచారం ఉన్న సినిమా పేజీల జాబితా కూడా ఉంది. వాటిని చూసి అయోమయనివృత్తి పేజీలు చెయ్యటమో లేక మరో విధముగా పరిష్కరింటమో చెయ్యాలి.
  • అక్కడే ఇతర వ్యాసాలతో కలిసి ఉన్న సినిమా పేజీలు కూడా ఉన్నాయి. వీటిని తనిఖీ చెయ్యాలి.
  • ఇక వ్యాసాల విస్తరణ దీర్ఘకాలిక ప్రయత్నం. దీనికింత సమయం పడుతుందని ఖచ్చితంగా నిర్ణయించలేము.
  • ఈ ప్రాజెక్టులో వర్గీకరణ మరియు బేరిజు పూర్తి అయినందువలన వ్యాసాలు మెరుగుపడుతున్నకొద్ది వాటిని సులువుగా గుర్తించడానికి మెరుగుపరచిన్నప్పుడు నాణ్యతను కూడా నమోదు చెయ్యటం మరచిపోవద్దు.
  • ఇందులో మొదటి మెట్టుగా ఇప్పుడు దేశాల జాబితాల జాబితాను కాసుబాబు గారు తయారు చేస్తున్నారు. ఒకో దేశానికీ ఒకో వ్యాసమైనా చేయాలి. అంటే షుమారు 250 - 300 వ్యాసాలు. ఒక్కో సభ్యుడినీ కనీసం రెండు వ్యాసాలు అనువదించమని కోరుతున్నాను.
  • నేను తెలుగుకు బాగా సరిపోయే దేశాల సమాచారమూస తయారుచేసే ప్రయత్నంలో ఉన్నాను. (వైజాసత్య)
  • దేశాల పేజీలను కేవలం ఒక చిన్న పేరాతో పాటు సమాచారపెట్టె కల వ్యాసాలుగా ప్రారంభించాలా? లేదా కొంతైనా సమాచారంతో ప్రారంభించాలా అన్న నిర్ణయం సభ్యులు తీసుకోవాలి.
వ్యాసాల ఆరంభ నిడివి గురించి ఇంతకు ముందు కొంత చర్చ జరిగింది. వైజా సత్యా! నువ్వు మూసతో వ్యాసాలు ఆరంభించు. ఎక్కువ కాలం పట్టినా ఒకో వ్యాసాన్నీ చెప్పుకొనదగిన నిడివి ఉండేలా అనువదించాలి. ఏమైనా మొక్కుబడి వ్యాసాలకు (పొట్టి వ్యాసాలకు) స్వస్తి పలకాలని నా అభిప్రాయం. (కాసుబాబు)
ప్రస్తుతానికి ఆసియా దేశాలన్నింటికీ మూసలు ఉన్న పేజీలు తయారయ్యాయి..కానీ వీటిని అనువదించి అసలు విషయంతో విస్తరించాలి
  • వర్గీకరణ చాలా మటుకు మూసలద్వారానే జరుగుతుంది కాబట్టి అన్ని ఉపయోగించే మూసలనూ తెలుగులోకి అనువదించి సిద్ధం చేసుకోవాలి. ఇక బేరీజు వేసేందుకు ప్రాజెక్టు మూసను తయారుచేసి సంబంధిత పేజీల్లో అంటించాలి.

ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు కింద కొన్ని వ్యాసాలు వచ్చాయి. సభ్యులు ఇందులో చురుగ్గా పాల్గొంటే మంచి ప్రాజెక్టు కాగలదు. తెవికీలో తప్ప మరెక్కడా ఇంత విస్తృతంగా దొరకని వ్యాసాలవి.

  • జలవనరులు ప్రాజెక్టు చిన్నదే అయినా చాలా నాణ్యమైన వ్యాసాలు కలది. కొద్దిపాటి విస్తరణతో దాదాపు అన్ని వ్యాసాలూ మొదటి పేజీ ప్రదర్శనకు పరిగణింపదగినవే. ప్రాజెక్టు విస్తృతిని పెంచి అందులో నదులు, చెరువులు మరియు ఇతర నదులపై ప్రాజెక్టులను కూడా కలిపి పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు తరహా ఒక చిన్న ప్రాజెక్టును రూపొందించాలి.
  • వర్గీకరణ ఇదివరకే జరిగింది. కాబట్టి బేరీజు వేసేందుకు ప్రాజెక్టు మూసను తయారుచేసి సంబంధిత పేజీల్లో అంటించాలి.

రాజశేఖర్ గారు జీవశాస్త్రమునకు సంబంధించిన అనేక విషయాలపై వ్యాసాలు ప్రారంభించి తెవికీ విస్తృతిని పెంచుతున్నారు. వీటి వర్గీకరణ మరియు బేరీజు వెనువంటనే జరుగుతుండటం వలన నిర్వహణా పరంగా పెద్ద పని లేదు. కానీ, ఇందులో కనీసం ఒక 10% వ్యాసాలనైనా ఒకస్థాయికి తీసుకెళ్ళి ప్రదర్శించాలి. అలాగే సమీప భవిష్యత్తులో ఒక జీవశాస్త్రపు వేదికను ప్రారంభించే దిశగా ఆలోచించాలి.

మిగిలిన ప్రాజెక్టుల గురించి[మార్చు]

  • భారతదేశం తాలూకాలు ప్రాజెక్టు - ఇది ఆంధ్రప్రదేశ్ మండలాల ప్రాజెక్టులాంటిదే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలోని జిల్లాలకు మరియు తాలూకాలకు పేజీలు తయారుచెయ్యాలి. దీన్ని ప్రారంభించాలంటే ముందుగా అన్ని తాలూకాలు పేజీలోని పేర్లను తెలుగులోకి అనువదించాలి. అనువదించి పెట్టుకుంటే పేజీలను తయారుచెయ్యటం మనం 50,000 దాటిని తర్వాత ప్రారంభించాలని నా ఆలోచన.
  • ఆంధ్రప్రదేశ్ మండలాల ప్రాజెక్టులో అనుకున్న వరకు పనంతా పూర్తయింది. ప్రస్తుతానికి అందులో పనేమీలేదు. అంతటితో అది ముగిసిందని ప్రకటిద్దామా? మరేమైనా చెయ్యగలమా? (అన్ని మండలాలకి అక్షాంశరేఖాంశాలు కనుగొని ఆయా మండలపేజీలలోని మూసలలో చేర్చటమనే చిన్నపని ఉన్నది..తలా ఒక చెయ్యి వేస్తే వారం రోజుల్లో అయిపోతుంది)
  • భారతదేశ చరిత్రకు సరైన నిర్దేశం మరియు లక్ష్యం లేక నిలచిపోయినది. ప్రాజెక్టు మరీ విస్తృతమైనదిగా కూడా అనిపిస్తుంది. దీన్ని ఎటువైపు నడిపించాలో మీకేమైనా ఆలోచనలు ఉంటే తెలియజేయండి.
  • కంప్యూటరు విజ్ఞానము మరియు లినక్సు ప్రాజెక్టులు చాలారోజులనుండి నిర్జీవంగా ఉన్నాయి.
  • ఇక్కడ అలాంటి విషయాలు ఉండాలా వద్దా అన్న సందిగ్ధతతో శాసనాలు ప్రాజక్టు నిలిపివేయటమైనది.

ప్రతిపాదిస్తున్న కొత్త ప్రాజెక్టులు[మార్చు]

పుస్తకాలు ప్రాజెక్టు[మార్చు]

క్రొత్తగా మొదలు పెట్టవలసిన ప్రాజెక్టు. ఇందులో తెలుగు లేదా ఇతర భాషలలోని రచనలనుగురించిన వ్యాసాలు వ్రాయాలి. - శ్రీ మదాంధ్ర మహాభారతం, మను చరిత్రము, కన్యాశుల్కం, సుమతీ శతకం, పాండవోద్యోగ విజయములు, బుడుగు, చివరకు మిగిలేది, మహా ప్రస్థానం, పురాణ వైర గ్రంధమాల, అమరావతి కధలు, తులసి దళం, రత్తాలు-రాంబాబు, చక్రనేమి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మహాంధ్రోదయం - ఇలా ఎన్నో రచనలను గురించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టులో భాగంగా చేయవచ్చును. మాటల బాబూ! శాస్త్రీ! - ఎవరైనా ముందుకు రాగలరా?.

హిందూమతం ప్రాజెక్టు[మార్చు]

ఈ విషయానికి సంబంధించి కాసుబాబు, మాటలబాబు, విశ్వనాథ్ మరియు శాస్త్రి గారు కృషి చేస్తున్నారు. దాన్ని వ్యవస్థీకరించడానికి, నిర్వహించటానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించాలని మాటలబాబు ప్రతిపాదించారు. హిందూ పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఉపనిషత్తులు, వేదాలు, పౌరాణిక వ్యక్తులు, హైందవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు మొదలగువాటి గురించిన వ్యాసాలన్నీ ఈ ప్రాజెక్టులో భాగమౌతాయి.

నిర్వహణా దళాలు[మార్చు]

సాధారణ నిర్వహణకు లొంగని పెద్దపెద్ద పనులను నిర్వహించడానికి వికీలో మూడు నిర్వాహణా దళాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తెవికీలో చురుగ్గా ఉన్న సభ్యులంతా ఈ దళాలలో చేరితే బాగుంటుంది. అవి

భాష మెరుగుపరచే దళం
  • వ్యాసాల్లో అక్షరదోషాలు ఎక్కువగా ఉండి, నాణ్యతాపరంగా ఉన్నతంగా ఉండడం లేదు. అంచేత నాదొక సూచన. కొందరు సభ్యులు కలిసి ఒక దళంగా ఏర్పడి ఈ అక్షరదోషాలను తొలగించడాన్ని ఉద్యమం లాగా చేపట్టాలి. దోషాలను తొలగించడం పట్లే కాకుండా, వాటిని నివారించడం పట్ల, దోషాలు రాయకుండా సభ్యులకు సూచనలివ్వడం పట్లా నడుం కట్టాలి.(చదువరి)
  • అక్షర దోషాలు - చదువరి, శాస్త్రి ఈ విషయాలపై అధిక శ్రద్ధ చూపుతున్నారు. - అందరికీ విన్నపం. ఎక్కడైనా దోషాలు కనిపిస్తే పోనీలే అని వదల వద్దు. దిద్దండి.(కాసుబాబు)
ఈ దళం తయారయింది: వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం
వ్యాసాలు శుద్ధిచేసే దళం
  • ఎన్వికీలో క్లీనప్ అనే దళంలోలాగా ఇందులోని సభ్యులు వ్యాసాలను వికీకరించి వాటి శైలికి, అమరికకీ తగు మార్పులు చేసి ఉన్నత ప్రమాణాలకు చేర్చుతారు.
ఈ దళం తయారయింది: వికీపీడియా:శుద్ధి దళం
వ్యాసాలను బేరీజు వేసే దళం.
  • బేరీజుకు అవసరమయ్యే మూసలను తయారుచేసి, వీలైనచోటల్లా యాంత్రికంగా బేరీజు వేసి, వ్యాసాలను బేరీజు వేసే పనిలో చాలామటుకు చాకిరినంతా వైజాసత్య, ప్రదీపు బాట్లతో చేయించినా ఒక వ్యాసాన్ని మెరుగుపరచినప్పుడు ఆయా సభ్యులు నాణ్యతను నమోదు చేస్తే దీన్ని నిర్వహించడం తేలిక.


ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులే ఈ దళాలలో చేరితే వారికి పనిభారం మోయలేనంత అవుతుంది. లేదంటే అన్నీ ఒకే ఒక సభ్యుడి దళాలు అవుతాయి. కనుక ఇకముందు క్రొత్తగా చేరిన సభ్యులను ఆహ్వానించేప్పుడు, "ఈ దళాల అవుసరం చాలా ఉంది. మీరు సాయపడగలరా?" అని అభ్యర్ధించడం మొదలు పడితే మంచిది. అందుకు స్వాగత సందేశంలో మార్పులు చేయవలెను. క్రొత్త సభ్యులకు ఉండే అవరోధాలను అధిగమించడంలో వారికి మనం సాయం చేయవచ్చును. --కాసుబాబు 19:51, 4 సెప్టెంబర్ 2007 (UTC)
కొత్త వాళ్ళకు సముదాయపందిరిలోని చెయ్యాల్సిన పనుల జాబితా సరిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ దళాల పనులు నిర్వర్తించడానికి కొంతైనా వికీ గురించి తెలుసుండాలి. కొత్తవాళ్ళు అక్షరదోష నిర్మూలన దళంలో బాగా రాణిస్తారేమో, శుద్ధి దళంలో చేరాలంటే వికీశైలి ఎలా ఉండాలో కొంతైనా అవగాహన ఉండాలి. ఏమైనా కొత్తవాళ్ళను ఆహ్వానించి చూడటంలో తప్పులేదు. --వైజాసత్య 21:05, 5 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ సమీక్ష కూడా చూడండి[మార్చు]

వికీపీడియా:2007 సమీక్ష/సెప్టెంబరు 2007 వ్యాసం