వికీపీడియా:2009 ప్రణాళిక
2009 సంవత్సరానికి తెవికీ ప్రగతికి కొంత ప్రణాళిక, ప్రతిపాదనలు. అందరు సభ్యులూ సూచనలు, సలహాలు మరియు చర్చలు చేయవచ్చు. ఇదివరలో 2007 సెప్టెంబరులో వికీపీడియా:2007 సమీక్ష అంటూ సభ్యులు కలిసి తెవికీలోని వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తూ, మరియు వివిధ ప్రాజెక్టులలో ఎటువంటి కృషిచేయవచ్చో ప్రతిపాదిస్తూ ఒక నివేదిక తయారు చేశారు. కానీ వివిధ ప్రాజెక్టుల ప్రాతిపదికన అభివృద్ధి అంతగా పుంజుకోలేదు. దానికి ఒక కారణంగా తెవికీలో ఒకే విషయంపై ఆసక్తిగల సభ్యుల సంఖ్య ఒక క్రిటికల్ స్థాయిని ఇంకా చేరుకోకపోవటంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రాజెక్టు స్థాయి అభివృద్ధి ఆంగ్లవికీలాంటి పెద్దవికీలకు సరిపోతుంది కానీ తెవికీకి అనుగుణంగా లేదు. అందుకే 2009 ప్రణాళికలో కొన్ని అందరు సభ్యులు పాల్గొనగలిగే లక్ష్యాలు, సులువుగా ప్రగతిని కొలిచే అవకాశమున్న లక్ష్యాలను ఎంచుకోవాలని భావిస్తున్నాం.
లక్ష్యాలు
[మార్చు]- 1000 విశేష వ్యాసాలను అభివృద్ధి చేయటం
- మొలకలను 35 శాతానికి తగ్గించటం (ప్రస్తుతం 51%)
- రెండు కేబీలపైబడిన వ్యాసాలను 25% కు చేర్చటం (ప్రస్తుతం 8.2%)
- 50 వేల వ్యాసాలకు చేరటం
(పైవి కొన్ని ఉదాహరణలకు మాత్రమే వాటిని చర్చించాలి)
ప్రతిపాదనలు
[మార్చు]- విలీనం, మొలక, తొలగింపులు, చాలా కొద్ది సమాచారం, ప్రాముఖ్యత లేని విషయం, లాంటి మూసలు ఉంచడం.
- విలీనాలు చేపట్టడం
- తొలగింపులు రెండు నెలల తరువాత చేపట్టడం
- అనువాదాల వ్యాసాలు పూర్తిచేయడం (అనువాదాలు, అన్న పేజీలో ఒక్క వ్యాసంపేరూ ఉండకూడదు)
- మొలకలను, మొలకల స్థితి నుండి పైకి తీసుకు రావడం
- తెలుగువికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన జాబితాను పరిపూర్ణం చేయడం.
- వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన జాబితాను పరిపూర్ణం చేయడం.
- ఈ కాలంలో కొత్త వ్యాసాల జోలికి పోరాదు
- దీని కొరకు, నిర్వాహకులందరికీ, క్రియాశీలకం చేయాలి, క్రొత్త సభ్యులకు తగు సూచనలు ఇచ్చి వారికి వ్యాసకర్తలుగా, శుద్ధి దళ సభ్యులుగా, అక్షరదోష నిర్మూలనా సభ్యులుగా తయారు చేసుకోవాలి. నిసార్ అహ్మద్ 08:59, 1 డిసెంబర్ 2008 (UTC)