Jump to content

వికీపీడియా చర్చ:2009 సమీక్ష

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

1000 విశేష వ్యాసాలను అభివృద్ధి చేయటం

[మార్చు]

1000 విశేష వ్యాసాలను అభివృద్ధి చేయటంలో మార్పు కనబడలేదని నేను భావించట్లేదు. అసలు 1000 విశేష వ్యాసాలకు అభివృద్ధి పథం స్థూలంగా ఇది. వెయ్యి విశేష వ్యాసాలుండాలంటే మొదట వెయ్యి వ్యాసాలుండాలి. ఆ తర్వాత అన్నింటినీ రెండు. ఐదు కేబీలను, పది కేబీలను దాటించాలి. కేవలం పరిమాణం నాణ్యతకు సూచన కానే కాదు. కానీ, ఎంతోకొంత సమాచారముందంటే దాన్ని తీర్చిదిద్దేందుకు అవకాశముందని ఆలోచన. అలా పదికేబీలు దాటిన వ్యాసాలు కొన్నివేలు ఉంటే అందులో ప్రాధాన్యతను, సమగ్రతను బట్టి ఒక వెయ్యి వ్యాసాలను ఎంపికచేసి, ఒక్కొక్కటే విశేషవ్యాసాల స్థాయికి అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రగతిని కొలవటానికే వికీపీడియా:1000 విశేష వ్యాసాల ప్రగతి వెలసింది. ఇందులోని ప్రగతి చూస్తే ఎంతోకొంత పురోభివృద్ధి సాధించామనే అనుకుంటున్నాను --వైజాసత్య 01:30, 17 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి మూలం. క్షమించాలి, నా శోధనలో కనబడలేదు. ధన్యవాదాలు. అర్జున 04:47, 17 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]