వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 13 | పాత చర్చ 14 | పాత చర్చ 15

alt text=2012 ఫిబ్రవరి 6 - 2012 జూన్ 5 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2012 ఫిబ్రవరి 6 - 2012 జూన్ 5

సైడ్‌బార్‌లో మార్పులు[మార్చు]

అర్జునరావు గారు, మీరు ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా సైడ్‌బార్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇన్నేళ్ళుగా కొత్తవారికీ, పాతవారికీ, అజ్ఞాతసభ్యులకు, లాగిన్ అయిన సభ్యులకు, నిర్వాహకులకు ఇలా అందరికీ తమ సమస్యలు, పరిష్కారాలు చెప్పుకొనే రచ్చబండను ఏకంగా మాయం చేశారు. తెవికీని ప్రారంభించినప్పటి మహామహుల అభిప్రాయాలు, వారి ఆలోచనలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రచ్చబండ ఉండడం వల్ల తెవికీకి ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి రచ్చబండను మళ్ళీ సైడ్‌బార్‌లో చేర్చుతున్నాను. అంతేకాకుండా రచ్చబండలో ఎలాంటి చర్చలు చేయరాదనే అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను. రచ్చబండలో ఎలాంటి విషయమైనా వ్రాయవచ్చు. కొంతకాలం తర్వాత వాటిని రచ్చబండ ఉపవిభాగాలలో చేరిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:27, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ సవరణ గురించి నెలపైగా చర్చ సాగుతూనే వుంది. ఇప్పటి దాకా పాలుగొన్న వారి సలహాలు తీసుకునే చేశాను. తెవికీలో ఎందుకు అలావుందో కూడా ఇప్పటివారికి తెలియని సంగతి మీరు ఇంతకు ముందల ప్రస్తావించారు కూడా. మనకు అనుమానం వస్తే కనీసం ఇంగ్లీషు వికీ చూసైనా అర్థం చేసుకునే పరిస్థితి ఇంతవరకు లేదు. మీకు అయిన మీకు అభ్యంతరమున్నట్లుంది. మీ సలహాలు త్వరగా పంచుకోండి. ప్రక్క పట్టీమార్పులు మీడియావికీ:Sidebar లో చర్చించండి. నేను అక్కడ వ్యాఖ్యరాశాను. రచ్చబండకు సంబందించి ఇక్కడే చర్చిద్దాం--అర్జున 16:41, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటిపేజీ, సైడ్‌బార్ రెండూ వేరువేరు. సైడ్‌బార్‌లో మార్పులు చేసేంతవరకు ఇటీవల దీనిపై చర్చ జరుగలేదు. మొదటిపేజీలో మార్పుల కొరకు కూడా చర్చలో ఎక్కువగా పాల్గొనడం లేదు. దానిపై కూడా ఎలాంటి నిర్ణయం లేనిదే "వెబ్ చాట్లో కొత్త రూపానికి మార్చటానికి నిర్ణయించబడింది" అని చెప్పిమీరు మార్పులు చేశారు. వారానికోసారి గంట సేపు జరిగే ఛాట్‌లో అందరికీ పాల్గొనే వీలు, సమయం కుదరకపోవచ్చు కొందరికి ఇష్టం లేకపోవచ్చు. నలుగురైదుగురు మాత్రమే పాల్గొనే ఛాట్‌లో తీసుకున్న నిర్ణయాలకంటె అందరికీ అందుబాటులో ఉన్న తెవికీ చర్చల నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా అప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయాలు, అభిప్రాయాల కంటె ఆలోచించి తీసుకొనే నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు నేను చెప్పినది రచ్చబండ ఉపశీర్షిక గురించి మాత్రమే కాని సైడ్‌బార్ గురించి చర్చ చేయలేను. సైడ్‌బార్‌లో అదనపు లింకులు పెట్టడం మంచిదే కాని రచ్చబండ వంటి పాఠకామోదం పొందిన (సరాసరిన రోజూ 100 హిట్లు) లింకులను తొలిగించడం బాగుండదు. ఆంగ్లవికీ లాగా తెవికీ ఇంకనూ పరిణతి సాధించలేదు కాబట్టి అక్కడి పద్దతులను మక్కికిమక్కి చేయకుండా అవసరముంటే కొన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చేసిన మార్పులు Sidebar తప్ప చర్చించి చేసినవనే విషయాన్ని గమనించండి. దానిగురించి ( అక్కడి వ్యాఖ్యకూడా చూడండి) తెవికీ అభివృద్ధికి పాత సంప్రదాయాలతో పాటు కొత్తరకం సంప్రదింపుల పద్ధతులు కూడా ప్రయత్నించటం అవసరం. సమిష్టి కృషి తగిన స్థాయిలో లేకపోతే తెవికీ అభివృద్ధి వేగవంతం కానేరదు. చర్చాపేజీలలో స్పందన సరిపోక చేసిన కొత్త ప్రయత్నమే వెబ్ ఛాట్, మీడియా వికీ సైట్ నోటీస్. ఇది తెవికీ సభ్యులకోసమే, తెవికీ సభ్యునిగా చేసినదని గమనించండి. దీని రికార్డు కూడ తెవికీలో భద్రపరుస్తున్నాము. అందుకని వెబ్ ఛాట్ ని తక్కువగా చర్చపేజీని ఎక్కువగా చూడటం నా దృష్టిలో సరికాదు. తెవికీకి 8 ఏళ్లునిండినా, ఇంకనూ పరిణతి రాలేదంటే మనమందరం సమిష్టికృషిపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా వుంది. నేను చేసిన ప్రయత్నాలకు తోడ్పాటు అందించినందులకు చంద్రకాంతరావు గారికి, ఇతర నిర్వాహకులకు, సభ్యులకు, రచ్చబండ ముఖంగా ధన్యవాదాలు. క్రియాశీలంగా వున్న అందరూ కొత్త ఆలోచనలతో సమిష్టిగా వుద్యమిస్తే బాగుంటుంది. ముందు ముందు నేను చేయబోయే ప్రయత్నాలు ఇంతకుముందు లాగా రచ్చబండలోకాని ఇతర చర్చాపేజీలలోకాని ఇతర పద్ధతులలో చర్చించినా దానిని తెవికీలో నమోదు చేసి చేస్తానని మాటిస్తున్నాను. --అర్జున 11:19, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పట్టీ కొత్త రూపం[మార్చు]

పట్టీ కొత్త రూపం ఇంగ్లీషు వికీ కు దగ్గరగా చేస్తే దాదాపు ఆరేడేళ్లుగా మార్పులేని తెవికీని వాడటానికి మరింత ఉపయోగంగా చేయవచ్చు. దీనికై నేను ప్రతిపాదిస్తున్నది. దీనిపై సలహాలు ఇవ్వండి. --అర్జున 16:47, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆరేడేళ్ళుగా మార్పులకు లోనుకాకుండా ఉన్ననూ ఇప్పుడూ పట్టీకి మార్పులు చేసే అవసరం కనిపించడం లేదు. అదనంగా కొన్ని లింకులు మాత్రం పెట్టవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:14, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
రచ్చబండ లంకె ఎడమ పట్టీలో ఉండాలి. రెండవ విభాగంలో ఉంచవచ్చు. రెండో విభాగానికి పేరు పారస్పర్యం అంటే బాగుంటుంది. — వీవెన్ 02:35, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ అంటేనే ఎల్లప్పుడూ మార్పులు జరిగేది కదా. మొదటిపేజీ మార్పులు మరీ ఎక్కువ వుండకూడదనేదానికి నేను ఒప్పుకుంటాను. అయితే క్రియాశీలంగా లేని లింకులను (ఉదా వర్తమాన ఘటనలనేది వుండేది) తొలగించకపోతే తెవికీ పై చెడ్డ అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. అందుకని కనీసం సంవత్సరానికొకసారైనా మెరుగుచేయటానికి ప్రయత్నించటం మంచిది. రచ్చబండ లో వార్తలు తప్ప మిగతావి వాడేది క్రియాశీలక సంపాదకులు లేక నిర్వాహకులు మాత్రమే. సముదాయ పందిరిని సాధారణ సంపాదకులు కూడా వాడతారు. అందుకని వార్తలు విభాగాన్ని సముదాయపందిరి కి మార్చి రచ్చబండని సముదాయ పందిరి లింకుగా మారిస్తే వికీపీడియా వాడేవారి మొదటి చూపు మరింతగా ఉపయోగపడే సముదాయపందిరి పై పడేటట్లు చేయవచ్చు. రెండో విభాగానికి మెరుగైన పేరు కి దృష్టాంతం తెలపండి. నేను బూదరాజు ఆధునికవ్యవహారకోశం (http://www.andhrabharati.com/dictionary/index.php) లోని పదాన్ని వాడాను --అర్జున 12:26, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
పారస్పర్యం వాడుక. అలానే ఈ పదం రెసిప్రొసిటికి కూడా వాడుకలో ఉంది. చూడండి. — వీవెన్ 03:43, 9 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో మార్పులు జరగాలి నిజమే, కాని ఆ మార్పులనేవి సభ్యుల అనుమతితో, సభ్యులు మరియు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగితే బాగుంటుంది. క్రియాశీలంగా లేని లింకులు తొలిగించడానికి ఇదివరకు కూడా ఎవరూ ఒప్పుకోలేరనుకుంటాను. మొదటిపేజీలో మీరు క్రింది నుంచి పైకి తెచ్చిన శీర్షిక మీకు తెలుసా! ను తొలిగించాలని ఇదివరకు కాసుబాబు గారు రెండు సార్లు ప్రతిపాదించారట. ఆ సమయంలో నేను సభ్యుడిని కాను కాబట్టి ఆ సంగతి ఏమయిందో తెలీదు కానీ ఆ తర్వాత నేను సభ్యుడిగా చేరడం అచేతనంగా ఉన్న మీకు తెలుసా శీర్షికను చాలా కాలంపాటు క్రమం తప్పకుండా నిర్వహించడంతో కాసుబాబు గారే నాకు ఆ సంగతి చెప్పి అభినందించారు. (చూడండి) ఇదంతా చెప్పే ఉద్దేశ్యమేమంటే ఆనాడు క్రియాశీలంగా లేదని తొలిగిస్తే ఆ తర్వాత శీర్షిక గురించి కొత్తగా వచ్చిన సభ్యులకు తెలిసేది కాదు. అంతేకాదు ఇప్పుడు మీరు తొలిగించిన వర్తమాన ఘటనలు శీర్షిక కూడా నేను రాకపూర్వం అచేతనంగానే ఉండేది. దాన్ని కూడా నేను ప్రతిరోజు నిర్వహించిన సంగతి 2007-09 కాలంలో చురుగ్గా ఉన్న వారందరికీ తెలుసు. కొన్ని శీర్షికలు ఇప్పుడు అచేతనంగా ఉన్ననూ ప్రస్తుతం ఉన్న సభ్యులు కాని, కొత్తగా చేరే సభ్యులు కాని ఎవరైనా నిర్వహించే వీలు కల్పించాలి. లేనిచో సమర్థత, అర్హత ఉండి కూడా శీర్షిక నిర్వహించడానికి అవకాశం కల్పించనట్లవుతుంది. తెవికీకి చదువరులపై మంచి అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం ఏర్పడడం అనేది శీర్షికలపై కాకుండా వ్యాసంపై ఉంటుందనుకుంటాను. కాబట్టి వ్యాసాల నాణ్యత, తాజాకరణ చేపట్టడం ముఖ్యం. శీర్షికలు ఎంత క్రియాశీలంగా ఉన్నప్పటికీ వ్యాసాలలో పాత సమాచారం, ఏకవాక్య వ్యాసాలు ఇలా ఉంటే పాఠకులు హర్షించరు కదా! ఇక రచ్చబండ విషయానికి వస్తే ఇది ప్రారంభం నుంచి అందరి ఆమోగ్యం పొందిన పేజీ. కొత్తవారు కూడా తమ సమస్యల కొరకు దీన్ని ఉపయోగించారు. కొంతకాలం పాటు సెలవులో ఉన్న సభ్యులు రాగానే చూసేది రచ్చబండనే అని అనుకుంటున్నాను. సముదాయపందిరిలో ఏమి చేర్చాలనుకుంటున్నారో దాన్ని రచ్చబండలో చేరిస్తే సరిపోతుంది. రచ్చబండను తొలిగించడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రాధాన్యత కల మొదటిపేజీ మరియు అంతకంటే ప్రాధాన్యత కల్గిన సైడ్‌బార్‌లలో మార్పులు చేసే ముందే సభ్యుల దృష్టికి తీసుకొని వచ్చి అందరి అభిప్రాయాలను తెలుసుకుంటే బాగుండేది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:23, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వెబ్ చాట్లో నిర్ణయాలు తీసుకోవడం[మార్చు]

నా వరకు వెబ్ చాట్ అనేది ఒక ప్రయివేట్ ఎఫయిర్. నిర్ణయాలు తీసుకునే ముందు వికీలో చర్చించి తగిన సమయం ఇచ్చి తీసుకోగలరు. Chavakiran 03:11, 9 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు ఏవిధంగా దానిని తెవికీ సంబందించినది కాదని అంటున్నారో నాకు అర్థంకాలేదు. దానిలో పాల్గొనటానికి పరిమితులు ఏమి లేవే. దానిలో జరిగినది తెవికీలో నమోదుచేస్తున్నామే. అది తెవికీ అభివృద్ధిని వేగవంతం చేయటానికి తెవికీ సభ్యులతో ,తెవికీ సభ్యునిగా చేసిన ప్రయత్నమే. పాత పద్ధతులతో పాటు కొత్త పద్ధతులు వాడకపోతే తెవికీ అభివృద్ధి వేగ వంతం కానేరదు. నేను చేసిన మార్పుల గురించిన వివరం ఇదే పేజీలో పైన చేర్చిన ఈ నాటివ్యాఖ్య కూడా చూడండి. --అర్జున 11:26, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
దానిలో పాల్గొనటానికి పరిమితులు ఏమి లేవే. --> కాలమే పరిమితి.
My request is not to made decisions as final in chat, rather put them up for discussion offline and then make them final. Chavakiran 01:53, 22 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
కాలం అనుకూలంకాకపోతే ఆసక్తి వున్న వారికి అనుగుణంగా కాలం మార్చవచ్చు. సాధారణంగా వెబ్ ఛాట్లోచర్చావిషయాలు, అప్పటికే చర్చపేజీలలో రాసినవే. స్పందన రానందున, వెబ్ ఛాట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోటంజరిగింది. అటువంటప్పుడు వాటిని మరల చర్చాపేజీలలో రాయాలంటే కాలయాపన తప్ప మరేమి ఫలితముండదు.--అర్జున (చర్చ) 11:23, 25 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

MediaWiki 1.19[మార్చు]

(Apologies if this message isn't in your language.) The Wikimedia Foundation is planning to upgrade MediaWiki (the software powering this wiki) to its latest version this month. You can help to test it before it is enabled, to avoid disruption and breakage. More information is available in the full announcement. Thank you for your understanding.

Guillaume Paumier, via the Global message delivery system (wrong page? You can fix it.). 15:20, 12 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మిగతా భారతీయ భాషల్లో ఉండి, తెలుగులో లేని వ్యాసాలు[మార్చు]

మిగతా భారతీయ భాషల్లో ఉండి, తెలుగులో లేని వ్యాసాల చిట్టా తయారు చేస్తే కొత్త వ్యాసాలు తయారు మనం వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక ఐడియా రావచ్చు అని నా ఆలోచన. ఇటువంటి చిట్టూ సులభంగా తయారు చేయడం ఎవరికైలా తెలుసా? Chavakiran 16:06, 21 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది మంచి ఆలోచన. దీన్ని బాటుద్వారా చేయవచ్చనుకుంటున్నాను. ఇదివరకు ఇలాంటి వాటికి వైజాసత్యగారు బాటుద్వారా పట్టికలను తయారుచేశారు. ఆంగ్లవికీలోని భారతదేశం వర్గంలో ఉన్న వ్యాసాలలో కనీసం ఆరేడు భారతీయ భాషా అంతర్వికీ లింకులు ఉన్నవాటిని కనిపెడితే చాలు, మనకు పెద్ద పట్టికే వస్తుంది. ఆపై ఆ వ్యాసాలలోంచి ఎవరికి ఇష్టమైన విషయాలపై వారు కృషిచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:13, 21 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
దివ్యమైన ఆలోచన. పట్టిక తయారుచేస్తే పని విభజన చేసి అందరూ కలిసి మంచి వ్యాసాల్ని తయారుచేద్దాము.Rajasekhar1961 06:37, 22 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వీటిని ఇంటర్ వికీలింకుల ద్వారా బాట్లుపయోగించి చేయవచ్చు. ఇతర భాషలసంగతి కెళ్లే ముందు, తెలుగు లో వున్న ఇంటర్ వికీలింకు లేని వ్యాసాలకు ఇంగ్లీషులో ఇంటర్ వికీ లింకులు చేర్చే చిన్న పనితో ప్రారంభించవచ్చు.--అర్జున 06:46, 23 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో ఉన్న తెలుగు టైపింగు పద్ధతికి స్వస్తి[మార్చు]

తెవికీలో మీరు తెలుగులో టైపు చెయ్యడానికి ఇక్కడ లభించే పద్ధతిని ఉపయోగిస్తుంటే, ఈ సందేశం మీ కోసమే. తప్పక చదవండి.

ఇప్పుడు తెవికీలో అప్రమేయంగా (డీఫాల్టుగా) ఒక టైపింగు పద్ధతి ఉంది. అయితే, దాన్ని తీసివేయబోతున్నారు. దాని స్థానంలో అన్ని వికీపీడియాలలోనూ ప్రామాణికంగా పనిచేసే విధానాన్ని తెస్తున్నారు. మీరు ఏం చేయాలంటే:

  • ఈ లంకెకు వెళ్ళి ఎడిట్ పెట్టెలో తెలుగు టైపు చేసి చూడండి.
  • RTS పద్ధతిలో మీరు తెలుగుని టైపు చెయ్యవచ్చు. పరీక్షించి చూసి తప్పులనూ, దోషాలనూ తెలియజేయండి. అందరూ పరీక్షించి చూసి సరే అంటే దీన్ని మరో వారంలో తెవికీ మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలులోనికి తేవచ్చు.

మరింత సమాచారం కోసం ఈ క్రింద చదవండి.

ప్రస్తుత పద్ధతిని తీసివేయాలనుకోడానికి ఇవీ కారణాలు:

  1. ఇప్పుడున్న పద్ధతి అంత సంపూర్ణం కాదు.
  2. తతిమా సోదర ప్రాజెక్టులలో లేదు. కొన్ని చోట్ల సరిగా పనిచేయట్లేదు.
  3. మీడియావికీ 1.19 సంచికలో జావాస్క్రిప్టుకి సంబంధించి మార్పులు చాలా ఉన్నాయి. ఈ పద్ధతి పనిచేయకపోవచ్చు కూడా.
  4. ఇతర స్థానిక వికీపీడియాల్లో ఇలాంటి పద్ధతులు అమలులో ఉన్నాయి. వీటన్నింటి (సాంకేతికంగా అమలుచేసిన విధానం, పనిచేసే పద్ధతుల) మధ్య చాలా తేడాలు ఉన్నాయి.

ఇలాంటి స్థానిక పరిష్కారాలను ఏకీకృతం/ప్రామాణికం చేస్తూ, వివిధ భాషలలో టంకనాన్ని (టైపింగుని) సాధ్యం చేస్తూ సాంకేతికంగా ఒకే విధమైన పద్ధతిని అవలంబించే నరయం అనే మీడియావికీ పొడగింతను ఫౌండేషన్ తయారుచేస్తుంది. తెలుగుకి సంబంధించినంత వరకూ ప్రస్తుతం InScript మరియు RTS (లిప్యంతరీకరణ) మీటల మ్యాపింగులను నేను అందించాను. ఈ కొత్త పరికరం ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో పరీక్షకు ఉంది. మీకు ఆ సైటులో ఖాతా ఉంటే, పరీక్షించి చూడండి. లేదా పైన నేను ఇచ్చిన లంకెలోనైనా పరీక్షించవచ్చు. ఈ కొత్త పద్ధతిని వాడి చూసి దీనిలోని లోపాలను, తప్పులను కనిపెట్టి తెలియజేయవలసిందిగా మనవి.

దీనిపై మీకు సందేహాలూ ప్రశ్నలూ ఉంటే అడగడానికి వెనుకాడకండి.

అన్నట్టు, అన్ని వికీ సోదర ప్రాజెక్టుల లోనూ తెలుగు టైపింగు పద్ధతులను స్థిరీకరించాలి అన్నది తెవికీ 2012 లక్ష్యాలలో ఒకటి.

వీవెన్ (చర్చ) 04:18, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని పదాలు టైపు చేశాను. బాగానే ఉన్నది. కానీ అన్ని అక్షరాలు మరియు క్లిష్టమైన పదాలను సంకేతాల విషయంలో సమస్యలు వస్తాయేమో ప్రామాణికంగా పరీక్షించాలి. వికీఖోట్ లో అసలు ఇలాంటి విధానం లేదు. అక్కడ కూడా ఇదే RTS పద్ధతి ప్రవేశపెడితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 05:10, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని పదాలను ప్రయత్నించాను బాగానె వుంది. కొత్తదనం ఏమి ఉన్నట్టు లేదు. పైన చెప్పినట్లు సంక్లిష్ట పదాల సంగతి గమనించాలి.ellanki 11:41, 2 మార్చి 2012 (UTC)భాస్కర నాయుడు

ఉగాది చిత్రపటాల పోటీ[మార్చు]

ఉగాది సందర్భంగా చిత్రపటాల పోటీని నిర్వహిస్తే బాగుంటుంది. తెలుగువారికి సంబంధించిన చిత్రపటాలను ఎవరైనా వికీపీడియాలోని చేర్చి ఈ పోటీలో పాల్గొనవచ్చును. 20 నుండి నెలాఖరు వరకు 10 రోజుల సమయం ఇచ్చి మంచి చిత్రపటానికి మెడల్ ఇచ్చి సత్కరించవచ్చును. ఇలాంటి పోటీ తమిళ వికీవారు వికీకామన్స్ ద్వారా నిర్వహించగా మంచి స్పందన లభించింది. మనం కూడా చేద్దామా. కామన్స్ లో పోటీకి సంబంధించిన ప్రకటన చేసి వీవిన్ గాని రహమానుద్దీన్ గాని పోటీని ప్రారంభించమని ప్రార్ధన. దీని ద్వారా కొంతమంది తెవికీ లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం కలుగుతుంది.Rajasekhar1961 (చర్చ) 05:55, 20 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలోచన బాగానేవుంది. కాని తమిళ వికీస్థాయిలో (ఆకర్షణీయమైన బహుమతులుకూడా వున్నాయి) కొంతవరకన్నా ప్రయత్నించితే వుపయోగం వుండవచ్చు. ఇటువంటివి సత్ఫలితాలివ్వాలంటే మన ప్రత్యక్ష కార్యక్రమాలు బలంపుంజుకోవాలి. హైద్రాబాదులో నెలకొకసమావేశం జరపాలన్న ప్రయత్నం ముందుకు పోవటం లేదు. దానిపై దృష్టిపెట్టి ఈ ఆలోచన తరువాత చేపట్టవచ్చు.--అర్జున (చర్చ) 11:26, 25 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ కామన్స్ కు ట్రాన్స్ ఫర్ చేసిన బొమ్మల గురించి[మార్చు]

నేను నా అప్ లోడ్ లు అన్నింటిని వికీకామన్స్ కు ట్రాన్స్ ఫర్ చేశాను. దయచేసి వాటిని తొలగించగలరు. --Sridhar1000 (చర్చ) 13:08, 20 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయకేంద్రం / నెలవారీ సమావేశం[మార్చు]

వికీపీడియా జన్మదిన వేడుకల సందర్భంలో కొత్తగా చేరిన సభ్యుల కోసం ఒక సహాయ కేంద్రాన్ని నిర్వహించడానికి నేను ముందుకు వచ్చాను. దానికి పాల్గొన్న సభ్యుల సమ్మతి లభించినది. దానికి నా ధన్యవాదాలు. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నా ఫోన్ నంబర్: 9246376622 అందరికీ తెలియజేసి సహాయం కావలసిన వారు సంప్రదించవలసినదిగా కోరుతున్నాను.

అలాగే హైదరాబాద్ లో నెలకొక వికీపీడియా సమావేశాన్ని జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ప్రతి నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం అయితే బాగుంటుందని భావిస్తున్నాను. hands on work-shop వలె ఇది ఉపయోగపడుతుంది. సభ్యులు మరియు నిర్వాహకులు వారివారి అభిప్రాయాలను తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 08:44, 28 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు, మూడవ ఆదివారం అయితే నేను బెంగుళూరు నుండి వీలైతే స్కైప్ లేక జీటాక్ ద్వారా పాల్గొనగలను. త్వరలో మీ ప్రయత్నం ఫలించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:16, 28 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
భాస్కరనాయుడు గారు ఈ సమావేశానికి హాజరు అయితే బాగుంటుంది. ఆయన హైదరాబాదులోనే ఉంటారని అనుకుంటున్నాను. ఆయన బొమ్మలు అప్లోడ్ చెయ్యటం వంటి విషయాలను నేరుగా తెలుసుకుంటే ఆయన పనిలో చక్కగా ముందుకు సాగవచ్చని అనుకుంటున్నను.t.sujatha 16:09, 28 మార్చి 2012 (UTC)
మీ విలువైన అభిప్రాయలను అందించినందుకు ధన్యవాదాలు. ఈ వచ్చే ఆదివారం నుండి నెలవారీ సమావేశాల్ని ప్రారంభిస్తున్నాను. సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 07:19, 9 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఏప్రిల్ నెలవారీ సమావేశం మే నెలలో జరుగుతుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 14:48, 13 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమానియా[మార్చు]

నాకు వికీమానియా 2012 లో పాల్గొనడానికి స్కాలర్షిప్పు లభించినది. నా కృషిలో తోడ్పడినవారు అందరికీ నా హార్థిక ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:10, 21 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు అభినందనలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:51, 21 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ ! స్కాలర్షిప్ లభించిన తరుణంలో నా హృదయ పూర్వ అభినందనలు అందజేస్తున్నాను. t.sujatha 13:40, 21 ఏప్రిల్ 2012 (UTC)
శుభం. మీకీ అవకాశం వికీ ప్రపంచం గురించి మరింత తెలుసుకోవటానికి, తద్వారా తెవికీ అభ్యున్నతికి దోహదపడుతుందని అశిస్తూ..--అర్జున (చర్చ) 08:58, 26 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

దినపలితాలు[మార్చు]

ప్రతి రొజు తిధి వార నక్ష్త్రత్రలు మరియూ దిన పలితలు ఈవ్వగలరు

ఆ సమాచారం ఎవరో ఒకరు రాస్తే అలాగే చేయవచ్చు.--అర్జున (చర్చ) 01:23, 11 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో టైపింగు వద్ధతి మార్పు![మార్చు]

తెవికీ 2012 లక్ష్యాలలో తెలుగు టైపింగ్ పద్ధతుల స్థిరీకరణ (అన్ని వికీ ప్రాజెక్టులలో) అన్నది ఒకటి. దీని సాధనకై నారాయం అనే పొడగింతకు తెలుగు టైపింగు పద్ధతులను చేర్చి దాన్ని (అన్ని వికీ తెలుగు ప్రాజెక్టులలోనూ) ఉపయోగం లోనికి తీసుకురావాలి. దీనిలో భాగంగా మూణ్ణెళ్ళ క్రితం టైపింగు పద్ధతులని చేర్చి పరీక్షించాం కూడా. ప్రస్తుతం:

  1. కొన్ని రోజుల క్రితం కొత్త టైపింగు పద్ధతులను తెవికీలో క్రియాశీలం చేసారు. [1]
  2. తెవికీలో ఇప్పటివరకూ ఉన్న అప్రమేయ టైపింగు పద్ధతిని నేను అశక్తం చేసాను. [2]

తెవికీలో తెలుగులో టైపు చెయ్యడానికి ఇక నుండి నారాయంను ఉపయోగించుకోవచ్చు.

ఎడిట్ బాక్సు, విషయం/శీర్షిక/వ్యాఖ్య ఇచ్చేచోట, వెతుకుడు పెట్టెలోనూ ఇప్పుడు తెలుగులో టైపు చెయ్యవచ్చు. అందుకు Ctrl + M అన్న కీబోర్డు సంయోగాన్ని ఉపయోగించవచ్చు. తెలుగు మరియు ఇంగ్లీషుల మధ్య మారడానికి కూడా ఇదే సంయోగాన్ని ఉపయోగించవచ్చు.

దీనిలో లిప్యంతరీకరణ మాత్రమే కాక ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటు కూడా ఉంది. ఈ కొత్త టైపింగు పరికరం లేదా దానిలోని టైపింగు పద్ధతిపై సందేహాలుంటే తప్పక అడగండి.

వీవెన్ (చర్చ) 08:03, 2 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీలో మార్పులు[మార్చు]

విక్షనరీలో పదస్వరూపంలో మార్పుల చర్చ జరుగుతున్నది. వికీపీడియన్లందరు దానిలో పాల్గొని విక్షనరీ అభివృద్ధికి తోడ్పడండి.--అర్జున (చర్చ) 10:45, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీలో మొదటి పుట, మూల స్వరూపము, కొత్తగా నేటి పదం శీర్షిక, మరికొన్ని మార్పులు మొదలయినవి. తప్పక అందరి సలహా సూచనలు వీలయినంత త్వరలో తప్పక తెలియ పరచగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:43, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవారం బొమ్మ కు సహాయం[మార్చు]

ఈవారం బొమ్మ పరిగణనలు లో బొమ్మల సంఖ్య తగ్గిపోయినవది. తెవికీ వ్యాసాలలోని ప్రాధాన్యత గల బొమ్మలను గుర్తించి వాటి చర్చాపేజీలలో {{ఈవారం బొమ్మ పరిగణన}} చేర్చి ఈ వారం బొమ్మ నిరాటంకంగా వచ్చేటందులకు సహాయంచేయండి. మరింత సమాచారానికి వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు చూడండి.--అర్జున (చర్చ) 10:56, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా వ్యాసములు[మార్చు]

తెలుగు వికీపీడియాలో 50,171 వ్యాసాలున్నాయి అని మొదటి పుటలో సూచిస్తున్నది. నిజానికి అవి వ్యాసాలా ? లేక పుటలా ? తెలిసిన వారు తెలియజేయగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:46, 11 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అవి వ్యాసాలేనండీ. పుటలు లక్షకు పైగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం పూర్తి గణాంకాలను చూడండి. — వీవెన్ (చర్చ) 14:26, 14 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
సినిమా పుటలు కూడా వ్యాసాలుగా చేరాయి కదండీ ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:02, 14 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది సిర్ఫ్ హమారా[మార్చు]

తేది 20-05-2012 నాటి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం పుస్తకంలో రెండోపేజీ సిర్ఫ్ హమారాలో 4వ అంశంగా ఇవ్వబడిన తూర్పుకమాన్ బొమ్మ మరియు దాదాపు పూర్తి సమాచారం మన మహబూబ్ నగర్ పట్టణం వ్యాసం నుంచే తీసుకోబడినది. అయిననూ తెవికీకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేరు. కొద్దిగా మార్చి వ్రాయాలనుకున్నారో ఏమో కాని "రాయచూరు రహదారిపై నాటి సంస్థానాధీశులు నిర్మించిన మూడు కమాన్లలో" అని వ్రాయడంతో అర్థం మారిపోయింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:10, 27 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద చరితం గల వర్గాలు తొలిగింపు[మార్చు]

ఇటీవల అర్జునరావు గారు, కడప, నెల్లూరు జిల్లాకు చెందిన ఇదివరకే ఉన్న వర్గాలన్నీ తొలిగించి కొత్త పేరుతో ఇచ్చారు. పాత వర్గాలను దారిమార్పు లింకులుగా ఉంచితే సరిపోయేది. ఎందుకంటే దాని అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఒక్కో వర్గానికి పెద్ద చరితమే ఉంది. నెల్లూరు గ్రామ వర్గంలో 30 దిద్దుబాట్లు జరిగాయి. ఎవరికీ ఎలాంటి సందేశం ఇవ్వకుండా ఒక్క క్లిక్కుతో వాటన్నింటినీ తొలిగించడం వల్ల దిద్దుబాట్ల సంఖ్య తొలిగిపోవడమే కాకుండా ఆ వర్గాల దిద్దుబాట్లపై కృషిచేసినవారికి అపహాస్యం చేసినట్లవుతుంది. ఎవరో కొత్తవారు ఏదో తమాషా కొరకు సృష్టించిన వర్గాలు కావుకదా! వైజాసత్య, చదువరి, కాసుబాబు లాంటి మహామహులు ఆ వర్గాలపై పనిచేశారు. వారిప్పుడు చురుకుగా లేరని వారు ఇంతకు క్రితం చేసిన దిద్దుబాట్లను మనం ఇప్పుడు తగ్గించలేము కదా! తొలిగించడం వల్ల కొందరు సరాసరిగా ఇంతకు క్రితం వచ్చినట్లుగా ఆ వర్గాలను చేరుకోడానికి ఇబ్బంది. కాబట్టి తొలిగించిన వర్గాలన్నీ పునరుద్ధరించడం తప్పనిసరి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:57, 29 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాల దారి మార్పు గురించి మార్గదర్శకం en:WP:CMOVE చూడండి. తెలుగు వికీలో వర్గాల సమస్యలు గురించి ఈఉపకరణం అందచేసే వివరాలు చూడండి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా చేయవలసిన మార్పులు ఎంతో శ్రమతో చేస్తున్నాను. అవసరమైన చోట్ల చర్చలు ప్రారంభించాను. దానికి సహకరించండి. ఒకవేళ నేను ఏదైనా మార్పులు చేసినా మీరు చర్చ ప్రారంభించి ఆ తరువాత దాని ఫలితం ప్రకారం ఆ మార్పుని అవసరమైతే సరిదిద్దవచ్చు. అంతే కాని వెంటనే సరిదిద్దటం అనవసరం. తెవికీలో ఏ సభ్యునితోకూడా నాకు వ్యక్తిగత తగాదాలు లేవు. తెవికీ మెరుగుకోసం చేస్తున్న పనులకు దయచేసి సహకరించండి. ఒకవే‌ళ నేను చేసే మార్పులలో ఏదైనా లోటుపాట్లు జరిగితే వాటిని సరిదిద్దండి.
మీరు చేసేదే శ్రమ అనుకుంటే ఎలా? ఇంతకు క్రితం చేసిన వారి శ్రమను గంగలో కలిపేయడమేనా? అన్నీ మీ ఇష్టప్రకారమే చేస్తూ అందరూ మీకు సహకరించాలని చెప్పడం బాగుండదు. మీరు మార్పులు చేసిన తర్వాత మాత్రమే చర్చ ఎందుకు ప్రారంభించాలి? మీరు మార్పు చేయడానికి ముందు చర్చ అవసరం లేదా? అంతే కాకుండా ప్రతీదానికి ఆంగ్లవికీ నియమాలు చూపించే అవసరం లేదు. తొలిగించిన వర్గాలన్నీ నేను పునరుద్ధరిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:36, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారు, మీరు నేను చేసిన పనికి నిరాధారమైన దురుద్దేశాలను ఆపాదిస్తున్నారు. ప్రతీచిన్నమార్పుకు అందరితో చర్చించాలన్న నియమం తెవికీ లోలేదే. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టుల వ్యాసాల మార్పులు గురించి ముందు సూచనం ఇవ్వటం జరిగింది. దానిలో సభ్యుడైవుండి కూడా మీనుండి ప్రాజెక్టు ప్రారంభమైన మొదటిరోజులలో తప్ప స్పందన రాలేదు. తెలుగులోకూడా ఎప్పుడో అనువాదం చేసిన అలాంటి మార్గదర్శమే వుంది. దానికి నేను ఇటీవల స్వల్ప మార్పులు చేశాను కాబట్టి, ఇంగ్లీషు మూలం ఇచ్చాను. మీడియావికీ సాఫ్ట్ వేర్ అన్ని వికీలకు ఒకటే కాబట్టి, ఇటువంటి సాంకేతిక విషయాలకు సంబందించి, విధానాలు భాషని బట్టి మారవు. మీరు ఎటూ ఈ విషయమై చర్చప్రారంభించారు కాబట్టి, ఇతర నిర్వాహకులు స్పందించటానికి ఒక వారం అవకాశం ఇద్దాం. ఆ తరువాత నేను చేసిన మార్పులు అనవసరం అని నిర్ణయించితే తొలగించటం చేయవచ్చు. నా వలన జరిగినవాటిని సరిదిద్దాలంటే, మీకు శ్రమలేకుండా దీనిపై నిర్ణయం తీసుకున్నాక నేనే చేస్తాను.ఆ విధంగా, మీ శ్రమకూడా తెవికీని మెరుగపరచటానికి సద్వినియోగపడుతుంది. ఆలోచించండి. ఇతర సభ్యులకు ,నిర్వాహకులకు మఖ్యమై న ఈ విషయమై 6 జూన్ 2012 లో స్పందించమని మనవి. ధన్యవాదాలు అర్జున --అర్జున (చర్చ) 17:52, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నేను మీపై దురుద్దేశాలను ఆపాదించడం ఏమీలేదు. ఇక్కడి పరిణామాలు అందరూ చూస్తున్నారు. గత కొన్ని మాసాల నుంచి మీరు అన్నీ మీ ఇష్టప్రకారమే చేస్తున్నారు. మీరు చేసిన పిదప తిరిగి మార్పులు చేయాలంటే చర్చ అవసరం అంటున్నారు. ఎవరూ ఏమీ చేసిననూ పొరపాట్లు తెలపకుండా ఉండాలంటే అది నిర్వహణ ఎలా అవుతుంది. నేను ఇక్కడ చర్చ తీయలేను మీ అనవసర మార్పులు వెనక్కి తెస్తానని తెలియజేశానంతే. మీరే కొత్తగా చర్చ లేవదీశారు. ప్రతీదానికి చర్చలు అవసరం లేదు కాని అధికమార్పులు చేసిన అధిక వర్గాలను తొలిగించడం మాత్రం భావ్యం కాదు. వాటిని తొలిగించే అవసరం కూడా లేదు. కడప, నెల్లూరు జిల్లాల పేర్లు ఇప్పటికీ తరచుగా వాడుతుంటారు. అలాంటప్పుడు వాటిని దారిమార్పుల్లా ఉంచితే తప్పేమిటి? నేను ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రాజెక్టులో సభ్యుడినే కాని మీ ఏకపక్ష వైఖరికి నిరసనగా కొంతకాలం నుంచి ఆ ప్రాజెక్టుపనిలో పనిచేయడం లేదు కాబట్టే ఆ విషయంపై నేను స్పందించడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:01, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నా ఉద్దేశంలో పేరు మారిన వర్గాలను ఉంచడం అనవసరం. ఎందుకంటే—
  1. సందర్శకులు వర్గాలను నేరుగా సందర్శించరు లేదా ఆ అవకాశం చాలా తక్కువ (వ్యాసం ఎలాగూ సరైన వర్గంలోనే ఉంటుంది కదా, ఇది ఆ అవసరాల్ని తీరుస్తుంది.)
  2. ఎవరైనా పొరపాటున గానీ లేదా తెలియక పాత వర్గంలో కూడా పేజీలను చేర్చే అవకాశం ఉంది. (ఆ వర్గం ఇక చెల్లని వర్గం అని చెప్పే అవకాశం లేదు.)
  3. వర్గాలకు దారిమార్పులు చేసినపుడు (సరిగా చేయకపోతే) పాతవర్గం కొత్త వర్గంలో ఉపవర్గంగా చేరుతుంది. ఉదాహరణకు, వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు వర్గంలో కడప జిల్లా గ్రామాలు అన్న ఉపవర్గం ఎందుకు ఉంది?
మీడియావికీ ఉపకరణంలో పాతవర్గాలను మరియు వర్గాల దారిమార్పులను సరిగా సంభాళించే సౌలభ్యం వచ్చే వరకూ, పాత (పేరు మారిన) వర్గాలను తొలగించడమే మంచిది. — వీవెన్ (చర్చ) 09:37, 31 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గాలు పేరు మారిననూ ఇంకనూ ప్రజల్లో కొత్త పేర్లపైన పట్టు రాలేదు. వాడులలొ పాతపేర్లే ఉన్నాయి. కాబట్టి పాత వర్గాల పేర్లతోనే చూడడానికి ప్రయత్నిస్తారు. వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు వర్గంలో పాత వర్గం ఉపవర్గంగా తప్పుగాఆ చేరడాన్ని సవరించాను. పాత వర్గాలను తొలిగించినా డేటాబేస్ మారదు. అది మళ్ళీ పునరుద్దరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో తొలిగించినా ప్రయోజనం ఏమీలేదు. పాత వర్గాల వల్ల కొందరికైనా సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ మనం సౌలభ్యం గురించే ఆలోచించాలి. అలా అనుకుంటే కొన్ని వ్యాసాలకు గంపెడు దారిమార్పులెందుకు? తెవికీలో పాఠకుల దృష్ట్యా కొత్త సౌలభ్యాలు ఏర్పర్చాలి కాని ఉన్న వాటిని తొలిగిస్తూపోతే ఎలా? తెవికీ నాణ్యతను పెంచడానికి ఎన్నోదారులున్ననూ ఉన్న ప్రయోజనాలను ఒక్కొక్కటిగా తొలిగిస్తూ పోవడానికి కారణం తెలియడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:49, 31 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ అనే భవన నిర్మాణంలో అందరూ సమానులే కాని ఏ ఒక్కరో నేను చెప్పినట్లు వినాలి, అందరూ నాకు మద్దతు పలకాలి అంటే కుదరదు. ఒకరు మేస్త్రీ అవతారం ఎత్తి మిగితా వారిని కూలీలుగా పరిగణిస్తూ సహకరించాలనడం సరికాదు. ఎవరికి ఇష్టమైన రంగాలలో వారు కృషిచేయవచ్చుననే సంగతిని గమనిస్తే బాగుంటుంది. ఇక్కడ చురుకుగా ఉన్నవారు దాదాపు అందరూ నిర్వాహకులే. వారందరికీ వ్యక్తిత్వం ఉన్న సంగతిని గుర్తించుకోవాలి. ఎవరిపైనా ఒత్తిడి చేసే అవసరం లేదు. అదే సమయంలో పెద్ద మార్పులు చేయడానికి ముందే సభ్యుల నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకరు మార్పులు చేసినపిదప యధాస్థితికి తీసుకురావడానికి మాత్రమే చర్చ అంటే మిగితా సభ్యులను నిర్లక్ష్యపర్చినట్లే. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:55, 31 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]


ఒకప్పుడు వికీపీడియాలో సభ్యుల మద్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. సభ్యులు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సంయమనంతో పనిచేసేవారు. అలా చేయడం వలనే తెవికీ ఇంత అభివృద్ధి సాధించింది. కాని క్రమంగా అవాంచితమైన చర్చలు పొడిగంచబడి వాటి కారణంగా తెవికీ అభివృద్ధి బాగా వెనుకబడింది. విలువైన

సభ్యులు తెవికీకి దూరం అయ్యారు. చర్చలు తీవ్రరూపం దాల్చినప్పుడు దాని నుండి దూరంగా ఉంటే నిదానంగా అనవి సమసి పోతాయి. ఇప్పుడు చంద్రకాంత రావు గారు, అర్జునరావుగారు తెవికిలోఉన్న సభ్యులలోఅత్యంత విలువైన సభ్యులు అలాగే క్రియాశీలకంగా కూడా ఉన్నారు. వీరిద్దరి సేవ తెవికీని అభివృద్ధి పధంలోకి తీసుకు పోగలదని నా భావన. నాకు వీరిద్దరి మీద గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ తీవ్రతర చర్చలు తెవికీ అభివృద్ది బలహీన పరుస్తాయి అన్నది నా అభిప్రాయం. ఇప్టటి వరకు సాగిన చ్చలకు ముగింపు పలికి మనకు ఆసక్తి కలిగిన పనులలో మనం ముందుకు పాదాం. తిరిగి పాతరోజులలో చేసినట్లు స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచుకుని పని చేద్దాం.

  1. ఆధునికీకరణలో భాగంగా తెవికిలో జరిగిన మార్పులలో వర్గాలు కూడా ఒక భాగమని నా అభిప్రాయం. ఏరంగంలో అయినా ఆధునికీకరణ జరిగినప్పుడే అది రాణిస్తుంది. వైజాత్య, చదువరి, కాసుబాబు వంటి వారి మీద నాకు ఎనలేని అభిమానం ఉంది. వారు తెవికీకి చేసిన కృషి అలాంటిది. ఇప్పుడు జరిగిన మార్పులు వారి మీద అగౌరవ పరిచేవి కాదు. వారుటే వారి అనపమతిలో నిర్ణయాలు తీసుకోవచ్చు కాని ఇప్పుడు వారు క్రియాశీలకంగా లేరు కదా.
  2. చంద్రకాంత రావుగారు వందకు పైగా పెద్ద వ్యాసాలు వ్రాసేన వారు. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. వీరు ఆర్ధిక రంగం క్రీడలు వంటి వ్యాసాలు చాలా బాగా అభి వృద్ధి చేసారు. వీరి నుడి ఇలాంటి వ్యాసాలు మరెన్నింటినో ఎదురు చూస్తున్నాను.
  3. అర్జునరావు గారు తెవికిలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు. వీరు తెవికి సభ్యులలో నూతన ఉత్సాహం కలిగించారు. అవిశ్రాంతంగా తెవికిలో ఏకధాటిన కృషి చేస్తున్నారు.
  4. మనమంతా కలసి కట్టుగా పని చాద్దాం తెవికిని మరింత మెరుగుపరుస్తాం. తెలుగు మీద మన అభిమానం చాటుదాం. నేను చెప్పిన విషయం ఎవరి మనసునానైనా

నొప్పిస్తే దయచేసి మన్నించండి. --t.sujatha (చర్చ) 07:24, 2 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందించిన వీవెన్, సుజాత, చంద్రకాంతరావు గార్లకు ధన్యవాదాలు. నిర్వహణలో బేదాభిప్రాయాలు సహజం. వాటిని చర్చించి పరిష్కరించుకంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తెవికీ కృషి చేసినవారందరిపైనా నాకు పూర్తి గౌరవభావమే. ఒక నిర్వాహకుడు మార్పులు చేసినప్పుడు ( మార్పులు చేయాలా చేయకూడదా అని నిర్దిష్టమైన సూచనలు లేనప్పుడు), వాటిని రద్దుచేయక చర్చించి అవసరమైతే రద్దుచేస్తే తోటి నిర్వాహకునిపనిపై గౌరవభావంచూపినట్లవుతుందని నా ఆలోచన. ఇంకా ఈ చర్చ విషయం విధానానికి సంబంధించినది. వ్యాసాలకు దారిమార్పు పెట్టవచ్చని, వర్గాలకు దారిమార్పు పెట్టవద్దని విధానాలలో వుంది. నిర్వాహకులేవిధానాలు పాటించకపోతే, మిగతా సభ్యుల తప్పులను ఎత్తిచూపే నైతిక హక్కు కోల్పోతాము. నాచర్యలు చంద్రకాంతరావుగారికి అపార్థంకలిగించినట్లు కొంతకాలంనుండి వారి వ్యాఖ్యలద్వారా నాకుఅనిపిస్తున్నది. నాకు తెలిసిన విషయాలు, నాకుగల నైపుణ్యాల తో తెవికీ అభివృద్ధికి కృషి చేద్దామన్న ఆలోచన, పని తప్ప ఎవరికి కష్టం కలిగించాలని, అగౌరవ పరచాలన్న వుద్దేశం ఏ మాత్రము లేదు. ఇక ఏకారణాలవలనైనా (ముఖాముఖి లేక ఫోన్ లేక వ్యక్తిగత ఛాట్లో మాట్లాడుకోలేక పోవటంవలన...), ఎవరికైనా వేరే అభిప్రాయాలు కల్గినట్లయితే అలా జరిగినందులకు నా క్షమాపణలు . అందరి కృషితో తెవికీ అభివృద్ధి జరగాలని నా కోరిక.--అర్జున (చర్చ) 12:52, 7 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గాలకు దారి మార్పులు ఏ కారణంతో పెట్టాల్సి వచ్చిందో తెలిసి కూడా విధానాలు గురించి మాట్లాడటం బాగుండదు. అసలు ఆ వర్గాల పేర్లను మార్పుచేసే అవసరం అంతగా లేదు కూడా. వాటిని అలా ఉంచిననూ వ్యాసాలను చేరుకోవడానికి ఇబ్బంది ఏమీ లేకుండేది. అందుచేతనే ఇంతవరకు వాటిజోలికి ఎవరూ వెళ్ళలేరు. వర్గాలపై కృషిచేయాలనుకున్ననూ ఇప్పటికీ చేయాల్సింది చాలా ఉంది. తెగిపోయిన వర్గాలే కాకుండా అసలు ప్రారంభం కాని వర్గాలే వందలాదిగా ఉన్నాయి. కొన్నివ్యాసాలలో పూర్తిగా ఎర్రలింకు వర్గాలే ఉన్నాయి, ఇంకొన్ని వ్యాసాలలో అసలు వర్గాలే ఇవ్వలేరు. ఇదివరకు నేను చాలా వాటికి వర్గాలను చేర్చాను/సరిచేశాను. అంతేకాకుండా తెవికీ సదుద్దేశంతో రచనలు చేసిన వారి దిద్దుబాట్లను సాధ్యమైనంతవరకు తగ్గించడానికి ప్రయత్నించకుండా ఉంటే బాగుంటుంది. వైజాసత్య గారు కొన్ని వ్యాసాలను విలీనం చేసినప్పుడు చరితంను కూడా కాపిచేసి కొత్త వ్యాసం చర్చాపేజీలో ఉంచిన విషయం నాకు బాగా తెలుసు. తెవికీలో ఎవరైననూ తమదైన ముద్ర వేయాలనుకున్ననూ కొత్త వాటికి దాన్ని వర్తింపజేయాలి కాని ఉన్న వాటిని తొలిగిస్తూ పోతే బాగుండదు. ఇదివరకు తెవికీపై కృషిచేసిన వారి రచనలు ఇప్పుడు తొలిగిస్తే ఇప్పుటి రచనలు ఇకముందూ తొలిగించే ప్రమాదమూ ఉంది. కాబట్టి మరోసారి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే తొలిగించే రచనలు మరీ అంత అవసరం అయితే తప్ప తొలిగింపునకు గురికాకూడదు. ఇక్కడ పనిచేసేవారందరూ తెవికీ అభివృద్ధికే కృషిచేస్తున్నారు. ప్రతివ్యక్తికి కల విషయాలలో, నైపుణ్యాలలో తేడా ఉంటుంది. అందువల్ల కేవలం మనకు తోచిన విషయం, నైపుణ్యం ఆధారంగా మాత్రమే పనిచేస్తే కొన్నిసార్లు ఇతర సభ్యులతో తేడాలు రావచ్చు, కాబట్టి ఇతర సభ్యుల గురించి, ఇదివరకు రచనలు చేసిన వారి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎవరికీ కష్టం, నష్టం కలిగించాలని ఉండదు, అదేసమయంలో వారు కూడా ఇతరుల నుంచి కష్టం, నష్టం రాకూడదనే కోరుకుంటారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:04, 9 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్స్ నిర్వాహకత్వానికి ఆహ్వానం[మార్చు]

ఇటీవల, తెలుగు వికీసోర్స్ సహాయమై ఓ సభ్యుడు సంప్రదించగా నేను తెవికీసోర్స్ ని పరిశీలించడం జరిగింది. బొమ్మలుగా గ్రహించిన పుస్తకపు పుటలలోని పాఠ్యాన్ని టైపు చేయడానికి తగిన పొడిగింత లేదు. ఫౌండేషన్ సలహాదారు షిజూతో పొడిగింతని సరిగా అమర్చే ప్రయత్నం చేశాను. దానికి సంబంధించిన మూసలను స్థానికీకరించి పనిచేసేటట్లు చేయడానికి తెలుగు తెలిసిన నిర్వాహకుని అవసరం వుంది. తెలుగు వికీ సోర్స్ పై మరియు నిర్వాహకత్వం ఆసక్త కలిగిన తెవికీ సభ్యులు రెండూ మూడు రోజులలో స్పందించవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 08:45, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పై విషయము నాకు అర్థము కాలేదు. వివరించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:41, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
పై న ఇచ్చిన తెలుగు వికీ లింకు ని, ఇంగ్లీషు వికీ సోర్స్ ని పాల్చిచూస్తే తెవికీలో స్కాన్ చేసిన పుస్తకాలు పాఠ్యరూపంలో టైపు చేయడానికి దానిని మూలంతో సరిపోలిందని ధృవీకరించడానికి కావలసిన Proofread Extension సరిగా పనిచేసేటట్లు చేయాలి. అందుకొరకు సహకరించే సభ్యునికి నిర్వాహక హోదా వుండాలి. ఇంకేదైనా సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 17:55, 30 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు ఏమీ అర్థం కావడము లేదు. అందుకని ఇంక ఏమని అడగినా అర్థం కాదు.--జె.వి.ఆర్.కె.ప్రసాద్
నేను ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాను. --t.sujatha (చర్చ) 13:14, 1 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
Proofread Extension ఇంగ్లీషువికీ మరియు షిజూ సహకారంతో పనిచేయించటంలో విజయవంతమయ్యాము. ఉదాహరణకు Wikisource:te:మొల్ల_రామాయణం చూడండి. దీనిలో అచ్చుతప్పులు దిద్దటానికి సమిష్టిగా కృషిజరగాలి. అలాగే పాత పుస్తకాల స్కాన్ (బొమ్మల)నుండి పాఠ్యీకరించడంలో ఆసక్తిగలవారు తెవికీసోర్స్ లో పని ప్రారంభించవచ్చు.--అర్జున (చర్చ) 12:14, 7 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Update on IPv6[మార్చు]

(Apologies if this message isn't in your language. Please consider translating it, as well as the full version of this announcement on Meta)

The Wikimedia Foundation is planning to do limited testing of IPv6 on June 2-3. If there are not too many problems, we may fully enable IPv6 on World IPv6 day (June 6), and keep it enabled.

What this means for your project:

  • At least on June 2-3, 2012, you may see a small number of edits from IPv6 addresses, which are in the form "2001:0db8:85a3:0000:0000:8a2e:0370:7334". See e.g. w:en:IPv6 address. These addresses should behave like any other IP address: You can leave messages on their talk pages; you can track their contributions; you can block them. (See the full version of this announcement for notes on range blocks.)
  • In the mid term, some user scripts and tools will need to be adapted for IPv6.
  • We suspect that IPv6 usage is going to be very low initially, meaning that abuse should be manageable, and we will assist in the monitoring of the situation.

Read the full version of this announcement on how to test the behavior of IPv6 with various tools and how to leave bug reports, and to find a fuller analysis of the implications of the IPv6 migration.

--Erik Möller, VP of Engineering and Product Development, Wikimedia Foundation 01:26, 2 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

2011 Picture of the Year competition[మార్చు]

македонскиnorskpolski

Dear Wikimedians,

Wikimedia Commons is happy to announce that the 2011 Picture of the Year competition is now open. We are interested in your opinion as to which images qualify to be the Picture of the Year 2011. Any user registered at Commons or a Wikimedia wiki SUL-related to Commons with more than 75 edits before 1 April 2012 (UTC) is welcome to vote and, of course everyone is welcome to view!

Detailed information about the contest can be found at the introductory page.

About 600 of the best of Wikimedia Common's photos, animations, movies and graphics were chosen –by the international Wikimedia Commons community– out of 12 million files during 2011 and are now called Featured Pictures.

From professional animal and plant shots to breathtaking panoramas and skylines, restorations of historically relevant images, images portraying the world's best architecture, maps, emblems, diagrams created with the most modern technology, and impressive human portraits, Commons Features Pictures of all flavors.

For your convenience, we have sorted the images into topic categories.

We regret that you receive this message in English; we intended to use banners to notify you in your native language but there was both, human and technical resistance.

See you on Commons! --Picture of the Year 2011 Committee 18:41, 5 జూన్ 2012 (UTC)

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)