వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 80
← పాత చర్చ 79 | పాత చర్చ 80 | పాత చర్చ 81 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2021 మార్చి 1 - 2021 ఏప్రిల్ 30
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు
[మార్చు]వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.
రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది మార్చి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. దయచేసి సభ్యులందరు రావాల్సినదిగా కోరుతున్నాను. --KCVelaga (WMF) (చర్చ) 11:07, 1 మార్చి 2021 (UTC)
- చిన్న మార్పు : మీరు ఆన్లైన్ సమావేశం ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది అని పెట్టారు. నెను ఈ తేదీ 06-March-2021 అని భావిస్తున్నాను. ఒకసారి గమనించి మార్పు చేయగలరు. --Prasharma681 (చర్చ) 16:31, 1 మార్చి 2021 (UTC)
- @Prasharma681: అవును, ధన్యవాదములు. --KCVelaga (WMF) (చర్చ) 08:23, 2 మార్చి 2021 (UTC)
Wikifunctions logo contest
[మార్చు]01:47, 2 మార్చి 2021 (UTC)
వికీ క్లబ్ ఏర్పాటుకు ప్రతిపాదన - తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు
[మార్చు]నమస్కారం ,
ఇండిక్ వికీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొన్ని విద్యాసంస్థలలో వికీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము, ఈ క్లబ్ లు ఆ విద్యాసంస్థ లో విద్యార్థులకు , అధ్యాపకులకు, ఆ విద్యాసంస్థ ఖ్యాతిని పెంచటంలో చుట్టుపక్కల ఉన్న తెలుగు ఔత్సాహికులకు, ఇతర విద్యార్థులకు ఒక హబ్ గా తోడ్పడతాయి, ఇందులో ఆయా ప్రాంతాల్లో ఉన్న వికీపీడియన్లు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు వీరి సూచనలు, ఆయా సభ్యులు ఆశక్తుల ఆధారంగా ప్రతి క్లబ్ లు ఒక లక్ష్యం దిశగా స్వయం ప్రతిపత్తి తో నడుస్తాయి. ఇది దీర్ఘ కాల ప్రణాళిక ఇందులో అధ్యాపకులు, భాషా ప్రేమికులు, స్థానిక వికీపిడియన్లు , ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల ప్రతినిధులు, ఆ ప్రాంత ప్రముఖులు నిర్దేశికులు గా ఉంటారు, సాంకేతిక సహకారం, ఐఐఐటి హైదరాబాద్ అందిస్తుంది, ఈ క్లబ్ లు మాతృభాష లో ఆసక్తి పెంచేందుకు, స్థానికీకరణ , ఉపకరణాలు డెవలప్ చేసేందుకు తద్వారా వారు మరిన్ని ఉపాధి అవకాశాలు పొందేందుకు , వారి భాషా సామర్థ్యం , సమిష్టి గా స్వచ్చందంగా పనిచేయటం వంటి అంశాలకు దోహదం పడతాయి. ఇలాంటి క్లబ్ ల వలన విద్యార్ధులు తమ చదువులు పూర్తి చేసినా కొత్తగా చేరిన విద్యార్థులు వికీ క్లబ్ లో సభ్యులు గా చేరుతారు ఆ క్లబ్ ప్రాజెక్టు లకు కొనసాగిస్తారు, వికీ-క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థులకు వారి తెలుగు డిజిటల్ అక్షరాస్యత నైపుణ్యాలు పెంపుదల చేయటానికి, తెలుగు వికీ వాడుకను ని ప్రోత్సహించడానికి, వ్యాసాలకు రాయటానికి తగిన శిక్షణ ఇవ్వటానికి, వికీ డేటా , వికీ సోర్స్ వివిధ వికీమీడియా ప్రాజెక్టుల పరిచయం , అమలు, శిక్షణ ద్వారా విద్యార్ధులను, అధ్యాపకులను భాగస్వామ్యం చేయటం , పోటీలు , ఎడిట్ థాన్ లు , మొదలైనవి ఇందులో భాగంగా చేపడుతున్నాము. ఈ ప్రాజెక్ట్ అభ్యున్నతికి తగు సూచనలు , ప్రాజెక్టు చర్చా పేజీ లో గానీ , ఇక్కడ అయినా తెలియచేయగలరు ,అందరి సూచనలను పరిగణలోకి తీసుకొని తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు లో ఉప పేజీని ప్రారంభించడం జరుగుతుంది. ఈలోగా దయచేసి తెలుగు వికీపీడియన్లు ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు తెవికీ-ఐఐఐటి బృందం Kasyap (చర్చ) 11:33, 7 మార్చి 2021 (UTC)
- కశ్యప్ గారూ నమస్కారం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్ని వికీ క్లబ్‌లు ఏయే ప్రాంతాల్లో ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారో తెలుసుకోవచ్చా? ఇతమిత్థంగా ఇన్ని అని ఖచ్చితమైన సంఖ్య మీరు చెప్పలేకపోవచ్చు (కళాశాలలతో ముడిపడివున్న విషయం కనుక) కానీ స్థూలంగా ఈ ఆరునెలల్లో దాదాపు ఇన్ని చేద్దామని ప్రణాళిక, ఆపైన ఆరునెలల్లో ఇన్ని చేద్దామని ప్రణాళిక అన్న ఒక స్థూలమైన ఐడియా చెప్పగలరా? అలాగే ప్రాంతాలు కూడా ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించనున్నారా లేదంటే అన్ని ప్రాంతాల్లో ఒకేసారి చేయదలిచారా? ఇలాంటి స్పష్టత ఇవ్వగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 15:45, 7 మార్చి 2021 (UTC)
- కశ్యప్ గారూ నమస్కారం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్ని వికీ క్లబ్‌లు ఏయే ప్రాంతాల్లో ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారో తెలుసుకోవచ్చా? ఇతమిత్థంగా ఇన్ని అని ఖచ్చితమైన సంఖ్య మీరు చెప్పలేకపోవచ్చు (కళాశాలలతో ముడిపడివున్న విషయం కనుక) కానీ స్థూలంగా ఈ ఆరునెలల్లో దాదాపు ఇన్ని చేద్దామని ప్రణాళిక, ఆపైన ఆరునెలల్లో ఇన్ని చేద్దామని ప్రణాళిక అన్న ఒక స్థూలమైన ఐడియా చెప్పగలరా? అలాగే ప్రాంతాలు కూడా ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించనున్నారా లేదంటే అన్ని ప్రాంతాల్లో ఒకేసారి చేయదలిచారా? ఇలాంటి స్పష్టత ఇవ్వగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 15:45, 7 మార్చి 2021 (UTC)
- పవన్ సంతోష్ గారు మీ స్పందనకు ధన్యవాదములు, మొదటి ఆరునెలల్లో తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాంతాలల్లో, పేరెన్నికగన్న కళాశాలలో కనీసం పది వికీ క్లబ్‌లు లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కలదు, ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి వాటి ఫలితాల ఆధారంగా విస్తరిస్తాము, మన సభ్యుల దృష్టిలో ఏవైనా కళాశాలు ఉంటే మాకు తెలియచేయగలరు, ఈ క్లబ్ లు స్వచ్ఛందంగా, స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి వీటిలో భావ సారూప్యం ఉన్న సంస్థలు , వ్యక్తులు అనుసంధానం కావచ్చు. ఏమైనా నిర్వాహక సూచనలు, సాంకేతిక సహకారం వంటివి ఐఐఐటి హైదరాబాద్ అందిస్తుంది. అందరి సూచనలతో, తోర్పాటుతో ఈ ప్రణాళికకు త్వరలో మరింత స్పష్టత ఇవ్వగలము. -- Kasyap (చర్చ) 07:14, 8 మార్చి 2021 (UTC)
ఈ విషయంపై నా సూచనలు:
- క్లబ్‌లు నడవడం అంటే ఏమిటి? దీనిలో ఐఐఐటీ వారు, వికీపీడియన్లు ఏమేం చేస్తారు? కార్యకలాపాలు ఏముంటాయి? మొదలుకొని పూర్తి ప్రణాళికను చేర్చమని సూచిస్తున్నాను. తద్వారా వికీపీడియన్లు తాము ఎక్కడ ఫిట్ అవుతామో సరళంగా అర్థం చేసుకోగలరు. లేదంటే సూచనలు ఉన్నా స్పష్టంగా చెప్పగలరు. అలానే, ఇది పత్రికలకు, బయటివారికి అనౌన్స్ చేసేముందే ఈ ప్రణాళిక తెలుగు వికీపీడియాలో పెడతారనే భావిస్తున్నాను.
- ప్రయోగాత్మకంగా ప్రారంభించేప్పుడు పది కూడా ఎక్కువే. ఐదుకు లోపు ఉండేలా చూసుకోవడం మంచిది. అలానే, ఆ కళాశాలల్లో వైవిధ్యం ఉండేలా చూడాలి. ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉంటే, మరొకటి డిగ్రీ కళాశాల, ఇంకొకటి భాషతో సంబంధం ఉన్న కళాశాల, అలానే ఒకటి నగరాల్లో ఉండేదైతే, మరొకటి కాస్త పట్టణాల్లో, ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో. దీనివల్ల లాభమేమిటి అంటే రేపన్న రోజున ఈ ప్రణాళికను స్కేల్ అప్ చేయాలన్న ఆలోచన ఉంటే గనుక మంచి మోడల్ మన వద్ద ఉంటుంది. కళాశాలలేమీ ఎగబడిపోవు కదా, ఉన్నవాటి నుంచే ఎంపిక చేసుకోవాలి అని మీరనవచ్చు. ఐనప్పటికీ మన లక్ష్యం ప్రయోగించి చూడడం అన్నప్పుడు సరైన శాంపిల్‌గా ఈ కళాశాలలు ఉండడం మంచిది.
- సామాన్యంగా మనం అందరం కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం ఉత్సాహంతో వికీ క్లబ్ విషయమై ముందుకు వస్తే వారితో మాట్లాడి ఏర్పాటుచేస్తాం. ఇదివరకూ ఇలానే చేశాం మేము. కానీ, అవేమీ సత్ఫలితాలను ఇవ్వవని దాదాపు ఏడెనిమిది సంవత్సరాల భారతీయ వికీపీడియా విద్యా కార్యక్రమాలు తేల్చాయి. మరి ఏవి సత్ఫలితాలను ఇస్తాయి అంటే విద్యార్థుల్లో ఉత్సాహపరులైన వారు ముందుకు వచ్చి, కళాశాల సహకరించే విధంగా ఉన్నప్పుడు, వికీపీడియన్లు-విద్యార్థుల భాగస్వామ్యాన్ని కళాశాల మద్దతునిచ్చే స్థాయిలో తటస్థంగా ఉండిపోతే సత్ఫలితాలను ఇస్తాయి. ఇది కష్టం. కానీ ఇదే ఫలితాన్నిస్తుంది. మన వయసులో మనకెవ్వరికీ అలాంటి ఉత్సాహభరితమైన విద్యార్థులతో ప్రత్యక్ష పరిచయం ఉండే వీలు తక్కువ. కానీ, అదే మార్గం. దానికై అన్వేషించాలి.
- ఈ కార్యక్రమం లక్ష్యాలు ఏమిటన్నది వివరించండి. దీని టార్గెట్స్‌లో కంటెంట్ రూపకల్పన ఉంటే ఉపయోగం ఉండదు. అంటే - కొత్తవారిని వికీపీడియన్లను చేసేప్పుడు అంతకన్నా లక్ష్యం ఏముంటుంది, వికీపీడియన్లు చేసేది కంటెంట్ క్రియేషన్ యే కదా అనుకోకండి. కొత్త వ్యక్తిని వికీపీడియన్‌ను చేయాలంటే లక్ష్యం వికీపీడియన్‌ను చేయడమే అయివుండాలి. ఇన్నేసి వ్యాసాలు రాయాలి, ఇంతేసి కంటెంట్ క్రియేట్ చేయాలి అని కూడా అదే ప్రోగ్రామ్‌లో లక్ష్యాలుగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాల వైపుకే చివరకు ప్రోగ్రామ్ పరుగులు తీసి, తద్వారా వికీపీడియన్ అవడం అన్నది పక్కకు పోయి అసలుకు మోసం కావడం అన్నది చర్వితచర్వణంగా మన వికీపీడియా ప్రాజెక్టుల్లో జరుగుతూనే ఉంది. కాబట్టి, లక్ష్యం ఏమిటో కూడా స్పష్టంగా ఉండాలి.ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 10:20, 8 మార్చి 2021 (UTC)
Kasyap గారు, మీరు ఐఐఐటి హైదరాబాదు కేంద్రంగా తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టులో భాగంగా వికీకార్యక్రమాలు సంవత్సరంపైగా నడుపుతున్నారు. వాటిని సవివరంగా సమీక్షించి, మీ కొత్త ప్రణాళిక ప్రాధాన్యాలు తెలియచేస్తే బాగుంటుంది. మీ ప్రాజెక్టుపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మీ స్పందనకూడా సంతృప్తికరంగా లేదు. ఇలా ప్రాజెక్టులు చేస్తే తెవికీకి మీ కార్యక్రమాలు ఏమి ఉపయోగపడవని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 01:39, 9 మార్చి 2021 (UTC)
CIS-A2K Newsletter February 2021
[మార్చు]Hello,
CIS-A2K has published their newsletter for the month of February 2021. The edition includes details about these topics:
- Wikimedia Wikimeet India 2021
- Online Meeting with Punjabi Wikimedians
- Marathi Language Day
- Wikisource Audiobooks workshop
- 2021-22 Proposal Needs Assessment
- CIS-A2K Team changes
- Research Needs Assessment
- Gender gap case study
- International Mother Language Day
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here.
MediaWiki message delivery (చర్చ) 17:24, 8 మార్చి 2021 (UTC)
కొత్త వాడుకరులను నిలుపుకునే ప్రాజెక్టు ప్రతిపాదనపై చర్చ ముగింపు
[మార్చు]వికీపీడియా:కొత్త వాడుకరులను నిలుపుకునే ప్రాజెక్టు ప్రతిపాదనను చర్చకు పెట్టి మూడు వారాలు దాటింది. మరో రెండు రోజుల సమయం ఇచ్చి, 12 వ తేదీన పెద్దలెవరైనా దీనిపై చర్చ ముగించి, నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 09:46, 9 మార్చి 2021 (UTC)
- ఈ చర్చలో నిర్ణయం ప్రకటించవలసినదిగా చర్చలో పాల్గొనని వారిని కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 07:17, 12 మార్చి 2021 (UTC)
- ఈ చర్చలో నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు (మార్చి 15) సాయంత్రం 6 గంటల (భారత సమయం) లోగా ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 05:01, 15 మార్చి 2021 (UTC)
- ఎవరూ నిర్ణయం ప్రకటించనందున నేను ప్రకటించాను. __చదువరి (చర్చ • రచనలు) 16:55, 15 మార్చి 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:36, 19 మార్చి 2021 (UTC)
- ఈ చర్చలో నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు (మార్చి 15) సాయంత్రం 6 గంటల (భారత సమయం) లోగా ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 05:01, 15 మార్చి 2021 (UTC)
మూలాల మూసలో సమస్య
[మార్చు]ఈ రోజు నాకు అన్ని వ్యాసాలలో మూలాల జాబితా మూసలో ఒక దోషం కనిపిస్తుంది. Page మూస:Reflist/styles.css has no content. ఇలా కనిపిస్తూంది. అర్జున గారూ, మీరు కొన్ని మూసలను మార్చడం గమనించాను. వాటి వల్ల ఏదైనా సమస్య వచ్చి ఉండవచ్చు అనుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 06:15, 10 మార్చి 2021 (UTC)
- Page మూస:Reflist/styles.css has no content. అన్ని వ్యాసాలలో ఇలా కొత్తగా కనిపిస్తుంది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 06:46, 10 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర , యర్రా రామారావు గారలకు, ఆంగ్ల వికీనుండి ఇతరులు చేసిన తాజాకరణ క్రియాశీలమైనందున సమస్య ఏర్పడినట్లుంది. నేను పరిష్కరించాను. --అర్జున (చర్చ) 08:38, 10 మార్చి 2021 (UTC)
- సరి చేసినందుకు ధన్యవాదాలు అర్జున గారూ. క్షమించాలి, మీరు చేసిన మార్పుల వల్లనేమో పొరపాటున అనుకున్నాను. రవిచంద్ర (చర్చ) 09:12, 10 మార్చి 2021 (UTC)
- వెంటనే స్పందించి సవరించినందుకు అర్జున గార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:55, 10 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర , యర్రా రామారావు గారలకు, ఇటువంటి సమస్యలు ఏ నిర్వాహకులైనా మూస పేజీలో దోషమని తెలుపుతున్న పేజీలను ఆంగ్ల వికీనుండి దిగుమతి చేయడం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు.--అర్జున (చర్చ) 23:01, 10 మార్చి 2021 (UTC)
- అర్జున గారూ, అవునండీ, ఇన్నాళ్ళూ మీరు ఎలా దిగుమతి చేస్తారో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఇన్నాళ్ళకి తెలిసింది. ఇకనుంచి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు నేనే స్వంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. రవిచంద్ర (చర్చ) 05:32, 11 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర , యర్రా రామారావు గారలకు, ఇటువంటి సమస్యలు ఏ నిర్వాహకులైనా మూస పేజీలో దోషమని తెలుపుతున్న పేజీలను ఆంగ్ల వికీనుండి దిగుమతి చేయడం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు.--అర్జున (చర్చ) 23:01, 10 మార్చి 2021 (UTC)
- వెంటనే స్పందించి సవరించినందుకు అర్జున గార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:55, 10 మార్చి 2021 (UTC)
- సరి చేసినందుకు ధన్యవాదాలు అర్జున గారూ. క్షమించాలి, మీరు చేసిన మార్పుల వల్లనేమో పొరపాటున అనుకున్నాను. రవిచంద్ర (చర్చ) 09:12, 10 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర , యర్రా రామారావు గారలకు, ఆంగ్ల వికీనుండి ఇతరులు చేసిన తాజాకరణ క్రియాశీలమైనందున సమస్య ఏర్పడినట్లుంది. నేను పరిష్కరించాను. --అర్జున (చర్చ) 08:38, 10 మార్చి 2021 (UTC)
WMF Community Board seats: Upcoming panel discussions
[మార్చు]As a result of the first three weeks of the call for feedback on WMF Community Board seats, three topics turned out to be the focus of the discussion. Additionally, a new idea has been introduced by a community member recently: Candidates resources. We would like to pursue these focus topics and the new idea appropriately, discussing them in depth and collecting new ideas and fresh approaches by running four panels in the next week. Every panel includes four members from the movement covering many regions, backgrounds and experiences, along with a trustee of the Board. Every panel will last 45 minutes, followed by a 45-minute open mic discussion, where everyone’s free to ask questions or to contribute to the further development of the panel's topics.
- Skills for Board work - Friday, March 12, 18:00 UTC
- Support for candidates - Saturday, March 13, 13:30 UTC
- Board - Global Council - Hubs - Saturday, March 13, 16:00 UTC
- Regional diversity - Sunday, March 14, 13:00 UTC
To counter spamming, the meeting link will be updated on the Meta-Wiki pages and also on the Telegram announcements channel, 15 minutes before the official start.
Let me know if you have any questions, KCVelaga (WMF), 08:36, 10 మార్చి 2021 (UTC)
తరలింపులు, దారిమార్పులు, చర్చలు సరిగా చేయడం లేదు
[మార్చు]తరలింపులు, దారిమార్పులు, చర్చలు సరిగా చేయడం లేదు. ఉదాహరణకు 17 ఆగస్టు 2012 న YVSREDDY గారిచే బహుమతి (ప్రైజ్) వ్యాసం సృష్టించబడింది. కాని బహుమతి (ప్రైజ్) వ్యాసం ప్రస్తుతం బహుమతి (సినిమా) వ్యాసమునకు దారిమార్పుగా ఉన్నది. బహుమతి (ప్రైజ్) వ్యాసంలో వ్రాసిన సమాచారంలో తప్పులు ఏమి లేకపోయినప్పటికి ఈ వ్యాసాన్ని బహుమతి వ్యాసంగా తరలించి ఈ వ్యాసం ఒక జోకు లాగా ఉన్నదని చర్చలు చేసి కావాలనే దురుద్దేశ ఆలోచనతో ఈ వ్యాసాన్ని తొలగించారు.YVSREDDY (చర్చ) 21:01, 10 మార్చి 2021 (UTC)
- వాడుకరి:YVSREDDY గారూ, మీరు చెప్పిన వ్యాసం పరిశీలిస్తే చరిత్ర ఒక బాటు పొరబాటున సినిమా వ్యాసానికి దారి మళ్ళించింది అంతేకానీ ఏ మానవీయ మార్పు కాదు. ఇక వ్యాసం పేరు విషయానికి వస్తే ఈ సందర్భంలో స్వచ్ఛమైన తెలుగు పేరు ఉన్నప్పుడు బ్రాకెట్లలో ఆంగ్ల పేరు అవసరం లేదు. కాబట్టి బహుమతి (ప్రైజ్) అనే దారిమార్పును నేను తొలగిస్తాను. ఇకపోతే బహుమతి వ్యాసాన్ని తొలగించడంలో ఎటువంటి దురుద్దేశం లేదు. అలాగే మీరు ఈ చర్చ లో చెప్పినట్లు దారిమార్పు సరికాదు. అది వికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదనే (చాలా కాలం నుంచి స్వల్ప సమాచారం ఉంది. మూలాలు లేవు, వికీశైలిలో లేదు) తొలగించారు. - రవిచంద్ర (చర్చ) 05:49, 11 మార్చి 2021 (UTC)
- Simple English Wikipedia లోని Prize వ్యాసం యొక్క చరిత్రను పరిశీలిస్తే Prize వ్యాసం 92 బైట్లతో ఒక వ్య్హక్తి ప్రారంభించాడు. ఆ తరువాత ఆ వ్యాసంలో అతను ఎటువంటి మార్పులు చేయలేదు. నేటికీ ఆ వ్యాస పరిమాణం 963 బైట్లతో ఎటువంటి మూలాలు లేకపోయినప్పటికి సజీవంగా ఉంది. 17 ఆగస్టు 2012 న YVSREDDY గారిచే బహుమతి (ప్రైజ్) వ్యాసం 2000 బైట్లకు మించి సృష్టించబడింది. నేడు YVSREDDY గారిచే సృష్టించబడినందున బహుమతి (ప్రైజ్) వ్యాసం నిర్జీవమయింది. చాలా కాలం కిందటే బహుమతి (ప్రైజ్) వ్యాసం 2000 బైట్లకు మించి ప్రారంభమయింది. ఇటువంటి వ్యాసాన్ని మూలాలు లేవని తొలగించకూడదు, ఎందుకంటే ఈ వ్యాసంలో అభ్యంతరకరమైన సమాచారం లేదు అందరికి తెలిసిన సాధారణ సమాచారం మాత్రమే ఉంది. వికీశైలిలో లేదు అని ఎవరికి అంతగా అర్థం కాని వికీశైలి అనే పదాన్ని ఉపయోగించి నేను వ్రాసిన వ్యాసాలను కావాలనే దురుద్దేశ ఆలోచనతో తొలగిస్తున్నారు తప్ప మరొకటి లేదు. YVSREDDY గారిచే సృష్టించబడిన వ్యాసాలు కావాలనే తొలగించారని అందరికి తెలుసు. కాని ఎవరు ఎందుకు అడగరు అంటే తొలగించే వారికి తెలియకుండా ఉంటుందా, తప్పు తెలుసుకొని మారకపోతారా అని.YVSREDDY (చర్చ) 15:33, 11 మార్చి 2021 (UTC)
తెవికీ నిర్వాహకులు తెలుగుకు మంచి చేస్తున్నారా, కీడు చేస్తున్నారా
[మార్చు]YVSREDDY గారు సృష్టించిన వ్యాసాలలో ఎటువంటి లోపాలు లేకపోయినప్పటికి ఆ వ్యాసాలను కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నా చూస్తూ ఉంటున్నారు తప్ప, ఆ వ్యాసాలను రక్షించేందుకు నిర్వాహకులు ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. నేను 2016 లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు రోజుకి కనీసం ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టిస్తూ అధిక సమయాన్ని వెచ్చించినాను. తరువాత 2020 లో కూడా ప్రతిరోజు రోజుకి కనీసం ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టిస్తూ అధిక సమయాన్ని వెచ్చిస్తూ చిన్న వ్యాసాలను తొలగించవద్దని, నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ ఉన్న వాటిని విస్తరిస్తానని చెబుతున్ననూ వ్యాసాలను తొలగించడం మానలేదు. తొలగించబడిన వ్యాసాలను తిరిగి 2000 బైట్లకు మించి ప్రారంభిస్తే తొలగించిన వెంటనే వ్యాసాలను తిరిగి ప్రారంభిస్తావా అంటూఈ ఆ వ్యాసాలను తొలగించడం మానలేదు. ఒక వ్యాసం తొలగించబడితే తిరిగి ఆ వ్యాసం వెంటనే సృష్టించకూడదనే నియమం తెవికీ నిర్వాహకులు కనిపెట్టారా లేదా ఎన్ని నిమిషాల తరువాత లేదా ఎన్ని గంటల తరువాత లేదా ఎన్ని రోజుల తరువాత, లేదా ఎన్ని నెలల తరువాత లేదా ఎన్ని సంవత్సరాల తరువాత సృష్టించాలో నిర్వాహకులు తెలియజేయగలరు. మహాభారతాన్ని ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించి కవిత్రయం అని మన్ననలందుకోగా, తెవికీలో YVSREDDY గారు అనువదించి సృష్టించిన వ్యాసాలకు ఒకరే ముగ్గురిగా మొదటి నుంచి అడ్డుపడుతూ చివరకు వాటిని తొలగిస్తూ బకేరో త్రయం గా పేరు గడిస్తున్నారు.YVSREDDY (చర్చ) 14:19, 19 ఏప్రిల్ 2021 (UTC)
- YVSREDDY గారూ మీకు నిరాధారమైన ఆరోపణలు వాడుకరులపై చేయడం అలవాటైపోయింది. వ్యాస నాణ్యతాభివృత్థిలో భాగంగా అందరి వాడుకరులతో పాటు మీ వ్యాసాలలో ఉన్న దోషాలను తెలియజేస్తే మీరు సరిచేసుకోరు. అలా చేసే వారందరినీ కలిపి కొత్త పేర్లతో అరోపణలు చేసి నిందిస్తారు. మేము గత రెండు సంవత్సరాలలో మొలక విస్తరణ కార్యక్రమాలలో భాగంగా అందరి వ్యాసాలను సమీక్షిస్తున్నాము. మీరు గతంలో రాసిన అనేక మొలక వ్యాసాలను కూడా విస్తరించడం జరిగింది. ఒకసారి చూసుకోండి. నిరతంతరం వ్యాసాలను తొలగించడమే మా పని కాదు కదా. నేను గతంలో తొలగించబడిన మంచి వ్యాసాలను కూడా పునః స్థాపించి విస్తరిస్తున్నాను. పరీశీలించండి. మీ మీద వ్యక్తిగత కక్ష నాకెందుకుంతుంది? వ్యాసాల నాణ్యత విషయంలో ఏదైనా సందేహాలుంటే చర్చా పుటలలో చర్చిందండి. ఇక్కడ వ్యాసంపై చర్చలుండాలి గానీ వ్యక్తిగత నిందలు కాదు. మీ పద్ధతి మార్చుకోండి.-- K.Venkataramana -- ☎ 01:04, 20 ఏప్రిల్ 2021 (UTC)
- వెంకటరమణ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.ఇప్పటి తెవికీ నిర్వాహకులు మొలకలుగా ఉండి, వికీపీడియాలో ఉండదగిన వ్యాసాలను మొలకలనే కారణంతో తొలగించకుండా విస్తరిస్తూ, అర్థం పర్థంలేని, మూలాలు లేని, స్వంత కవిత్వంతో రాసిన, రాసే వ్యాసాలను నిరంతరం పర్వేక్షిస్తూ వాటినినిర్మూలించటంద్వారా తెలుగు వికీపీడియా నాణ్యతను మెరుగు పరుస్తూ ఆ విధంగా మంచిచేస్తున్నారనుటలో ఎటువంటి సందేహంలేదు. యర్రా రామారావు (చర్చ) 05:52, 20 ఏప్రిల్ 2021 (UTC)
- YVSREDDY గారూ మీకు నిరాధారమైన ఆరోపణలు వాడుకరులపై చేయడం అలవాటైపోయింది. వ్యాస నాణ్యతాభివృత్థిలో భాగంగా అందరి వాడుకరులతో పాటు మీ వ్యాసాలలో ఉన్న దోషాలను తెలియజేస్తే మీరు సరిచేసుకోరు. అలా చేసే వారందరినీ కలిపి కొత్త పేర్లతో అరోపణలు చేసి నిందిస్తారు. మేము గత రెండు సంవత్సరాలలో మొలక విస్తరణ కార్యక్రమాలలో భాగంగా అందరి వ్యాసాలను సమీక్షిస్తున్నాము. మీరు గతంలో రాసిన అనేక మొలక వ్యాసాలను కూడా విస్తరించడం జరిగింది. ఒకసారి చూసుకోండి. నిరతంతరం వ్యాసాలను తొలగించడమే మా పని కాదు కదా. నేను గతంలో తొలగించబడిన మంచి వ్యాసాలను కూడా పునః స్థాపించి విస్తరిస్తున్నాను. పరీశీలించండి. మీ మీద వ్యక్తిగత కక్ష నాకెందుకుంతుంది? వ్యాసాల నాణ్యత విషయంలో ఏదైనా సందేహాలుంటే చర్చా పుటలలో చర్చిందండి. ఇక్కడ వ్యాసంపై చర్చలుండాలి గానీ వ్యక్తిగత నిందలు కాదు. మీ పద్ధతి మార్చుకోండి.-- K.Venkataramana -- ☎ 01:04, 20 ఏప్రిల్ 2021 (UTC)
YVSREDDY గారూ, మీ పద్ధతి బాలేదు. తెలుగు వికీపీడియా నిర్వాహకులపై మీరు ప్రతిసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పైన మీరు రాసిన దానికి నేను కొంత వివరాణ ఇస్తున్నాను.
- '2016 లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు రోజుకి కనీసం ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టిస్తూ అధిక సమయాన్ని వెచ్చించినాను. తరువాత 2020 లో కూడా ప్రతిరోజు రోజుకి కనీసం ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టిస్తూ అధిక సమయాన్ని వెచ్చించాను' అని చెప్తున్నారు. మీరు సృష్టించిన వ్యాసాలు ఎన్ని, అందులో మొలక వ్యాసాలు ఎన్ని, మూలాలు లేని వ్యాసాలు ఎన్ని, ఇంగ్లీషులో ఉన్న వ్యాసాలు ఎన్ని, వికీ నియమాలకు అనుగుణంగా మీరు విస్తరించిన వ్యాసాలు ఎన్ని అనేవి ఒకసారి చూసుకోండి. (మీ మొలకల జాబితాలో గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు కాకుండానే 810 ఇతర మొలక వ్యాసాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారేమో..!).
- 'నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ ఉన్న వాటిని విస్తరిస్తానని చెబుతున్ననూ వ్యాసాలను తొలగించడం మానలేదు.' అంటున్నారు. మరి వ్యాసాల తొలగింపు చర్చల్లోకానీ, వ్యాసాల తొలగింపు చర్చాపేజీల్లోకానీ ఎందుకు స్పందించలేదు? అయినా, వ్యాసాలను వికీ నియమాలకు అనుగుణంగా రాస్తే ఎవరూ తొలగించరని తెలుసుకోండి. మీరు విస్తరించాను అని చెప్తున్న వ్యాసాల జాబితా ఒకసారి చూసుకుంటే అవి ఎందుకు తొలగించబడ్డాయో తెలుస్తుంది. (తొలగించబడిన వ్యాసాల జాబితాలో ఆయా వ్యాసాల వివరాలు చూడండి).-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:50, 20 ఏప్రిల్ 2021 (UTC)
- YVSREDDY గారు. ఒకసారి వికీలో వ్యాసం కాని మరేదైనా కాని రాసాక అది నాది అనిపించుకోదు, దానిపై అందరికీ హక్కులుంటాయి. దాఇనిపై జరిగే ఏ మార్పుకైనా, చర్యకైనా గౌరవంగా అంగీకరించాలి. నా వరకూ వెంకటరమణ గారి పనిలో నిబద్దత,భాద్యత అందరికంటే ఎక్కువగా కనిపిస్తాయి. నిర్వహకులపై కాని వాడూకరులపై కాని రచ్చబండ వేదికగా మీరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదు...B.K.Viswanadh (చర్చ) 18:35, 20 ఏప్రిల్ 2021 (UTC)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - ప్రతిపాదన
[మార్చు]త్వరలో 75 వసంతాల భారత స్వాత్యంత్ర వేడుకలు నిర్వహించుకోబొతున్నాము , ఈ సందర్బంగా మన వికీపీడియాలో ఈ 75 సంవత్సరాలలో సాధించిన విజయాలు , స్వాతంత్ర్య పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, 75 ఏళ్ల లో ఆలోచన విధానాలు 75 ఏళ్ల లో విజయాలు , 75 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, భారతీయ ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ వ్యక్తులు లాంటి విషయాలు అనుగుణంగా 75 రోజులు లేదా వీలును బట్టి 75 వారాలు ! ఒక కార్యక్రమం నిర్వహించుకుంటే ఎలా ఉంటుంది, ఈ విషయ ప్రాధాన్యత వలన ఎన్నో సంస్థలతొ మనం కలసి చాలా కార్యక్రమాలు చేయవచ్చు , ఇది ఒక వికీపీడియన్ గా నా ఆలోచన, దయచేసి మీ సూచనలు తెలుపగలరు, మనలో ఎవరైనా ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తే కావల్సిన తోడ్పాటుకు నేను సిద్దం ! ఇలాంటి కార్యకమాలలో మనం పాల్గొని , ప్రజలను భాగస్వామ్యులను చేయటం ద్వారా నిజమైన జ్ఞాన స్వేఛ్చ వికీపీడియా ద్వారా కలుగుతుంది , తద్ద్వారా అమృత ఫలాలు అందుతాయని అని నా దృఢ నమ్మకం Kasyap (చర్చ) 08:33, 12 మార్చి 2021 (UTC)
- Kasyap గారూ, బాగుంది ఆలోచన. చాలా థీములను చెప్పారు. అలాగే మరిన్ని థీములు కూడా ఉండొచ్చు. కొన్ని పదుల వందల వ్యాసాలకు సరిపడా సరుకుంటుంది. చేద్దాం. నేనూ ఇందులో పాల్గొంటాను. __చదువరి (చర్చ • రచనలు) 08:51, 12 మార్చి 2021 (UTC)
- చాలా బావుంది కశ్యప్ గారూ. ఒక చిన్న సవరణ: ఈ పదబంధం ఆజాదీ కా అమృతోత్సవ్ కాకుండా తెలుగులోది ఏదోకటి పెట్టుకుని చేద్దామని నా సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 13:33, 12 మార్చి 2021 (UTC)
- 75 సంవత్సరాల వేడుకలు
ఆంగ్లంలోలాటిన్ లో సెమిసెస్క్విసెంటెనియల్ అంటారు, 70 ఏళ్ళకు ఆంగ్లం ప్లాటినం అయిపోయింది స్వర్ణోత్సవాలప్పుడు వచ్చేది ప్లాటినం అనుకునే వాడిని, సంస్కృతం లో ఉన్న పంచ సప్తతి అని ఇవి తెలుగులో వాడలేము డెబ్బైఐదు మరీ సాధారణంగా ఉన్నది . మీరు చెప్పినట్లు తెలుగులో మంచి పేరు వెతకాలి అది వినగానే అర్ధం కోసం వికీకి రావాలి :) : Kasyap (చర్చ) 05:31, 13 మార్చి 2021 (UTC)- వజ్రోత్సవం!__ చదువరి (చర్చ • రచనలు) 05:41, 13 మార్చి 2021 (UTC)
- తెలుగు సినిమా వాళ్ళు వజ్రోత్సవం అని బాగా వాడేశారు , భారత స్వేచ్ఛా వజ్రోత్సవం అనొచ్ఛా ;) : Kasyap (చర్చ) 05:49, 13 మార్చి 2021 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువులో వజ్రోత్సవం అంటే "ఒక సంస్థకు అరవై సంవత్సరములు నిండినపుడు చేయు ఉత్సవం అని తెలుపుతుంది." యర్రా రామారావు (చర్చ) 05:50, 13 మార్చి 2021 (UTC)
- వజ్రోత్సవం ఒక వ్యక్తి 60 సంవత్సరాలు లేదా ఒక సంస్థ 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. ఎక్కువగా సంస్థలకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు అని వికీలో రాశారు ! : Kasyap (చర్చ) 05:55, 13 మార్చి 2021 (UTC)
- వజ్రోత్సవం!__ చదువరి (చర్చ • రచనలు) 05:41, 13 మార్చి 2021 (UTC)
- 75 సంవత్సరాల వేడుకలు
- చాలా బావుంది కశ్యప్ గారూ. ఒక చిన్న సవరణ: ఈ పదబంధం ఆజాదీ కా అమృతోత్సవ్ కాకుండా తెలుగులోది ఏదోకటి పెట్టుకుని చేద్దామని నా సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 13:33, 12 మార్చి 2021 (UTC)
తెలుగు సినిమా వజ్రోత్సవం మాదిరిగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవం అంటే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 06:42, 13 మార్చి 2021 (UTC)
- మంచి ప్రతిపాదన. నేను కూడా ఇందులో పాల్గొంటాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:37, 19 మార్చి 2021 (UTC)
- వజ్రోత్సవం అన్నది 75 ఏళ్ళకు చేసేది కాదు. కాకపోతే - పెద్దలు చేసే తప్పులు కూడా ఒప్పులుగా ఒప్పుతాయని కవుల విషయంలో చెప్తారు కదా. మన తెలుగు సమాజానికి ఈనాడు తెలుగు సినిమా వాళ్ళను మించిన పెద్దలు లేరు. కాబట్టి, ఆ దారినే మనం కూడా తెలుగు స్వాతంత్ర్య వజ్రోత్సవం చేసేదాం. పైగా వజ్రోత్సవం నోళ్ళలో నలిగిన పదం కాబట్టి జనం కనెక్టవుతారు. --పవన్ సంతోష్ (చర్చ) 09:20, 25 మార్చి 2021 (UTC)
- మంచి ప్రతిపాదన. నేను కూడా ఇందులో పాల్గొంటాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:37, 19 మార్చి 2021 (UTC)
చర్యలకు నోచుకోని ఏళ్ల తరబడి ఉన్న చర్చా పేజీలు
[మార్చు]తెవికీలో పలు వ్యాసాలపై, మూసలపై, వర్గాలపై ప్రారంభించిన చర్చలలో కేవలం ప్రారంభ చర్చతో కొన్ని, ఏకాభిప్రాయంరాక నిర్ణయంకొరకు ఎదురుచూసే చర్చలు కొన్ని, చర్చలు జరిగి, చర్చ ప్రకారం తదుపరి చర్యలు చేపట్టని చర్చలు కొన్ని ఏళ్ల తరబడి ఉంటున్నవి.కొన్ని చర్యలు చేపట్టిన చర్చా పేజీలలో రికార్డు చేయనందున చర్చలు పెండింగ్ లో ఉన్నట్లు అనుకోవాల్సివస్తుంది.వీటిని గమనించి పరిష్కరించుటలో సరియైన పంథా లేదని నేను భావిస్తున్నాను.
కొన్ని చర్చాపేజీలు ఉదాహరణ
- చర్చ:జోల పాటలు - 2009 నాటి చర్చ నిర్ణయం లేదు.చర్యలు లేవు
- చర్చ:కూచిపూడి నృత్యం - 2017లో చర్చ మొదలైంది.రెండు సంవత్సరాల తరువాత పరిష్కరించబడినది
- చర్చ:ఆరావళీ పర్వత శ్రేణులు - చర్య అయితే తీసుకోబడింది.కానీ చర్చలో తీసుకున్న చర్య రాయనందున పరిష్కరింపబడనట్లుగా తెలుస్తుంది.
- చర్చ:కోళ్లూరు గనులు - ఏకాభిప్రాయం రాలేదు.ఇంకాచర్చ కొనసాగవలసి ఉంది.2020 ఆగష్టు 15 నుండి ఎదురు చూస్తుంది
- చర్చ:వరంగల్ (పట్టణం) - ఇది 2018 డిసెంబరు 27 మొదలుపెట్టబడిన చర్చ. ఇది 2021 మార్చి 12న గట్టెక్కింది.
- చర్చ:తెలంగాణా ముఖ్యమంత్రులు - 2019 జూన్ 13న చర్చ మొదలు పెట్టబడింది.నన్ను పట్టించుకోరా అని ఎదురు చూస్తుంది.
- చర్చ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు - ఏది సరియైనది విభాగం లో ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసానికి పదవి చేపట్టిన తేదీలు తేడా గురించి 2013 మార్చి 24న మొదలైంది. (అన్ని చర్చల వయస్సు కన్నా ఈ చర్చ వయస్సు పెద్దది.)
- చర్చ:లోక్ సభ స్పీకర్ - వ్యాసంలో విధులు, బాధ్యతలు గురించిన వాక్యాలు తప్పుగా ఉన్నవి అని చర్చ2019 ఏప్రిల్ 29న మొదలైంది.ఇప్పటికీ అదే పరిస్థితి.
(ఇవి కొన్ని ఉదాహరణకు మాత్రమే) వీటి పరిష్కార నిమిత్తం కొన్ని సూచనలు ప్రతిపాదిస్తున్నాను.
- చర్చా పేజీ సృష్టించగానే, చర్చ సాగటానికి గుర్తుగా ఏదేని ఒకమూస "చర్చ కోసం వేచి ఉన్నపేజీలు" ; " దృష్టి కేంద్రీకరించని చర్చా పేజీలు " ; “ చర్చించవలసిన చర్చలు “ ; “ చర్చకొరకు ఎదురుచూసే పేజీలు ” లేదా మరేదైనా వాక్యం తో మూస ఉండాలి.
- చర్చ మొదట ప్రారంభించిన వాడుకరి తప్పనిసరిగా ఈ మూసను ఎక్కించాలి.
- ఈ మూస ఎక్కించిన చర్చాపేజీలు ఒక ప్రత్యేక వర్గంలో చేరాలి.
- చర్చలలో కనీసం ముగ్గురు వాడుకరులైనా పాల్గొనాలి.
- ఏకాబిప్రాయం రానివాటికి కామన్ రూల్ ప్రకారం, చర్చలలో పాల్గొనని వాడుకరి నిర్ణయం చేయాలి.
- ఏకాభిప్రాయం వచ్చిన, నిర్ణయం చేసిన చర్చలలో, చర్చ ప్రవేశపెట్టిన వాడుకరి, ఆ చర్చకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలి.
- చర్చకు అనుగుణంగా చేపట్టిన చర్యలు చర్చా పేజీలో రికార్డు చేయాలి.
గమనిక:ఎన్ని రాసుకున్నా చురుకైన వాడుకరులు సత్వర స్పందన ఉంటేనే ప్రయోజనం.లేకపోతే షరా మామూలే.
కావున దీనిమీద సముదాయ సభ్యులు పరిశీలించి స్పందనలు, ఇతర సూచనలు, అభిప్రాయాలు తెలియజేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:15, 12 మార్చి 2021 (UTC)
- బాగున్నై సూచనలు. ఈ మధ్య అర్జున గారు, యర్రా రామారావు గారు ఈ పని చేస్తూ ఇలాంటి ప్రతిష్ఠంభనలకు ముగింపు పలుకుతూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు.
- నిలిచిపోయిన, పాత చర్చల గురించి నాదొక అభిప్రాయం ఉంది.. ఎన్నో ఏళ్ళుగా చర్చ మొదలైనా ఎటూ పోకుండా నిలబడిపోయిన వాటిని ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి చర్చించే బదులు, అది చూసిన వాడుకరి తానే ఒక నిర్ణయం తీసుకుని అమలు చేసేస్తే బాగుంటుంది. ఏం చెయ్యాలో తెలియకపోతే చర్చను కొనసాగించవచ్చు. ఫలానా పని చెయ్యాలి అనే అభిప్రాయం ఉంటే మాత్రం ఆ అభిప్రాయాన్ని అమలు చేస్తేనే బాగుంటుంది. ఆ చర్య తప్పని ఎవరైనా భావిస్తే అప్పుడు వాళ్ళే కొత్త చర్చ లేవదీస్తారు. పరిశీలించండి.
- రామారావు గారు చేసిన సూచనల గురించి...
- మూసను సృష్టించాలనే మొదటి సూచన ప్రకారం ఒక మూసను సృష్టిస్తే బాగుంటుంది. ప్రస్తుతం వాడుతున్న "సహాయం కావాలి" మూసలో రెండు ఇబ్బందులున్నాయి - ఒకటి.. చర్చల్లో మనం అడుగుతున్నది సహాయం కాదు, అభిప్రాయాలూ సూచనలూ. ఇంకోటేంటంటే.. ఈ మూస పెద్దదై పోయింది. అడిగే ప్రశ్న ఒకలైనుంటే ఈ మూస ఏడెనిమిది లైన్లుంటుంది. చారానా కోడికి బారానా మసాలా లాగా ఎబ్బెట్టుగా కనబడుతుంది. అంచేత సింపులుగా ఉండేలా మరొక మూస ఉంటే బాగుంటుంది.
- నాలుగోది- చర్చలో కనీసం ముగ్గురు పాల్గొనాలి అనేది - ఇలాంటి నిబంధనలు అభిలషణీయం కాదు. అనుసరణీయమూ కాదు.
- ఐదోది - ఇది అభిలషణీయమే గాని, మన చురుకుదనాన్ని బట్టి చూస్తే అది ఆచరణ సాధ్యం కాదు. చర్చలో ఎంతమంది పాల్గొన్నా, ఒక స్పష్టమైన కన్సెన్సస్ ఏర్పడితే నిర్ణయం ఎవరైనా ప్రకటించవచ్చు. చర్చ ఎటువైపుకూ బలంగా మొగ్గు చూపకపోతే , ప్రతిష్ఠంభన ఏర్పడితే, అప్పుడు.. రామారావు గారన్నది చేయవచ్చు.
- __ చదువరి (చర్చ • రచనలు) 06:08, 13 మార్చి 2021 (UTC)
- చదువరి గారు, నేను ప్రతిపాదించిన సూచనలు, అభిప్రాయాలపై సాధ్యా అసాధ్యాలపై, ఆచరణాత్మకంపై పరిశీలించి మంచిసూచనలు చేసారు.ఆసూచనలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:20, 15 మార్చి 2021 (UTC)
స్పందించండి
[మార్చు]చురుకైన గౌరవ వాడుకరులు పై చర్చకు 2021 ఏప్రిల్ 30 లోపు స్పందించి మీ అభిప్రాయాలను తెలుపవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:00, 21 మార్చి 2021 (UTC)
- చదువరి గారు ప్రస్తుతం వాడుతున్న {{సహాయం కావాలి}} మూసపై తెలిపిన లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాను. ఇంకేమైనా మార్పులు అవసరమైతే ఆ మూస చర్చాపేజీలో తెలపండి. --అర్జున (చర్చ) 23:36, 21 మార్చి 2021 (UTC)
- బాగుంది, @Arjunaraoc గారూ.__ చదువరి (చర్చ • రచనలు) 08:34, 22 మార్చి 2021 (UTC)
చరిత్రలో ఈరోజులో ఏం ఉండాలి?
[మార్చు]చరిత్రలో ఈరోజు (మార్చి 13) చూస్తూంటే అందులో భారతీయ జనతా పార్టీ యువనేత (?) వరుణ్ గాంధీ 1980లో జన్మించినట్టు ఉంది. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందినవాడు, వివాదాస్పదుడైన సంజయ్ గాంధీ కుమారుడు, తల్లితో పాటుగా భాజపాలో చేరినవాడు అయిన ఇతని గురించి ఈ కారణాలన్నిటి వల్ల తప్పనిసరిగా వికీలో వ్యాసం ఉండాల్సిందే. మూడు సార్లు ఎంపీగా వరుసగా గెలుపొందాడు. ఇప్పటివరకూ కేంద్ర మంత్రి కాలేదు. ఇదీ ఇతని వివరాలు. ఐతే, చరిత్రలో ఈరోజులో స్థానం సంపాదించుకునేంత వాడా? అసలు చరిత్రలో ఈరోజులో ఏయే విషయాలు ఉండవచ్చు? ఏం ఉండకూడదు? దీని విషయ ప్రాముఖ్యత ఏమిటి? - ఈ అంశాలపై విస్తృత చర్చ జరిగితే ప్రయోజనకరంగా ఉంటుందని భావించి ఇలా ప్రారంభిస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాలు, ఆలోచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 04:50, 13 మార్చి 2021 (UTC)
- చరిత్రలో ఈరోజు మాత్రమే కాదు, మొదటిపేజీలో ఉండే ఈవావ్యా, మీకు తెలుసా వంటి అన్ని అంశాల్లో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. భాష సరిగ్గా లేని వ్యాసాలను కూడా మొదటి పేజీ వ్యాసంగా ప్రతిపాదించిన ఘటనలను చూసాన్నేను. __ చదువరి (చర్చ • రచనలు) 08:02, 13 మార్చి 2021 (UTC)
- మీకు తెలుసా వాక్యాలు ఈ మధ్య నేను మనకున్న వ్యాసాల నుంచే కాసింత నాణ్యమైనవి చేర్చాలని ప్రయత్నిస్తున్నాను. మనకు కొత్తగా ప్రారంభమవుతున్న వ్యాసాలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి, అభివృద్ధి అవుతున్న మిగతా వ్యాసాలేవైనా ఇప్పటిదాకా ఈ శీర్షికలో ప్రదర్శింపకుండా ఉంటే వాటిలోని వాక్యాలు కూడా చేరుస్తున్నాను. ఇందులో అన్ని వాక్యాలు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ ఉన్నంతలో మంచి వాక్యాలు చేర్చడానిని ప్రయత్నిస్తున్నాను. అలాగే ఒక్కోసారి నేను రాసే వాక్యాలు నాకే నచ్చక కొత్త వ్యాసాలు సృష్టిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. :-) రవిచంద్ర (చర్చ) 06:24, 15 మార్చి 2021 (UTC)
- పవన్ సంతోష్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. దీనిపై మరింత చర్చ జరిగి చరిత్రలో ఈరోజు లో ఉండదగ్గ సమాచారం ఏమిటి అనే ప్రమాణాలు నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:35, 14 మార్చి 2021 (UTC)
ఇటీవలి మార్పులలో ఇతర సమీక్ష ఉపకరణాల అమలు
[మార్చు]గత కొన్ని సంవత్సరాలలో AWB వాడుకరులు పెరిగినందున, AWB వాడుక ఎక్కువైన సందర్భంలో సాధారణ మార్పులు గమనించడం అసాధ్యమవుతుంది. బాట్ మార్పులు దాచినట్లు AWB మార్పులు దాచే అవకాశం లేదు. కావున ఆంగ్ల వికీలో ఇతర వడపోతలు ప్రకారం ముఖ్యమైనవాటిలో సవరణలు గమనించే సాలభ్యాన్ని తెవికీలో చేర్చాను. ప్రస్తుతానికి విశేషవ్యాసాలలో జరిగే మార్పులను గమనించడానికి అవసరమైన సవరణలు చేశాను. ప్రదర్శితమైన విశేష వ్యాసంలో {{విశేషవ్యాసం}} చేర్చటం జరిగినపుడే, ఇది ఉపయోగపడుతుంది. దీని పనితీరుకు ప్రత్యేక:ఇటీవలిమార్పులు చూడండి. ఇప్పటికే ప్రదర్శితమైన వ్యాసాలకి AWB లేక బాటు ద్వారా చేర్చితే మంచిది. దీనిని తెలుగు వికీకి మరింత అనువుగా చేయటంలో సహకరించండి. అర్జున (చర్చ) 22:43, 14 మార్చి 2021 (UTC)
దారిమార్పు వర్గాల్లో పేజీలు
[మార్చు]ఈ మధ్య వర్గాల దారిమార్పుల విషయం చర్చలో వచ్చింది. ప్రస్తుతం 160 పైచిలుకు దారిమార్పు వర్గాలుండగా, 25 వర్గాల్లో పేజీలు ఉన్నాయి. వాటిపై తగు చర్య తీసుకోవడం కోసం వాటిని కింది జాబితా రూపంలో వాడుకరుల దృష్టికి తెస్తున్నాను. పూర్తి వివరాలను సంబంధిత గణాంకాల పేజీలో చూడవచ్చు. దీనికి సంబంధించిన క్వెరీని కూడా చూడవచ్చు.
__ చదువరి (చర్చ • రచనలు) 06:25, 15 మార్చి 2021 (UTC)
గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టును తెవికీలో చేర్చాలని అభ్యర్ధించాను
[మార్చు]గ్రోత్ ప్రాజెక్టు గురించి మనం చేసిన చర్చ, దానిపై తీసుకున్న నిర్ణయాన్ననుసరించి, గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టును తెవికీలో నెలకొల్పమని ఫ్యాబ్రికేటరులో అభ్యర్ధించాను. దాని లింకు ఇది __ చదువరి (చర్చ • రచనలు) 17:23, 15 మార్చి 2021 (UTC)
- ఈ ప్రాజెక్టు అభ్యర్ధన పట్ల గ్రోత్ బృందం స్పందించింది. ఈ ప్రాజెక్టును తెవికీలో పరీక్షార్థం స్థాపిస్తారు. ఒక వారం పాటు అనుభవజ్ఞులైన వాడుకరులు పరిశీలించాక, అనువాదాల్లో ఏమైనా మార్పుచేర్పులు చెయ్యాల్సి ఉంటే చేసాక, దాన్ని పూర్తిస్థాయిలో కొత్తవారికి కూడా అందుబాటులో ఉండేలా పెడతారు. ఆ తరువాత మనం చెయ్యాల్సిన పనులు రెండున్నాయి:
- గురువుల నమోదు. ఒక పేజి పెట్టుకుని అందులో గురువులుగా పనిచెయ్యాలనుకునే వారు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. ఈ పేజీ నేను సృష్టిస్తాను.
- ఒక నాలుగైదు పేజీలకు పేర్లను చేర్చాలి. దానికి బహుశా "ఇంటర్‌ఫేస్ అడ్మినిస్ట్రేటరు" అనుమతులు అవసరమౌతాయి. ప్రస్తుతం ఆ అనుమతులు ఉన్నవారు మనలో ఎవరూ లేరు. అధికారిని కాబట్టి, ఈ అనుమతి నేను ఇవ్వగలను. ఈ పని చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నేను వారికి తాత్కాలికంగా ఆ అనుమతి ఇస్తాను.
- __ చదువరి (చర్చ • రచనలు) 07:35, 16 మార్చి 2021 (UTC)
- మంచిది. వికీఅభివృద్ధికి ఇది శుభసూచకమని నేను భావిస్తున్నాను.ప్రాజెక్టుపై శ్రమ తీసుకున్న చదువరి గార్కి, అమలుపర్చటానికి తగినచర్యలు తీసుకుంటున్న ఫ్యాబ్రికేటరు బృందం వార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:40, 16 మార్చి 2021 (UTC)
- దీని గురించి ఒక ప్రాజెక్టు పేజీని తయారు చేసాను. అలాగే పైన తెలిపినట్లుగా, గురువుల జాబితా కోసం ఒక పేజీని తయారు చేసాను. గురువుగా పనిచేసే ఆసక్తి ఉన్నవారు ఇందులో తమ పేరును నమోదు చేసుకోవవచ్చు. గ్రోత్ ప్రాజెక్టు నిర్వహించే ఒక బాటు కోసం ఈ జాబితా పేజీ అవసరం. __చదువరి (చర్చ • రచనలు) 09:51, 16 మార్చి 2021 (UTC)
- ప్రాజెక్టు తాజా విశేషం: మార్చి 24 తెల్లవారు ఝామున తెవికీలో గ్రోత్‌ను స్థాపించాలని గ్రోత్ బృందం నిర్ణయించి ప్రకటించింది. అందుకు సన్నాహకంగా రాత్రి మీడియావికీ:NewcomerTasks.json అనే పేజీని సృష్టించారు. __ చదువరి (చర్చ • రచనలు) 04:54, 17 మార్చి 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు. -- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:41, 19 మార్చి 2021 (UTC)
- ప్రాజెక్టు తాజా విశేషం: మార్చి 24 తెల్లవారు ఝామున తెవికీలో గ్రోత్‌ను స్థాపించాలని గ్రోత్ బృందం నిర్ణయించి ప్రకటించింది. అందుకు సన్నాహకంగా రాత్రి మీడియావికీ:NewcomerTasks.json అనే పేజీని సృష్టించారు. __ చదువరి (చర్చ • రచనలు) 04:54, 17 మార్చి 2021 (UTC)
[Small wiki toolkits] Workshop on "Debugging/fixing template errors" - 27 March
[మార్చు]As part of the Small wiki toolkits (South Asia) initiative, we are happy to announce the third workshop of this year. The workshop will be on "Debugging/fixing template errors", and we will learn how to address the common template errors on wikis (related but not limited to importing templates, translating them, Lua, etc.).
Details of the workshop are as follows:
- Date: 27 March
- Timings: 3:30 pm to 5:00 pm (IST), 15:45 to 17:15 (NPT), 16:00 to 17:30 (BST)
- Meeting link: https://meet.google.com/cyo-mnrd-ryj | click here to add this to your Google Calendar.
- Trainer: Jay Prakash
Please sign-up on the registration page at https://w.wiki/36Sg.
prepare for the workshop in advance, we would like to gather all kinds of template errors (related but not limited to importing templates, translating them, Lua, etc.) that you face while working with templates on your wiki. If you plan to attend the workshop and would like your common issues related to dealing with templates addressed, share your issues using this Google Form, or under this section on the workshop's talk page. You can see examples of such errors at this category.
Note: We are providing modest internet stipends to attend the workshops, for those who need and wouldn't otherwise be able to attend. More information on this can be found on the registration page.
Regards, Small wiki toolkits - South Asia organizers, 07:01, 16 మార్చి 2021 (UTC)
గ్రోత్ ప్రాజెక్టు పరీక్షార్థం చేతనమైంది
[మార్చు]తెవికీలో గ్రోత్ ప్రాజెక్టును పరీక్షార్థం చేతనం చేసారు. వాడుకరులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. దీన్ని చేతనం చేసుకునే విధానం ఇది:
- మీ వాడుకరి అభిరుచులు లోని వాడుకరి ప్రవర ట్యాబుకు వెళ్ళండి
- అక్కడ, అన్నిటికంటే అడుగున, "కొత్తవాడుకరి హోంపేజీ" విభాగంలో "కొత్తవాడుకరి హోంపేజీని చూపించు" చెక్‌బాక్సు కనిపిస్తుంది. అందులో టిక్కు పెట్టాలి.
- ఆ వెంటనే దాని కిందనే, "వ్యక్తిగత పరికరాల్లోని వాడుకరిపేరును డిఫాల్టుగా కొత్తవాడుకరి హోంపేజీకి లింకు చెయ్యి" అనే మరో చెక్‌బాక్సు కనిపిస్తుంది. దీనిలో టిక్కు పెడితే, తెరపై పైన కుడి పక్కన ఉండే మీ వాడుకరిపేరును నొక్కినపుడు మీ వాడుకరి పేజీకి కాకుండా నేరుగా హోంపేజీ కి పోతుంది.
- హోంపేజిని చేతనం చెయ్యడంతో, వాడుకరి పేజీ, చర్చ పేజీ ట్యాబులకు ఎడం పక్క ఓ కొత్త ట్యాబు వచ్చి చేరుతుంది. ఈ కొత్త ట్యాబుపై "హోంపేజీ" అని ఉంటుంది.
- దీన్ని చేతనం చేసుకున్నవాళ్ళంతా శిష్యులై పోతారన్నమాట. గురువుల పేజీలో ఉన్న పేర్ల లోంచి ఎవరో ఒకర్ని మనకు గురువుగా అదే నిర్ణయిస్తుంది.
నేను చేతనం చేసుకున్నాను. వెంటనే హోంపేజీ కనబడింది. @Pavan santhosh.s గారికి నన్ను శిష్యుడిగా చేర్చి, ఆ సంగతి నాకు నా హోంపేజీలో చూపించింది. నా హోంపేజీ నుండి నేను ఆయనకు ఒక ప్రశ్న (నమస్కారం చెప్పాను) పంపాను. అది ఆయన వాడుకరి చర్చ పేజీలో కనబడింది.
మీరూ ప్రయత్నించండి. మార్చి 24 న ఇది కొత్త వాడుకరులకు పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈలోగా మనం పరీక్షించి ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకుందాం - ముఖ్యంగా తెలుగు అనువాదాల్లో__ చదువరి (చర్చ • రచనలు) 02:52, 19 మార్చి 2021 (UTC)
- హోంపేజీలో మీ గురువు గారు ఫలానా అని కనబడకపోతే, ఇక్కడ ఆ విషయం తెలియజేయవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 05:14, 19 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ, నేను సచేతనం చేసి చూసుకున్నాను. నాకు గురువుగా మీ పేరు చూపించింది. ఒక సందేశం పంపి చూశాను. అది మీ చర్చా పేజీలో నమోదవడం చూశాను. రవిచంద్ర (చర్చ) 06:19, 19 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ, మనమైతే ఇప్పుడు అభిరుచుల్లోకి వెళ్ళి కొత్త వాడుకరి హోంపేజీ ని సచేతనం చేసుకున్నాం. ఇది కొత్త సభ్యులకు ఎలా క్రియాశీలకమవుతుంది? వాళ్ళు కూడా ఈ విధంగానే చేయాలా? లేక వాళ్ళు ఖాతా సృష్టించుకున్నప్పుడే ఈ హోం పేజీ దానంతట అదే ఎనేబుల్ అవుతుందా? ఒక వేళ దానంతట అదే ఎనేబుల్ అయినా ఆ హోం పేజీ నుంచి వారి గురువును సంప్రదించమని మనం ఏదో ఒకరకంగా వాళ్ళకి చెప్పాలి కదా? ఆ ఏర్పాటు కూడా చేయబడిందా లేక మనం స్వాగత సందేశంలో ఏదైనా మార్పులు చేయాలా? రవిచంద్ర (చర్చ) 07:59, 19 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారూ మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలు నాక్కూడా తెలియదు.
- గ్రోత్ ప్రాజెక్టు ప్రొడక్షను లోకి వెళ్ళినపుడు (మార్చి 24 న) కొత్తవాళ్ళు ఖాతా సృష్టించుకోగానే నేరుగా వాళ్ళ హోంపేజీకి వెళ్తారని భావిస్తున్నాను. ప్రస్తుతం, ఈ పరీక్షా స్థితిలో, మాత్రం అలా జరగడం లేదు. నేనొక ఖాతా సృష్టించుకుని చూసాను. మామూలుగానే ఉంది. అభిరుచుల్లో సెట్టింగులు చేసుకుంటేనే హోంపేజీ కనబడుతోంది.
- కొత్త వాడుకరికి హోంపేజీలో ఒక స్వాగత సందేశం ఉండాలని నేనూ భావించాను. అందులో ఈ గురుశుశ్రూష గురించి, ఈ మాడ్యూళ్ళ గురించీ చెప్పాలి. ప్రస్తుతం అది లేదు. దాని గురించి అడుగుదాం. (మనమే చేర్చుకునేందుకు ఒక అడ్డదారిని వాడొచ్చని నాకు తోస్తోంది. పరిశీలిద్దాం.)
- మన ప్రస్తుత స్వాగత సందేశంలో కూడా మార్పులు చేసుకుందాం.
- __చదువరి (చర్చ • రచనలు) 16:25, 19 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారూ మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలు నాక్కూడా తెలియదు.
- చదువరి గారూ, మనమైతే ఇప్పుడు అభిరుచుల్లోకి వెళ్ళి కొత్త వాడుకరి హోంపేజీ ని సచేతనం చేసుకున్నాం. ఇది కొత్త సభ్యులకు ఎలా క్రియాశీలకమవుతుంది? వాళ్ళు కూడా ఈ విధంగానే చేయాలా? లేక వాళ్ళు ఖాతా సృష్టించుకున్నప్పుడే ఈ హోం పేజీ దానంతట అదే ఎనేబుల్ అవుతుందా? ఒక వేళ దానంతట అదే ఎనేబుల్ అయినా ఆ హోం పేజీ నుంచి వారి గురువును సంప్రదించమని మనం ఏదో ఒకరకంగా వాళ్ళకి చెప్పాలి కదా? ఆ ఏర్పాటు కూడా చేయబడిందా లేక మనం స్వాగత సందేశంలో ఏదైనా మార్పులు చేయాలా? రవిచంద్ర (చర్చ) 07:59, 19 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ, నేను సచేతనం చేసి చూసుకున్నాను. నాకు గురువుగా మీ పేరు చూపించింది. ఒక సందేశం పంపి చూశాను. అది మీ చర్చా పేజీలో నమోదవడం చూశాను. రవిచంద్ర (చర్చ) 06:19, 19 మార్చి 2021 (UTC)
వికీపీడియా:ప్రైవేటు బడి
[మార్చు]వికీపీడియాలో పనిచేసే వాడుకరులకు దిద్దుబాట్లు చెయ్యడంలో వస్తూండే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వికీపీడియా:ప్రైవేటు బడి అనే పేజీని సృష్టించాను. ఇక్కడ ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చు. సమాధానాలు తెలిసిన వారెవరైనా ఇవ్వవచ్చు. పరిశిలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 05:38, 20 మార్చి 2021 (UTC)
గ్రోత్ ప్రాజెక్టులో హోంపేజీ
[మార్చు]గ్రోత్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి శిష్యుడికీ ప్రత్యేకంగా ఒక హోంపేజీ ఉంటుంది. పైన చూపినట్లుగా దాన్ని ఎవరైనా చేతనం చేసుకోవచ్చు. చేసుకుని ఈ గ్రోత్ ప్రాజెక్టు ఎలా ఉంటుందో పరిశీలించవచ్చు. ఈ హోంపేజీలో వివిధ మాడ్యూళ్ళు ఉంటాయి. వాటిలో "సూచిత దిద్దుబాట్లు" అనే మాడ్యూలు ఒకటి. వికీలోని ఏయే వ్యాసాల్లో ఏమేం పనులు చెయ్యవలసి ఉందో కొత్త వాడుకరికి ఈ మాడ్యూలు తెలియజేసి, ఆ పనులు చెయ్యమని ప్రోత్సహిస్తుంది. ఈ పనులు మూడు రకాలు - తేలికైనవి, మధ్యస్థం, కష్టమైనవి. గ్రోత్ ప్రాజెక్టు ఈ పనులను ఎలా కనిపెడుతుందంటే.. వ్యాసాల పేజీల్లో మనం పెట్టే నిర్వహణ మూసల ద్వారానే! అవేటంటే..
- మూస:Copy edit - తేలిక
- మూస:Underlinked - తేలిక
- మూస:Update - మధ్యస్థం
- మూస:Unreferenced - మధ్యస్థం
- మూస:మొలక - కష్టం
ఈ జాబితాకు మరిన్ని మూసలను చేర్చాలని భావిస్తున్నాను. మీమీ సూచనలు చెప్పవలసినదిగా వాడుకరులందరినీ కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 12:10, 20 మార్చి 2021 (UTC)
ద్వితీయ వార్షిక మొలకలు అభివృద్ధి కార్యక్రమం-2021
[మార్చు]వికీపీడియాలో మొలకల అభివృద్ధి చేసే కార్యక్రమం మొదటిసారిగా 2020 ఏప్రిల్ 1 నుండి 30 వరకు మొలకల అభివృద్ధి ఉద్యమం 2020 నిర్వహించుకున్నాం.ఆ తరువాత జూన్ నుండి ఆగష్టు వరకు మొలకల విస్తరణ ఋతువు 2020 నిర్వహించుకున్నాం. ఈ రెండు కార్యక్రమలలో సుమారు 2000 పైచిలుకు మొలక వ్యాసాలు అభివృద్ధి చేయుట మనందరం గర్వించతగ్గ విషయం.మొలకపేజీల నియంత్రణ విధానం 2013 ఏప్రిల్ 1 నుండి సముదాయం అమలులోకి తీసుకు వచ్చింది.దీనిని పురష్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మొలకలు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో భాగంగా "ద్వితీయ వార్షిక మొలకలు అభివృద్ధి కార్యక్రమం-2021" అనే కార్యక్రమం 2021 ఏప్రిల్ 1 నుండి నిర్వహించటానికి మొలక వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2021 ఏప్రిల్ అనే ప్రాజెక్టుపేజీ రూపొందించటమైనది. కావున చురుకైన వాడుకరులు, ఆసక్తి ఉన్న ఇతర వాడుకరులు ప్రాజెక్టు పేజీలో సంతకం చేసి, మొలక వ్యాసాలు తగ్గించటానికి ఈ బృహుత్తర ప్రయత్నంలో భాగస్వామ్యం కావల్సిందిగా కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 06:39, 21 మార్చి 2021 (UTC)
- మొలకల విస్తరణ ఋతువు 2020లో భాగంగా ఆ మూడు నెలలకాలంలో మొలకలను అభివృద్ధి చేయడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ద్వితీయ వార్షిక మొలకలు అభివృద్ధి కార్యక్రమం ప్రతిపాదించిన యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. ఇందులో నేను కూడా పాల్గొని, వీలైనన్ని వ్యాసాలను అభివృద్ధి చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:45, 21 మార్చి 2021 (UTC)
- నేనూ పాల్గొంటున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 07:44, 22 మార్చి 2021 (UTC)
గ్రోత్ ప్రాజెక్టును పరీక్షించండి
[మార్చు]గ్రోత్ ప్రాజెక్టు ప్రస్తుతం పరీక్షా స్థితిలో ఉంది. గురువు శిష్యునికిచ్చే వ్యక్తిగత శిక్షణ తరహాలో ఇది సాగుతుంది. గురువుకు ప్రత్యేకంగా ఇంటర్‌ఫేసు పేజీలేమీ లేవుగానీ, శిష్యులకు మాత్రం ఒక ప్రత్యేకమైన హోంపేజీ, ఎవరిది వారికి, ఉంటుంది. ఈ శిష్యుల ఇంటర్‌ఫేసును పరీక్షించేందుకు మనమందరం కూడా శిష్యునిగా చేరి (ఎలా చేరాలో ఇక్కడ చూడవచ్చు) ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించవచ్చు. గురువుగా నమోదు చేసుకున్నా లేకున్నా, ఈ పరీక్ష చెయ్యవచ్చు. దీన్ని పరీక్ష చేస్తే మీ సూచనలు, సలహాల సాయంతో ప్రాజెక్టును మెరుగుపరచవచ్చు. కాబట్టి అందరూ ఈ శిష్యుడి ఇంటర్‌ఫేసును పరీక్షించాలని కోరుతున్నాను. మార్చి 24 న ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో స్థాపిస్తారు. అప్పటి నుండి కొత్త శిష్యులు రావడం మొదలౌతుంది. __చదువరి (చర్చ • రచనలు) 07:59, 22 మార్చి 2021 (UTC)
గ్రోత్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్టు చేతనమైంది
[మార్చు]గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టు తెవికీలో చేత్నం చేసారు.ఇప్పుడు కొత్తవారికి ఇది అందుబాటులో ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 02:32, 25 మార్చి 2021 (UTC)
- గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టు చేతనమైన తరువాత వాడుకరి చర్చ:Heerendra babu 221149 గార్కి నేను మొదటిసారి గురువుగా (ఆటోమాటిక్) కేటాయించబడ్డాను.బాగుంది.ఉపయోగించకునేదానినిబట్టి దీని ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:07, 25 మార్చి 2021 (UTC)
కొత్త వాడుకరులకు ఆహ్వానం పలకడం
[మార్చు]కొత్త వాడుకరులకు ఆహ్వానం పలికే విషయమై గతంలో @ప్రభాకర్ గౌడ్ నోముల గారు రచ్చబండలో మార్పుల సంఖ్య ముఖ్యమా అనే చర్చ లేవనెత్తారు. ఇతర భాషల వారిని తెలుగులో స్వాగతిస్తే ప్రయోజనమేంటి అనేది ఆయన ఉద్దేశం. సరైన అలోచన అది. కానీ దాన్ని పెద్దగా పాటిస్తున్నట్టు అనిపించడం లేదు. ఎవరు పాటిస్తున్నారో, ఎవరు పాటించడం లేదో తెలియదు గానీ, ఆహ్వానాలు మాత్రం వాళ్ళూ వీళ్ళని తేడా లేకుండా అందరికీ వెళ్తున్నై. బహుశా ఎవరు తెలుగు వారో ఎవరు కాదో తెలియక అలా జరుగుతోందని అనుకుంటున్నాను. అందుకే ఒక సూచన చెయ్యదలచాను..
కొత్త వాడుకరుల చిట్టాలో ఉండే ఖాతాలను గమనించండి:
"వాడుకరి ఖాతా <ఫలానా> (చర్చ | రచనలు | నిరోధించు) ను సృష్టించారు" -అని కొన్ని ఖాతాలు ఉంటాయి. అంటే ఆ ఖాతాను నేరుగా తెవికీ లోనే సృష్టించినట్లు. వాళ్ళకు 99% తెలుగు వచ్చే ఉంటుంది. వీళ్ళందరినీ స్వాగతించవచ్చు.
"వాడుకరి ఖాతా <ఫలానా> (చర్చ | రచనలు | నిరోధించు) ను ఆటోమేటిగ్గా సృష్టించారు" -అని మరి కొన్ని ఖాతాలు ఉంటాయి (ఇవే ఎక్కువగా ఉంటాయి). ఇందులో "ఆటోమేటిగ్గా" అనే పదాన్ని గమనించండి. ఈ ఖాతాలు నేరుగా ఇక్కడ సృష్టించినవి కావు, వేరే వికీల్లో సృష్టించినవి. వాళ్ళలో 99% మందికి తెలుగు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎవరికైనా వచ్చినా, వాళ్లెవరో మనకు తెలియదు. వీళ్ళను స్వాగతించవద్దు.
పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 08:23, 30 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ, ఇది చాలా సులభమైన, సరళమైన పద్ధతి. దయచేసి స్వాగత సందేశం తెలిపే వాడుకరులు ఈ విషయం గమనించ ప్రార్థన. రవిచంద్ర (చర్చ) 09:11, 30 మార్చి 2021 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారు ఈ విషయం లో చాలా ఆందోళన చెంది చర్చ కు పెట్టారు.కానీ ఎవ్వరూ ఆచరించుటలేదు. ఈవిషయంలో నేను కొన్ని సూచనలు చేస్తున్నాను.
- స్వాగతం చెప్పే వాడుకరులకు ముందుగా ఈ విషయం తెలియజేయాలి.
- తెలియచేసిననూ పాటించకుండా అదేపనిని కొనసాగిస్తున్న పక్షంలో నిరోధ హెచ్చరిక సందేశం పంపాలి.
- ఇంకనూ అదేపనిని కొనసాగిస్తున్న పక్షంలో తాత్కాలిక నిరోధం విధించాలి.
- నిరోధం సడలిన తరువాత తిరిగి అదేపనిని కొనసాగిస్తున్న పక్షాన నిరోధక హెచ్చరికతో పనిలేకుడా శాశ్వత నిరోధం విధించాలి.
- ఈసూచనలు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:45, 31 మార్చి 2021 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారు ఈ విషయం లో చాలా ఆందోళన చెంది చర్చ కు పెట్టారు.కానీ ఎవ్వరూ ఆచరించుటలేదు. ఈవిషయంలో నేను కొన్ని సూచనలు చేస్తున్నాను.
- చదువరి గారు, వాడుకరుల ఇతర వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్టులలో తమ ఖాతా తెరిచి, వారు చూస్తున్న పేజీకి తెలుగు వికీభాషా లింకు ద్వారా తెలుగు వికీపీడియా పేజీని దర్శించినపుడు ఇటువంటి ఆటోమేటిక్ ఖాతాలు తెలుగు వికీలో సృష్టించబడతాయి అని గమనించాను. వారిలో చాలామందికి తెలుగు తెలియకపోవచ్చు. కాని వారి భాషా వికీపీడియా పేజీలో తెలుగు వికీకు ప్రాధాన్యమున్న సమాచారం వున్నప్పుడు, వారు తెలుగు వికీని సందర్శించవచ్చు, బొమ్మలు లాంటివి సులభంగా వారి భాషాపేజీలో చేర్చుకోవచ్చు. అలాగే చాలామంది తెలుగువారు తొలిగా ఆంగ్ల వికీలో ఖాతా తెరవవచ్చు. స్వాగతం సందేశం చేర్చటం వలన తెలుగు వికీకి నష్టం లేకపోగా, ఎవరైనా ఆంగ్ల వికీలో తొలిగా చేరిన వారిని తెవికీలో కృషి చేయమని ప్రేరేపించడాన్ని స్వాగతం సందేశం ఇవ్వకపోతే కోల్పోతాం. కావున ఖాతా తెరిచిన వారందరికి స్వాగత సందేశం చేర్చటం మంచిదేనని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 01:11, 4 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు, తెలుగు భాషాభిమానం ఉన్నవారు కూడా మొదట ఆంగ్ల వికీలో ఖాతా ప్రారంభించవచ్చు కదా. నేను కూడా మొదట ఆంగ్ల వికీలోనే ఖాతాను ప్రారంభించాను. తరువాత తెలుగు వికీ గూర్చి తెలుసుకుని ఇందులో పనిచేస్తున్నాను. అందువలన ఖాతా తెరిచిన వారందరికి స్వాగత సందేశం ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం.-- K.Venkataramana -- ☎ 05:20, 4 ఏప్రిల్ 2021 (UTC)
- వెంకటరమణ గారూ, నిజమేనండి. నిజానికి తెలుగు అర్థం కాని వాళ్ళను కూడా ఆహ్వానించినా వికీకి నష్టమేమీ లేదు. గతంలో ఒక కొత్త వాడుకరి, ఈ ఆహ్వానించేవారిని ఒక ప్రశ్న అడిగారు - నాకు తెలుగు రాదు కదా నన్నెందుకు ఆహ్వానిస్తున్నావ్ అని. అది దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ ఈ ఆహ్వానించేవారెవరైనా.. తెలుగు తెలిసినవాళ్ళనే ఆహ్వానిద్దాం అని భావిస్తే వాళ్లకు నే జెప్పినది పనికొస్తుందండి.
- అర్జున గారూ, "..స్వాగతం సందేశం ఇవ్వకపోతే కోల్పోతాం." అనే మీ ఆందోళన ఉంది చూసారూ.. చాలా బావుంది సార్. కాకపోతే, ఆహ్వాన పత్రికలో ఏం పెట్టామో, అసలు ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో ముందు తెలుసుకోవాలి. ఆహ్వానించేది పాచిపోయిన చద్దన్నం పెట్టడానికా, ఇప్పుడు పనికొచ్చే సమాచారం ఇవ్వడానికా అనేది ఆలోచించాలి. సమాచారానికి కాలదోషం పట్టడం సహజం; దాన్ని తాజాకరించుకోవడమూ అంతే సహజం; కాలదోషం పట్టినా సరే.. దాన్ని నేర్పాల్సిందే అని అనడం మాత్రం సహజం కాదన్న సంగతి తెలుసుకోవాలి. ముందు ఆ మెట్టు ఎక్కితే, ఆ తరువాత దాని పైమెట్లు ఎక్కొచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:40, 4 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు, తెలుగు భాషాభిమానం ఉన్నవారు కూడా మొదట ఆంగ్ల వికీలో ఖాతా ప్రారంభించవచ్చు కదా. నేను కూడా మొదట ఆంగ్ల వికీలోనే ఖాతాను ప్రారంభించాను. తరువాత తెలుగు వికీ గూర్చి తెలుసుకుని ఇందులో పనిచేస్తున్నాను. అందువలన ఖాతా తెరిచిన వారందరికి స్వాగత సందేశం ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం.-- K.Venkataramana -- ☎ 05:20, 4 ఏప్రిల్ 2021 (UTC)
రేపటి నుండి (2021 ఏప్రిల్ 1) నుండి జరిగే మొలకల ఆభివృద్ధి ప్రాజెక్టు పనిలో పాల్గొంద్దాం రండి
[మార్చు]వికీపీడియాలో మొలకల అభివృద్ధి చేసే కార్యక్రమం మొదటిసారిగా 2020 ఏప్రిల్ 1 నుండి 30 వరకు మొలకల అభివృద్ధి ఉద్యమం 2020 నిర్వహించుకున్నాం.ఆ తరువాత జూన్ నుండి ఆగష్టు వరకు మొలకల విస్తరణ ఋతువు 2020 నిర్వహించుకున్నాం.6500 పై చిలుకు ఉన్న మొలక వ్యాసాలను ఈ రెండు కార్యక్రమలలో సుమారు 3250 మొలక వ్యాసాలు తగ్గించకలిగాం. ఇది మనందరం గర్వించతగ్గ విషయం.మొలకపేజీల నియంత్రణ విధానం 2013 ఏప్రిల్ 1 నుండి సముదాయం అమలులోకి తీసుకు వచ్చింది.దీనిని పురష్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మొలకలు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో భాగంగా "ద్వితీయ వార్షిక మొలకలు అభివృద్ధి కార్యక్రమం-2021" అనే కార్యక్రమం 2021 ఏప్రిల్ 1 నుండి నిర్వహించటానికి " మొలక వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2021 ఏప్రిల్ " అనే ప్రాజెక్టుపేజీ రూపొందించటమైనది. కావున @ చదువరి గారు, రాజశేఖర్ గారు, సుజాత గారు, వెంకటరమణ గారు, స్వరలాసిక గారు, రవిచంద్ర గారు, ప్రణయ్ రాజ్ గారు, నోముల ప్రభాకర్ గౌడ్ గారు, మహేశ్వరరాజు గారు, ఇంకా ఇతర చురుకైన వాడుకరులు, ఆసక్తి ఉన్న ఇతర వాడుకరులు ప్రాజెక్టు పేజీలో సంతకం చేసి, మొలక వ్యాసాలు తగ్గించటానికి ఈ బృహుత్తర ప్రయత్నంలో భాగస్వామ్యం కావల్సిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:40, 31 మార్చి 2021 (UTC)
- ప్రభాకర శర్మ గారూ, మీరు కొన్ని వందల మొలకలను (ముఖ్యంగా వృక్ష శాస్త్ర మొలకలను) విస్తరించారు. ఇలాంటి ప్రాజెక్టులు విజయవంతమవ్వాలంటే మీవంటి వారు పాల్గొనాలి. మీరు తప్పకుండా ఇందులో భాగం పంచుకోవాలి సార్. __చదువరి (చర్చ • రచనలు) 04:17, 1 ఏప్రిల్ 2021 (UTC)
సార్ ,మీరు పెట్టిన ఈ పనిలో నేను భాగస్వామిని అవుతాను. కృతజ్ఞతలు--Prasharma681 (చర్చ) 07:38, 3 ఏప్రిల్ 2021 (UTC)
- ప్రభాకర్ శర్మ గారూ నమస్కారం.మీరు మొలక వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ లో భాగస్వామి కావటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.ప్రాజెక్ట్ పేజీలో పాల్గొనేవారు అనే విభాగంలో పేరు నమోదు చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 08:35, 3 ఏప్రిల్ 2021 (UTC)
ఈ వారం వ్యాసాలను ప్రత్యేకంగా వ్యాస రూపులో గుర్తించడం
[మార్చు]ఇటీవలి మార్పులు మెరుగు చేయడం భాగంగా విశేషవ్యాసాలకు లింకు చేర్చాను. ఈ వారం వ్యాసంగా ప్రదర్శితమైనవాటిలో కొన్నిటికి మాత్రమే {{విశేషవ్యాసం}} వాడారు. కావున వాటన్నిటికీ విశేష వ్యాసం గా గుర్తించేటందుకు ప్రతిపాదన చేశాను. పవన్ సంతోష్ గారు విశేష వ్యాసంపై గతంలో జరిగిన చర్చలను తెలిపి, నాణ్యత మదింపు చేసి మాత్రమే ఆ మూసను వాడాలని తెలిపారు. అందువలన ఈ వారం వ్యాసంగా ప్రదర్శనకు పరిగణించిన వ్యాసాలను {{ప్రదర్శన వ్యాసం}} అనే కొత్త మూసతో గుర్తించి వాటిలో జరిగే మార్పులను ఇటీవలి మార్పులలో ప్రత్యేక లింకు ద్వారా చూపటానికి ప్రతిపాదించాను. ఇది ఈ వారం వ్యాసం మూసకు సంబంధించిన వ్యాసాల గురించి కావున ఆ మూస చర్చలో {{సహాయం కావాలి}} మూస చేర్చి చర్చ ప్రారంభించాను. అయితే ఇప్పటివరకు కేవలం పవన్ మాత్రమే స్పందించారు. పవన్ సూచన మేరకు రచ్చబండలో ఈ వ్యాఖ్య చేర్చుతున్నాను. సహ సభ్యులందరు ఆ చర్చలో పాల్గొనవలసినది. అర్జున (చర్చ) 00:05, 2 ఏప్రిల్ 2021 (UTC)
- నా అభిప్రాయాలివి:
- ప్రస్తుతం తెవికీలో "ఈ వారం వ్యాసాలు" మాత్రమే ఉన్నాయి. ఈవావ్యా వ్యాసాన్ని నిర్ణయించడానికి పెద్దగా ప్రమాణాలేమీ పాటించడం లేదు. వీటికే "విశేష వ్యాసం" అనో "ప్రదర్శిత వ్యాసం" అనో కొత్తపేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. వీటిని "ఈ వారం వ్యాసాల"నే పిలవొచ్చు.
- వీటిలో కొన్నిటిని గతంలో విశేష వ్యాసాలని అన్నాం గదా, మిగతా వాటిని కూడా అనేద్దాం అని అంటున్నారు. అది సరికాదు. సరైన పని ఏంటంటే.. ఆ కొన్ని వ్యాసాలను కూడా విశేష వ్యాసాలని అనకుండా ఉండడం. వాటి లోంచి విశేషవ్యాసం మూసను తీసెయ్యడం. ఎందుకంటే..
- ..ఎందుకంటే, "విశేష వ్యాసం"గా పరిగణించేందుకు మనం ప్రమాణాలేమీ నిర్ధారించుకోలేదు. ముందు వాటిని నిర్ధారించుకుందాం. ఆ తరువాత ఆ గీటురాయిని వాడి వ్యాసాల నాణ్యతను పరీక్షించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ప్రమాణాలు ఎలా ఉండాలీ అనేందుకు ఒక ఉదాహరణగా మంచి వ్యాసం ప్రమాణాలను చూడవచ్చు. (ఇది కేవలం సూచిక గానే ఉదహరిస్తున్నాను.)
- ప్రస్తుతం ప్రమాణాలు లేనందువలన వలన, ఫలానా వ్యాసం "విశేష వ్యాసమో" కాదో తేల్చలేం.
- ఇప్పుడు మనకు కావాల్సింది ప్రమాణాలను నిశ్చయించుకోవడం. ఒకసారి ప్రమాణాలంటూ ఏర్పరచుకున్నాక, వాటికి అనుగుణంగా వ్యాసాలను మెరుగుపరచుకున్నాక, సగర్వంగా వాటికి తారకలను ఇచ్చుకుందాం. ఇటీవలి మార్పులులో చూపించుకుందాం. అప్పటి వరకు ఆగుతే మంచిది.
- కాదు, అప్పటి దాకా ఆగలేం ఇప్పుడే చూపించాలి అంటే.. ఇటీవలి మార్పులు లో చేర్చే కొత్త అంశానికి "విశేష వ్యాసాలు" అనే పేరు పెట్టకుండా, దానికి "ఈ వారం వ్యాసాలు" అనే పేరునే పెట్టి, దాని కింద "ఈ వారం వ్యాసాల" న్నిటినీ చూపించవచ్చు.
- ఈ వారం వ్యాసాలన్నీ ఒక వర్గంలో ఈసరికే చేరే ఉన్నాయి కాబట్టి కొత్తగా ఆ వ్యాసాల్లో కొత్తగా తారకలను చేర్చాల్సిన అవసరం లేదు.
- ఎట్టకేలకు చర్చను విస్తృత పరిధి లోకి తీసుకొచ్చినందుకు అర్జున గారికి ధన్యవాదాలు. విశేష వ్యాసాలకు, ఈ వారం వ్యాసాలకూ ప్రమాణాలను రూపొందించే దిశగా ఆలోచించమని ఆయన్ను కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 08:28, 2 ఏప్రిల్ 2021 (UTC)
- నా అభిప్రాయం మూస చర్చ:ఈ వారం వ్యాసం లో వెల్లడించాను. యర్రా రామారావు (చర్చ) 09:54, 2 ఏప్రిల్ 2021 (UTC)
- కె.వెంకటరమణ అభిప్రాయాలు
గత కొన్నేళ్ళుగా ఈ వారం వ్యాసాలను మొదటి పుటలో ప్రచురిస్తున్నాను. ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించలేము. వికీపీడియాలో నాణ్యతా ప్రమాణాలను నిర్థారించకుండా ఎవరైనా వాడుకరి తాను రాసిన వ్యాస చర్చా పేజీలో "ఈ వారం వ్యాసం పరిగణన" మూసను చేర్చడం, కొన్ని వ్యాసాలను ఇతర వాడుకరులు కూడా దాని పరిమాణం చూసి "ఈ వారం వ్యాసం పరిగణన" మూసను చేర్చడం జరుగుతుంది. ఈ వ్యాసాలను ప్రచురించేటప్పుడు "ఈ వారం వ్యాసం పరిగణనల వర్గం" చూసి అందులోని వ్యాసాలను ప్రచురించాలనే నియమం పూర్వం నుంఛి ఏర్పరచుకున్నాం. ఆ వర్గంలోని వ్యాసాలలో మంచి వ్యాసం ప్రమాణాలు కలిగినవి 10 శాతం కూడా ఉండవు. కానీ ఏదో ఒకటి మొదటి పుటలో ప్రచురించాలి కదా! నాణ్యత కలిగిన వ్యాసాలు లేకపోయినా తప్పని పరిస్థితులలో ఉన్నవాటిలో కొద్దిగా ఎక్కువ పరిమాణంలో ఉండి, శుద్ధి చేయబడినది ఈ వారం వ్యాసంగా ప్రచురించడం జరిగినది. వికీ అభివృద్ధి చెందిన కొద్దీ అటువంటి విధానాన్ని మార్చాలి. ఒకసారి ఈ వారం వ్యాసం పరిగణన మూసను చేర్చాక ప్రతీ వ్యాసం చర్చాపేజీలో అది వ్యాసంగా ప్రచురించుటకు నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉన్నదా లేదో చర్చించాలి. అది మంచి వ్యాసంగా పరిగణించబడితుందని భావిస్తే ప్రచురించాలి. నిర్వాహణ మూసలు, శుద్ధి చెయబడిన వ్యాసాలను కూడా ఈ.వా.వ్యాసాలుగా వర్గంలో చేర్చారు. నాణ్యతా ప్రమాణాలను లేని చిన్న వ్యాసాలు/నిర్వహణా మూసలు ఉన్న వ్యాసాలు/శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసాల చర్చా పేజీలలోని ఈ.వా.వ్యా మూసను తొలగించాలి.
- ఈ వారం వ్యాసాలు విశేష వ్యాసాలు కాదు. 2007 నుంచి ప్రచురించబడిన ఈ వారం వ్యాసాలలో కొన్ని తరువాత కాలంలో తొలగించబడడం కూడా గమనించాను. అందువలన వ్యాస నాణ్యతను పరీక్షించి అందులో ఏవైనావిశేష వ్యాసాలుంటే వాటిని విశేష వ్యాసాల తారకను చేర్చవచ్చు. ప్రదర్శించబడిన వ్యాసాలు ఇదివరకే వివిధ వర్గాలలో ఉన్నవి. వాటికి కొత్తగా పేర్లు పెట్టవలసిన అవసరం లేదు. ప్రస్తుతం విశేష వ్యాసాలుగా పరిగణించేందదుకు ప్రమాణాలను నిర్థారించుకోవలసిన అవసరం ఉంది. ప్రమాణాలు నిర్థారించుకున్న తరువాత ఈ వారం వ్యాసాలలో ఏవైనా విశేష వ్యాసాలుంటే పరీక్షించవచ్చు. ప్రచురించబడిన ఈ వారం వ్యాసాలన్నీ సంవత్సరాల వారీ, వారాలవారీ, వర్గాలలో ఉన్నందున కొత్తగా ఆ వ్యాసాలలో నక్షత్రాలను చేర్చవలసిన అవసరం లేదు. -- K.Venkataramana -- ☎ 09:56, 2 ఏప్రిల్ 2021 (UTC)
- యర్రా రామారావు అభిప్రాయాలు
- వికీపీడియాలో విశేషవ్యాసానికి తగినప్రామాణికతలు ఏమీ సముదాయంలో నిర్థారించకుండా లేదా నిర్ణయంలేకుండా ఏదేని వ్యాసానికి విశేషవ్యాసంగా సింబల్ గా ఆకుపచ్చ నక్షత్రం, పసుపుపచ్చ నక్షత్రం , లేదా ఇంకొక ఏదేని సింబల్ వాడటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:59, 3 ఏప్రిల్ 2021 (UTC)
- పవన్ సంతోష్ అభిప్రాయాలు
- నేను ఇంతకుముందు మూస చర్చ:ఈ వారం వ్యాసం వద్ద నా అభిప్రాయాలు చెప్పాను. రచ్చబండలోకి ఈ చర్చను తరలించాలనీ లేదా కనీసం నోటిఫై చేయాలని కూడా అందులో రెండు పాయింట్లు రాశాను. ఇక్కడ చర్చిస్తున్న తోటి సభ్యులు కూడా చూసేందుకు వీలయ్యేలా వాటిని తీసేసి మిగిలిన పాయింట్లు ఇక్కడ చేరుస్తున్నాను.
- అర్జున గారు, ఈవారం వ్యాసాలకు ప్రదర్శిత వ్యాసం అని ఒక మూస పెట్టి, వ్యాసంలో కుడిచేతివైపున ఒక పచ్చ నక్షత్రం వచ్చేలా గౌరవం కల్పిస్తానంటున్నారు. ఎందుకు అంటే రెండు కారణాలుగా 1) వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం 2) ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు.
- మొదటి ఉద్దేశం పట్ల నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటే - అసలు వీటి నాణ్యత ఏమిటన్నది మనకు తెలియదు. వీటిని ఎంపిక చేయడానికి ఉన్న కొలమానాలు ఏమిటి? ఒకటి - కనీసం 5 బైట్లు ఉండాలి. రెండు - గతంలో ప్రదర్శింపబడి ఉండకూడదు. మూడు - అనువదించాల్సిన భాగాలు ఉండకూడదు. నాలుగు - కనీసం ఒక బొమ్మ ఉండాలి. ఈ నాలుగిటిలో నాణ్యత గురించి కానీ, వ్యాసం విలువ గురించి కానీ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఏ వ్యాసం నాణ్యత ఏదో కనీసం మదింపు కూడా లేకుండా ఇలాంటి గౌరవం లేక ప్రత్యేకత కల్పించకూడదు.
- ఇటీవలి మార్పుల్లో ఈ వ్యాసాల్లో మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటుచేయడంపై నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ, ఒక మూస/వర్గం వ్యాసంలో చేరిస్తే పని అయ్యేప్పుడు దానికి నక్షత్రాలూ అవీ చేర్చనక్కరలేదు.
- ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 04:47, 5 ఏప్రిల్ 2021 (UTC)
అర్జున గారూ, ఈ వారం వ్యాసాల పేరుమార్పు/తారకలు వగైరాలకు సంబంధించి మీ ప్రతిపాదనకు ఇక్కడ వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడ గానీ, వేరే పేజీలో గానీ మీకు సమర్ధనగా ఒక్కరే రాగా, వ్యతిరేకంగా కనీసం నలుగురు మాట్లాడారు. ఇతర "ఇటీవలి మార్పులు" పేజీలో చూపించాలంటే ఈ వారం వ్యాసాలు అనే పేరుతోనే చూపించాలి, అలా చూపించవచ్చు, పేజీల్లో తారకలు పెట్టనవసరం లేదు, పెట్టరాదు అని చెప్పినప్పటికీ మీరు ప్రదర్శన వ్యాసాలు అనే పేరుతో మూసలు/తారకలు పెట్టడం మొదలుపెట్టారు. నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పాలని ఆ తరువాత ఆ ప్రమాణాలకు తూగే వాటికే తారకలు ఇవ్వాలని చెప్పినప్పటికీ, దాన్ని తూష్ణీకరించి ఇలా చెయ్యడం సరైన పద్ధతి కాదు. మీరు చేసిన పనులను వెనక్కి తిప్పమని కోరుతున్నాను. ఇటీవలి మార్పులులో "ఈ వారం వ్యాసాలు" అనే పేరుతో, ఆ వర్గం లోని పేజీలనే వాడి, చెయ్యవలసినదిగా కోరుతున్నాను. ఈ పని చేసేందుకు ఇసరికే అన్ని వనరులూ ఉన్నప్పటికీ మీరు అనుకున్న మాటే చెల్లాలని, నలుగురి వ్యతిరేకతను ఎందుకు తోసిపుచ్చుతున్నారు? అనుకున్న నాణ్యతను సాధించేందుకు మనం కృషి చెయ్యాలి. అంతే తప్ప ఉన్నవాటికే పేర్లు మార్చేసి, తారకలు పెట్టేసి ఇదే నాణ్యత అనుకుందామంటే మనలను మనమే మోసం చేసుకోవడం అవుతుంది అని గమనించండి. కనీసం నాణ్యత విషయంలోనైనా దయచేసి పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ను అనుసరించకండి. నమస్కారం. __చదువరి (చర్చ • రచనలు) 04:29, 7 ఏప్రిల్ 2021 (UTC)
- ప్రయోగాత్మకం అంటూ ప్రతిపాదించిన తారను ఒకటి తయారుచేసి బాలాంత్రపు రజనీకాంతరావు అన్న వ్యాసపేరుబరి పేజీలో @Arjunaraoc: గారు చేర్చేశారు. ఒకపక్క చర్చ జరుగుతున్నప్పుడు, చర్చలో చాలామంది మౌలికంగా అసలు నాణ్యతలో చాలా ఎగుడుదిగుళ్ళు ఉన్న ఇలాంటి పేజీలకు తారలే ఇవ్వవదన్న సూచన చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం సరికాదు. ఒకవేళ అందరూ ఒక ఆలోచన బావుందనీ, కాకుంటే అది అమలు ఎలా ఉంటుందో తెలియదనీ అభిప్రాయపడితే అప్పుడు ప్రయోగం చేసి చూడడంలో అర్థం ఉంది కానీ ఇక్కడ ఆ ఆలోచనే సరికాదని అత్యధికులు చెప్తూ ఉంటే ప్రయోగం పేరిట ఇదంతా చేయడం సరికాదు. పైన చర్చలోనే @Chaduvari: గారు దీన్ని గుర్తించి ఈ పద్ధతి సరికాదనీ, ఈ ధోరణిలో పోవద్దనీ అర్జున గారిని కోరుతూ రాశారు. అంతేగాక, చర్చలో పాల్గొన్నవారిలో ఒక్కరు తప్ప మరెవ్వరూ ఈవారం వ్యాసాలకు అలాంటి తారలు ఇవ్వడాన్ని సూత్రప్రాయంగా కూడా అంగీకరించలేదు. అలాంటప్పుడు ప్రయోగం దేనికి? ఈ పద్ధతి సరికాదు కాబట్టి బాలాంత్రపు రజనీకాంతరావు, జల వనరులు వ్యాసాల్లో తారచేరుస్తూ ఆయన చేసిన మార్పును తిరగకొట్టాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:15, 7 ఏప్రిల్ 2021 (UTC)
ట్వింకిల్ తెలుగీకరణ
[మార్చు]ట్వింకిల్ కు సంబంధించి కొన్ని ఇంటర్‌ఫేసు విషయాలు ఇంకా ఇంగ్లీషు లోనే ఉన్నాయి. కొన్నిటిని గతంలో అనువదించుకున్నప్పటికీ, ఇంకా కొన్ని ఇంగ్లీషు లోనే ఉండిపోయాయి. ఉదాహరణకు -
- కొత్త వాడుకరిని స్వాగతించినపుడు, దిద్దుబాటు సారాంశం ఇంగ్లీషులో "వెల్‌కమ్ టు వికీపీడియా!" అని వస్తుంది (ఇటీవలి మార్పులలో చూడవచ్చు). దీన్ని మార్చాలి.
- TW అనే మెనూ ట్యాబు కింద ఉన్న అంశాలను నొక్కినపుడు వచ్చే డయలాగుల్లో చాలా వరకు ఇంగ్లీషే ఉంది. వాటిని తెలుగు లోకి మార్చాలి. (TW కింద ఉండే CSD,XFD,.. వగైరా అంశాలను మార్చనక్కర లేదు)
ఇలాంటి తెలుగీకరణ చెయ్యాలంటే దానికి ఇంటర్‌ఫేసు అడ్మిన్ అనే హోదా అవసరం. ప్రస్తుతం మనలో ఎవరికీ ఆ అనుమతులు లేవు. ఒక అధికారిగా నేను ఆ ఎవరికైనా అనుమతులు ఇవ్వగలను. ఎక్కడెక్కడ ఏమేం మార్చాలో తెలిసినవా రెవరైనా ఈ పని చేసేందుకు ముందుకు వస్తే, వారికి ఈ అనుమతులు ఒక వారం గడువుతో ఇస్తాను. లేదా నాకు నేనే ఇచ్చుకుని పని పూర్తి చేస్తాను. సముదాయ సభ్యులకు అభ్యంతరం ఏమైనా ఉంటే రెండు రోజుల్లో తెలుపగలరు. పై ట్వింకిల్ పనులతో పాటు ఇంకా ఏమైనా పనులుంటే కూడా చేసెయ్యవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 04:39, 3 ఏప్రిల్ 2021 (UTC)
- దీనికోసం నే చేసిన దిద్దుబాటు అభ్యర్ధనను మీడియావికీ చర్చ:Gadget-Twinkle.js పేజీలో చూడవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 05:09, 3 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారూ గమనించింది మీరే కాబట్టి, అధికారిగా మీకు మీరే అనుమతి ఇచ్చుకొని తగిన మార్పులు, సవరణలు చేయటం బాగుంటుంది.దీనికి నేను సమ్మతించుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:50, 3 ఏప్రిల్ 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు. ట్వింకిల్ తెలుగీకరణ బాధ్యతను మీరు తీసుకున్నా, ఎవరైనా ఇతర సభ్యులు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నా నాకు సమ్మతమే.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:13, 3 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari గారు, ట్వింకిల్ ఇంటర్ ఫేస్ విషయాలను తెలుగులో అనువదించి ట్వింకిల్ ఉపయోగాన్ని మరింత సులభతరం చేస్తున్నందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 23:16, 5 ఏప్రిల్ 2021 (UTC)
ప్రగతి నివేదిక
[మార్చు]ట్వింకిల్ తెలుగీకరణ దాదాపు 90% పూర్తైంది. ఎక్కువగా వాడే అంశాలన్నీ దాదాపుగా అయినట్లే. ఈ తెలుగీకరణకు సంబంధించిన విశేషాలు కొన్ని:
- తెలుగీకరణ చేసినది మీడియావికీ:Gadget-Twinkle.js అనే పేజీని.
- ఈ పేజీ దాదాపు 15,000 లైన్లు గల జావాస్క్రిప్టు ఫైలు.
- ఇందులో సుమారు 1200 నుండి 1500 లైన్లను - పూర్తిగా లైనంతటినీ గాని, అందులో కొంత భాగాన్ని గానీ - అనువదించాల్సి ఉంటుంది. ఒక్కో లైన్నూ ఒక స్ట్రింగు అనుకుంటే సుమారు 1200 - 1500 స్ట్రింగులను అనువదించాలన్న మాట (నిజానికి కొన్ని లైన్లలో ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగులుంటై). పోలిక కోసం చూస్తే..
- మీడియావికీ సాఫ్టువేరు లోని కోర్ భాగం దాదాపు 4000 స్ట్రింగులుంటుంది. అందులో 90% అనువదించుకున్నాం.
- మీడియావికీ మొత్తం అంతా కలిపి (కోర్, పొడిగింతలు వగైరాలన్నీ కలుపుకుని) 40,600 స్ట్రింగులు. అందులో మనం అనువదించుకున్నది 31 శాతమే. (అయినప్పటికీ, మన రోజువారీ వాడుకలో ఇంగ్లీషు దాదాపు ఎక్కడా కనబడదు)
- మళ్ళీ ట్వింకిల్‌కు వస్తే.., పై స్ట్రింగుల్లో చాలా కొద్ది భాగాన్ని నేను 2016, 2018 ల్లో (సుమారు 50 - 60 స్ట్రింగులను) అనువదించాను (అప్పట్లో దిద్దుబాటు చెయ్యడానికి నిర్వాహకులకు అనుమతి ఉండేది).
- ఈ విడతలో దాదాపు వెయ్యి దాకా స్ట్రింగులను అనువదించి ఉండొచ్చు.
- ఇంకా రెండు మూడొందల స్ట్రింగులు చెయ్యాల్సి ఉండవచ్చు. వాటి కోసమూ, ఇప్పటికి అనువదించినవాటిలో దోషాలేమైనా ఉంటే వాటి సవరణల కోసమూ, నేను తీసుకున్న ఇంటర్‌ఫేసు నిర్వాహక అనుమతిని మరొక వారం పాటు పొడిగించుకుంటాను.
- ట్వింకిల్‌లో ప్రస్తుతం చేసిన అనువాదాలను కింది చోట్ల పరీక్షించవచ్చు:
- TW ట్యాబు నొక్కినపుడు వచ్చే మెనూ అంశాల్లోకి వెళ్ళి అక్కడ చూపించే డయలాగు పెట్టెల్లో అనువాదాలను పరిశీలించాలి. ఈ మెనూ అంశాలు పేరుబరిని బట్టి మారుతూంటాయి. అన్ని పేరుబరులోని అన్ని అంశాలనూ పరీక్షించండి.
- వికీపీడియా:Twinkle/Preferences పేజీ: ఈ పేజీలో దాదాపుగా ఇంగ్లీషు ఉండదు - చరరాశుల పేర్లు, జావాస్క్రిప్టుకు సంబంధించినది తప్ప. ఈ పేజీలో మీకు తగ్గట్టుగా సెట్టింగులను మార్చుకుని భద్రపరిస్తే, ఆ సెట్టింగులు మీ జావాస్క్రిప్టు పేజీలో భద్రమౌతాయి. ఉదాహరణకు నా జావాస్క్రిప్టు పేజీ చూడండి.
వాడుకరులు ట్వింకిల్ ను పరిశీలించి, దోషాలు, సవరణలను సూచించవలసిందిగా కోరుతున్నాను. ఈ వారంలో మీ సూచనలను బట్టి అవసరమైన సవరణలు చేసేస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 16:36, 12 ఏప్రిల్ 2021 (UTC)
తెవికీ కృషి సమస్యలు
[మార్చు]నాకు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి టైపింగ్ చేస్తున్నపుడు పొరపాటు వస్తే బ్యాక్ స్పేస్ చేస్తుంటే వెనక ఉన్నపదాలు పోతున్నాయి. డిలేట్ బటన్ కొడితే పోయినట్టు. రెండవది లాగిన్ అవని వాళ్ళకు లిప్యంతిరీకరణ చాలాసేపు అయ్యాకనే కనిపించడం. లాగిన్ అయిన వాళ్ళకూ వెంటనే లిప్యంటిరీకరణ బాక్స్ కనిపించకపోవడం కనిపించినా ఎక్కదో విసిరేసినట్టుగా ఉండటం, ఇది టైప్ చేసే చోట దగ్గరలో ఉంటే బావుంటుంది.B.K.Viswanadh (చర్చ) 07:38, 3 ఏప్రిల్ 2021 (UTC)
- @B.K.Viswanadh గారూ,
ఈ సమస్య ఇక్కడ ఎందుకు రాసారో తెలవదు గానీ... - మీ సమస్యకు కారణాలు/పరిష్కార మార్గాలు కిందివాటిలో ఉండే అవకాశం ఉంది, చూడండి:
- సమస్య ఎదురైన దిద్దుబాటులో మీరు రాసిన పాఠ్యాన్ని కాపీ చేసి వేరే చోట భద్రపరచుకోండి. దిద్దుబాటును రద్దు చేసెయ్యండి. ఆ పేజీని మళ్ళీ దిద్దుబాటు మోడులో తెరవండి. కాపీ చేసుకున్న పాఠ్యాన్ని దిద్దుబాటు పెట్టెలో అతికించి, మీ దిద్దుబాటును కొనసాగించండి. 90% మీకు సమస్య ఉండదు.
- మీరు దిద్దుబాటు కోసం తెరిచిన పేజీ చాలా పెద్దది కావచ్చు (విభాగం దిద్దుబాటు ప్రయత్నించి చూడండి. ప్రవేశికను దిద్దుబాటు చెయ్యాలనుకుంటే, మీ అభిరుచుల్లో ప్రవేశిక దిద్దుబాటు పెట్టెలో టిక్కు పెట్టుకోండి.
- సోర్సు ఎడిటరులో కాకుండా విజువల్ ఎడిటరులో దిద్దుబాటు చెయ్యండి. విజూవల్ ఎడిటరులో ఈ సమస్య కుసింత తక్కువ ఉంటుంది.
- మీ బ్రౌజరు బాగా బరువెక్కిపోయి ఉండొచ్చు - బోలెడన్ని ట్యాబులతో, చాలా సేపటి నుండీ పనిచేస్తూ ఉండి ఉండవచ్చు. దాన్ని మూసేసి, ఓ రెణ్ణిముషాలాగి మళ్ళీ తెరవండి. ట్యాబులు మరీ ఎక్కువగా తెరవకండి.
- మీరు చాలా సేపటి నుండీ దిద్దుబాటు చేస్తూ ఉండి ఉండవచ్చు. (దిద్దుబాటు మొదలెట్టి చాలాసేపై ఉండవచ్చు)
- మీ కంప్యూటరు మెమరీ (ర్యామ్) సరిపోవడం లేదేమో.
- పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 08:03, 3 ఏప్రిల్ 2021 (UTC)
- నమస్తే చదువరి గారు. ట్వింకిల్ పై సమస్య అని రాసారు కనుక ఇవి నాకున్న సమస్యలు అని రాసాను. మీ సూచనలు గమనిస్తాను. ధన్యవాదాలుB.K.Viswanadh (చర్చ) 04:56, 4 ఏప్రిల్ 2021 (UTC)
మొబైల్ లో ఎడిటింగ్ చేయటంలో కూడా చాలా ఇబ్బందులు వున్నాయి , ముఖ్యంగా ఒక్కోసారి ఏదైనా వత్తు పెట్టవలసి వస్తున్నప్పుడు క్య యుుుుుాాూూూూూ ఇలా సాగుతున్నాయి : Kasyap (చర్చ) 06:51, 6 ఏప్రిల్ 2021 (UTC)
- అవి తొలగించటానికి కూడా తొందరగా డిలీట్ అగుటలేదు యర్రా రామారావు (చర్చ) 04:57, 7 ఏప్రిల్ 2021 (UTC)
Universal Code of Conduct – 2021 consultations
[మార్చు]Universal Code of Conduct Phase 2
[మార్చు]Please help translate to your language
The Universal Code of Conduct (UCoC) provides a universal baseline of acceptable behavior for the entire Wikimedia movement and all its projects. The project is currently in Phase 2, outlining clear enforcement pathways. You can read more about the whole project on its project page.
Drafting Committee: Call for applications
[మార్చు]The Wikimedia Foundation is recruiting volunteers to join a committee to draft how to make the code enforceable. Volunteers on the committee will commit between 2 and 6 hours per week from late April through July and again in October and November. It is important that the committee be diverse and inclusive, and have a range of experiences, including both experienced users and newcomers, and those who have received or responded to, as well as those who have been falsely accused of harassment.
To apply and learn more about the process, see Universal Code of Conduct/Drafting committee.
2021 community consultations: Notice and call for volunteers / translators
[మార్చు]From 5 April – 5 May 2021 there will be conversations on many Wikimedia projects about how to enforce the UCoC. We are looking for volunteers to translate key material, as well as to help host consultations on their own languages or projects using suggested key questions. If you are interested in volunteering for either of these roles, please contact us in whatever language you are most comfortable.
To learn more about this work and other conversations taking place, see Universal Code of Conduct/2021 consultations.
Global bot policy changes
[మార్చు]నమస్తే!
I apologize for sending a message in English. Please help translate to your language. According to the list, your wiki project is currently opted in to the global bot policy. As such, I want to let you know about some changes that were made after the global RfC was closed.
- Global bots are now subject to a 2 week discussion, and it'll be publicized via a MassMessage list, available at Bot policy/New global bot discussion on Meta. Please subscribe yourself or your wiki if you are interested in new global bots proposals.
- For a bot to be considered for approval, it must demonstrate it is welcomed in multiple projects, and a good way to do that is to have the bot flag on at least 5 wikis for a single task.
- The bot operator should make sure to adhere to the wiki's preference as related to the use of the bot flag (i.e., if a wiki doesn't want a bot to use the flag as it edits, that should be followed).
Thank you for your time.
Best regards,
—Thanks for the fish! talk•contribs 18:48, 6 ఏప్రిల్ 2021 (UTC)
సహాయం కావాలి మూస వాడకంలో లోపాలు
[మార్చు]సహాయం కావాలి మూస కేవలం సహాయం అవసరంకోసమే వాడాలికాని, చర్చలుకు ఎందుకు ఉపయోగించాలి?చర్చలకు దీని అవసరమేంటి? అనే దానిపై నాకున్న సందేహాలు, అభిప్రాయాలు దిగువ వివరిస్తున్నాను.
- సహాయం కావాలి (Help me or Need Help), చర్చ (Discussion or Conversation) ఇవి వేరు వేరు పదాలు వేరు వేరు అర్థాలు సూచిస్తాయి.
1. అసలు సహాయం కావాలి అనేదానిని ఏ సందర్బంలో వాడాలి అనేదానిని పరిశీలిస్తే సహాయం అనేది ఏ వ్యక్తి కైనా ఏదైనా అవసరాన్నిబట్టి, అవతలివ్యక్తి, లేదా వ్యక్తులు సహాయం చేయటానికి అవకాశం ఉంది అనిభావించి కోరటాన్ని సహాయం కావాలి అనేదానికి వర్తించింది.దానికి ఉదాహరణగా:ఏదేని ఒక వ్యాసంలో మీడియా ఫైల్ ఎక్కించాలంటే ఎలా, లేదా ఆవ్యాసానికి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే ఎలా అని అడగవచ్చు.అసలు ఆ మూసలోనే సహాయంం కోసం తరచూ అడిగే ప్రశ్నలు వివరింపబడింది. ఇందులో సహాయం లభించవచ్చు, లభించకపోవచ్చు.ఇలాంటి సందర్బాలలోనే వాడాలిగానీ, చర్చలకు దీనిని వాడాల్సిన అవసరంలేదు.
2. అసలు చర్చ (Discussion or Conversation) అంటే ఏమిటి? అనేదానికి వస్తే ఇది ఒక అంశంపై సందేహం కలిగినప్పుడు దానిని నివృత్తి చేసుకోవటానికి, లేదా వికీపీడియా పరంగా సరైనది కానప్పుడు (NOT PROPER) (ప్రతికూలమైన, వక్రమైన; అళీకమైన; తగని; కూడని; అయోగ్యమైన, తప్పైన; నిజముకాని, న్యాయవిరుద్ధమైన; పక్షపాతమైన,) ఇలాంటి సందర్బాలలో మొదలుపెట్టే సంభాషణ.చర్చలో ఆలోచించిన విషయాలపై సంభాషణ సమయంలో అభిప్రాయాలను పంచుకోవడం ప్రధానంగా ఉంటుంది. మర్యాదపూర్వక సమాజంలో చర్చకు ముందు విషయం మారుతుంది లేదా వివాదాస్పదమవుతుంది.ఇందులో చర్చలో పాల్గొనినవారు అందరూ ఏకాభిప్రాయం తెలుపవచ్చు, లేదా భిన్నాభిప్రాయాలు, విభిన్న అభిప్రాయాలు వెల్లడించవచ్చు. మరి చర్చలకు సహాయం మూస ఎలావాడతారు? చర్చలకు సహాయం మూస వాడటంలో అర్థంలేదు. చర్చలకుసహాయం మూస వాడి, భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు సహాయం విఫలం లేదా సహాయం లభించింది అని నిర్థారణ ఎలా చేస్తారు.ఇది ప్రారంభించటానికి ఎలాగూ ప్రతిపేజీకి చర్చాపేజీలు ఉన్నవి.రచ్చబండ ఉంది.అందువలన ఇలాంటి చర్చలకు దీనిని వాడవలసిన అవసరంలేదు. దీనిమీద ఇంతకన్నా పెద్ద వివరణ అవసరంలేదు అనుకుంటాను.
3. ఇంక సహాయం విఫలం అనే విషయానికి వస్తే, సహాయం అందేదాకా ఉంచాలిగాని, ఒక వారం రోజుల తరువాత సహాయం విఫలం అని మూస చేర్చి, సహాయం లభించని పేజీలనే వర్గంలోకి పంపించటం ఎంతవరకు సబబు.వాటిని తిరిగి ఎవరైనా ఎప్పుడైనా మరలా పరిశీలించి సహాయం చేసిన సందర్బాలు ఉన్నాయా?లేవు.సహాయం లభించేదాకా మూస అలానే ఉండాలి.
4. సహాయస్థితిలో సహాయం మూస స్థానం: సముదాయ పందిరి, రచ్చబండ లోని కుడి వైపు పట్టికలో సహకారం స్థితి అనే విభాగం క్రింద వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనేదానిని మిగతావి చూపించినట్లుగా మాత్రమే చూపిస్తే సరిపోతుంది.కానీ ఇది వర్గంలో ఉన్నపేజీలు కూడా చూపిస్తుంది.మరిదీనికి ప్రత్యేకత ఎందుకో అర్థమగుటలేదు. ఇలా అవసరంలేదు.మిగతా వర్గాలలాగానే ఉంటే సరిపోతుంది. దీని మీద చురుకైన వికీపీడియన్లు, వారి స్పందనలు, అభిప్రాయాలు, సూచనలు తెలియచేయవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:56, 8 ఏప్రిల్ 2021 (UTC)
- ఈ విషయంపై యర్రా రామారావు గారి అభిప్రాయాలతో స్థూలంగా ఏకీభవిస్తున్నాను. టూకీగా:
- {{సహాయం కావాలి}} అనే మూస చర్చల్లో పెట్టేందుకు పనికిరాదు. సహాయం వేరు, చర్చ వేరు. సహాయం అడిగిన వ్యక్తి, వచ్చిన సహాయం తనకు పనికొచ్చిందో లేదో నిర్ణయించుకుని తాను పెట్టిన "సహాయం కావాలి" అనే మూసను తీసి విఫలం మూసనో, సఫలం మూసనో పెడతారు. కానీ చర్చ అలాంటిది కాదు, చర్చలో కోరేది అభిప్రాయం. చర్చను మొదలెట్టినవారు, వచ్చిన అభిప్రాయాలు తనకు నచ్చాయో లేదో చూసుకుని దాన్నిబట్టి చర్చ సఫలమైందని ముగించడమో, లేదంటే చర్చ విఫలమైందని ముగించి, కొత్తగా మళ్ళీ మొదలెట్టడమో చెయ్యరు, చెయ్యకూడదు. ఆ ఊహే హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి చర్చకు ఈ మూసలు పనికిరావు. పిడుక్కీ బియానికీ ఒకే మంత్రం వెయ్యకూడదు.
- అసలు {{సహాయం కావాలి}}, {{సహాయం కావాలి-విఫలం}}, {{సహాయం చేయబడింది}} అనే మూసలను వాడడంలో కూడా తర్కం సరిగ్గా లేదు. ఈ రెండవ మూడవ మూసలను దుర్వినియోగం చెయ్యడం కూడా ఈమధ్య చూసాం. అంచేత వాటిని ఎప్పుడు, ఎవరు వాడాలో కూడా సరిగ్గా నిర్దేశించుకోవాల్సిన అవసరం సముదాయానికి ఉంది.
- ఇకపోతే సముదాయ పందిరిలో ఉంచిన {{సహకారం స్థితి}} మూస గురించి.. రామారావు గారూ, ఇప్పుడు ఉన్న రూపం కొంత సంస్కరించాక వచ్చినది, అంతకు ముందు మరీ అన్యాయంగా ఉండేది. ఆ మూస చరిత్రలో ఇటీవల జరిగిన మూణ్ణాలుగు దిద్దుబాట్లను, వాటి దిద్దుబాటు సారాంశాలనూ చూస్తే విషయం తెలుస్తుంది.
- ఇంకొకటి.. రామారావు గారూ, ఇలాంటి ప్రతిపాదనలను వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీకి ఉపపేజీగా చేరిస్తే బాగుంటుంది. రచ్చబండలో మొదలుపెడితే, అది కొత్తగా చేరిన చర్చల కింద కూరుకుపోయి, కనబడకుండా పోయి, చివరికి పాత పేజీల్లో చేరిపోతుంది. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 07:16, 19 ఏప్రిల్ 2021 (UTC)
ఫీచర్ ఫోనుల కోసం వికీపీడియా అనువర్తనం
[మార్చు]జియోఫోన్ ఫీచరు ఫోన్లు, ఇతర కైఓయెస్ ఆధారిత ఫోన్ల కోసం ఒక వికీపీడియా అనువర్తనం తయారుచేసారు. దీన్ని ఆయా ఫోన్లలో కైఓఎస్ స్టోరు లేదా జియోస్టోరు నుండి దించుకోవచ్చు ( కైఓఎస్ స్టోరులో వికీపీడియా అనువర్తనం పేజీ). జియోఫోన్ అనే ఫీచర్ ఫోను ఉన్నవారు దీన్ని ప్రయత్నించి చూడండి.
ఈ అనువర్తనాన్ని తెలుగు లోనికి అనువదించాను. తెలుగు అనువర్తనం వాడుకరులకు త్వరలోనే అందుబాటులోనికి రావచ్చు.
కొత్త చదువరుల కోసం ఉత్పత్తులు రూపొందించే ఇనుక జట్టు ఆశయంలో ఒక భాగం ఈ ఫీచర్ ఫోనుల కోసం వికీపీడియా అనువర్తనం.
— వీవెన్ (చర్చ) 08:12, 9 ఏప్రిల్ 2021 (UTC)
- @Veeven గారికి, కొత్త విషయం తెలిపినందులకు, దానికి అవసరమైన తెలుగు స్థానికీకరణ చేసినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 23:14, 12 ఏప్రిల్ 2021 (UTC)
Line numbering coming soon to all wikis
[మార్చు]From April 15, you can enable line numbering in some wikitext editors - for now in the template namespace, coming to more namespaces soon. This will make it easier to detect line breaks and to refer to a particular line in discussions. These numbers will be shown if you enable the syntax highlighting feature (CodeMirror extension), which is supported in the 2010 and 2017 wikitext editors.
More information can be found on this project page. Everyone is invited to test the feature, and to give feedback on this talk page.
-- Johanna Strodt (WMDE) 15:09, 12 ఏప్రిల్ 2021 (UTC)
కొత్తగా చేరినవారి కోసం విజువల్ ఎడిటరు
[మార్చు]వికీలో దిద్దుబాట్లు చేసేందుకు మనకు విజువల్ ఎడిటరు, వికీటెక్స్టు ఎడిటరు అనే రెండు ఎడిటర్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. వికీటెక్స్టు ఎడిటరులో మళ్ళీ రెండు కూర్పులున్నై - 2010 వికీటెక్స్టు ఎడిటరు, 2017 వికీటెక్స్టు ఎడిటరు. ఈ మూడింటిలో మనకు కావాల్సినదాన్ని మన అభిరుచుల్లోకెళ్ళి ఎంచుకోవచ్చు.
ఈ మూడు ఎడిటర్లలోనూ విజువల్ ఎడిటరు అనేది అన్నిటికంటే ఇంద్రియ సహజంగా (ఇంట్యూటివ్) ఉంటుందని వర్డును వాడినట్లుగా దాన్ని తేలిగ్గా వాడుకోవచ్చని మనకు తెలిసిందే. అంచేత కొత్తవారికి ఇది అనుకూలమైనది. అంచేతనే గ్రోత్ ప్రాజెక్టులో చేరే కొత్తవారికి డిఫాల్టుగా విజువల్ ఎడిటరునే చూపిస్తున్నారు. అయితే..
గ్రోత్ ప్రాజెక్టును పరీక్షించే నిమిత్తం ఒక కొత్త వాడుకరిని సృష్టించుకున్నపుడు ఒక సంగతిని గమనించాను - నాకు విజువల్ ఎడిటరును ఇవ్వకుండా 2010 వికీటెక్స్టు ఎడిటరును ఇచ్చింది. అలా ఇవ్వకూడదు గదా అని నేను గ్రోత్ బృందాన్ని అడిగాను - ఈ లింకు చూడండి. "మామూలుగానైతే అలా జరక్కూడదు, కొత్త ఖాతా సృష్టించుకోకముందు మీరు 2010 వికీటెక్స్టు ఎడిటరును వాడారేమో చూడండి" అని వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. ఆ సంగతి ముందు నేను గమనించలేదు కాబట్టి, నేను మళ్ళీ మరొక ఖాతాను సృష్టించుకుని పరిశీలించాను. నిజమే, వాళ్ళు చెప్పినట్లే జరిగింది: ఖాతా సృష్టించుకోబోయే ముందు నేను ఏ ఎడిటరు వాడి ఉంటే ఖాతా సృష్టించుకున్నాక దాన్నే నాకు ఇస్తోంది. నేను అసలు ఏ ఎడిటరూ వాడి ఉండకపోతే, అప్పుడు విజువల్ ఎడిటరును ఇస్తుంది. గ్రోత్ ప్రాజెక్టు వరకూ అది సరిపోతోంది.
కానీ అసలు ఖాతాయే లేనపుడు, ఎడిటర్లు ఎన్ని ఉన్నాయో, ఏది ఎలా ఉంటుందో తెలీక, కనబడిన దేదో వాడినంత మాత్రాన, ఖాతా సృష్టించుకున్నాక కూడా అదే ఎడిటరును ఇస్తానంటే ఎలా? చాలామంది కొత్త వాడుకరులకు ఈ ఎడిటర్ల గొడవ ఏంటో తెలీక పోవడం సహజమే గదా. వాళ్ళకు ఏది మంచిదో సాఫ్టువేరే చూసి, దాన్నే వాళ్ళకు ఇవ్వాలి గదా.
అంచేతనే నేను అక్కడ - ఖాతా సృష్టించేముందు అతడు ఏం చేసాడో అనవసరం, వాడుకరిగా నమోదయ్యాక మాత్రం అతడికి ఖచ్చితంగా విజువల్ ఎడిటరే ఇవ్వాలి అని కోరాను. అయితే ఈ అంశం గ్రోత్ ప్రాజెక్టు బృందం పరిధిలో లేదు కాబట్టి వాళ్ళు విజువల్ ఎడిటరు బృందానికి దాన్ని పంపించారు. ఆ విషయం ఇక్కడ చూడవచ్చు. చదువరి (చర్చ • రచనలు) 09:05, 15 ఏప్రిల్ 2021 (UTC)
- అలాగేనండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:52, 15 ఏప్రిల్ 2021 (UTC)
ఎక్కువగా చేరేవారు మొబైల్ వాడుతున్నారు కాబట్టి, శీర్షికలు,ఇంటర్ వికీ లింకులు,ప్రాథమిక రూపంలో రిఫరెంస్నులు చేర్చతానికి సోర్స్ ఏడిటర్ అనువుగా వుంటుంది అని నేను గ్రహించాను, కాబట్టి వారు వాడే పరికరం బట్టి సరైన ఎడిటర్ మొదట చెప్పవచ్చు : Kasyap (చర్చ) 04:48, 23 ఏప్రిల్ 2021 (UTC)
- @Kasyap గారూ, మీరు రాసినది చదివి ఆశ్చర్యపోయాను (నిజానికి నాకు నమ్మకం కుదరలేదు. అయితే నేను మొబైల్లో ఎప్పుడూ పనిచెయ్యలేదు కాబట్టి నాకు తెలియదు కూడా.) ఈ విషయాన్ని మరింత వివరంగా, కారణాలతో రాస్తే వాడుకరులందరికీ ఉపయోగంగా ఉంటుంది. పరిశీలించండి. వికీపీడియా:మొబైల్ పరికరాలపై దిద్దుబాటు చెయ్యడం పేజీలో రాయండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 09:18, 24 ఏప్రిల్ 2021 (UTC)
ట్వింకిల్‌లో జావాస్క్రిప్టు తెలిసినవారి సహాయం కావాలి
[మార్చు]ట్వింకిల్‌లో ఒక సమస్య ఉంది. దాని వివరం ఇది:
- ఎవరైనా "వాడుకరి చర్చ" పేజీకి వెళ్ళండి ఉదాహరణకు వాడుకరి చర్చ:GrowthChaduvari1
- ఆ పేజీలో TW మెనూలో warn నొక్కండి.
- ఒక డయలాగ్ పెట్టె కనిపిస్తుంది. అందులో రెండు డ్రాప్ డౌన్ పెట్టెలు ఒకదాని కింద ఒకటి ఉంటాయి
- మొదటి దానిలో సాధారణ గమనింపు (1) అనేది సెలెక్టయి ఉంటుంది. దాన్ని డ్రాప్ డౌన్ చేసి చూస్తే మరో ఏడెనిమిది ఉంటాయి.
- రెండవదానిలో "{{uw-vandalism1}}: దుశ్చర్య" అనేది సెలెక్టయి ఉంటుంది. డ్రాప్ డౌనులో చూస్తే ఇంకా చాలానే ఉంటాయి.
- ఇప్పుడు సమస్య ఏంటంటే.. మొదటి దానిలోని డ్రాప్ డౌన్ జాబితా లోని అంశాల్లోంచి మరేదైనా ఎంచుకున్నపుడు, తదనుగుణంగా కింది పెట్టెలోని జాబితా మారిపోవాలి. అంటే పై పెట్టెలో "జాగ్రత్త (2)" అనేది ఎంచుకుంటే కింది పెట్టెలో జాబితా మొత్తం మారిపోయి వేరే జాబితా రావాలి. ఈ కొత్త జాబితా లోంచి "{{uw-vandalism2}}: దుశ్చర్య" అనే అంశం సెలెక్టయి ఉండాలి. అలాగే పై పెట్టెలోని జాబితాలో ఇతర అంశాలను ఎంచుకుంటే కింది పెట్టె లోని దానికి అనుగుణంగా జాబితా మారిపోతూ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. నేను దీన్ని క్రోమ్, ఎడ్జ్ - ఈ రెండు బ్రౌజర్లలోనూ చూసాను.., రెండిట్లోనూ సమస్య కనిపించింది.
- ఇది జావాస్క్రిప్టు లోపమని నేను అనుకుంటున్నాను.
- ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ వికీపీడియాల్లో చూసాను. అక్కడ ఈ సమస్య లేదు. బెంగాలీ ట్వింకిల్, మన ట్వింకిల్ రెండు ఒకే వెర్షన్‌లో ఉన్నట్టున్నాయి (ఈ రెండు భాషల్లోనూ ట్వింకిల్ చాలావరకు ఒకే పెద్ద జావాస్క్రిప్టు పేజీలో ఉంది. అది 15000 లైన్లుంది. మిగతా భాషల్లో అది అనేక చిన్నచిన్న ఫైళ్ళుగా ఉంది). నేను ఈ రెండు ఫైళ్ళనూ పోల్చి చూసాను గానీ నాకు తేడా తెలీలేదు. నేను మీడియావికీ:Gadget-morebits.js (ట్వింకిల్ దీని ద్వారానే మీడియావికీతో మాట్లాడుతుంది) అనే పేజీని కొత్తగా దిగుమతి చేసుకుని చూసాను. కానీ దానితో అసలు ట్వింకిల్ కనబడ్డమే మానేసింది. అంచేత దాన్ని మళ్ళీ పాత కూర్పుకే తీసుకుపోయాను. ఇప్పుడు ట్వింకిల్ బానే కనబడుతోంది.
జావాస్క్రిప్టు తెలిసినవాళ్ళు దీన్ని తేలిగ్గా సరిచెయ్యగలరని అనుకుంటున్నాను. వాళ్ళు చూడవలసిన పేజీలు ఇక్కడ ఇస్తున్నాను:
పేజీ పేరు: మీడియావికీ:Gadget-Twinkle.js, దీని బెంగాలీ ప్రతిని చూడండి.
జావాస్క్రిప్టు తెలిసినవాళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలని వినతి. చదువరి (చర్చ • రచనలు) 16:32, 15 ఏప్రిల్ 2021 (UTC)
- అయితే, ఇప్పుడే ఒక లోపాన్ని గమనించాను.. మీడియావికీ:Gadget-morebits.js పాత కూర్పును తిరిగి స్థాపించాక, TW మెనూ కనిపిస్తోంది గానీ, దాని కింద ఉన్న అంశాలు దేన్ని నొక్కినా, పనేమీ జరగడంలేదు. ఇది ఖచ్చితంగా మీడియావికీ:Gadget-morebits.js పేజీ లోని లోపమే. నేను కూర్పులను మార్చినపుడు లోపం ఏదైనా జరిగిందేమో.. జావాస్క్రిప్టు తెలిసినవాళ్ళు చూడవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 01:07, 16 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు, మీడియావికీ:Gadget-morebits.js లో మీరు చేసిన మార్పులు కొన్ని మిగిలిపోయనట్లు గమనించి అవి పూర్తిగా రద్దు చేయగా ప్రస్తుతం మెనూలు కనబడతున్నాయి. --అర్జున (చర్చ) 04:36, 16 ఏప్రిల్ 2021 (UTC)
- @Arjunaraoc గారూ, నాకు ఇప్పుడు TW ట్యాబు కనబడ్డమే లేదు! (క్రోం, ఎడ్జ్ బ్రౌజర్లలో చూసాను) ఇంతకుముందు ఆ ట్యాబు కనిపించింది గానీ, మెనూ అంశాలను నొక్కితే ఏదీ పనిచేయ్యలేదు. మీరు చేసిన సవరణ తరువాఅత ఆ ట్యాబే కనిపించడం లేదు. మరొక్కసారి పారిశీలించి చూస్తారా? (లేక సమస్య నా కంప్యూటర్లోనే ఉందా!!?) __ చదువరి (చర్చ • రచనలు) 05:23, 16 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారూ, నాకు కూడా TW ట్యాబు కనిపించడం లేదండీ. రవిచంద్ర (చర్చ) 05:30, 16 ఏప్రిల్ 2021 (UTC)
- సరేనండి. __ చదువరి (చర్చ • రచనలు) 05:41, 16 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారూ, నాకు కూడా TW ట్యాబు కనిపించడం లేదండీ. రవిచంద్ర (చర్చ) 05:30, 16 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున గాఅరూ, మీరు చేసిన మార్పును వెనక్కి తిప్పానండి. ఇప్పుడు ట్యాబు కనిపిస్తోంది. కానీ మెనూ అంశాలేవీ పనిచెయ్యడం లేదు. నేను దీని గురించి Wikipedia talk:Twinkle వద్ద సహాయం అడిగాను. చూద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 05:52, 16 ఏప్రిల్ 2021 (UTC)
- ట్వింకిల్ లోని సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం బాగానే పని చేస్తోంది.(@Arjunaraoc,@రవిచంద్ర గార్లు గమనించవలసినది.)
- అయితే ఒరిజినల్‌గా ఉన్న సమస్య (పైన 6 పాయింట్లలో రాసిన సమస్య) అలాగే ఉంది. అది తప్ప మిగతా అంశాలు బాగానే పనిచేస్తున్నాయి. దాని గురించి కూడా అడిగాను. ఏం చెబుతారో చూద్దాం. __ చదువరి (చర్చ • రచనలు) 10:55, 17 ఏప్రిల్ 2021 (UTC)
- నేను పైన రాసిన 6 పాయింట్ల సమస్య కూడా పరిష్కారమైపోయింది. ఇప్పుడూ ట్వింకిల్ నేను చూసినంతమేరకు అన్నివిధాలా సరిగ్గానే పని చేస్తోంది. మీకేమైనా సమస్యలు కనిపిస్తే చెప్పండి. పోతే అనువాదాలు కూడా చాలావరకు అయిపోయాయి. ఇంకా ఏమినా మిగిలుంటే వచ్చే రెండు మూడు రోజుల్లో చేసేస్తాను. అనువాదం చెయ్యాల్సినవి ఏమైనా కనిపిస్తే కూడా ఇక్కడ రాయండి. __ చదువరి (చర్చ • రచనలు) 13:30, 17 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari గారు, సమస్యను వేగంగా పరిష్కరించినందులకు అభివందనాలు. అర్జున (చర్చ) 23:02, 17 ఏప్రిల్ 2021 (UTC)
- నేను పైన రాసిన 6 పాయింట్ల సమస్య కూడా పరిష్కారమైపోయింది. ఇప్పుడూ ట్వింకిల్ నేను చూసినంతమేరకు అన్నివిధాలా సరిగ్గానే పని చేస్తోంది. మీకేమైనా సమస్యలు కనిపిస్తే చెప్పండి. పోతే అనువాదాలు కూడా చాలావరకు అయిపోయాయి. ఇంకా ఏమినా మిగిలుంటే వచ్చే రెండు మూడు రోజుల్లో చేసేస్తాను. అనువాదం చెయ్యాల్సినవి ఏమైనా కనిపిస్తే కూడా ఇక్కడ రాయండి. __ చదువరి (చర్చ • రచనలు) 13:30, 17 ఏప్రిల్ 2021 (UTC)
- @Arjunaraoc గారూ, నాకు ఇప్పుడు TW ట్యాబు కనబడ్డమే లేదు! (క్రోం, ఎడ్జ్ బ్రౌజర్లలో చూసాను) ఇంతకుముందు ఆ ట్యాబు కనిపించింది గానీ, మెనూ అంశాలను నొక్కితే ఏదీ పనిచేయ్యలేదు. మీరు చేసిన సవరణ తరువాఅత ఆ ట్యాబే కనిపించడం లేదు. మరొక్కసారి పారిశీలించి చూస్తారా? (లేక సమస్య నా కంప్యూటర్లోనే ఉందా!!?) __ చదువరి (చర్చ • రచనలు) 05:23, 16 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు, మీడియావికీ:Gadget-morebits.js లో మీరు చేసిన మార్పులు కొన్ని మిగిలిపోయనట్లు గమనించి అవి పూర్తిగా రద్దు చేయగా ప్రస్తుతం మెనూలు కనబడతున్నాయి. --అర్జున (చర్చ) 04:36, 16 ఏప్రిల్ 2021 (UTC)
కొత్త సభ్యులకు తొలి స్వాగత సందేశం
[మార్చు]తెవికీలో 2006 లో కొత్త సభ్యులకు {{స్వాగతం}} సందేశం తొలికూర్పు వైజాసత్య గారు తయారు చేశారు. దానిని మెరుగు చేయటానికి ప్రధానంగా మాకినేని ప్రదీప్ గారు, నేను, చదువరి గారు కృషి చేశాము. ఏవైనా మార్పులు మూస చర్చాపేజీలోనో, రచ్చబండలోనో చాలావరకు చర్చించి చేయడం జరిగింది. వికీపీడియాలో కొత్త వాడుకరులు ఏ క్షణమైనా చేరుతారు, వారిని ఎవరైనా స్వాగతిస్తారు కావున తొలి స్వాగత సందేశం ఏకరూపంగా వుంటేనే, ఆ కొత్త వాడుకరి చర్చలో ప్రతిస్పందించేటప్పుడు సులభంగా ఎవరైనా స్పందించగలుగుతారు. అందువలన కొన్ని సార్లు సభ్యులు ఇతర రూపాల స్వాగత సందేశం వాడుతుంటే వారిని {{స్వాగతం}} మూసనే వాడమనగా వారు అంగీకరించటం జరిగింది. ఇటీవల స్వాగత సందేశంలో మార్పుల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమై, పాక్షిక ఏకాభిప్రాయం కుదిరింది. అయినా చదువరి గారు, సాధారణ స్వాగతంతో పోలిక లేని, ఏకాభిప్రాయం కుదరని అంశాలతో కొత్త {{క్లుప్తస్వాగతం}} సృష్టించి సముదాయానికి తెలిపి, స్పందనలు తెలుసుకోకుండా కొత్త ప్రాజెక్టు సభ్యుల కొరకని వాడడం ప్రారంభించారు. దీనిపై నేను అభ్యంతరం తెలిపి, ఖాతా తెరిచిన వారు వికీపీడియా సభ్యులవుతారు, ఆ తరువాతనే ఏదైనా కొత్త ప్రాజెక్టు సభ్యులవుతారని, కావున సాధారణ స్వాగత సందేశం తర్వాత, అదనపు స్వాగత సందేశంగా ప్రాజెక్టు స్వాగత సందేశాన్ని వాడమని సూచించినా వారు పాటించలేదు. కావున ఈ విషయంపై సముదాయ నిర్ణయం కొరకు ఈ చర్చ ప్రారంభించుతున్నాను. చర్చ నేపథ్యం కొరకు మూస చర్చ:క్లుప్తస్వాగతం, మూస_చర్చ:స్వాగతం#2014_పుస్తకం_లింకు లింకులు చూడండి. అర్జున (చర్చ) 22:17, 16 ఏప్రిల్ 2021 (UTC)
- ఈ చర్చను మొదలుపెడుతూ @Arjunaraoc గారు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. ఇందులో ప్రతిపాదన లేదు, ఆయన ఆరోపణలున్నాయి అంతే. అసలు జరిగినదేంటో చెప్పలేదు. నేనేం చెప్పానో చెప్పలేదు, తానేం చెప్పారో చెప్పలేదు. నేను తప్పు చేసేసానని మాత్రం తీర్మానించి తీర్పు చెప్పమని సముదాయాన్ని కోరుతున్నారు. ఇది అన్యాయం.
- కనీసం కింద పవన్ సంతోష్ గారు అడిగిన సమాచారాన్నైనా అర్జున గారు ఈ చర్చను మొదలుపెడుతూ ఇచ్చి ఉండాల్సింది. అవేమీ ఇవ్వకుండా ఈ చర్చను మొదలుపెట్టడం పూర్తి ఏకపక్షంగా ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 04:50, 17 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari గారు, నా స్పందన చూడండి. అర్జున (చర్చ) 23:58, 23 ఏప్రిల్ 2021 (UTC)
చర్చ మధ్యవర్తిత్వం, నిర్ణయం చేసే సభ్యుని పేరు ప్రతిపాదన
[మార్చు]వాడుకరి:రవిచంద్ర గారిని, ఈ చర్చని క్రమబద్ధంగా నడిపించడానికి మధ్యవర్తిత్వం చేయమని, చర్చలు చివరిదశకు చేరినప్పుడు నిర్ణయం చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 22:24, 16 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున గారి ఈ కోరికపై నా పరిశీలనలు ఇవి:
- మధ్యవర్తిత్వం అంటే ఒక వ్యక్తి చర్చలలో పాల్గొని ఇరుపక్షాల అభిప్రాయాలనూ అవసరమైన చోట్ల మోడరేషను చేస్తూ, ఒక ఏకాభిప్రాయంకోసం కృషి చేస్తారు. అందుకోసం, అవసరమైతే తన అభిప్రాయాలను చెబుతారు. అవసరమైతే ఫలానావారి అభిప్రాయంలో ఇలాంటి దోషముంది అని చెప్పి అభిప్రాయాలను మెరుగుపరుస్తారు. కానీ చర్చా ఫలితాన్ని నిర్ణయించేవారు ఆ పని చెయ్యరు. చర్చలో కలగజేసుకోరు, చేసుకోకూడదు. చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుని, వాటిలో వికీ విధానాలకు అనుగుణంగా లేనివాటిని పక్కనపెట్టేసి తన నిర్ణయం చెబుతారు. నిర్ణయంలో అతన స్వీయాభిప్రాయానికి తావులేదు. అంచేత ఈ రెండు పనులూ 'పరస్పర అంటరానివి' (మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్). ఈ రెండు పనులూ ఒక్కరినే చెయ్యమని ఎవరూ అడగరాదు, ఎవరూ చెయ్యనూరాదు.
- చర్చ ముగిసాక ఎవరైనా నిర్ణయం చెప్పండనో, ఫలానావారు నిర్ణయం చెప్పండనో కోరతాం, అది సహజం కూడా. కాని చర్చను మొదలెడుతూనే ఫలానావారిని నిర్ణయం చెప్పమని కోరడం గతంలో లేదు. అసలు అలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలీదు."వికీపీడియాలో సాంప్రదాయాలను మీరు గౌరవించకుండా,.. " అంటూ అర్జున గారు నన్ను (దీనికి మూలమైన చర్చలో) నిందించారు. మరి అర్జున గారు ఏ సంప్రదాయాన్ని గౌరవించి ఈ అభ్యర్థన చేసారో తెలుసుకోవాలనుంది.
- ఇప్పుడు, "వారు నిర్ణయం చెయ్యడం పట్ల నాకు అభ్యంతరం ఉందని" నేను అంటే, లేదా మరెవరైనా అంటే ఏం జరుగుతుంది? వారు ఇక నిర్ణయం చేసేందుకు ముందుకు వస్తారా?
- నిర్ణయం చెయ్యమని అడగడం అంటే.. ఈ చర్చలో మీ అభిప్రాయం చెప్పకండి అని ఆ వ్యక్తికి చెప్పేసినట్టేగా! కానీ అయన తన అభిప్రాయం చెప్పదలిస్తే? అలా చెప్పాలంటే నిర్ణయం చెప్పమన్న అభ్యర్థనను ఆయన తిరస్కరించాలి.
- ఇప్పుడు, ఆ వ్యక్తే ముందుకు వచ్చి, నేను ఈ నిర్ణయం చెయ్యను, అభిప్రాయం చెబుతాను అని అంటే ఏంచేస్తారు? మరొకరిని అడుగుతారా? వాళ్ళూ కాదంటే మరొకరిని అడుగుతారా? ఇలా అడుగుతూ పోతారా?
- నిజానికి ఈ చర్చలో అర్జున గారు ఏదో ప్రతిపాదన చెయ్యలేదు. నాపై ఆరోపణలు చేసారంతే. నేను తప్పు చేసానని ఆరోపిస్తూ ఆయన ఈ చర్చను చేపట్టారు. అలాంటపుడు ఫలానావారిని నిర్ణయం చెప్పమనో మధ్యవర్తిత్వం చెయ్యమనో కోరేముందు అయన నన్ను సంప్రదించి ఉండాల్సింది కదా. అదేదో సంప్రదాయమనో, విధానమనో నేను అనడం లేదు. కానీ అదొక మర్యాద అని అంటున్నాను. ఆ మర్యాద ఆయన నాకు ఇవ్వలేదు.
- వాడుకరులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 04:38, 17 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari గారు, వికీపీడియా లో చర్చల వాతావరణం విపరీతంగా దెబ్బతిన్నదని గత చర్చలు పరిశీలించిన ఎవరికైన తెలుస్తుంది. అందువలనే నేను మధ్యవర్తి అభ్యర్ధన చేశాను. కావున మీకు ఆ ప్రతిపాదనపై అభ్యంతరముంటే, వేరే పేరు తెలియచేయండి. దానిగురించి మీరు తెలిపిన స్పందనలు, ఊహాగానాల వలన ఉపయోగంలేదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 23:55, 23 ఏప్రిల్ 2021 (UTC)
- నేను పైన తెలిపిన అభ్యంతరాల తరువాత నైనా అర్జున గారు తన తప్పును తెలుసుకుంటారని వేచి చూసాను. కాని తన చర్యను సమర్థించుకునే విఫల ప్రయత్నం చేసారు తప్ప, తప్పు గ్రహించలేదు. పైగా నన్ను ఒక పేరు సూచించమని చెబుతూ నన్నూ తప్పు చెయ్యమన్నారు. దీనిని నేను నిరసిస్తున్నాను. ఒక తప్పును సవరించడానికి మరొక తప్పు చెయ్యనక్కర్లేదు. నేను అలా చెయ్యను. అర్జున గారు చేసిన తప్పును సవరించే ప్రయత్నమే చేస్తాను. అందుకే అర్జున గారు చేసిన నాపై చేసిన ఈ తప్పు అభియోగాలపై నిర్ణయం ఎవరు చెప్పాలో కూడా ఆయనే నిర్ణయించడం నాకు సమ్మతం కాదని తెలియజేస్తున్నాను. రవిచంద్ర గారు ఈ నిర్ణయం చేయాలనే అర్జున గారి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను. చర్చ జరిగాక, మామూలు పద్ధతి లోనే నిర్ణయం చెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:07, 24 ఏప్రిల్ 2021 (UTC)
చర్చించడానికి ముందు కొన్ని వివరణలు కావాలి
[మార్చు]@Arjunaraoc: గారూ, ఈ చర్చ ప్రారంభించే ముందు మీ నుంచి స్పష్టత కావాలి:
- ఇంతకు ముందు చర్చ జరిగిందా? ఏకరూప స్వాగతం గురించి గత చర్చల్లో ఉందన్నట్టు చదువరి గారితో చర్చల్లో మీరు మాట్లాడారు. తెలుగు వికీపీడియాలో ఎక్కడ ఈ చర్చ జరిగి, సముదాయ సభ్యులు ఆమోదించారో ముందు చెప్పండి. "ఏకరూప స్వాగతం గురించి ఇప్పటికే గత చర్చలలో తెలపటం జరిగింది" అన్నారు. ఈ తెలపడం జరగడం ఏమిటి? ఆ విషయం మీ స్వంత అభిప్రాయం అయితే - "గత చర్చల్లో తెలిపాను" అనాలి. వేరేవాళ్ళ అభిప్రాయం అయితే "తెలిపారు" అనాలి. సముదాయం నిర్ణయించి ఉంటే "గత చర్చల్లో నిర్ణయం అయింది" అనాలి. చర్చ మాత్రమే జరిగి ఉంటే "గతంలో చర్చ జరిగింది" అనాలి. ఇదేమీ కాకుండా ఈ రాజకీయ నాయకుల పడికట్టు భాష మనకెందుకు? ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పండి. ఎవరు ఎవరిని స్వాగతించినా ఒకటే మూస వాడాలన్న విషయమై చర్చ జరిగిందా? లేదా? జరిగితే లింకు ఎక్కడ ఉంది?
- అసలు వివాదం ఏమిటి?: 2014 నాటి వికీపీడియాలో రచనలు చేయుట అని మీ నాయకత్వంలో అనువదించిన పుస్తకం ఇప్పుడు కాలదోషం పట్టినదని చదువరి గారు భావించి దాన్ని ఆ మూస లోంచి తొలగిద్దామన్నారు. ఆయన కాలదోషం అంటే మీరు "పుస్తకం విలువ కాలంతో కొంత తగ్గవచ్చు కాని, దాని ఆధారిత సాంకేతికాలు పూర్తిగా తొలగితే తప్ప, విలువ పూర్తిగా కోల్పోదు." అన్నారు. "మీకో నమస్కారం సార్" అని "ఆ కాలదోషం పట్టిన పుస్తకపు లింకును తిరిగి పెట్టేసా"నన్నారు. ఇదే కదా మీరు చెప్పే "పాక్షిక ఏకాభిప్రాయం". చదువరి గారికి ఇది కాలదోషం పట్టిన పుస్తకము, దీన్ని ఆ స్వాగతం మూసలో ఉంచడం అనవసరము అన్న స్పష్టత ఉంది. మీకు కాలంతో దాని విలువ తగ్గిందో లేదో కూడా తెలియదు. "తగ్గవచ్చు" అని అస్పష్టంగా వాడారు. చిన్న ఉదాహరణ తీసుకుందాం: ఆ పుస్తకం మొత్తం మీద మొబైల్ ఇంటర్ఫేస్ గురించి, యాప్ గురించి చిన్న ముక్క అయినా ఉందా? మనకు మొబైల్ నుంచి చేరుతున్నవారు ఇబ్బడిముబ్బడిగా లేరా? మరి కాలదోషం పట్టింది కాకపోతే ఏమిటిది? మీ ఇష్టాఇష్టాల కోసం కొత్తగా వచ్చిన వాడుకరులకు కాలదోషం పట్టిందో లేదో మీకే తెలియని ఒక పుస్తకం స్వాగతంగా ఇస్తే తెలుగు వికీపీడియా బాగుపడుతుందా? ఈ పుస్తకం లెగసీ మీద మీకు ఆసక్తి ఉంటే తోటి వాడుకరులు ఇది కాలదోషం పట్టిందని గట్టిగా చెప్తున్నప్పుడు, సామరస్వపూర్వకంగా దీని లింకు స్వాగతం మూస నుంచి తీసేసి, దాన్ని మీరు మళ్ళీ నడుంకట్టుకుని, తోటివాళ్ళని జతచేర్చుకుని ఇంప్రూవ్ చేసి ఉండకూడదా?
క్లుప్తంగా మరోసారి చెప్తున్నాను, ఈ చర్చ ముందుకు వెళ్ళాలంటే 1) "ఒకటే స్వాగతం కొత్తవారు అందరికీ చెప్పాలని" ఎక్కడైనా చర్చ జరిగిందో లేదో కచ్చితంగా చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. ఉంటే ఉందని చెప్పండి. సంప్రదాయాలూ అవీ వద్దు. అవి తర్వాత మాట్లాడుకుందాం. సూటిగా ఈ విషయం మీద చర్చ జరిగిందా లేదా? 2) "వికీపీడియాలో రచనలు చేయుట" అన్న పుస్తకంలో బోలెడంత అస్పష్టత, అసమగ్రత ఉండగా దాన్ని "లెగసీ కోసం తప్ప" ఎందుకు స్వాగతం మూసలో ఉండి తీరాలని పట్టుబడుతున్నారో చెప్పండి. చదువరి గారు సూటిగా, స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు కాలదోషం పట్టిందో. --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 17 ఏప్రిల్ 2021 (UTC)
దస్త్రంపై చర్చ పేరుబరి
[మార్చు]మనకున్న "చర్చ" పేరుబరుల పేర్లన్నీ ఒకరకంగా ఉన్నాయి, దస్త్రంపై చర్చ: పేరుబరి పేరు మాత్రం భిన్నంగా ఉంది. మిగతావి వాడుకరి చర్చ, వికీపీడియా చర్చ,... ఇలా ఉండగా, ఇది మాత్రం దస్త్రంపై చర్చ అని "పై" ప్రత్యయంతో కూడి ఉంది. అలా ఎదుకు చేసుకున్నామో తెలియదు, ఇన్నాళ్ళూ అలాగే ఎందుకు ఉండనిచ్చామో తెలియదు. దీన్ని కూడా మిగతావాటి లాగానే దస్త్రం చర్చ: అని మారుద్దాం అని నా ప్రతిపాదన. వ్యతిరేకత ఏమైనా ఉన్నా, భిన్నాభిప్రాయమేదైనా ఉన్నా చెప్పగలరు. __ చదువరి (చర్చ • రచనలు) 00:20, 18 ఏప్రిల్ 2021 (UTC)
- అసలు దస్త్రం అనేది కూడా సరైన పదం కాదు.దస్త్రం బదులు బొమ్మ అని ఉండాలి.బొమ్మ చర్చ అని ఉండాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:06, 18 ఏప్రిల్ 2021 (UTC)
- ఒకప్పుడు అది బొమ్మ (ఇంగ్లీషులో image) అనే ఉండేది. ఆ తరువాత, వీడియో, ఆడియో, డాక్యుమెంట్ల వంటి అనేక ఇతర రకాల ఫైళ్ళను కూడా చేర్చి దాన్ని విస్తరించి దానికి File: అని పేరు పెట్టినట్టున్నారు. ఆ ఫైలే మనకు దస్త్రం అయింది. ప్రస్తుతం ఈ పేరుబరిలో ఉన్న పేజీలను/ఫైళ్ళను చూస్తే దస్త్రం అనే పేరు సరైనదే అని తెలుస్తుంది. __ చదువరి (చర్చ • రచనలు) 06:23, 18 ఏప్రిల్ 2021 (UTC)
- అసలు దస్త్రం అనే పేరు సరైనది కాదనిపిస్తుంది. దస్త్రం బదులు "బొమ్మ" లేదా "చిత్రం" ఉంటే బాగుండునేమో పరిశీలించండి. ఇతర వికీపీడియాలైన హిందీ లో चित्र: అనీ, గుజరాతీ లో ચિત્ર: అనీ, కన్నడంలో ಚಿತ್ರ: అనీ, బెంగాలీ లో চিত্র: అనీ వాడుతున్నారు. చాలా వికీపీడియాలలో "చిత్రం" అనే పేరుబరి వాడుతున్నట్లుంది. మన తెలుగులోనే "దస్త్రం" అనే పదం వాడుతున్నట్లుంది. అది సరిచేస్తే మంచిదే. అయితే ఈ చర్చకు సంబంధించిన విషయానికొస్తే "దస్త్రంపై చర్చ" కు బదులు "దస్త్రం చర్చ" అంటేనే ఇతర పేరుబరుల మాదిరిగా ఉంటుందని నా అభిప్రాయం.-- K.Venkataramana -- ☎ 06:44, 18 ఏప్రిల్ 2021 (UTC)
- చిత్రం మాత్రమే కాకుండా ఆడియో, వీడియో, డాక్యుమెంటు వంటి రకాల ఫైళ్ళు ఉన్నందున "దస్త్రం" సరైన పేరనిపిస్తుంది.-- K.Venkataramana -- ☎ 12:16, 18 ఏప్రిల్ 2021 (UTC)
- వీడియో, ఆడియో, డాక్యుమెంట్ల వంటి అనేక ఇతర రకాల ఫైళ్ళను బట్టి చూస్తే దస్త్రం అనే పేరు ఉంటేనే సరిగా ఉంటుంది. అలాగే, దస్త్రంపై చర్చ పేరుబరికి బదులుగా దస్త్రం చర్చ పేరుబరి ఉండాలని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:52, 18 ఏప్రిల్ 2021 (UTC)
- ఒకప్పుడు అది బొమ్మ (ఇంగ్లీషులో image) అనే ఉండేది. ఆ తరువాత, వీడియో, ఆడియో, డాక్యుమెంట్ల వంటి అనేక ఇతర రకాల ఫైళ్ళను కూడా చేర్చి దాన్ని విస్తరించి దానికి File: అని పేరు పెట్టినట్టున్నారు. ఆ ఫైలే మనకు దస్త్రం అయింది. ప్రస్తుతం ఈ పేరుబరిలో ఉన్న పేజీలను/ఫైళ్ళను చూస్తే దస్త్రం అనే పేరు సరైనదే అని తెలుస్తుంది. __ చదువరి (చర్చ • రచనలు) 06:23, 18 ఏప్రిల్ 2021 (UTC)
నిర్వాహకత్వ కార్యక్రమాల అర్నెల్ల సమీక్ష
[మార్చు]చదువరి నిర్వాహకత్వ సమీక్ష
[మార్చు]2020 అక్టోబరు - 2021 మార్చి మధ్య కాలానికి నా నిర్వాహకత్వ కార్యకలాపాల స్వీయసమీక్షను తయారుచేసి సముదాయం పరిశీలన కోసం పెట్టాను. పరిశీలించగలరు. __ చదువరి (చర్చ • రచనలు) 06:18, 18 ఏప్రిల్ 2021 (UTC)
ప్రణయ్‌రాజ్ వంగరి నిర్వాహకత్వ సమీక్ష
[మార్చు]2020 అక్టోబరు - 2021 మార్చి మధ్య కాలానికి నా నిర్వాహకత్వ కార్యకలాపాల స్వీయసమీక్షను తయారుచేసి సముదాయం పరిశీలన కోసం పెట్టాను. పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:49, 18 ఏప్రిల్ 2021 (UTC)
తెవికీలో ట్వింకిల్ స్థితి
[మార్చు]ట్వింకిల్ అనువాదాలు చేస్తూండగాను, ఆ తర్వాత తలెత్తిన సమస్యలను, అంతకు ముందు నుండీ ఉన్న సమస్యలను పరిష్కరించే క్రమంలోనూ నేను కింది విషయాలను గమనించాను:
- మన దగ్గర ఉన్న ట్వింకిల్ రూపం చాలా పాతది. దాన్ని మనం స్థాపించుకున్నాక, ట్వింకిల్ అభివృద్ధి ముందుకు పోయింది. మనం మాత్రం 2013 లోనే ఉండిపోయాం.
- ఆ కారణం వల్లనే మన ట్వింకిల్ గాడ్జెట్ జావాస్క్రిప్టు ఫైలు 15,000 లైన్ల పొడుగుంటుంది. మొత్తం ట్వింకిలంతటినీ ఒకే ఫైల్లో కూరేసారు దాదాపుగా. తాజా కూర్పుల్లో అది 500 లైన్లకు మించదు. అనేక చిన్నచిన్న ఫైళ్ళుగా చేసారు దాన్ని. ఇంగ్లీషు, హిందీ వగైరా వికీల్లో ఈ చిన్న ఫైళ్ళే వాడుతున్నారు. బెంగాలీ వాళ్ళు మాత్రం మన లాగానే పే..ద్ద ఫైలు వాడుతున్నారు. మనం చేసుకున్నట్టే పెద్దయెత్తున అనువాదాలు చేసుకున్నారు వాళ్ళు.
- మన సమస్య పరిష్కారం కోసం ట్వింకిల్ చర్చ పేజీలో అడిగినపుడు వాళ్ళు మనల్ని కొత్త ఫైళ్ళు పెట్టుకొమ్మని చెప్పారు.
- కొత్త ఫైళ్ళు పెట్టుకుంటే, గత పది రోజులుగా నే చేసిన వెయ్యి పైచిలుకు అనువాదాలను మనం మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. (బహుశా బెంగాలీ వాళ్ళు అందుకే కొత్త ఫైళ్ళు తెచ్చుకోలేదేమో!)
- మళ్ళీ అనువాదం చేసుకోవడమనేది ప్రస్తుతానికి సమస్యే కావచ్చు గానీ, కొత్త ఫైళ్ళు తెచ్చుకుంటే ముందు ముందు మనకు సుఖంగా ఉంటుంది. సమస్యలు తక్కువగా వస్తాయి, వచ్చినా పరిష్కారాలు చప్పున దొరికేస్తాయి.
నా అభిప్రాయం మనం కొత్త ఫైళ్ళను తెచ్చుకోవాలని. అందరూ సరేనంటే ఆ పని చేద్దాం.
అలా ఫైళ్ళు తెచ్చుకోవడం స్థాపించడంలో కొన్ని సాంకేతిక సంగతులున్నై. వాటి గురించి నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు (@Arjunaraoc గారు ఈ పని చెయ్యగలరనుకుంటున్నాను) ఆ పని పెట్టుకోవాలని కోరుతున్నాను. ట్వికీల్ చర్చ పేజీలో నేను మొదలుపెట్టిన ఈ చర్చలో దాని గురించి చెప్పారు. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 14:37, 18 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari గారు, నేను ఆ చర్చలు గమనించాను. ట్వింకిల్ కొత్త రూపాన్ని పరిశీలించి తెవికీకి ప్రస్తుత రూపం తో పోల్చి ఉపయోగాలను విలువకట్టాలి. ఆంగ్లంలో వాడటానికి, బాటులు కూడా సహాయపడతాయి. మనం తెలుగులో సంబంధిత బాటులు లేనందున, మన ఉపయోగం పాక్షికమని నేను భావిస్తున్నాను. నా జావాస్క్రిప్ట్ నైపుణ్యం అంతంత మాత్రమే. నా ప్రస్తుత ప్రాధాన్యత పని అయిన తర్వాత పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 04:02, 19 ఏప్రిల్ 2021 (UTC)
ట్వింకిల్ మూసల అనువాదం
[మార్చు]ట్వింకిల్ చేసే అనేక పనుల్లో అది చాలా సమాచారాన్ని పంపిస్తూంటుంది. వాడుకరి నుండి ఒక నిర్దుష్ట వాడుకరికి, వాడుకరి నుండి వాడుకరులందరికీ, వాడుకరి నుండి పాఠకులకూ.. ఇలా సమాచారం ప్రవహిస్తూంటుంది. ఈ సమాచారమంతా కొన్ని వందల మూసల్లో ఇమిడ్చి ఉంచారు. ఈ మూసలు వివిధ వర్గాల్లో ఉన్నాయి. ఉదాహరణకు: వర్గం:Templates used by Twinkle, వర్గం:User warning template. వీటిలో కొన్నే మూసలను మనం అనువదించుకున్నాం. ఇంకా అనువదించాల్సినవి చాలానే ఉన్నాయి. వాటి అనువాదాల్లో పాలుపంచుకోవలసినదిగా వాడుకరులను కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 06:29, 19 ఏప్రిల్ 2021 (UTC)
- @Chaduvari చదువరిగారూ, ట్వింకిల్ కొత్త వెర్షనుకు నవీకరించడం పూర్తయ్యిందా? లేదా దాన్ని వాయిదా వేసారా? కొత్త వెర్షను నవీకరణ చేయడానికి నేను సిద్ధం! — వీవెన్ (చర్చ) 07:11, 19 ఏప్రిల్ 2021 (UTC)
- @Veeven గారూ, సూపర్!! నవీకరణ గురించి నేను అసలు ఏ పనీ చెయ్యలేదండి. మీరు ఆ పని చేసెయ్యవచ్చు.
- నేను కేవలం స్థానికీకరణ చేసానంతే! అది దాదాపుగా పూర్తైంది. మిగతాదాన్ని నవీకరణ చేసాక చేసుకుందాం. ఇప్పటివరకు నేను చేసిన అనువాదాలను అలాగే ఉంచుతూ ఈ నవీకరణ చెయ్యగలిగితే మాత్రం గొప్పగా ఉంటుంది. కాదూ అవి పోతాయి, మళ్ళీ చేసుకోవాల్సిందే అంటే.. చేసేదేమీ లేదు, మళ్ళీ చేసుకుందాం.
- ఇక మీరు పని మొదలుపెట్టెయ్యొచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 07:23, 19 ఏప్రిల్ 2021 (UTC)
- Veeven గారూ, మరింత స్పష్టత కోసం..,నవీకరణ వద్దనే అభిప్రాయాలేమీ రాలేదు, అంచేత దాన్ని వాయిదా వెయ్యలేదండి. మీరు చేసెయ్యొచ్చు. మీ వీలును బట్టి పని మొదలు పెట్టెయ్యొచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 07:37, 19 ఏప్రిల్ 2021 (UTC)
- నవీకరణలో అనువాదాలు పోతాయి. కానీ, కొత్త వెర్షనుకు నవీకరించుకోవడం ఇకముందు పెద్ద సమస్యగా ఉండబోదు. అలాగే మనకు కావాల్సిన ప్రత్యేక విశేషాలను/సౌలభ్యాలను ట్వింకిల్‌లో మనమే చేర్చుకోవడమూ వీలవుతుంది. ఇది భవిష్యత్తు దృష్ట్యా ప్రయోజనకరమే. ట్వింకిల్ కోర్‌ను అనువదించడం ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్‌లో మరో రెండు మూడు రోజులలో కుదురుతుంది. కనుక కోడులోకి వెళ్ళి మనం అనువదించే అవసరం ఉండదు. మూసలు మాత్రం ఎలాగా ఇక్కడ అనువదించుకోవాల్సిందే!
- నవీకరించిన ట్వింకిల్ పరీక్షించడానికి తయారుకాగానే తెలియజేస్తాను. — వీవెన్ (చర్చ) 07:40, 19 ఏప్రిల్ 2021 (UTC)
- సరే!__ చదువరి (చర్చ • రచనలు) 07:41, 19 ఏప్రిల్ 2021 (UTC)
- ట్వింకిల్ ఉపకరణాన్ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్‌లో తెలుగించవచ్చు. — వీవెన్ (చర్చ) 15:17, 19 ఏప్రిల్ 2021 (UTC)
- @Veeven గారూ, అనువాదం అయిపోయింది. ట్వింకిల్ ను స్థాపించాక, అవసరమైన సవరణలు (సందర్భోచితంగా లేనివి వగైరా) చేసుకుందాం. __ చదువరి (చర్చ • రచనలు) 04:27, 21 ఏప్రిల్ 2021 (UTC)
- ట్వింకిల్ ఉపకరణాన్ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్‌లో తెలుగించవచ్చు. — వీవెన్ (చర్చ) 15:17, 19 ఏప్రిల్ 2021 (UTC)
- సరే!__ చదువరి (చర్చ • రచనలు) 07:41, 19 ఏప్రిల్ 2021 (UTC)
[Small wiki toolkits] Workshop on "Designing responsive main pages" - 30 April (Friday)
[మార్చు]As part of the Small wiki toolkits (South Asia) initiative, we would like to announce the third workshop of this year on “Designing responsive main pages”. The workshop will take place on 30 April (Friday). During this workshop, we will learn to design main pages of a wiki to be responsive. This will allow the pages to be mobile-friendly, by adjusting the width and the height according to various screen sizes. Participants are expected to have a good understanding of Wikitext/markup and optionally basic CSS.
Details of the workshop are as follows:
- Date: 30 April (Friday)
- Timings: 18:00 to 19:30 (India / Sri Lanka), 18:15 to 19:45 (Nepal), 18:30 to 20:00 (Bangladesh)
- Meeting link: https://meet.google.com/zfs-qfvj-hts | to add this to your Google Calendar, please use click here.
If you are interested, please sign-up on the registration page at https://w.wiki/3CGv.
Note: We are providing modest internet stipends to attend the workshops, for those who need and wouldn't otherwise be able to attend. More information on this can be found on the registration page.
Regards, Small wiki toolkits - South Asia organizers, 15:52, 19 ఏప్రిల్ 2021 (UTC)
Intimation about the Research Proposal on Gender Gap
[మార్చు]Dear Wikimedians,
Hope you are doing well. We would like to inform you that we (User: Praveenky1589 and User: Nitesh Gill) have proposed a research project for Project Grant. The study will focus on analyzing gender-based differences in leadership of Indian Wikimedia communities. The purpose of the research project is to analyse the growth of projects under different leadership, reasons behind the difference in engagement, contribution and iterations of the project. It also aims to study-
How male and female leadership impacts volunteer contribution and their retention?
The output of events under different leadership and the future of projects and leaders.
The study will be conducted on the last 5 years of online and offline activities. For knowing more about the project please visit the proposal page and share your valuable feedback and suggestions on the talk page. We look forward to refining it more following your valuable inputs and questions.
Thank you Nitesh Gill (చర్చ) 18:09, 19 ఏప్రిల్ 2021 (UTC)
Suggested Values
[మార్చు]From April 29, it will be possible to suggest values for parameters in templates. Suggested values can be added to TemplateData and will then be shown as a drop-down list in VisualEditor. This allows template users to quickly select an appropriate value. This way, it prevents potential errors and reduces the effort needed to fill the template with values. It will still be possible to fill in values other than the suggested ones.
More information, including the supported parameter types and how to create suggested values: [1] [2]. Everyone is invited to test the feature, and to give feedback on this talk page.
Timur Vorkul (WMDE) 14:08, 22 ఏప్రిల్ 2021 (UTC)
చరిత్రలో ఈ రోజు ఉపయోగిస్తున్న తెలుగు పత్రిక
[మార్చు]ఆదాబ్ హైదరాబాదు ఎడిటోరియల్ పేజీలో తెలుగు వికీపీడియా శీర్షిక చరిత్రలో ఈ రోజు ను చరిత్రలో నేడు అనే శీర్షికతో వాడుతున్నట్లు గమనించాను. అయితే వారు వికీపీడియాకు గుర్తింపు ఇస్తే బాగుంటుంది. అర్జున (చర్చ) 23:38, 23 ఏప్రిల్ 2021 (UTC)
తెలుగు వికీపీడియా పాఠ్యప్రణాళిక ప్రాజెక్టు - వికీమీడియా ఫౌండేషన్ నుండి ప్రాజెక్టు గ్రాంటు సహకారం
[మార్చు]తెలుగు వికీపీడియా పాఠ్యప్రణాళిక ప్రాజెక్టు రెండవ దశ (తెలుగు వికీపీడియా గురించి నేర్పించేందుకు ఉపకరించే పాఠ్య ప్రణాళిక, వీడియోలు, చేపుస్తకాలు, పీడీఎఫ్‌లు, పేజీలు వగైరా తయారుచేయడానికి అవసరమైన పూర్తి ప్రాజెక్టు) కోసం వికీమీడియా ఫౌండేషన్ వారిని తమ ప్రాజెక్టు గ్రాంట్ ద్వారా మద్దతునివ్వమని కోరుతూ గ్రాంట్ దరఖాస్తు రాసిన విషయం అందరికీ తెలిసిందే.
వికీమీడియా ఫౌండేషన్ ఈ ప్రాజెక్టుకు మద్దతునివ్వడానికి అంగీకరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడొచ్చు. సముదాయం పర్యవేక్షణలో జరిగే ఈ ప్రాజెక్టుకు గౌరవ వికీపీడియన్లు తమ సహకారం (సలహాలు, సూచనలు) అందించాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు కమిటీ తరఫున ప్రాజెక్టు గ్రాంటీ ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:10, 24 ఏప్రిల్ 2021 (UTC)
వ్యాసపు చర్చ పేజీల్లో చేసే చర్చలు అనాథలు కాకుండా ఉండేందుకు
[మార్చు]వ్యాసాల చర్చ పేజీల్లో కొన్ని చర్చలు జరుగుతూంటాయి. చాలా సందర్భాల్లో ఆ చర్చలపై వాడుకరులు అభిప్రాయాలు చెప్పడం, తదనంతర నిర్ణయాలు చెయ్యడం అవసరమౌతుంది. అయితే ఇలాంటి చర్చలు చాలావరకు వాడుకరుల అభిప్రాయాలకు నోచుకోవడం లేదు. చర్చ మొదలుపెట్టినపుడు దాన్ని గమనించకపోతే, ఇక ఆ చర్చ గురించి మరే విధంగానూ తెలిసే అవకాశం లేకపోవడం దానికి ఉన్న రెండవ ప్రధాన కారణం. మొదటి కారణం మనకందరికీ తెలిసినదే! @Arjunaraoc గారు ఈ విషయంలో గట్టిగా శ్రద్ధ తీసుకుని సహాయం కావాలి అనే మూసను వాడేలా వాడుకరులకు చెబుతూ వస్తున్నారు. అవసరమనుకుంటే, పాత చర్చలకు కూడా ఈ మూసను పెట్టి ఆయా పేజీలను ఒక వర్గం లోకి చేరేలా చర్యలు తీసుకున్నారు. ఆ విషయంలో ఆయన చేసిన, చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ "సహాయం కావాలి" మూస, చర్చల కోసం వాడేందుకు అంతగా సరిపోదనే ఉద్దేశంతో చర్చల కోసమని వేరే మూసలను తయారు చేసాను. వాటి గురించిన వివరమిది:
- చర్చ మొదలు పెట్టేటపుడు పైన {{అభిప్రాయాల కోసం చర్చ}} అనే మూసను పెట్టి చర్చను సాగించాలి.
లేదా
- చర్చ మొదలు పెట్టేటపుడు పైన {{చర్చాస్థలం పైన}} అనే మూసను, దాని కింద {{చర్చాస్థలం అడుగున}} అనే మరొక మూసనూ పెట్టి, చర్చనంతా ఆ రెండు మూసల మధ్యనే సాగించాలి.
ఈ రెండు పద్ధతుల్లో దేన్నైనా పాటించవచ్చు. ఆ విధంగా చర్చ చేసే పేజీ, వర్గం:అభిప్రాయాలను కోరుతున్న చర్చలు అనే వర్గం లోకి చేరుతుంది. ఆ వర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే చర్చ కోసం వేచి ఉన్న పేజీలు ఏమేంటనే సంగతి వాడుకరులకు తెలుస్తుంది, తద్వారా వారు వాటిలో పాల్గొని ఒక నిర్ణయానికి వచ్చేందుకు తోడ్పడవచ్చు. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 16:31, 28 ఏప్రిల్ 2021 (UTC)
- ఈ విధానం బాగుంది.చర్చలు మరుగున పడకుండా సంబంధిత వర్గంలో ఉంటాన, చర్చలు కొనసాగి, నిర్ణయాలు వెలువరించే సంప్రదాయం ఆచరణలోకి వస్తుంది. యర్రా రామారావు (చర్చ) 17:45, 28 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు సూచించిన విధానం బాగుంది. చర్చలకు కూడా వర్గం ఉంటే మళ్ళీ వాటిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 16:32, 5 మే 2021 (UTC)
రచ్చబండ పాత చర్చ పేజీలు ఏ కాలానికి చెందినవి?
[మార్చు]రచ్చబండ పాత చర్చల విషయంలో కొన్ని మార్పులు చేసాను. అవి:
- పాత చర్చల పెట్టెలో కొత్తగా వచ్చే పాత చర్చ పేజీలను ప్రస్తుతం మానవికంగా చేరుస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఆటోమేటు చేసాను. ఇకపై పేజీ లోని సమాచారాన్ని పాత చర్చ పేజీకితరలిస్తే చాలు.. ఈ పెట్టెలో కొత్త పేజీ నంబరును చేర్చనక్కరలేదు.
- మరొకటేంటంటే ఈ పాత చర్చల పెట్టెను ప్రతీ పాత పేజీలోనూ పెట్టవచ్చిపుడు. సింపులుగా {{Archives}} అని ప్రతి పేజీలోనూ చేరిస్తే సరిపోతుంది. అందులో root=వికీపీడియా:రచ్చబండ|aauto=yes అనే పరామితులను తప్పనిసరిగా ఇవ్వాలి.
- రచ్చబండలో ప్రస్తుతం 79 పాత చర్చ పేజీలున్నాయి. వాటి జాబితాను రచ్చబండ పేజీలో పైన కుడివైపున ఉన్న పాత చర్చల పెట్టెలో చూడవచ్చు. కానీ అందులో ఓ సౌకర్యం లేదు... ఫలానా సంవత్సరం, ఫలానా నెలలోని పాత చర్చ పేజీకి వెళ్ళాలంటే సుమారుగా పేజీ సంఖ్యను ఎంచుకుని, ఆ పేజీని తెరిచి, అది కాకపోతే, మరో పేజీని తెరిచి, అదీ కాకపోతే మరో పేజీని తెరిచి.. ఇలా చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతిపేజీ లోనూ ఆ చర్చ జరిగిన కాలాన్ని చూపించే ఏర్పాటు చేసాను ({{subst:పాత చర్చ కాలం}} అనే మూసను చేర్చాలి. అందులో datestart=|dateend= అనే పరామితులకు తప్పనిసరిగా విలువల నివ్వాలి. పేజీలో తొలి చర్చ జరిగిన రోజే datestart; తుది చర్చ జరిగిన రోజే dateend). ఇప్పుడు రచ్చబండ లోని పాత చర్చల పెట్టెలో ఏదైనా అంకెపై కర్సరును ఉంచినపుడు, అది కొంత క్లుప్తమైన సమాచారం చూపిస్తుంది. అందులో ఈ "చర్చా కాలపు సమాచారం" ఉంటుంది. ఉదాహరణకు, "2" పై కర్సరును ఉంచినపుడు "..ఈ పాత చర్చ జరిగిన కాలం: 2007 ఆగస్టు 11 - 2007 సెప్టెంబరు 26" అని చూపిస్తుంది.
అయితే ఈ ఏర్పాటును నేను పాత చర్చలు 1,2,3,4,5 పేజీల్లో మాత్రమే చేసాను. మిగతా 75 పేజీల్లోనూ చెయ్యాల్సి ఉంది. ఉత్సాహవంతులెవరైనా మిగతా పేజీల్లో చేసేందుకు ముందుకు వస్తే సంతోషం. లేదంటే నేనే చేస్తాను. వాడుకరులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 08:16, 29 ఏప్రిల్ 2021 (UTC)
- పాత పేజీలన్నిటిలో మూసలు పెట్టడం అయిపోయింది. __ చదువరి (చర్చ • రచనలు) 02:04, 30 ఏప్రిల్ 2021 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 16:32, 5 మే 2021 (UTC)
వికీపీడియా రూపురేఖల్లో మార్పులు
[మార్చు]వికీపీడియా (దాంతోపాటు ఇతర వికీమీడియా ప్రాజెక్టులు కూడా) రూపురేఖలను మార్చే పని జరుగుతోంది. దాని పనితీరు ఏ మాత్రం మారకుండా కేవలం రూపు రేఖలను మాత్రం మారుస్తారంట-అది కూడా వెక్టర్ రూపు లోనే. వాళ్ళు చేయదలచిన మార్పులను మీడియావికీ సైటులో చూడొచ్చు. వాటిలో కొన్ని మార్పులను -కొన్నిటినే- పరీక్షార్థం కొన్ని వికీల్లో ప్రవేశపెట్టారు. ఫ్రెంచి (fr), సెర్బియన్ (sr), కొరియన్ (ko) వగైరా వికీపీడియాల్లో దీన్ని చూడొచ్చు. బెంగాలీలో కూడా రావాల్సి ఉందిగానీ, ఎందుకో మరి అక్కడ ఇంకా ఈ మార్పును ప్రవేశపెట్టలేదు. పైన చూపిన వికీలకు వెళ్ళి ఈ మార్పులను చూడవచ్చు. బహుశా ఈ యేడో వచ్చే యేడో మనకూ వచ్చేస్తుంది ఇది. ఆ సమయానికి మనం మొదటిపేజీకి ఒక కొత్త రూపుతో సిద్ధంగా ఉంటే చక్కగా ఓకొత్త తెవికీని ఆవిష్కరించుకోవచ్చు (నాకైతే ప్రస్తుత రూపు బోరు కొడుతోంది). పరిశీలించండి.
అసలైనా.., ఇలాంటి కొత్త మార్పుల ప్రయోగాల కోసం తెవికీని ఎందుకు ఎంచుకోవడం లేదు వీళ్ళు!? మనకేం తక్కువ? వాళ్ళక్కావలసిన క్రిటికల్ మాస్ లేదా మన దగ్గర? __ చదువరి (చర్చ • రచనలు) 17:44, 29 ఏప్రిల్ 2021 (UTC)
- ఈ మార్పు చేర్పులను మనం కూడా చూసుకోవచ్చు. కానీ ఎవరికి వారు తమ అభిరుచుల్లో కింది మార్పు చేసుకుంటేనే దాన్ని చూడగలుగుతారు:
- నా అభిరుచులు --> రూపురేఖలు కు వెళ్ళి అక్కడ "పాత వెక్టర్ వాడు" అనే పెట్టెలో టిక్కును తీసెయ్యాలి.
- దీంతో మనం కొత్త రూపును, సంబంధిత విశేషాలనూ చూడవచ్చు. వద్దనుకుంటే పై పెట్టెలో మళ్ళీ టిక్కు పెట్టి తిరిగి పాత రూపుకు వెళ్ళవచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 02:19, 30 ఏప్రిల్ 2021 (UTC)
తెవికీ కొత్త రూపుపై చర్చ
[మార్చు]పై విధంగా అభిరుచుల్లో సెట్టింగులను మార్చుకున్నాక మీరు పరిశిలించిన విశేషాలను, మీ అభిప్రాయాలు సూచనలను ఇక్కడ రాయవలసినది:
చదువరి
[మార్చు]నేను 2021 ఏప్రిల్ 30న కొత్త రూపును స్థాపించుకున్నాను. నా తొలి పరిశీలనలు ఇవి:
- లోగో మారిపోయింది. మనం కొత్త లోగోను తయారు చేసుకోవాలి. ప్రస్తుతం ఇంగ్లీషు పేరుతో లోగోను చూపిస్తోంది.
- ఎడమ వైపు నేవిగేషను చూపడం, దాచడం బాగానే పని చేస్తోంది.
- ఆ నేవిగేషన్ను దాచినపుడు పేజీలోని పాఠ్యం ఎడమ వైపుకు విస్తరించకూడదు. అన్ని పేజీలు బానే ఉన్నై గానీ "చరిత్ర" పేజీ మాత్రం పేజీ రెండువైపులా విస్తరిస్తోంది
- గ్రోత్ ప్రాజెక్టు కింద కొత్త వాడుకరులకు సృష్టించే హోంపేజీ కూడా రెండు వైపులా విస్తరిస్తోంది.
- ట్వింకిల్ ట్యాబు కనిపిస్తోంది గానీ, దానికింద ఉండే మెనూ కనిపించడం లేదు. ఈ కారణంగా కొత్త రూపును కొనసాగించలేని పరిస్థితి. ఇది మన ట్వింకిల్‌లో ఉన్న సమస్యేమో చూడాలి.
- "మరిన్ని" ట్యాబుపై మౌసు ఆడిస్తే మెనూ కనబడ్డం లేదు, దానిపై నొక్కితేనే కనిపిస్తోంది.
__చదువరి (చర్చ • రచనలు) 02:36, 30 ఏప్రిల్ 2021 (UTC) మరికొన్ని:
- వెతుకు పెట్టెలో పదాన్నిచ్చి "వెతుకు" కొడితే, ఫలితాల పేజీకి పోతోంది గానీ, ఫలితాలు రావడం లేదు.
- వెతుకు పెట్టెలో పదాన్నిచ్చి ఎంటరు కొడితే, ఫలితాల పేజీకి పోతోంది, ఫలితాలు వస్తున్నాయి.
- ఫలితాల పేజీ రెండువైపులా విస్తరిస్తోంది.
- అదొక్కటే కాదు, ప్రత్యేక పేజీలన్నీ కూడా అలాగే ఇరువైపులా విస్తరిస్తున్నాయి
__చదువరి (చర్చ • రచనలు) 03:05, 30 ఏప్రిల్ 2021 (UTC)
కశ్యప్
[మార్చు]- ఇది మొబైల్ వీక్షణకు అనువుగా వున్నది
ఇంగ్లీష్ లొగొలో Free encyclopedia అని వుండేది ,, కొత్త వీక్షణలో లేక పోవటం తెలుగు లో చేసేవారు పరిగణించదగిన అంశం- ఫలితాలు రాకపోవటం అనేది Language settings లో మారుస్తారేమో చూడాలి, ఉదాహణకు పాత వెక్టర్ వీక్షణలో లిప్యంతరీకరణ ద్వారా తెలుగు రాస్తున్నప్పుడు మాత్రమే సంబందిక శీర్షికల సూచనలు కనిపిస్తాయి , అదే గూగుల్ క్రొం తెలుగు ఇంన్పుట్ వాడితే కనపడవు.
- నేను పరీక్షించిన దాని ప్రకారం కంప్యూటర్ క్రోం బ్రౌసర్‌లో కొత్తది లోడ్ అవటానికి 2306 మిల్లీ సెకనులు పడితే , పాత వెక్టర్ కు 1890 మిల్లీ సెకనులు పడుతోంది.
__ Kasyap (చర్చ) 12:41, 5 మే 2021 (UTC)
రాజశేఖర్
[మార్చు]- ఎడమవైపు నేవిగేషన్; కుడివైపు కనిపించడం లేదు. ఖాళీ మాత్రమే ఉన్నది.
- వెతుకుపెట్టె position మారింది.
- లోగోలోని తెలుగు వికీ కోసం చేసిన మార్పుల్ని దీనికోసం మార్పుచేయాల్సి వుంటుంది.
- ఇవి కాకుండా పెద్దగా ఇబ్బందిగా అనిపించడం లేదు.