వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 26
← పాత చర్చ 25 | పాత చర్చ 26 | పాత చర్చ 27 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 అక్టోబరు 23 - 2013 నవంబరు 2
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
వర్గాల నిర్వహణ
[మార్చు]వాడుకరి:YVSREDDY వర్గాల నిర్వహణ పెద్ద పెట్టున చేస్తున్నందులకు వారికి ధన్యవాదాలు. ఈ దిశలో తోడ్పాటుగా వికీపీడియా:వర్గాల చర్చలు మనమందరము వాడవలసి వుంది. ఇప్పటికే చర్చలు మొదలైనవి కాబట్టి క్రియాశీల సభ్యులందరూ తమ స్పందనలు ప్రతిపాదనలపై వ్యాఖ్యానించవలసిందిగా మరియు ఈ పేజీని వీక్షణ జాబితా లో చేర్చుకుని గమనించవలసిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 15:53, 16 అక్టోబర్ 2013 (UTC)
- వికీపీడియా:వర్గాల చర్చలు#Category:జీవిస్తున్న ప్రజలు to Category:సజీవ వ్యక్తులు చర్చలో ఇప్పటివరకు ఆరుగురు స్పందించారు. రేపటి రోజున చర్చలో పాల్గొనని నిర్వాహకుడు/అధికారి చర్చా ఫలితాన్ని నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 04:45, 23 అక్టోబర్ 2013 (UTC)
ఎక్కించే దస్త్రాలకు సరిపోయే లెసెన్స్ లను తాజాపరచుట
[మార్చు]మన తెలుగులో లైసెన్స్ వివరాల చివరి మార్పు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. కామన్స్ లో ప్రముఖంగా వాడే CC-BY-SA 3.0 ప్రస్తుతము లేదు. CC-BY 3.0 మాత్రమే వుంది. దానిని చేర్చుటకు మరల ఆంగ్లంలో చేర్చిన మరిన్ని వివరాలు చేర్చవలసివుంది. మీడియావికీ_చర్చ:Licenses#లైసెన్స్ వివరాలు తాజాపరచుట వద్ద మీ అభిప్రాయాలు తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:01, 18 అక్టోబర్ 2013 (UTC)
పేజి పేరు మార్పులు
[మార్చు]పేజీ పేరు మార్చవలసిన పద్ధతులు తెలియజేయండి. వికీపీడియా:శైలి నుంచి
- ము తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి.
- పై వాక్యాన్ని బట్టి "ప్రపంచము" అనే పదాన్ని "ప్రపంచం" అని పేజీ పేరుగా ఉపయోగించాలా లేక పేజీలోని సమాచారంలోనా?
- పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
- ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)
- పై వాక్యాన్ని బట్టి అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకుండా పేజీ పేరులో ఉపయోగించాలా లేక పేజీలోని సమాచారంలోనా?
- నలుపు మరియు తెలుపు పేజీ పేరు మార్చడం అవసరమా. YVSREDDY (చర్చ) 07:55, 18 అక్టోబర్ 2013 (UTC)
- YVSREDDY గారి సందేహాన్ని చర్చకు పెట్టినందులకు ధన్యవాదాలు. వ్యాసం పేర్లు, వర్గాల పేర్లు విధానాలు వున్నాయి. శైలి నియమాలు అంత ఖచ్చితంగా పాటించి వుండకపోవొచ్చు. ఉదా:వర్గాలపేర్లు ఏకవచనంలో వుండాలని వుంది. మనం చాలా వర్గాలలో బహువచనంలో వుండటం చూడవచ్చు. వీటిలో కొన్నిటిలో దోషాలు వుండవచ్చు. మామూలుగా శైలి సూచనలు ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేక పద్ధతులు లేని చోట్ల వర్తిస్తాయి. దీనిపై దృష్టిపెట్టే ఇద్దరు ముగ్గురు వికీపీడియన్లుంటే మన వ్యాసాల నాణ్యత మెరుగుపరచవచ్చు. ఇదేవిషయమై తెవికీ మహోత్సవంలో ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిటర్ జగన్ వ్యాఖ్యానించారు కాబట్టి తెవికీలో నాణ్యత మెరుగుపరచటానికి ఇదిప్రాధాన్యకరమైన విషయం. ప్రతీ తెలుగుపత్రికకి శైలి పుస్తకం వుంటుంది. వాటిని వాడుకొని చర్చించి మనం వికీశైలిని మెరుగుపరచుకోవాలి మరియు వున్న నియమాలకు అనుగుణంగా మార్పులు చేయాలి. --అర్జున (చర్చ) 11:55, 18 అక్టోబర్ 2013 (UTC)
- నలుపు మరియు తెలుపు గురించి చర్చ:నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ లో రాశాను. --అర్జున (చర్చ) 12:02, 18 అక్టోబర్ 2013 (UTC)
- చక్కని చర్చ ప్రారంభించారు. ప్రపంచం అన్నది అన్ని చోట్ల (వ్యాసంలోనూ, వ్యాసం పేర్లలోనూ). కానీ "నా ప్రపంచము" అనే ఒక పుస్తకం గురించిన వ్యాసం వ్రాస్తున్నారనుకొండి. దానికి "నా ప్రపంచం" అన్న పేరు పెట్టకూడదు. అలాగే పొడి అక్షరాల మధ్యన చుక్క విషయంలో కూడాను. ఆంగ్లంలో నిర్ధిష్టమైన style guides ఉంటాయి. వాళ్ళ శైలిలో N. T. Rama Rao అని వ్రాయాలి. కానీ ఈ విరామ చిహ్నాలనేవి మనం ఇటీవల అరువు తెచ్చుకున్న సాంప్రదాయం. పుల్‌స్టాప్ పెట్టడమే మనకు విరామమైతే మళ్ళీ ఖాళీ అక్కరలేదని అభిప్రాయం. అసలు పొడి అక్షరాలే మన భాషకు మరోవింత సంకర సాంప్రదాయం. నిజానికి తెలుగు పొడి అక్షరాల్లో నం.తా.రామారావు అని వ్రాయాలి లేకపోతే పాత సినిమాల టైటిల్లలో ఉపయోగించినట్టు N. T. రామారావు అని వ్రాయాలి. కానీ ఏదో సంకర పద్ధతి వలన ఎన్.టి.రామారావు అని వ్రాసే వింత పద్ధతి స్థిరపడింది. చాలా విషయాల్లో తెలుగు భాషకు ఒక ప్రామాణికమైన శైలి మాన్యువల్ అంటూ లేదు. తెవికీ, వికీ పరిధిని దాటి వ్యవహరించాలని నేను భావించే విషయాల్లో ఇది ఒకటి. సాధారణంగా వికీ పదాలను సృష్టించడం కానీ, భాషను ప్రభావితం చేయడంకానీ చేయకూడదు. కానీ మనకు తప్పేట్టు లేదు. --వైజాసత్య (చర్చ) 08:58, 20 అక్టోబర్ 2013 (UTC)
- "పుల్‌స్టాప్ పెట్టడమే మనకు విరామమైతే మళ్ళీ ఖాళీ అక్కరలేదని అభిప్రాయం"కు నేనూ మద్దతు పలుకుతాను. కొన్నాళ్ళ క్రితం పాలమూరులో ఇదే విషయమై కొందరిమధ్య చర్చ జరిగింది. విరామంచిహ్నం తర్వాత ఖాళీ అనేది వాక్యం చివరన మాత్రమే పెట్టాలనీ, అలా ఖాళీ ఉన్నప్పుడు ఉచ్ఛారించేటప్పుడు కొద్దిగా ఆగాలని భాషావేత్తలు అభిప్రాయపడ్డారు. కాని ఆంగ్లంలో మాత్రం N. T. అంటూ ఖాళీలతో వ్రాస్తూ ఆగకుండా ఉచ్ఛారిస్తున్నాం. ఆంగ్లబాష నియమాలు మనకెందుకుకాని, అక్కడి పద్దతి చూసి తెలుగులో కూడా పేర్లలో విరామచిహ్నం అనంతరం ఖాళీ ఉండాలని తెవికీలో ఇదివరకు ఒక సభ్యుడు ప్రతిపాదించాడు. కాని తెలుగులో దీనికి సంబంధించి ఏమైనా నిర్దిష్ట పద్దతులున్నాయా అనేది తెలియదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:19, 20 అక్టోబర్ 2013 (UTC)
- చక్కని చర్చ ప్రారంభించారు. ప్రపంచం అన్నది అన్ని చోట్ల (వ్యాసంలోనూ, వ్యాసం పేర్లలోనూ). కానీ "నా ప్రపంచము" అనే ఒక పుస్తకం గురించిన వ్యాసం వ్రాస్తున్నారనుకొండి. దానికి "నా ప్రపంచం" అన్న పేరు పెట్టకూడదు. అలాగే పొడి అక్షరాల మధ్యన చుక్క విషయంలో కూడాను. ఆంగ్లంలో నిర్ధిష్టమైన style guides ఉంటాయి. వాళ్ళ శైలిలో N. T. Rama Rao అని వ్రాయాలి. కానీ ఈ విరామ చిహ్నాలనేవి మనం ఇటీవల అరువు తెచ్చుకున్న సాంప్రదాయం. పుల్‌స్టాప్ పెట్టడమే మనకు విరామమైతే మళ్ళీ ఖాళీ అక్కరలేదని అభిప్రాయం. అసలు పొడి అక్షరాలే మన భాషకు మరోవింత సంకర సాంప్రదాయం. నిజానికి తెలుగు పొడి అక్షరాల్లో నం.తా.రామారావు అని వ్రాయాలి లేకపోతే పాత సినిమాల టైటిల్లలో ఉపయోగించినట్టు N. T. రామారావు అని వ్రాయాలి. కానీ ఏదో సంకర పద్ధతి వలన ఎన్.టి.రామారావు అని వ్రాసే వింత పద్ధతి స్థిరపడింది. చాలా విషయాల్లో తెలుగు భాషకు ఒక ప్రామాణికమైన శైలి మాన్యువల్ అంటూ లేదు. తెవికీ, వికీ పరిధిని దాటి వ్యవహరించాలని నేను భావించే విషయాల్లో ఇది ఒకటి. సాధారణంగా వికీ పదాలను సృష్టించడం కానీ, భాషను ప్రభావితం చేయడంకానీ చేయకూడదు. కానీ మనకు తప్పేట్టు లేదు. --వైజాసత్య (చర్చ) 08:58, 20 అక్టోబర్ 2013 (UTC)
వర్గీకరణలు
[మార్చు]ఈ మధ్య బాటు చేయవలసిన పనులు తెవికీలో వేల సంఖ్యలో జరుగుతున్నవి. ఈ దిద్దుబాట్లు సునాయాసంగా చేయవచ్చునని ఏదైనా వ్యాసం వ్రాసినా, శుద్ధి చేసినా ఎంతో శ్రమపడవలసి వస్తుందని సదరు సభ్యుల మనోగతం అయినట్లుంది! తెవికీ లో దిద్దిబాట్లు సంఖ్య తో సభ్యుల ర్యాంకులు నిర్ణయించుట వల్ల కొందరు సభ్యులు గణనీయంగా సులువుగా ఉండే దిద్దుబాట్లు (అలాగని సహేతుకమైన చిన్న దిద్దుబాట్లు అనికాదు) అధికంగా చేయుచున్నారని విశదమవుతున్నది. బాటు చేయవలసిన ఒకే విధమైన సునాయాస దిద్దుబాట్లపై శ్రద్ధ అధికంగా కనబరచుట జరుగుతున్నది. ఈ మధ్య కొత్త వ్యాసాలు గానీ మొలక దాటిన వ్యాసాలు గానీ అధిక శాతం తెవికీ కి రావడం లేదు. కాపీ వ్యాసాలు , మొలకలు మరియు బాటుచేయవలసిన సునాయాస పనులు అధికంగా చేరుతున్నాయి. విశేష వ్యాసాలు రావటం లేదు. ఒక వ్యాసం వ్రాయాలన్నా, అనువాదం చేయాలన్నా ఎంతో శ్రమపడవలసి వస్తుంది. అంత శ్రమపడి కొందరు సభ్యులు కృషిచేస్తే కొందరు సులువుగా కష్టపడకుండా సునాయాసంగా బాటుచేయవలసిన పనులు చేసి దిద్దిబాట్లు సంఖ్యను పెంచుకొనుట కొరకు చేయుట శోచనీయం. యిలా చేయడం వల్ల కష్టపడి వ్యాసాలు వ్రాసేవారు అనాశక్తత చూపించే అవకాశం అధికంగా ఉన్నది.
వర్గాల విషయానికొస్తే "1520 జననాలు" "1520 మరణాలు" వర్గాలను "1520" వర్గంలో ఉంచారు. "1520" వర్గాన్ని "1520లు" లో ఉంచారు. బాగుంది. కానీ మరల వేల సంఖ్యలో ఉన్న "1520 జననాలు" "1520 మరణాలు" వంటి జనన మరణ వర్గాలను "1520లు" వంటి వర్గాలో చేర్చడంలో అర్థం ఏముంది? ఈ విషయాన్ని రెడ్డిగారికి విన్నవిస్తే వారు " "1520 జననాలు" "1520 మరణాలు" వర్గాలను "1520" వర్గంలో ఉంచినా, "1520" వర్గాన్ని "1520లు" లో ఉంచినా, "1520లు" వర్గంలో "1520 జననాలు" "1520 మరణాలు" ప్రత్యేకంగా కనిపించవు, అందువలన ఇవి ప్రత్యేకంగా కనిపించేందుకు "1520 జననాలు" "1520 మరణాలు" వంటి జనన మరణ వర్గాలను 1520లు వంటి వర్గాలలో చేర్చడమే అర్థం." అని సమాధానమిచ్చారు. ఉపవర్గంలో ఉన్న విషయాలను మనకు కనబడకుండా ఉన్నాయని మరల వర్గాలలో చేర్చితే వర్గీకరణ అనిపించుకుంటుందా? మరల రెడ్డిగారు "1030 మరణాలు" "1030 జననాలు" వంటి వర్గాలను యిదివరకు "1030" లో ఉంచినప్పటికీ మరల యిపుడు వాటిని "1030లు మరణాలు" అనే కొత్తవర్గాలను సృష్టించి వాటిలో చేర్చుటకు సన్నద్ధులయ్యారు. యిలా జనన మరణ వర్గాలకే కొన్ని వేల వర్గాలను సృష్టించుటకు ఉపక్రమించుట సరియైనదేనా? విజ్ఞులు ఆలోచించ మనవి.----K.Venkataramana (talk) 05:59, 22 అక్టోబర్ 2013 (UTC)
- రెడ్డిగారు చేస్తున్న పని వృధాప్రయాస తప్ప మరేమీ కాదు. వారికి ఎన్నివిధాల చెబుతున్నా సమస్యను అర్ధం చేసుకొవడం లేదు. ఈ దశాబ్దాల జనన మరణ వర్గాలు అనవసం అని నా అభిప్రాయం. రెడ్డిగారు దీన్ని తప్పుగా భావించకుండా ఇక్కడితో ఆపి; చేసిన మార్పుల్ని తొలగించడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 06:09, 22 అక్టోబర్ 2013 (UTC)
- ఈ సమస్య ఉత్పన్నమవడానికి కారణం ప్రోత్సాహం. మీ దిద్దుబాటులు వేలు దాటాయి కనుక పతకం అందుకొమ్మనో, అభినందనలు అందుకొమ్మనో సభ్యులు ప్రోత్సహించినంతకాలం అది అలా జరుగుతూనే ఉంటుంది. వారిపై నిర్వహణపరంగా చర్యలు తీసుకోవాలనుకున్నా వారిని సమర్ధించే గుంపులు వెలుగుచూసే అవకాశం ఉన్నది (కొండకచో ఎదురుదాడి కూడా జరగవచ్చు). రెడ్డిగారు చాలా సమయం కేటాయించి తెవికీలో ఉత్సాహంగా కృషిచేస్తున్నారు కనుక ఆయన మార్పులను స్వాగతించడం మంచిది...విశ్వనాధ్ (చర్చ) 07:38, 22 అక్టోబర్ 2013 (UTC)
- రమణ గారూ, మీ ప్రతిపాదనలు సమంజసంగానే ఉన్నాయి. దాదాపు నెలరోజుల నుంచి ఇలాంటి దిద్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిపై నిర్వహణాపరమైన చర్యలు ప్రజాస్వామ్యయుతంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ సభ్యునిపైనే కొందరు తీసుకున్న అప్రజాస్వామ్య మరియు ఏకపక్ష చర్యలవల్ల విమర్శలు వచ్చాయి. తెవికీలో ఏ చర్య తీసుకోవాలన్ననూ నియమాలు లేదా ప్రజాస్వామ్యపద్దతిలో క్రమానుగతంగా చర్యలు తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ఇదివరకే ఆ సభ్యునికి దిద్దుబాట్ల ఇబ్బందుల గురించి తెలియజేశారు కాబట్టి ఇక హెచ్చరిక పంపండి, అలాంటి హెచ్చరికనూ పట్టింకోనప్పుడూ మరో రెండుసార్లు అవకాశం ఇచ్చి చివరకు నిషేధం ఎందుకు విధించరాదో అని తెలుపుతూ హెచ్చరించండి. అప్పుడూ ఆ సభ్యునిలో ఎలాంటి మార్పులు లేనప్పుడు ఇతర సభ్యుల సహకారంతో పరిమితకాలపు నిషేధం విధించవచ్చు. ఆ నిషేధం అనంతరం కూడా ధోరణి మార్చుకోనప్పుడు నిషేధం కాలపరిమితి పెంచవచ్చు. చర్చ జరిగే సమయంలో మాత్రం దిద్దుబాట్లు నిబంధనలకు విరుద్ధంగా లేదా దుశ్చర్యలు అనిపిస్తే తప్ప మీరు నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చకండి (అంటే దిద్దుబాట్లు వెనక్కి చేయడం, వ్యాసాలు/వర్గాలు తొలిగించడం, సభ్యునిపై చర్చలు తీసుకోవడం లాంటివి). మరోమార్గం ఏమిటంటే సభ్యునిపై తగు చర్యలకై రచ్చబండలోనే ప్రతిపాదించవచ్చు. సభ్యుల నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:02, 22 అక్టోబర్ 2013 (UTC)
- ఈ సభ్యునిపై ఏకపక్ష చర్యలు కాని అప్రజాస్వామ్యపద్దతిలో కాని తీసుకొనబడలేదు. సభ్యుని వ్యాసాలను విలీనం చేసిన క్రమంలో, తొలగించిన వ్యాసాలను మళ్ళీ మళ్ళీ సృష్టించడం వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకొని ఏకవచన ప్రయోగం చేయడం వలన వచ్చిన పరిణామాల ద్వారా వచ్చినవి. ఇదే సభ్యుని గురించి చాలా విషయాలలో చర్చనడిచినా ఇప్పటికీ దేని విషయంలోనూ క్లారిటీ లేకపోవుటకు కారణం ఆ యొక్క ప్రహసనం మాత్రమే. కనుక చర్యలు తీసుకొనే ఆలోచన కంటే కొంత సమయం వేచి చూడడం, నచ్చచెప్పే ప్రయత్నం చేయడం వలన ఉత్సాహం కలిగిన సభ్యుని నుంచి మంచి వ్యాసాలు, దిద్దుబాట్లు వచ్చే అవకాశం ఉన్నది...విశ్వనాధ్ (చర్చ) 14:13, 22 అక్టోబర్ 2013 (UTC)
- రమణ గారూ, మీ ప్రతిపాదనలు సమంజసంగానే ఉన్నాయి. దాదాపు నెలరోజుల నుంచి ఇలాంటి దిద్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిపై నిర్వహణాపరమైన చర్యలు ప్రజాస్వామ్యయుతంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ సభ్యునిపైనే కొందరు తీసుకున్న అప్రజాస్వామ్య మరియు ఏకపక్ష చర్యలవల్ల విమర్శలు వచ్చాయి. తెవికీలో ఏ చర్య తీసుకోవాలన్ననూ నియమాలు లేదా ప్రజాస్వామ్యపద్దతిలో క్రమానుగతంగా చర్యలు తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ఇదివరకే ఆ సభ్యునికి దిద్దుబాట్ల ఇబ్బందుల గురించి తెలియజేశారు కాబట్టి ఇక హెచ్చరిక పంపండి, అలాంటి హెచ్చరికనూ పట్టింకోనప్పుడూ మరో రెండుసార్లు అవకాశం ఇచ్చి చివరకు నిషేధం ఎందుకు విధించరాదో అని తెలుపుతూ హెచ్చరించండి. అప్పుడూ ఆ సభ్యునిలో ఎలాంటి మార్పులు లేనప్పుడు ఇతర సభ్యుల సహకారంతో పరిమితకాలపు నిషేధం విధించవచ్చు. ఆ నిషేధం అనంతరం కూడా ధోరణి మార్చుకోనప్పుడు నిషేధం కాలపరిమితి పెంచవచ్చు. చర్చ జరిగే సమయంలో మాత్రం దిద్దుబాట్లు నిబంధనలకు విరుద్ధంగా లేదా దుశ్చర్యలు అనిపిస్తే తప్ప మీరు నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చకండి (అంటే దిద్దుబాట్లు వెనక్కి చేయడం, వ్యాసాలు/వర్గాలు తొలిగించడం, సభ్యునిపై చర్చలు తీసుకోవడం లాంటివి). మరోమార్గం ఏమిటంటే సభ్యునిపై తగు చర్యలకై రచ్చబండలోనే ప్రతిపాదించవచ్చు. సభ్యుల నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:02, 22 అక్టోబర్ 2013 (UTC)
- ఈ సమస్య ఉత్పన్నమవడానికి కారణం ప్రోత్సాహం. మీ దిద్దుబాటులు వేలు దాటాయి కనుక పతకం అందుకొమ్మనో, అభినందనలు అందుకొమ్మనో సభ్యులు ప్రోత్సహించినంతకాలం అది అలా జరుగుతూనే ఉంటుంది. వారిపై నిర్వహణపరంగా చర్యలు తీసుకోవాలనుకున్నా వారిని సమర్ధించే గుంపులు వెలుగుచూసే అవకాశం ఉన్నది (కొండకచో ఎదురుదాడి కూడా జరగవచ్చు). రెడ్డిగారు చాలా సమయం కేటాయించి తెవికీలో ఉత్సాహంగా కృషిచేస్తున్నారు కనుక ఆయన మార్పులను స్వాగతించడం మంచిది...విశ్వనాధ్ (చర్చ) 07:38, 22 అక్టోబర్ 2013 (UTC)
తెవికీ నిర్వహణ బ్లాగు
[మార్చు]తెలుగు వికీపీడియాకు సంబంధించి కొత్తవారిచే రచనలు చేయించడం, వర్గాలు- లింకులు- బొమ్మలు- మూలాలు- మూసలు తదితరాలు ఉపయోగించడం, నిర్వహణ స్థాయిని మెరుగుపర్చడం, సభ్యుల సందేహాలు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని కొత్తకొత్త విషయాలను వివరించడం, తెవికీ సభ్యులకే కాకుండా తెలుగుబ్లాగు లోకానికికూడా తెవికీ గురించి పరిచయం చేసి వారిని ఈవైపు దృష్టిసారించేటట్లు చేయడం, తెవికీని ప్రచారం చేయడం, తెవికీలో వ్రాయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కొత్తవారికి వివరించడం ... ఇలా ఒకటేమిటి, బహుళప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్లాగు ప్రారంభించాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెవికీ నిర్వహణ బ్లాగును ఒక చిన్న సమాచారంతో ఈ రోజు ప్రారంభించానని చెప్పుటకు సంతోషిస్తున్నాను. మరికొన్ని రోజులలో దీన్ని మరింతగా విస్తరించి అందరికీ అన్ని విషయాలలో ప్రయోజనం కలుగునట్లు చేయడమే కాకుండా ఒక్కో సభ్యునిపై కూడా విశ్లేషణాత్మక సమాచారం, నెలవారీగా తెవికీ అభివృద్ధిపై వ్యాసాలు, నిర్వహణపై కూడా పరిశీలనాత్మక సమాచారం చేర్చుటకు నా వంతుగా ప్రయత్నిస్తాను. ఇలా చేయడం వల్ల తెవికీని గుణాత్మకంగానూ మెరుగుపర్చడానికి పరోక్షంగా తోడ్పడినట్లవుతుందని భావిస్తున్నాను. తెవికీ అభివృద్ధికి నిజమైన కృషిచేసేవారిని ప్రాత్సాహంచడం, అలాంటివారికి ప్రచారం ద్వారా పేరు వచ్చేటట్లు చేయడం కూడా నా లక్ష్యంలో భాగము. ఈబ్లాగును పలు అగ్రిగేటర్లలో చేర్చడం వల్ల ప్రచారం మరింత సులువవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:38, 22 అక్టోబర్ 2013 (UTC)
- అభినందనలు..... చంద్రకాంతరావు గారూ... మంచి విషయాన్ని సరైన సమయంలో ప్రారంభించారు... అభినందనలు అందుకోండి. అహ్మద్ నిసార్ (చర్చ) 03:48, 23 అక్టోబర్ 2013 (UTC)
- శుభాకాంక్షలు జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:59, 23 అక్టోబర్ 2013 (UTC)
- అభినందనలు--K.Venkataramana (talk) 04:08, 23 అక్టోబర్ 2013 (UTC)
- చాలా బాగుంది.సభ్యులకు చాలా ఉపకరమైన సమాచారం అందించె ప్రయత్నం.అబినందనాలు.పాలగిరి (చర్చ) 04:11, 23 అక్టోబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావుగారూ ! బ్లాగు చాలా బాగుంది. అనుభవం ఉన్న వికీపీడియన్లకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఇలాంటి వివరణలు వికీపీడియాను చక్కగా అవగాహన చేసుకున్న మీలాంటి వారే ఇవ్వగలరు. ఈ బ్లాగు వలన మరిన్ని ఉపయోగాలు ఉంటాయి. తెవికీ ప్రచారానికి, కొత్తవారికి తెవికీ గురించిన అవగాహన కలిగించడానికి ఈ బ్లాగు ఉపకరించగలదు. ఇలాంటి బ్లాగును ప్రారంభించినందుకు ధన్యవాదాలు. తెవికీలో చురుకుగా పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. సహసభ్యులకు మీ సహకారం అందిస్తూ తెవికీలో నిరంతరంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. --t.sujatha (చర్చ) 04:29, 23 అక్టోబర్ 2013 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Rao గారు తెవికీకైప్రత్యేకించి బ్లాగు ప్రారంభించినందులకు సంతోషం. ప్రస్తుతం వికీపీడియా:తెవికీ వార్త లేని లోటు తీర్చడంతోపాటు, మీ బ్లాగు అభివృద్ధిచెందుతూ తెవికీఅభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 04:37, 23 అక్టోబర్ 2013 (UTC)
- చాలా మంచి ఆలోచన. ఇందులో కూడా మనమందరం వికీపీడియన్లు కాని బ్లాగర్లను ప్రోత్సహించడానికి తెవికీలోని మంచి వ్యాసాల గురించి మన ప్రాజెక్టుల గురించి తెలియజేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:05, 23 అక్టోబర్ 2013 (UTC)
- వికీలో బ్లాగర్లకృషి నెమ్మదించిన తరుణంలో తెలుగు బ్లాగర్లను కలుపుకునేటందుకు మంచి ఆలోచన, చంద్రకాంతరావుగార్కి అభినందనలు..విశ్వనాధ్ (చర్చ) 05:36, 23 అక్టోబర్ 2013 (UTC)
- స్పందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. తెవికీ ప్రారంభమై పది సంవత్సరాలు కావస్తున్ననూ పట్టుమని పదిమంది చురుకైన సభ్యులు కూడా లేకపోవడం, ఉన్న చురుకైన సభ్యుల మధ్యన ఏమిచేయాలన్ననూ సరైన సహకారం అందకపోవడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్ననూ పూర్తిఫలితం ఇవ్వకపోవడం, చర్చలు ఎన్ని జరిగిననూ తుదినిర్ణయానికి అవకాశం లేకపోవడం, కొందరు సభ్యులకు నియమాలపై పూర్తిపట్టు లేకపోవడం, "స్వేచ్ఛా" విజ్ఞానసర్వస్వం అంటే ప్రతి ఒక్కరు ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనే "స్వేచ్ఛ" ఉన్నట్లుగా కొందరు ఆలోచించడం తదితర కారణాలతో, తెవికీని ప్రస్తుతమున్న "దశ" నుంచి బయటపడేటట్లు చేయడమే కాకుండా కొత్తవారికి తెవికీ రచనాతీర్థం పుచ్చుకొనేటట్లు చేయడం గురించి ఆలోచించి ఈ దిశగా చేయబోయే ఒక చిన్న ప్రయత్నమే ఈ బ్లాగు ఆవిష్కరణ. ఇదివరకు ఇలా బ్లాగులు ప్రారంభించినవారు ఉండవచ్చు కాని ఈ బ్లాగులో మాత్రం ఏదో రెండువ్యాసాలు వ్రాసి మూతపడేటట్లు చేయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. సాధ్యమైనంతవరకు తెవికీకి సమాంతరంగా ఉంటూ తెవికీ బయటా సభ్యులను ఆకర్షించడం, ఇక్కడి వ్యాసాలు, కృషిచేసే సభ్యుల గురించి తెలుగువారికి తెలియపర్చడం దీని లక్ష్యంగా పెట్టుకున్నాను. తెవికీలో ఎన్ని వ్యాసాలున్ననూ, మనం ఎంత కృషిచేస్తున్ననూ అది పదిమందికి ప్రయోజనం కలిగించాలంటే బలమైన తెలుగు బ్లాగులోకానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. అసలు తెలుగు వికీపీడియా అంటే చూడడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. రోజూ ఎందరెందరో సభ్యత్వం తీసుకుంటున్ననూ ఒక్క దిద్దుబాట్లు కూడా చేయకపోవడానికి కారణం ఏమిటి? దీనిపైనా పరిశోధన చేయాలి, వారిచే దిద్దుబాట్లు చేయించాలి. పూర్తి లక్ష్యం నెరవేరడానికి కొంత సమయం పట్టవచ్చు, వెనువెంటనే ఫలితాల గురించి ఆశపడక లక్ష్యమే మనల్ని వెదుక్కుంటూ వచ్చేవరకు మన పని మనం చేద్దాం. ఈవిషయంలో సభ్యుల సలహాలు, సూచనలకు తప్పకుండా విలువ ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:39, 23 అక్టోబర్ 2013 (UTC)
- వాడుకరి:C.Chandra Kanth Rao గారు ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఉడతాభక్తిగా, మీరు వ్రాసిన బ్లాగులను తెవికీ ఫేస్ బుక్ గుంపు మరియు ట్విటర్ ద్వారా వీలయినంత ఎక్కువమందికి తెలియజేయడానికి నా వంతు ప్రయత్నిస్తాను.--విష్ణు (చర్చ)18:43, 24 అక్టోబర్ 2013 (UTC)
- అవునండి విష్ణుగారు, తెవికీలో రచనలు చేయడం కంటే ఈ పని కష్టమైనదే. ఎంత ఆలోచించి వ్రాసిననూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. మూలాల పాఠం చూసి శ్రీరామమూర్తిగారు ఇప్పుడు మూలాలను సరిగ్గా చేర్చుతున్నందుకు సంతోషమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:56, 25 అక్టోబర్ 2013 (UTC)
- శెభాష్, చక్కని ప్రయత్నం. శెభాష్ అని చప్పట్లు కొట్టే బొమ్మ ఏదైనా వికీలో కనిపిస్తుందేమోనని చూశా, కానీ సరైనవి కనిపించలేదు --వైజాసత్య (చర్చ) 05:45, 27 అక్టోబర్ 2013 (UTC)
- వైజాసత్యగారి వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అలాగే విష్ణుగారు ఫేస్‌బుక్ ద్వారా బ్లాగును పరిచయం చేసినందుకు (ఎక్కడ అనేది తెలియదు కాని ఫేస్‌బుక్ నుంచి హిట్లు మాత్రం వస్తున్నాయి) ధన్యవాదాలు. ఫేస్‌బుక్‌లో నేను తెవికీ పేజీని కూడా ప్రారంభించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:11, 27 అక్టోబర్ 2013 (UTC)
- శెభాష్, చక్కని ప్రయత్నం. శెభాష్ అని చప్పట్లు కొట్టే బొమ్మ ఏదైనా వికీలో కనిపిస్తుందేమోనని చూశా, కానీ సరైనవి కనిపించలేదు --వైజాసత్య (చర్చ) 05:45, 27 అక్టోబర్ 2013 (UTC)
- అవునండి విష్ణుగారు, తెవికీలో రచనలు చేయడం కంటే ఈ పని కష్టమైనదే. ఎంత ఆలోచించి వ్రాసిననూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. మూలాల పాఠం చూసి శ్రీరామమూర్తిగారు ఇప్పుడు మూలాలను సరిగ్గా చేర్చుతున్నందుకు సంతోషమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:56, 25 అక్టోబర్ 2013 (UTC)
- వాడుకరి:C.Chandra Kanth Rao గారు ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఉడతాభక్తిగా, మీరు వ్రాసిన బ్లాగులను తెవికీ ఫేస్ బుక్ గుంపు మరియు ట్విటర్ ద్వారా వీలయినంత ఎక్కువమందికి తెలియజేయడానికి నా వంతు ప్రయత్నిస్తాను.--విష్ణు (చర్చ)18:43, 24 అక్టోబర్ 2013 (UTC)
- స్పందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. తెవికీ ప్రారంభమై పది సంవత్సరాలు కావస్తున్ననూ పట్టుమని పదిమంది చురుకైన సభ్యులు కూడా లేకపోవడం, ఉన్న చురుకైన సభ్యుల మధ్యన ఏమిచేయాలన్ననూ సరైన సహకారం అందకపోవడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్ననూ పూర్తిఫలితం ఇవ్వకపోవడం, చర్చలు ఎన్ని జరిగిననూ తుదినిర్ణయానికి అవకాశం లేకపోవడం, కొందరు సభ్యులకు నియమాలపై పూర్తిపట్టు లేకపోవడం, "స్వేచ్ఛా" విజ్ఞానసర్వస్వం అంటే ప్రతి ఒక్కరు ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనే "స్వేచ్ఛ" ఉన్నట్లుగా కొందరు ఆలోచించడం తదితర కారణాలతో, తెవికీని ప్రస్తుతమున్న "దశ" నుంచి బయటపడేటట్లు చేయడమే కాకుండా కొత్తవారికి తెవికీ రచనాతీర్థం పుచ్చుకొనేటట్లు చేయడం గురించి ఆలోచించి ఈ దిశగా చేయబోయే ఒక చిన్న ప్రయత్నమే ఈ బ్లాగు ఆవిష్కరణ. ఇదివరకు ఇలా బ్లాగులు ప్రారంభించినవారు ఉండవచ్చు కాని ఈ బ్లాగులో మాత్రం ఏదో రెండువ్యాసాలు వ్రాసి మూతపడేటట్లు చేయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. సాధ్యమైనంతవరకు తెవికీకి సమాంతరంగా ఉంటూ తెవికీ బయటా సభ్యులను ఆకర్షించడం, ఇక్కడి వ్యాసాలు, కృషిచేసే సభ్యుల గురించి తెలుగువారికి తెలియపర్చడం దీని లక్ష్యంగా పెట్టుకున్నాను. తెవికీలో ఎన్ని వ్యాసాలున్ననూ, మనం ఎంత కృషిచేస్తున్ననూ అది పదిమందికి ప్రయోజనం కలిగించాలంటే బలమైన తెలుగు బ్లాగులోకానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. అసలు తెలుగు వికీపీడియా అంటే చూడడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. రోజూ ఎందరెందరో సభ్యత్వం తీసుకుంటున్ననూ ఒక్క దిద్దుబాట్లు కూడా చేయకపోవడానికి కారణం ఏమిటి? దీనిపైనా పరిశోధన చేయాలి, వారిచే దిద్దుబాట్లు చేయించాలి. పూర్తి లక్ష్యం నెరవేరడానికి కొంత సమయం పట్టవచ్చు, వెనువెంటనే ఫలితాల గురించి ఆశపడక లక్ష్యమే మనల్ని వెదుక్కుంటూ వచ్చేవరకు మన పని మనం చేద్దాం. ఈవిషయంలో సభ్యుల సలహాలు, సూచనలకు తప్పకుండా విలువ ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:39, 23 అక్టోబర్ 2013 (UTC)
- ఇప్పటికే ఫేస్‌బుక్‌లో తెలుగు వికీ పేరుతో తెవికీ పేజీ ఉన్నది. దీనితో రెండు అవుతాయి..(https://www.facebook.com/groups/560945180622204/)...విశ్వనాధ్ (చర్చ) 03:37, 29 అక్టోబర్ 2013 (UTC)
- నాకు దాని గురించి ముందే తెలియదు. అయినా సరే అది గ్రూపు, ఇది పేజీ. రెండూ సందర్భానుసారంగా ప్రచారానికి పనికివస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:48, 29 అక్టోబర్ 2013 (UTC)
- నాకు తెలిసి తొలి పేస్బుక్ పేజీ ని 2012 లక్ష్యాలలో భాగంగా (మొదటి పోస్ట్ ఫిభ్రవరి 6, 2012 ప్రారంభించాము. అంతకు ముందు సంవత్సరంలోతొలి ఫేస్బుక్ గ్రూప్ (మొదటి పోస్ట్ అక్టోబర్ 22, 2010) వాడాము. వీటిని స్వాగత మూసలద్వారా తెలియచేశాము. నా అనుభవంలో సోషల్ మీడియా తెవికీ ప్రాచుర్యాన్ని పెంచడానికి అంత ఉపయోగపడలేదు. ప్రస్తుత ప్రయత్నాలు ఫలించాలని కోరిక--అర్జున (చర్చ) 05:07, 31 అక్టోబర్ 2013 (UTC)
- నాకు దాని గురించి ముందే తెలియదు. అయినా సరే అది గ్రూపు, ఇది పేజీ. రెండూ సందర్భానుసారంగా ప్రచారానికి పనికివస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:48, 29 అక్టోబర్ 2013 (UTC)
ఐ.పి.నెంబరు తో ఇబ్బంది.
[మార్చు]నా కంప్యూటరు సిస్టంలో BSNl Local area connection status నా ఐ.పి.నెంబరు 192.168.1.2 గా చూపిస్తున్నది.తెవికిలో ఈ రోజు నేను లాగిన్ అవ్వకుండ ఎంట్రి అయ్యి దిద్దుబాటుచేసి చూస్తే నా ఐ.పి.నెంబరును 117.200.27.128 గా చూపిస్తున్నది.ఇంకను పాత ఐ.పి.నే ఎందుకు చూపిస్తున్నది.దీని వలన ఈ సంవత్సరం రెండుసార్లు ఇబ్బంది పడ్డాను.కారణం వేరే ఎవ్వరో అజ్ఞాతసభ్యుడు 117 నెం మీ దుశ్చర్యలు చేయ్యగా,దానిని వికిమెట వాళ్ళు బ్లాక్ చేసిన, నా ఎడిట్ పేజిబ్లాకు కూడా అవ్వుతున్నది.మళ్ళి నేను వారి దృష్టికి తీసికెళ్ళడం,వాళ్ళు మీఅకౌంటుకాదండి,ఐ.పి.ని బ్లాకు చేశామంటుమళ్ళి పునరుద్దరించడం జరిగినది.ఈ ఐ.పి.గోలకు శాశ్విత పరిష్కరం ఎవ్వరైన చెప్పగలరా?పాలగిరి (చర్చ) 04:25, 24 అక్టోబర్ 2013 (UTC)
- మీ దగ్గరున్న బిఎస్ఎన్ఎల్ రూటర్ మీ కంప్యూటరుకు స్థానికంగా కేటాయించే ఐపి మీరు చెప్పిన మొదటిది. ఇది సాధారణంగా మారదు. మీరు అంతర్జాలంలో వాడేటప్పుడు మీ బిఎస్ఎన్ఎల్ ఒకతాత్కాలిక ఐపిని కేటాయిస్తుంది. అదే రెండవది. బిఎస్ఎన్ఎల్ కి కేటాయించబడిన సమూహ IP లలో ఏదో ఒకటి మీకు కేటాయించబడుతుంది. సాధారణంగా IP నిరోధాలు అనామక ఎడిటర్లకు మాత్రమే వర్తిస్తాయి. మీకు ఇబ్బంది కలుగుతుంటే ఏ వికీనుండి నిరోధం చేశారో ఆ వికీలోనే శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నించండి--అర్జున (చర్చ) 06:58, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఐ.పి.నెంబరుతో బ్లాక్ ఛేసినప్పుడు,ఆ ఐ.పి నెంబరుతో నిషేధం నేను ఎడిట్ చెయ్యటానికి ప్రయత్నంచేసినప్పుడు కన్పిసున్నది.నిషెధపుటలోసంప్రదించమని వున్నవ్యక్తితో ,నిషేధ పుటద్వారా మాత్రమే వ్రాతమూలకంగా వారిని సంప్రదించటం జరుగుతున్నది.నిషేధం తొలగించినతరువాత పుటతొలగింపటం వలన నేను చేసిన సంప్రదింపు వివరాలు కూడా తొలగిపోతున్నాయి.నా చర్చపుటలో నమోదు కావటంలేదు.అందులో ఆవ్యక్తి వివరాలు తెలియటంలేదు మరల సంప్రదించుటకై.పాలగిరి (చర్చ) 07:46, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఆంగ్ల వికీ లో తెలిపినట్లు మీరు నిరోధం సడలింపుకై ప్రయత్నించవచ్చు. లేక మీరు నిర్వాహకునిగా మారితే సమస్య తొలగిపోవొచ్చు. --అర్జున (చర్చ) 07:56, 24 అక్టోబర్ 2013 (UTC)
- పాలగిరి గారి సమస్యకు తెవికీ వరకు పరిష్కరించవచ్చని గమనించిన పిదప [ఐపి నిరోధం నుండి మినహాయింపు] కల్పించాను. మరల తెవికీలో సమస్య కనబడితే తెలియచేయండి. -- 2013-10-28T08:19:38 Arjunaraoc
2013 మూడవ త్రైమాసికంలో తెలుగు వికీ మార్పులు ఆంగ్లేతర భారతీయభాషలన్నిటిలో ప్రధమ స్ధానంలో
[మార్చు]దేశాలవారీగా మార్పుల గణాంకాల లింకు ప్రకారం తెలుగువికీమార్పులు (7.4%)తో గణనీయంగా పెరిగి మొట్టమొదటిసారిగా 2013మూడవ త్రైమాసికంలో భారతీయభాషలలో అగ్రస్థానంలోకి వచ్చాయి. పూర్తి వివరాలు విశ్లేషించడానికి సెప్టెంబరు గణాంకాలు ఇంకా అందుబాటు లోకి రాకపోయినా, ఇప్పటి వరకు నేను గమనించిన మార్పులను బట్టి ఈ కృషికి రాజశేఖర్ గారి నేతృత్వములో చేపట్టిన ప్రాజెక్టులు, సహకరించి విస్తారంగా కృషిచేసిన సహ సభ్యులు భాస్కర్నాయుడు, వెంకటరమణ, ప్రణయరాజ్, విష్ణు ఇంతేగాక గ్రామాలవ్యాసాలలో విశేషంగా కృషిచేసిన శ్రీరామమూర్తి, వికీని శుద్ధిచేయటానికి విశేషంగా కృషి చేసిన వెంకటరమణ, వైవిఎస్ రెడ్డి, వికీసోర్స్ లో జానపదకళారూపాలు ప్రాజెక్టుని నిర్వహించిన భాస్కరనాయుడు, భాగవతం ప్రాజెక్టుకి కృషి చేసిన రాజశేఖర్ గారు, వీటితో పాటు కొత్తగా చేరిన సభ్యులకు సూచనలు అందజేసిన అనుభవజ్ఞులైన సభ్యుల వైజాసత్య, చంద్రకాంతరావు, సుజాత మరియు సిఐఎస్-ఎ2 కె ప్రాజెక్టు తరపున సహాయమందించడమే కాకుండా సహసభ్యునిగా వికీఅభివృద్ధికి కృషి చేస్తున్న విష్ణులతో పాటు వికీ అభివృద్ధికి మనందరి కృషి చాలావరకు కారణమనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా కృషిచేసిన వారి పేర్లేవైనా పేర్కొనకుండినట్లయితే క్షమించండి మరియు స్పందన ద్వారా తెలియచేయండి. అందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 09:53, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఈ రికార్డుకి కారణభూతులైన అందరికీ ధన్యవాదాలు! అలాగే గత ఐదు నెలలో, ప్రతి నెలా 25, 100, 250 మరియు 1000 దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెవికీ పుట్టినప్పటినుండి చూస్తే కూడా మనకు ఇలాంటి రికార్డ్ కనిపించదు . దిద్దుబాట్లే కాకుండా, నన్ను చాలా సంతోషపెట్టిన విషయం ఎమిటంటే మనలో కొందరు ప్రాజెక్టులలో సమిష్టిగా కృషి చేసాము. ఇక ముందు కూడా ఇలాగే మనం సమిష్టిగా కలిసి తెలుగు వికీని ముందుకు తీసుకువెలుదాం. రానున్న తెవికీ 10వ వార్షికోత్సవ సంబరాలలో అందరం కలుద్దాం, తెవికీ పురోగతిని మరింత వేగవంతం చేద్దాం. అర్జున గారు, ఈ మంచి వార్తను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ... --విష్ణు (చర్చ)12:16, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఇది తెలుగు వికీపీడియాలో కృషిచేస్తున్న మనందరిదీ. ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇంతవరకు పది సంవత్సరాలలో మనం మొదటిసారిగా ఈ స్థాయికి ఎదిగాము. గణాంకాలను చూచి మనకు తెలియజేసిన అర్జునరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనవి ఒకటి వున్నది. ఈ ప్రగతిని ప్రతి త్రైమాసికంలో నిలుపుకోవాలంటే మనం కలిసి పనిచేయాలని మాత్రమే నేను చెప్పదలచుకున్నాను. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమస్యలను అధిగమిస్తూ ముందుకు పోతూ వుంటే ఇలా ప్రతిసారి మనం మొదటిపంక్తిలో వుంటాము.Rajasekhar1961 (చర్చ) 12:23, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఈ విషయం చాలా సంతోషం కలిగించింది. ఇందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. 100 ఎడిట్ల కన్నా ఎక్కువ చేసే వారి సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఆంగ్లంతో సరిసమానంగా మార్పులు జరిగే రోజు కోసం ఎదురుచూస్తాను. మరో వారం రోజులలో సెప్టెంబర్ గణాంకాలు మన వద్ద అందుబాటులో ఉండవచ్చు. సభ్యులందరికీ శుభాకాంక్షలు. రహ్మానుద్దీన్ (చర్చ) 12:28, 24 అక్టోబర్ 2013 (UTC)
- తెవికీని అభివృద్ధి పథంలో నడిపి అందరూ గర్వించదగ్గ స్థాయికి తీసుకు వెళ్ళీన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రగతి మనందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ప్రాజెక్టులను సమిష్టిగా సమన్వయంతో నిర్వహించి సభ్యులకు ప్రోత్సహించి వాటి అభివృద్ధికి కారణమైన రాజశేఖర్ మరియు విష్ణు లకు ధన్యవాదాలు. గ్రామ వ్యాసాలను విశేషంగా తీర్చిదిద్దుతున్న శ్రీరామమూర్తి గారికి, అక్షర దోషాలను సరిచేస్తూ శుద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్న కంపశాస్త్రి గారికి, విశేష వ్యాసాలు అందించిన సుజాత గార్కి ధన్యవాదాలు. అవిరళంగా కృషిచేస్తూ ఉన్న తెవికీ సభ్యులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా యిదే నమన్వయంతో సమిష్టి కృషితో తెవికీని భారతీయ భాషలలో అత్యున్నత స్థాయిలో నిరంతరం నిలపడానికి మనందరం కృషిచేయాలి.----K.Venkataramana (talk) 13:13, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఇది నిజంగా మంచి విషయం. తెవికీని శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న సభ్యులందరికీ అభినందనలు. ఈ కృషి ఇలానే కొనసాగించి ఎప్పుడూ అదేస్థాయిలో వికీని నిలబెట్టాలి..విశ్వనాధ్ (చర్చ) 13:57, 24 అక్టోబర్ 2013 (UTC)
- తెవికీ దిద్దుబాట్ల పురోగతి బాగుండటం శుభసూచకం. గతంతో పోలిస్తే దిద్దుబాట్ల సంఖ్య పెరగడం వాస్తవమే కాని నా పరిశీలన ప్రకారం చెప్పాలంటే పైన చెప్పిన 7.4% మార్పులు దిద్దుబాట్ల మార్పుల వృద్ధికాదు. ఈ శాతం భారతీయ భాషలలో అగ్రస్థానంలో ఉన్ననూ మన కన్నా తమిళవికీ వారు దిద్దుబాట్ల వృద్ధిలో ముందంజలో ఉన్నారు కాని వీక్షకుల సంఖ్య అక్కడ అధికంగా ఉండుట వల్ల వారి శాతం తగ్గింది. 3వ త్రైమాసికంలో మనవీక్షకులు 8 వేలు ఉండగా, తమిళవికీ వీక్షకులు 21.9 వేలున్నారు. త్రైమాసికంలోని తొలి రెండుమాసాలలో మన దిద్దుబాట్లు 13.6 వేలుండగా, తమిళవికీ దిద్దుబాట్లు 29 వేలున్నాయి. మరి ఆ 7.4% ఎలా వచ్చిందీ అంటే - అది దేశం మొత్తంలో వీక్షకుల సంఖ్యకు, దేశం మొత్తంలో జరిగిన దిద్దిబాట్ల సంఖ్యకు నిష్పత్తి మాత్రమే. ఆ 7.4% అనేది దేశంలోని అన్ని వికీల నిషత్తిలో మన వాటా మాత్రమే కాని పెరుగుదల శాతం కాదు. అలా అయితే ఆంగ్లవికీ 75%పైగా పెరుగుదల సాధించడం అసంభవమే కదా! (ఏదేని త్రైమాసికానికి సంబంధించి అన్ని వికీల మొత్తం చూడండి 100% ఖచ్చితంగా సరిపోతుంది, అంటే దేశంలో అన్ని వికీలు కలిపి వృద్ధి ప్రతి త్రైమాసికానికి రెట్టింపు అవుతుందని కాదు కదా!) హిందీ వికీలో దిద్దుబాట్లు దాదాపు మనకు సమానంగా ఉన్ననూ వీక్షకుల సంఖ్య మనకన్నా 4 రెట్లకు పైగా అధికంగా ఉండటంతో మనతోపోలిస్తే వారి వాటా 4వ వంతే ఉంది. మనకు కనీసం ఈ వాటా అయినా పెరిగినందుకు సంతోషమే. నిజమైన పెరుగుదలకు కూడా కృషిచేద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:39, 24 అక్టోబర్ 2013 (UTC)
- నేను మరల ఒకసారి పరిశీలించాను. నేనిచ్చిన పేజీ మార్పుల విభజన చూపెట్టుతుంది. దానిలో వేరే లింకు ద్వారా పేజీ వీక్షణల విభజన కూడాచూడవచ్చు. మూడు నెలలలో భారతదేశం నుండి జరిగిన మార్పులన్నిటిలో ఏ భాషలో ఎన్ని మార్పులు జరిగినవనేదానిని మొత్తముమార్పులతో భాగించితే వచ్చే దానినేశాతంగా చూపెట్టటము జరిగింది. ఇది ఇంతకు ముందలి త్రైమాసికంలో 4.8% గా నమోదైంది. అందువలన మనం ఎక్కువమార్పులు జరిగితే దీనిలో వృద్ధికనబడుతుంది లేక ఇతర భాషలలో ఏవిధంగానైన మార్పులు తగ్గితే మనం మొదటి స్థానానికి చేరవచ్చు. ఇతర భాషల మార్పులు లో భారీ తేడాలు రావటానికి కారణాలు నాకు తెలిసి గత త్రైమాసికంలో జరగలేదు. బహుశా తమిళ వికీదశాబ్ది ఉత్సవాలు తప్ప. అందుకని మన భాషలో జరిగిన మార్పులే దీనికి కారణమని అనుకుంటున్నాను. దీనితో పాటు వీక్షక అభ్యర్ధనలను కూడా దేశాల వారీగా వాటిలో భాషల విభజన ప్రకారం చూస్తే తెలుగు 0.2 శాతం గానమోదైంది. మన వైజాసత్య గారి అలాగే కిరణ్మయి గారి మార్పులు దీనిలోలెక్కకు రాలేదు. వారు అమెరికాలో వుంటున్నారు కాబట్టి. ఈ గణాంకాలకి ఆపేజీలో తెలిపినట్లు పరిమితులుంటాయి. అలాగే నేను మరల పరిశీలించినపుడు ఇవి వికీపీడియాకి మాత్రమే అని తెలిసింది. మరిన్ని వివరాలు సెప్టెంబరు గణాంకాలు తెలిసినప్పుడు తెలియవచ్చు. చంద్రకాంతరావుగారు చెప్పినట్లు మరి ఇతర నివేదికల మార్పులు పరిశీలించినపుడు ఐదారుగురు బలమైన ఎడిటర్లు వలన ఈ మార్పు జరిగిందని భావిస్తాను. దీనిని నిలబెట్టుకోవడం చాలాకష్టం. వికీపరిచయం తెలుగువారికి ఎక్కువగా కలిగినప్పుడు 5 కన్నా ఎక్కువ మార్పులు చేసేవారు గణనీయంగా పెరిగినప్పుడే మన తెవికీ అభివృద్ధిపధంలో పడిందనుకోవాలి. గత నాలుగైదుసంవత్సరాలుగా నేను కాని, సభ్యుడు:C.Chandra Kanth Rao గారు కాని అప్పుడప్పుడు గణాంకాల విశ్లేషణ చేస్తున్నాము. ఆసక్తిగల సభ్యులు మరింత మంది దీనిపై దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు చేసినప్పుడు స్పష్టమైన గణాంకాలతో విశ్లేషణ చేయడం జరిగింది. వాటిని పొందడానికి తగిన మైఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కూడా సంబంధిత చర్చాపేజీలో రాయడం జరిగింది. ఎవరైనా ముందుకు వస్తే నాకు తెలిసినది పంచుకోగలను. ఈ పైన చెప్పినవాటిని ఇతరులుకూడా పరిశీలించి ధృవీకరించమని మనవి. --అర్జున (చర్చ) 15:52, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఇది తెవికీ పీడియన్లు అనందించవలసిన విషయం. ఈ ఉత్సాహంతో మనమందరం కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాలలో మొదటి స్థానానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విషయం మనకందరికీ అందించి మనలో సరికొత్త ఉత్సాహం నింపిన అర్జునరావుగారికి ధన్యవాదాలు. తెవికీ సభ్యుడుగా విష్ణువర్ధన్ గారు అందిస్తున్న సహకారం ఈ అభివృద్ధికి మరింత కారణం. అలాగే వర్గాలలో అత్యధిక మార్పులు చేసిన ఉత్సాహవంతుడైన వైవి.ఎస్ రెడ్డి గారు , తెలుగు ప్రముఖుల ప్రణాళికను చేపట్టిన రాజసేఖర్ గారూ, భాస్కరనాయుడు గారు, యువ వికీపీడియన్లు ఉత్సాహవంతులు అయిన రహ్మానుద్దీన్, ప్రణయరాజ్ మరియు విశ్వనాథ్ గార్లు, స్వల్పకాలంలో అత్యధిక వ్యాసాలు మరియు వ్యాసేతర సేవలు అందించిన వెంకట రమణగారూ , పాలగిరిగారు ఈ ముందడుగుకు కారణం అని భావిస్తున్నాను. ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్న తెవికీ సభ్యులందరికీ ఈ అభివృద్ధికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలిసి నడుస్తాం మరింత అభివృద్ధి సాధిస్తాం. --t.sujatha (చర్చ) 18:25, 24 అక్టోబర్ 2013 (UTC)
- తెలుగులో వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాక, కొన్ని కారణాల వల్ల అనుకున్నట్టు చేయలేకపోయాను. చరిత్ర పుస్తకాల నుంచి, వైజ్ఞానిక విషయాలు అనువదించడం సరి అంటే, నేను ఆ పనిలో నిమగ్నమవుతాను. కిరణ్మయీ (చర్చ) 22:42, 24 అక్టోబర్ 2013 (UTC)
- సభ్యులకు ఏవిషయంలో ఆసక్తి వుంటే ఆ విషయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించవచ్చు. కాని నాణ్యత మెరుగయ్యేదెప్పుడంటే నలుగురు కలసి ఒక ప్రాజెక్టును చేపట్టినియతకాలవ్యవధిలో పనిచేయడమే. నా అనుభవాలు ఉపయోగపడవచ్చు. ప్రాజెక్టుల పేజీలో ప్రతిపాదనచేసి ఇంకో ముగ్గురు చేరితే పని మొదలు పెడితే మంచిది. --అర్జున (చర్చ) 03:27, 25 అక్టోబర్ 2013 (UTC)
- P.S. I have not been able to send you this message in Telugu, but it may interest you to know I have been working on translating Telugu literature into Hebrew on my home Wikipedia (as a volunteer, at night). Ijon (చర్చ) 16:26, 25 అక్టోబర్ 2013 (UTC)
- Thanks Ijon for your wishes and also for your work on Hebrew wp related to Telugu literature.--అర్జున (చర్చ) 03:51, 26 అక్టోబర్ 2013 (UTC)
- Ijon thanks for the wishes :) Now I understand why you keep asking questions on Telugu literature!! I have started translating Culture of Israel, from Hebrew wp into Telugu. Still a long way to go. I am sure my Telugu friends here will take up translating the rest of the two articles from Hebrew wp nominated here. --విష్ణు (చర్చ)
సముచిత వినియోగానికి తెవికీలో విధాన నిర్ణయం
[మార్చు]ఇటీవల బొమ్మల నకలుహక్కులపైశ్రద్ద పెట్టడం అందరూ గమనించారనుకుంటున్నాను. సముచిత వినియోగ సూత్రాలప్రకారం మార్చదగ్గవీలున్న బొమ్మలను ఆంగ్లవికీలో తొలగించటానికి నిర్ణయించారు (Wikipedia:CSD#Files#Invalid fair-use claim). వికీఫౌండేషన్ ఉచిత వినియోగానికి, వ్యాస అవసరానికంటే ప్రాముఖ్యతనిచ్చింది.(https://wikimediafoundation.org/wiki/Resolution:Licensing_policy) అయితే స్వేచ్ఛాబొమ్మ అందుబాటులో లేనప్పుడు నకలుహక్కుల బొమ్మను చేర్చితే తొలగించాలా లేదా అనే దానిని సంబంధిత వికీప్రాజెక్టుయొక్క నిర్ణయానికి వదిలేసింది. ఉదాహరణకు మనం జీవించివున్న కళాకారుని బొమ్మ సముచిత వినియోగమని తెవికీలో చేర్చితే అది మార్చవీలున్న బొమ్మ క్రింద వస్తుంది. చారిత్రాత్మక బొమ్మలు మార్చవీలుకాని వర్గంలో వస్తాయి. మరిన్ని వివరాలకు Wikipedia:Non-free content review, కనుక మనం తెవికీలో దీనిపై స్పష్టమైన విధానాన్ని నిర్ణయించుకోవాలి. నాకు తెలిసినంత వరకు లాభనష్టాలు వివరిస్తాను. వీటిపై చర్చించి విస్తృతఏకాభిప్రాయానికి ప్రయత్నిద్దాము.
- మార్చవీలున్న బొమ్మలు తొలగించితే లాభనష్టాలు క్రిందవివరిస్తాను.
- లాభాలు
- అవసరమైన బొమ్మలు పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి
- వికీబొమ్మలుఎక్కువగా వినియోగంలోకి వస్తాయి
- మనం విధానం ఆంగ్లవిధానంతో సమానమై, ఆంగ్లంలో వినియోగించే ఉపకరణాలు, విధానాలు సులభంగా వాడుకోవచ్చు.
- నష్టాలు
- మన వ్యాసాలకు అవసరమయ్యే బొమ్మలు కోల్పోతాము. (ఇలాంటివి ఎన్ని వున్నవివిశ్లేషించవలసివుంది, దాదాపు 30 శాతం బొమ్మలు (2000పైగా) ఉచితంకాని మీడియాగావున్నవి. వీటిలో ముఖ్యంగా జీవించివున్న వ్యక్తులు బొమ్మలే ఈ విధానానికి ప్రధానమవుతాయి. ఇతర బొమ్మలు మనం వెతికితే ఫ్లికర్లో ఉచితంగా దొరకవచ్చు. మనము సమీక్షచేస్తేనే ఎన్ని బొమ్మలు కోల్పోతాము అని తెలుస్తుంది).
ఇంకేదైనా సందేహాలుంటే అడగండి మరియు చర్చలో పాల్గొనండి--అర్జున (చర్చ) 11:15, 24 అక్టోబర్ 2013 (UTC)
- ఇతర వ్యాఖ్యలు
- భారతదేశంలో తయారవుతున్న ఫోటోలు, సమాచారంపై కాపీహక్కులు నిర్ధారించడం చాలా దుర్లభమైన పని. స్పష్టమైన విధానమంటూ లేదు. ఉదాహరణకి ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న సమాచారం ప్రజలకు సార్వజనీకంగా చెందుతుందా లేదా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరింత కఠినమైన వికీనియమాల వల్ల చాలా ఫోటోలను కోల్పోతాం. సముచిత వినియోగానికి అ.సం.రా కాపీహక్కుల చట్టం క్రింద చక్కని పరిరక్షణ ఉన్నది. కాబట్టి బొమ్మల సముచిత వినియోగం చట్టరీత్యా నేరం కాదు. ఆంగ్ల వికీ నియమాలు అతిజాగ్రత్తతో చేసినవి. ప్రస్తుతానికి మనం అంత కఠినమైన నియమాలు అమలుపరచటం మంచిది కాదు. ఈ పనిలోనే ఉండగా భారతీయ కాపీహక్కుల చట్టాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొనేందుకు ప్రయత్నిస్తాను (భారతీయ ఆంగ్లం అర్ధం చేసుకోటం అంత సులభం కాదు సుమీ, బ్రిటన్లో కూడా ప్రస్తుతం ఉపయోగించని పరమ పురాతన భాషలో వ్రాస్తారు మరి).--వైజాసత్య (చర్చ) 02:25, 25 అక్టోబర్ 2013 (UTC)
- వ్యాఖ్య వెనక్కి తీసుకోవాలేమో :-) http://copyright.gov.in అనే సులభమైన వెబ్సైట్ ఉంది --వైజాసత్య (చర్చ) 02:32, 25 అక్టోబర్ 2013 (UTC)
- ఫ్లికర్లో ఉన్న భారతీయ ఫోటోగ్రఫర్లను కొన్ని ఫోటోలు ఉచిత లైసెన్సులతో విడుదల చేసేందుకు ప్రోత్సహించడం చక్కని ఆలోచన. చాలా మంది అడగ్గానే చక్కగా సహకరిస్తారు --వైజాసత్య (చర్చ) 02:25, 25 అక్టోబర్ 2013 (UTC)
- భారతీయ కాపీహక్కుల చట్టం గురించి చదివిన తర్వాత తెలసిన విషయాలు 1) సినిమాలు, ఫోటోలు తదితరాలు తొలిసారి ప్రచురించబడిన 60 ఏళ్ళకు పబ్లిక్ డొమైన్లోకి వస్తాయి. పుస్తకాలు, చిత్రలేఖనాలు వగైరా కర్త మరణించిన అరవై ఏళ్ళకి గానీ ఉచితమవవు. 2) ప్రభుత్వం తయారుచేసిన వాటికి కాపీహక్కులు ప్రభుత్వానికి చెందుతాయి ప్రజలకు కాదు. 3) సముచిత వినియోగం లాంటి వెసలుబాట్లు ఉన్నాయి. 4) వార్తలపై కాపీహక్కులు లేవు, కానీ వాటిని అందించే విధంపై కాపీహక్కులున్నవి 5)అనుమతి లేకుండా అనువదించకూడదు. అనువాదానికి కూడా మూలానికి ఉన్న కాపీహక్కులు వర్తిస్తాయి. --వైజాసత్య (చర్చ) 03:04, 25 అక్టోబర్ 2013 (UTC)
- వైజాసత్య గారి స్పందనకి ధన్యవాదాలు. నకలు హక్కుల చట్టం లో క్లుప్తంగా తెలుగులో సమాచారం వుంది. సంబంధిత ఆంగ్లవికీలో మరింత సమాచారందొరకుతుంది.--అర్జున (చర్చ) 03:21, 25 అక్టోబర్ 2013 (UTC)
- కాపీహక్కులపై ఇప్పుడే ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నించక మరికొంతకాలం వేచిచూడడం మంచిది. ప్రస్తుతం కాపీహక్కులపై అవగాహన ఉన్న సభ్యులు తక్కువగా ఉన్నారు. ఈ విషయంలో ఏదైనా ప్రతిపాదించినచో సరైన నిర్ణయం వెలువడుతుందన్న నమ్మకం ఉండదు. వెలువడిన నిర్ణయం తెవికీకి నష్టం కలిగించే అవకాశమూ ఉండవచ్చు. కాబట్టి కాపీహక్కులపై అవసరమైనచోట మరిన్ని చర్చలు జరుపుతూ సభ్యులకు ఈ విషయంలో అవగాహన కల్పించడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:57, 25 అక్టోబర్ 2013 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. వికీ దశాబ్దికి సిడి విడుదల కావాలంటే వీటిపై త్వరగా స్పష్టత ఏర్పడడం మంచిది. నాకు తెలిసి వికీలో విషయాలు బొమ్మలు అమెరికా చట్టాలకు అలాగే ఇవి వాడే ప్రజల యొక్క దేశాల చట్టాలకు అనుగుణంగా మరియు వికీమీడియా ఫౌండేషన్ విధాలకు లోబడి వుండాలి. అందువలన విధానాలలో స్పష్టత కావలసింది ఒక్క సముచిత వినియోగంలో మార్చదగ్గవీలున్న వాటిగురించే. ఇది అర్ధం చేసుకోటానికి అంత క్లిష్టమనుకోను. సందేహాలుంటే త్వరగా స్పష్టత కొరకు రచ్చబండలోకాని ప్రత్యేకంగా వెబ్ ఛాట్ లో కాని పాల్గొనగలను. తీర్మానంపై స్పష్టత వచ్చిన తరువాత అవసరమైతే వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం రెండు వారాలు వుంటుంది. మీ దృష్టిలో ఎంత సమయం కావాలో తెలిపితే దానిపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. అన్నట్లు ఈ విధానానికి దాదాపుఇప్పటికే ఐదేళ్ల పైగా ఆలస్యమైంది. ఫౌండేషన్ గట్టి చర్యలు తీసుకోకపోవడంతో మన వికీలలో ఇబ్బంది పడకుండా వున్నాము. నకలుహక్కులకు సంబంధించి సమస్య తెలిసినతరువాత ఎంత వేగంగా వీలయితే అంత త్వరగా చర్యలు తీసుకోవడం మంచిది --అర్జున (చర్చ) 10:13, 26 అక్టోబర్ 2013 (UTC)
- వికీపీడియాకు చాల ముఖ్యమైన ఈ విషయంపై ఇద్దరే ఇప్పటికి స్పందించారు. సంబంధించిన కొత్త ఫైల్ అప్లోడ్ ప్రతిపాదన పై ఇద్దరుమరియ ఇంపోర్ట్అప్లోడ్ హక్కు ప్రతిపాదన పై ఒకరు స్పందించారు. సహ సభ్యులుకూడా రెండు మూడు రోజూలలో స్పందించమని మనవి. దీనిగురించి నేను ఇప్పటికే కనీసం రెండు మూడు రోజులు వెచ్చించి కొత్త ఫైల్ అప్లోడ్ గురించి కృషి చేశాను. దీనిపై త్వరలో నిర్ణయం చేయగలిగితే ఈ పనిని వేగవంతం చేయటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 04:42, 31 అక్టోబర్ 2013 (UTC)
- ఇప్పటివరకు వాడుతున్న వివరము ఆంగ్ల వికీనే పోలివుంది. జీవించివున్న వ్యక్తుల ఛాయాచిత్రములు సదుపయోగం (సముచితవినియోగం) క్రిందఎక్కించవద్దు అని స్పష్టంగా వున్నందున కొత్తగా నిర్ణయం చేయనవసరం లేదనుకుంటాను. ఆంగ్లవికీ నియమాలను అనుసరిస్తే మనకు సంబంధించిన కృతులను ఆంగ్లం లో మరియు తెలుగులో ఏకరీతిన వాడుకొనటం వీలవుతుంది. ఏమైనా అభ్యంతరాలుంటే ఒక వారంలో (14 నవంబర్ 2013 లోగా)తెలియచేయండి. --అర్జున (చర్చ) 03:54, 7 నవంబర్ 2013 (UTC)
జీరంగి / కీచురాయి
[మార్చు]జీరంగి అనే కీటకాన్ని గురించి కొంత వ్రాశాను. కీచురాయి అనే కీటకము పై కొంత సమాచారము తెవికిలో వున్నది. అక్కడ ఆ కీటకము బొమ్మను బట్టి చూస్తే జీరంగికి కొంత పోలికలున్నాయి.. కనుక జీరంగి ..... కీచు రాయి అనే ఈ రెండు కీటకాలు ఒకటే ననే అనుమానమున్నది. దానిని జీరంగి అని పిలిచే ప్రాంతంలో దానికి కీచురాయి అనే పేరు వాడుకలో వున్నట్లు లేదు. ఈ రెండు ఒకటే అయితే విలీనము చేయ వచ్చునేమో పరిశీలించ వచ్చును. Bhaskaranaidu (చర్చ) 05:41, 25 అక్టోబర్ 2013 (UTC)
- వ్యాస చర్చా విషయాలు వాటి చర్చా పేజీలో రాసి అందరి దృష్టికి తేవాలంటే {{సహాయం కావాలి}} మూస చేర్చమని మనవి. నేను పై వ్యాఖ్యను అక్కడ చేరుస్తాను. దీనిపై ఇక చర్చ చర్చ:జీరంగి లో చేయండి. --అర్జున (చర్చ) 06:24, 25 అక్టోబర్ 2013 (UTC)
గణాంకాలు
[మార్చు]నేను వ్రాస్తున్న గ్రామగణాంకాలకు అవసరమైన సమాచారం [1] ఈ ప్రభుత్వ వెబ్ సైట్ నుండి తీసుకుంటున్నను. ఇందులో 2011 గణాంకాలని ఉన్నది. అయినప్పటికీ 2011 గణాంకాలు ఇంకా అప్‌లోడ్ చేయలేదని 2001 గణాంకాలని చంద్రకాంతరావు గారు సూచించిన తరువాత ఇప్పుడు 2001 అని వ్రాస్తున్నాను. ఇప్పటి వరకూ వ్రాసిన గణాంకాలను బాటు ద్వారా సరిచేయవచ్చు కనుక బాటు గురించి తెలిసిన సభ్యులు సరి చేయవలసిందిగా కోరుతున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 13:17, 25 అక్టోబర్ 2013 (UTC)
- అవును, పై లింకులో ఉన్న గ్రామజనాభా వివరాలు 2001 నాటివే. గ్రామాలకు సంబంధించి 2011 జనాభా వివరాలు ఇంకనూ అంతర్జాలంలో పెట్టలేరు కాని గణాంక విభాగంలో జిల్లాలవారీగా గ్రామాలకు చెందిన జనాభా వివరాలు ఉన్న సీడిలు లభ్యమౌతాయి. వీటి ప్రకారం 2011 వివరాలు కూడా చేర్చవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:03, 25 అక్టోబర్ 2013 (UTC)
- మీకు 2011 గణాంక వివరాలు అందుబాటులో ఉంటే, వాటిని నాకందివ్వగలిగితే నేను బాటు ద్వారా వివరాలను చేర్చగలను. --వైజాసత్య (చర్చ) 05:43, 27 అక్టోబర్ 2013 (UTC)
- గ్రామాలకు సంబంధించిన 2011 సంవత్సరపు జనాభా వివరాలను అందించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:00, 27 అక్టోబర్ 2013 (UTC)
- 2011 గణాంకాలను గ్రామాల పేజీలలో చేరిస్తే మంచి పురోగతి సాధించినట్లే. వైజాసత్య లాంటి వారు ఇలాంటి బృహత్కారానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ధన్యవాదాలండి.Rajasekhar1961 (చర్చ) 17:20, 27 అక్టోబర్ 2013 (UTC)
- వైజాసత్య గారూ, 2011 జనాభా వివరాలకు సంబంధించి పాలమూరు జిల్లాకు చెందిన (64 మండలాల గ్రామాలు) ఎక్సెల్ ఫైలు మీకు మెయిల్ చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:21, 30 అక్టోబర్ 2013 (UTC)
- మీకు 2011 గణాంక వివరాలు అందుబాటులో ఉంటే, వాటిని నాకందివ్వగలిగితే నేను బాటు ద్వారా వివరాలను చేర్చగలను. --వైజాసత్య (చర్చ) 05:43, 27 అక్టోబర్ 2013 (UTC)
సరికొత్త లోగో
[మార్చు]తెవికీలో సరికొత్త లోగో సచేతనమయింది. రామరాజ ఖతిలో ఉన్న ఈ లోగో ఇంతకు ముందు ఉన్న అన్ని తెలుగు వికీపీడియా లోగోలనూ తిరిగిరాస్తుంది. లోగో ప్రతిపాదన లో సహాయం అందించిన వారందరికీ ధన్యవాదాలు(అర్జున , విశ్వనాధ్.బి.కె. మరియు ఇతరులు). రహ్మానుద్దీన్ (చర్చ) 07:36, 26 అక్టోబర్ 2013 (UTC)
- మొదటిపేజీలోని లోగోలో నాకు ఒక లోపము కనిపిస్తున్నది. వికీఎపీడియా కంటే స్వేచ్చా విజ్నాన సర్వస్వం ముందుకు ఉన్నది. రెండూ సమానంగా లేవు. ఇల కేవలం నాకేనా లేక అందరికీ అలానే కనిపిస్తున్నదా?దీనితో సరిపోల్చిచూడండి. ...విశ్వనాధ్ (చర్చ) 15:45, 5 నవంబర్ 2013 (UTC)
- .విశ్వనాధ్ గారి సందేహం నిజమే. ప్రక్కచూపిన బొమ్మకు ప్రస్తుత లోగోకు తేడావున్నది. రహ్మానుద్దీన్ గారు ఒక సారి తనిఖీ చేసి ధృవీకరించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 04:18, 7 నవంబర్ 2013 (UTC)
కనిపించుట లేదు
[మార్చు]నూజెళ్ళ (కృష్ణా జిల్లా) అనే పుట నాకు ఇక్కడ దొరుకుట లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:11, 27 అక్టోబర్ 2013 (UTC)
- నూజెళ్ళ (కృష్ణా జిల్లా) అనే గ్రామము పేజీ ఉందా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:52, 27 అక్టోబర్ 2013 (UTC)
- ఇది గుడివాడ మండలంలో ఉండాలి, కాని లేదు. బహుశా అది రెవెన్యూ గ్రామం కాకపోవచ్చు. నా వద్ద ఉన్న సమాచారంలో కూడా ఈ గ్రామం పేరు లేదు. రెవెన్యూ గ్రామం కాకున్ననూ మీ వద్ద ఈ గ్రామ సమాచారం ఉంటే పేజీ సృష్టించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:04, 27 అక్టోబర్ 2013 (UTC)
ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడుకకు ప్రతిపాదన
[మార్చు]వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ తెలుగులో వాడుట లో స్పందించండి. --అర్జున (చర్చ) 07:46, 28 అక్టోబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ , విశ్వనాధ్ స్పందనలకు ధన్యవాదాలు. మిగతా సహ సభ్యులు త్వరలో స్పందిస్తే ఈ విషయంపై ముందుకి వెళ్లడానికి వీలుంటుంది--అర్జున (చర్చ) 04:29, 31 అక్టోబర్ 2013 (UTC)
Short-term Assignment at CIS-A2K
[మార్చు]తెవికీ మిత్రులకు, CIS-A2K తో ఒక స్వల్పకాలిక ప్రాజెక్టులో పని చేయటానికి అవకాశం. ఈ అవకాశం వికీపీడియానులకు మాత్రమే ఈ నోటిస్ చూడండి.--విష్ణు (చర్చ)08:09, 28 అక్టోబర్ 2013 (UTC)
రెండు సరిక్రొత్త వాడుకరి పెట్టెలు
[మార్చు]ఆంగ్ల వాడుకరి పెట్టెలని అనువదించి, ఈ సరిక్రొత్త వాడుకరి పెట్టెలని తయారు చేశాను.
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి. |
ఈ వాడుకరి కొండారెడ్డి బురుజు పై నుండి కర్నూలు పట్టణాన్ని చూసి ఆనందించారు. |
- శశి (చర్చ) 09:18, 29 అక్టోబర్ 2013 (UTC)
- శశి కి ధన్యవాదాలు. ఛాయాచిత్రాలు చేర్చిన వారి చర్చాపేజీలలో తెలియచేస్తే మంచిది. తెవికీలో ఛాయచిత్రకళపై ఆసక్తిగలవారు ఛాయాచిత్రపోటీలు నిర్వహించటానికి అలాగే ఇప్పటికే వున్న ఛాయాచిత్రాల నకలుహక్కుల సమీక్షకి ముందుకు వస్తే తెవికీ నాణ్యత పెంచడానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 03:24, 31 అక్టోబర్ 2013 (UTC)
తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణ
[మార్చు]వికీమీడియా ఇండియా చాప్టర్ మిగులు బడ్జెట్ లో కొంత భాగం ముద్రణలకై కేటాయించబడింది. ఈ సందర్భంలో తెలుగు వికీపీడియా పై ఒక పేజీని రూపొందించాను. https://docs.google.com/document/d/134v_ou7Wya_7D3I4ONh1fJVgrIvQlhkNdEp9t2ZMmlo/edit?usp=sharing దీనిని సమీక్షించి, మీ సలహాలను ఇక్కడ పొందుపరచగలరు. దయచేసి నేరుగా మార్పులు చేయవద్దు. సమీక్షకు ఆఖరి తేదీ 31 అక్టోబర్, 2013 అర్ధరాత్రి(భారత కాలమానానుసారం). అనంతరం ముద్రణకు తగిన ఖతిని అమర్చి, పీడీఎఫ్ ను కామన్స్ లో చేర్చి ఇక్కడ లంకె ఉంచుతాను. రహ్మానుద్దీన్ (చర్చ) 17:40, 29 అక్టోబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ చొరవ అభినందనీయం. అయితే ఇంతకు ముందల కలిసినప్పుడు అనుకున్న వికీపీడియాకి స్వాగతం పుస్తకానికి మీరు ప్రతిపాదించినదానికి భారీగా తేడావుండడంతో ఇది అంత ఉపయోగమనిపించుటలేదు. నా దృక్పధంలో తెవికీ ప్రచారానికి కావలసినవి వాటి ప్రస్తుత స్థితి తెలియచేస్తాను.
- అ) తెలుగు వికీ ఒకటుందని, దానిలో తెలుగు టైపు చేయొచ్చని తెలిపే కరపత్రం:వికీపీడియా:తెవికీ అకాడమీ లో చూపించిన కరపత్రం నేను ఇంతకు ముందు సమావేశాలకు వుపయోగించి నకలుహక్కుల గురించి కరపత్రం జిరాక్స్ తీసినా కూడా ఉపయోగపడేటట్లు మెరుగు చేశాను.
- ఆ) వికీమీడియా భారతదేశం లో తెలుగు ప్రత్యేక అసక్తి జట్టు గురించిమరియు తెలుగు వికీ ప్రాజెక్టుల గురించి తెలిపే కరపత్రం: మొదటి ఆంగ్ల నమూనా ఆధారంగా తెలుగు వికీలసమాచారం, ఇటీవలి ఛాయచిత్రాలు చేర్చి తయారు చేయాలి.
- ఇ) వికీపీడియాకి స్వాగతం: ఆంగ్ల పుస్తకం . ఇది వికీగురించి సులభంగా తెలుసుకోవటానికి స్వయం శిక్షణకు అనువుగా అనుభవజ్ఞులు తయారు చేసిన పుస్తకం. దీనిని చాల దేశాల చాప్టర్లు, భాషా సముదాయాలు తమ అవసరాలకు తగ్గట్లుగా మార్చి ప్రచురించాయి ( యుకె ఆంగ్ల రూపం) దీనిని తెలుగు లోకి అనువదించి, బొమ్మలను భారతీయసంస్కృతికి అనువుగా మార్చి ముద్రిస్తే బాగా వుపయోగంగా వుంటుంది. నేను దీని అనువాదానికి వికీసోర్స్ లో పుస్తకాన్ని ఆంగ్ల మూలంతో ప్రారంభించాను. దీనితో మీరు జతచేసిన వికీకోడ్ల వివరణ పట్టిక ఆంగ్ల మూలం ఆంగ్లములోని పుస్తకానికి అదనపుపేజీగా ప్రచురించారు. ఆసక్తి గలవారందరు దీనిలో పాలుపంచుకోమని కోరుతున్నాను. ఇక చివరిగా తెవికీ లో ఏదైనా స్పందనలు ఆశించేటప్పుడు కనీసం ఒక వారం గడువీయడం సంప్రదాయం. అది పాటించమనికోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:02, 31 అక్టోబర్ 2013 (UTC)
- ఇది మనం ప్రింట్ చేసుకునేది కాదు. ఇది చాప్టర్ మిగులు డబ్బులతో చేస్తున్నది. ఇంకా 16 పేజీల పుస్తకం కన్నా, రెండు-నాలుగు పేజీల కరపత్రం రూపొందించడమే ఉత్తమమని అభిప్రాయం కూడా, పోయిన సారి చర్చలలో వచ్చింది. అందువలన మీరు రూపొందించిన పీడీఎఫ్ నే వాడుదాం, లేదా మీరే మరో పత్రాన్ని రూపొందించగలరు. వారం రోజుల గడువు సంగతి నేనెక్కించిన దస్త్రాన్ని మీరు డిలీట్ చేసినపుడు గుర్తుకురాలేదా? సౌమ్యన్ నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు, ఆ వ్యవధిలోనే రూపొందించి పంచుకున్నాను. రేపటికి సౌమ్యన్ కు పంపించాల్సి ఉంది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 31 అక్టోబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారి స్పందనకు ధన్యవాదాలు. వారు పేర్కొన చర్చలగురించి నాకు తెలియదు కనుక సందర్భం అర్ధంచేసుకోవటంలో కొంత అవగాహనలోపం వున్నట్లుంది. చాప్టర్ కి ఇటువంటి ప్రచార సామాగ్రి తయారు చేయలన్న ఊహ చాలా రోజులనుండి వుంది. నాకు తెలిసి ప్రస్తుతం అంత డబ్బుసమస్య లేదు. అందుకని మనం ఫలితం మెరుగుగా వుండేటట్లు కరపత్రాలు, పుస్తకాలు రూపుదిద్దితే ఏమైనా బడ్జెట్ పరిమితులుంటే దాని ప్రకారం ఏవి ఎంతమేరకు ముద్రించాలో నిర్ణయించుకోవచ్చు. మీరు తయారుచేసిన దానిని వికీసోర్స్ లో చేర్చి స్వల్పంగా మార్పులు చేశాను. సహ సభ్యులు ఈ కరపత్రాలు, పుస్తకాల అనువాదం మరియు సమీక్షలో పాల్గొనమని మనవి .--అర్జున (చర్చ) 06:20, 1 నవంబర్ 2013 (UTC)
- వికీసోర్స్ లో వికీస్వయంశిక్షణ అనువాదంలో పాలు పంచుకుంటున్న సుజాత మరియు భాస్కరనాయుడు గారికి ధన్యవాదాలు. అనువాదం సగంపైగా పూర్తయినది. అయితే నేను ఈ పుస్తకం కొత్త సంచిక ఈ నెలలో విడుదలకాబోతున్నదని తెలిసినది. అందుకని ఆ కొత్త సంచికను తెలుగులోకి అనువదించి ముద్రిస్తే బాగుంటుంది. ప్రస్తుత అనువాదాన్ని కొనసాగించితే ఇది కూడా ఇంకొక విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. --అర్జున (చర్చ) 03:20, 2 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావుగారూ ! తప్పకుండా కొనసాగిస్తాం. సమిష్ఠికృషిలో నాకు వీలైనంతగా సహకరిస్తాను. --t.sujatha (చర్చ) 03:27, 2 నవంబర్ 2013 (UTC)
- అనువాదంలో పాలుపంచుకున్న అందరికి ధన్యవాదాలు. వికీపీడియా స్వయంశిక్షణ అనువాదం పూర్తయింది. అనువాదం సమీక్షించి మెరుగుకి సంబంధిత పుట చర్చాపేజీలలో సలహాలు చేర్చండి. --అర్జున (చర్చ) 06:12, 9 నవంబర్ 2013 (UTC)
సెప్టెంబరులో 2013 తెవికీ అభివృధ్ధి
[మార్చు]సెప్టెంబరు 2013 మాసం తెవికీ గణాంకాల చిద్విశ్లేషన - మిత్రుల కోసం.
- క్రితం నెలకంటే దిద్దుబాట్లలో 55% వృద్ధి.
- 48 మంది చురుకైన ఎడిటర్లు. ఇది తెవికీ చరిత్రలోనే 2nd highest రికార్డ్. దాదాపు 5 1/2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2008 లో 102 చురుకైన ఎడిటర్ల సంఖ్య మొదటి స్థానంలో కొనసాగుతుంది.
- అతి చురుకైన వాడుకరుల సంఖ్య పరంగా, మొట్టమొదటి సారిగా వ్యాసాలలో 3 సభ్యులు 1000 కంటే ఎక్కువ దిద్దుబాట్లు మరియు 1 సభ్యుడు 2500 పై చిలుకు దిద్దుబాట్లతో ఒక చారిత్రాత్మకమైన రికార్డు నెలకొల్పారు.
- వ్యాసాల పరంగా రోజుకు సగటుగా 18 కొత్త వ్యాసాల ఈ మాసంలో తెవికీలో చేరుకున్నాయి.
- ఈ గణాంకాలు మన తెవికీ 10వ వార్షికోత్సవాన్ని స్వాగతిస్తూ వచ్చిన శుభసూచకాలు. అక్టోబరులో 50 చురుకైన ఎడిటర్ల మైలురాయి దాటి చక్కని వ్యాసాలతో మరిన్ని ప్రాజెక్టులలో సమిష్టి కృషితో తెవికీ ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తూ... గణాంకాల వనరుకై ఇక్కడ చూడండి.
--విష్ణు (చర్చ)09:10, 30 అక్టోబర్ 2013 (UTC)
- సెప్టెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలపై విశ్లేషణ కొరకు ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:46, 30 అక్టోబర్ 2013 (UTC)
తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శన
[మార్చు]తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శనకు నేను వాడిన స్లయిడ్స్ ఇక్కడ చూడగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 21:25, 30 అక్టోబర్ 2013 (UTC)
- బాగుంది. తెవికీసోర్స్ బొమ్మలేమి కనబడలేదు, ప్రత్యక్ష ప్రదర్శనఏమైనా ఇచ్చారా? సమావేశ నిర్ణయాలేమైనా వుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 03:26, 31 అక్టోబర్ 2013 (UTC)
- తెరపట్టులు పెద్దవిగా చేసి చూపేందుకు వీలుంటుందని, స్లైడుల్లో చేర్చకుండా విడిగా చూపించాను. అవి బ్లాగుపోస్టులో జోడించాను. కెవలం చర్చ మాత్రమే జరిగింది. telugupustakam.org అనే జాలగూడులో స్వేచ్ఛా నకలుహక్కులతో పుస్తకాలను ఉంచుతామని ఒక తీర్మానం చేసారు, తెలుగు కార్పస్(కోటి మాటల కోట) రూపొందించేందుకు తీర్మానం చేసారు. టీటీడీ, ప్రభాకర శాస్త్రి గారి, మరియు కొన్ని వర్సిటీల పుస్తకాలు త్వరలో స్వేచ్ఛా నకలుహక్కులతో వెలువడే మార్గం సుగమమయింది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:40, 31 అక్టోబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ స్పందనకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ పోస్ట్ కూడా చాలా ఉపయోగంగావుంది.--అర్జున (చర్చ) 06:23, 1 నవంబర్ 2013 (UTC)
- తెరపట్టులు పెద్దవిగా చేసి చూపేందుకు వీలుంటుందని, స్లైడుల్లో చేర్చకుండా విడిగా చూపించాను. అవి బ్లాగుపోస్టులో జోడించాను. కెవలం చర్చ మాత్రమే జరిగింది. telugupustakam.org అనే జాలగూడులో స్వేచ్ఛా నకలుహక్కులతో పుస్తకాలను ఉంచుతామని ఒక తీర్మానం చేసారు, తెలుగు కార్పస్(కోటి మాటల కోట) రూపొందించేందుకు తీర్మానం చేసారు. టీటీడీ, ప్రభాకర శాస్త్రి గారి, మరియు కొన్ని వర్సిటీల పుస్తకాలు త్వరలో స్వేచ్ఛా నకలుహక్కులతో వెలువడే మార్గం సుగమమయింది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:40, 31 అక్టోబర్ 2013 (UTC)
అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు
[మార్చు]వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు లో ఇప్పటికే స్పందించిన K.Venkataramana కు ధన్యవాదాలు. సహ సభ్యులు 4 నవంబర్ లో స్పందించమని మనవి. --అర్జున (చర్చ) 04:32, 31 అక్టోబర్ 2013 (UTC)
బొమ్మల నకలహక్కుల విషయమై
[మార్చు]- ఇది కామన్స్ వద్ద మొదటగా కనిపించే సూచన ఇది.
ఇది గమనించి ఇందులో ఏమయినా సందేహాలుంటే తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:10, 31 అక్టోబర్ 2013 (UTC)
- ఈ సమాచారం బాగుంది. తెలుగు లోకి అనువదించి తెవికీలో చేరిస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 10:47, 31 అక్టోబర్ 2013 (UTC)
- +1. --అర్జున (చర్చ) 06:23, 1 నవంబర్ 2013 (UTC)
- -- రహ్మానుద్దీన్ గారు తయారు చేసిన తెలుగురూపం కుడిపక్కన చూపెట్టబడింది (రచ్చబండలోనిమార్పు)
- రహ్మానుద్దీన్ గారి అనువాదం బాగుంది,ఇది కూడా తెవికీ ప్రచారానికి ఉపయోగపడేది. క్రితం వ్యాఖ్యంలోని మూడింటితోపాటు, దీనిని కూడా ముద్రించేందుకు చర్యలు తీసుకుంటే మంచిది.--అర్జున (చర్చ) 03:06, 2 నవంబర్ 2013 (UTC)