వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 23

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 22 | పాత చర్చ 23 | పాత చర్చ 24

alt text=2013 జూలై 3 - 2013 ఆగస్టు 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 జూలై 3 - 2013 ఆగస్టు 31

ఎవరి మొలకల బాధ్యత వారికి[మార్చు]

మొలకలను ప్రారంభించి, అవి ఇంకా ఎదగకపోతే, ఆయా సభ్యులకు వారు సృష్టించిన మొలకల జాబితాను విస్తరించేందుకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికిప్పుడే అన్నీ విస్తరించాలని కాదు. కనీసం ఆ దిశగా కృషి చేస్తారన్న ఆశతో. ముందుగా నేను మొదలుపెట్టిన వ్యాసాల్లో ఇంకా మొలకలు గానే ఉన్న వ్యాసాల జాబితా ఇక్కడ తయారుచేసుకున్నాను... వాటితో కుస్తీపడదామని. ఇంకా ఎవరైనా సభ్యులకు ఆసక్తి ఉంటే వారి వారి మొలకల జాబితాలు కూడా తయారు చేయగలను. --వైజాసత్య (చర్చ) 05:00, 3 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పద్దతి మంచిదే. ఇది నాకు అమోద యోగ్యమే . ముందుగా నాతో ప్రారంభించండి. నా వంతు కృషిచేస్తాను. --t.sujatha (చర్చ) 18:04, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుజాత గారూ, మొలకలను విస్తరించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ మొలకల జాబితా ఇక్కడ ఉంది చూడండి. మీరు సాధారణంగా ఎప్పుడూ పెద్ద వ్యాసాలే వ్రాస్తారు. అందుకే మీ మొలకల జాబితా అంత చిన్నదిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. --వైజాసత్య (చర్చ) 02:37, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరు తయారుచేశారనే విషయం ముఖ్యమైనదే కానీ ఏనెలకానెల మొలకల విస్తరణ మొదటివారం చేపట్టి అందరూ సమైక్యంగా వాటిని విస్తరించడం బాగుంటుంది. ఒక నెల (ఏప్రిల్) విజయవంతంగా కార్యక్రమాన్ని వైజాసత్యగారు నిర్వహించారు. ప్రతినెల కూడా అదేవిధంగా చేయడమే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 06:31, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చక్కని ఆలోచన. అలాగే రాజశేఖరగారు చెప్పిన విధంగా మే మాసంలో చేసిన విధంగా ప్రతినెల ఈ పని చేపడితే చాలా బాగుంటుందండి. మనం మేలో చేసిన ఏప్రిల్‌ నెలలో చేరిన మొలకల విస్తరణ పని చాలా ఉత్తేజకరంగా జరిగిందనిపించింది. అల్పమైనా, నా వంతు కృషి చేస్తాను. విష్ణు (చర్చ)00:16, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Need Help[మార్చు]

I am unable to type in telugu in telugu wikipedia for the past eight days. I use int. explorer. Some body help me to find out the solution. అహ్మద్ నిసార్ (చర్చ) 17:40, 4 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కుడివైపున కల లిప్యంతరీకరణ పెట్టెను గమనించారా, దానిలో మార్ప్చుకుంటూ చూడండి. తెలుగు వస్తుంది. మామూలుగా తెలుగుకు కంట్రోల్ ఎం కొడుతుంటాం కదా అదీ చూడండి...విశ్వనాధ్ (చర్చ) 04:00, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
WP:TH చూడండి. --అర్జున (చర్చ) 05:18, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ సైట్ నేమ్ మార్పుకై అభ్యర్థనకు గానూ మీ మీ సమ్మతం తెలుపండి.[మార్చు]

s:వికీసోర్స్:రచ్చబండ#వికీసోర్స్ సైట్ నేమ్ లో మార్పుకు అభ్యర్థన వద్ద మీ మీ సమ్మతి తెలుపగలరు. ప్రస్తుతం సైట్ నేమ్ ఆంగ్లంలో ఉంది. దానిని తెలుగుకి మార్చగోరి ఈ అభ్యర్థన. రహ్మానుద్దీన్ (చర్చ) 04:41, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సోర్స్ పేరు మార్పు[మార్చు]

దీని పేరు తప్పక మార్చాలి. దీనికి నా సమ్మతి తెలుపుతున్నాను. మరి పేరు? ..... సిద్ధంగా వున్నదా? అది కూడ చెప్పితే బాగుండేది. కొందరు కొన్ని పేర్లను సూచించే వారు. పేరు గురించి అడగక పోయినా.......... నా దొక సూచన: వికీ సోర్స్ లో వుండే విషయం........ పెట్టబోయే పేరులో ప్రతిబింబించాలి. అందులో కాఫీ హక్కులు లేని గ్రంథాలు మాత్రమే వుంటాయను కుంటే...... ---వికీ పుస్తక భాండాగారం--- అని పెట్టి దానికి ..... చివర్లో ఒక తోక తగిలిస్తే........(కాపీ హక్కులు లేని పుస్తకాలు.... అనే అర్థం వచ్చేటట్లు)Bhaskaranaidu (చర్చ) 05:55, 6 జూలై 2013 (UTC).[ప్రత్యుత్తరం]

బెంగుళూరు తెవికీసమావేశం గురించి వికీ పై ప్రకటన ప్రతిపాదన[మార్చు]

సమావేశ ప్రకటన బొమ్మ

బెంగుళూరు రెండవ సమావేశానికి ప్రచారం కల్పించడానికి వెబ్ బేనర్ నుఆరు రోజులు వీకీపీడియా పేజీలపై ప్రకటన ప్రతిపాదించబడినది. అభ్యంతరముంటే ఒక రోజు లోగా స్పందించండి. ప్రస్తుతం ప్రకటితమవుతున్న బ్యానర్ క్రింద గాని లేకపోతే ఏదో ఒకటి యాదృచ్ఛికంగా వచ్చేటట్లు ప్రకటన రూపుదిద్దబడుతుంది.--అర్జున (చర్చ) 15:34, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

 • ధన్యవాదాలు. ప్రకటన చేర్చబడింది. అన్నిటిలో ప్రదర్శించటానికి నిర్వాహక హక్కులు కావాలి. నాకు వికీపీడియాలో మాత్రమే వున్నాయి. మీకు వీలైతే ప్రయత్నించవచ్చు.--అర్జున (చర్చ) 15:28, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • మొదటి బెంగుళూరు తెవికీసమావేశం గురించి వీర శశిధర గారు రాసిన ఈ బ్లాగు చూడండి. గత వారం జరిగిన రెండవ సమావేశంపై కూడా త్వరలోనే వారు ఇంకో బ్లాగు ఇస్తామన్నారు. రవిచంద్ర గారు దీనిని తెవికీ బ్లాగులోనూ పెడితే బాగుంటుంది. -- విష్ణు (చర్చ) 09:05, 17 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ ప్రతిపాదన[మార్చు]

 • వెంకటరమణ గారి, నిర్వాహకత్వానికై వైజాసత్య గారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయగలరు.

బంగారాన్ని యెప్పుడు కనిపెట్టారు. దేవ్వుళ్ళ్ల కాలం లోనేనా కాదా[మార్చు]

బంగారాన్ని యెప్పుడు కనిపెట్టారు. దేవ్వుళ్ళ్ల కాలం లోనేనా కాదా

 • మీ సందేహాలు వికీపీడియా వ్యాసాల వ్రాయటానికి లేక మార్పులకు సంబంధించినవై వుండాలి. వికీపీడియా గురించి మరింత తెలుసుకొనండి. మీ వాడుకరి చర్చా పేజీలో వున్న లింకులు చూడండి.--అర్జున (చర్చ) 16:05, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

జూన్ 2013 మొలకలు[మార్చు]

జూన్ నెలలో సృష్టించబడిన మొలకల జాబితా ఇక్కడ ఉంది. 87 మొలకలున్నాయి. వీటి పనిపట్టడానికి తలా ఒక చెయ్యి వెయ్యాలని మనవి. ఒక్కొక్కరు పది విస్తరిస్తే చాలు. అన్నీ విస్తరించవలసి కాకపోవచ్చు. కొన్ని విలీనం చేయదగినవి కూడా ఉన్నాయి. --వైజాసత్య (చర్చ) 02:07, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిని | తెలుగు వికీ ఫేస్‌బుక్ పేజి లో కూడా పెట్టాను. ఎవరైనా కొత్తవారొస్తారేమో చూద్దాం. --విష్ణు (చర్చ)09:55, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నోటిసు / బానర్లు[మార్చు]

ఈ మధ్య కనిపించే బానర్లు అసలు బాలేవు . మీడియా వికి మనకి చానా మంచి టెంప్లేటలిచ్చిండి వాటి వల్ల సైట్ కి ఒక ఆందం వచ్చిండి . కాని ఈ బ్యానర్లు చూస్తుంటే నాకు 19వ శతాబ్దం యాహూ యాడ్స్ గుర్తువస్తున్నాయి .

అవన్ని వికిపీడియా సమావేశాలకోసం వాడుతున్నారని అర్ధం చేసుకుంటాను కాని ఒక స్టాండర్డ్ ( మీడియా వికి టెంప్లేట్ ని మ్యాట్ఛ్ అయ్యేవిధంగా ) బ్యానర్ టెంప్లేట్ ఉంటే మంచిడని నా ఆలోచన . అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉందటమే కాకుండా జనాలకి క్లిక్ చేయాలనిపిస్తదని నా ఆలోచన . --పవి (చర్చ) 06:01, 15 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పవి గారు మీ సద్విమర్శకు ధన్యవాదాలు. మీరు ప్రస్తుతించిన సమస్య తీరాలంటే రెండు మార్గాలు నాకు తోచాయి. ఒకటి ఇక నుండి బ్యానర్ల బాద్యత మీరు తీసుకుంటే మంచిది. రెండు లేదా మన వాళ్ళలో ఒక నలుగురికి దీనిని ఎలా చేయాలో నేర్పితే బాగుంటుంది. రెండవది చేస్తే మంచిదని నా నమ్మకం. మీరు రడీ అంటే వచ్చే ఆదివారం నాడు మీరు మన తెలుగు వికీ సమావేశంలో దీనిపై ఒక సెషన్ తీసుకోవచ్చు. ఏమంటారు? విష్ణు (చర్చ)10:04, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
*సహాయం చేయటానికి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు , కాని నేనిప్పుడు భాగ్యనగరం లో నివసించట్లేదు కాబట్టి నలుగురిని కలిసి నేర్పలేను . కాని నేను ఒక సహాయపట్టి మొదలు పెట్టగలను . అది ఎక్కడ ఉందాలో కొంచం తెలుపగలరు . --పవి (చర్చ) 11:07, 1 ఆగష్టు 2013 (UTC)

వికీపీడియాలో మామూలు జనం ఏం చూస్తున్నారు?[మార్చు]

మొన్న బెంగుళూరు వికీ సమావేశం సందర్భంగా అర్జున గారితో జరిగిన మాటల సందర్భంలో తెలుగు వికీపీడియాకి ఇన్ని విధాలుగా వ్యాసాలు రాస్తున్నాం, అలానే ఎన్నో మంచి మంచి విషయాలు చేర్చబడుతున్నాయి. కానీ సాధారణ ఆఖరి వాడుకరికి ఉన్న అవసరం ఏమిటి? ప్రస్తుతం తెలుగు వికీపీడియాకి జనం ఏం ఆశించి వస్తున్నారు అని ఒక చిన్న ప్రశ్న ఎదురయింది. http://stats.grok.se/te/top వద్ద అత్యధికంగా సందర్శించబడుతున్న పేజీలు కలవు. వీటిని ఒక ప్రాతిపదికగా తీసుకొని అత్యధికంగా చూడబడుతున్న పేజీలు ముందుగా మరింతగా అభివృద్ధి చేయవచ్చు. లేదా వర్తమాన సంఘటనలను ఎప్పటికప్పుడు తాజాపరిచేందుకు(ఉదా: ప్రముఖుల మరణం, అవార్డుల ప్రకటన, భారీ దుర్ఘటనలు, ఎన్నికల ఫలితాలు మొ॥) ఉన్న కొద్ది సభ్యులే దళంగా ఏర్పడి పని చేయడం. ఇంకా ఏమయినా ఆలోచనలుంటే పంచుకోగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:12, 17 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలను ఖరారుచేసుకోవడానికి వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము) లో అధిక వీక్షణలు గల వ్యాసాలు అన్న విభాగం కూడా చూడండి. --అర్జున (చర్చ) 13:24, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ నిర్వాహకత్వ ప్రతిపాదన[మార్చు]

 • రహ్మనుద్దీన్ గారి, నిర్వాహకత్వానికై అర్జున ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మీ అభిప్రాయాన్నిఇంకా తెలియచేయకపోతే ఇక్కడ 21 జులై 2013 లోపు తెలియజేయగలరు.--అర్జున (చర్చ) 13:28, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • ప్రక్రియ ముగిసింది. స్పందించిన వారందరికి ధన్యవాదాలు. రహ్మనుద్దీన్ గారికి అభివందనలు. --అర్జున (చర్చ) 10:48, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

లోగో మెరుగునకు ఏకాభిప్రాయం[మార్చు]

వి, యా అక్షరములు పెద్ద పరిమాణంలో కొనసాగాలా?[మార్చు]

లోగో ప్రతిపాదన

వాడుకరి_చర్చ:Veeven#వికీపీడియా 2.0 ;చిహ్నంలో తప్పులు? అర్థాంతరంగా 2010 లో ఆగిపోయింది. ఆ తరువాత రహ్మనుద్దీన్ ప్రారంభించిన వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_18#తెవికీ లోగో మార్పుకు ప్రతిపాదన చర్చకూడా పెద్దగా స్పందనలు లేకుండా 2013 ఫిభ్రవరిలో ముగిసింది. ప్రస్తుతమున్న లోగోలో అక్షరాలకు లోహిత్ ఖతి (మొదటి అక్షరాన్ని పెద్దదిగా చేయకుండా) వాడితే బాగుంటుందని అప్పటి చర్చలో వీవెన్, కాసుబాబు, వైజాసత్య,రవిచంద్ర మరియు నేను అభిప్రాయపడ్డాము. చంద్రకాంతరావు గారు మొదటి అక్షరము చాలా అక్షరశైలులలో పెద్దసైజులో (వి) అనగా రెండవఅక్షరము (కీ)కు దగ్గరగా వుంటుందని అలా చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతము వి, యా అక్షరాలు పెద్దసైజులో కొనసాగటం బాగుండలేదు. అందుకని కు మీ స్పందన 27జూలై 2013 లోగాతెలియచేయండి.--అర్జున (చర్చ) 05:12, 20 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

 • ప్రస్తుతం ఉన్న వి, యా లు పెద్దగా ఉండటం వలన గ్లోబును కవర్ చేస్తూ ప్రేం మొత్తాన్ని సరిపెట్టుకుంటున్నవి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రక్కన ప్రస్తుతం ఉన్న లోగో పెట్టి చూడండి. నిండుతనం అనేది ఇప్పుడున్న దాన్లోనే ఉన్నదని నా అభిప్రాయం. ఖతి మార్చినా ఆ రెండు అక్షరాలను అలా పెద్దగా ఉంచితే గ్లోబు రెం.డు మూలలను సరిపెట్టుకుంటుంది.విశ్వనాధ్ (చర్చ) 06:25, 20 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • మొదటి అక్షరము పెద్దదిగా చూపెట్టటము, పత్రిక వ్యాసాల అలంకరణలో సర్వసాధారణం. ఇంగ్లీషు భాషలో పెద్ద, చిన్న బడులుండటం వలన ఇంగ్లీషు వికీలోగో అలా చేసివుండవచ్చు. మన తెలుగుకి అదిఅనవసరమనిపిస్తుంది. మన తెలుగు పత్రికల లోగోలు పరిశీలించినా శైలి మార్పులు కనబడతాయి కాని మొదటి అక్షరపరిమాణం పెద్దదిగా వుండదు. --అర్జున (చర్చ) 04:02, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • అక్షరాలు ఎలా ఉండాలనే విషయంపై నేను ఇపుడేమీ చెప్పను కాని, ఇదివరకు నేను చెప్పినట్లుగా అర్జునరావు గారు పైన వివరించినట్లు "వి అక్షరం చాలా అక్షరశైలులలో రెండవ అక్షరం (కీ)కి దగ్గరగా ఉంటుంద"ని నేను ఎప్పుడూ చెప్పలేను. వి అక్షరం ఇతర అక్షరాలకు గుడి ( ి) ఇచ్చిన ఎత్తులో ఉంటుందని మాత్రం చెప్పాను. చాలా ఫాంట్లలో అలా ఉంటుందనే విషయం తెలుసేననుకుంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:52, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • మీవివరణకు ధన్యవాదాలు. నేను అలాగే అర్థంచేసుకున్నాను కాని మీ వ్యాఖ్యను క్లుప్తంగా రాయటంలో పొరబడ్డాను. --అర్జున (చర్చ) 08:28, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • అలాగే వి పెద్దపరిమాణంలో వుండే ఖతుల ఉదాహరణలిస్తే, ఉభయతారకంగా ఆ ఖతికి మారవచ్చేమో పరిశీలించవచ్చు.--అర్జున (చర్చ) 12:14, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఖతి మార్పు[మార్చు]

 • లోహిత్ తెలుగుతో పాటుగా గురజాడ, ఎన్టీఆర్ ఖతులు కూడా వాడవచ్చు. ఉదాహరణకి విక్షనరీ లోగోలో అక్షరాలు వేమనలో ఉన్నందువలన చాలా వైవిధ్యంగా అందంగా కనిపిస్తున్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 12:11, 20 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • నేను వాడే అలంకరణలో అసలు లోగో కనిపించదు కాబట్టి ఇది గమనించలేదు. పైన అర్జునరావుగారు అతికించిన దానికంటే ఇదివరకు రహ్మానుద్దీన్ గారు ప్రతిపాదించిన ఈ లోగో ఇంకా బాగుందనిపిస్తుంది. ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 02:21, 21 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లోగో ప్రతిపాదన 2
 • అర్థమైంది. లోగో కొరకు అక్షరాలపరిమాణంగురించి వికీ ప్రమాణాలేమైనా వున్నాయేమోగమనించారా? --అర్జున (చర్చ) 08:34, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

లోగోలో NTR,Ramaraja ఖతులు వాడుటకు వీలు కాదా..విశ్వనాధ్ (చర్చ) 12:25, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

 • ఇవి చూడండి

http://upload.wikimedia.org/wikipedia/te/3/31/Wikipedia-logo-v2-te-changed_font1.svg http://upload.wikimedia.org/wikipedia/te/c/c6/Wikipedia-logo-v2-te-changed_font2.svg

రహ్మానుద్దీన్ (చర్చ) 19:38, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • రామరాజ ఖతి బావున్నది. (లోగో ప్రతిపాదన 3) అది వాడి చూడండి
లోగో ప్రతిపాదన 3
లోగో కొరకు అనువైన మరిన్ని ఖతులు

...విశ్వనాధ్ (చర్చ) 07:44, 24 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

 • ఇది బాగానే అనిపిస్తుంది. వి అక్షరము సాధారణ గుడి అక్షరాల స్థాయిలో వున్నట్లుంది. స్వేచ్ఛానకలుహక్కుల ఖతులకి ప్రాధాన్యం కాబట్టి, ఇటువంటి రూపంగల స్వేచ్ఛాఖతి వుంటే అది వాడడం మంచిది. --అర్జున (చర్చ) 05:37, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది స్వేచ్చా ఖతులలో ఒకటి ntr ఖతిని పైన రహమనుద్దీన్ లింక్ రూపలో ఇచ్చారు. ఇది రామరాజ ఖతి, ఇంకా కృష్ణదేవరాయ, తిమ్మన రెగ్యులర్ లాంతివి ఉన్నాయి. ఇక్కడ అలాటి కొన్ని ఇస్తున్నా వాటిలో ఏది బావుంటుందో చూడండి...విశ్వనాధ్ (చర్చ) 06:37, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. వీటిలో రామరాజ నాకు నచ్చింది. ఇంకొన్ని స్పందనలకోసం ఎదురుచూసి ఆ తరువాత ఏకాభిప్రాయం ఖరారు చేయటానికి వోటు ప్రక్రియ చేయవచ్చు. అన్నట్లు మీ ప్రతిపాదనలో అచ్చుదోషాలు, నీలంరంగు గీత సవరించి లోగోని తాజాపరచండి--అర్జున (చర్చ) 06:48, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ చక్కని లోగో తయారు చేశారు, రామరాజ ఖతి చాలా బాగుంది. కాకపోతే చిన్న సమస్య, "చ్ఛా" లో ఛ వత్తు సరిగా కనిపించడం లేదు. ఇది అచ్చుతప్పా? లేకపోతే లైను క్రిందికి వెళ్ళిపోయిందా. అలా అయితే రెండవ లైను కాస్త చిన్నది చెయ్యండి --వైజాసత్య (చర్చ) 11:46, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • విశ్వనాధ్ గారూ మీరు చేసిన రామరాజ ఖతి లోగో నాకూ నచ్చిందండి. దీనినే CISA2K ప్రింట్ చేస్తున్న టీషర్ట్ లపై కూడా ముద్రించాలనుకుంటున్నాము :) --విష్ణు (చర్చ)
రామరాజ ఖతిపై ఏకాభిప్రాయం ఏర్పడినందున ఓటింగు అవసరం లేదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయగలరు. ఈ ఖతిలో చక్కని లోగో (శుద్ధ ప్రతి) తయారుచేసి వికీవారికి పంపించండి. రహ్మానుద్దీన్ గారూ, విశ్వనాథ్ గారూ మీరీ పని చేపట్టగలరా? ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 14:25, 2 ఆగష్టు 2013 (UTC)
 • రహ్మనుద్దీన్ రూపొందించినది ఇక్కడకు మార్చాను. అయితే బొమ్మలో స్పష్టత లోపించింది ముఖ్యంగా గుడి అక్షరానికి కలిసేదగ్గర మరియు 'యా' దగ్గర. కొత్తరూపం కావాలి.--అర్జున (చర్చ) 04:05, 3 ఆగష్టు 2013 (UTC)
విశ్వనాథ్ గారు సూచించిన విధంగా, రహ్మనుద్దీన్ రూపుదిద్దిన
 • నా దగ్గర ఉంది, అయితే నేను .svg లో ఇవ్వలేను.ఇంక్ స్కేప్ లో తీసుకొంటున్నపుడు నాకూ ఇలానే ఫాంట్ యొక్క కొంత భాగం పాడవుతున్నది. jpg, png ఫైల్స్ అయితే ఇవ్వగలను..విశ్వనాధ్ (చర్చ) 11:59, 3 ఆగష్టు 2013 (UTC)
 • అలాగే 600 dpiలో ఇవ్వండి.అప్పుడు ముద్రణకు కూడా సరిపోతుంది.--అర్జున (చర్చ) 03:58, 4 ఆగష్టు 2013 (UTC)
 • వికీ గోళం పైన కత్తిరించినట్లుంది. అది పూర్తిగా వుండేటట్లు చూడండి.--అర్జున (చర్చ) 12:47, 6 ఆగష్టు 2013 (UTC)
 • లేదు. ఎన్లార్జ్ చేసి చూడండి. పైన కొంత కాళీ కనిపిస్తుంది. png కనుక కట్ చేసినట్టు ఉన్నది...విశ్వనాధ్ (చర్చ) 03:56, 7 ఆగష్టు 2013 (UTC)
 • ఇంగ్లీషులోగో గమనిస్తే గ్లోబ్ పైన ఎక్కువ భాగం కనిపిస్తుంది. అలా చేస్తే పారదర్శకతవుందికాబట్టి ఎక్కడాచేర్చిన బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:23, 16 ఆగష్టు 2013 (UTC)
మీరు చెప్పిన విదంగా మరొకటి చేర్చాను..విశ్వనాధ్ (చర్చ) 07:09, 16 ఆగష్టు 2013 (UTC)
ధన్యవాదాలు. దీనిని కొత్త లోగోగా చేయటానికి ప్రయత్నం ప్రారంభించటానికి రహ్మనుద్దీన్ గారిని కోరదాము.--అర్జున (చర్చ) 03:54, 17 ఆగష్టు 2013 (UTC)
 • ఇందులో ఏమయినా లోపం ఉందా?
  రామరాజ ఖతిలో లోగో
 • లోపమని చెప్పలేము. వి విశ్వనాధ్ గారు రూపొందించినదానిలో మరింత ఎత్తుగా వుంది. మొత్తంమీద మెరుగుగావుంది. --అర్జున (చర్చ) 06:51, 17 ఆగష్టు 2013 (UTC)

Pywikipedia is migrating to git[మార్చు]

Hello, Sorry for English but It's very important for bot operators so I hope someone translates this. Pywikipedia is migrating to Git so after July 26, SVN checkouts won't be updated If you're using Pywikipedia you have to switch to git, otherwise you will use out-dated framework and your bot might not work properly. There is a manual for doing that and a blog post explaining about this change in non-technical language. If you have question feel free to ask in mw:Manual talk:Pywikipediabot/Gerrit, mailing list, or in the IRC channel. Best Amir (via Global message delivery). 13:50, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పుస్తకాల డిజిటలైజేషన్[మార్చు]

తెలుగు వికీపీడియా అభివృద్ధి ప్రణాలికలో భాగంగా పబ్లిక్ డొమైన్లో ఉన్న తెలుగు పుస్తకాలను డిజిలైజేషన్ చేయడానికి CIS ముందుకు వచ్చినట్లు మనందరికీ తెలుసు. అందుకోసం ముందుగా మనమందరం కలిసి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితాని తయారుచేసుకొంటే బాగుంటుందని భావించాను. దానికోసం ఒక పేజీని ప్రారంభించాను: వికీపీడియా:డిజిటల్ తెలుగు పుస్తకాలు ఇందులో మీకు అతిముఖ్యమైన పుస్తకాలను చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 12:06, 24 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయంలో CIS వారు ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? --వైజాసత్య (చర్చ) 11:47, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఒక 100 ముఖ్యమైన తెలుగు పుస్తకాల్ని గుర్తిస్తే; వారు అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకుంటారు. తర్వాత వాటిని మనం వికీసోర్సులో కొందరు వ్యక్తుల సహాయంతో లిప్యంతరీకరణ చేయడానికి ఆర్థిక ప్రణాళికను తయారుచేసి CIS వారికి పంపిస్తాము. వారు సహాయం చేస్తారని నా నమ్మకం.Rajasekhar1961 (చర్చ) 13:15, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమోవాకాలు. ఖచ్చితంగా దీనికి CISA2K గ్రాంటు నుండి కొంత బడ్జేట్ కేటాయిద్దాం. 100 అతి ముఖ్యమైన తెలుగు పుస్తకాలను గుర్తించడం ఒక పని. కాకపోతే పైలట్‌గా మొదలు ఒక 10 పుస్తకాలు చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఈ అనుభవాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం ఉచితమేమో. అలాగే దీనిని ఒక నిర్దారిత కాలంలో పూర్తి చేస్తే మంచిది. మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు. విష్ణు (చర్చ)04:41, 31 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణుగారికి ధన్యవాదాలు. మొదట 100 పుస్తకాల జాబితా పూర్తయిన తర్వాత వానిలో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక పది పుస్తకాలను పైలట్ ప్రాజెక్టుగా చేయాలన్న ఆలొచన బాగుంది. ముందు అందరూ చెరోక చెయ్యివేసి జాబితాను తయారుచేద్దాము. దయచేసి సహకరించండి.Rajasekhar1961 (చర్చ) 05:41, 7 ఆగష్టు 2013 (UTC)

మొబైల్ లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షణ[మార్చు]

ఎయిర్సెల్ మరియు ఎయిర్టెల్ వినియోగదారులు మొబైల లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షించవచ్చు. వివరాలకు ఎయిర్సెల్ ప్రకటన మరియు ఎయిర్టెల్ వెబ్ పేజీ చూడండి. తెలుగులో వివరాలకు నా తెలుగు బ్లాగుపోస్ట్ కూడ చూడవచ్చు.--అర్జున (చర్చ) 08:40, 26 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ వ్యాసరచన పోటీని ఆగష్టు 10 తేదీ వరకు పొడిగించాము. కాబట్టి దానిక్రింద మరొక బేనర్ మొబైల్ వికీపీడియా గురించి తయారుచేసి అందరికీ తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 13:29, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • ప్రకటనలు ఎక్కువచేయటం ఎక్కువకాలం వుంచటం అంత మంచిది కాదు. వ్యాసరచనపోటీ ప్రకటన తొలగించిన తరువాత ఈ ప్రకటన చేద్దాం. ఔత్సాహికులు దీనికి తగిన బేనర్ ని మరియు సంబంధిత వ్యాసాన్ని రూపొందించమని కోరిక--అర్జున (చర్చ) 06:45, 29 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పంచాయితీ ఎలక్షన్లు ఒక స్వర్ణావకాశం - తెవికీ పవర్ లోకానికి చాటటానికి.[మార్చు]

2013 పంచాయితీ ఎలక్షన్లు ఈ నెలాఖరుకు అయిపోతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల, నిజంగా ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వారు ఎందరు గెలిచారో అనే విషయంలో పారదర్శక రిపోర్టు ఎక్కడా లేదు. తెవికీ ఉన్నట్టువంటి ఇన్ ప్రా వల్ల ఆ లోటు మనం చక్కగా తీర్చవచ్చు. మనం చెయ్యవలసిందల్లా పంచాయితీ ఎలక్షను ఫలితాలు ఆయా గ్రామ పుటల్లో ఉంచడమే. మనకు తెలిసిన గ్రామాలు, మనకు తెలిసిన వారి గ్రామాలు అన్నీ ఫోన్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలుసుకొని వేగంగా ఈ దత్తాంశం వ్రాద్దాము. ఆగస్టు తొలి వారం కల్లా మొత్తం అన్ని గ్రామాల వివరాలు వ్రాయగలిగితే ఆ తరువాత మూసలు బట్టి సమ్మరీలు తయారు చేసి చూడవచ్చు. సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు. అలానే మూస కూడా ఒకటి తయారు చెయ్యాలి. Chavakiran (చర్చ) 15:30, 27 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి ఆలోచన చావాకిరణ్ గారు. మనం ఎలాగూ గ్రామల వ్యాసాల్ని విస్తరించాలని ఆలోచిస్తున్నాము. మొత్తం అన్ని గ్రామ పంచాయితీల ఫలితాలు మనకు లభిస్తే వాటి వివరాలను ఒక మూసను తయారుచేసి; సంబంధించిన గ్రామాలలో చేర్చితే బాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:33, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 • ఈ విషయమై తెలిసిన ఇద్దరు పాత్రికేయులతో మాట్లాడాను. పత్రికాపేక్షోపేక్షలకు అతీతంగా జరిగిన చర్చల్లో, మూడో విడత ఎన్నికలు జరిగాక ఎలెక్షన్ కమిషన్ వారి వెబ్ సైటులో ఈ సమాచారం రావచ్చు అనీ, అదే అన్నిటికన్నా అత్యంత నమ్మదగినదనీ తెలిసింది. అప్పటి వరకూ పైచెప్పిన విధంగా సమాచారం చేర్చటం మంచిది. రహ్మానుద్దీన్ (చర్చ)
 • పార్టీరహితంగా జరిగే పంచాయతి ఎన్నికలలో ఏ పార్టీ వారు ఎన్ని గెలిచారో తెలుసుకోవడం మనకు అసాధ్యమైన పనే. వివిధ పత్రికలలో వచ్చే సమాచారంలో విజయం సాధించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి తేడా లేదు కాని దాదాపు 20-30% అభ్యర్థుల విషయంలో వారికి మద్దతు ఇచ్చిన పార్టీలకు సంబంధించిన సమాచారంలో వైరుధ్యాలున్నాయి. వాటిని సరిచేయాలంటే మనకు ఎలాంటి అధికారిక సమాచారం లభించదు. రహ్మానుద్దీన్ గారు చెప్పినట్లు ఈసీ వెబ్‌సైట్లో పంచాయతీల వారీగా విజయం సాధించిన అభ్యర్థుల జాబితా పెట్టవచ్చు కాని పార్టీల వివరాలు మాత్రం ఉంచరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:43, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

VisualEditor and your Wikipedia[మార్చు]

(Please translate this message)

Greetings,

The Wikimedia Foundation will soon turn on VisualEditor for all users, all the time on your Wikipedia. Right now your Wikipedia does not have any local documents on VisualEditor, and we hope that your community can change that. To find out about how you can help with translations visit the TranslationCentral for VisualEditor and read the easy instructions on bringing information to your Wikipedia. The User Guide and the FAQ are very important to have in your language.

We want to find out as much as we can from you about VisualEditor and how it helps your Wikipedia, and having local pages is a great way to start. We also encourage you to leave feedback on Mediawiki where the community can offer ideas, opinions, and point out bugs that may still exist in the software that need to be reported to Bugzilla. If you are able to speak for the concerns of others in English on MediaWiki or locally I encourage you to help your community to be represented in this process.

If you can help translate the user interface for VisualEditor to your language, you can help with that as well. Translatewiki has open tasks for translating VisualEditor. A direct link to translate the user interface is here. You can see how we are doing with those translations here. You need an account on Translatewiki to translate. This account is free and easy to create.

If we can help your community in any way with this process, please let me know and I will do my best to assist your Wikipedia with this |exciting development. You can contact me on my meta talk page or by email. You can also contact Patrick Earley for help with translations and documents on Mediawiki. We look forward to working with you to bring the VisualEditor experience to your Wikipedia! Keegan (WMF) (talk) 19:14, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)
కొత్త దృశ్యసరిచేయు ఉపకరణం వికీసాంకేతికాలు వాడవలసిన అవసరము తొలగించగలదు కావున ఈ ఉపకరణం యొక్క సందేశాలఅనువాదానికి ప్రాధాన్యత మరియు సమిష్టికృషి అవసరం. ఇది ఎలా పనిచేస్తుందోతెలుసుకోవటానికి ఆంగ్ల వికీలో ప్రయత్నించండి. క్లిష్టమైన సందేశాలకు అలా అవగాహన పెంచుకున్న తరువాత అనువాదం చేయడం మంచిది. 166 సందేశాలకు తెలుగు అనువాదాలు ట్రాన్స్ లేట్ వికీలో చేయండి.--అర్జున (చర్చ) 16:26, 31 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద పరికరము సందేహాలు[మార్చు]

కొన్ని పెద్ద వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెవికీలోకి గూగుల్ అనువాదపరికరము ద్వారా చేర్చాలని భావిస్తున్నాను. ఈ క్రమంలో కొన్ని సందేహములు తలెత్తినవి. సీనియర్ సభ్యులు నివృత్తి చేయగలరు.

 1. యాంత్రిక అనువాదములు ఏసభ్యుడైనా చేయవచ్చునా? లేక గుర్తింపు పొందిన కొందరికి మాత్రమే ఆ అవకాశము కలదా?
 2. అనువాదమైన తెలుగు వ్యాసము ను కాపీ చేసుకోవడానికి గూగుల్ అనువాద పరికరములో ఏమైనా ఆప్షన్ ఉన్నద? నేను ప్రయత్నించినపుడు అలాంటి ఆప్షన్ కనిపించలేదు. పార్ట్ పార్ట్ గా కంటెంట్ ను కాపీ చేసి తెవికీకో పేస్ట్ చేయడమొక్కటే మార్గమా?
 3. తెవికీలో ఈ ప్రక్రియకు ఏమైనా విధి విధానాలు రూపొందింపబడ్డాయా? ఆటులైనచో దయచేసి ఆ వివరాలు లేదా సంబంధిత లింకు తెలుపగలరు.

ధన్యవాదములు. మీ, --పోటుగాడు (చర్చ) 05:16, 8 ఆగష్టు 2013 (UTC)

 • ఎవరైన యాంత్రికఅనువాదాలు చేయవచ్చు. అయితే అనువాదం నాణ్యతను మెరుగుపరచినతర్వాత మాత్రమే సంబంధిత వ్యాసాన్ని తెవికీలోచేర్చండి. ఇప్పటికే చేర్చిన వ్యాసాలను శుద్ధిచేయటానికి కొంత సమాచారము తయారుచేయబడింది. లింకు నొక్కి ఇంగ్లీషు వికీ వ్యాసము URL టైపుచేసి అనువాదం చేయవచ్చు. --అర్జున (చర్చ) 11:18, 9 ఆగష్టు 2013 (UTC)
ధన్యవాదములు అర్జునరావు గారు.--పోటుగాడు (చర్చ) 14:29, 9 ఆగష్టు 2013 (UTC)

ఆంగ్ల వికీ బొమ్మలను తెవికీలో ఎలా పొందవచ్చు[మార్చు]

పెద్దలకు నమస్కారము, కొన్ని బొమ్మలు ఆంగ్లవికీలో ఇదివరకే ఎక్కించబడ్డాయి. వాటిని తెవికీలో ఎలా పొందవచ్చునో తెలుపగలరు. ఉదాహరణకు ఆంగ్లవికీ లింకులను [[m:en:<లింకు పేరు>]] ద్వారా పొందవచ్చును. కానీ ఇదే విధానము బొమ్మలకు పనిచేయడం లేదు. దీనికి ఏదైనా పరిష్కారము ఉన్నదా? లేనిచో ఆంగ్ల వికీలోని బొమ్మలను తెవికీలో ఎక్కించవచ్చా? దీనికి ఏ లైసెన్సింగ్ వర్తిస్తుంది? పెద్దలు సందేహ నివృత్తి చేయగల మనవి.
మీ
పోటుగాడు (చర్చ) 12:21, 15 ఆగష్టు 2013 (UTC)

ఆంగ్ల వికీ లోని బొమ్మలు కామన్స్ లో చేర్చినవైతే దానిని కాపీ చేసి వాడుకోవచ్చును. అవి ఫైర్ యూజ్ లైసెన్స్ వి అయితే అవి తెవికీ లో వాడినా ఫలితముండదు. మీరు కొత్తగా బొమ్మలను లైసెన్స్ కు అనుగుణంగా అప్‌లోడ్ చేసుకోవలసిందే. లేదా ఫైర్ యూజ్ లైసెన్స్ ప్రకారం సముచిత వినియోగానికి చిత్రాన్ని చేర్చవచ్చు.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 13:20, 15 ఆగష్టు 2013 (UTC)
సందేహ నివృత్తికి ధన్యవాదములు వెంకటరమణ గారూ --పోటుగాడు (చర్చ) 13:40, 15 ఆగష్టు 2013 (UTC)

వర్గముల తరలింపు మరియు తొలగింపు[మార్చు]

ఈ మధ్య కొన్ని వర్గాలను సృష్టించడం జరిగింది. తర్వాత అవి వేరే పేర్లతో ఇదివరకే సృష్టించారని తెలుసుకున్నాను. మరికొన్నిటికి సముచిత పేర్లు తోచినవి. ఇటువంటి సందర్భంలో ఆయా వర్గాలని కొత్తపేర్లకి తరలించడం లేదా తొలగింపు ప్రతిపాదనలు చేయడానికి ఎలాంటి ఆప్షన్లు కనిపించడం లేదు. దయచేసి ఆయా ఆప్షన్లను ఎలా పొందవచ్చునో తెలుపగలరు.
మీ
పోటుగాడు (చర్చ) 12:21, 15 ఆగష్టు 2013 (UTC)

అంతర్జాల సంపర్కం లేకుండా పనిచేయు (ఆఫ్ లైన్) తెలుగు వికీపీడియా[మార్చు]

నేను ఇటీవల హాంగ్ కాంగ్ లో జరిగిన వికీమేనియా 2013 కు FDC సభ్యుని హోదాలో హాజరయ్యాను. తెలుగు వికీని మెరుగుపరచడానికి సంబంధించిన వివరాలపై చర్చలు జరిపాను. కివిక్స్ తో పనిచేసే అంతర్జాల సంపర్కం లేకుండా పనిచేయు (ఆఫ్ లైన్) తెలుగు వికీపీడియా తయారు చేయడానికి ఇమ్మానుయేల్ తో చర్చించి కావలసిన అనువాదాలు పూర్తిచేశాను. ఇప్పుడు తెలుగు వికీపీడియాను అంతర్జాల సంపర్కంలేకుండా వాడవచ్చు.

http://download.kiwix.org/portable/wikipedia_te_all.zip.torrent

ఉపయోగించి మీ స్పందనలు తెలపండి. --అర్జున (చర్చ) 05:59, 16 ఆగష్టు 2013 (UTC)

నా కంప్యూటర్ లో డెమో మాత్రమే వస్తుంది. పూర్తి ఫైలు తెరుచుకొనడం లేదు.Rajasekhar1961 (చర్చ) 05:46, 8 అక్టోబర్ 2013 (UTC)

సినీ పాటలు[మార్చు]

తెలుగు సినీ పాటల సాహిత్యాన్ని తెవికీలో చేర్చదలిచాను. వాటిని ఆయా సినిమాల వ్యాసాలలో చేర్చితే బాగుంటుందా? లేక కొత్త వ్యాసాలను సృష్టించి వాటిని వర్గం:సినీ పాటలు గా చేర్చితే బాగుంటుందా? సభ్యులు తమ విలువైన అభిప్రాయాలను తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:17, 16 ఆగష్టు 2013 (UTC)

మంచి ఆలోచన. పాటలను ఆయా సినిమా వ్యాసాలలోనే చేర్చడం బాగుంటుంది. అయితే మొత్తం పాటంతా కాకుండా కొంతభాగాన్ని మాత్రమే చేరిస్తే కాపీహక్కుల సమస్యలు తలెత్తవు. ముందుకు సాగండి.Rajasekhar1961 (చర్చ) 09:21, 16 ఆగష్టు 2013 (UTC)
 • సినిమా పాటల సాహిత్యానికి వేదిక వికీసోర్స్. పల్లవిలోని మొదటి లైనును వికీపీడియా సినిమా పేజీలలో జత చేయగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 04:16, 18 ఆగష్టు 2013 (UTC)

వికీమేనియా 2013 విశేషాల చర్చ[మార్చు]

వికీమేనియా 2013 హాంగ్‍కాంగ్ లో జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. మన తెలుగు వికీపీడియనులు అర్జున గారు మరియు విష్ణు గారు ఈ వికీమేనియాలో పాల్గొన్నారు. ఆ విసేషాలను పంచుకోవడంతో పాటుగా కొన్ని సూచనలు కూడా అందించారు. http://www.youtube.com/watch?v=tVShamvuJTM వద్ద ఈ చర్చ వీడియోను చూడొచ్చు. సభ్యులకు ఏమయినా ప్రశ్నలు ఉండీ, సమావేశానికి హాజరు కాలేనివారు, ఇక్కడ మీ ప్రశ్నలు అడగవచ్చు. అంతర్జాల సమావేశంలో పాల్గొని, విషయాలు తెలియపరచిన అర్జున గారికీ, విష్ణు గారికీ ధన్యవాదాలు. రహ్మానుద్దీన్ (చర్చ) 10:05, 19 ఆగష్టు 2013 (UTC)

HTTPS for users with an account[మార్చు]

Greetings. Starting on August 21 (tomorrow), all users with an account will be using HTTPS to access Wikimedia sites. HTTPS brings better security and improves your privacy. More information is available at m:HTTPS.

If HTTPS causes problems for you, tell us on bugzilla, on IRC (in the #wikimedia-operations channel) or on meta. If you can't use the other methods, you can also send an e-mail to https@wikimedia.org.

Greg Grossmeier (via the Global message delivery system). 19:44, 20 ఆగష్టు 2013 (UTC) (wrong page? You can fix it.)

తెలుగు వంటలపై వ్యాసం[మార్చు]

తెలుగు వంటలు(telugu cuisine) పై వ్యాసం ఇప్పటికే ఉన్నదా? లేక సరికొత్తగా రాయాల్సి ఉందా? రహ్మానుద్దీన్ (చర్చ) 04:39, 21 ఆగష్టు 2013 (UTC)

వర్గం:వంటలు చూడండి.Rajasekhar1961 (చర్చ) 05:10, 21 ఆగష్టు 2013 (UTC)
ఆంధ్ర వంటకాలు వ్యాసాన్ని అభివృద్ధి చేసిన బాటుంటుంది.Rajasekhar1961 (చర్చ) 05:11, 21 ఆగష్టు 2013 (UTC)

వికీమీడియా ప్రాజెక్ట్ ఏషియా లో కల్చరల్ కంటెంట్ ఎక్స్చేంజ్ - తెలుగు నుండి వ్యాసాలు[మార్చు]

http://meta.wikimedia.org/wiki/Wikimedia_Asia_Project/Cultural_Content_Exchange వద్ద కొన్ని వ్యాసాలను ప్రతి భాష నుండి తీసుకొని వాటిని ఆంగ్ల భాషలోకి మరియు ఇతర ఆసియా భాషలలోకి తర్జుమా చేసి ఆ విధంగా ఆయా భాషలకు సంబంధించిన విశేష విషయాలు అన్ని భాషల్లో అందుబాటులోకి తేవడం ఈ ప్రాజెక్టు ఆశయం. తెలుగు భాష నుండి నాలుగు వ్యాసాలను ప్రతిపాదించాను. ఆ వ్యాసాలను http://meta.wikimedia.org/wiki/Wikimedia_Asia_Project/Cultural_Content_Exchange#From_Telugu వద్ద చూడవచ్చు, ఈ వ్యాసాలను మరింతగా అభివృద్ధి చేయటం ఇంకా ఇతర భాషాలలోకి అనువదించటం వంటివి ఔత్సాహికులు చేయగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 05:32, 21 ఆగష్టు 2013 (UTC)

రహ్మానుద్దీన్ గారు శభాష్! ఈ ప్రాజెక్టు ద్వారా మన తెవికీ వైవిధ్యం ఇంకా మెరుగవుతుందని నా నమ్మకం. అలాగే ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో మన తెవికీకి, సముదాయానికి గుర్తింపు కలిగించవచ్చు. ఈ ప్రాజెక్టు హాంకాంగ్‌లో జరిగిన వికీమేనియాలో ఉద్భవించింది. ఈ | లంకెలో అక్కడ జరిగిన చర్చ చూడండి. నేనూ అందులో చురుకుగా పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. విష్ణు (చర్చ)07:15, 21 ఆగష్టు 2013 (UTC)
 • మన సంస్కృతీ-సాంప్రదాయలను ప్రతిబింబించే ఇంకా ఇతర వ్యాసాలనూ సభ్యులు ప్రతిపాదించవచ్చు. ఉదాహరణకు హైదరాబాదులో ఐటీ విప్లవం మొ॥. రహ్మానుద్దీన్ (చర్చ) 07:48, 21 ఆగష్టు 2013 (UTC)
ఇందులో భాగంగా కంబోడియా జాతీయ చిహ్నాలు వ్యాసాన్ని ప్రారంభించాను. సభ్యులు దానిని విస్తరిస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:36, 26 ఆగష్టు 2013 (UTC)
ఇందులో భాగంగా ఇజ్రాయిల్ సంస్కృతి వ్యాసాన్ని ప్రారంభించాను. ఈ వ్యాసానికి ఆంగ్ల మూలం ఇక్కడ ఉంది. మిత్రులు దీనిని అనువదించి వ్యాసాన్ని విస్తరించ ప్రార్ధన. --విష్ణు (చర్చ)06:45, 27 ఆగష్టు 2013 (UTC)

కేశవపట్నం మరియు శంకరపట్నం విలీనము గూర్చి[మార్చు]

తెవికీ లో కరీంనగర్ జిల్లా లో మండలాల జాబితాలో శంకర పట్నం లేదు. కానీ కేశవ పట్నం ఉన్నది. కానీ సూచిక [1] ప్రకారం శంకర పట్నం ఉన్నది. ఆ జాబితాలో కేశవ పట్నం లేదు. ఈ వ్యాసంలో ఉన్న గ్రామాలన్నీ కేశవ పట్నం లోనివే. కనుక రెండు మండలాలు ఒకటేనేమో అని సూచిక[2] మరియు సూచిక[3] లను బట్టి అనిపిస్తుంది. సరైన వ్యాసం ఏదో తెలియజేయగలరు.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 17:10, 23 ఆగష్టు 2013 (UTC)

మార్గదర్శన పెట్టెలలో చూచమా కనబడే విధము సమస్య -బగ్ నివేదింపు[మార్చు]

మార్గదర్శన పెట్టెలలో (ఉదామూస:గుంటూరు జిల్లా మండలాలు ) చూ చ మా లింకులు సంబంధిత మూసలను లూవాకు మార్చినతరువాత ఒకే వరుసలో కనబడుటలేదు. దానిగురించి బగ్ 53336 నివేదించాను. --అర్జున (చర్చ) 06:00, 26 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు. ఎప్పటినుంచో నివేదిద్దామని బద్ధకించాను. --వైజాసత్య (చర్చ) 06:51, 26 ఆగష్టు 2013 (UTC)
 • బగ్ లో ఇచ్చిన సలహా ప్రకారం ఇంగ్లీషు వికీపీడియా Common.css ని నా వ్యక్తిగత శైలి గా పరీక్షించి సరిగావుందని నిర్ధారించుకొని తెలుగు వికీపీడియాలో చేర్చాను. సమస్య పరిష్కారమైంది. సమస్యలుంటే ఇక్కడ స్పందించండి. --అర్జున (చర్చ) 12:05, 26 ఆగష్టు 2013 (UTC)
 • వైజాసత్య గారి సవరింపు తరువాత కొత్త శైలితో సమస్యలు లేవని నిర్ధారిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:44, 28 ఆగష్టు 2013 (UTC)

అజ్ఞాత సభ్యుని వ్యాఖ్యలు[మార్చు]

కొందరు అజ్ఞాత సభ్యులు వారి పేర్లతో కాకుండా ఐ.పి నెంబర్లు 106.206.52.112 ,‎106.216.146.65 తో నా చర్చా పేజీలలో వ్యాఖ్యానించుచున్నారు. తెవికీ క్రియాశీల సభ్యులే ఈవిధముగా చేయుచున్నారని అనుకుంటున్నాను. వారు తమ సభ్యనామముతో నాతో వ్యాఖ్యానిస్తే తిరుగు సమాధానము ఇవ్వడానికి వీలవుతుంది. నిర్వాహకులకు విజ్ఞప్తి: నా చర్చా పేజీలో ఎవరైనా వ్యాఖ్యానించినపుడు ముందుగా నేను అప్రూవ్ చేసిన తర్వాత వివరాలు సేవ్ అయ్యే అవకాశం ఉంటే , దయచేసి ఆ సదుపాయాన్ని నాకు కల్పించగలరు. --పోటుగాడు (చర్చ) 06:12, 28 ఆగష్టు 2013 (UTC)

వ్యాఖ్యలను ముందస్తు అప్రూవ్ చేసే అవకాశం లేదు, కానీ వ్యాఖ్యలు మరీ మితిమీరితే ఈ అజ్ఞానసభ్యులను వికీపీడియాలో ప్రవేశించకుండా నిరోధించే అవకాశముంది. మీ చర్చాపేజీలో వ్రాసిన వ్యాఖ్యను నేను చూసాను. ఇలాంటి వాటికి ప్రతిస్పందించనవసరం లేదు. జవాబిచ్చుకుంటూ పోతే అవతలి వాళ్ళు మరీ రెచ్చిపోయే అవకాశముంది --వైజాసత్య (చర్చ) 06:24, 28 ఆగష్టు 2013 (UTC)

వ్యాస రచనపోటీ- అభివందనలు[మార్చు]

వ్యాసరచనపోటీ లో గెలుపొందిన విజయప్రకాష్ కొండేటి, బండి మోజేష్ , భరద్వాజిత్ , ఎస్.వి.పి. నిఖిల్ , చెన్నమణికంఠేశ్వర , శివున్నాయుడు , పి.వి.వి. సత్యనారాయణ , సన్మిత్ర వారికి అభివాదములు. దీనిని దిగ్విజయంగా నిర్వహించిన మల్లాది, రాజశేఖర్ మరియు విశ్వనాధ్ గార్లకు ధన్యవాదములు. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య,_ఉపాధి పేజీ, బహమతి పొందిన వారి వ్యాసాలకు అయా వాడుకరులపేజీలు చూడండి. దీనిలో పాల్గొన్న ఇతర విద్యార్థులకు కూడా ధన్యవాదములు. ఈ పోటీ తదుపరి పరిణామంగా విద్యార్థులు వికీపీడీయాలో మరింత కృషి చేసి, వారి విద్యాసంస్థలలో (వికీపీడియా:తెవికీ_అకాడమీ, వికీపీడియా అవగాహన సదస్సులు )) నిర్వహించటానికి, పాల్గొన్న విద్యార్థులు సహకరించి వికీపీడియా ప్రచారానికి తద్వారా జ్ఞానసమాజ నిర్మాణానికి దోహదపడతారని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 06:18, 28 ఆగష్టు 2013 (UTC)

ఈ పోటీలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు. నిర్వాహకులైన మల్లాది, రాజశేఖర్ మరియు విశ్వనాధ్ గార్లకు అభినందనలు. --విష్ణు (చర్చ)18:54, 28 ఆగష్టు 2013 (UTC)

మీడియాలో తెవికీ[మార్చు]

తెవికీకి సంబందించి మీడియాలో వచ్చిన వార్తల గురించి ఒక పేజిలో సంవత్సరం వారిగా వివరాలను పొందుపరిస్తే బాగుంటుందేమో. ఇప్పటికే ఉన్న మీడియాలో తెవికీ పేజిలో గతంలో వచ్చిన వార్తలను తెవికీ మిత్రులు చొరవ తీసుకొని చేర్చవలసిందిగా మనవి. ఇది మన తెవికీ చరిత్రకు ముందుముందు ఒక మంచి వనరు కాగలదని నా నమ్మకం. --విష్ణు (చర్చ)18:49, 28 ఆగష్టు 2013 (UTC)

అర్జునరావు గారు ఉగాది మహోత్సవం తర్వాత మీడియాలో వికీపీడియా గురించి వ్యాసాల్ని ఒక దగ్గర చేర్చారు. ఆ లింకు తెలిసిన వారు ఈ రెండింటిని ఒక దగ్గర చేరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 02:40, 30 ఆగష్టు 2013 (UTC)

మీకు ఎంతమంది లీలావతి కూతుళ్ళు తెలుసు?[మార్చు]

మరిన్ని వివరాలు ఈ తెవికీ ప్రాజెక్టు పేజిలో. మీరూ పాల్గొంటారని అశిస్తూ... విష్ణు (చర్చ)07:28, 29 ఆగష్టు 2013 (UTC)

డా.వండాన శేషగిరిరావు గారి రచనలు తెవికీ లో చేర్చుట గూర్చి[మార్చు]

డా.వండాన శేషగిరిరావు గారు శ్రీకాకుళం పట్టణం లో ప్రముఖ వైద్యులు. గత చాలా సంవత్సరాలుగా వైద్య రంగంలోనె కాకుండా వివిధ రంగాలలో విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనే సదుద్దేశంలో 21 కి పైగా బ్లాగులను నిర్వహించి వివిధ విషయాలను చేరుస్తున్నారు.ఆయన తెలుగు వికీపీడియాకు కూడా విశేష సేవలు అందించారు. ఆయన బ్లాగులలో చేర్చే అంశాలను తెవికీ లో వినియోగించుకొనుటకు డా.రాజశేఖర్ గారి సలహాతో ఆయనను వ్యక్తిగతంగా సంప్రదించడం జరిగినది. ఆయన తను బ్లాగులలో తయారు చేసిన వ్యాసాలను తెవికీ లో చేర్చుకొనుటకు అనుమతించారు. వారు తెవికీ లో ఆ వ్యాసాలు ఉంటే అందరికీ ఉపయోగపడగలవని అందువలన చేర్చినా అభ్యంతరం లేదని తెలియజేశారు.తెవికీలో రచనలు చేర్చుకొనుటకు అనుమతినిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన రచనలు చేసే బ్లాగులు ఈ దిగువనుదహరింపబడినవి.

 1. శ్రీకాకుళం జిల్లా యొక్క సమాచారము తెలిపేది
 2. శ్రీకాకుళం లో ప్రముఖ వ్యక్తుల గూర్చి
 3. తెలుగు ప్రముఖుల గూర్చి
 4. భారత దేశ ప్రముఖుల గూర్చి
 5. ప్రపంచ ప్రముఖుల గూర్చి
 6. టాలీవుడ్ ప్రముఖూల్ గురించి
 7. విశిష్ట వ్యక్తుల భావాలను తెలియ జేసేది.
 8. తెలుగు పండగలు వాతి విశిష్టతలు తెలియజేసేది.
 9. కొన్ని నిజాలు, వాస్తవాలను తెలియజేసేది
 10. వింత నిజాలను తెలియజేసేది.
 11. ఏమిటి? ఎందుకు? ఎలా?
 12. శాస్త్రవేత్తల గూర్చి తెలియజేసేది-1
 13. శాస్త్రవేత్తల గూర్చి తెలియజేసే ది - 2
 14. వైద్య రత్నాకరము.
 15. ఆహారం - ఆరోగ్యం -వ్యాధులు గూర్చి తెలియజేసేది.
 16. ఆరోగ్య సమస్యలు
 17. వివిధ దినోత్సవాలు వాటి ప్రాముఖ్యత
 18. పురాణాల పాత్రలు
 19. లైంగిక సమస్యలు వాటికి సంబంధించిన ప్రశ్నలు
 20. జంతు కుటుంబం.
 21. చిత్రం వెనుక కథలు

పై బ్లాగుల లోని అంశాలను తెవికీలో చేర్చటకు ఆయన అంగీకరించి యున్నారు.ఆయన తయారుచేసిన వ్యాసాలన్నీ "యునీ కోడ్" లోనే ఉన్నాయి. వీటిని కాపీ-పేస్ట్ ద్వారా వికీలో సులువుగా చేర్చవచ్చు. వీటిని చేర్చడం ద్వారా తెవికీ వ్యాసాల సంఖ్యను గణనీయంగా పెంచవచ్చని నా అభిప్రాయం. దీనిపై మీ అమూల్యమైన సలహాలు అందించగలరు.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 17:44, 30 ఆగష్టు 2013 (UTC)

ఈ బ్లాగుల్లో విలువైన సమాచారం ఉన్నది. దీనిని వినియోగించుకోవడానికి, తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి తేవడానికి డా. వందన శేషగిరిరావు గారు అంగీకరించారు. వారికి తెవికీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఒకరివలన పూర్తయే పనికాదు. కావున ఎవరికి ఆసక్తి గల విషయాన్ని వారు ఆయా వికీ పేజీలలో చేర్చమని కోరుతున్నాము. మనం తెవికీ చేర్చుతున్నప్పుడు వండాన గారికి లేదా ఆ సమాచారాన్ని అందించిన మీడియా ప్రముఖుల్ని తెవికీ వ్యాసాల్లో మూలాలుగా చూపడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 03:48, 31 ఆగష్టు 2013 (UTC)
మంచి, ఉపయుక్తమైన వ్యాసాలు ఉన్నాయి. శేషగిరిరావు గారి కృషి ప్రశంశనీయం, వారి అంగీకారానికి కృతజ్నతలు...విశ్వనాధ్ (చర్చ) 07:12, 31 ఆగష్టు 2013 (UTC)
వండాన శేషగిరిరావు అంగీకరించడం ముదావహం. ఇందుకు సహకారం అందించిన డాక్టర్ రాజశేఖరావు గారికి ధన్యవాదాలు. నేను వారి బ్లాగును చూసాను. నాకది చాలా నచ్చింది. అందులో ఉపయుక్తమైన వ్యాసాలు విస్తారంగా ఉన్నాయి. వారి వ్యాసాలను వికీపీడియాలో చేర్చే బాధ్యతను పంచుకోవడానికి నేను ఆనందంగా అంగీకరిస్తున్నాను. --t.sujatha (చర్చ) 17:30, 31 ఆగష్టు 2013 (UTC)
ఈ బ్లాగులలో గల కొన్ని వ్యాసాలు యిదివరకే తెవికీలో ఉన్నవి. కనుక సభ్యులు ప్రతీ వ్యాసం తెవికీ లో ఉన్నదో లేదో ముందుగా పరీక్షించి చేర్చవలసినదిగా విజ్ఞప్తి. ప్రతీ వ్యాసం చేర్చునపుడు వికీకరణలు చేయాలి. వర్గాలను చేర్చాలి. శేషగిరిరావు గారు ప్రతీవ్యాసంలో తెలియజేసిన వివిధ మూలాలను కూడా చేర్చవలసి ఉంటుంది. వ్యాస శీర్షికలు అర్థవంతంగా సంగ్రహంగా ఉండేటట్లు చూసుకోవాలని మనవి.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 05:30, 1 సెప్టెంబర్ 2013 (UTC)
చాలా మంచి వనరును పరిచయం చేసారు కె.వెంకటరమణగారు. ధన్యవాదాలు. దీనికి వండాన శేషగిరిరావు గారు అంగీకరించడం ఇంకా చాలా ఆనందం కలిగించింది. నా కొన్ని అభ్యర్థనలను మన్నిస్తారని ఆశిస్తున్నాను.
1) వండాన శేషగిరిరావు గారు చాలా పెద్ద మనసుతో వారు ఎంతో శ్రమకోర్చి పొందుపరచిన సమాచారం మన తెవికీ అందించడం చాలా హర్షనీయం. కాకపోతే వారి ఈ విశాల హృదయానికి మనం ఎలా కృతజ్ఞత తెలియజేయాలో మనం ఆలోచించవలసిన విషయం. కొన్ని ఆలోచనలు... వారు తెవికీకి ఇచ్చే ఈ విరాళం (content donation) గురించి మీడియావారికి తెలియజేయటం; బ్లాగుల్లో వ్రాయటం; తెవికీ, హైదరాబాద్ మరియు భారత మెయిలింగ్ లిస్టులలో దీనిని గురించి తెలపడం; వచ్చే నెల తెవికీ సమావేశానికి వారిని ఆహ్వానించి వారిని ఉడతాభక్తిగా సన్మానించికోవడం; చేస్తే బాగుంటుందని నా ఆలోచన.
2) అలాగే వారి ఈ సద్చర్య మిగతా రచయితలకి, సంస్థలకు మార్గదర్శకంగా ఉండేటట్టు మనం చేయగలగాలి. ఇది కేవలం తెవికీ విజయం కాదు మన తెలుగు సమాజ స్వేచ్ఛా విజ్ఞానానికి ఒక తార్కాణం
3) ఇది చేసే ముందు.. వారి బ్లాగు ప్రస్తుతం కాపీరైటుకు లోబడి ఉంది. కావున మనం అందులోంచి సమాచారం తీసుకోవడం చట్టరిత్యా తగని చర్య మరియు ఇది వికీకి కూడా తగదు. కావున ఈ బ్లాగును CC-BY-SA 3.0 లోకి లేదా ఒక డిజిటల్ ప్రచురణ ద్వారానో ఫ్రీ కంటెంటు చేయడం ఉచితం.
4) తదనంతరం దీనిని ఒక ప్రాజెక్టులా పద్దతి ప్రకారం మనం చేపడితే చాలా మంచిది. --విష్ణు (చర్చ)12:05, 1 సెప్టెంబర్ 2013 (UTC)
ఇది మంచి ఆలోచన, ఆయనను సముచిత రీతిన సత్కరించడం చాలా బావుంటుంది...విశ్వనాధ్ (చర్చ) 13:37, 1 సెప్టెంబర్ 2013 (UTC)
 • ‌పై న విష్ణు చెప్పినట్లు శేషగిరిరావు గారి బ్లాగులలో Copyrightని మార్చినతరువాత ఈ పనిచేపడితే వికీపీడియా విధానాలకు అనుగుణంగా వుంటుంది. --అర్జున (చర్చ) 08:07, 3 సెప్టెంబర్ 2013 (UTC)
 • శేషగిరిరావుగారు తమ బ్లాగు సమాచారాన్ని తెవికీలో చేర్చడానికి అనుమతి ఇచ్చియుంటే ముందుగా కృతజ్ఞతలు. అయితే తెవికీ పరంగా మనం "కాపీ" ప్రక్రియను ఆసాంతంగా అవలోకన చేసుకోవాల్సి ఉంటుంది.
  1) బ్లాగులోని సమాచారం చాలా వరకు పత్రికలు, మేగజైన్ల నుంచి కాపీచేసినవి ఉన్నట్లుగా గమనించాను. కాబట్టి ఇలాంటి వ్యాసాలు మక్కికిమక్కి తెవికీ వ్యాసాలలో చేర్చడానికి వీలుండదు.
  2) పత్రికల/మేగజైన్ల/ఇతర వనరుల సమాచారం కాపీ చేసిన బ్లాగుల నుంచి తెవికీలో కొన్ని వాక్యాలు చేర్చవలెనన్ననూ దానికి మూలం బ్లాగులను కాకుండా అసలు మూలమైన పత్రికల/మేగజైన్ల మూలాలనే తెవికీలో చేర్చవలసి యుంటుంది.
  3) ఒక బ్లాగు నుంచి తెవికీలో ఏదేని సమాచారం చేర్చవలెనంటే ముందుగా ఆలోచించాల్సినది, ఆ బ్లాగులోని సమాచారం బ్లాగు నిర్వాహకులే వ్రాశారా అని, అలా నిర్థారించుకోవడానికి అవకాశం లేనప్పుడు కాపీ చేయడానికి అవకాశం ఉండదు.
  4) బ్లాగులో ఉన్న బొమ్మలను కూడా తీసుకొని తెవికీలో చేర్చాలన్ననూ, ఆ బొమ్మ ఆ బ్లాగు నిర్వాహకులే స్వయంగా తీశారా లేదా ఎక్కడి నుంచైనా కాపీ చేశారా అని నిర్థారించుకోవాలి. ఇతర సైట్ల నుంచి కాపీచేసి బ్లాగులలో ఉంచుకున్న బొమ్మలు తెవికీలో చేర్చి బ్లాగు లింకులివ్వడం పొరపాటే.
  5) పత్రికలు సాధారణంగా అధిక కాలం సమాచారం అంతర్జాలంలో ఉంచరు. ఇప్పుడు శోధించిననూ పాత సమాచారం పత్రికలలో వచ్చినట్లు నిర్థారణ చేసుకోవడం కొంత కష్టమే, అయిననూ ఆ సమాచారాన్ని తెవికీలో కాపీ చేయడం నిబంధనలకు విరుద్ధమే.
  6) బ్లాగు లింకులపై ఇదివరకు చాలా సార్లు చర్చలు జరిగాయి, ఇప్పుడు కూడా చర్చ జరుగుతున్న దశలోనే కొందరు సభ్యులు సమాచారాన్ని, బొమ్మలను అప్లోడ్ చేయడం, లింకులివ్వడం సమంజసం కాదు.
  7) బ్లాగు నిర్వాహకుడు స్వయంగా రచయిత అయి, వ్యాసాలు స్వయంగా (కాపీరైట్ ప్రమాణాల ప్రకారం) రచించినట్లు తెలుసుకుంటే తప్ప బ్లాగు నుంచి కాపీ చేసుకోవడం, లింకులివ్వడం కుదరదు.
  8) ఎవరో ఒక బ్లాగరు గాజుల సత్యనారాయణ "పెద్ద బాలశిక్ష"ను కాపీ చేసుకొని కొంతకాలం అనంతరం తన బ్లాగులోని సమాచారాన్ని తెవికీలో చేర్చడానికి సిద్ధమైనప్పుడు మనం అతన్ని బ్రహ్మరథం పట్టడం కంటే ముందుగా ఆలోచించాల్సిన, పరిశీలించాల్సిన, తెలుసుకోవాల్సిన, నిర్థారించుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి.
  9) పత్రికలలో వచ్చిన వ్యాసాలు బ్లాగులో కాపీచేయడం, ఆ బ్లాగుల నుంచి తెవికీలో కాపీ చేయడం, తెవికీలో ఉండేది ఎవరైనా ఉపయోగించుకొనవచ్చని భావించి (ఇది వరకు ఒక పత్రికలో రాలేదనే అభిప్రాయంతో) మరో పత్రికవారు ఉపయోగించుకోవడం, ఆ తదనంతరం ఆ వ్యాసం అసలు రచయిత (లేదా మొదటి పత్రిక) రెండో పత్రికపై కాపీరైట్ కేసు పెట్టడం, రెండో పత్రికవారు తెవికీ నుంచి తీసుకున్నామని చెప్పడం, మొదటి పత్రిక వారు మన సమాచారం కాపీ చేయడానికి తెవికీకి ఎవరు అనుమతిచ్చారని చెప్పడం .... ఇదంతా వినడానికే గందరగోళంగా ఉంది కదూ! మరి నిజంగా జరిగితే ఈ ప్రక్రియకు బాధ్యులెవరు?
  10) స్వయంగా బ్లాగు నిర్వాహకుడు రచించిన సమాచారం తెవికీలో కాపీ చేయాలనుకున్ననూ స్పష్టమైన అనుమతితో పాటు ఆ సమాచారం స్వయంగా రచించినట్లు తెవికీకి వెల్లడించాలి. మౌఖిక అనుమతి పనిచేయదు.
  11) ఇతర వనరుల నుంచి కాపీచేసుకొని బ్లాగులో ఉంచిన సమాచారాన్ని తెవికీలో చేర్చడానికి బ్లాగరు, సభ్యులందరూ ఒప్పుకున్ననూ ఇది (కాపీ హక్కుల సమస్య) తెవికీ మూల నియమానికి విరుద్ధం కాబట్టి ఆ సమాచారం కాపీచేయనికి వీలుండదు.
  12) ఒక బ్లాగు నుంచి కాపీ చేసుకోవాల్సివచ్చినప్పుడు మనం పరిశీలించాల్సినది తెవికీ ప్రమాణమే కాని సమాచారం కాదు.
  13) ఇలాంటి సమస్యలన్నీ (ఇవి మాత్రమే కావు, ఆలోచిస్తే ఇంకనూ చాలా ఉంటాయి) అధికమిస్తే మాత్రం తెవికీలోకి కాపీ చేయడానికి ఎలాంటి సమస్య ఉండదు, అలాంటి బ్లాగరును మెచ్చుకొని తీరాల్సిందే. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:36, 5 సెప్టెంబర్ 2013 (UTC)
నేను వ్యక్తిగత పనిమీద శ్రీకాకుళం వెళ్లినప్పుడు, అక్కడ నేను రమణగారిని తోడుగా తీసుకెళ్లి శేషగిరిరావుగార్ని కలవడం జరిగింది.అప్పుడు మేము ఆయనను తిరిగి తెవీకీలో రచనలను చెయ్యమని కోరగా అందుకు ఆయన "తన ఆరోగ్యదృస్ట్యా,మరియు క్లినిక్ నిర్వహణవలన రచనలు చెయ్యడం కష్టమంటూ",తనబ్లాగులను మాకు చూపించాడు.అప్పుడు మేము ఆయన అనుమతి ఇచ్చినచో వాటిని వీకికి తరలిస్తామని అడిగాము.అందుకు ఆయన"తనకేమి అభ్యంతరం" లేదని.అయితే కొంతసమాచారాన్ని తాను పత్రికలనుండి సేకరించానని,అవిషయాన్ని వ్యాసాలలో పెర్కొన్నానని,పొటోలనుకూడా కొంతమేరకు బయటనుంచి/పత్రికలనుంచి సేకరించినవి వున్నాయని,వాటిని ఆయా పత్రికలసౌజన్యంతో అని వికిలో వ్రాసిన కాపీరైట్ ఇబ్బంది వుండవచ్చు/వుండక పోవచ్చునని తెలిపారు.ఆవిషయాన్ని మినహాయించి, తనరచనలను తెవీకీలోకి తరలించుకోవచ్చని చెప్పారు.పాలగిరి (చర్చ) 02:21, 6 సెప్టెంబర్ 2013 (UTC)
శేషగిరిరావు గారి బ్లాగులోని విషయాలు చాలా వరకూ పండగలు, ఆరోగ్య సంభంద వ్యాసాలు, ప్రముఖులు, ఆహారం, పురాణ పాత్రలు ఇలాంటివే. వీటిలో చాలా వరకూ తెవికీలో ఉన్నవి. మరింత సమాచారం ఆయన బ్లాగుల ద్వారా దొరకుతున్నది. బొమ్మలు కాపీ హక్కులు ఉన్నవి మాత్రమే అయితే తీసుకోవచ్చు. కనుక ఆయన తన కంటెంటు వాడుకొనేటందుకు ఒక లేఖ వ్రాస్తే, దానిని స్కాన్ చేసి ఆయన పేజీలోనే పెట్టచ్చు, తద్వారా కాపీ హక్కుల ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం..విశ్వనాధ్ (చర్చ) 05:08, 6 సెప్టెంబర్ 2013 (UTC)
 • మరిన్ని సందేహాలు.
  14) వికీపీడియాలో ఏది చేర్చిననూ సార్వజనీనం అవుతుంది. అంటే ఇక్కడి సమాచారం ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అలాంటప్పుడు పత్రికలలో వచ్చిన వ్యాసాలను సార్వజనీనం చేయడానికి మనకు ఎవరు హక్కు ఇచ్చారు?
  15)బ్లాగులలో ఎవరు ఏదైనా వ్రాసుకుంటారు, ఎక్కడి నుంచైనా కాపీ చేసినా అది మనకు సంబంధం లేదు, కాని కాపీ చేసిన సమాచారం అసలు వ్యాసకర్త నుంచి అనుమతి లేకుండా తెవికీలో చేర్చడం రెండు విధాలుగా పొరపాటు. రెండో పొరపాటు ఏమిటంటే తెవికీలో చేర్చేవారు కాపీహక్కులకు లోబడి సమాచారం చేర్చుతున్నట్లుగా ఒప్పుకున్నట్లే. అంటే కాపీ వ్యాసాలను చేర్చడం మొదటి పొరపాటు, ఆ సమాచారం లైసెన్సుకు అనుగుణంగా ఉన్నట్లుగా ఒప్పుకోవడం రెండో పొరపాటు
  16) తెవికీలో ఇటీవల చేర్చిన కాపీ వ్యాసాలు (శాస్త్రవేత్తలు, ప్రముఖులకు సంబంధించి) ఎక్కువగా ఈనాడు పత్రికలో (హాయ్ బుజ్జీలో) సుబ్బారావు గారు వ్రాశారు. ఇప్పుడు ఇక్కడి సమాచారం సార్వజనీనంగా భావించి ఎవరైనా ఈ సమాచారంతో పుస్తకం ముద్రిస్తే తదుపరి పరిణామాలకు తెవికీలో ఈ సమాచారం చేర్చిన సభ్యుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ సమాచారం భద్రపర్చినా లైసెన్సుకు అనుగుణంగా ఉన్నట్లు సభ్యుడు ఒప్పుకున్నట్లే.
  17) అనామకులు, కొత్తవారు, తెలియని వారు, ఐపీ అడ్రస్‌తో వ్రాసేవారు ఇలాంటి కాపీ సమాచారం చేర్చినట్లు నిర్వాహకులెవరైనా గమనిస్తే వెంటనే తొలిగించవలసి ఉంటుంది. ప్రస్తుతం అట్టి కాపీ సమాచారం చేర్చినవారు అనుభవమున్నవారే కాబట్టి వారే తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
  18) ఇదివరకు చేర్చిన కాపీ సమాచారం ఇప్పుడు తొలిగించిననూ ఇప్పటికే ఇక్కడి సమాచారం కొందరు కాపీ చేసుకొని ఉండవచ్చు కూడా! ఆ సమాచారం దుర్వినియోగపరిస్తే పత్రికల వారికి (లేదా వ్యాసకర్తకు) ఏమని సమాధానం చెప్పాలి?
  19) వికీలో మూలాలను బట్టి వ్యాస నాణ్యత అంచనా వేయవచ్చు. మూలాలు ఎంత ప్రామాణికమైతే వ్యాసం అంత నాణ్యతగా ఉన్నట్లు. స్వయంగా నిర్వహిస్తున్న ప్రముఖ నాయకుల, రచయితల బ్లాగులైతే ఫర్వాలేదు కాని, పత్రికల నుంచి కాపీ చేసే బ్లాగులను కూడా తెవికీలో లింకులివ్వడం రెండు విధాలుగా పొరపాటు. ఇలా చేయడం మనల్ని మనం దిగజార్చుకున్నట్లే కాకుండా నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
  20) సమాచారం కాపీ చేసే బ్లాగులకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తే, భవిష్యత్తు పరిణామాల సంగతేమో కాని, వ్యాసాలన్నీ బ్లాగులింకులతో నిండిపోతాయి.
  21) తెవికీ అనేది ఉన్నతమైన స్థానంలో ఉంటూ హుందాగా మెలుగుతూ రచయితలకు, పరిశోధకులకు, ఔత్సాహికులకు మార్గదర్శకంగా నిలవాలి. ఆంగ్లవికీ నుంచి పలు విశ్వవిద్యాలయాలు సమాచారం కూడా గ్రహిస్తున్నాయి. తెవికీని కూడా ఆ దిశలో నిలపేటట్లు ఆలోచించాలి. అంతేకాని అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన తెవికీ, కాపీ సమాచారం ఉన్న బ్లాగులపై ఆధారపడటం, అక్కడి నుంచి సమాచారం తీసుకున్నామని తెలపడం, మన వ్యవస్థను మన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది.
  22) తెవికీలో వ్యాసాల సంఖ్య, సమాచారం వృద్ధి కావడానికి ఆలోచించడం, ఆ దిశగా గమ్యం చేరడం అవసరమే కాని, కాని ఆ దిశలో వెళ్ళడానికి మార్గం కూడా సరైనదిగా ఎంచుకోవాల్సి ఉంటుంది, లేనిచో నవ్వుల పాలవుతాం.
  23) పత్రికల వారు టైటిల్ పెట్టేటప్పుడు తోకలు తగిలిస్తారు. దాన్నే కాపీ చేసి మనం కూడా అలా వ్యాసం పేరు పెట్టడం బాగుండదు (ఉదా: పైడి జైరాజ్ -హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో‎)
  24) కొన్ని వ్యాసాలు ఆంగ్ల వికీపీడియా నుంచి కాపీ చేసుకొని బ్లాగులో ఉంచితే, మనం మళ్ళీ ఆ బ్లాగు నుంచి కాపీ చేసి దానికి మూలం బ్లాగు లింకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:08, 7 సెప్టెంబర్ 2013 (UTC)

పైన కనబరచిన వ్వాసాల గురించి[మార్చు]

ఆర్యా.... పైన కనబరచిన వెబ్ సైట్ లోని కొన్ని వ్వాసాలను చేర్తాను. వాటిలో కొన్ని మన వికి పీడియాలో వున్నాయి. వాటిని వదిలి మిగతా వాటిని చేర్చాను. వీటిగురించి నా మనవి ఏమంటే......

 1. కొన్ని వ్వాసాలు ఉత్తమ పురుషంలో విన్నాయి వాటిని మార్చ వచ్చా?
 2. అన్ని వ్వాసాలకు ఉపోద్గాతంగా ఒక పేరా వున్నది. దాన్ని తొలగించితే మంచిదని నా భావన. కొన్నింటిని తొలిగించాను కూడా. ఇది సమంజసమేనా? కాదా?

తెలియ జేయండి.

భాస్కరనాయుడు గారు మంచి పని మొదలుపెట్టారు. ఈ వ్యాసాల్ని వికీకరించాలి. అంటే ఉపోద్ఘాతాన్ని తొలగించాలి. తృతీయ పురుషలో వుండాలి. బయటి లింకుల్ని మూలాలలో చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:07, 31 ఆగష్టు 2013 (UTC)