కంబోడియా జాతీయ చిహ్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంబోడియా దేశపు జాతీయ చిహ్నాలు: ఆంగ్‌కోర్ వాట్, జాతీయ పతాకం, జాతీయగీతం, జాతీయ చిహ్నం, రాజముద్రికలు. 2005 సంవత్సరంలో, కంబోడియా రాజరికం ఏడు వృక్ష, జంతు జాతులను జాతీయ చిహ్నాలుగా గుర్తించింది.[1]

The sugar palm, Borassus flabellifer, and Angkor Wat are two symbols of Cambodia; the latter is also portrayed on the flag of Cambodia.

జాతీయ చిహ్నాలు[మార్చు]

కంబోడియా జాతీయ వృక్షం.

ఆంగ్‌కార్ వాట్[మార్చు]

ఆంగ్‌కోర్ వాట్ (ఆంగ్లం: Angkor Wat; Khmer: អង្គរវត្ត) ఆంగ్‌కోర్ లోని ఒక పెద్ద దేవాలయ సముదాయం. దీనిని సూర్యవర్మన్ II, 12 వ శతాబ్దం పూర్వార్ధంలో నిర్మించాడు. ఇది ఆ దేశపు జాతీయపతాకంలో కేంద్రస్థానంలో కనిపిస్తుంది.

కంబోడియా జాతీయ పతాకం[మార్చు]

కంబోడియా జాతీయ పతాకం.

కంబోడియా జాతీయగీతం[మార్చు]

నోకోర్ రీచ్ (ఆంగ్లం: "Nokor Reach"; Khmer: បទនគររាជ; Royal Kingdom) కంబోడియా దేశపు జాతీయగీతం. ఇది కంబోడియా జానపద గీతం ఆధారంగా స్వరపరచబడింది. దీనిని చౌ నాథ్ (Chuon Nath) రచించాడు. దీనిని 1941 లో జాతీయగీతంగా నిర్ణయించి, ఫ్రాన్స్ నుండి 1947 లో స్వతంత్రం వచ్చిన తరువాత స్థిరపరిచారు. 1970 లో రాజరికం పోయిన కాలంలో దీనిని నిషేధించారు. కమ్యూనిస్టులు గెలుపొందిన తర్వాత 1975 లో ముందటి చిహ్నాలతో పాటు నోకోర్ రీచ్ ను కూడా కొంతకాలం తిరిగి పునఃస్థాపించారు. ఖ్మెర్ రోగ్ (Khmer Rouge) కాలంలో మళ్ళీ దీనిని దాప్ ప్రాంపి మెసా చోకే (Dap Prampi Mesa Chokchey; "Glorious Seventeenth of April") తో మార్చారు. 1993లో రాజరికపు రోయల్ పార్టీ కమ్యూనిష్టులను ఒడించిన పిదప మళ్ళీ నోకోర్ రీచ్ ను జాతీయగీతంగా స్థాపించారు.

కంబోడియా జాతీయ చిహ్నం[మార్చు]

Royal Arms of Cambodia

అధికారికంగా ప్రకటించిన జంతువృక్షజాతులు[మార్చు]

కంబోడియా జాతీయ పక్షి.
కంబోడియా జాతీయ చేప.
తాటిచెట్టు (Borassus flabellifer) , కంబోడియా జాతీయ వృక్షం.
en:Mitrella mesnyi, కంబోడియా జాతీయ పుష్పం.
కోడిగుడ్డు అరటిపండు (Lady Finger banana or Chicken Egg banana) , కంబోడియా జాతీయ ఫలం.
en:Giant barb, కంబోడియా జాతీయ చేప.
దక్షిణ నది తాబేలు (Royal turtle) , కంబోడియా జాతీయ సరీసృపం.
en:Giant Ibis, కంబోడియా జాతీయ పక్షి.
అడవి ఎద్దు (Kouprey or Gray ox or Forest cattle) , కంబోడియా జాతీయ క్షీరదం.

మూలాలు[మార్చు]

  1. "ROYAL DECREE on Designation of Animals and Plants as National Symbols of the Kingdom of Cambodia" (PDF). Archived from the original (PDF) on 2007-06-30. Retrieved 2013-08-26.