Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 61

వికీపీడియా నుండి

పాత చర్చ 60 | పాత చర్చ 61 | పాత చర్చ 62

alt text=2018 జూలై 5 - 2018 అక్టోబరు 4 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 జూలై 5 - 2018 అక్టోబరు 4

జులై 1, 2018 సమావేశం

[మార్చు]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జులై 1, 2018 సమావేశం చూసి దాని చర్చాపేజీలో స్పందించండి.--అర్జున (చర్చ) 06:31, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నమయ్య గ్రంథాలయం, స్వేచ్ఛ కార్యాలయాల్లో సెషన్లు

[మార్చు]

అందరికీ నమస్కారం,
అన్నమయ్య గ్రంథాలయం, స్వేచ్ఛ పలు స్థాయిల్లో తెలుగు వికీపీడియా కార్యకలాపాలకు సంస్థాగతంగా సహకరించిన విషయం తెలిసిందే. ఈ సంస్థల్లో రెండు పరిచయ సెషన్లు నిర్వహిస్తున్నాం.

  • అన్నమయ్య గ్రంథాలయంలో వారి గ్రంథాలయ జాబితాను పూర్తిస్థాయిలో వికీపీడియాలో చేర్చగలగడానికి అవసరమైన శిక్షణను ఇవ్వమని కోరారు. వారి స్టాఫ్‌కి జూలై 8 10వ తేదీ, మంగళవారం నాడు గుంటూరులో వారి వద్ద ఉన్న ఎక్సెల్ షీట్లలో డేటాను వికీపీడియాలో మార్కప్ కోడ్ టేబుల్స్‌గా మలచడానికి ఉపకరించే ఉపకరణాలు, ఏయే పేజీల్లో ప్రచురించాలి అన్న విషయాలు నేర్పనున్నాను. వీటితో పాటు ఆ పుస్తకాల గురించి వికీడేటా క్విక్ స్టేట్‌మెంట్స్ వాడి వికీడేటా ఐటమ్స్ తయారుచేయవచ్చన్న ఆలోచనను వారితో పంచుకుని ఆ విషయంపై ప్రగతికి ప్రయత్నిస్తాను. గ్రంథాలయంలో వికీసోర్సుకు అవసరమైన, పేజీలు మిస్సైన పుస్తకాలు వెతికి స్కాన్ చేసి చేర్చే ప్రయత్నమూ జరుగుతుంది.
  • స్వేచ్ఛ సంస్థ వారు రంగారెడ్డి జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల వివరాలను వికీడేటా ఐటమ్స్‌గా చేర్చే ప్రయత్నంలో ఉన్నందున దీనిని మరింత వేగవంతంగా మెరుగ్గా చేయగల ఉపకరణాల గురించి నేర్పమని కోరారు. కాబట్టి వారికి ఆ అంశాల్లో మౌలిక శిక్షణ 2018 జూలై 15, ఆదివారం నాడు అందించనున్నాం.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:02, 9 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా నాణ్యతాభివృద్ధి

[మార్చు]

జులై 1, 2018 సమావేశం చర్చల పర్యవసానంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో భాగంగా నాణ్యత తనిఖీ జాబితాను అభివృద్ధి పరచి అమలుచేయాలని సూచించబడింది. ఆంగ్ల వికీపీడియాలోని ఒక జాబితాని తెలుగులోకి మార్చి, రాబోవు ఈ వారం వ్యాసాల చర్చ పేజీలకు కేశవ శంకర్ పిళ్ళై,తుర్లపాటి కుటుంబరావు, లాల్ బహాదుర్ శాస్త్రి,కాళోజీ నారాయణరావు జత చేశాను. ఆసక్తి గల సభ్యుల ఈ చర్చలలో పాల్గొని వ్యాసాల్ని అభివృద్ధిచేయవలసింది.--అర్జున (చర్చ) 11:05, 9 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, విశేష/ఈవారం వ్యాసాల ప్రమాణాలు మరింత విస్తృతంగా మరింత సమగ్రంగా ఉంటాయి. మన వ్యాసాల ప్రస్తుత నాణ్యత, మనకున్న పరిమిత వనరుల దృష్ట్యా, మన వ్యాసాలు ముందుగా "మంచి వ్యాసాల" ప్రమాణాలను అందుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 01:58, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి స్పందనకు ధన్యవాదాలు. దీనిలోని విభాగాలలో కొన్ని కుదించవచ్చు. ఈ చిట్టా పూర్తిగా వాడాలి అనే ఆంక్ష లేకుండా వాడితే కొన్నాళ్లకు విశేష వ్యాసాల స్థాయికి చేరుకోవచ్చు అని నా అభిప్రాయం. మొదట సభ్యులు కొంత సమయం సమిష్టిగా వ్యాసం మెరుగు చేయటానికి కృషి చేయటం చాలా ముఖ్యం. అలా కొన్నాళ్లు పోయిన తర్వాత జాబితా ని కుదించవచ్చు. అలాకాకుండా మీరు మీ ప్రాజెక్టు టైగర్ అనుభవాన్ని బట్టి వేరే జాబితాని ప్రతిపాదించినా మంచిదే.--అర్జున (చర్చ) 05:59, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, "మొదట సభ్యులు కొంత సమయం సమిష్టిగా వ్యాసం మెరుగు చేయటానికి కృషి చేయటం చాలా ముఖ్యం." ఈ విషయంలో నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. ప్రస్తుతానికి "విశేష" వ్యాసాల కోసం కాకుండా "మంచి" వ్యాసాల కోసం ఒక ప్రమాణాల జాబితా చేసుకుందామనే నా ఉద్దేశం కూడాను. వాడుకరి:Pavan santhosh.s గారు మొదలు పెట్టిన వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు పేజీ చూడండి. అక్కడ మీ ఆలోచనలను చేర్చండి. సముదాయం అభిప్రాయాలు తీసుకొన్న తరువాత వ్యాసాల మెరుగుదలకు పని మొదలు పెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:12, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి ప్రమాణాలు పేజీ బాగానేవుంది. దానికి తగ్గట్టుగా నాణ్యత తనిఖీ జాబితాని కుదించి వాడుకోవచ్చు.--అర్జున (చర్చ) 03:52, 11 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Global preferences are available

[మార్చు]

19:20, 10 జూలై 2018 (UTC)

విశ్వసనీయ మూలాలు

[మార్చు]

వికీపీడియా మౌలిక నియమాల్లో ఒకటైన మూలాలను ఉదహరించడం అనే విషయమై కొత్తవారికి తెలియజేసేందుకు పవన్ సంతోష్ గారు వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు అనే ఒక వ్యాసాన్ని తయారుచేసారు. వాడుకరులంతా దీన్ని చూసి అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే దాని చర్చాపేజీలో తెలుపగలరు. __చదువరి (చర్చరచనలు) 07:26, 13 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు, రవిచంద్ర, స్వరలాసిక, మీనాగాయత్రి, ప్రణయ్ రాజ్ గార్లు, ఇంకా నేను ప్రస్తావించడం మరచిపోయిన ఇతర వికీపీడియన్లు దయచేసి ఈ పేజీ సందర్శించి తమ తమ అభిప్రాయాలు, పరిశీలనలు చెప్పాలని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:43, 15 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, పరిశీలించి నా అభిప్రాయాలు తెలియజేస్తాను. రవిచంద్ర (చర్చ) 05:02, 16 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, గారూ వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు వ్యాసం పరిశీలించటమైనది.ఏ కోణం నుండి పరిశీలించినా మార్గదర్శాకాలు బాగున్నాయి.--యర్రా రామారావు (చర్చ) 06:17, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు పై చర్చ

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ మార్పులు, చేర్పులు ఇప్పటికి పాత జిల్లాలైన కరీంనగర్,వరంగల్,ఖమ్మం,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల నందు పూర్తి చేయబడినవి.మిగిలిన జిల్లాల పని జరుగుతుంది. పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం మండలాలలోని గ్రామాలు మూసల సవరించగా రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు (అనుబంధ గ్రామాలు/శివారు గ్రామాలు/గ్రామ పంచాయతీలు ఏవైనా కావచ్చు) కొన్ని గ్రామాలు పక్కనపెట్ట వలసి వచ్చింది.వీటిలో చాలా వరకు ఏక వ్యాక్యంతో కొన్ని,కొద్దిపాటి సమాచారంతో కొన్ని ఉన్నాయి.వాటికి భారత జనగణన డేటా కూడా లేదు.ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలుకు ఎటువంటి ఆధారాలు లేనందున పునర్య్వస్థీకరణ తరువాత అసలు ఆ గ్రామం ఏ జిల్లాలోని ఏమండల పరిధిలోకి చెందిందో కొన్ని గ్రామాలకు తెలుసుకోవటం క్లిష్టతరంగా ఉంది.కొన్ని గ్రామాల నిర్థారించవలసిన గ్రామాలు వర్గంలో చేరాయి.కొన్ని గ్రామాలు ఎందుకైనా మంచిదని ఒక జాబితాగా పొందుపర్చబడ్డాయి. అయితే నాకు తోచిన ఆలోచన ప్రకారం ఆ వ్యాసంలో ఉన్న సమాచారాన్ని బట్టి అది ఏమండలానికి చెందిందో ఆ మండల వ్యాసంలో “మండలంలోని గ్రామాలు” విభాగం దిగువ “రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు” లేదా “రెవెన్యూ గ్రామాలు కాని అనుబంధ, శివారు గ్రామాలు” అనే విభాగంలో చూపితే ఎలా ఉంటుందనేది నా అభిప్రాయం. మాదిరి వ్యాసం ఇక్కడ చూడండి.ఈ గ్రామాలు మూసలో కనపడవు.ఈగ్రామాలకు మండలంలోని గ్రామాలు మూసలు తగిలించినా,మూసలో చేర్చినా, పలానా జిల్లాలోని గ్రామాలు అనే వర్గం చేర్చినా ప్రభుత్వ ఉత్తర్వులు లోని గ్రామాలుకు సంఖ్యాపరంగా తేడా కనపడుతుంది. రెవెన్యూ గ్రామాలకు ఇక అర్థం లేదు. పరిశీలన నిమిత్తం.

కరీంనగర్ జిల్లా పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా-భౌగోళికం/జిల్లాల వారి సమీక్ష (కరీంనగర్ జిల్లా సమీక్ష చూడండి.) ఈ గ్రామాలను కాకపోతే ” ------- జిల్లా రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు” అనే వర్గంలో చూపవచ్చు. సంబందిత జిల్లా ప్రభుత్వ ఉత్తర్వులు PDF లంకె మండల వ్యాసంలో,జిల్లా వ్యాసంలో ఇవ్యటం జరుగుతుంది. ఈ విషయంపై చర్చించగలరు--యర్రా రామారావు (చర్చ) 07:02, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, గ్రామ వ్యాసాల్లో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. "ఆ వ్యాసంలో ఉన్న సమాచారాన్ని బట్టి అది ఏమండలానికి చెందిందో ఆ మండల వ్యాసంలో “మండలంలోని గ్రామాలు” విభాగం దిగువ “రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు” లేదా “రెవెన్యూ గ్రామాలు కాని అనుబంధ, శివారు గ్రామాలు” అనే విభాగంలో చూపితే ఎలా ఉంటుందనేది నా అభిప్రాయం." అలా చూపితే బాగానే ఉంటుంది. ఏ మండలానికి చెందుతుందో తెలియని గ్రామాల పేజీల విషయంలో నా అభిప్రాయం ఇది:
  • ఆ పేజీలో సమాచారం ఏమీ లేకపోతే, దాన్ని తొలగించాలి.
  • ఆ పేజీలో అర్థవంతమైన సమాచారం ఉంటే, ఆ పేజీని ఒక ప్రత్యేక వర్గంలోకి చేర్చి ఉంచెయ్యాలి.
__చదువరి (చర్చరచనలు) 10:38, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 10:49, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వంటలు, పాటల వ్యాసాలు

[మార్చు]

వికీపీడియాలో అవసరమైన సరుకులు, తయారుచేయు విధానం వగైరాలతో కూడిన వంటల పేజీలు, పాట సాహిత్యాన్ని యథాతథంగా రాసిన పాటల పేజీలు ఉన్నాయి. వికీపీడియా విధానం ప్రకారం ఇవి ఉండదగ్గ వ్యాసాలు కావు. బహుశా వికీపీడియా విధానం గురించి అవగాహన లేని రోజుల్లో రాసినవి అయి ఉంటాయి. వీటిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది వంటల గురించి పాటల గురించీ ఉన్న వ్యాసాలను ఉద్దేశించినది కాదు. __చదువరి (చర్చరచనలు) 10:56, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసరూపంలో లేవు కనుక తప్పకుండా తొలగించడం మంచిదే.JVRKPRASAD (చర్చ) 12:25, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
* నేను సృష్టించిన "పాట వ్యాసాల"ను తొలగించాను.--స్వరలాసిక (చర్చ) 15:06, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
యదాతథంగా రాసిన పాటల వ్యాసాలను తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 15:59, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ! పనస పొట్టు కూర అన్న వ్యాసం చూడండి. దీనిలో కూర గురించి సమాచారంతో పాటు, ఎలా వండాలో కూడా రాశాను. మీరన్నట్టు వికీపీడియాకు వచ్చిన తొలినాళ్ళలోనే. పొట్టుకొట్టే పద్ధతి ఫోటోలు చేర్చాను. ఉదాహరణతో మాట్లాడుకుంటే మరింత స్పష్టంగా అర్థం అవుతుంది కాబట్టి ఈ వ్యాసం ఉండదగినదేనా? లేదంటే ఏ మార్పులు చేయాలి? --పవన్ సంతోష్ (చర్చ) 02:41, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, వంటకం గురించి రాస్తే వ్యాసాన్ని తొలగించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. తయారుచేయు విధానం తీసేస్తే సరిపోతుంది. కేవలం వంటకాన్ని తయారు చేయడం మాత్రమే రాసిన వ్యాసాలను తొలగించవచ్చని అనుకుంటున్నాను. పనస పొట్టు కూర చర్చ పేజీలో నా అభిప్రాయం రాసాను, చూడగలరు. __చదువరి (చర్చరచనలు) 04:53, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాలు, కృతక భాష - సముదాయం చర్యలు

[మార్చు]

గూగుల్ అనువాద పరికరాన్ని ఉపయోగించి వికీపీడియాలోకి వచ్చిపడిన వేలాది వ్యాసాలు ఇంకా శుద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిని ఏం చెయ్యాలి అనే విషయమై గతంలో చర్చలు జరిగాయి -ఇక్కడ, ఇక్కడా. పై చర్చల్లో ఎక్కువమంది ఈ వ్యాసాలను తొలగించాలని అభిప్రాయపడినప్పటికీ, కొందరు వాటిని శుద్ధి చేద్దామని భావించారు. శుద్ధి చెయ్యదగ్గ వ్యాసాలను, తొలగించాల్సిన వ్యాసాలనూ గుర్తించే పని కూడా రెండు విడతలుగా జరిగింది. ఈ రెండు విడతల్లోనూ 62 పేజీలను తొలగించాం. 66 వ్యాసాలను శుద్ధి చెయ్యదగ్గవిగా గుర్తించాం. గుర్తించామంతే! వీటిలో ఎన్ని శుద్ధికి నోచుకున్నాయో నాకు తెలీదు గానీ, బహు కొద్దిగా మాత్రమే ఉండవచ్చు. ఇవి కాక, ఇంకా పరిశీలించాల్సిన వ్యాసాలే 1825 ఉన్నాయి.

పైన ఉదహరించిన రెండో చర్చ జరిగిన రెండేళ్ళ తరువాత మన పురోగతి ఇది. ఈ ప్రగతిని, తెవికీకి ఉన్న వాడుకరుల సంఖ్యనూ గణనలోకి తీసుకుంటే ఈ కృతక అనువాద వ్యాసాలను సంస్కరించడం మన తరం కాదు, మన తరంలో కాదు అనేది నా అభిప్రాయం. పదాలను అడ్డగోలుగా కూర్చడంతో ఏర్పడిన అర్థం పర్థం లేని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాలను ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఎక్కువ చేటు వికీపీడియాకు. వీటిని తక్షణమే తొలగించాలి అనే నా అభిప్రాయాన్ని మరోసారి మీ ముందుకు తెస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 16:44, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాదవ్యాసాలను శుద్ధి చేయడం కంటే తొలగించడం మంచిది.చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. వాటిని తొలగించి మనం వ్రాయాలనుకున్న వ్యాసాలను ప్రత్యేకంగా వ్రాయడమే మంచిది. ఇవి తెవికీ పేరుకు భగం కలిగించచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.T.sujatha (చర్చ) 18:56, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించడమే ఉత్తమం.మనకు రెగ్యులరుగా రాసేవారు చాలా తక్కువ.కావున వాటిని శుద్ధిచెయ్యటం అనుకున్నంత సులభంకాదు.కావున వాటిని తొలగించడంమేలు.పాలగిరి‌Palagiri (చర్చ) 02:19, 20 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో జరిగిన చర్చల్లో ఈ వ్యాసాలను తొలగించాలని దాదాపుగా అందరూ అభిప్రాయపడ్డారు. మళ్ళీ చర్చ ఏంటి అని అనుకుంటూండవచ్చు. కానీ అప్పట్లో తొలగింపును ఇద్దరు వ్యతిరేకించారు కాబట్టి సముదాయం తొలగింపుపై ముందడుగు వెయ్యలేకపోయింది. తొలగించడాన్ని వ్యతిరేకించిన వాడుకరి:Meena gayathri.s గారు వాడుకరి:Rajasekhar1961 గారు స్పందించి తమ ప్రస్తుత అభిప్రాయం చెబితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 01:23, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చల్లో నేను ఏమి అభిప్రాయం చెప్పానో తెలియదు. కానీ నాకున్న సమయాభావం వల్ల శుద్ధి కార్యక్రమంలో పాల్గొనలేకపోవచ్చు. తొలగించడమే మేలు. తొలగింపు కార్యక్రమాల్లో పాల్గొనగలను. -రవిచంద్ర (చర్చ) 18:59, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
యాంత్రికానువాదాలే కాదు, మక్కికి మక్కి అనువాదాలు కూడా అనవసరం. మన తెలుగు పాఠకుల దృష్టితో మనం రచించుకోవాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:51, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరులు ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, యాంత్రికానువాద వ్యాసాలను తొలగించాలని నిర్ణయించడమైనది. పవన్ సంతోష్ గారు అయా వ్యాసాలను ఎంచి పక్కన పెట్టి సరేనన్న తరువాత తొలగింపులు చెయ్యవచ్చు.__చదువరి (చర్చరచనలు) 06:53, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ పైన చెప్పిన విధంగా, వాటిని ఎర్రలింకులుగా చేసి, పక్కన ఆ వ్యాసం ఆంగ్ల పేజిని లింకు ఇస్తే వాటిని తిరిగి రాయడానికి వీలుగా ఉంటుంది.--Meena gayathri.s (చర్చ) 09:05, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తోచినవి, యాంత్రికానువాదం తీసేసి మళ్ళీ మొదలు పెడుతున్నాను. రవిచంద్ర (చర్చ) 09:52, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గూగుల్ అనువాద వ్యాసాలు బాగుండటం లేదు. వాటిని శుద్ధి చేసే కంటె కొత్త వ్యాసాలు రాయడమే ఉత్తమం అని నేను లోగడ ఒక అభిప్రాయం వెలిబుచ్చేను. గూగుల్ అనువాద వ్యాసాలకి ఉంటే గింటే ఒక్క ప్రయోజనం ఉన్నట్లు కనిపిస్తున్నాది. ఫలానా వ్యాసాన్ని తెలుగులోకి గూగుల్ ద్వారా అనువాదం చెయ్యాలనే నిర్ణయం ఎలా జరుగుతోంది? ఫలానా అంశం అనువదించాలనే నిర్ణయం కేవలం యాదృచ్చికమా? లేక తార్కికమైన పద్ధతి ఉందా? ఉంటే, ఆ నిర్ణయించే పద్ధతి ప్రకారం మనమే అంశాలని ఎన్నుకొని సరి కొత్త వ్యాసాలు రాసుకుంటే సరిపోతుంది. Vemurione (చర్చ) 16:09, 10 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్రోద్యమ చరిత్ర వ్యాసాలు అభివృద్ధికి సమిష్టి కృషి ప్రతిపాదన

[మార్చు]

భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రకు సంబంధించిన వ్యాసాలు (1858 నుంచి 1947 లేక 1950 వరకూ) ఈ ఆగస్టులో సమిష్టి కృషితో అభివృద్ధి చేసేలా ఏదైనా కార్యక్రమం రూపొందించాలన్న ఆలోచన సముదాయం ముందు ఉంచుతున్నాను. దీనికి ప్రాతిపదిక ఏమిటంటే-

  1. అత్యధిక ప్రయోజనం: భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర అన్నది చాలా పోటీ పరీక్షల్లో ఒక కీలకమైన అంశం. పోటీ పరీక్షల విద్యార్థులు తెలుగులో చదువుతున్నారు, ఈ కోణంలో విజ్ఞానాభివృద్ధి వారికి లాభం కలిగించగలిగే నాణ్యతతో మనం సృష్టిస్తే కాక ప్రయత్నానికి ఎంతో సార్థకత కలుగుతుంది. ఈ అంశాన్ని అజ్ఞాత వాడుకరి ఇటీవల, పలువురు వాడుకరులు గతంలోనూ ఇప్పటికే ప్రస్తావించడం సముదాయానికి విదితమే. మూస:భారత స్వాతంత్ర్యోద్యమం పరిశీలిస్తే చాలా వ్యాసాలు సృష్టించాల్సిన అవసరం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అత్యంత కీలక ఘట్టాల వ్యాసాలను పైపైన చూసినా చాలా విస్తరణకు ఆస్కారం కనిపిస్తోంది.
  2. సమిష్టి కృషి పెంపు: సమిష్టి కృషి ఆవశ్యకత, తెలుగు వికీపీడియాలో లోపిస్తున్న తీరును గమనిస్తూ మన వాడుకరి వాడుకరి:Arjunaraoc ఇటీవల పరిశీలనలు వెలువరించారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిశోధనల్లో ఎక్కువమంది పనిచేస్తున్న వ్యాసాలు ఎక్కువ నాణ్యతతో ఉన్నాయన్న విషయమూ తేలింది, పైగా అది ఎందరో వికీపీడియన్ల స్వానుభవంలోనూ ఉన్న సంగతే. అందరూ ఒక సమిష్టి అంశంపై ఒకరికొకరు మూలాల విషయంలో తోడ్పడుతూ, ఒకరు సృష్టించి, విస్తరిస్తున్నదానిలో మరొకరు సూచనలు చేస్తూ, దిద్దుబాటు చేస్తూండే సంస్కృతికి చేయూతనివ్వడం మేలన్నది ఈ పరిశీలనల నుంచి వస్తున్న ఒక సూటి సూచన.

కనుక దయచేసి తమ అభిప్రాయాలు చెప్పగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 08:12, 20 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమష్టి కృషితో వ్యాసాలను అభివృద్ధి చెయ్యాలనే విషయంలో నాకేమీ భేదాభిప్రాయం లేదు. కానీ, పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు ఉపయోగపడేలా వ్యాసాలను తయారు చెయ్యడమనే విషయమై కొంత అభ్యంతరం ఉంది. వికీపీడియా విజ్ఞాన వనరులలో ఒకటి కావచ్చేమో గానీ, ప్రామాణికమైనది, విశ్వసనీయమైనదీ కాదు. ఇక్కడ అనేక తప్పులు జరుగుతూంటాయి. కావాలని తప్పులు చేరుస్తూంటారు. గత రాత్రే నేను ఒక పేజీలో ఒక ఐపీఅడ్రసు చేసిన దుశ్చర్య చూసాను.. 260 అనే అంకెను 240 అని మార్చారు. మీడియావికీ ఒక అద్భుతమైన సాఫ్టువేరు కాబట్టి, ఇలాంటివన్నీ మన దృష్టికి వస్తున్నై, ఎంతో కొంత సరిదిద్దగలుగుతున్నాం. సముదాయం అలాంటి తప్పులను, దుశ్చర్యలనూ గమనించకపోతే, అవి అలాగే ఉండిపోతాయి. దుశ్చర్యలే కాకుండా, వ్యాసాల్లో మామూలు మార్పుచేర్పులు కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి (జరగాలి కూడా). మరో సంగతి -నిపుణులు రాసిన వ్యాసాలు కావివి. అంచేత వీటిని విద్యార్థులకు సూచించలేం. కానీ, వ్యాసాలను వీలైనంత ఉత్తమ స్థాయికి తీసుకుపోయేందుకు ఇవేవీ మనకు అడ్డం కాదు. అంచేత..
సమష్టిగా వ్యాసాలను అభివృద్ధి చేద్దామనే విషయమై నాకేమీ అభ్యంతరం లేదు. నేనూ పాల్గొనడానికి సిద్ధం. __చదువరి (చర్చరచనలు) 01:49, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సమిష్టి కృషిలో పాల్గొనడానికే నేను సిద్ధమే. రవిచంద్ర (చర్చ) 19:02, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా ముఖ్యమైన పనే, కాని నిపుణతతో చేయాల్సిన పని. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:49, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశాలు

[మార్చు]

నమస్కారం. గత కొన్ని నెలలుగా తెవికీ సమావేశాలు జరగలేదు. రవీంద్రభారతిలో ఏర్పాటుచేసుకోవడానికి మామిడి హరికృష్ణ గారు అంగీకరించారు కాబట్టి ముందస్తు సమావేశంగా ఈ నెల నాలుగవ ఆదివారం (జూలై 22)నాడు వికీపీడియన్లంతా ఒకసారి కలిసి చర్చించుకుందాం అనుకున్నాం. అయితే, ఆ రోజు రవీంద్రభారతిలో జరిగే దాశరథి జయంతి కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రి భద్రత కారణాల దృష్ట్యా వికీపీడియన్ల కలయికకు అంతరాయం కలగవచ్చు. అందుచేత, మంగళవారం (24) నాడు సాయంత్రం కలిసి చిన్నపాటి చర్చ జరుపుకుందామని, వచ్చేనెల నుండి ప్రతనెల ఒక ఆదివారం నాడు పూర్తిస్థాయి సమావేశాలను నిర్వహించుకుందామని నా అభిప్రాయం, సభ్యులు స్పందించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:39, 20 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండలో జరిగుతున్న చర్చలను - మనం రాస్తున్నదానికి పక్కనే ఉన్న చర్చలను- పట్టించుకునే దిక్కు లేదు గానీ, ఎక్కడో ఒకచోటకు వెళ్ళి, కలిసి మాట్టాడుకోవడమనేది అత్యాశ ప్రణయ్ రాజ్ గారూ. __చదువరి (చర్చరచనలు) 01:55, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలని కాకుండా సముదాయ సభ్యులకు ఉపకరించే విషయాలపై శిక్షణలు కూడా చేయవచ్చు కద చదువరి గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 17:38, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, తప్పకుండా చెయ్యవచ్చు నండి. వ్యక్తులు కలిసి ముఖాముఖి మాట్టాడుకోడానికి నేను ఎప్పుడూ సుముఖంగానే ఉంటాను. మీరు నేనూ వికీ బయట చేసిన కొన్ని చర్చలు ఎలా ఫలవంతమయ్యాయో/అవుతున్నాయో మనిద్దరికీ తెలుసు. __చదువరి (చర్చరచనలు) 02:46, 22 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రేపు సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో సభ్యుల ముఖాముఖి కలయిక ఉంటుంది. అందుబాటులో ఉన్న సభ్యులు రాగలరని మనవి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:19, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అరుణిమ సిన్హా సంక్షిప్త వ్యాసం - ఒక పరిశీలన

[మార్చు]

తెవికీ అనగానే సామాన్య పాఠకుల దృష్టిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కాపీపేస్టుల రూపంలో అతికించినదేననే భావన విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అసలు ఉన్న సమాచారాన్నే మనం ఇక్కడ చేర్చాలనేది నిజమే, లేని సమాచారాన్ని మనం చేర్చడానికి అవకాశమే లేదు. అయినా తెవికీ వ్యాసాలనేవి "కాపీపేస్టు"ల రూపంలో కాకుండా లభ్యమయ్యే సమాచారాన్ని విశ్లేషించి క్రమరూపంలో వాక్యాలను చేరుస్తూ ఆధారాలు జతచేస్తూ ఉంటే బాగుంటుంది. సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం ఈ విధంగానే వ్యాసాలు చూడముచ్చటగా (చదవముచ్చటగా) తయారయ్యేవి. అప్పుడు తెవికీకి పాఠకులు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అప్పట్లో సమాచారాన్ని చేర్చే సభ్యులు కూడా కేవలం పాఠకుల దృష్టితో ఆలోచించి చదవముచ్చటైన వ్యాసాలు తయారుచేసేవారు. సభ్యులలో ప్రతిఒక్కరికీ అన్ని విషయాలలో విషయపరిజ్ఞానం ఉండకపోవచ్చు కాబట్టి ఒకరు రచించిన వ్యాసాలను విషయపరిజ్ఞానమున్న సభ్యులు మార్పులుచేర్పులు చేసి తెవికీ ప్రమాణాలకనుగుణంగా తయారుచేసేవారు. క్రమక్రమంగా సభ్యులలో మార్పువచ్చి (ముఖ్యంగా కొత్త సభ్యులు) తాము రచించిన వ్యాసాలలో ఇతర సభ్యుల మార్పులను సహించని స్థాయికి రావడం, పొరపాట్లు లేవదీసిన సభ్యులను పట్టించకపోవడం, సూచనలు చేసే సభ్యులను ఖాతరుచేయకపోవడం, తామురాసిందే వేదంగా భావించి నిర్వాహకులు సూచించే నిబంధనలే కాకుండా తెవికీ మూలనిబంధనలకే ఉల్లంఘనలు జరపడం, చివరికి తెవికీ నాణ్యత దారుణంగా పడిపోవడం, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే సభ్యులు తెవికీకి దూరంకావడం జరిగింది. మొదటిపేజీలో ప్రదర్శనకు ఉంచిన వ్యాసాలు, మీకుతెలుసా? విషయాలలోనే పలు తప్పులున్నట్లు అప్పుడప్పుడు చూసిననూ చేయలేని మరియు చెప్పలేని పరిస్థితి రావడం బాధాకరం. నేను ఇప్పుడే చూసిన మొదటిపేజీ ప్రదర్శనలోని అరుణిమసిన్హా సంక్షిప్త వ్యాసం చదివిన తర్వాత అందులోని 12 వాక్యాలలో 6 పొరపాట్లు ఉండటం బాధకలిగించింది.
1) సంక్షిప్త వ్యాసం 3వ వాక్యంలో "మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు" అని ఉంది (వ్యాసంలో ఈ వాక్యానికి ఆధారం కూడా జతచేశారు - నేను ఇప్పుడే సరిచేశాను). కాని ఈమె ఎవరెస్టును అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తి కాదు (ఈ ఘనత బచేంద్రీపాల్‌కు దక్కింది). అంతేకాకుండా వ్యాసం 1వ వాక్యానికి, 3వ వాక్యం భిన్నంగా ఉంది.
2) "ఇరవై ఐదు సంవత్సరాల సిన్హా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు చేరుకున్నారు" అని బదులు 25 సం.ల వయసులో అని రావాలి. (ఎందుకంటే వ్యాసంలోని ఇన్ఫోబాక్సులో ఈమె వయసు ఇప్పటికే 30 అని సూచిస్తోంది). ఆ వాక్యం ఐదేళ్ల క్రితం పత్రికలో వచ్చింది కాని తెవికీలో ఇప్పటికీ అలానే ఉండటం (ఉంచేయడం) బాగుండదు.
3) "గత ఏడాదిలో ఉత్తరకాశీలోని టాటా స్టీల్‌ అడ్వంచెర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్ ) లో అరుణిమా సిన్హా చేరారు" అని ఉంది. గతఏడాది అంటే? సాధారణంగా పత్రికలు, మేగజైన్లు ఇలా వ్రాస్తాయి కాని శాశ్వత ప్రాతిపదికన ఉండే తెవికీలో ఈ విధానం బాగుండదు. ఖచ్చితంగా సం. సూచించాలి.
4) "నా కలలు ఇక ఎప్పుడూ నెరవేరవు అని ఆమె గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు" వాక్యంలో గురువారం అంటే ఏ గురువారం? అసలు ఇలాంటి వాక్యాలు తెవికీలో చేర్చకపోవడం ఉత్తమం.
5) మొదటినుంచి రెండో వాక్యంలో కుడికాలు పోగొట్టుకున్నట్లు, చివరి నుంచి రెండో వాక్యంలో ఎడమకాలు దెబ్బతిన్నట్లుగా ఉంది. అసలు ఏ కాలు పోయిందో పాఠకులకు తికమక కలిగించేదిగా ఉంది.
6) "ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు" వాక్యం మరీ బాధాకరంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే ఆమె కోలుకొని పర్వతాలు అధిరోహించి చరిత్ర సృష్టించింది. కాని మనం ఆమెను ఇంకా ఆసుపత్రిలోనే ఉంచేశాం!!
ప్రధాన వ్యాసాన్ని పరిశీలిస్తే మరో 3 పొరపాట్లు కూడా ఉన్నట్లు గమనించాను (కొన్నింటిని నేనిప్పుడే సవరించాను). చిన్న వ్యాసంలోనే ఇన్ని పొరపాట్లు ఉన్నాయంటే పెద్ద వ్యాసాలలో ఎన్ని పొరపాట్లు ఉండాలి ? గతంలో ఒక దేశానికి చెందిన అనువాద వ్యాసంలో వంద తప్పులు తీశాను (అక్షరదోషాలు లాంటివి కావు, ఖచ్చితమైన తప్పులే). ఒంటిచేతితో మొదటిపేజీ శీర్షికను నిర్వహిస్తున్న నిర్వాహకుడిని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు కాని తెవికీ వ్యాసాలలో తప్పులు దొర్లకుండా చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:34, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారూ మీరు ప్రస్తావిస్తున్న తెవికీ స్వర్ణయుగం (మీ వర్ణనను బట్టి అలా పిలవవచ్చునేమో అని సాహసించాను) కాలంలో నేను లేనందుకు కించిత్ బాధగా ఉన్నా, మరో స్వర్ణయుగాన్ని సృష్టించుకోగలమన్న నమ్మకం దృఢతరమవుతూండగా నా ఉత్సాహంలో పడి ఆ బాధ కొట్టుకుపోతోంది. అటువంటి స్వర్ణయుగాన్ని సృష్టించుకోవాలంటే అందుకు తగ్గ సంస్కృతిని నిర్మించాలన్నది నిర్వివాదాంశం. దిద్దుబాట్ల సంఖ్యకు బదులు ఎన్ని వ్యాసాలను మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయగలిగామన్న మెట్రిక్ ఉండడం తొలి మెట్టు అని భావించి, మంచి వ్యాసం ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా మంచుమనిషి వ్యాసాన్ని వ్యాసకర్త చదువరి ప్రతిపాదించగా, నేను సమీక్షక బాధ్యత స్వీకరించి ఈ సమీక్ష చేస్తున్నాను. (రెండవ అభిప్రాయం కోరుతున్నందున ఆసక్తి కల సభ్యులు తమ అభిప్రాయం రాయవచ్చు) ఇది పూర్తైతే, నాణ్యతపై దృష్టి ఉన్నవారందరం ఇంతవరకూ రాసిన వ్యాసాల్లో ఉత్తమమైనవి ఎంచుకుని, తగు మార్పుచేర్పులు చేసి ప్రతిపాదించి కనీసం ఓ పది మంచి వ్యాసాల సమీక్ష పూర్తిచేసుకోవచ్చనీ, తర్వాత సభ్యులందరినీ క్రమేపీ ఈ ప్రయత్నం వైపుకు ప్రోత్సహించడం, వారికి నేర్పించడం చేయాలనీ ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:03, 22 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత రావు గారు చెప్పినవి మనమందరం దృష్టిలో పెట్టుకోవాలి. నిర్వహకులు అందరూ దీనిని గమనిస్తూ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. సాధ్యమైనంతలో ఇలాంటి విషయాలు సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను. రవిచంద్ర (చర్చ) 13:25, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్జన గ్రామాల తయారీ సరికాదు

[మార్చు]

ఇటీవల మన సహసభ్యుడు వాడుకరి:Nrgullapalli, గతంలో పలువురు వికీపీడియన్లు కూడా మండలాలలో గ్రామాల జాబితాలో ఉన్న ఎర్ర లింకులపై నొక్కి కొత్త గ్రామాల వ్యాసాలు సృష్టించడం చూశాను. వారు సదుద్దేశంతోనే సృష్టిస్తున్నారు, ఐతే ఇక్కడొక ధర్మసూక్ష్మం (నిజానికి పరిపాలనా సూక్ష్మం) ఉంది
మనం 2006లో బాట్‌తో సృష్టించినవీ, భారత జనగణన జరిగేదీ రెవెన్యూ గ్రామం మౌలిక యూనిట్‌గా తీసుకుని. అంటే రెవెన్యూ గ్రామాల్లో జనగణన చేసి, ఇదిగో సమాచారం అని ప్రభుత్వం ఇస్తుందన్న మాట. ఐతే ఈ రెవెన్యూ గ్రామం అన్నది బ్రిటీష్ కాలం నాడు పన్నులు స్వీకరించడానికి వారికి సౌలభ్యంగా ఉండేందుకు తయారుచేసిన యూనిట్. ఈ రెవెన్యూ గ్రామంలో పలు శివారు గ్రామాలు ఉంటాయి, ఈ శివారు గ్రామాల్లో కొన్ని పంచాయితీ హోదా కూడా ఉన్న గ్రామాలు, కొన్ని అసలు గ్రామం కన్నా పెద్దవి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారేమో, ఆ విషయానికే వస్తే:

  • నిర్జన గ్రామాలు: రెవెన్యూ గ్రామాలు కొన్నిటిలో పదుల ఏళ్ళు గడిచిపోయిన ఈ స్థితిలో పలు కారణాలతో (ముంపు వల్ల వలసలు, కరువు వల్ల వలసలు, చుట్టుపక్కల వేరే పెద్ద గ్రామం ఏర్పడడం, వగైరాలు ఎన్నైనా ఉండొచ్చు) జనం లేచి వెళ్ళిపోయారు. రెవెన్యూ వ్యవస్థకు అవసరమైన పన్నులు ఇచ్చే పంటలు, చెరువులు అక్కడ ఉన్నాయి కదా అందుకే ఆ రెవెన్యూ గ్రామంలో జనం లేకపోయినా వ్యవస్థలో కొనసాగుతోంది. ఈ సూక్ష్మాంశాలను పట్టించుకోకో, తెలిసినా సరేలెమ్మని వదిలేసో భారత జనగణన వారు ఆ గ్రామాన్ని కూడా తమ లెక్కల్లో పెట్టుకుంటున్నారు. కాకపోతే సమాచారం ఖాళీగా ఉంటుంది. రెవెన్యూ వారి, జనగణన వారి లెక్కల కోసం మాత్రమే ఉన్న ఈ ఖాళీ ఊళ్ళు జనగణన జాబితా ద్వారా తయారుచేసిన మండలాలలో గ్రామాల జాబితాలోకి ఎక్కాయి. (పంచాయితీ, తండా గ్రామాల గురించి మాట్లాడట్లేదు. అవి రెవెన్యూ, జనగణన గుర్తించని, జనమున్న ఊళ్ళు. ఇవి జనం లేని రెవెన్యూ వ్యసవ్థ కోసమే ఉన్న ఊళ్ళు)
  • ఏం చేయవచ్చు: నా అభిప్రాయం ప్రకారం, మనుషులు లేని ఊళ్ళకు సంబంధించి మహా అయితే రెవెన్యూ లెక్కలే ఉంటాయి, విజ్ఞానదాయకమైనవీ, జనం తెలుసుకోదగ్గవి అక్కడ ఏమీ ఉండవు. మనుషులు లేని ఊళ్ళకు వ్యాసాలను మనం సృష్టించరాదు, సృష్టించితే చేర్చేందుకు సమాచారం కానీ, చదివేందుకు మనుషులు కానీ లేరు కాబట్టి. కాబట్టి ఆ గ్రామాల వ్యాసాలు ఇప్పటివరకూ తయారైనవి తీసేయాలి. సృష్టించినవారి పొరబాటు ఏమీ లేదనే తలుస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఈ వివరాలు తెలిసివుండవకపోవచ్చు కాబట్టి. అలానే భవిష్యత్తులో మరెవరూ సృష్టించే వీలు లేకుండా మండలం పేజీలో గ్రామాల జాబితాలోకి వెళ్ళి, సదరు గ్రామాల పేర్లు తొలగించి, ఈ మండలంలో ఇన్ని నిర్జన రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్న ముక్క రాసి ఊరుకోవాలి.
  • ఎలా తెలుస్తుంది: ఈ గ్రామాలను గుర్తించడానికి ఉన్న ముఖ్యమైన మార్గం, జనాభా లెక్కల్లో ఏ సమాచారం లేని గ్రామాలు కావడమే. ఈ విషయంలో మరిన్ని ఆలోచనలు పంచుకోమని జనగణన సమాచారం వికీపీడియా వ్యాసాల్లోకి తేవడంలో విస్తృతంగా పనిచేసిన వాడుకరి:Chaduvari, గతంలో గ్రామ పరిపాలన వ్యవస్థలో పనిచేసిన వాడుకరి:యర్రా రామారావు, తొలినాళ్ళ నుండీ గ్రామాల వ్యాసాల్లో ఇప్పటిదాకా పనిచేస్తున్న వాడుకరి:Bhaskaranaidu, వంటివారిని కోరుతున్నాను.

ఇక సముదాయ సభ్యులు ఈ అంశంపై తమ పరిశీలను, అభిప్రాయాలు పంచుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 03:20, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల అభివద్దిపై,రెవెన్యూ గ్రామం పై సవివరమైన వ్యాసం సృష్టించి గ్రామాలలో ఉన్న తేడాలు (రకాలు) తెలిపినందుకు మీ కృషి అభినందనీయం.ధన్యావాదాలు--యర్రా రామారావు (చర్చ) 03:44, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్జన గ్రామాల చేర్పు అనవసరమని నా అభిప్రాయంPalagiri (చర్చ) 04:04, 25 జూలై 2018 (UTC):[ప్రత్యుత్తరం]
వాటికి ఒక మూస పెట్టి ఉంచడం వల్ల ఆ సమాచారం కూడా వికీలో లభ్యం ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ తక్కువ సమాచారం కలిగినా కూడా, ఎవరైనా ఆ గ్రామ సమాచారంకోసం వెదికినా దొరకగలదు అని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ)
B.K.Viswanadh గారూ! అసలు అలాంటి గ్రామం రెవెన్యూ లెక్కల్లో తప్ప బయట ఉండదండీ. ఎవరు వెతుకుతారు, అసలు లేని గ్రామాన్ని? --పవన్ సంతోష్ (చర్చ) 10:14, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:24, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్జన గ్రామాల చేర్పు అనవసరం. ఉన్నవాటిని తొలగించాలి. ప్రస్తుతం వికీలో ఎటువంటి సమాచారం లేకుండా మూలాలు లేకుండా విపరీతంగా కొత్త గ్రామవ్యాసాలను గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు సృష్టిస్తున్నారు. వికీ విధానాల ప్రకారం వాటిని వ్యాసాలుగా పరిగణించలేము. వాటిని కూడా తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 12:24, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్జన గ్రామాల్లో సమాచారం - ఇది ఫలానా మండలంలోని గ్రామం అనేది తప్ప వేరే ఏమీ ఉండదు. కొన్నిచోట్ల నీటిపారుదల సౌకర్యాల గురించి కూడా ఉంటుంది. ఇవి తప్పించి మరే సమాచారమూ ఉండదు. అసలు సమాచారమే లేని పేజీని ఉంచడం వలన ఏ ఉపయోగమూ లేదు. అయితే "అదొక నిర్జన గ్రామం అనే సంగతైనా వికీపీడియాలో ఉండాలి కదా" అంటే.. రాష్ట్రం లోని నిర్జన గ్రామాలన్నిటినీ ఒక పేజీలో జాబితాగా పెడితే సరిపోతుంది. రెండు రాష్ట్రాలకూ రెండు పేజీలు ఉంటాయి. లేదా జిల్లాకొక జాబితా పేజీ పెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:15, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  1. సహజంగా గ్రామాలు అంటే అన్నీ ఒకటే కదా? కాకపోతే నిర్జన గ్రామాలు ఉంటాయి అనుకుంటాం.నాకు తెలిసినంతవరకు గ్రామాలు దిగువ తెలిపిన ప్రకారం ఉంటాయి.
  2. రెవెన్యూ గ్రామంతో కూడిన గ్రామ పంచాయతీలు.
  3. రెవెన్యూ గ్రామం కాని గ్రామ పంచాయితీలు.(ఇవి ఇంకొక రెవెన్యూ గ్రామానికి శివారు గ్రామంగా ఉంటుంది.రెవెన్యూ లెక్కలు లావాదేవీలకు))
  4. జనాభా నివసించని గ్రామాలు (రెవెన్యూ లెక్కలలో గ్రామంగా రికార్డు ఉంటుంది.)

భారత జనన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం నూతన జిల్లాల, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు ప్రకారం గ్రామ వ్యాసాల మూసలనందు, వ్యాసలో “మండలంలోని గ్రామాలు” అనే విభాగంలో చూపినవి అన్నీ రెవెన్యూ గ్రామాలు మాత్రమే. అంటే పైన వివరించిన మొదటి కోవకు చెందినవి. నేను పై విషయసూచిక వ.సం 27 లో రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు పై చర్చలో వివరించింది ఒక్క నిర్జన గ్రామాలు ఒక్క అంశమే కాదు.రెండవ కోవకు చెందిన గ్రామాలు (రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు) ఎలా చూపాలి అనే దానిమీద నా అభిప్రాయం పైన వివరించాను.

ఆలింకులో మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలంలో 17 గ్రామ పంచాయితీలు ఉన్నవి.కానీ ప్రభుత్వ ఉత్తర్వుల GO Ms No 241 ప్రకారం 14 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.ఆ మండలంలో 14 గ్రామాలు పైన చెప్పిన 1 ప్రకారం రెవెన్యూ గ్రామంతో కూడిన గ్రామ పంచాయతీలు. అందులో వ.సం 1,2,4, సుంకురంపల్లి,తిమ్మాయపల్లి తండా,రామచంద్రాపూర్ గ్రామాలు మూడు పైన చెప్పిన 2 ప్రకారం రెవెన్యూ గ్రామం కాని గ్రామ పంచాయతీలు. ఇవి రెండు ప్రభుత్వ ఉత్తర్వులలో కనపడవు.ఇక్కడ మరియెక విషయం చెప్పాలి.అందరికి తెలిసే ఉంటుంది.సందర్బం వచ్చింది కాబట్టి వివరిస్తున్నాను.గ్రామ పంచాయితీల పరంగా పరిపాలన సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతుంది.మండల పరిషత్ అధికారుల పర్వేక్షణ ఉంటుంది.రెవెన్యూకు సంబందించిన రెవెన్యూ గ్రామాలు పరిపాలన తహశీలుదారు నియంత్రణలో పనిజరుగుతుంది. పరిశీలించి చర్చించ గలరు.--యర్రా రామారావు (చర్చ) 16:33, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ! మీరు చెప్పిన మూడు కోవల గ్రామాలతో పాటుగా పంచాయితీ, రెవెన్యూ హోదా లేని తండాలు, శివారు పల్లెలూ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించీ చర్చించి నిర్ణయం తీసుకోవాలి, నా వరకూ నా ఖచ్చితమైన అభిప్రాయం ఏమంటే - జనం నివసించే ప్రతీ గ్రామానికి పేజీ ఉండవచ్చు, జనం నివసించని దాన్ని గ్రామం అనుకుని వ్యాసం సృష్టించడం తగదు. అయితే రెవెన్యూ హోదా లేని పంచాయితీ గ్రామాలలో ఎలాంటి సమాచారం చేర్చాలి? పంచాయితీ, రెవెన్యూ హోదాల్లేని శివారు గ్రామాలకు వ్యాసం సృష్టించదగ్గ స్థాయి సమాచారం ఉంటుందా అన్న అనుబంధ ప్రశ్నలు విడిగా వేసుకుందాం. కింద ఒక విభాగం సృష్టించి వాటి గురించి విడిగా చర్చించి నిర్ణయం తీసుకుందాం. ఈ చర్చలో మాత్రం జనం లేని గ్రామాలను తెలుగు వికీపీడియాలో ఎలా ప్రతిబింబించాలి? అన్న అంశంపై పరిమితం అవుదాం అని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అలాంటి సంధర్భంలో చదువరి గారు తెలిపినట్టు ఒక పేజీలో అలాంటి గ్రామలను జాబితాగా చేసి అసలు గ్రామాలని ప్రక్కన లింక్‌గా ఇస్తే సరిపోతుంది. ఎవరికైనా అవసరం ఉన్నా దొరకవచ్చు...B.K.Viswanadh (చర్చ)
నిర్జన గ్రామాల విషయంలో చదువరి గారి అభిప్రాయం ప్రకారం జాబితాలో చేర్చి ఉన్న వ్యాసాలకు జాబితాలోనే లింకులు ఇస్తే సరిపోతుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 07:57, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్జన గ్రామవ్యాసాలు తెవికీలో ఉండరాదని ఖచ్చితంగా అనలేము. నిర్జనగ్రామానికి కారణాలు అనేక రకాలు. కొన్ని కారణాలు చరిత్రకే తెలియక పోవచ్చు మరికొన్ని ప్రకృతివైపరీత్యాలవల్ల, వలసల వల్ల జరగవచ్చు. ఇటీవలి కాలంలో నిర్మించే ప్రాజెక్టులు, భారీ జలాశయాలవల్ల కూడా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కారణమేదైనా సరే ఇప్పుడు ఆ గ్రామం లేకున్ననూ దాని చరిత్ర మాత్రం మనకుంటుంది. మనిషి మరణించాడనీ, ఇప్పుడు ఆ మనిషి లేడనీ ఒక వ్యక్తి వ్యాసాన్ని తొలగించడం లేదు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, కోటలు నాశనమైనా చరిత్రలో స్థానం ఉంది కాబట్టి ఆ వ్యాసాలూ మనం ఉంచుకున్నాం. అలానే నిర్జన గ్రామాలకు కూడా ఘనమైన చరిత్ర ఉండవచ్చు (ఉదా: మంగంపేట, బూడ్దిపాడు). కాకుంటే తగిన ఆధారాలతో తగినంత సమాచారం లభ్యమైతే తప్ప ఏకవాక్య వ్యాసాలు సృష్టించే అవసరం ఉండరాదు. కాబట్టి నిర్జన గ్రామాలన్నీ చరిత్ర లేనివనీ, వాటికి వ్యాసాలు ఉండరాదని కాకుండా ఆధారాలతో తగినంత సమాచారం ఉంటేతప్ప వ్యాసాలు సృష్టించే అవసరం ఉండరాదు, ఇప్పటికే ఉన్న తగినంత సమాచారం లేని నిర్జన గ్రామవ్యాసాల పేజీలను తొలగించవచ్చు. నిర్జన గ్రామవ్యాసాల పేజీలను తొలగించిననూ ఆయా మండలాలలోని గ్రామవ్యాసాల పట్టికలోనూ మరియు మండలాల మూసలలోనూ నిర్జనగ్రామ వ్యాసాల పేర్లు ఉంచవచ్చు కానీ లింకులు మాత్రం పెట్టే అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత రావు గారూ! ఏ నియమానికైనా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. మీరు చెప్పిన ఎక్సెప్షన్ సరైనది. ప్రస్తుతం నామమాత్రావశిష్టమైన గ్రామానికి ఉంటే చెప్పుకోదగ్గ చరిత్ర ఉంటుంది. అయితే మూలాలతో సమర్థించదగ్గ, విశేషంగా చెప్పవలసిన చరిత్ర కలిగిన కొన్ని గ్రామాలకే ఆ ఎక్సెప్షన్ వర్తిస్తుంది. ఒక ఉద్యమంలా నిర్జన గ్రామాలకు పేజీలు సృష్టించుకుంటూ పోయే ప్రయత్నం ఆపడానికి ఈ ఎక్సెప్షన్ అడ్డుపడదని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:40, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
లేనిగ్రామాల పేర్లను తొలగించడం మంచిదనుకుంటాను Nrgullapalli (చర్చ) 17:16, 30 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వివిధ కారణాల వలన నిర్జన గ్రామాలుగా ఉన్న కొన్నింటికి ఘనమైన చరిత్ర ఉండవచ్చు. కనుక అటువంటి వాటికి ఆధారాలతో తగినంత సమాచారం లభిస్తే వ్యాసంగా రాయవచ్చు. ఎటువంటి సమాచారం లేని ఏక వాక్య వ్యాసాలుగా ఉన్న/రాస్తున్న నిర్జన గ్రామాల వ్యాసాలను తొలగించి వాటిని జిల్లా/రాష్ట్రాల వారీగా జాబితాగా చేర్చితే సరిపోతుంది.--కె.వెంకటరమణచర్చ 14:12, 31 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. వెంకటరమణ గారు మొత్తం చర్చనంతా క్రోడీకరించి ఒక ఆమోదయోగ్యమైన సూచనకు తీసుకువచ్చారని భావిస్తున్నాను, కాబట్టి ఈ విషయంపై ఏకాభిప్రాయానికి అది ప్రాతిపదిక కాగలదని వ్యక్తిగతంగా భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ)

నిర్జన గ్రామాల తయారీ సరికాదనటం, సరికాదు. మరణించిన మనిషికి వికీలో పేజీ ఎందుకు? అన్నట్లుగానే భావించవలసి ఉంటుంది. కాల గమనంలో ఎన్నో ఏండ్లు నడిచి, ఎంతో మందికి జీవనాధారమై, కారణాంతరాలచే అంతర్ధానమైనంత మాత్రానా దాని చరిత్ర ముగిసిపోదు. నిర్జన గ్రామాల గురించి రాస్తే, ఎవరు చదువుతారు? అన్న ప్రశ్న కూడా అసంబద్దమే. ఎక్కువ మంది చదివే వాటిని మాత్రమే వికీలో వ్యాసాలుగా రాయాలి అన్న నిబంధన ఏమైనా ఉందో!లేదో? నాకు తెలియదు. కానీ నిర్జన గ్రామాల గురించి ఎవరు చదువుతారు? అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఉంది. ఊరు పోయినంత మాత్రానా, ఊరి జనమంతా అంతరించి పోయి ఉండరు. వారి వంశాలు ఎక్కడో ఒక చోట నివసిస్తూనే ఉంటారు. అట్లాంటి వారు ఎక్కడ ఉన్నా వారి మూలాలను వారు వెతుక్కుంటారు. వారికి అవసరం. ఎక్కడో సుదురాన ఉన్న వారికి అదొక పనికి రానిది కావొచ్చు. కాని దాని సమీప గ్రామాల వారికి దాని చరిత్ర అవసరం.

జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన మంగంపేట ఒక దశాబ్ధం కిందట అంతరించిపోయింది. కానీ ఆ ఊరికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద ఆధారపడిన ఆ గ్రామానికి చెందిన ప్రజలు పక్క గ్రామాల్లో జీవిస్తున్నారు. కృష్ణ, తుంగభద్రల సంగమ స్థల సమీపాన కూడవల్లి అని ఒక గ్రామం ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన అదీ అంతరించి పోయింది. ఆ గ్రామానికి చెందిన ప్రజలంతా దక్షిణ తెలంగాణలో దక్షిణ కాశిగా పిలువబడే అలంపూరు, దాని సమీప గ్రామాలలో నివసిస్తున్నారు. అక్కడ ఉన్న అతి పెద్ద సంగమేశ్వర దేవాలయాన్ని అలంపూరులో పునర్నిర్మించారు. దాన్ని కూడవల్లి సంగమేశ్వరాలయంగానే పిలుస్తారు. నిత్యం ఎందరో యాత్రికులకు ఆలయ పూజారులు కూడవల్లి గురించి చెబుతూనే ఉంటారు. ఆ ఊరి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాటికి వికీలో పేజీలు ఉండవు. ఉండకూడదు అని కూడా అంటారు. వికీలో ఇప్పుడున్న గ్రామాలు, వాటి పిన్ కోడ్‌లు, రోడ్లు, నీళ్ళు, మరుగుదొడ్లతో నిండిపోయిన గ్రామ వ్యాసాల కన్నా, ఇట్లాంటి ప్రత్యేక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలు రేపటి తరానికి ఎంతో అవసరమని నా భావన. --నాయుడు గారి జయన్న (చర్చ) 15:03, 5 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారూ! పైన జరిగిన చర్చ సారాంశాన్ని వెంకటరమణ గారు క్రోడీకరిస్తూ వివిధ కారణాల వలన నిర్జన గ్రామాలుగా ఉన్న కొన్నింటికి ఘనమైన చరిత్ర ఉండవచ్చు. కనుక అటువంటి వాటికి ఆధారాలతో తగినంత సమాచారం లభిస్తే వ్యాసంగా రాయవచ్చు. అన్నారు కదా. ముందు చంద్రకాంతరావు గారూ లేవనెత్తిన అభ్యంతరాన్ని (అదే అభ్యంతరం మీరూ ఇప్పుడు వ్యక్తం చేశారు) పరిగణనలోకి తీసుకున్న వాక్యం. అయితే అటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామాలను ఉంచి, మూలాలతో విస్తరించి - వందలాదిగా ఏ ఇతర సమాచారమూ లేని గ్రామాల వ్యాసాల సృష్టి, చారిత్రక ప్రసిద్ధి కూడా లేని గ్రామంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామం ఇది అన్న తరహా ఏకవాక్య వ్యాసాలను తొలగించాలనే ఈ చర్చ ముగింపుకల్లా తేలింది. కాబట్టి ఈ రెండు అంశాల్లో దేనిపైన మీ అభ్యంతరమో సూటిగా చెప్పగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 02:10, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

జయన్న గారూ! చిన్న ఉదాహరణతో ఈ పనిచేద్దాం. పైన జరిగిన చర్చ చూస్తే మీ స్పందన కన్నా ముందే నిర్జన గ్రామాలు చారిత్రకంగా ప్రసిద్ధి కలిగినవైతే, తగిన మూలాలతో సమాచారాన్ని సమర్థించగలగితే నిస్సందేహంగా వ్యాసం ఉండాలన్న నిర్ణయం జరిగింది. ఆ విషయంలో చర్చ చర్వితచర్వణమే అవుతుంది. అయితే మీకు ముందు జరిగిన చర్చలో ప్రతిపాదన కాని, మీరన్న మరో అంశం - "కానీ ఆ ఊరికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద ఆధారపడిన ఆ గ్రామానికి చెందిన ప్రజలు పక్క గ్రామాల్లో జీవిస్తున్నార"న్నది. ఇలా ఈ నిర్జన గ్రామాల్లో కేవలం పంటలు, జలాధారాలు మాత్రమే ఉంటాయనీ, జనాభా లెక్కల్లో రెవెన్యూ విశేషాలే నమోదవుతాయని నేను పైన నా పరిశీలనలో రాయనైతే రాశాను కానీ అది వికీపీడియా వ్యాసం ఉండడానికి సమర్థన అనలేదు. నా అవగాహన చరిత్ర ప్రసిద్ధి కాని, కేవలం రెవెన్యూ వివరాలే లభ్యమయ్యే నిర్జన గ్రామాలకు వ్యాసాలు ఉండకూడదనేది. మీ వాదన తద్భిన్నం అనఅ అర్థమవుతోంది కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకూ సమాచారం లేకుండా ఇటీవలే సృష్టించిన ఓ ఖాళీ వ్యాసం రుద్రపురం (భద్రాద్రి). ఇందులో మీరన్నట్టు కనీసం పిన్‌కోడ్ వివరాలు కూడా లేవు. ఈ వ్యాసాన్ని ఏ ప్రకారం అభివృద్ధి చేయగలమన్నది ఉదాహరణగా వృద్ధి చేస్తే ఆ పద్ధతిలోనే ఇటీవల తామరతంపరగా సృష్టి అవుతూ, నిర్వహణాభారంగా ఉన్న అనేక వ్యాసాల మీద కూడా పనిచేయడానికి ప్రయత్నించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:41, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ! "వందలాదిగా ఏ ఇతర సమాచారమూ లేని గ్రామాల వ్యాసాల సృష్టి, చారిత్రక ప్రసిద్ధి కూడా లేని గ్రామంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామం ఇది అన్న తరహా ఏకవాక్య వ్యాసాలను తొలగించాలనే" చర్చా ముగింపు సారాంశంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. వికీలో ఇప్పుడున్న గ్రామాలు, వాటి పిన్ కోడ్‌లు, రోడ్లు, నీళ్ళు, మరుగుదొడ్లతో నిండిపోయిన గ్రామ వ్యాసాల కన్నా, ప్రత్యేక చారిత్రక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలే రేపటి తరానికి ఎంతో అవసరమన్నదే నా భావన. అన్యధా భావించరని భావిస్తూ...సమాప్తి.---నాయుడు గారి జయన్న (చర్చ) 13:00, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాయుడు గారి జయన్న గారూ, ఎటువంటి మూలాలు లేని ఏక వాక్య వ్యాసాలుగా ఉన్న వ్యాసాలను తొలగించవచ్చు. మీరన్నట్లు ప్రత్యేక చారిత్రక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలను సరైన మూలాలతో తగినంత సమాచారం దొరికితే వ్యాసాలను రాయవచ్చు.--కె.వెంకటరమణచర్చ 17:42, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండీ నాయుడు గారి జయన్న గారూ, ఏ చారిత్రక ప్రసిద్ధీ లేని నిర్జన గ్రామాల తొలగింపు ప్రతిపాదన విషయమై ఏకాభిప్రాయానికి రాగలిగినందుకు సంతోషం. ఇది పక్కన పెట్టి 28 వేల గ్రామాల వ్యాసాల్లో మౌలిక వనరుల కన్నా చరిత్ర ప్రధానమని, అది రేపటి తరానికి అవసరమని అన్న మీ అభిప్రాయం మీ వ్యక్తిగత అభిరుచిగా స్వీకరిస్తున్నాను. అదలా ఉంచినా రెండవ దఫా గ్రామాల వ్యాసాలపై జరిగే కృషిలో గ్రామాల పేర్ల వెనుక ఉన్న చరిత్ర (typonomy), గ్రామాల చరిత్ర వంటివాటిపై పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నాం. అంటే మౌలిక సదుపాయాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన చరిత్ర, గ్రామనామ వివరణ వంటివీ పరిగణనలోకి తీసుకునే పనిచేస్తున్నామన్నమాట. ఈ అంశంపై మీకు వ్యక్తిగత అభిరుచి ఉందని అనిపిస్తోంది కాబట్టి దయచేసి వికీసోర్సులో ఈ ప్రకటన చూడండి. తెలుగు గ్రామాల పేర్లపై పరిశోధించి తెలుగులో సంబంధిత పరిశోధన గ్రంథం రాసిన తొలి పరిశోధకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథ రెడ్డి గారి కడప ఊర్ల పేర్లు గ్రంథాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించి, వికీసోర్సులో డిజిటైజేషన్ చేపట్టాం. దయచేసి సందర్శించి, మీకు ఆసక్తి ఉంటే పుస్తకాన్ని ఉపయోగించి గ్రామ నామ వివరణ విభాగాన్ని విస్తరించడం విషయంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:52, 7 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:నిర్జన గ్రామాల సృష్టిపై విధానం అన్న పేరుతో ఇక్కడ జరిగిన చర్చ ఫలితాలను (పలువురు వాడుకరుల చర్చలను సమీక్షించి, పలు దృక్కోణాలను ప్రతిఫలిస్తూ కె.వెంకటరమణ గారు చేసిన నిర్ణయాన్ని అనుసరించి) అనుసరించి విధానం పేజీ సృష్టించాను. ఈ చర్చను అక్కడి చర్చా పేజీలో పదిలపరిచాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:04, 23 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మిసిమి పత్రిక సంపాదకులతో భాగస్వామ్య చర్చలు - కొన్ని ముఖ్యాంశాలు

[మార్చు]

నమస్కారం,
మిసిమి పత్రిక మనలో చాలామందికి తెలిసి ఉంటుందని భావిస్తున్నాను. దశాబ్దాలుగా ఈ పత్రికలో చిత్రకళ, సాహిత్యం, సంగీతం, మతం వంటి అంశాల విషయంలో నాణ్యమైన వ్యాసాలు, సాహిత్యం వెలువరిస్తోంది. పరిశోధనాత్మక రచనల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలను తెలుగువారికి అందించడం వంటి విషయాలలో తెలుగు పత్రికల్లో మిసిమిది విశిష్ట స్థానం. ఈ నేపథ్యంలో నమ్మదగ్గ మూలాలను తెవికీపీడియన్లకు అందుబాటులోకి తీసుకురావడం, శాస్త్రీయమైన ఆధార సహితమైన అంశాలను అంతర్జాలంలో పెంపొందించడం వంటి విషయాలపై మిసిమి పత్రికా కార్యాలయంలో జూలై 24 తేదీన చర్చించాను. చర్చలో మిసిమి సంపాదకుడు, రచయిత, అనువాదకుడు వల్లభనేని అశ్వినీ కుమార్, సంపాదకమండలి సభ్యుడు, చిత్రకళా విమర్శకుడు కాండ్రేగుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ చర్చలో వచ్చిన అంశాలు:

  • హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న మిసిమి కార్యాలయ గ్రంథాలయంలో మన నెలవారీ సమావేశాలు నిర్వహించుకోవచ్చనీ, అక్కడే పుస్తకాలు తీసుకుని చదివి సమాచారం అభివృద్ధి చేసేలాంటి ఎడిటథాన్లు నిర్వహించుకోవచ్చని వారు అవకాశం ఇచ్చారు.
  • వచ్చే నెల అటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటే పత్రిక రచయితలను ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. తెలుగు వికీపీడియాలో అభివృద్ధి చేయదలిచిన కొన్ని ప్రధానమైన అంశాలు (తెలుగు ప్రముఖులు, తెలుగు గ్రామాలు, భారతదేశ చరిత్ర, వగైరా) తీసుకుని తెవికీపీడియన్లు, మిసిమి రచయితలూ కలిసి ఆయా అంశాల్లో అత్యంత ప్రామాణికమని ఎంచే పుస్తకాలను (ఓ 50-100) జాబితా వేస్తే ఆ జాబితా భవిష్యత్తులో మనం తెలుగు వికీపీడియన్లకు అందుబాటులోకి తీసుకురావడం, వికీసోర్సు పునర్విడుదలలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి కార్యక్రమాలకు స్వీకరించేందుకు వీలుంటుంది.
  • మిసిమి పత్రికలో తెలుగు వికీపీడియా నిర్మాణం, అది ఎదుర్కొంటున్న సమస్యలు, సభ్యులు దాన్ని అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలు వంటి అంశాలను కలిపి తెవికీపీడియన్లు వ్యాసం రాయవచ్చు, తద్వారా అత్యంత సీరియస్, పాండిత్య, పరిశోధన ప్రధానమైన మిసిమి పత్రికను చదివే పాఠకులకు తెవికీపీడియా గురించి విజ్ఞప్తి చేసినట్టవుతుంది.
  • పత్రికను కేవలం లాభాపేక్ష కోసం కాక ఉన్నతమైన లక్ష్యాల కోసం నడుపుతున్నట్టు కాబట్టి కాపీహక్కుల మీద తమకు పట్టింపులేదనీ, పత్రికలోని నాణ్యమైన సాహిత్యం ప్రజలకు చేరువ కావడం ముఖ్యమనీ వారు తెలిపారు. పత్రికలోని పలు వ్యాసాలను కానీ, సంచికలను కానీ ప్రస్తుతం పత్రికల కాపీహక్కుల పునర్విడుదల విషయమై ఉన్న సాంకేతిక సమస్యలు అధిగమించి ఎలా సీసీ-బై-ఎస్‌ఎలోకి తీసుకురావచ్చన్నది ఆలోచించాలి.

ఈ అంశాలపై సముదాయం తమ అభిప్రాయం తెలుపుతుందని ఆశిస్తున్నాను. పై వాటిలో తొలి రెండు పాయింట్లను అమలులోకి తెచ్చేందుకు ఆగస్టు 19 తేదీన మిసిమిలో ఎడిటథాన్, మేధోమధనంలు ప్రధాన అంశాలుగా నెలవారీ సమావేశం నిర్వహించుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. సముదాయ సభ్యుల స్పందనలను ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:54, 30 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర దినోత్సవ ఎడిటథాన్ - ఆగస్టు 10-20

[మార్చు]

గతంలో చర్చించిన విధంగా పరిధిలోకి వచ్చే వ్యాసాలను సృష్టించడం, అభివృద్ధి చేయడంతో ఒక ఎడిటథాన్ చేయాలని సంకల్పించాం. ఇందుకు అవసరమైన ఆధారాలు, ఆకర గ్రంథాలు ఆసక్తి కల సభ్యులకు అందిస్తాం. అలానే ఎవరైనా దీని నాయకత్వం వహించే ఆసక్తి కానీ, కొద్ది నిర్వహణ కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్దేశం గానీ ఉన్నవారుంటే ఆహ్వానం. పలు వికీపీడియాల్లో ఆగస్టు 10-20 నడుమ స్వాతంత్ర దినోత్సవ ఎడిటథాన్ జరుగుతున్నందున మనం దానిలో భాగంగా ఈ థీమ్‌తో కార్యక్రమం నిర్వహిద్దాం. అలానే మిసిమి కార్యాలయంలో ఆగస్టు 19 తేదీన కలిసి కొన్ని వ్యాసాలు అభివృద్ధి చేసుకుందామని ప్రతిపాదిస్తున్నాను. దీనిపై సభ్యులు స్పందించగలరు. భారత స్వాతంత్ర్యోద్యమంలోని అత్యవసరమైన ఘట్టాలు, వ్యక్తులు, సంఘటనలు, అంశాలు వగైరా ముఖ్యమైన వ్యాసాలు అభివృద్ధి అవుతాయని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:05, 30 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఎడిటథాన్‌లో పాల్గొనదలిచినవారు దయచేసి ఇక్కడ సంతకం చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:12, 7 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

New user group for editing sitewide CSS / JS

[మార్చు]


IMPORTANT: Admin activity review

[మార్చు]

Hello. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was adopted by global community consensus in 2013. According to this policy, the stewards are reviewing administrators' activity on smaller wikis. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the admin activity review.

We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):

  1. కాసుబాబు (administrator)
  2. వైజాసత్య (administrator)

These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.

However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Rschen7754 05:50, 10 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సభ్యులుగా మనం ఏమైనా ఒకసారి సంప్రదిద్దామా? నాకు తెలిసినంతవరకు వీరిద్దరూ చాలాకాలంగా క్రియాశీలకంగా లేరు. వాళ్ళకు ఈమెయిలు కూడా చేరి ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 05:26, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు వారిద్దరినీ ఈమధ్య సంప్రదించారని తెలసింది. చదువరి గారూ! వారేమంటున్నారు? --పవన్ సంతోష్ (చర్చ) 14:49, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వాళ్ళ దగ్గరినుండి తిరుగుజాబేమీ రాలేదండి. __చదువరి (చర్చరచనలు) 17:02, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శనివారం మిసిమి పత్రిక గ్రంథాలయంలో సమావేశం

[మార్చు]

అందరికీ నమస్కారం,
ఈ శనివారం హైదరాబాద్, ఆర్టీసీ x రోడ్స్ వద్ద ఉన్న కళాజ్యోతి ప్రెస్ కార్యాలయంలోని మిసిమి పత్రికలో జరుగనున్న సమావేశంలో పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కార్యక్రమంలో మిసిమి పత్రిక నిర్వాహకులు కూడా పాల్గొని భాగస్వామ్యంపై చర్చిస్తారు. గ్రంథాలయంలోని పుస్తకాలను అక్కడే చదివి వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు, అలా చేసేందుకు సభ్యులు తమ లాప్‌టాప్‌లతో రాగలరు. మిగిలిన వివరాలు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/2018 ఆగస్టు 18 పేజీలో చూడగలరు, ఆసక్తి ఉన్న పేరు నమోదుచేసుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 16 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం పేజీలో నివేదిక చేర్చాం. దయచేసి గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:50, 27 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Editing of sitewide CSS/JS is only possible for interface administrators from now

[మార్చు]

(Please help translate to your language)

Hi all,

as announced previously, permission handling for CSS/JS pages has changed: only members of the interface-admin (ఇంటర్‌ఫేసు నిర్వాహకులు) group, and a few highly privileged global groups such as stewards, can edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css or .js that is either in the MediaWiki: namespace or is another user's user subpage). This is done to improve the security of readers and editors of Wikimedia projects. More information is available at Creation of separate user group for editing sitewide CSS/JS. If you encounter any unexpected problems, please contact me or file a bug.

Thanks!
Tgr (talk) 12:40, 27 ఆగస్టు 2018 (UTC) (via global message delivery)[ప్రత్యుత్తరం]

నెల్లూరులో రచయితల సమావేశం, ఇంటర్వ్యూ

[మార్చు]

అందరికీ నమస్కారం,
ఆంధ్రప్రదేశ్‌లోని సాంస్కృతిక, రాజకీయ కేంద్రాల్లో ఒకటైన నెల్లూరు నగరంలో 2018 ఆగస్టు 25న పవన్ సంతోష్ పర్యటించి ప్రముఖ రచయిత, పరిశోధకుడు కాళిదాసు పురుషోత్తం సహకారంతో అక్కడి వర్ధమాన సమాజ గ్రంథాలయంలో స్థానిక రచయితలు, ప్రచురణకర్తలతో జరిపిన సమావేశంలో మాట్లాడారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రసారాలు చేస్తున్న వార్తాఛానెల్ యాక్ట్ 24x7 తెలుగు వికీపీడియా నుంచి వ్యక్తిగత అంశాల వరకు పలు అంశాలపై పవన్‌ను ఇంటర్వ్యూ చేశారు. దయచేసి మిగిలిన వివరాల కొరకు కార్యక్రమ నివేదిక చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:25, 28 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్కీవ్.ఆర్గ్ లో పుస్తకాల పేజీలకి లింకు ఇవ్వటం

[మార్చు]

ఆర్కీవ్.ఆర్గ్ లో తెలుగు పుస్తకాల అధిదత్తాంశం తెలుగులిపిలోకి మార్చటం కృషి కొనసాగుతున్నది. ఇటీవల చదువరి గారి చొరవతో దాదాపు 2600 పుస్తకాలు తెలుగులిపిలోకి మార్చబడ్డాయి. ఈ పుస్తకాలను మూలాలుగా వాడుకొనేటప్పడు, వాటి పేజీలకి లింకు లివ్వటం గురించి ఈ రోజే నేను తెలుసుకున్నాను. పుస్తకపు పేజీలో భూతద్దము నొక్కితే పుస్తకపు చదువరి పేజీకి వెళతారు. కావలసిన పేజీకి వెళ్లి అప్పుడు కనబడే లింకుని వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు చూడండి. సున్నా, అరసున్నా గురించి మన భాష పుస్తకం పేజీకి ఉదాహరణ లింకు.--అర్జున (చర్చ) 07:16, 31 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Read-only mode for up to an hour on 12 September and 10 October

[మార్చు]

13:33, 6 సెప్టెంబరు 2018 (UTC)

[మార్చు]
Apologies for writing in English, please consider translating this message to the project language

Hello,
A workshop on Wikimedia copyright-related topics will take place on 19 October afternoon to 21 October in Bangalore or slightly around. Pre-event session is on 19 October later afternoon/early evening.

Any Wikimedian from South Indian states (who is currently staying in) Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu, Telangana, who are actively working, may apply to participate in the workshop.

The primary trainer of the workshop will be Yann

Some of the topics to be discussed during the workshop are (more topics may be added)

  • Different Creative Commons licenses (CC licences) and terminologies such as CC, SA, BY, ND, NC, 2.0, 3.0, 4.0
  • Public domain in general and Public domain in India
  • Copyright of photos of different things such as painting, sculpture, monument, coins, banknotes, book covers, etc.
  • Freedom of Panorama
  • Personality rights
  • Uruguay Round Agreements Act (URAA, specially impact on Indian works)
  • Government Open Data License India (GODL)
  • topic may be added based on needs-assessment of the participants

Please see the event page here.

Partial participation is not allowed. In order to bridge gendergap, female Wikimedians are encouraged to apply. -- Tito, sent using MediaWiki message delivery (చర్చ) 18:40, 26 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే,

అక్టోబరు 19 మధ్యాహ్నం నుంచి 21 తేదీ వరకు బెంగళూరు లేదా చుట్టుపక్కల ప్రదేశాల్లో వికీమీడియా కాపీహక్కుల సంబంధిత అంశాలపై కార్యశాల జరగనుంది. దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో నివసిస్తూ క్రియాశీలంగా వికీమీడియా ప్రాజెక్టులకు కృషిచేస్తున్న వికీమీడియన్ ఎవరైనా ఈ కార్యశాలలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. User:Yann (యాన్) కార్యశాల ప్రధాన శిక్షకునిగా వ్యవహరిస్తారు.

కార్యశాలలో చర్చించే కొన్ని అంశాలు ఇవి (మరిన్ని అంశాలు చేరవచ్చు)

  • వివిధ క్రియేటివ్ కామన్స్ లైసెన్సులు (సీసీ లైసెన్సులు), సీసీ, ఎస్‌ఎ, బై, ఎన్‌డి, ఎన్‌సి, 2.0, 3.0, 4.0 వగైరా పరిభాష గురించి
  • సాధారణంగానూ, భారతదేశంలో ప్రత్యేకించీ సార్వజనీనం
  • పెయింటింగ్, శిల్పాలు, పురావస్తువులు, స్మారక కట్టడాలు, నాణేలు, బ్యాంకు నోట్లు, పుస్తకాల ముఖపత్రాలు వంటివాటి కాపీహక్కులు
  • ఫ్రీడమ్ ఆఫ్‌ పనోరమా
  • వ్యక్తి హక్కులు (పర్సనాలిటీ రైట్స్)
  • ఉరుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ (యుఆర్ఎఎ, ప్రత్యేకించి భారతీయ కృతులపై ప్రభావం)
  • గవర్నమెంట్ ఓపెన్ డేటా లైసెన్స్ ఇండియా (జీవోడీఎల్)
  • *పాల్గొనే సభ్యుల అవసరాల మదింపు ఆధారంగా అంశాలు పెరగవచ్చు*

కార్యక్రమ పేజీని ఇక్కడ చూడండి.

పాక్షికంగా పాల్గొనే వీలు లేదు. జెండర్ గ్యాప్ తగ్గించే క్రమంలో మహిళా వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం.

ధన్యవాదాలు

పైన ఉన్న ఆంగ్ల ప్రకటనకు అనువాదం

"డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు" అనే అంశంపై సదస్సు నిర్వహణ

[మార్చు]

అందరికి నమస్కారం... బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 12,13 తేదీల్లో "డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు" అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాను అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ మాధ్యమంగా గుర్తించి, డిజిటల్ రంగానికే విశిష్టమైన వికీపీడియా ద్వారా తెలుగులో స్వేచ్ఛా విజ్ఞాన విస్తరణకు కృషిచేస్తున్న వారిని ఇదే సదస్సులో గౌరవించుకోవాలని సదస్సు నిర్వాహకులు ఆశిస్తున్నారు. కార్యక్రమంలో పలు భాష సాంస్కృతిక శాఖ ప్రచురణలను స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడుదల చేయడం, తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు, వికీడేటా వంటి ప్రాజెక్టుల గురించి అవగాహన పెంపొందించడం వంటి కార్యకలాపాలు చేపడతారు. అంతేకాకుండా, డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు, సాంకేతిక తెలుగు మరియు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు వంటి అంశాలపై పత్ర సమర్పణలతోపాటూ వికీ ప్రాజెక్టులకు సంబంధించి సదస్సులో పాల్గొన్న వారికి అవగాహన కలిపించడం జరుగుతుంది. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:58, 30 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమానికి హాజరుకాదలిచిన వారు ఇక్కడ సంతకం చేయగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:04, 1 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సంతోషకరమైన విషయం. తెలుగు వికిపీడియా మరియు సమూహ సభ్యులకూ ఒక ఉపయుక్తమైన కార్యక్రమం. ఈ సమావేశం మనకూ నూతనోత్సహన్ని అందిస్తుందని నా భావన. దీనికి నా వంతుగా నేను కృషి చేస్తాను..--Ajaybanbi (చర్చ) 11:33, 3 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమం. ప్రభుత్వం నుండి ఇలాంటి ప్రోత్సాహం లభించడం గొప్ప పరిణామం.--Nagarani Bethi (చర్చ) 11:29, 4 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]