వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 19 | పాత చర్చ 20 | పాత చర్చ 21

alt text=2013 ఏప్రిల్ 1 - 2013 ఏప్రిల్ 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 ఏప్రిల్ 1 - 2013 ఏప్రిల్ 30

మహిళా దినోత్సవం[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన మొదలుపెట్టిన కార్యక్రమంలో సభ్యులందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూడు వారాల్లో సుమారు 100 కొత్త వ్యాసాలు ప్రముఖ మహిళల గురించి చేర్చబడ్డాయి. సుమారు 50 పైగా వ్యాసాలు విస్తరించబడ్డాయి. వివరాలను వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం పేజీలో చూడండి. అందరం కలిసి పనిచేస్తే మొలకల వ్యాసాల్ని లేకుండా చేయలేకపోయినా చాలా వరకు తగ్గించి మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయవచ్చును. దయచేసి ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 09:35, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందులకు రాజశేఖర్ గారికి పాల్గొన్న అందరికి అభివందనలు.--అర్జున (చర్చ) 10:02, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రాజశేఖర్ గారు చాలా మంచి సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో అతి చురుకుగా పాల్గొన్న మొదటి 3 మంది సభ్యుల వివరాలు వెల్లడించగలిగితే చాలా బాగుంటుంది మరియు ఓ ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. విష్ణు (చర్చ)14:03, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
కార్యక్రమంలో పాల్గొన్నవారిలో సుల్తాన్ ఖాదర్, వెంకటరమణ, వైజాసత్యగారు ఎక్కువగా కృషిచేశారు. వీర్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.Rajasekhar1961 (చర్చ) 08:45, 2 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సిజిజి(CGG), హైద్రాబాదులోఏప్రిల్ 9మధ్యాహ్నం వికీఅకాడమీ[మార్చు]

సిజిజి(CGG), హైద్రాబాదు లోఏప్రిల్ 9 2013 మధ్యాహ్నం వికీపీడియా:తెవికీ అకాడమీ జరగబోతున్నది. రహ్మనుద్దీన్, విష్ణు, నేను పాల్గొంటున్నాము. ఇంకా ఇద్దరు ముగ్గురు వికీపీడియన్ల సహకారం కోరుతున్నాను.ఆసక్తిగల వారు స్పందించండి. --అర్జున (చర్చ) 12:12, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దీనిలో నాతో పాల్గొన్న రహ్మనుద్దీన్, విష్ణు మరియు పవిత్రన్ కు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:21, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక[మార్చు]

చాలా మంది సభ్యులకు వికీమీడియా ఫౌండేషన్ CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ (A2K) ప్రోగ్రాం కి గ్రాంటు ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఈ గ్రాంటు భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ గ్రాంటు భాగంగా CIS-A2K నుండి మేము ఈ సంవత్సరం ఐదు భారతీయ భాషా వికీపీడియాల పెంపుదలకై కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మన తెలుగు వికీని ఈ జాబితాలో చేర్చాను. దీనిలో భాగంగా కొంత మంది తెవికీ సముదాయ సభ్యులతో, గత రెండు నెలలుగా, చర్చించి మరియు రచ్చబండలో జరిగిన కొన్ని చర్చల ఆధారంగా వ్యయప్రయాసలకోర్చి ఓ ప్రణాళికను రూపొందించాను. మనలో చాలా మంది చాలా కొద్ది రోజులలోనే ఉగాది నాడు కలుస్తున్నాము. దానికంటే ముందు ఈ ప్రణాళికను మీరందరూ చూడాలని సమయం చాలక మరియు మిగితా భాషా ప్రణాళికల ఒత్తిడివలన అనువదించడానికి వీలుకాక ఆంగ్లములోనే పెట్టాను. క్షమార్ధిని! మిత్రులు ఎవరైనా చొరవ తీసుకొని అనువదించగలిగితే కృతార్ధుడనై ఉంటాను. భాషా దోషాలను సద్మనస్సుతో సవరించ ప్రార్ధన. CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక పేజి ఇది. తెవికీ మిత్రులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు సూచనలు ప్రణాళిక చర్చ పేజీలో ఇవ్వవలసినదిగా మనవి. ధన్యవాదాలు. మిత్రులు e-mail ద్వారా పంపడానికి సౌకర్యంగా ఉంటే vishnu@cis-india.org కి మెయిల్ చేయగలరు. ఒకవేళ ఫోన్ ద్వారా చర్చించదలచితే నా మొబైల్ నంబరు +91-9845207308 విష్ణు (చర్చ)15:27, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ ప్రణాళికను ఆంగ్లములో చదవడానికి ఇక్కడ చూడండి . సభ్యులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్ధన. విష్ణు (చర్చ)07:25, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీసౌర్స్‌లో ఆంధ్రులచరిత్ర[మార్చు]

అర్జునరావు గారి కృషి కారణంగా తెలుగు వికీసౌర్స్‌లో చేరిన ఆంధ్రులచరిత్ర అనే అద్భుతమైన పుస్తకం లోని వ్యాసాలు చక్కగా ఆడియో ద్వారా వినాలంటే ఈ కింది లింకు చూడండి. [[1]]

 • ధన్యవాదాలు. మంచి లింకుతెలిపారు. ఇవి ఆంధ్రులచరిత్ర గురించి ఇతరులు వ్రాసిన వ్యాసాలు వాటి ధ్వనిముద్రణులండీ. సరియైన లింకు అన్నట్టు. చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రులచరిత్ర వికీసోర్స్ లో పాఠ్యీకరణం చేసినందును ఇపుడు కంప్యూటర్ గొంతు ద్వారా ధ్వనిముద్రణం సులభం.--అర్జున (చర్చ) 14:58, 2 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగా ఇవి మనం పాఠ్యీకరణ చేసినవి అనుకున్నాను. అయినప్పటికీ ఇవి వినడానికి చాలాబాగున్నాయి.--t.sujatha (చర్చ) 15:05, 2 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలలో తోడ్పాటు[మార్చు]

సెన్సస్ శోధకం వద్ద 2011 సెన్సస్ ప్రకారం వెతికి ప్రతి గ్రామంలో గల మొత్త జనాభా, ఇళ్ళ సంఖ్య, పురుషుల, స్త్రీల జనాభా వివరాలు పొందవచ్చు. మిత్రులు రాజశేఖర్ గారు సమాచారాన్ని సమగ్రంగా అందించే లోపు గొల్లపల్లె (బీ.కొత్తకోట) వ్యాసంలో చేర్చిన విధంగా జనాభాను చేర్చితే, కొంత సమాచారం ప్రతి గ్రామ వ్యాసంలో కొంత సమాచారం చేరుతుంది. నేను నాకు వీలయినంతలో కృష్ణా జిల్లా గ్రామాలను పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 13:50, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

household కి గడపలు అని వాడుతున్నాను. అందువలన మరో లైను చేరుతుంది. రహ్మానుద్దీన్ (చర్చ) 13:54, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
జనాభా గణాంకలకు సంవత్సరం చాలా ముఖ్యం. అది కూడా చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 14:03, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సంవత్సరం చేర్చని చోట చేరుస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
household అంటే కుటుంబము, ఇల్లు, సంసారము, స్వంత ఇల్లు, ఇంటిజనము, యజమాని ఇలా అనేక అర్థాలు వస్తాయి కనుక ఈ సెన్సస్ శోధకంవిషయములో ఏ అర్థములో వాడారో గమనించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:09, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
household అనేది ఇక్కడ జనాభా లెక్కల అధికారి సందర్శించిన ఇళ్ళ వివరాలు. కానీ ఒకే ఇంట్లో రెండు గడపలు ఉంటే, రెంటినీ వేరు వేరుగా లెక్క వేస్తారు. ఇది నా అనుకోలు. రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]మొదటగా మండల పేజీలు పూరిస్తున్నాను. ఆపై ప్రత్యేక గ్రామ పేజీలో రాస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 15:27, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వంపై చర్చ[మార్చు]

నిర్వాహకత్వంపై కాలపరిమితుల గురించి చర్చించడం ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటగా నా అభిప్రాయాలు.

 • నిర్వాహకత్వం ఒక పదవి కానీ, హోదా కానీ కాదు. వికీలో పదవులూ నిర్వహించే వాళ్లుంటారు. వాళ్ళని స్టీవార్డులంటారు. పదవి ఎందుకాదంటే దాని వళ్ళ ప్రత్యేక అధికారాలు ఏమీరావు. నిర్వాహకుల అభిప్రాయాలకుగానీ, ఓటుకు గానీ ప్రత్యేకమైన బలమేమీ ఉండదు. హోదా ఎందుకు కాదంటే అది వాడుకరి యొక్క కృషికి గుర్తింపుగా ఇచ్చేది కాదు. అలా అయితే రహంతుల్లా గారిలాంటి చాలామంది సభ్యులు నిర్వాహకులుగా ఉండేవారు. నిర్వహణా వ్యవహారాలలో పాల్గొనే వారికి, పాల్గొనాలని ఉత్సాహపడేవారికి నిర్వాహకత్వం ఇస్తారు.
 • ఒక వికీలో ఇంత మందే నిర్వాహకులుండాలని ఏమీ నియమం లేదు. వికీలో అవసరాన్ని బట్టి లేదా సభ్యులు అభ్యర్ధన ప్రకారం కొత్త నిర్వాహకులని చేరుస్తారు. అయితే నిర్వాహకత్వ అభ్యర్ధనకు సముదాయం యొక్క మద్దతు ఉండాలి. అలాంటి మద్దతు లేకపోతే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మరింత అనుభవం గడిస్తే మద్దతు వచ్చే అవకాశం ఉంది.
 • సభ్యులను నిర్వాహకులు చేసే వీలు అధికారులకు ఉంది. తెవికీలో ప్రస్తుతం నలుగురు అధికారులున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ కనీసం ఒక్క అధికారి అయినా క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవటం తెవికీకి శ్రేయస్కరం. అధికారులను చాలా ఆచితూచి ఎంచుకోవాలి. తెలుగు విక్షనరీలో కూడా ఒక అధికారి ఉండాలి. నేను సుజాత గారిని తెలుగు విక్షనరీలో అధికారిగా ప్రతిపాదించాలని అనుకుంటున్నాను. మన సొంత అధికారి ఉంటే మన సముదాయపు అవసరాలకు అనుగుణంగా నిర్వాహకులను తయారుచేసుకోవచ్చు. మన సముదాయం గురించి తెలియని బయటివాళ్ళని అభ్యర్ధించవలసిన అవసరం రాదు.
 • నిర్వాహకత్వంపై కాలపరిమితులు అనేది ఆంగ్లవికీ లాంటి పెద్దవికీ వాళ్ళ సముదాయపు అవసరాల దృష్ట్యా చేసుకున్న నియమం. అని మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న నిర్వాహకులలో క్రియాశీలకంగా లేనివాళ్ళ నిర్వాహకత్వం తీసివేయటం ఒక క్షణంలోపని కానీ దాని వళ్ల మనకు ఒరిగే లాభం సున్నా. కానీ అలాగే ఉంచేస్తే వాళ్ళు ఎప్పుడు తిరిగివచ్చినా, ఇదివరకే నిర్వాహకత్వంలో అనుభవముంది కాబట్టి వెనువెంటనే అవసరమైతే నిర్వాహణలో పాల్గొనే వీలుంది. ఉదాహరణకు (నేను, వీవెన్, చావా కిరణ్). మేం ముగ్గురం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి మార్పులు చెయ్యలేదు.

--వైజాసత్య (చర్చ) 10:00, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పేరులో ఉన్న పెద్దల స్పందనలు ఇంతవరకు ఇక్కడ పొందు పరచక పోవడము మనలోని అనైక్యతా లేదా అనైతికతా అనే సందేహము సభ్యులకు కలగనీయ వద్దని, స్పందించమని నా సలహా మరియు సూచన. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:09, 5 ఏప్రిల్ 2013 (UTC)::Reply[ప్రత్యుత్తరం]
తెలుగు విక్షనరికి అధికారిగా శ్రీమతి సుజాతగారిని ప్రతిపాదించాలనుకోవటం సంతోషం.ప్రస్తుతం తెలుగు విక్షనరిలో సభ్యులసంఖ్య, రచనలసంఖ్య తక్కువగా వున్నది. విక్షనరిలో రచనలను ప్రోత్యాయించవలసిన అవసరము న్నది.జె.వి.కె.ప్రసాదు గారు కూడా నిర్వహాకభాద్యతలు స్వీకరించటానికి ఉత్సహము కనపరచుచున్నారు. వీరిద్దరు విక్షనరీలో చాలా రచనలు చేసారు. కావున వీరిద్దరిని విక్షనరీలో నియమించటం అవసరమను కుంటున్నాను. పాలగిరి (చర్చ) 13:05, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు ఇది చాలా చక్కని ప్రతిపాదన. ఈ చర్చలో మిగతా భారతీయ భాషా వికీల అనుభవాలు కూడా పరిగణలోకి తీసుకోవడం ఉచితమేమో. ఉదా: తమిళ వికీలో ప్రతి సంవత్సరం కొందరు కొత్త చురుకైన సభ్యులను నిర్వాహకులుగా ట్రైన్ చేయడం సినియర్ నిర్వాహకులు ఒక బాధ్యతగా తీసుకున్నారు. దీని వళ్ళ క్రియాశీలక సభ్యులకూ ఓక ప్రోత్సాహంగా కూడా ఉంటుంది అనేది వారి ఆలోచన.-- విష్ణు (చర్చ)
ఇదొక మంచి ఆలోచన ఈమధ్య తెలుగు వికీపీడియాకు ఉన్నతమైన వ్యాసాలను అందించడమే కాకుండా, నిర్వహణలోను, సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి జరిగే చర్చలలోను చురుకుగ పాల్గొంటున్న పాలగిరి మరియు వెంకటరమణ గార్లము నిర్వహకులుగా చేయుట మనందరి బాధ్యత.Rajasekhar1961 (చర్చ) 16:05, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • వైజాసత్య గారు స్పష్టమైన శీర్షిక పెట్టినా కూడా కొన్ని స్పందనలు దానికి తగ్గట్టుగా లేవు.దీనికి అనుబంధమైన కొందరు సభ్యుల గురించి అభిప్రాయాలు వున్నాయి. ఈ విషయమై నా అభిప్రాయమేమంటే, తెలుగు వికీ స్థితిని అంచనా వేయటానికి వికీలో కీలకమైనవి గణాంకాలు. అందులో నిర్వాహకుల సంఖ్య, ఆ వికీకి ఒక ముఖ్యమైన గణాంకం. ఇది ఎక్కువగా వుంటే ఆ వికీ చక్కగా నిర్వహించబడుతుందని అనుకుంటారు. కొత్తవారిని నిర్వాహకులుగా ఎంపిక చేయటానికి ఇతరులు వుత్సాహం చూపించరు కూడా, వోటు చేయడంలో ఇదే వాదన ఒక్కోసారి కన్పిస్తుంది. వికీ లో ముఖ్యమైన నిర్వాహక పనులు చేయడానికి, శీర్షికలు నిర్వహించడానికి, వివాదా పరిష్కారానికి, వికీ అభివృద్ధికి సంబంధించిన చర్చలలో పాల్గొననపుడు, కొత్త సభ్యులు ఆ నిర్వాహకుల పేజీలలో అభ్యర్థించడం, లేక వారికి వికీ ద్వారా మెయిల్ పంపించడం జరిగి వారు స్పందించకపోతే బాధపడి, నిరుత్సాహం కలగటం నా అనుభవం. ఏళ్లతరబడి క్రియాశీలంగా లేని వారిని నిర్వాహకులుగా కొనసాగించడం అంత ఉపయోగంలేదు. ఒక వేళ వారు క్రియాశీలమైతే, మరల నిర్వాహక హోదా ఇవ్వటానికి సులభమైన నియమాలు పెట్టుకోవచ్చు. నిర్వాహకుల జాబితాలో వారి నిర్వాహకత్వ ప్రారంభం ముగింపు వివరాలు పొందుపరుస్తాము కాబట్టి వారికి తగినైన గుర్తింపు ఇవ్వగలుగుతాము. ఆంగ్ల వికీలో ఒక సంవత్సరం(?) క్రియాశీలంగా లేకపోతే నిర్వహకత్వ హోదా తొలగించాలి అన్న నియమాన్ని కాల వ్యవధిని మన తెవికీ కి తగ్గట్టుగా మార్చుకొని అమలు చేయడం మంచిది.--అర్జున (చర్చ) 00:05, 11 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఈ విషయంలో నేను వైజా సత్యగారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నను. నిర్వాకత్వం, అధికారం సభ్యులకు నిరంతరంగా ఉంటేనే అందరికీ సులువు. కొంతకాలం వ్యక్తి గత కారణం వలన

క్రియాశీలకంగా పనిచేయకుండా తిరిగి రావాలనుకున్న వారు క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఉన్నది. ప్రతి విషయానికి అందరూ స్పదించ వలసిన అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకంగా చెప్పలకున్నప్పుడు స్పందిస్తే చాలు. స్పందించని వారు వ్యతిరేకం అనుకోవలసిన అవసరం లేదు. నిర్వహకత్వం, అధికారం వంటివి శాశ్వతంగా ఉండాలన్నదానిని నేను స్పష్టంగా సమర్ధిస్తాను. అప్పుడే వారి సేవలను గౌరవించిన వారం ఔతాం. --t.sujatha (చర్చ) 15:54, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • కొన్ని వికీలలో కొంతకాలంపాటు అచేతనంగా ఉంటే నిర్వాహక హోదా నుంచి తొలిగించుటకు నిబంధనలున్నట్లు ఎప్పుడో చూసినట్లు గుర్తు కాని మనం మాత్రం స్వచ్ఛందంగా వదులుకుంటే తప్ప నిర్వాహక హోదా నుంచి ఇదివరకు తెవికీ అభివృద్ధికి కృషిచేసినవారిని తప్పించకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:41, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాళ్ళు ఇటు వస్తేనే కదా నిర్వాహకత్వాన్ని స్వఛ్ఛందంగా త్యజించాలనుకుంటున్నారో, లేదో తెలిసేది. అయినా నాకు ఇంకా సరిగా అర్ధం కానీ విషయమేమిటంటే పేరుకు నిర్వాహకులు ఎంతమంది ఉన్నా వచ్చిన సమస్య నాకు అర్ధం కావటం లేదు. వంద మంది క్రియాశీలక సభ్యులుంటే అందరికీ నిర్వాహకహోదా ఉన్నా నష్టమేమీ లేదు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్న సభ్యులను నిర్వాహకులు చెయ్యటానికి అభ్యంతరాలేమీ లేవు. ఆయా వాడుకర్ల పేర్లు ప్రతిపాదించండి. తప్పకుండా వాళ్ళను నిర్వాహకులు చేద్దాం. నిర్వాహకుల సంఖ్య అనేది వికీ యొక్క అనేకానేక కొలతల్లో ఒకటి, వ్యాసాల సంఖ్యనే పెద్దగా నమ్మదగిన కొలతగా ఎవరూ తీసుకోవట్లేదు. నిర్వాహకుల సంఖ్య అంత గొప్ప కొలతేమీ కాదు. తార్కికంగా నిర్వాహకత్వం, సాధారణ సభ్యత్వం కంటే భిన్నమైనది కాదు. సభ్యులు క్రియాశీలకంగా లేరని వారి సభ్యత్వాన్ని తీసెయ్యటం లేదు కదా. ఇంత మంది సభ్యులున్నారు కానీ వాళ్ళలో క్రియాశీలకమైన సభ్యులు కొంతమందే అని ఎవరూ మధనపడిపోవటం లేదు కదా. నిర్వాహకులకు ఉండే భాధ్యతలన్నీ సాధారణ సభ్యులకూ ఉన్నాయి. కాస్త వికీమీడియా వైపు వెళ్ళి వాళ్ల కారణాలేంటో చదివి వస్తా --వైజాసత్య (చర్చ) 09:48, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అన్నట్టు సముదాయం క్రియాశీలక నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తీసేయ్యటానికి మొగ్గు చూపితే నాకేమీ అభ్యంతరం లేదు. రెండు సంవత్సరాలలో ఒక మార్పైన చేయకపోతే తొలగించివచ్చు. బహిష్కరణ గురికాని నిర్వాహకులెవరైనా మళ్ళీ తిరిగి వస్తే అభ్యర్ధించిన వెంటనే అధికార లాంఛనాలేవీ లేకుండా తిరిగి ఇచ్చేట్టు మనం నియమం చేసుకోవచ్చు. ఊరకే అనవసరమైన విషయంతో సమయం వృధాచేసుకుంటున్నామన్న ఆలోచన తప్పమరేమీ లేదు --వైజాసత్య (చర్చ) 09:56, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వెన్న నాగార్జున గారి తెలుగు వికీ మహోత్సవం గురించి సుజాతగారితో స్పందన[మార్చు]

Nagarjuna Venna

Sujatha garu - just saw this email and I also saw that Arjun emailed me. I will try and coordinate with him.

Regards, Nagarjuna

చాలా సంతోషించ వలసిన విషయము మన అందరకు అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:33, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చాలా సంతోషంగా ఉన్నది. వారిని మన సమావేశాల కోసం రికార్డు చేసిన సందేశాన్ని పంపమని కోరండి.Rajasekhar1961 (చర్చ) 08:27, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Wikidata phase 2 (infoboxes) coming to this Wikipedia[మార్చు]

Wikidata-logo-en.svg

Sorry for writing in English. I hope someone can translate this. If you understand German better than English you can have a look at the announcement on de:Wikipedia:Kurier.

A while ago the first phase of Wikidata was enabled on this Wikipedia. This means you are getting the language links in each article from Wikidata. It is soon time to enable the second phase of Wikidata (infoboxes) here. We have already done this on the [first 11 Wikipedias] (it, he, hu, ru, tr, uk, uz, hr, bs, sr, sh) and things are looking good. The next step is English Wikipedia. This is planned for April 8. If everything works out fine we will deploy on all remaining Wikipedias on April 10. I will update this part of the FAQ if there are any issues forcing us to change this date. I will also sent another note to this village pump once the deployment is finished.

What will happen once we have phase 2 enabled here? Once it is enabled in a few days you will be able to make use of the structured data that is available on Wikidata in your articles/infoboxes. It includes things like the symbol for a chemical element, the ISBN for a book or the top level domain of a country. (None of this will happen automatically. Someone will have to change the article or infobox template for this to happen!)

How will this work? There are two ways to access the data:

 • Use a parser function like {{#property:p169}} in the wiki text of the article on Yahoo!. This will return “Marissa Mayer” as she is the chief executive officer of the company.
 • For more complicated things you can use Lua. The documentation for this is here.

We are working on expanding the parser function so you can for example use {{#property:chief executive officer}} instead of {{#property:p169}}. The complete plan for this is here.

Where can I test this? You can already test it on test2.

Where can I find more information and ask questions? We have collected the main questions in an FAQ for this deployment. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages.

--Lydia Pintscher 17:12, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

వాడుకరులు[మార్చు]

ఈ క్రింద సూచించిన వికీపీడీయా లోని "పేర్ల" గురించిన వివరణాత్మకమైన (మొత్తము వారి విధి విధానాలు, ..అన్నీ) మొత్తము సమాచారము తెలుగులో లభించు చోటు తెలిసిన వారు తెలియజేయగలరు లేదా స్పందించ గలరు.

 1. సభ్యులు
 2. బాట్‌లు
 3. నిర్వాహకులు
 4. అధికారులు
 5. స్టీవార్డులు
 6. ఖాతా తయారీదార్లు
 7. దిగుమతిదార్లు
 8. ట్రాన్స్ వికీ దిగుమతిదారులు
 9. ఐపీ నిరోధపు మినహాయింపులు
 10. పరాకు అధికారులు
 11. చెక్‌యూజర్లు
 12. నిర్ధారిత వాడుకరులు

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:08, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, వాడుకరుల చిట్టా కోసం మీరిక్కడ చూడవచ్చు. ఏ రకం వాడుకరుల జాబితా కావాలో అన్నది మీరు డ్రాప్ డౌను ద్వారా తెలుసుకోవచ్చును. కానీ నా పరిశీలనలో మీకు కేవలం సభ్యులందరూ, బాట్‍లు, నిర్వాహకులు, అధికారులు జాబితాలు మాత్రమే సభ్యులను చూపిస్తున్నాయి. మిగితా హోదాలు ఉన్నపటికీ, అవి కూర్పబడలేదు లేదా అధికారులు ఆ పేజీని ఇంకా సృష్టించలేదు/దాచి ఉంచారు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:16, 11 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మార్పులూ, చేర్పులూ, క్రితం నెలలో చేసిన ఎడిట్ల సంఖ్యతో చురుకుగా పనిచేసే వారి జాబితా మీకు http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm వద్ద లభ్యం కానీ, ఇది ప్రస్తుతం ఫిబ్రవరీ వరకున్న సమాచారం చూపుతోంది. తాజా సమాచారం కోసం టూల్‍సర్వర్ ఖాతా ఉన్న వాడుకరులు తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:19, 11 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, మీరడిగిన సమాచారం ప్రత్యేక:గుంపుహక్కులజాబితా లో ఉంది --వైజాసత్య (చర్చ) 07:26, 3 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సిధ్ధాంతం - వాదం[మార్చు]

భౌతిక శాస్త్ర వివిధ గ్రంధాలలో Geo centric theory, Heleo centric theory లకు "భూ కేంద్రక సిద్ధాంతం" మరియు "సూర్య కేంద్రక సిద్ధాంతం" అని ఉన్నది. శాస్త్రి గారు భౌతిక శాస్త్ర పారిభాషిక పద కోశమునందు సిద్ధాంతము కు బదులుగా "వాదము" అని మార్చారు. అలాగే చాలా వ్యాసాలలో (ఐన్ స్టీన్) సిద్ధాంతం నకు బదులు వాదం అని మారుస్తున్నారు. సిద్ధాంతం మరియు వాదం అనే పదాలను ఉపయోగించడంలో గల భేదాలను తెలియ జేయండి. ఏ పదమైనా ఉపయోగించవచ్చా!--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 01:20, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

శాస్త్రమునకు సంబందించినది సిద్ధాంతం అని, వాడుకలో వచ్చే పదం వాదం, రెండు తెలుగు పదాలకు అర్థములు వేరు వేరు అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:13, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సిద్ధాంతానికి వాదానికి ఖచ్చితమైన సరిహద్దు లేదు కాని రెండింటికీ మధ్య అర్థంలో తేడా మాత్రం ఉంది. సిద్ధాంతానికి మూలం శాస్త్రీయత అయితే వాదం అనేది తార్కికంపై ఆధారపడి ఉంటుంది. అంటే శాస్త్రీయంగా నిరూపించగలిగే దేనినైననూ సిద్ధాంతంగా పేర్కొనవచ్చు. దానిని ఏ కాలంలోనైనా, ఎవరు చేసిననూ, ఎక్కడ చేసిననూ ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. వాదానికి శాస్త్రీయంగా నిరూపించలేము. అదేసమయంలో ఒకే అంశంపై అనేక వాదాలుండవచ్చు. అది వారివారి తార్కిక (లాజిక్) దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భూకేంద్ర సిద్ధాంతం అనేది వాదం కిందికే తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక శాస్త్రంలో శాస్త్రీయంగా నిరూపించలేని వాటన్నింటినీ సిద్ధాంతాలనే అంటున్నారు! సిద్ధాంతం అన్నప్పుడు సాధారంగా మార్పు చెందరాదు కాని కాలం గడిచేకొద్దీ ఒకే అంశంపై కొత్త కొత్త సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో సరైన సమాధానం ఇవ్వడం కొంత ఇబ్బందే. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:33, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013విజయవంతచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు[మార్చు]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఆలోచనని ప్రతిపాదించి సభ్యుల మద్దతు కూడగట్టిన మల్లాది కామేశ్వరరావు గారికి, దీనిని నిర్వహించడంలో ముఖ్యపాత్రవహించిన రాజశేఖర్, రహ్మనుద్దీన్, తదితర కార్యనిర్వాహక సభ్యులకు, వీడియో సందేశాలు పంపిన వెన్న నాగార్జున గారికి,సందేశాలు పంపించిన తోటి సభ్యులకు, సర్వసభ్యసమావేశంలో అమెరికానుండి వీడియా సమావేశం ద్వారా పాల్గొన్న రవి వైజాసత్యకు, పాల్గొన్న సభ్యులందరికి, సహకారం అందజేసిన సిఐఎస్-ఎ2కే , వికీమీడియా, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారి పెద్ది రామారావు వారి సిబ్బందికి, ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన ప్రముఖులందరికి, మీడియాకు , సమావేశం విజయవంతం చేసినందుకు తోడ్పడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమ మనందరిలో వికీపీడియా స్ఫూర్తిని మరింత పెంచి, తెవికీ అభివృద్ధికి సహాయపడుతుందని నేను విశ్వసిస్తాను. --అర్జున (చర్చ) 08:33, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • వికీపీడియాలో చేరి తక్కువకాలం అయ్యినప్పటికి చురుకుగా వికీపిడియా చర్చలలో పాల్గొంటూ,తెలుగు వికీపీడియా మహోత్సవంను ఉగాది పర్వదినాన నిర్వహించాలను మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన మల్లాదిగార్కికి , సహాకారంగా ఉత్సహంగా ముందుకు వచ్చిఅయనకు అన్నిరకాలమద్ధతుఇస్తూ, ఈ ఉత్సవాన్ని విజయవంతంచేయుటకు కృషిచేసిన డా.రాజశేఖరు,రహ్మనుద్దీన్,ప్రణయరాజ్, అర్జున్ గార్లకు,మరియు తెలుగు వికీపీడియామహోత్సవం మిగతా కార్యవర్గసభ్యులకు ధన్యవాదాలు.అలాగే పాల్కొని కార్యక్రమమును విజయవంతంచేసిన నిర్వహాకులకు,సహాసభ్యులకు, సహకారం అందజేసిన సిఐఎస్-ఎ2కే , వికీమీడియా, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారి పెద్ది రామారావు వారి సిబ్బందికి, ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన ప్రముఖులందరికి, మీడియాకు , సమావేశం విజయవంతం చేసినందుకు తోడ్పడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.
 • అయితే ఈ సమావేశానికి చదువరి,చావాకిరణ్,సి.చంద్రకాంతారావు గార్లు రాకపోవడం,కొంతలోటు.వికీపీడియాకై వారుచేసిన కృషి తక్కువేమికాదు.వారుచేసినకృషివలనే మనం నేడు మనం ఈ మహోత్సం చేసుకొనే స్థాయికి ఎదిగినది.వారు తప్పక హజరవుతారని,వాళ్ల అనుభవాలను మాలాంటి క్రొత్త సభ్యులకు చెప్పి,తమ అమూల్యమైన సలహాలనిస్తారని ఆశించాము.వారు ఏక్షణమైనరావచ్చునని,ఆశగా ఎదురుచూసాము. వారిని ప్రత్యక్షంగా చూచి,మాట్లాడలనే మాకోరిక తిరకపోవడంకొంచెము నిరాశజనకమైనప్పటికీ,వీరందురు పెద్ద మనస్సుచేసుకొని మళ్లి తెలుగు వికీపీడియా అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటూ, తమవంతుసహకారం మళ్లి అందించాలని నా వ్యక్తిగతంగా,వికీపీడియా క్రియాశీలక సభ్యులందరి తరుపున అర్థిసున్నాను.పాలగిరి (చర్చ) 13:49, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]


వాడుకరుల పేజీలలో వారి ఇతర సైట్ల, బ్లాగుల వివరాలు[మార్చు]

(1) వాడుకరుల పేజీలలో వారి ఇతర సైట్ల వివరాలు ఉండకూడదు అని చాలా మంది భావన. కొంతమంది అనుసరిస్తున్నారు. మరికొంతమందికి అనుకూలంగా ఉండి, వారి బ్లాగుల వివరాలు, ఇతర సైట్ల లింకులు, మరి ఇతరమైనవి చాలా ఉన్నాయి. వీటి శుద్ధి కార్యక్రమము కూడా ఉన్నది. శుద్ధి కార్యక్రమములో పాలు పంచుకునే వారికి అటువంటివి తొలగించేందుకు నా వంతు సహాకారము చేస్తాను. దయచేసి సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:07, 16 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జునగారు, మీ వాడుకరి పేజీలో ఉన్న బ్లాగుల వివరము, ట్విట్టర్ లింకు, మరి ఇతర లింకుల విషయములు తదితర వికీపీడియాకు సంబంధము లేనివి వెంటనే తొలగించుకోండి. నా లాంటి వారు ఆ పని చేస్తే మీ మనసుకు కష్టం కలగవచ్చు. నేను నిన్న నా దాంట్లో మీలాగానే సైట్ల గురించి పెట్టాను. అవి వెంటనే తొలగించారు. మీరు అధికారి కనుక సరి దారి చూపించండి అందరికి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:06, 17 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇది తు.చ. తప్పకుండా పాటించవలసిన నియమేమీ కాదు. ఇది ఎక్కడినుండి వచ్చిందో అర్ధం చేసుకోని వర్తించాలి. వికీపీడియా వ్యాపార ప్రకటనా స్థలం కాదు అనే నియమం నుండి పరోక్షంగా వచ్చింది. మీ వాడుకరి పేజీని కేవలం వ్యక్తిగత వ్యాపారాన్ని ప్రకటించుకొనే బ్రోచర్లా తయారుచేస్తే సభ్యులు అభ్యంతర పెట్టవచ్చు కానీ బ్లాగు లింకులు, ట్విట్టరు లింకులు ఇలాంటివి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఈ విషయంతో పీపకాయల రాజు గురించి గుర్తుకు వచ్చింది. తెవికీలో పీపకాయల రాజు గారని ఒక వాడుకరి ఉండేవారు. ఆయన ఎప్పుడు ఇక్కడ దర్శనమిచ్చినా కేవలం ఆయన వాడుకరి పేజీ మాత్రమే దిద్దుకొని వెళ్ళేవారు :-) --వైజాసత్య (చర్చ) 08:43, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, ఈ సందర్భములో తెలియజేయునది ఏమనగా, మనము వికీపీడియా గురించి అనేక సైట్లలో ప్రచారం చేస్తున్నాము. కానీ ఇక్కడ అటువంటి ప్రచారములకు వికీ విరుద్ధము. కానీ మనము ఏ ఏ సైట్లలో (అనగా బ్లాగులు, ట్విట్టర్, పేస్‌బుక్, ఆర్కుట్, ఇతర సైట్లు) వికీపీడియా గురించి ఏ ఏ విధములుగా ప్రచారము చేస్తున్నామో తెలిపే లింకులు ఆయా సభ్య పేజీలలో మాత్రమే పొందు పరచుకుంటుంటే, అవి కూడా [2]తొలగిస్తున్నారు. ఇది ఏంత వరకు సబబు, న్యాయము అంటారు ? నాకు సమాధానము ఈ రోజు వరకు (ఇప్పటి మీ సమాధానము కాదు) రాకపోయే సరికి నేనే అర్జున గారి బ్లాగు, ట్విట్టర్ వివరములు తొలగించాను. ఇప్పుడు మీ సమాధానమునకు చర్చలు ఏమైనా సాగుతాయేమో తదుపరి కొంత కాలము వేచి చూద్దాము. చివరకు అందరూ ఒక నిర్ణయానికి వస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:59, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

(2) సభ్యులు,ఈ మార్పు (సమయము: 20:33, ఏప్రిల్ 16, 2013‎ ) అర్థము [3]తెలిసిన వారు తెలియపరచగలరు. ఇందులో అర్జున గారి పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియ లేదు. ఒకవేళ సుజాత గారు, అర్జున గారి సలహా, సంప్రదింపులతో నా వివరాలు తొలగించారని అనుకోవాలా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:14, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ ! ఈ విషయం ఇప్పుడే గమనిస్తున్నాను. సభ్యుల పేజీలో మార్పులు తొలగింపులు వంటివి నేను చేయను. అర్జునరావుగారూ ! అలాంటి సలహలు ఇవ్వరు. ఇతరుల సలహా మీద నేను ఇలాంటివి ఎందుకు చేస్తాను ? నేను " టచ్ స్క్రీన్ " లో పని చేస్తున్నందు వలన ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చు. మీ పేజీలో మీ బ్లాగులు, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇతర లింకులు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు తిరిగి నిరభ్యంతరంగా పెట్టొకోవచ్చు. --t.sujatha (చర్చ) 04:10, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • మార్పులు చేసినప్పుడు వికీపీడియా చరిత్రలో కనబడిన సందేశం అంత వివరణాత్మకమైనది కావడం వలన ప్రసాద్ గారు పొరబడినట్లున్నారు. సుజాత గారు తెలిపినట్లు ఏదో పొరబాటు జరిగిందేమో? ఆ సందేశానికి మెరుగైన అనువాదం చేస్తే మంచిది.--అర్జున (చర్చ) 05:27, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జునరావుగారు చెప్పినట్లు ఈ సందేశంలో మార్పులు జరగాలి. లేకుంటే ఇదేదో తీవ్రమైన చర్చనీయాంశలా కనిపించే అవకాశం ఉన్నది. --t.sujatha (చర్చ) 14:08, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఆ సందేశం గురించి: పేజీలో మార్పులను తిప్పికొట్టేప్పుడు (అంటే revert చేసేప్పుడు) చివరిసారి ఎవరి మార్పు అయితే మంచిదో/సరైనదో ఎంచుకొని ఆపై జరిగిన మార్పులు రద్దుచేయవచ్చు. ఆ సందర్భంలో చివరి కూర్పు ఎవరిదో అక్కడివరకూ పేజీ స్థితిని తీసుకువెళ్ళారు అని దాని అర్థం. అయితే, ఈ సందేశం ట్రాన్స్‌లేట్‌వికీలో మెరుగుపరచబడింది. కానీ ఆ మార్పు తెవికీలో ఇప్పటికే అనువాదం ఉండటం వల్ల ప్రతిఫలించలేదు. ఇప్పుడు నేను తెవికీలోని అనువాదాన్ని తొలగించాను. కనుక ఇకనుండి తెవికీలో మెరుగైన సందేశం కనిపిస్తుంది. ఇదీ ప్రస్తుత సందేశం: ఫలానావాడుకరి (చర్చ) చేసిన మార్పులను ఫలానా2వాడుకరి యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. దీనికి మరింత మెరుగైన అనువాదాన్ని ఇక్కడ సూచించవచ్చు. — వీవెన్ (చర్చ) 14:41, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి పుట వారి ఇష్టాఇష్టాలకే వదిలెయ్యటం బాగుంటుంది. Chavakiran (చర్చ) 03:53, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

క్రియాశీల వాడుకరుల బాజితా[మార్చు]

ఈ మధ్యన ప్రత్యేక పేజీలలో ఉండే క్రియాశీల వాడుకరుల బాజితా అనేది ఇటు వికీపీడియాలోను అటు విక్షనరీలోనూ తొలగించారు. కారణము తెలియదు. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:19, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ జాబితాను మీడియావికీ (వికీలు నడిచే సాఫ్ట్‌వేర్ ఉపకరణం) లోనే తొలగించారు. ఈ భోగట్టాను చూపించే క్వెరీలు నెమ్మదిగా పనిచేస్తున్నాయన్నది కారణం. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితాను తిరిగి పునఃస్థాపించాలన్న అభ్యర్థననూ నిరాకరించారు. భవిష్యత్తులో ఈ సౌలభ్యం పొడగింత (ఎక్స్‌టెన్షన్) రూపంలోనో లేదా ఏ వికీకి ఆ వికీకి ప్రత్యేకంగానో అందుబాటులోనికి వచ్చే అవకాశం ఉంది. — వీవెన్ (చర్చ) 15:16, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చిన్న అక్షరాలు[మార్చు]

గత వారం రోజులుగా నా సిస్టంలో తెవికీ అక్షరాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నవి.టైపు చేయుటకు ఇబ్బందిగా వున్నది. విక్షనరీలో అక్షరపరిమాణం మాములుగానే వుంది.పరిష్కారంఏవ్వరైన సూచించగలరు.పాలగిరి (చర్చ) 12:21, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు Ctrl అనే బటన్ పట్టుకునే, పైన ఉన్న + గుర్తును ఒకటి లేదా రెండు సార్లు నొక్కండి. అక్షరాలు పెద్దవి అవుతాయి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:30, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీ సలహా కు ధన్యవాదాలు.పాలగిరి (చర్చ) 21:59, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
స్వాగతము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:11, 22 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

CIS-A2K 2013-14 ప్రణాళిక[మార్చు]

తెలుగు వికీ మిత్రులకు నమస్కారం. CIS-A2K 2013-14 పూర్తి ప్రణాళికను మీరు ఇక్కడ చూడగలరు. తెలుగు ప్రణాళికకు లాగే ఈ overall ప్రణాళికపై మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్థన. విష్ణు (చర్చ)07:41, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Request for comment on inactive administrators[మార్చు]

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians. Please also consider translating the proposal.)

Read this message in English / Lleer esti mensaxe n'asturianu / বাংলায় এই বার্তাটি পড়ুন / Llegiu aquest missatge en català / Læs denne besked på dansk / Lies diese Nachricht auf Deutsch / Leś cal mesag' chè in Emiliàn / Leer este mensaje en español / Lue tämä viesti suomeksi / Lire ce message en français / Ler esta mensaxe en galego / हिन्दी / Pročitajte ovu poruku na hrvatskom / Baca pesan ini dalam Bahasa Indonesia / Leggi questo messaggio in italiano / ಈ ಸಂದೇಶವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ / Aqra dan il-messaġġ bil-Malti / norsk (bokmål) / Lees dit bericht in het Nederlands / Przeczytaj tę wiadomość po polsku / Citiți acest mesaj în română / Прочитать это сообщение на русском / Farriintaan ku aqri Af-Soomaali / Pročitaj ovu poruku na srpskom (Прочитај ову поруку на српском) / อ่านข้อความนี้ในภาษาไทย / Прочитати це повідомлення українською мовою / Đọc thông báo bằng tiếng Việt / 使用中文阅读本信息。

Hello!

There is a new request for comment on Meta-Wiki concerning the removal of administrative rights from long-term inactive Wikimedians. Generally, this proposal from stewards would apply to wikis without an administrators' review process.

We are also compiling a list of projects with procedures for removing inactive administrators on the talk page of the request for comment. Feel free to add your project(s) to the list if you have a policy on administrator inactivity.

All input is appreciated. The discussion may close as soon as 21 May 2013 (2013-05-21), but this will be extended if needed.

Thanks, Billinghurst (thanks to all the translators!) 05:23, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery (Wrong page? You can fix it.)
ఇక్కడ తెలుగు అనువాదము చేసిన పిదప లేదా విషయము అర్థం అయిన తరువాత మన అభిప్రాయములు ఎక్కడ, ఏలా తెలియజేద్దాము. దీని కోసం వేరే పుటలో (పేజీ) లేదా ఇక్కడే అందరము చెప్పవచ్చునా ? మరి నా అభిప్రాయము మాత్రము ఆంగ్లములో కన్నా తెలుగులోనే విపులంగా, స్పష్టముగా చెప్పగలను. అంత వివరముగా చెప్ప వచ్చునా ? నాకు ఓ పుటను కేటాయించండి. నాకు సమయము, సందర్భ అభిప్రాయ ఆలోచన వచ్చినప్పుడు (పైన వారు కేటాయించిన సమయము లోపల లేదా) మీరు నిర్ణయించిన సమయము లోపల లేదా ముందుగానే నా స్పందన పొందు పరచగలను. నిర్వాహకత్వంపై చర్చ ఎలాగూ సాగుతోంది. గమనించండి. అందరూ మాట్లాడండి తప్పకుండా. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:37, 24 ఏప్రిల్ 2013 (UTC).Reply[ప్రత్యుత్తరం]

విక్షనరీ అనవసరం పేజీలు[మార్చు]

విక్షనరీ అనవసరం పేజీలు [4] గురించి చర్చలు మొదలయ్యాయి. ఇంకా అనేక చర్చలకు అందరూ అర్హులు, ఆహ్వానితులే. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:20, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Wikidata phase 2 (infoboxes) is here[మార్చు]

Wikidata-logo-en.svg

Sorry for writing in English. I hope someone can translate this. If you understand German better than English you can have a look at the announcement on de:Wikipedia:Kurier.

A while ago the first phase of Wikidata was enabled on this Wikipedia. This means you are getting the language links in each article from Wikidata. We have now enabled the second phase of Wikidata (infoboxes) here. We have already done this on the [first 11 Wikipedias] (it, he, hu, ru, tr, uk, uz, hr, bs, sr, sh) a month ago and two days ago on the English Wikipedia. Today all the remaining Wikipedias followed.

What does having phase 2 enabled here mean? You are now able to make use of the structured data that is available on Wikidata in your articles/infoboxes. It includes things like the symbol for a chemical element, the ISBN for a book or the top level domain of a country. (None of this will happen automatically. Someone will have to change the article or infobox template for this to happen!) The current state is just the beginning though. It will be extended based on feedback we get from you now.

How will this work? There are two ways to access the data:

 • Use a parser function like {{#property:p159}} in the wiki text of the article on Wikimedia Foundation. This will return “San Francisco” as that is the headquarter location of the non-profit.
 • For more complicated things you can use Lua. The documentation for this is here.

We are working on expanding the parser function so you can for example use {{#property:headquarter location}} instead of {{#property:p159}}. The complete plan for this is here.

Where can I test this? You can test it on test2 if you don't want to do it in an article here.

Where can I find more information and ask questions? We have collected the main questions in an FAQ for this deployment. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages.


We are excited about taking yet another step towards allowing all Wikipedias share structured data and collect and curate it together. --Lydia Pintscher 19:22, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

తొలగించవలసిన వ్యాసాలు[మార్చు]

ప్రస్తుతం 150 పైగా తొలగించవలసిన వ్యాసాలున్నాయి. వర్గం:తొలగించవలసిన వ్యాసములు వాటిని తొలగించడానికి ఎంత సమయం వేచి చూడాలి.Rajasekhar1961 (చర్చ) 07:02, 26 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తొలగింపు మూస చెర్చిన నెలరోజుల తరువాత,వ్యాసం విస్తరింపబడకపోయినచో తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 01:42, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:26, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పాలగిరి గారి సూచనతో నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కాకపోతే వ్యాసకర్త మనకు తెలిసినవారైతే (ముఖ్యముగా వారు చురుకైన సభ్యులైతే) ఒకసారి మెయిలు ద్వారా వారికి రిమైండర్ పంపితే బాగుంటుంది.--విష్ణు (చర్చ)08:17, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విలీనం చేయవలసిన వ్యాసాలు[మార్చు]

ప్రస్తుతం 255 పైగా తొలగించవలసిన వ్యాసాలున్నాయి. వర్గం:విలీనము చేయవలసిన వ్యాసములు వాటిని విలీనం చేయటానికి ఎంత సమయం వేచి చూడాలి. వాటిపై కూడా చర్చించండి.Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 01:19, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విలీనం మూస చెర్చిన నెల తరువాత,వచ్చిన స్పందనలను బట్టి,విస్తరింపబడని వ్యాసాలను విలీనంచెయ్యవచ్చును.పాలగిరి (చర్చ) 01:43, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేద్దాము.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:24, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రూపాయ గుర్తు[మార్చు]

 • ఈ మధ్యనే ప్రభుత్వం వారు ప్రవేశ పెట్టిన రూపాయ గుర్తును తెవికీ లో ఎలా టైపు చెయ్యాలి?కంపశాస్త్రి 23:02, 26 ఏప్రిల్ 2013 (UTC)
 • ఉబుంటులో ఇంగ్లీషు కీ బోర్డుతో పనిచేస్తున్నప్పుడు లోహిత్ ఖతి వాడుతుంటే, CTRL+SHIFT+u నొక్కి తరువాత 20B9 తరువాత స్పేస్ బార్ (ఖాళీ)నొక్కితే ₹ (రూపాయి గుర్తు) కనబడుతుంది. విండోస్ లో Alt నొక్కి వుంచి న్యూమరిక్ కీపాడ్ లో ' +' మీట నొక్కి తరువాత 20B9 నొక్కి Alt వదిలివేయాలి లేక Alt నొక్కివుంచి 0నొక్కి తరువాత 20B9 నొక్కి తరువాత Alt వదిలివేయాలి. ఇది పనిచేయటానికి మీ వ్యవస్థలో వున్న ఖతి తోడ్పాటు వుండాలి. ఇది ప్రామాణికం చేయటం పూర్తికాలేదుకావున కీబోర్డులు మరియు వికీ అంతర్గత టైపు పద్దతులలో మరింత సులభంగా టైపు చేయుటకు చేర్చవలసివుంది.--అర్జున (చర్చ) 04:55, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • "ప్రత్యేక అక్షరాలు" విభాగం లో "గుర్తులు" ఉపవిభాగం లో రూపాయ గుర్తును చేర్చడానికి వీలవుతుందా? అందులో €, ₤, £, ₨, $, ¥ వంటి గుర్తులు ఉన్నాయి.కంపశాస్త్రి 12:12, 27 ఏప్రిల్ 2013 (UTC)

వికీసోర్స్ లో నిర్వాహకత్వ ప్రతిపాదన మరియు వోటుప్రక్రియ[మార్చు]

వికీసోర్స్ లో నిర్వహకత్వ ప్రతిపాదనకు రాజశేఖర్ మరియు సుజాత గార్లు అంగీకరించారు. s:వికీసోర్స్:రచ్చబండ#నిర్వాహక ప్రతిపాదన-రాజశేఖర్ మరియు వోటు ప్రక్రియ మరియు s:వికీసోర్స్:రచ్చబండ#నిర్వాహక ప్రతిపాదన-సుజాత మరియు వోటు ప్రక్రియ విభాగాలలో వోటు ప్రక్రియ ప్రారంభమైంది. వికీసోర్స్ సభ్యులు వోటు చేయవలసినదిగా కోరడమైనది.--అర్జున (చర్చ) 08:34, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • అర్జున గారు, కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. ఇది సరి అయిన సమయము కాదు. అధికారి, నిర్వాహకుడు ఇలాంటి హోదాలకు వాడుకరులు ఎవరయిననూ కావాలనుకునేవారు, ఒక వర్గంగానో లేదా ఏదోవిధముగా ప్రయత్నాల ద్వారా వాడుకరులకు తెలియజేసుకునే కంటే, ఎవరికి వారు ఆయా హోదాకు జతగా అనేక ఆంశాలు పొందు పరచిన ఒక అనుమతి ధృవీకరణ పత్రంలోని ఆంశాలు, వాటి అన్నింటిని తనకు తానే ధృవీకరిస్తూ సంతకం చేసి తన అనుమతిని తెలియజేస్తే, ఎన్నికలలో పాల్గొనలేని వాడుకరులు సరి అయిన అవగాహన పొందుతారు. అటువంటి నకలు ధృవీకరణ పత్రం మనందరము తయారు చేసుకోవల్సిన అవసరము ఎంతయినా ఉంది. దీనికి ఈ లింకులు [5], [6]లోనివి కొంత ఉపయోగ పడతాయి. సభ్యుల స్పందనలు ఈ విషయములో తెలుసుకోవలిసిన అవసరము కూడా ఉంది. (సశేషం)జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 23:21, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • మీ స్పందన సరిగా అర్థం చేసుకోలేకపోయాను. క్షమించాలి. వికీ ప్రాజెక్టులో ఇప్పటివరకు అనుసరించిన పద్దతినే కొనసాగిస్తున్నాము. తెవికీ మెరుగైన స్థితిలో వున్నందున అర్హతకు మార్పుల సంఖ్యలు లాంటి ఇంకొంచెం నిర్దిష్టమైన అంశాలు వున్నాయి. వికీసోర్స్ లో అలా జరుగలేదు. అయినా నేను ప్రతిపాదించిన వారు ఇప్పటికే వికీపీడియాలో నిర్వాహకులుగావున్నందున, వికీసోర్స్లో కృషి చేసినందున వారిని ప్రతిపాదించాను. అయినా అభ్యంతరాలుంటే వికీసోర్స్ ప్రాజెక్టుచర్చలలో స్పందించవలసినది. --అర్జున (చర్చ) 04:21, 1 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారు, ఈ నెలలోనే (కొద్ది రోజులు క్రితం మాత్రమే) వికీ మహోత్సవము,హైదరాబాదులో 10, 11.4.2013 తేదీలలో జరిగిన తదుపరి తోటి సభ్యులలో చాలా రకము లయిన మార్పులు అనేక మందిలో గమనించాను. అవి అప్రస్తుతము. వికీసోర్స్ ప్రాజెక్టు గురించి ముందు వాడుకరులకు అవగాహన పెంచాలి. వాడుకరులు అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించాలి. ఎప్పటినుంచో ఉన్నావారే ఉన్నారు. ఎలాగూ వారే నిర్వాహకులు అయ్యే అవకాశం ఉండవచ్చును. అన్ని అనుబంధ సంస్థలలోనూ వారి వారి సేవలు వాడుకరులు ఏ విధంగా పొందుతున్నారు కూడా గమనించాలి. పేరుకు అధికారాలు అన్ని చోట్ల ఉంటాయి, కాని వారు అందుకు తగిన విధముగా సేవలు అందించ లేక పోవచ్చును. తదుపరి. అధికారము పొందడానికి ముందస్తు నకలు ధృవీకరణ పత్రం అర్థము గురించి మీకు వివరిస్తాను. వాటిలో కొన్ని:
 • నాకు (విక్షనరీ, వికీపీడియా .......... ) (rules and regulations) అవగాహన పూర్తిగా తెలుసును.
 • నేను (విక్షనరీ, వికీపీడియా .......... )లలో ఒక నెలలో ...........రోజులు...గంటలు కనీసము సభ్యులకు అందుబాటులో ఉంటాను.
 • సభ్యులకు సరి అయిన సూచనలు, సలహాలు ఇవ్వగలను.
 • సభ్యులు లేదా అధికారులు నన్ను కొంత కాలము వరకు మాత్రమే ఎన్నుకునేందుకు నాకు సమ్మతమే.
 • అధికారము దుర్వినియోగము చేయను.
 • నేను సభ్యులకు సూచించిన ఏ విషయములో నయినా అజాగ్రత్త జరిగిన తప్పులకు దానికి బాధ్యత వహించ గలను.
 • వర్గాలు, గ్రూపులు, పెంచి పోషించను. రాజకీయాలు చేయను. ఒకరికోసం పనిచేయను.
 • స్వలాభపేక్ష, ఇతరుల కోసం వ్యవస్థ హోదాను వాడను, ఉపయోగించను, ఉపయోగపడను.
 • అందరినీ ఒకే స్థాయి పద్ధతిలో ప్రోత్సహించగలను.
 • ప్రతి వికీ విషయము సభ్యులతో వ్రాత పూర్వకము గానే మాత్రమే చర్చిస్తాను.
 • సభ్యులు లేదా అధికారులు కాని నా పని నచ్చనిచో వికీ పాలసీల పద్ధతిలో నన్ను తొలగించ వచ్చును.

ఇలా చాలా విషయాలు కూర్చిన ఒక పత్రం చేసి ఆశావహులు (aspirants) చేత సంతకము చేయించాలి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:50, 1 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • మీ ప్రతిపాదన అర్థమైంది. సేవా దృక్పధంతో ప్రాజెక్టుపై ఆసక్తివుండి అభివృద్ధి కోరి నిర్వహక పదవిని చేపట్టేవారు ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తే, మీరు సూచించిన వాటిలో వారి వారి పరిమితులకు లోబడి, చాలవాటికి అనుగుణంగానే సాధ్యమైనంతవరకు నడచుకుంటారనుకుంటాను. ఒకవేళ అలా నడచుకోకపోతే ఏ సభ్యుడైన వారిపై అభియోగం తెచ్చి తోటి సభ్యుల మద్దతు లభిస్తే వారిని పదవీచ్యుతలను చేయవచ్చు. మీ ప్రతిపాదనను విధానంగా మలచాలనుకుంటే ప్రాజెక్టు పేజీలో విధాన ప్రతిపాదన చేసి తోటి సభ్యుల స్పందనలతో మెరుగుపరచి తదుపరి వోటు ప్రక్రియలో తీర్మానం గెలిస్తే అమలులోకి తేవచ్చు. అలాగే ప్రస్తుత నిర్వాహక ప్రతిపాదనలపై మీకు అభ్యంతరముంటే , వీలైతే తగిన కారణాలను, ఉదాహరణలతో (ఇతర వికీప్రాజెక్టులవైనా సరే) పేర్కొంటూ వ్యతిరేకించవచ్చు. --అర్జున (చర్చ) 03:45, 2 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీరు ప్రతిపాదించిన స్ఫూర్తి నాకు అర్ధమైంది. కానీ ఈ ప్రతిపాదనలు వికీపీడియాను స్వచ్ఛంద సేవ కాకుండా నిర్భంద సేవగా మార్చే అవకాశముంది. వికీ నియమాలు లోబడి ఉన్నంత వరకు ఇలాంటి ప్రత్యేక హామీలు అవసరం లేదని నా అభిప్రాయం. --వైజాసత్య (చర్చ) 04:26, 3 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీసోర్స్లో కృషి[మార్చు]

 • అర్జున గారు, వికీసోర్స్ ప్రాజెక్టు గురించి కాస్త వివరించండి లేదా లింకు ఇవ్వండి. ఏం పని చేయాలో, నేను వస్తాను, పని చేస్తాను. మీరు చేసిన పనిని గుర్తించండి. ఇలా కొంతమందిని ప్రోత్సహించి అక్కడకు చేర్చండి. మేము చేయగలిగింది చేస్తాము. అభివృద్ధి కనపడుతుంది. మీరు అందుబాటులో మాత్రము ఉంటారనే నమ్మకము ఉంది. నేను ప్రతిపాదించిన పత్రము లేదా రాబోయే ధృవీకరణ పత్రము (ఎన్నో సూచనలు,....జత చేయాల్సి ఉంది) మీద మొదటి సంతకము నేనే చేస్తాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:13, 1 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారు, నిన్న కొంత పని చేశాను చూడండి. పని చేయడానికి చాలా "వికీ" అనుబంధ సంస్థలు మనకు అనేకం ఎలాగూ ఉన్నాయి. అన్నింటి గురించి అందరూ తెలుసుకోవచ్చును. మీరు అందరికి ఆహ్వానము పెట్టండి. కనీసము ఏమిటో అని తెలుసుకునేందుకు కొంతమంది అయినా వస్తారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 00:59, 2 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • చూశానండీ. వికీసోర్స్ వ్యాసం చూసి తదుపరి వికీసోర్స్ ప్రాజెక్టును కొంత పరిశీలించితే ప్రాజెక్టు గురించి అర్థంచేసుకోవటం కష్టంకాదుగదా. అక్కడి రచ్చబండ, సముదాయపందిరి, ఇటీవలి మార్పులు చూస్తుంటే తోటి సభ్యులు ఏంచేస్తున్నారో తెలిసి, ఆసక్తివుంటే వికీసోర్స్ కి ఎలా తోడ్పడవచ్చో అర్థమవుతుందనుకుంటాను. ఒకవేళ సందేహాలుంటే ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు తోటి సభ్యులు నివృత్తి చేస్తారు. సోదర ప్రాజెక్టులగురించి అప్పుడప్పుడు వికీపీడియాలో వార్తల రూపంలో తెలియచేస్తున్నాము. కొత్త వారిని ఆకర్షించడానికి అవి సరిపోతాయనుకుంటాను. అయినా అంతకుమించి ప్రత్యేకంగా ఆహ్వానించటానికి నాకు ప్రస్తుత పరిస్థితులలో వ్యక్తిగతకారణాలవలన వీలుకాదు.--అర్జున (చర్చ) 03:52, 2 మే 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విక్షనరీలో సుజాత గారికి అధికారి హోదా ప్రతిపాదన[మార్చు]

సుజాత గారిని విక్షనరీలో అధికారిగా చేయటానికి నేను ప్రతిపాదించాను. wikt:విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/T.sujatha పేజీలో మీ మద్దతు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 09:19, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వైజాసత్యగారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 23:28, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారి నిర్వాహక హోదా ప్రతిపాదన[మార్చు]

విక్షనరీ ప్రస్తుతం వేగవంతగా అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ నిర్వాహకుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కొరత తీర్చడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్న రాజశేఖర్ గారిని నిర్వాహకునిగా ప్రతిపాదిస్తున్నను. వారికి సహసభ్యులు మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీ మద్దతు తెలపండి wikt:విక్షనరీ:నిర్వాహక హోదా/రాజశేఖర్.--T.sujatha (చర్చ) 18:14, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

T.sujatha గారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 23:29, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విక్షనరీ లో గ్రామాల పేర్లు చేర్చుట గూర్చి[మార్చు]

 • విక్షనరీ లో గ్రామాల పేర్లు విపరీతంగా ప్రస్తుతం చేరుస్తున్నారు. యిలా చేర్చుతూ పోతే భారత దేశం లోని అన్ని గ్రామాలు చేరే అవకాశం ఉంది. మనం భాషా సంబంధిత విషయాలను చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలా గ్రామవ్యాసాలు, ఇంటిపేర్లు, సినిమా పేర్లు, మనుష్యుల పేర్లు, ...... యిలా అన్నింటిని చేర్చవచ్చునా?
 • గూగుల్ సెర్చ్ లో మనం ఒక విషయాన్ని అన్వేషించినపుడు మొదటగా వికీపీడియా, విక్షనరీ లు కూడా వస్తాయి కదా. మనం వికీ పీడియాలో అనేక గ్రామ వ్యాసాలను చేర్చాము కదా. అన్వేషించే వ్యక్తి సంబంధిత విషయం తెలుసుకొనేందుకు వికీపీడియాను ఉపయోగిస్తాడు. మరల ఆ వ్యాసాలను విక్షనరీ లో చేర్చవలసిన అవసరం ఉందంటారా?
 • ఇది విక్షనరీ లో భాషా సామర్థాలను పెంచే కృషిలా కనబడుట లేదు. పేజీల సంఖ్యను పెంచే కృషిలా కనిపిస్తుంది.
 • విక్షనరీ లో పదాల యొక్క వివిధ భాషా విషయాలను పెంపొందించే కృషి జరగవలసి యున్నది. దానికి అందరం పాటుపడాలని కోరుతున్నాను.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 03:47, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
విక్షనరీలో సమాధానము [7] ఇచ్చాను చదువుకోండి. ముందు తెలుసుకునేందుకు ప్రయత్నించి, ఆ తరువాత చర్చ చేయండి. చర్చలు చేసి పని నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యన మీరు అన్ని విషయాలలో, అన్ని చోట్ల చాలా విపరీతంగా స్పందిస్తున్నారు. చాలా మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:44, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీకు అక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని సమాధానము ఇక్కడ కూడా పొందు పరుస్తున్నాను. చదువుకోండి.
మీరు ఆంగ్ల విక్షనరీ చూసినట్లు లేదు. ఇక్కడ [8] చూడండి. అన్ని ఇతర విక్షనరీలలో ఉన్నాయి. ఒకసారి అన్ని వర్గాలు చూడండి. ఏ విక్షనరీలలోనూ పూర్తిగా సమగ్రంగా సమాచారము ఉండదు. అన్నిచోట్ల పదాలు వాళ్ళు కూడా చేర్చాలి. ఇంక, గ్రామవ్యాసాలు కాదు పదాలు. మీకు వ్యాసాలకు పదాలకు తేడా తెలియదని నేను అనుకోను. కేవలము మీరు వాదన వినిపిస్తున్నారు. అన్ని శాస్త్రాలు, డిక్షనరీలు చదివిన మీకు, శాస్త్రవ్యాసాలలో ఉన్న పదాలు డిక్షనరీల్లో లేవంటారా ? ఏ భాషలలో ఇలాంటి మీ వాదన లేదు. ఒక పదానికి ఏ అర్థం తెల్సుకోవాలంటే ఎవరూ వ్యాసం చదవరు. ముందు అది మీరు తెల్సుకోండి. పదానికి అర్థము కావాలంటే మీరు వ్యాసాలు చదువుతారేమో ? మేమేవరమూ చదవము. అనేక విక్షనరీల్లో లక్షల పదాలు ఏలా వస్తున్నాయో, వచ్చాయో మీకు తెలిస్తే చెప్పండి. ఆ పదాలే ఏకాభిప్రాయముతో చేర్చుదాము లేదా చేర్చండి. దీనికి రచ్చలు ఎందుకు ? గ్రామాల పేర్లు అసలు మొదలు పెట్టింది ఎవరో మీకు తెలియదు. ఇక్కడ [9] చూడండి. ఏమీ తెలియకుండా ప్రతిసారి ఏదో రాసేస్తారు. ఇంకముందు అన్నీ ఆలోచించుకుని వ్రాయండి. లేదా సందేహం అడగండి. (1) ఇంటిపేర్లు, మనుష్యుల పేర్లు: వ్రాయవచ్చును. మనము ఇప్పుడు కొంతకాలము వద్దు అనుకుంటున్నాము. ఇంతకు ముందు డా.రాజశేఖర్ గారు నాతో చర్చించారు. ఎన్నో విషయాల మీద చాలాకాలముగా చర్చిస్తున్నారు. ఆయన అనుమతితోనే ఏ పదాలు అయినా ఇక్కడ వ్రాయడము జరుగుతున్నది. నేను వ్రాసే ఏ పేజీ పదము అయినా సంజాయిషీ ఇవ్వగలను. ఇది నా స్వంత నిర్ణయాలు కాదు. అయినా ఆయన (డా.రాజశేఖర్ గారు) కాని మరెవరికి కాని తెలియకుండా నేను వ్రాసే పదాలు గురించి తప్పకుండా ఆయా పదాలు పేజీలలో సందేహం తెలియపరచిన, జవాబు ఇవ్వగలను. (2) తదుపరి భాషా సామర్థాలను పెంచే కృషిలా కనబడుట లేదు అని అంటున్నారు. ఉదా: మా తోటి వాడుకరి కొన్ని వేలు (షుమారు 28 వేలు) పేజీలు ఇక్కడ ఎక్కించి, మొదటి స్థానము వరకు వస్తున్న వారు ఇప్పుడు విక్షనరీ అనగానేమి ? అని రచ్చబండలో అడుగుతున్నారు. ఆయన తప్పులేదు. అడగడములో ఎటువంటి పొరపాటు లేదు. ఆయన తెలుసుకోవాలనుకున్నారు. కాని ఆయన ఇక్కడకు వచ్చే ముందు కొత్తవారే. ఎవరో ఒకరు వారికి సలహాలు ఇచ్చి ఉండవచ్చును. కొన్ని వేలు పేజీలు తదుపరి వారికి సూచనలు, సలహాలు ఇప్పుడు దొరకడము లేదేమో ? అందువల్ల నా లాంటి వారు పేజీలు పెంచడము కోసమో, మరే రకమయిన వాటి కోసమో ఇక్కడకు రారు. ముందు తెలుసుకోండి. ఎవరయినా కొంతవరకు పని చేయగలరు. మీరు తదుపరి మరికొంత చేయవచ్చును. వ్యాసాలే పదిమంది తలోచెయ్యి వేసి పూర్తి చేస్తున్నారు. ఇది అంతే. మీ సామర్థాలను విమర్శలతో కంటే పనులతో ఇక్కడ ప్రదర్శించండి. అందరము నేర్చుకుంటాము. అందరూ మాటలు........ రచ్చబండలు ................చేస్తున్నారు. పనులు ఎంతవరకు, ఎవరు ఏమి పాటుబడుతున్నారో కూడా గమనించండి. ఒకరిని పని చేయమని చెప్పేకంటే, ఎవరు ఏం చేస్తున్నారు ?, .............జరిగే పనికూడా జరగ నివ్వకపోతే .....ఆ పని కూడా ఆంతా .......ఒకరు చేయాలి లేదా ఆ పని ఆగి పోతుంది. (3) చివరిగా మీ 3వ సందేహ సలహాలో, "'వివిధ భాషా విషయాలను పెంపొందించే కృషి జరగవలసి యున్నది. దానికి అందరం పాటుపడాలని కోరుతున్నాను"' అని అన్నారు. అ పని ఎలా చేయాలో వినే వాళ్ళకు చెప్పరు. నా లాంటి వారు చెప్పినా వినేవారు ఉన్నారా ? నాకు తెలిసిన పని అందరకూ చెప్పడమే నా అభిమతం. మనమే మనకు తెలిసిన పని, విక్షనరీ యొక్క (rules and regulations) పని విధానాలకు లోబడి చేసుకుపోవడము ఉత్తమమని నా అభిప్రాయము. ఇంకా ఏమైనా ఉంటే ఆడగండి. (సశేషం) జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:12, 29 ఏప్రిల్ 2013 (UTC)
కె.వెంకటరమణ గారికి, వికిపీడియా, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీకోట్స్, వికీకామన్‌స్, .......ఇలా అనేక అనుబంధ సంస్థలు మనకు ఉన్నాయి. మీకు వీటి గురించి తెలిసిన వివరాలు దయచేసి తెలియ బరచగలరు. అప్పుడు మీకు మీకే సమాధానాలు దొరుకుతాయి. చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:28, 29 ఏప్రిల్ 2013 (UTC)
నేను నాకు తెలియని అంశాల గూర్చి ప్రశ్నల రూపంలో మాత్రమే ఆడిగాను. దానికి మిరు అతిగా స్పందిస్తున్నారు. ఒక సభ్యునిగా అడిగే హక్కు లేదంటారా? మీకు తెలిస్తే ప్రశ్నలకు సమాధానములు తెల్పండి. పాత చర్చల గురించి నాకు తెలియదు. మీరు సూటిగా సమాధానం చెబితే సంతోషం. దీనికి ఇన్ని వివరణలు ఒకరితో పోలికలు నాకు అవసరం లేదు. నాకు తెవికీలో రచనలు గూర్చి తెలుసు. విక్షనరీ లో తెలియదు. మీరు అర్థమయ్యేటట్లు చెప్పవససి యున్నది. కానీ ఇంత కథ అవసరమంటారా. మీరు విక్షనరీ కి అందరికీ స్వాగతాలు చెబుతారు.ఒక నిర్వాహకునిగా సభ్యుల సమస్యల పట్ల స్పందన ఇలానే ఉంటుందా! నేను అన్ని విషయాల చర్చల పట్ల అతిగా స్పందిస్తున్నానని తెవికీ రచ్చబండలో రాసారు. చర్చల లో అభిప్రాయాలు తెలియజేయటం తప్పు అనిపిస్తే మీ యిష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను ఏ విషయాల పట్ల కూడా స్పందిచనని తెలియజేస్తున్నాను.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:23, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అవి ప్రశ్నలు లాగా లేవు. ఎవరు అతిగా స్పందిస్తున్నారో ఇక్కడ మీ సమాధానమే చెబుతోంది. మీ మర్యాద ఏమయింది ? మీకు కథలాగే ఉంటుంది వివరంగా చెబితే. ముందు ముందు కొత్తగా వచ్చే ఇతరులు తెలుసుకుని, ఇంక మీలాగా అడగరు. స్పందనలు అందరికీ ఒకేలా ఉండవు. మీ ఇష్టం, నా ఇష్టం ప్రకారము చేసుకోవడానికి ఇది మన సొంత సంస్థ కాదు. అంత ఒద్దు లేండి. అడిగే వారికి చెప్పేవారు లోకువ కాదని ముందు తెలుసుకోండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:34, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, వెంకటరమణ గారు దయచేసి ఈ చర్చ కాస్త ఆపండి. చర్చ వ్యక్తిగతమైతే ఎవరికీ లాభదాయకం కాదు. --వైజాసత్య (చర్చ) 07:56, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, "'మీ"' సూచన/సలహా గౌరవిస్తున్నాను. మీరన్నది నిజమే కదండీ ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:19, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నిజానికి రమణ గారికి వచ్చిన సందేశమే ఈ చర్చ శీర్షిక చూడగానే నాకూ కలిగింది. ఆంగ్ల విక్షనరీలో చూడండి ఇలా చేస్తున్నారు. తెలుగు విక్షనరీలో ఇలా చేయ్యాలని నిర్ణయించుకున్నాం అని రెండు ముక్కుల్లో చెప్పే విషయానికి వ్యక్తిగత వ్యాఖ్యలు అనవసరమనుకుంటాను. ప్రశ్నలడిగే సభ్యులను నిరుత్సాహపరచకూడదు. ఒకరికి వీలుకాకపోతే ఇంకోకరెవరైనా సమాధానమిస్తారు. ప్రసాద్ గారూ మీరూ, రాజశేఖర్ గారు, సుజాతగారితో కలిసి విక్షనరీలో చేస్తున్న కృషి మెచ్చుకోదగినది. సుజాత గారు అక్కడ అధికారి అయిన వెంటనే ఆమెకు మిమ్మల్ని విక్షనరీలో కూడా నిర్వాహకులను చేసే అధికారాలు వస్తాయి --వైజాసత్య (చర్చ) 08:22, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, రమణగారికి ఈ నెలనుంచి నేను ఏ పని చేసినా ఆయనకే ముందు ధర్మసందేహాలు వస్తున్నాయి. ఇంతకుముందు సమాధానము [10] మరోవిధముగా ఇచ్చాను. ఆయన లింకులు చూడటము లేదేమోనండి. తదుపరి, విక్షనరీలో చేస్తున్నదానికంటే చేయవలసినది ఎంతో ఉంది. అది ఏమిటి ( ఆ పనులు ఏమిటి ) అని ఉత్సాహంగా ఉండి ముందుకు వచ్చి అడిగి, తెలుసుకుని పని చేయాలనుకునే వారికి తప్పకుండా అన్ని విధాలుగా నాకు తెలిసిన విషయాలు స్నేహపూర్వకంగా సభ్యులకు తెలియజేస్తాను. మనకు తెలుగు అధికారి కనుక ఉంటే, నన్ను నిర్వాహకునిగా చేసేందుకు నా కోసం ఎంతో కష్టపడిన అర్జున గారు, ఆ తదుపరి సుజాత గారు, రాజశేఖర్ గార్లు చేసిన కృషి నా విషయములో నిర్వీర్యము అయి ఉండేది కాదు. తిరిగి నా వ్యక్తిగత అభ్యర్థన విషయములో చర్చలు ఫలించలేదు. అందుకనే ఇంక ముందు వ్యక్తిగత అభ్యర్థన చేయదలచు కోలేదు. మన పని మనం చేస్తూ ఉంటే అధికారాలు అనేవి వాటంతట అవే మనల్ని వెతుక్కుని వస్తాయని నా ఆలోచన పద్ధతి. ఈ విషయము లోనే డా. రాజశేఖర్ గారు నేనూ చాలాకాలం అనేక విషయాల మీద చర్చలు చేసుకుంటూ, ఈ పదవుల విషయములో కూడా అనుకున్నాము. అధికారిగా లేదా నిర్వాహకులుగా ఎవరు ఉంటారనే దానికంటే, ఆ పాత్రలో ఉన్నవారు ఎంత వరకు సభ్యులకు అందుబాటులో ఉంటారనేది నా సందేహం. మీరన్నట్లుగానే, ఈ నాడు విక్షనరీకి తెలుగు అధికారి ఉంటే మనమే నిర్వాహకులను నియమించు కోవచ్చునని ఈ మధ్యన 10, 11.4.2013 తేదీలలో జరిగిన తెలుగు వికీపీడియా సమావేశము సభ నందు సభ్యులకు తెలియజేశాను. నాకు ఎలా ఎవరిని నియమించినా వారికి అభినందనలతో నా అభిప్రాయము తెలుపగలను మరియు వారికి తప్పక సహకరించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:01, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మూసలు తొలగింపు[మార్చు]

సుజాత గారికి, విక్షనరీ పేజీలో మూసలు ఉండకూడదని చాలా సందర్భాలలో చర్చకు వచ్చింది. ఇప్పుడు మూసలు ఉంచాలో తొలగించాలో తెలియజేస్తే (కనీసం నేను ప్రవేశ పెట్టిన మూసలు తొలగిస్తున్నాను) నేను వెంటనే తొలగిస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:14, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

--t.sujatha (చర్చ) 03:03, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరిచ్చిన సమాధానం నాకు అర్థం కాలేదు. en:రైతు అని ఖాళీ పుట ఉంది. ప్రస్తుతము చాలా వరకు మూసలు తొలగించాను. వాటికి సంబంధించిన పేజీలు కూడా శుభ్రము చేస్తాను. బొమ్మలు/దస్త్రాలు కూడా ఏమైనా తొలగించాల్సినవి ఉంటే లింకు ఇవ్వండి అవి కూడా తొలగిస్తాను. విక్షనరీలో ప్రస్తుతము నేను నిర్వాహకుడిని కాను, అందువల్ల పూర్తిగా తొలగించలేను కనుక మూస:తొలగింపు పెడుతున్నాను. గ్రహించగలరు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:17, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

--t.sujatha (చర్చ) 04:13, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

* భారతీయ రైల్వేలు మూసలు అన్నీ తీసివేశాను. దానికి సంబంధించిన ఏ పేజీలు తీసివేయాలో నిర్వాహకులు నిర్ణయించి తొలగించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:30, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
*సుజాత గారికి, నాతో చర్చించిన వారిని కూడా ఇక్కడ తొలగించాల్సిన వాటిని సూచించమని చెప్పగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:35, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

[en] Change to wiki account system and account renaming[మార్చు]

Some accounts will soon be renamed due to a technical change that the developer team at Wikimedia are making. More details on Meta.

(Distributed via global message delivery 04:12, 30 ఏప్రిల్ 2013 (UTC). Wrong page? Correct it here.)

వికీపీడియాలోని వర్గాలు[మార్చు]

వికీపీడియాలోని వర్గాలు అనేకం విక్షనరీలో కూడా ఉన్నాయి. ఇటువంటి పేజీల గురించి అనేకసార్లు అనేకమంది తొలగించమని ప్రతిపాదించారు. ఏ వర్గాలు తొలగించాలో ప్రతిపాదించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:37, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

[en] Change to section edit links[మార్చు]

The default position of the "edit" link in page section headers is going to change soon. The "edit" link will be positioned adjacent to the page header text rather than floating opposite it.

Section edit links will be to the immediate right of section titles, instead of on the far right. If you're an editor of one of the wikis which already implemented this change, nothing will substantially change for you; however, scripts and gadgets depending on the previous implementation of section edit links will have to be adjusted to continue working; however, nothing else should break even if they are not updated in time.

Detailed information and a timeline is available on meta.

Ideas to do this all the way to 2009 at least. It is often difficult to track which of several potential section edit links on the far right is associated with the correct section, and many readers and anonymous or new editors may even be failing to notice section edit links at all, since they read section titles, which are far away from the links.

(Distributed via global message delivery 19:01, 30 ఏప్రిల్ 2013 (UTC). Wrong page? Correct it here.)