వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 85

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 84 | పాత చర్చ 85 | పాత చర్చ 86

alt text=కేలండర్ రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2022-03-01 : 2022-05-27

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరణ లేని ఫైళ్లు సరిచేయటం[మార్చు]

బొమ్మల నిర్వహణలో ఐదవ విడతగా (సముచిత వినియోగాల చేర్చటానికి సంబంధించి చివరి విడతగా) 58 మంది సభ్యులు, 2013 నవంబరు 19కి ముందు తెవికీలో ఎక్కించిన 2090 ఫైళ్లకు సముచిత వినియోగానికి సంబంధించిన మూసతో వివరణ లేదు. వాటి జాబితా పేజీ చూడండి. అయితే అవి వ్యాసపేరుబరిలో వాడినందున సంబంధిత సభ్యులకు సరిచేయమని హెచ్చరిక సందేశాలు పంపాను. ఎక్కించిన సభ్యులకు మాత్రమే వాటి మూలం వివరాలు తెలుస్తాయి కాబట్టి వాటిని వారుమాత్రమే చాలావరకు సవరించే వీలున్నది. ఒకవేళం మూలం వివరాలు పేర్కొని వున్నట్లైతే, లేక ఆ బొమ్మ ఆంగ్లవికీ వ్యాసంలో కూడా వుంటే లేక పుస్తకం/డివిడి ముఖచిత్రాల వంటి వాటిని ఇతరులు కూడా సవరించే వీలుంది. తెవికీ పుట్టిననాటినుండి ఇటీవలి కాలం వరకు బొమ్మల నిర్వహణ చురుకుగా జరగలేదు. దోషాలున్న బొమ్మలు ఒక్కటి వున్నా కొత్త వికీపీడియన్లు దానినే మాదిరిగా తీసుకొని మరిన్ని అటువంటి దోషాల బొమ్మలు ఎక్కించేవీలుంది. కావున వారంలోగా చురుకుగా వున్న సభ్యులందరు ప్రయత్నించి, అదనపు సమయం అవసరం అయితే తెలియచేయండి. స్పందనలు లేకపోతే, కొన్ని వారాలు సవరణ పురోగతి గమనించిన తరువాత సవరించని బొమ్మలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 15:22, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాఠ్య ప్రణాళిక-పాఠాలు[మార్చు]

సముదాయ సభ్యులకు నమస్కారం. తెలుగు వికీపీడియా పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా వికీపీడియా శిక్షణకు సంబంధించి 8 పాఠాలతో 1. వికీపీడియా పరిచయం, 2. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, 3. వ్యాస వివరాల పరిచయం, 4. ఖాతాను తెరవడం, 5. వాడుకరి పేజీ సృష్టి, 6. వాడుకరి చర్చాపేజీ, 7. ప్రయోగశాల, 8. వీక్షణ జాబితా పేజీలు సృష్టించడం జరిగింది. ఈ పేజీల్లో ఉన్న పాఠంతో వీడియోలు తయారుచేయడం జరుగుతుంది. కనుక, సముదాయ సభ్యులు ఈ పేజీలను పరిశీలించి తమ సలహాలు, సూచనలు, మార్పులు తెలియజేయగలరని కోరుతున్నాను -- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:09, 2 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. ఈ పేజీలను నేరుగా సరిదిద్దవచ్చా, చర్చ పేజీలో రాయాలా? ఎప్పటి లోగా చెయ్యాలి?__ చదువరి (చర్చరచనలు) 11:34, 2 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం చదువరి గారు. పై పేజీలను నేరుగా సరిదిద్దితే పేజీలో పాఠం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సలహాలు, సూచనలు ఉంటే చర్చాపేజీలో రాసి, అక్షర దోషాలు ఉంటే పేజీలో సరిచేయవచ్చు. తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలు అనే పేజీని ఒకదానిని పెట్టి, ఈ మెత్తం పాఠాల పేజీల లింకులను అందులో చేరుస్తున్నాను. కాబట్టి, ఈ మొత్తం పాఠాలకు సంబంధించిన సలహాలు, సూచనలు, మార్పులు తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలు చర్చాపేజీలోనూ.., ఏఏ పాఠానికి సంబంధించిన సలహాలు, సూచనలు, మార్పులు ఆయా పేజీలకు చెందిన చర్చాపేజీలోనూ మార్చి 11వ తేది నాటికి తెలియజేయగలరని సముదాయ సభ్యులను కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:37, 4 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి సమన్వయం[మార్చు]

గత 90 రోజులలో ఆంధ్రప్రదేశ్ కు లింకున్న వ్యాసాలలో కనీసం 5 మార్పులు చేసిన B.K.Viswanadh, Batthini Vinay Kumar Goud, Bvprasadtewiki, Ch Maheswara Raju, Chaduvari, T.sujatha, మురళీకృష్ణ ముసునూరి, యర్రా రామారావు, రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. తెవికీలో క్రియాశీలక సభ్యులు తక్కువగా వున్నందున ప్రామాణిక ప్రాజెక్టు నిర్వహణ వలన పనికి తగ్గం ఫలితం వుండదు. కాని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమైన వార్తలు చేర్చేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలలో మార్పుల సమన్వయం కోసం ఈ ప్రత్యామ్నాయ నిర్వహణ పేజీ ప్రారంభించాను. దీనిలో సభ్యత్వం తీసుకోవడం, పని కాల అవధి అంటూ వుండదు. ఆసక్తిగల వారు సంబంధిత వ్యాసాలలో కృషి చేయవచ్చు, సూచనలు చేయవచ్చు. సమన్వయం కోసం ఈ పేజీని, సంబంధిత చర్చపేజీని వాడుకోవచ్చు. రాజధాని వికేంద్రీకరణ రద్దు వార్త సందర్భంలో సంబంధిత వ్యాసాలను మెరుగు చేస్తున్నాను. ఆసక్తి వున్న వారందరూ పాల్గొనమని కోరుతున్నాను. అలాగే ఈ ప్రతిపాదనపై మీ స్పందనలు, సలహాలు తెలియచేయండి.- అర్జున (చర్చ) 06:32, 5 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గత 16 ఏళ్లలో ఎక్కువమంది పాల్గొన్న సమష్టికృషి వ్యాసాలు సంవత్సరాల వారీగా విశ్లేషణ వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు/active collaboration analysis లో చూడండి. --అర్జున (చర్చ) 06:36, 10 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ శీర్షికలలో తప్పనిసరికానిచోట ZWNJ అక్షరాల వాడుక తగ్గించండి[మార్చు]

వికీపీడియా చర్చ:శైలి/page-titles-with-unnecessary-zwnj లో పేజీశీర్షికలలో ZWNJ అక్షరాల చేర్చిన వారి గణాంకాలు వున్నాయి. 5598 పేజీలకు ఇవి వాడారు. ఉదాహరణ పేజీ శీర్షిక: 'బిశ్వ_భూషణ్‌_హరిచందన్‌‌' (వికీటెక్స్ట్ ఎడిటర్ లో ZWNJ ఎర్ర చుక్కలతో కనబడతాయి) పేజీకి లింకు చేసేటప్పుడు సాధారణంగా ZWNJ లేకుండానే లింకు చేస్తాము. కొన్ని వెబ్సైట్లు వారు ప్రతి నకారపొల్లు తరువాత ఖాళీ అక్షరం వుంటే ZWNJ చేర్చి వాడుతున్నారు. వాటిని శీర్షికలకు వాడకుండా నేరుగా టైపు చేసి కొత్త పేజీలు సృష్టించమని కోరుతున్నాను. తప్పనిసరైతే (ఉదా: ఓపెన్‌స్ట్రీట్‌మేప్(OSM))) వాడవచ్చు. ఏమైనా సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 07:01, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ ఈ 5598 పేజీలను సరిచూడాలి. ఈ డేటా సరైనది కాకపోవచ్చు. కింది అంశాలను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ జాబితా తయారు చెయ్యండి:
  1. పదాంతంలో మాత్రమే ZWNJ ఉన్నవాటిని పట్టుకోవాలి.
  2. దారిమార్పులను ఈ క్వెరీ లోంచి మినహాయించాలి.
అప్పుడు సరైన జాబితా వస్తుంది. పరిశీలించగలరు. __ చదువరి (చర్చరచనలు) 08:25, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, అవునండి, మీరు చెప్పేది సబబే. ZWNJ క్వెరీ తయారుచేయటానికే రెండు మూడు గంటలు పట్టింది కావున పోస్ట్ చేశాను. మీరు కోరిన విధంగా అదనపు లింకులు ఆ పేజీలో చేర్చాను, పట్టిక సరిచేశాను. ఇంకేమైనా దోషాలుంటే తెలపండి. అర్జున (చర్చ) 09:15, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దారి మార్పుల పని పూర్తి చేశాను. ఏమైనా ఇంకా మిగిలిపోయివుంటే తెలపండి. అర్జున (చర్చ) 00:46, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పేజీల లింకులు పంచుకోవటానికి క్లుప్త యుఆర్ఎల్ ఉపకరణం(URL)[మార్చు]

నేను సాధారణంగా పేజీ శీర్షికల ZWNJ వాడవలసిన పదబందాలకు ^ ( caret key /shift 6) లేదా ,మొబైల్‌లో వాడే GBoard లో <|> ద్వారా చేయమని సూచిస్తాను, అయితే ఉదాహరణకు మాల్వా ఎక్స్‌ప్రెస్ అనే వ్యాసం పంచుకొవటానికి https://www.url-encode-decode.com/ ద్వారా https://te.wikipedia.org/wiki/మాల్వా_ఎక్స్‌ప్రెస్ లా మార్చమనిచెపుతాను ,హిందీవికీలొ చక్కగా https://hi.wikipedia.org/s/1zut వ్యాస శీర్షికలోతయారు చేసుకొనే వీలు ఉన్నది , వీలయితే మనమూ ఆ సదుపాయం స్థాపిం చుకోవాలి , దీనివలన SMS ద్వారా కూడా తెలుగు వికీపీడియా లింకులు సులభంగా పంచుకోవచ్చు ప్రత్యేక పేజీలు మెనూ లో URL Shortener ఉన్నా కూడా అది ఇలా https://w.wiki/4vPq చేయవచ్చు అని అందరికీ తెల్వకపోవచ్చు ~:Kasyap (చర్చ) 08:31, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

విభాగపు అనువాదం(Section translation) చేతనం[మార్చు]

మొబైల్ వాడుకరులకు విభాగపు అనువాదం(Section translation) చేతనమైంది. డెస్క్టాప్ వాడుకరులు మొబైల్ లింకు తో వాడవచ్చు. తొలి సవరణ చూడండి. అర్జున (చర్చ) 01:09, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి విషయం తెలియజేశారు, ధన్యవాదాలు అర్జున గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:51, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు. చాలా ఉపయోగకరంగా ఉంది.--అభిలాష్ మ్యాడం (చర్చ) 06:04, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH, @Pranayraj1985 గార్ల స్పందనకు ధన్యవాదాలు. నేను మొబైల్ నుంచి కూడా ప్రయత్నించాను. ఆంగ్లభాషలో వ్యాసాన్ని చదువతున్నపుడు తెలుగు వ్యాసం కోసం చూస్తే, తెలుగు వ్యాసం కనిపించకపోతే, కొత్త విభాగపు అనువాదం చేసే అవకాశం ఇస్తుంది. ఒక్కో వాక్యం అనువాదం చేయాలి కాబట్టి విభాగంలో 4-5 వాక్యాలు కన్నా ఎక్కువ వుంటే కొంత కష్టమే. అత్యవసరమైనప్పుడు వాడుకొనడానికి బాగుంది. అర్జున (చర్చ) 17:01, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ, నేను నేను కూడా ప్రయత్నించి చూశాను. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:02, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter February 2022[మార్చు]

Dear Wikimedians,

Hope you are doing well. As you know CIS-A2K updated the communities every month about their previous work through the Newsletter. This message is about February 2022 Newsletter. In this newsletter, we have mentioned our conducted events, ongoing events and upcoming events.

Conducted events
Ongoing events
Upcoming Events

Please find the Newsletter link here. Thank you Nitesh (CIS-A2K) (talk) 08:58, 14 March 2022 (UTC)

On behalf of User:Nitesh (CIS-A2K)

Wiki Loves Folklore 2022 ends tomorrow[మార్చు]

International photographic contest Wiki Loves Folklore 2022 ends on 15th March 2022 23:59:59 UTC. This is the last chance of the year to upload images about local folk culture, festival, cuisine, costume, folklore etc on Wikimedia Commons. Watch out our social media handles for regular updates and declaration of Winners.

(Facebook , Twitter , Instagram)

The writing competition Feminism and Folklore will run till 31st of March 2022 23:59:59 UTC. Write about your local folk tradition, women, folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, folklore, and tradition, including ballads, folktales, fairy tales, legends, traditional song and dance, folk plays, games, seasonal events, calendar customs, folk arts, folk religion, mythology etc. on your local Wikipedia. Check if your local Wikipedia is participating

A special competition called Wiki Loves Falles is organised in Spain and the world during 15th March 2022 till 15th April 2022 to document local folk culture and Falles in Valencia, Spain. Learn more about it on Catalan Wikipedia project page.

We look forward for your immense co-operation.

Thanks Wiki Loves Folklore international Team MediaWiki message delivery (చర్చ) 14:40, 14 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Section Translation tool enabled in Telugu Wikipedia[మార్చు]

Hello Friends!

The Language team is pleased to let you know that the Section Translation tool is now enabled in Telugu Wikipedia. It means you can translate real content one section at a time using your mobile devices with ease.

Now you can also start translating an article on your mobile device right when you notice it is missing in Telugu. From a Wikipedia article in any language, switch languages and search for Telugu. If the article does not exist, an option to translate it will appear, as shown in the image below.

Image of the entry point

We have enabled this tool in your Wikipedia based on your interest and feedback about the tool. This tool will be useful for your community since data shows significant mobile device activity in Telugu Wikipedia.

Content created with the tool will be marked with the “sectiontranslation” tag for the community to review. We’ll monitor the content created, but we are very interested in hearing about your experience using the tool and reviewing the content created with it.

So, enjoy the tool and provide feedback on improving it.

Thank you!

UOzurumba (WMF) (చర్చ) 05:10, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@UOzurumba (WMF)Thanks for enabling this mobile tool for Telugu Wikipedia as it is much desired option for mobile user, but I could not able to access the same in Wikipedia Android mobile app. Please let me know the section translation process with App. Kasyap (చర్చ) 08:04, 16 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hello Kasyap,
Unfortunately, you can't access this tool from the Wikipedia Android mobile app now. We would concentrate on expanding the languages this tool supports and maybe consider the above in future.
Thank you! UOzurumba (WMF) (చర్చ) 22:25, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షణ జాబితా ప్రకటన ప్రతిపాదనకు స్పందించండి[మార్చు]

వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి సంబంధించిన ప్రకటనని వీక్షణజాబితా ప్రకటనలలో చూపుటకు ప్రతిపాదన చూడండి. వారం రోజులలో ఆ పేజీలో స్పందించండి. అర్జున (చర్చ) 05:28, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షణ జాబితా ప్రకటన చేతనమైంది. (దాన్ని చూసినవాళ్లు తొలగించుకొనేందుకు ఇంకా కొన్ని మార్పులు జరగవలసి వుంది). ఈ ప్రకటనకు స్పందించండి. ఇటువంటి ప్రకటనలు చేయాలనుకుంటే మీడియావికీ_చర్చ:Watchlist-messages లో చర్చించండి. అర్జున (చర్చ) 07:20, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Pune Nadi Darshan 2022: A campaign cum photography contest[మార్చు]

Dear Wikimedians,

Greetings for the Holi festival! CIS-A2K is glad to announce a campaign cum photography contest, Pune Nadi Darshan 2022, organised jointly by Rotary Water Olympiad and CIS-A2K on the occasion of ‘World Water Week’. This is a pilot campaign to document the rivers in the Pune district on Wikimedia Commons. The campaign period is from 16 March to 16 April 2022.


Under this campaign, participants are expected to click and upload the photos of rivers in the Pune district on the following topics -

  • Beauty of rivers in Pune district
  • Flora & fauna of rivers in Pune district
  • Religious & cultural places around rivers in Pune district
  • Human activities at rivers in Pune district
  • Constructions on rivers in Pune district
  • River Pollution in Pune district

Please visit the event page for more details. We welcome your participation in this campaign. Thank you MediaWiki message delivery (చర్చ) 07:19, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On behalf of User:Nitesh (CIS-A2K)

కొత్త వ్యాసపు పేజీని సృష్టించినపుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి?[మార్చు]

కొత్తపేజీని సృష్టించినపుడు ఏయే అంశాలు అందులో ఉండాలి అనే విషయమై వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో కొత్త పేజీలో ఉండాల్సిన హంగులు అనే ఒక కొత్త విభాగాన్ని చేర్చాను. పరిశీలించి తగు మార్పుచేర్పులేమైనా అవసరమైతే చెయ్యండి.

కొత్తగా పేజీలు సృష్టిస్తున్న వాడుకరులు ఈ పేజీని ఒకసారి చూడవలసినదిగా కోరుతున్నాను. అలాగే వికీపీడియా:శైలి అనే పేజీని, దాని ఉపపేజీలను కూడా చూడవలసినది.__ చదువరి (చర్చరచనలు) 08:54, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:23, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Feminism and Folklore 2022 ends soon[మార్చు]

Feminism and Folklore 2022 which is an international writing contest organized at Wikipedia ends soon that is on 31 March 2022 11:59 UTC. This is the last chance of the year to write about feminism, women biographies and gender-focused topics such as folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, fairy tales, folk plays, folk arts, folk religion, mythology, folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales and more

Keep an eye on the project page for declaration of Winners.

We look forward for your immense co-operation.

Thanks Wiki Loves Folklore international Team MediaWiki message delivery (చర్చ) 14:29, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటి ఇండిక్ వికీ ప్రాజెక్టు నమూనా వ్యాసాలు - పరిశీలనకు[మార్చు]

ఐఐఐటి ఇండిక్ వికీ శాండ్ బాక్స్ లో సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించిన వేలాది వ్యాసాలను మానవీయ పరిశీలన చేసి , అవసరమైన చోట మానవీయ సహాయంతో మార్పులు చేశాము. వీటిని ప్రాజెక్టు పేజీ నమూనా వ్యాసాల లో చూడవచ్చు, తెలుగు వికీపీడియా సభ్యులు దీనిని పరిశీలించి తమ అభిప్రాయాలను ఆయా వ్యాసాల చర్చ పేజీలలో వెల్లడించవలసిందిగా కోరుతున్నాం. మీ సూచనలు , అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని మిగిలిన వ్యాసాలను కూడా తదనుగుణంగా సవరించి అందుబాటులోకి తీసుకువస్తాం.--Po.indicwiki (చర్చ) 11:24, 4 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడ నేను రాస్తున్న అభిప్రాయాలను కింది సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చదవవలసినది:
ఈ వ్యాసాలను తెవికీ పద్ధతులు, విధానాలు, శిలి, సాంకేతికత, వ్యాసాల రూపురేఖలు మొదలైన అంశాల్లో, నిపుణులైన వారి చేత ఫుల్‌టైమ్ శిక్షణ పొందిన వాడుకరులు సరిదిద్దారు. కాబట్టి ఈ వ్యాసాలు వికీ శిలికి వ్యాసాల ఆకృతికీ అనుగుణంగా ఉంటాయి.
@Po.indicwiki గారూ, ముందుగా మీరు తయారుచేసిన వ్యాసాలను తెవికీలో ప్రచురించడానికి సిద్ధపడీనందుకు మీకు అభినందనలు. నేను ఈ వ్యాసాల్లో కొన్నిటిని పేరిశీలించాను. వివిధ కారణాల వల్ల అవి ప్రచురణకు సిద్ధంగా లేవు. వీటన్నిటినీ ఇక్కడ విడివిడిగా వివరించేకంటే తేలికైన పద్ధతిని నేను సూచించదలచాను.
ముందుగా.. తెలుగు వికీపీడియా సముదాయంలో చురుగ్గా కృషి చేస్తున్న వాడుకరులకు మీరు పెట్టిన వ్యాసాలన్నిటినీ పరిశీలించి, సవరించేటంత సమయం ఉందని నేను భావించడం లేదు. అంచేత -
ఒక కొత్త పేజీకి అవసరమైన అన్ని అంశాలూ ఈ పేజీల్లో ఉన్నాయా లేదా అనేది ముందు మీరు పరిశీలించి నిర్థారించండి. ఇందుకు గాను, మీ సౌకర్యం కోసం ఒక చెక్‌లిస్టు తయారుచేసాను. ఆ చెక్‌లిస్టులో కొత్త పేజీకి ఉండాల్సిన కనీసమైన అంశాల జాబితా ఉంది. మీరు ప్రాజెక్టు పేజీకి అనుబంధంగా చేర్చిన/చేరుస్తున్న పేజీలన్నీ ఈ చెక్‌లిస్టుకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి, లేనట్లైతే తదనుగుణంగా వాటిని సవరించి, ఆ తరువాత రచ్చబండలో సముదాయం దృష్టికి తీసుకురండి. అప్పుడు సముదాయం వాటిని పరిశీలిస్తుంది. ఆ చెక్‌లిస్టును కింది పేజీలో చూడవచ్చు:
  1. వికీపీడియా:ఐఐఐటి వారు కొత్తగా చేర్చే వ్యాసాల చెక్‌లిస్టు
సముదాయ సభ్యులకు విజ్ఞప్తి:
  1. నేను పైన సూచించిన పద్ధతికి ఏమైనా మార్పుచేర్పులు చెయ్యదలిస్తే సూచించండి.
  2. ఆ చెక్‌లిస్టులో కూడా ఏమైనా మార్పుచేర్పులు అవసరమనిపిస్తే, చేసెయ్యండి.
__ చదువరి (చర్చరచనలు) 10:06, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Po.indicwiki గారూ, ఆ చెక్‌లిస్టులో మార్పుచేర్పుల సూచనలేమీ రాలేదు. కాబట్టి ఇక మీరు దాన్ని అనుసరించవచ్చు. ఆ చెక్‌లిస్టుకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసి, సముదాయానికి తెలియపరచవలసినది. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 05:25, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Po.indicwiki గారూ, ఐఐఐటి ఇండిక్ వికీ ప్రాజెక్టులో భాగంగా రాసిన వ్యాసాలను వికీ సముదాయ అనుసంధాన కర్తగా వికీపీడియాలో చేర్చడానికి మీ ప్రయత్నాలకు అభినందనలు. కొత్త వ్యాసాలు రాయడానికి, పాత వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తాను అనే మీ ఈ అభిప్రాయానికి ధన్యవాదాలు.ఐఐఐటి ఇండిక్ వికీ ప్రాజెక్టు తరుపున పూర్తికాలపు శిక్షణపొందిన నిష్ణాతులైన వాడుకరులు మీ దగ్గర ఉన్నారు.తెలుగు వికీపీడియాలో చురుకైన వాడుకరులు, పరిశీలనాదృక్పధం ఉన్నవారు బహుతక్కువమంది ఉన్నారు.ఈ పరిస్థితులలో గంపగుత్తగా వికీపీడియా:ఐఐఐటి వారు కొత్తగా చేర్చే వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం తెవికీ వాడుకరులు పరిశీలించుట క్లిష్టతరం. ప్రతిపాదించే వ్యాసాలను మరియొకసారి మీ నిష్ణాతులైన వాడుకరులచేత వికీపీడియా:ఐఐఐటి వారు కొత్తగా చేర్చే వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం దానికి అనుగుణంగా సవరణలు చేసి సముదాయం దృష్టికి తీసుకునిరాగలరు.వాటిని మరలా తెలుగు వికిపీడియా సముదాయ సభ్యులు పరిశీలించి అంగీకరించిన వ్యాసాలు తెవికీలో చేర్చగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:30, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త జిల్లాల సమాచారం చేర్పు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సమాచారాన్ని చేర్చేవారు, సదరు పేజీకి సంబంధించిన పాత జిల్లా సమాచారాన్ని కూడా చేర్చితే మరింత సమగ్రంగా ఉంటుంది. గమనించగలరు. __ చదువరి (చర్చరచనలు) 03:47, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించి, పాటించాలి యర్రా రామారావు (చర్చ) 10:32, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాఠ్యప్రణాళిక ప్రాజెక్టు - ఖాతా పేరు[మార్చు]

తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు నమస్కారం, తెవికీ పాఠ్యప్రణాళిక ప్రాజెక్టుకు వీడియోల తయారీకీ, వీడియోలు పూర్తయిన తరువాత వాటిని వివిధ ఆన్లైన్ వేదికలలో ప్రచురించడానికి ఒక నిర్ధిష్టమైన ఖాతా పేరు ఉంటే బాగుంటుందని ప్రాజెక్టు కమిటీ నిర్ణయించి, ప్రాథమికంగా వికీ గురూజీ, వికీ గురూ, తెవికీ గురూజీ, తెవికీ గురూ మొదలైన పేర్లను సూచించడం జరిగింది. వీటిల్లో ఏ పేరు సముచితంగా ఉంటుందోనన్న విషయంపై సముదాయ సభ్యులు తమ స్పందనలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కమిటీ సూచించిన పేర్లే కాకుండా ఇతర పేర్లను కూడా సముదాయ సభ్యులు సూచించవచ్చు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:52, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ గురూ గురూజీ అనే మాటలను నిత్య వ్యవహారాల్లో చులకన ధోరణిలో వాడడం జరుగుతూంటుంది. వాటి బదులు గురువు అనడం బాగుంటుంది. పోతే..
  1. వికీవేత్త
  2. వికీ ఆచార్య
లను కూడా పరిశీలించవచ్చు. నా చాయిస్: "వికీవేత్త"
__ చదువరి (చర్చరచనలు) 05:35, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ గురు అనే పేరు బాగుంటుంది అనుకుంటున్నాను.- రవిచంద్ర (చర్చ) 17:25, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడ కొత్త వారికి మనం దారి చూపించే వారము, కానీ దిశానిర్దేశం చేసేవారము కాదు కావున గురువు అన్న మాట సరిపడదేమో! ఇక Guide , mentor అన్న పదానికి ఇంగ్లీష్-తెలుగు నిఘంటువుల ప్రకారం హర్కారా,సలహాదారు మార్గదర్శకుడు, మార్గనిర్దేశకుడు, ఉపదేష్ట అని చెప్పబడింది అయితే నా చాయిస్: వికీ ఉపదేష్ట : Kasyap (చర్చ) 06:40, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఖాతా చేస్తున్న పని కొత్తవారు నేర్చుకోడానికి అవసరమైన పాఠాలను తయారు చెయ్యడం. కాబట్టి గురువు అనడం సముచితమే. అంతేకాదు, గురువులకు గురువు కూడా __ చదువరి (చర్చరచనలు) 08:57, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అర్ధం చేసుకొన్నది ఆన్లైన్ వేదికలలో ప్రచురించడానికి ఒక నిర్ధిష్టమైన ఖాతా పేరు అని,అది కొంచెం విభిన్నంగా ఉంటే బాగుంటుంది అని ! Kasyap (చర్చ) 09:07, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, Kasyap గారూ, మీ స్పందనలకు ధన్యవాదాలు. వికీవేత్త, వికీ ఆచార్య, వికీ ఉపదేష్ట పదాలను కూడా పరిశీలించాను. అయితే ఈ పదాలు సంబోధించడానికి, పలకడానికి కాస్త సులభంగా లేవు. ఈజీగా, క్యాచీగా ఉండే పేరు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. వికీ గురు / Wiki Guru అనే పేర్లను పరిశీలించగలరు. Guru అనే పదం ఇతర భాషలలో కూడా గురువు అనే పదాన్ని కూడా సూచిస్తోంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:16, 6 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ / Wiki అనే పదం సార్వజనికమైంది, కావున తెలుగు వికీపీడియా గురు (Telugu Wikipedia Guru) లాంటి focused పేరు పరిశీలించ గలరు. :- Kasyap (చర్చ) 04:44, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
గురు కన్నా గురువు లేదా ఆచార్యుడు వంటి తెలుగు పదాలు గౌరవప్రదంగా బాగుంటాయి.--Rajasekhar1961 (చర్చ) 13:12, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ గురు కన్నా వికీగురువు అనటమే సముచితం. నా ఛాయిస్ వికీవేత్త లేదా వికీఆచార్యుడు-అభిలాష్ మ్యాడం (చర్చ) 04:48, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ గురు తెలుగు / Wiki Guru Telugu పేర్లను కూడా పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 02:23, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Announcing Indic Hackathon 2022 and Scholarship Applications[మార్చు]

Dear Wikimedians, we are happy to announce that the Indic MediaWiki Developers User Group will be organizing Indic Hackathon 2022, a regional event as part of the main Wikimedia Hackathon 2022 taking place in a hybrid mode during 20-22 May 2022. The event will take place in Hyderabad. The regional event will be in-person with support for virtual participation. As it is with any hackathon, the event’s program will be semi-structured i.e. while we will have some sessions in sync with the main hackathon event, the rest of the time will be upto participants’ interest on what issues they are interested to work on. The event page can be seen on this page.

In this regard, we would like to invite community members who would like to attend in-person to fill out a form for scholarship application by 17 April, which is available on the event page. Please note that the hackathon won’t be focusing on training of new skills, and it is expected that applications have some experience/knowledge contributing to technical areas of the Wikimedia movement. Please post on the event talk page if you have any queries. MediaWiki message delivery (చర్చ) 18:31, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ 2022 జిల్లాల పునర్వ్యస్థీకరణలో పాత జిల్లాల పేజీల సవరణలలో గమనించాల్సినవి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ 2022 జిల్లాల పునర్వ్యస్థీకరణలో 13 పాత జిల్లాల పేజీల సవరణలలో జిల్లాల పునర్వ్యస్థీకరణకు అనుగుణంగా చేపట్టే సవరణలలో ముఖ్యంగా "జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి" అనే కోణంలో సవరిస్తేనే జిల్లా గత చరిత్ర తెలిసేది.అలా కాకుండా పునర్వ్యవస్థీకరణ తరువాత స్థితి రాస్తే పునర్వ్యవస్థీకరణ ముందు సమాచారం మరుగున పడింది.దానిని తిరిగి తెలుసుకొనుట చాలాకష్టం.ఇది నా స్వంతంగా ఆలోచించిన విషయం కాదు.తెలంగాణలో 2016లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత 10 జిల్లాలలో పూర్తిగా ఇదే పద్దతి పాటించిన అనుభవంతో వివరిస్తున్నాను.కాస్త శ్రమపడ్డా ఇది అవసరం.తిరిగి ఇదే పద్దతిని శ్రీ కాకుళం జిల్లా (పాత జిల్లా) పేజీలో పాటించాను.ఆ విభాగాలు ఈ దిగువ వివరించాను.గమనించగలరు.

  • 5.1 పాలనా విభాగాలు
  • 5.1.1 జిల్లా కీలక అధికారులు
  • 5.1.2 రెవెన్యూ డివిజన్లు
  • 5.1.3 మండలాలు
  • 5.1.4 శ్రీకాకుళం జిల్లా లోని మండలాలు
  • 5.1.5 పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు
  • 5.1.6 విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు
  • 5.1.7 గ్రామాలు
  • 5.2 జిల్లాలో పట్టణ ప్రాంతాలు
  • 5.3 నియోజక వర్గాలు
  • 5.3.1 లోక్‌సభ స్థానాలు
  • 5.3.2 శాసనసభస్థానాలు

పాతజిల్లా పేజీలలో ఆసక్తి ఉన్నవారు ఈ పద్దతిపాటించి సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:31, 8 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీడేటాలో పరిపాలన విభాగాల క్రమం ప్రామాణీకరించడం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిధుల సవరణ సందర్భంగా, జిల్లా సమాచారం వికీడేటాలో సవరించి, దానికి అనుగుణంగా వికీపీడియాలో సమాచారపెట్టెలలో కనీసం మండల స్థాయి వరకు వాడే పని చేపట్టాను. ప్రస్తుతం జిల్లా-మండల-(రెవిన్యూ)గ్రామం క్రమం వాడాము. పరీక్షార్ధం నేను, DaxServer కొన్ని రెవిన్యూ డివిజన్లు చేర్చాము. అయితే P131 తో కేవలం ఆ అంశం పైన తక్కువ స్థాయిలో గల పరిపాలన విభాగం ఒక్కటే చేర్చాలి. మండల స్థాయికి రెవిన్యూ డివిజన్ తక్కువ స్థాయిలో వున్న పరిపాలన అయినప్పటికి, దానిని వాడితే సమాచారం చేర్చటం, సమాచారం పొందటానికి క్వెరీలకు పని, క్లిష్టత పెరుగుతుంది. జనగణనలో కూడా జిల్లా తరువాత మండల స్థాయి అంశమే ప్రధానంగా పరిగణించబడుతుంది. రెవిన్యూ డివిజన్ జిల్లాలో పరిపాలన సౌలభ్యానికి భూ సమస్యల పరిష్కారంలో మండల కంటె పై మెట్టులో ఏర్పరచినదని నా అభిప్రాయం. ఈ విషయం ఆధారంగా రెవిన్యూ డివిజన్ అంశాన్ని వికీడేటాలో ప్రయోగాత్మక వాడుక తొలగించుటకు, ఇప్పటివరకు వాడిన జిల్లా-మండల-(రెవిన్యూ)గ్రామం ప్రామాణీకరించుటకు వికీడేటా వికీప్రాజెక్టు ఇండియాలో ప్రతిపాదన చేసి స్పందనలు కోరాను. తెలుగు వికీపీడియాలో కూడా తెలియచేస్తున్నాను. ఏమైనా స్పందనలుంటే రెండు రోజులలో వీలైతే వికీడేటా వికీప్రాజెక్టు ఇండియా చర్చలో తెలియచేయండి. అర్జున (చర్చ) 11:08, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాద ఉపకరణంలో సమస్య[మార్చు]

అనువాద ఉపకరణం ఉపయోగించి వ్యాసాన్ని అనువాదం చేస్తున్నక్రమంలో... రెండుమూడు విభాగాలు అనువాదం చేసి, మరో విభాగ అనువాదంకోసం 'అనువదించండి' నొక్కినపుడు బ్రౌజర్ (ఫైర్ ఫాక్స్ బ్రౌజర్) క్లోజ్ అవుతోంది. రెండుమూడుసార్లు ప్రయత్నించి చూశాను. అలానే జరుగుతోంది. ఇలా నా ఒక్కడికే జరిగిందా, ఇంకెవరికైనా జరుగుతోందా..?--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:03, 10 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలోని అనువాద యంత్రం తెలుగులోకి అనువదించటలేదు.అనువదించండి అని క్లిక్ చేస్తే తిరిగి అదే ఆంగ్ల పాఠ్యం వస్తుంది. యర్రా రామారావు (చర్చ) 10:35, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో చెయ్యవలసిన మార్పులు[మార్చు]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడడం, ఈసరికే ఉన్నవాటిలో అనేక మార్పులు జరగడం, గ్రామాల మండలాలు, జిల్లాలు మారిపోవడం వంటి అనేక మార్పులు జరిగాయి. తదనుగుణంగా అనేక వేల పేజీల్లో మార్పుచేర్పులు చెయ్యాల్సి రావడం, వందలాది కొత్త పేజీలను సృష్టించాల్సి రావడం జరుగుతోంది. పేజీల్లో మార్పులు, పేజీల తరలింపులు, మూసల్లో మార్పులు, వర్గాల్లో మార్పులు, అయోమయ నివృత్తి పేజీల్లో మార్పులు, వివిధ పేజీల్లో బయటికి పోయే లింకుల్లో మార్పులు.. ఎన్నో చెయ్యాల్సి ఉంది. చాలా పెద్ద ప్రాజెక్టు ఇది. ఇదే సమయంలో అనేక గ్రామాల పేజీలను తప్పు పేర్లతో సృష్టించడం జరిగింది. ఇవి దాదాపు ఆరేడు వేల పేజీలుండవచ్చు. వాటిని సరైన పేరుకు తరలించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెయ్యాలంటే, కొన్ని లక్షల దిద్దుబాట్లు చెయ్యాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామాల పేజీల్లో ఈ పనులు కొంత జరిగాయి. కానీ ఇంకా ఎంతో పని జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీల్లో ఈ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. వివిధ ప్రాజెక్టుల ద్వారా ఈ పనులను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం చేపట్టిన పనుల్లో కొన్నిటిని కొంతమేర ఆటోమేటు చేసాను. తెలంగాణ లోని దాదాపు పదివేల గ్రామాల పేజీలలో చేర్చాల్సిన సమాచారాన్ని ఎక్సెల్‌లో తయారు చేసి పెట్టాను. ఒక్కో గ్రామపు సమాచారాన్ని దాన్లోంచి కాపీ చేసి సదరు గ్రామం పేజీలో పేస్టు చేస్తే సరిపోతుంది. తద్వారా ఈ పనిని చకచకా చేసెయ్యవచ్చు. అలాగే ఆంధ్ర గ్రామాల పేజీలకు ఆటోమేటు చేసే పని చేద్దాం. బాటుతో పనిచెయ్యగలవారు ఉంటే ఈ పనిని కూడా ఆటోమేటు చెయ్యవచ్చు. ఇక్కడ ఆ పని చెయ్యగలవారు లేరు కాబట్టి మానవికంగా చెయ్యక తప్పదు.

అయితే ప్రస్తుతం ఈ పనులు చాలా కొద్దిమందే చేస్తున్నారు. మరికొంతమంది చేరితే త్వరగా పూర్తి చేసే వీలు కలుగుతుంది. తోటి వాడుకరులను ఈ పనిలో చేరవలసినదిగా కోరుతున్నాను. తాము ప్రస్తుతం చేతున్న పనులను పూర్తిగా ఆపకుండానే ఈ పనికి కూడా కొంత సమయాన్ని కేటాయించగలిగే వీలు ఉంది. పరిశీలించండి.

ఈ విషయమై ఇక్కడ చర్చించడంతో పాటు ఒక ఆన్‌లైను సమావేశం పెట్టుకుని అక్కడ చర్చిస్తే మరింత వేగంగా మన ఆలోచనలను పంచుకోవచ్చు అని భావిస్తూ, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాను. రేపు, అంటే ఏప్రిల్ 16 శనివారం నాడు, సాయంత్రం 7 గంటలకు ఒక ఆన్‌లైను సమావేశం పెట్టుకుందామని ప్రతిపాదిస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు ఈ లింకు ద్వారా ఈ గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొనవచ్చు: https://meet.google.com/psg-okyi-rkb పాస్‌వర్డేమీ లేదు. అందరూ ఆహ్వానితులే.

చర్చాంశం: తెలుగురాష్ట్రాల గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో చెయ్యాల్సిన మార్పుచేర్పులపై ప్రణాళిక రచన

ఆసక్తి గలవారు తప్పక పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 05:01, 15 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీటింగులో పాల్గొనేవారు

  1. నేను పాల్గొంటాను యర్రా రామారావు (చర్చ) 05:21, 15 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఇందులో నేను కూడా భాగస్వామ్యమవుతాను. అయితే, ఈరోజు సాయంత్రం నాకు వేరే కార్యక్రమం ఉంది. అందువల్ల ఈనాటి గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొనలేకపోతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:09, 16 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాకరణ[మార్చు]

సమయం తక్కువగా ఉన్నందున అందరికీ తెలిసేలా, ఈ ఆన్‌లైన్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నాను. కొత్త తేదీ, సమయం: 2022 ఏప్రిల్ 20, బుధవారం సాయంత్రం 7 గంటలు. __చదువరి (చర్చరచనలు) 05:26, 16 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గమనించటమైనది.2022 ఏప్రిల్ 20, బుధవారం పాల్గొంటాను. యర్రా రామారావు (చర్చ) 05:49, 16 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా బుధవారం పాల్గొంటాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:11, 16 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం రద్దు[మార్చు]

వచ్చే ఆదివారం నాడు ప్రత్యక్ష సమావేశం ఉన్నందున, అక్కడైతే మరింత వివరంగా చర్చించే వీలున్నందున, రెండు సమావేశాల ఆవశ్యకత లేనందున, ప్రాజెక్టులపై చర్చించే వీలు అక్కడ ఉన్నందున, ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నాను. యర్రా రామారావు గారు, ప్రణయ్ రాజ్ గారు గమనించవలసినది. __చదువరి (చర్చరచనలు) 04:29, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే చదువరి గారు, 24న జరిగే సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:42, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
గమనించాను.మంచిది.ఆసమావేశంలో పాల్గొంటాను యర్రా రామారావు (చర్చ) 05:31, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter March 2022[మార్చు]

Dear Wikimedians,

Hope you are doing well. As you know CIS-A2K updated the communities every month about their previous work through the Newsletter. This message is about March 2022 Newsletter. In this newsletter, we have mentioned our conducted events and ongoing events.

Conducted events
Ongoing events

Please find the Newsletter link here. Thank you Nitesh (CIS-A2K) (talk) 09:33, 16 April 2022 (UTC)

On behalf of User:Nitesh (CIS-A2K)

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ప్రాజెక్టు పేజీ[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ -2022 లో గతంలో ఉన్న 13 జిల్లాలను ప్రధానంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అదనంగా మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటైనవి. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గం విస్తృత భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకుని రెండు జిల్లాలుగా ఏర్పడినవి.2022 ఏప్రిల్ 4 నాటినుండి కొత్త జిల్లాల ప్రారంభానికి గెజిట్ విడుదలై అమలులోనికి వచ్యాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పేజీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా దాని ప్రకారం అనుగుణంగా ఏఏ వ్యాసాలు, మూసలు, ఇంకా ఏఏ వర్గాలలోని వ్యాసాలు తాజాగా సవరించాల్సింది గుర్తించి, వాటిలో ఏమేమిసవరణలు ఎలా చేయాలి? అనే దానికి ప్రాజెక్టు పేజీ నొకదానిని రూపొందించటమైంది.ప్రాజెక్టు పేజీని పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో వివరించగలరు. సాధ్యమైనంతవరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పనిచేయువారు ఈ ప్రాజెక్టుపేజీ ప్రకారం సవరణలు, అభివృద్ధి చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:16, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు యర్రా రామారావు గారూ... నేను కూడా ఇందులో పాల్గొంటాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:27, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం (2022, ఏప్రిల్ 24)[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా అభివృద్ధి కోసం, వివిధ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించుకోవడానికి కొంతమంది వికీపీడియన్లతో 2013 నుండి 2016 వరకు ప్రతినెల హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు నిర్వహించబడ్డాయి. భారతీయ వికీపీడియాల్లో నెలవారి సమావేశాలను ప్రారంభించిన మొదటి వికీపీడియా, మన తెలుగు వికీపీడియా. 2016 తరువాత గోల్డెన్ త్రెషోల్డ్ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల నెలవారి సమావేశాలు నిర్వహించుకోలేకపోయాం. గత, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు తెలుగు వికీపీడియాకు ఎల్లవేళలా తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. వికీ సమావేశాల గురించి హరికృష్ణ గారి ముందు ప్రస్తావించినపుడు... భాషా సాంస్కృతిక శాఖ తరపున తెలుగు వికీ సమావేశాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించుకోవడానికి రవీంద్రభారతి రెండవ అంతస్తులోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ను ఇస్తానని గతంలోనే పలుమార్లు చెప్పారు. కానీ, కరోనా కారణంగా ప్రత్యక్ష సమావేశాలను నిర్వహించుకోలేకపోయాం.
అయితే, గతంలో జరిగినట్టుగానే తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు, కొత్తగా రాస్తున్న వాడుకరులకు, రాయాలనుకుంటున్న ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్న పలువురు సభ్యుల సూచనల మేరకు ప్రతినెల మూడవ లేదా నాలుగవ ఆదివారం నాడు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాం. అందులో భాగంగా ఈ నెల వచ్చే ఆదివారం ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం, శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. వికీ సభ్యులు, కొత్త వాడుకులు, ఔత్సాహిక రచయితలు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.

పాల్గొనే సభ్యులు కార్యక్రమ పేజీ తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం 2022, ఏప్రిల్ 24 లో తమ పేరును నమోదు చేయగలరు. ధన్యవాదాలు. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:49, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2022, ఏప్రిల్ 24న జరిగిన తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం, వికీ శిక్షణా కార్యక్రమం గురించిన కార్యక్రమ నివేదికను తయారుచేశాను, సభ్యులు గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:42, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Extension of Pune Nadi Darshan 2022: A campaign cum photography contest[మార్చు]

Dear Wikimedians,

As you already know, Pune Nadi Darshan is a campaign cum photography contest on Wikimedia Commons organised jointly by Rotary Water Olympiad and CIS-A2K. The contest started on 16 March on the occasion of World Water Week and received a good response from citizens as well as organisations working on river issues.

Taking into consideration the feedback from the volunteers and organisations about extending the deadline of 16 April, the organisers have decided to extend the contest till 16 May 2022. Some leading organisations have also shown interest in donating their archive and need a sufficient time period for the process.

We are still mainly using these topics which are mentioned below.

  • Beauty of rivers in Pune district
  • Flora & fauna of rivers in Pune district
  • Religious & cultural places around rivers in Pune district
  • Human activities at rivers in Pune district
  • Constructions on rivers in Pune district
  • River Pollution in Pune district

Anyone can participate still now, so, we appeal to all Wikimedians to contribute to this campaign to enrich river-related content on Wikimedia Commons. For more information, you can visit the event page.

Regards Nitesh (CIS-A2K) (talk) 04:58, 17 April 2022 (UTC)

On behalf of User:Nitesh (CIS-A2K)

Join the South Asia / ESEAP Annual Plan Meeting with Maryana Iskander[మార్చు]

Dear community members,

In continuation of Maryana Iskander's listening tour, the Movement Communications and Movement Strategy and Governance teams invite you to discuss the 2022-23 Wikimedia Foundation Annual Plan.

The conversations are about these questions:

  • The 2030 Wikimedia Movement Strategy sets a direction toward "knowledge as a service" and "knowledge equity". The Wikimedia Foundation wants to plan according to these two goals. How do you think the Wikimedia Foundation should apply them to our work?
  • The Wikimedia Foundation continues to explore better ways of working at a regional level. We have increased our regional focus in areas like grants, new features, and community conversations. How can we improve?
  • Anyone can contribute to the Movement Strategy process. We want to know about your activities, ideas, requests, and lessons learned. How can the Wikimedia Foundation better support the volunteers and affiliates working in Movement Strategy activities?

Date and Time

The meeting will happen via Zoom on 24 April (Sunday) at 07:00 UTC (local time). Kindly add the event to your calendar. Live interpretation will be available for some languages.

Regards, CSinha (WMF) (చర్చ) 10:27, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, సంబంధిత వ్యాసాల సవరణలకు సహాయం[మార్చు]

వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి లో భాగంగా ఈ నెలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, సంబంధిత మండల వ్యాసాల పని జరుగుతున్నది. ఇప్పటివరకు ఎనిమిది మంది పాల్గొన్నా, జిల్లా వ్యాసాలలో ప్రధానంగా కృషి చేస్తున్నవారు ఇద్దరు మాత్రమే అయినా మూడు, నాలుగు కొత్త, పాత జిల్లాల వ్యాసాలు మెరుగైన స్థితికి చేరుకున్నాయి. ఎంతో ప్రాధాన్యత,వీక్షణలు గల వ్యాసాల నాణ్యతను వేగంగా మెరుగు చేయడానికి బాగా అనుభవమున్న సభ్యులు చురుకుగా పాల్గొనవలసిన అవసరమున్నా, చాలామంది బాధ్యతతో ఎందుకు కనీసం ఒక్క మార్పు కూడా చేయటానికి సాహసించటంలేదో నాకు అర్ధమవటంలేదు. పెద్ద సవరణలే కాక చిన్న చిన్న సవరణలు(తనిఖీలు) కూడా వున్నాయి. ఈ పనులో పాల్గొనడం ద్వారా, మెరుగైన వ్యాసాలపైన అవగాహన, సులభమైన పరస్పర సహకార నిర్వహణ ఎలా జరుగుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకొనే అవకాశముంది. ఇటువంటి ముఖ్యమైన పనికి తెవికీలో అనుభవమున్నవారు ఉదాసీనత ప్రదర్శించడం తెవికీ అభివృద్ధికి శ్రేయస్కరంకాదు. దయచేసి ఈ పనిలో సహకరించమని అందరిని మరొక్కసారి కోరుతున్నాను. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 12:41, 20 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నా వ్యాఖ్య తరువాత @Chaduvari గారు, బాపట్ల జిల్లా copy edit చేశారు. user:యర్రా రామారావు గారు కొత్త జిల్లాలలో అడపదడపా సవరణలు మొదటినుంచి చేస్తూనే వున్నారు. వారిద్దరికి ధన్యవాదాలు. జిల్లా పేజీలపై జిల్లాల వివరాల ప్రకటన వెలువడిన నాటినుండి ధ్యాస పెట్టి కృషి చేస్తున్న వాడుకరి:Ch Maheswara Raju గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. బాపట్ల జిల్లా వ్యాసంలో ప్రస్తుతానికి పెద్ద సమస్యలు లేకపోతే వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి లో బాపట్ల జిల్లా వ్యాస పురోగతి పరామితిని 100 గా చేసి, అదేవరుసలో తన పేరు చేర్చమని లేక ఏమైనా సమస్యలుంటే చర్చాపేజీలో తెలపమని చదువరిగారిని కోరుచున్నాను. బాపట్ల జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు నా తరపునుండి పూర్తయినవి. ఆ వ్యాస చర్చాపేజీలో పురోగతి విభాగంలో తెలిపిన అంశాల సవరణలను కూడా తనిఖీ చేసి, అదేవిధంగా పురోగతి తాజా పరచి, పేరు చేర్చి సహకరించమని సభ్యులను మరొక్కసారి కోరుతున్నాను. అర్జున (చర్చ) 12:10, 23 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
బాపట్ల జిల్లా తో పాటు, పల్నాడు జిల్లా, వీటి మాతృ జిల్లాలైన గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా కు సంబంధించిన వ్యాసాలు, వర్గ వృక్షాల సవరణలు, పేరులో జిల్లా పేరు వున్నప్పుడు వాటికి దారిమార్పులు జరిగినప్పుడు, పాత వాడుకలకు కొత్త పేర్లు వాడటం,వాడుక లో లేని వాటిని తొలగించడం లాంటివి, సంబంధిత వికీడేటాలో సవరణలు, నేను ప్రధానంగా కృషి చేసి పూర్తిచేశాను. జిల్లా వ్యక్తుల వ్యాసాలు సాధారణంగా వారి పుట్టిన నాటి జిల్లాతోటే సూచించబడతాయి కనుక, వాటిని సవరించలేదు. ఆ వ్యాసాలకు పుట్టిన ఊరు ఇంకా వికీడేటాలో చేర్చకపోయినట్లైతే చేర్చాలి. అప్పుడు ప్రస్తుత జిల్లా ఆధారంగా జిల్లాకు సంబంధించిన వారి వివరాలు తెలుసుకోవటానికి క్వెరీల ద్వారా వీలవుతుంది. నా సవరణల గురించి మరిన్ని వివరాలకు లింకు 1, లింకు 2 చూడండి. వీటిని తనిఖీ చేసి ఏమైనా దోషాలుంటే సరిచేయమని సభ్యులను కోరుతున్నాను. ఈ వ్యాసాలన్నిటికి ఇప్పటివరకు, వికీపీడియాలో, వికీడేటాలో కృషి చేసిన వారందరికి నా కృతజ్ఞతలు. అర్జున (చర్చ) 11:51, 29 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
బాపట్ల, పల్నాడు జిల్లా వర్గవృక్షపు వ్యాసాలనుండి అయోమయ నివృత్తి పేజీలలో లింకులను పరిశీలించి, అవసరమైన జిల్లా మార్పులు, వ్యాసపేజీలలో మండల, పట్టణ స్థాయి వరకు అయోమయనివృత్తి లింకులు సవరించాను. మరిన్ని వివరాలకు ఆయా జిల్లా చర్చాపేజీలు చూడండి. అర్జున (చర్చ) 12:19, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పునర్వ్యవస్థీకరణ తరువాత, తెలంగాణ జిల్లాలు మండలాల పటాలు[మార్చు]

తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ జరిగాక, కొత్తవి ఏర్పడ్డంతో పాటు, పాతవాటి భౌగోళిక రూపాలు బాగా మారిపోయాయి. పాత మ్యాపుల స్థానే కొత్త మ్యాపులను పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనికనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తయారుచేసిన మ్యాపులను దించుకుని, వాటి నుండి ఒక్కో మండలాన్నీ, సంబంధిత జిల్లానూ హైలైటు చేసి చూపుతూ ప్రతి మండలానికీ ఒక మ్యాపును తయారు చేసాం. వీవెన్ గారు ఈ పనిలో ప్రశంసనీయమైన కృషి చేసారు. ఆయనకు ధన్యవాదాలు, అభినందనలు. ఈ పటాలను కామన్సు లోకి ఎక్కించాను. వికీలో వాడుకునేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయి. ఈ దస్త్రాల పేర్లు Telangana-mandal-Mahabubnagar_Rajapur-2022.svg అనే ఆకృతిలో ఉంటాయి. మ్యాపు ఉదాహరణకు తలమడుగు మండలం పేజీ చూడవచ్చు. ఆసక్తి ఉన్నవారు మిగతా వాటిని ఆయా మండలాల పేజీల్లోకి, పాత మ్యాపును తీసివేసి, దాని స్థానంలో ఎక్కించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 11:56, 24 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పాత మ్యాపు పేరు, mandal_map అనే ఫీల్డులో ఉంటుంది. దాని పేరు - Adilabad mandals outline04.png అనే రూపంలో ఉంటుంది. దీన్ని తీసివేసి కొత్త మ్యాపును పెట్టాలి. __ చదువరి (చర్చరచనలు) 12:09, 24 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మండలాల మ్యాపులన్నిటినీ కామన్సు లోని commons:Category:Telangana mandals అనే వర్గంలో చూడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 08:15, 25 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Collections Available Now - April 2022[మార్చు]

Hello Wikimedians!

The TWL owl says sign up today!

The Wikipedia Library has free access to new paywalled reliable sources. You can these and dozens more collections at https://wikipedialibrary.wmflabs.org/:

  • Wiley – journals, books, and research resources, covering life, health, social, and physical sciences
  • OECD – OECD iLibrary, Data, and Multimedia​​ published by the Organisation for Economic Cooperation and Development
  • SPIE Digital Library – journals and eBooks on optics and photonics applied research

Many other sources are freely available for experienced editors, including collections which recently became accessible to all eligible editors: Cambridge University Press, BMJ, AAAS, Érudit and more.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: log in today!
--The Wikipedia Library Team 13:17, 26 ఏప్రిల్ 2022 (UTC)

This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

ఆంధ్రప్రదేశ్ మండల వ్యాసాలలో వికీడేటా ఆధారిత సమాచారపెట్టె[మార్చు]

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మండల వ్యాసాలలో వున్న సాధారణ సమాచారపెట్టె బదులుగా వికీడేటా ఆధారిత సమాచారపెట్టె చేర్చబడింది. వికీడేటాలో జరిగే సవరణలు, ఈ సమాచారపెట్టెలో కనబడే వివరాలను ప్రభావితం చేస్తాయి కనుక, తెవికీ సభ్యులు తమ అభిరుచులలో ఇటీవల మార్పులు టేబ్ లో ఉన్నత ఎంపికలు విభాగంలో వికీడేటా మార్పులను ఇటీవలి మార్పులలో చూపించు అనే అంశాన్ని చేతనం చేస్తే, వికీడేటా వివరాలలో మార్పు జరిగినప్పుడు, ఇటీవలి మార్పులలో కనబడతాయి. ఈ విధంగా చెత్త మార్పులేమైనా మీరు గమనించితే వికీడేటాలో అటువంటివి రద్దు చేయడం ద్వారా, సమాచారపెట్టెలోని వివరాల నాణ్యతను కాపాడవచ్చు. సభ్యులు అందరూ గమనించి, ఆసక్తి గల వారు పాటించండి. అర్జున (చర్చ) 03:55, 27 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Call for Candidates: 2022 Board of Trustees Election[మార్చు]

Dear community members,

The 2022 Board of Trustees elections process has begun. The Call for Candidates has been announced.

The Board of Trustees oversees the operations of the Wikimedia Foundation. Community-and-affiliate selected trustees and Board-appointed trustees make up the Board of Trustees. Each trustee serves a three year term. The Wikimedia community has the opportunity to vote for community-and-affiliate selected trustees.

The Wikimedia community will vote to elect two seats on the Board of Trustees in 2022. This is an opportunity to improve the representation, diversity, and expertise of the Board of Trustees.

Kindly submit your candidacy to join the Board of Trustees. CSinha (WMF) (చర్చ) 09:04, 29 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Coming soon: Improvements for templates[మార్చు]

-- Johanna Strodt (WMDE) 11:14, 29 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2022 #1[మార్చు]

Read this in another languageSubscription list for this multilingual newsletter

New editors were more successful with this new tool.

The New topic tool helps editors create new ==Sections== on discussion pages. New editors are more successful with this new tool. You can read the report. Soon, the Editing team will offer this to all editors at the 20 Wikipedias that participated in the test. You will be able to turn it off at Special:Preferences#mw-prefsection-editing-discussion.

Whatamidoing (WMF) 18:55, 2 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లోగో మార్పులతో Vector 2022 UI సమస్య[మార్చు]

Vector 2022 UI వాడేటప్పుడు ఆజాది కా అమృత్ మహోత్సవ్ లోగో మార్పుతో ప్రక్కపట్టీలో ఆదేశాలకు స్పష్టత పోతున్న సమస్య, ఉబుంటు 18.04, ఫైర్ఫాక్స్ 97.0.2(64bit), క్రోమ్, Version 99.0.4844.51 (Official Build) (64-bit)

గత చర్చలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కొరకు లోగో మార్పు చేశారు. అయితే ఇది Vector 2022 UI (అభిరుచులలో, రూపురేఖలలో చేతనం చేసుకోవచ్చు) వాడేవారికి సమస్యాత్మకంగా మారింది. ప్రక్కన బొమ్మ చూడండి. జెండా నేపథ్యంగా పక్కపట్టీలో తొలి ఆదేశాలున్నాయి. కావున ఈ లోగో మార్పును తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఏమైనా అభ్యంతరాలుంటే లేక సమస్య కలిగించని ప్రత్యామ్నాయ లోగో ప్రతిపాదనతో వారంరోజులలోగా స్పందించండి. అర్జున (చర్చ) 04:54, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

బానే ఉంది. సమస్యేమీ అనిపించడం లేదు. తొలగించాల్సిన అవసరం కనబళ్ళేదు. __ చదువరి (చర్చరచనలు) 23:29, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvariగారు, మీరు ప్రక్కనే గల బొమ్మను సరిగా గమనించలేదా? లోగోకి నేపథ్యంగా వుండవలసిన జెండా బొమ్మ, ఆదేశాల నేపథ్యంగా వుంది చూడండి. అర్జున (చర్చ) 03:58, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్య పరిష్కరించాను. అర్జున (చర్చ) 00:39, 13 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
లోగోని తీసేసే విషయంలో ఏకపక్షంగా కాకుండా, ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకుంటే బాగుండేది. ఏదేమైనప్పటికీ, తీసేసారు కాబట్టి ఇక దాన్ని నేను తిరగదోడను.
ఈ లోగోను vector రూపుకు మాత్రమే వర్తించేలా మీడియావికీ:Vector.css పేజీలో చేర్చాను. ఇప్పుడది మిగతా రూపుల్లో కనిపించడం లేదు. అయితే, vector (2022) రూపులో మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. బహుశా ఇది vector రూపు నుండి సీయెస్స్‌ను వారసత్వంగా తెచ్చుకుంటోందేమో.. వాడుకరి:Veeven గారు, వాడుకరి:Arjunaraoc గారు, వాడుకరి:Kasyap గారు, వాడుకరి:రవిచంద్ర గారు.. దీన్ని పరిశీలించి సరిచెయ్యవలసినది. __ చదువరి (చర్చరచనలు) 05:09, 13 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఇతర అలంకారాలలోని అంశాలు మన జెండా వల్ల చూడలేట్టులేకుండా మార్చాను. ఈ మార్పులు వాడుకరి:Veeven/common.css ఫైలులో ఉన్నాయి. వీటిని మీడియావికీ:Common.cssలో చేర్చాలి. అనుమతులు ఉన్నవారు చేయగలరు. వీవెన్ (చర్చ) 13:01, 13 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Veeven గారూ, అవసరమైన మార్పుచేర్పులు చేసాను. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 04:32, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, @Veeven గారు, మీ సహాయానికి ధన్యవాదాలు. ఉబుంటులో సమస్య పూర్తిగా తొలగలేదు కాని, ఇంతకుముందు కంటే కొంత మెరుగుగావుంది.
@Chaduvari గారు, మీ స్పందనలో, నేను ఈ విషయమై ఏకపక్షంగా చేశానని అనటం బాధాకరం. రచ్చబండలో చర్చ ప్రారంభించి, వచ్చిన స్పందనలకు ప్రతిస్పందనలిచ్చి, గడువు తీరిన తరువాత Vector 2022 UI వాడే వికీపీడియా సభ్యుల సౌకర్యంకోసం సమస్యను తొలగించడం ఎలా ఏకపక్షం అవుతుంది? స్వేచ్ఛా జ్ఞాన సముదాయాలలో పసలేని వ్యాఖ్యలకు, పరిష్కారం సూచించని వ్యాఖ్యలకు నా అనుభవం ప్రకారం ఏమాత్రం విలువలేదండి. అర్జున (చర్చ) 05:07, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, నేనంటున్నది కూడా అదేనండి -వచ్చిన వ్యతిరేక స్పందనకు విలువనివ్వలేదనే. "ఏకపక్షంగా" అనేది మీకు బాధ కలిగించింది కాబట్టి నేను ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. కానీ వ్యతిరేక స్పందనను పరిగణించలేదు, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించలేదు అని మాత్రం మళ్ళీ చెబుతున్నాను.
  1. వచ్చినది ఒక్క స్పందనే అయినప్పటికీ, అది మీ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చి ఉంటే మీరు చర్య తీసుకోవచ్చు. కాని ఇక్కడ పరిస్థితి అది కాదు.
  2. మీరు అనుభవజ్ఞులు, సాంకేతికత తెలిసినవారు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతికగలిగే సామర్థ్యం ఉన్నవారు.. కనీసం ప్రత్యామ్నాయమేమైనా ఉందేమో నన్న చర్చకు కూడా తావివ్వలేదు మీరు.
__ చదువరి (చర్చరచనలు) 07:22, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, నా తొలి వ్యాఖ్యలోనే 'సమస్య కలిగించని ప్రత్యామ్నాయ లోగో ప్రతిపాదనతో' అన్న పదాలున్నాయి. ఈ అంశంలో నా సాంకేతికనైపుణ్యం ఉపయోగపడలేదు కావుననే నేను ఇతర సభ్యులను కోరాను. నా వ్యాఖ్య మీరు సరిగా అర్ధంచేసుకున్నట్లులేదు. అర్జున (చర్చ) 01:53, 22 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

డెస్క్ టాప్ వాడుకరులకు క్లుప్త వివరణ[మార్చు]

మొబైల్ లో వికీపీడియా పేజీలనుచూసినపుడు కనబడే క్లుప్త వివరణ, డెస్క్ టాప్ వాడుకరులు ఇప్పడు తమ ఉపకరణ అభిరుచులలో మార్పులు విభాగంలో Shortdesc helper ని చేతనంచేసుకొని పొందవచ్చు. అర్జున (చర్చ) 11:32, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చేతనంచేసుకొని ఒక పేజీకి క్లుప్త వివరణ కూడా చేర్చాను. ధన్యవాదాలు అర్జున గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:43, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు దిద్దుబాట్లలో సమస్య[మార్చు]

ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు ద్వారా మూలాల దిద్దుబాట్లలో సమస్య వస్తోంది. మూలాల్లో ఆర్కైవ్ లింకు, ఆర్కైవ్ తేదీ, మూలం తేదీ ఉన్నప్పటికి ఆయా మూలాల్లో ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు మరలా ఆర్కైవ్ లింకు, ఆర్కైవ్ తేదీ, మూలం తేదీలను చేరుస్తోంది. ఈ దిద్దుబాటులో ఆ సమస్యను చూడవచ్చు. దానివల్ల మూలాల్లో ఎర్రర్ రావడంతో వస్తోంది. ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు చేస్తున్న ఈ దిద్దుబాట్ల వల్ల చేయాల్సిన పని పెరగడమే తప్ప ఉపయోగం లేదనిపిస్తోంది. సభ్యులు పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:55, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ రాజ్ గారు గుర్తించిన సమస్య నాకు ఎదురైంది.నేను ఆ సమస్య ఉన్న పేజీలు గుర్తించినప్పుడు ఆ లోపం సరిదిద్దుచున్నాను.అయితే ఆలోపం గురించి నేను అంత లోతుగా పరిశీలించలేదు.దానివల్ల CS1 errors: redundant parameter అనే వర్గం అనవసరంగా వచ్చి చేరుతుందుని అనుకుంటున్నాను.ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు చేస్తున్న ఈ దిద్దుబాట్ల వల్ల చేయాల్సిన పని పెరగడమే తప్ప ఉపయోగం లేదనిపిస్తోందనే ప్రణయ్ రాజ్ గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇలాంటి పేజీలను గమనించగా 714 ఉన్నట్లు ఈ లింకు ద్వారా తెలుస్తుంది.అసలే చురుకైన వాడుకరులు, నిర్వాహకులు తక్కువుగా ఉండి వికీపీడియా నాణ్యత, అభివృద్ధిపనులు అంతంత మాత్రం జరుగుతుంటే ఇలాంటివాటిని వదిలించుకోవాలిగాని, పెంచుకుంటే నాణ్యత ఎలా పెరిగిందని నాఅభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 17:50, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమస్య ను సరిదిద్దటానికి ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు లో ఏమైనా సాంకేతిక మార్పులు చేయాలేమో పరిశీలించాలి, ఈ మూలాల పట్టిక చూసిన తరువాత ఇంకో విన్నపం మనం ఎక్కవ సంఖ్యలో ఒకటే ఆధారముగా మూలాలు ఇస్తున్నపుడు సాధ్యమైనంతవరకూ ప్రభుత్వ,ప్రసిద్ద సంస్థల వెబ్సైట్ లు మూలంగా అందించే సూచన శైలిలో చేర్చాలి ఎందుకంటే అయా లింకులు చేరుకోవటానికి, ఆ మూలాలు శాశ్వతంగా పని చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఉదాహరణకు 1800 పేజీలలో మూలంగా పేర్కొన్న ourtelugunadu.com సైటు తెరుచుకోవటం లేదు, కాబట్టి వీలయితే ఆమూలాలు కూడా పరిశీలించి సరిదిద్ది / ఆర్కైవ్ చేయగలరని మనవి. Kasyap (చర్చ) 08:27, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారు, బాట్ మార్పులలో దోషాలుంటే వాడుకరి_చర్చ:InternetArchiveBot లో తెలిపిన మెటాలింకు పేజీలో సమస్య తెలియచేస్తే, దోషాలనివారణకు బాట్ తయారీదారు తగిన చర్యలు తీసుకోవాటినికి ఉపయోగంగావుంటుంది. ఈ విషయమై నేను 2022 ఏప్రిల్ 3 న సమస్య నివేదించగా, ఏప్రిల్ 17 న సమస్య పరిష్కారమైనట్లు తెలిపారు. ఇంకా సమస్య పరిష్కారం కానట్లైతే, లేక ఇతర సమస్యలు మీ దృష్టికి వచ్చినట్లైతే ఆ మెటా పేజీలో తెలపండి. అర్జున (చర్చ) 03:56, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Arjunaraoc గారు, నేను చూసినవి ఏప్రిల్ 17 కంటే ముందు జరిగిన దిద్దుబాట్లు అనుకుంటాను. మీరు సమస్య నివేదించిన తరువాత, సమస్య పరిష్కారమైనట్లున్నది.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:31, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల సవరణకు చర్చ[మార్చు]

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలకు చెందిన వర్గాలు అవసరంలేని పదాలతో నిడివి ఎక్కువ ఉండి, ఒకే రకం వర్గాలు కొన్ని ఒకే పద్ధతిలో కాకుండా, కొద్ధి మార్పులతో వ్యాకరణ విరుద్ధంగా వివిధరకాలుగా ఉన్నాయి.అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటుదనే అభిప్రాయంతో వాటిని సవరించటానికి సవరణకొరకు చర్చించాల్సిన జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల జాబితాను చర్చకొరకు ఈ పేజీలో తయారుచేసి ప్రతిపాదించటమైంది.కావున చదువరి గారూ, అర్జునరావు గారూ, రాజశేఖర్ గారూ, వెంకటరమణ గారూ, విశ్వనాథ్ గారూ, పవన్ సంతోష్ గారూ, రవిచంద్ర గారూ, వీవన్ గారూ, ప్రణయ్ రాజ్ గారూ, సుజాత గారూ, రహ్మానుద్దీన్ గారూ, బత్తిన వినయ్ కుమార్ గౌడ్ గారూ, మేడం అభిలాష్ గారూ, నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మహేశ్వరరాజు గారూ, సాయికిరణ్ గారూ, స్వరలాసిక గారూ, కశ్యప్ గారూ, బేతి రమేష్ గారూ, ముసునూరి మురళీకృష్ణ గారూ, ఇంకా చురుకైన ఇతర వికీపీడియన్లు ఈ చర్చా పేజీలో ఆ వర్గాలను నిశితంగా పరిశీలించి మీకు నచ్చిన ప్రతి వర్గానికి సంతకం ద్వారా ఆమోదం తెలుపగలరు.అలాగే మీసూచనలు, అభిప్రాయాలు, సలహాలు, స్పందనలు పట్టిక చివరలో తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:11, 7 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:03, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. Nskjnv ☚╣✉╠☛ 07:48, 11 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ, మంచి పని @ప్రభాకర్ గౌడ్చర్చ 14:38, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

MGA73bot కు తెలుగువికీలో బాట్ అనుమతి[మార్చు]

User:MGA73 గారు, తెలుగు వికీపీడీయాలో బొమ్మల వివరాలు అభివృద్ధి పరచుటకు తన బాట్ ఖాతాకు అనుమతి అభ్యర్ధించారు. ఇప్పటికే కామన్స్, జపాను భాష వికీపీడియా లో బాట్ ఖాతా అనుమతి పొంది వున్నారు. గతంలో తెలుగు వికీపీడియాలో చిత్రాల నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు. ఏమైనా వివరణ కావలసినా, అభ్యంతరాలున్నా 2022-05-15 లోగా చర్చించండి. అర్జున (చర్చ) 06:18, 11 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా లో సాధ్యమైనంత వరకూ తెలుగు రాష్ట్రాలకు , సంస్కృతికి దగ్గర గా ఉన్న బొమ్మలు ఉంటే బాగుంటుంది, ఈ అంతర్జాతీయ బాట్లు ఆడించటం వలన అంతగా నొప్పని బొమ్మలు చేరతాయేమో, ఉదాహరణకు దేవాలయాలు , నాట్యం , తోలుబొమ్మలాట , దుస్తులు వంటి వ్యాసాలలో విదేశీ బొమ్మలు ఆకట్టుకోవు అని నా అభిప్రాయం, ఒక వేళ మనకు దగ్గరగా ఉన్న సంబంధిత చిత్రాలు like GPS coordinates ఆధారిత etc.. బాట్ ద్వారా చేర్చగలిగితే మంచిదే !  : Kasyap (చర్చ) 07:33, 11 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారు, బాట్ కొత్తగా బొమ్మలు చేర్చదు, ఉన్న బొమ్మలలో వివరాలు చేర్చడం, లేక ఇతర బొమ్మ నకలుహక్కుల హక్కులకు సంబంధించి ఏమైనా సవరణలు, హెచ్చరికలు చేర్చడం, సరిగా వున్న బొమ్మలను కామన్స్ కు తరలించడం లాంటి వాటిని మాత్రమే చేస్తుందని అభ్యర్ధనలో తెలిపారు. మీరు ఇంకొకసారి అనుమతి అభ్యర్ధనని పరిశీలించండి. అర్జున (చర్చ) 00:42, 13 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పరిష్కరించని అభ్యంతరాలు లేక వివరణలు లేనందున, ఖాతాకు బాట్ ఫ్లాగ్ చేతనం చేశాను. అర్జున (చర్చ) 05:00, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter April 2022[మార్చు]

Dear Wikimedians,

I hope you are doing well. As you know CIS-A2K updated the communities every month about their previous work through the Newsletter. This message is about April 2022 Newsletter. In this newsletter, we have mentioned our conducted events, ongoing events and upcoming events.

Conducted events
Ongoing events
Upcoming event

Please find the Newsletter link here. Thank you Nitesh (CIS-A2K) (talk) 15:47, 11 May 2022 (UTC)

On behalf of User:Nitesh (CIS-A2K)

Wikimedia Foundation Board of Trustees election 2022 - Call for Election Volunteers[మార్చు]

You can find this message translated into additional languages on Meta-wiki.

The Movement Strategy and Governance team is looking for community members to serve as election volunteers in the upcoming Board of Trustees election.

The idea of the Election Volunteer Program came up during the 2021 Wikimedia Board of Trustees Election. This program turned out to be successful. With the help of Election Volunteers we were able to increase outreach and participation in the election by 1,753 voters over 2017. Overall turnout was 10.13%, 1.1 percentage points more, and 214 wikis were represented in the election.

There were a total of 74 wikis that did not participate in 2017 that produced voters in the 2021 election. Can you help increase the participation even more?

Election volunteers will help in the following areas:

  • Translate short messages and announce the ongoing election process in community channels
  • Optional: Monitor community channels for community comments and questions

Volunteers should:

  • Maintain the friendly space policy during conversations and events
  • Present the guidelines and voting information to the community in a neutral manner

Do you want to be an election volunteer and ensure your community is represented in the vote? Sign up here to receive updates. You can use the talk page for questions about translation.
CSinha (WMF) (చర్చ) 10:37, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022[మార్చు]

గత ఏడాది వికీపీడియా వాంటింగ్ ఫోటోస్ 2021లో మనం అందరం ఉత్సాహంగా పాల్గొని తెవికీని ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది కూడా ఈ క్యాంపెయిన్ జూలై, ఆగష్టు నెలలలో నిర్వహిస్తున్నారు. ఐతే ఈ సారి ఈ పోటీలో పాల్గొనే వాడుకరుల విషయంలో కొంత మార్పులు చేశారు. ఈ పోటీలో పాల్గొనాలంటే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతాను తెరిచి కనీసం ఒక సంవత్సరం నిండి ఉండాలి. అంటే 1 జూలై 2021 ముందే వారు ఖాతా తెరిచి ఉండాలి. కొత్త వారు ఈసారి పోటీలో పాల్గొనే అవకాశం లేదు. గతంలాగే ఈ సారి కూడా మన కమ్యూనిటీ దీనిలో చురుకుగా పాల్గొనాలని ఆశిస్తున్నాను. ఈ సారి ఈ ప్రాజెక్టు నిర్వహణను చదువరి, అర్జునరావు, రాజశేఖర్, వెంకటరమణ, కశ్యప్, విశ్వనాథ్, పవన్ సంతోష్ , రవిచంద్ర, వీవెన్, ప్రణయ్ రాజ్, సుజాత, రహ్మానుద్దీన్,యర్రా రామారావు గార్లలో ఎవరో ఒకరు చేపడితే బాగుంటుంది. ప్రాజెక్టును నిర్వహించ దలచిన వారు దయచేసి ఇక్కడ నమోదు చేయగలరు. స్వరలాసిక (చర్చ) 15:11, 13 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు స్వరలాసిక గారు, నేను ఇతర వికీ ప్రాజెక్టులో ఉండడంవల్ల ఈ పోటీలో పాల్గొనలేను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:54, 17 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు.మీరు గతంలో మొదటిసారిగా వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 విజయవంతంగా నిర్వహించారు.మీకు ఆ ప్రాజెక్టుపై ఒక అవగాహన ఉంది,ఎటువంటి ఇబ్బందులు లేకపోతే వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టు కూడా మరలా మీరే నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నావరకు నాకైతే జిల్లా, మండల గ్రామ వ్యాసాలలో ఇంకా నిరవధిక సవరణలు చేయవలసిన అవసరం ఉన్నందున నేను ఈ ప్రాజెక్టును నిర్వహించలేను. నా అవకాశాన్ని పట్టి ప్రాజెక్టు పనిలో పాల్గొంటాను. యర్రా రామారావు (చర్చ) 14:42, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం స్వరలాసిక గారు, ఈ ప్రాజెక్టులో గత ఏడాది పాల్గొనడం ద్వారా ప్రాజెక్టు గురించి నేర్చుకున్నాను. అదే కాకుండా WPWP పోటి అంతర్జాతీయ జూరిలో కూడా సభ్యునిగా ఉన్నాను. కావున ఈ పోటి నిర్వహించడానికి తగు అనుభవం ఉన్నదని, ఈ పోటి నిర్వహించడానికి సముదాయ సహయం, ప్రోత్సాహం అందుతుందని భావించి. ఈ పోటిని నిర్వహించడానికి నిర్ణయించుకున్నాను.

ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 04:20, 13 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు సాయి కిరణ్ Nskjnv ☚╣✉╠☛ గారు, నాకు ప్రచారంలో కొంత అనుభవం ఉన్నది,మీకు పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రచారానికి,ఫొటోలు చేర్చటంలో శాయశక్తులా తోర్పడగలను దయచేసి ఒక ప్రాజెక్టు పేజీ తయారుచేసి చేసి నియమ,నిబంధలను తెలుప విన్నపము : Kasyap (చర్చ) 10:06, 13 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సాయికిరణ్ గారూ, ఈ ప్రాజెక్టును నిర్వహించడానికి ముందుకు వచ్చినందులకు అభినందనలు, శుభాకాంక్షలు. నావంతు సహకారం తప్పకుండా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 14:18, 13 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలు చెయ్యడం, ఇతరుల అభిప్రాయాలకు విలువ నివ్వడం[మార్చు]

వికీలో మంచి విశేషం ఒకటుంది -

  • చర్చలు చెయ్యడం.
  • అనుకూలుర/వ్యతిరేకుల సంఖ్యతో సంబంధం లేకుండా మంచి అభిప్రాయాలకు విలువ నివ్వడం.
  • చర్చలో భిన్నాభిప్రాయాలు వచ్చినపుడు, చర్చలో పాలుపంచుకోనివాళ్ళు నిర్ణయాన్ని ప్రకటించడం.
  • నిర్ణయాన్ని ప్రకటించేటపుడు చర్చలో వచ్చిన అభిప్రాయాలను తప్ప తన స్వంత అభిప్రాయాలను గణించకపోవడం.

వీటిలో కొన్ని విధానాలు, కొన్ని మార్గదర్శకాలు, మరికొన్ని సంప్రదాయాలు. ఇక్కడ మనందరం కలిసి సాఫీగా ప్రయాణం చెయ్యడానికి పనికొచ్చే గతుకుల్లేని బాటలివి. వీటిని పాటించకపోతే, ఏం జరుగుతుందనేదానికి మరొక ఉదాహరణ, రచ్చబండ లోనే, ఆజాదీ కా అమృత్ లోగోపై జరిగిన చర్చలో చూడొచ్చు. స్వాతంత్ర్యం సిద్ధించిన 75 ఏళ్ళయిన సందర్భంగా ఒక ఏడాది పాటు ప్రదర్శించాలని తలపెట్టి గత 9 నెలలుగా ప్రదర్శిస్తూ ఉన్న లోగోను తీసెయ్యాలనే ప్రతిపాదనను అర్జునరావు గారు తెచ్చారు, నేను దాన్ని వ్యతిరేకించాను. ఇద్దరిలో ఎవరు రైటో ఎవరు కాదో తెలీలేదు, తేలలేదు. కానీ ఆయన, తన అభిప్రాయం మేరకే తాను తలపెట్టిన పరిష్కారాన్నే- వ్యతిరేక అభిప్రాయం ఒకటి వచ్చినప్పటికీ - అమలు చేసేసారు. కానీ ఆ తరువాత, అంతకంటే మెరుగైన పరిష్కారం ఉందని తేలింది, దాన్ని అమలు చేసాం.

చర్చలో మరింత మంది పాల్గొని ఉంటే, బహుశా మరింత మెరుగైన పరిష్కారం దొరికి ఉండేదేమో. లేదా ఒరిజినల్‌గా ఉన్నదే మంచిదనో, ప్రతిపాదనే తెలివైనదనో తేలి ఉండేదేమో! తోటి వాడుకరుల మౌనం కారణంగా బహుశా ఒక మంచి పరిష్కారాన్ని కోల్పోయామేమో తెలీదు.

చర్చల్లో వ్యతిరేక అభిప్రాయాలు వచ్చినపుడు, ఒక నిర్ణయం వెలువడనంతవరకు, తొందరపడి మార్పులు చేసెయ్యకూడదు. ఇతరుల అభిప్రాయాలను కోరాలి. నిర్ణయం చెయ్యమని ఇతర నిర్వాహకులను కోరాలి. ఈ అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోనట్లైతే, ఆ చర్చను అంతటితో ముగిస్తూ, వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయి కాబట్టి, యథాతథ స్థితిని ఉంచెయ్యాలి. అంతేగానీ, ప్రతిపాదకులు తాము ప్రతిపాదించినదే సరైనదనుకుని దాన్ని అమలు చేసెయ్యకూడదు.__ చదువరి (చర్చరచనలు) 09:03, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గత ఐదు రోజులుగా ఆన్ లైన్ లో లేను. ఉండుంటే ఈ చర్చలో పాల్గొనేవాడిని. మళ్ళీ చూస్తాను.- రవిచంద్ర (చర్చ) 05:28, 16 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:51, 17 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల సవరణకు జరిగిన చర్చపై నిర్ణయం కొరకు అభ్యర్థన[మార్చు]

జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల సవరణకు చర్చ జరిగిన సంగతి మనందరికి తెలుసు.చర్చకు కాలపరిమితి ముగిసింది.చర్చలో పాల్గొనిన అందరికి ధన్యవాదాలు.ఈ చర్చలలో పాల్గొనని ఎవరైనా వాడుకరులు రెండురోజులలో సవరణకొరకు చర్చించాల్సిన జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల జాబితా పేజిీలో నిర్ణయాలు/నిర్ణయం ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:55, 19 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ సవరణకొరకు చర్చించాల్సిన జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల జాబితా పేజిీని పరిశీలించి నిర్ణయాలు/నిర్ణయం ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:05, 22 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ ఈ చర్చలో మిమ్మల్ని నిర్ణయం ప్రకటించవలసిందిగా కోరాం.మీరు పని వత్తిడి వలన దీనిని చూడలేదనుకుంటున్నాను.రెండు రోజులలో నిర్ణయం ప్రకటించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:22, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, సమయం తీసుకున్నందుకు క్షమించాలి. వ్యక్తిగత పనులమీదనే వికీలో పాల్గొనడం ఆలస్యమైంది. ఇప్పుడే చర్చా ఫలితాన్ని ప్రకటించాను.- రవిచంద్ర (చర్చ) 07:32, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ నిర్ణయ ఫలితం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:26, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Cleaning up files and moving to Commons[మార్చు]

Hi everyone! Sorry to write in English but hope those that are interessted in files understand or can use Google Translate.

I like to work on files and make sure that they have a valid license and a good source and author. For that I use my bot User:MGA73bot. I have been working on many wikis for example Hindi Wikipedia. Recently I have been working on Japanese Wikipedia but I would also like to help here. I mostly work on free files and I like to move them to Commons so other wikis can use the files too.

For users that have uploaded many files I sometimes create categories like ja:Category:Files uploaded by Maechan0360 and c:Category:Files uploaded by Maechan0360 because that can make it easier to make sure that the files have the relevant information. And if some users did not understand how copyright work before they uploaded the files it also makes it easier to make sure the files do not get moved to Commons but are fixed locally or deleted.

When I prepare files for Commons I usually also add a temporary category like "Category:Unidentified subjects in India" so they end up in c:Category:Unidentified subjects in India when they are moved to Commons. That is to make sure that the file will be related to India when moved to Commons and that should make it easier for users that know about India to categorize the files better. There are more than a million uncategorized files on Commons so I think it is better this way.

Sadly some users are no longer active. So we can't ask them to fix any problems. But all the users that is still active here on tewiki are very welcome to help check/fix own uploads.

My plan is to add {{Information}} and "Category:Unidentified subjects in India" and "Category:Files uploaded by N.N.". See దస్త్రం:Warangal mandals outline44.png as an example. On that file I added a more specific category because User:Mpradeep have uploaded hundreds of maps.

If anyone would like to help or know more you are very welcome to let me know. I will try to update వాడుకరి:MGA73/Status so it is easier to see the categories I create.

For example files on Special:UnusedFiles are not in use so if they look like copyvios, are missing information or look unusable then it may be better to delete them. So you can help by looking for files that should be deleted and nominate them for deletion.

You are also very welcome to check files in c:Category:Unidentified subjects in India and help categorize them. --MGA73 (చర్చ) 16:51, 20 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

I started on the files uploaded by JVRKPRASAD. Some are now in వర్గం:Files uploaded by JVRKPRASAD. You are welcome to help check and perhaps add a good description and a good file name. --MGA73 (చర్చ) 19:43, 20 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73 gaaru, thanks for taking up this work. some points for your notice:
  1. There are many files (several hundreds) which require to be renamed now. Many of the files (maps) uploaded by User:Mpradeep require renaming. Most of these maps are outdated now, because there have been many changes to the administrative boundaries. If we do not rename these files NOW, they might soon lose their historical relevance. Reason: All these files were named by the machine with numbers in the names. These numbers are just random; do not indicate the relevant administrative region. The description on these files also do not show the administrative area. Once we start replacing these files with the newer ones on the relevant article pages, these files will become orphans and then the only source of identifying these files will be lost. (Agreed, the renaming should have been done long back, but was not done). For example, దస్త్రం:Warangal mandals outline44.png is now used on ఘనపూర్ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) article. But but image has to be replaced with the Commons file File:Telangana-mandal-Jayashankar Bhupalpally Ghanapur Mulug-2022.svg. We need to rename the old file now from the current "Warangal mandals outline44.png" to "Warangal mandals Ghanpur pre-2016.png", so that we know what the file depicts. Similar action is required on most of the files uploaded by User:Mpradeep. User:Arjunaraoc has done extensive work in this area. He can be of good help in renaming (moving) the files. User:యర్రా రామారావు and User:Pranayraj1985 also can help. I may be of some help too. Let us create a table with "old name" and "new name" columns. The bot, if it has relevant permissions, can move these files en masse.
  2. There might be some free files which are required only in tewiki, but are not required anywhere else. These need not be moved to commons. Ex:దస్త్రం:Chaduvari Translations 100 in a month.png. Perhaps, as a generic rule, you may not move the screenshots to Commons.
  3. There might be some files which are non-encyclopedic -not required anywhere. These should not be moved to Commons. Ex: దస్త్రం:J.Padmavathi Prasad.jpg
చదువరి (చర్చరచనలు) 02:07, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
User:MGA73, User:Arjunaraoc, User:యర్రా రామారావు, User:Pranayraj1985.. Please see the page వాడుకరి:MGA73/File renaming for the list of files to be renamed. You may please add/remove items from the list. Thanks.__ చదువరి (చర్చరచనలు) 03:18, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hi చదువరి! Thank you for your input.
  1. I agree that it is a good idea to rename the files. It can either be done here or during transfer to Commons. I'm not yet sure what is the easiest solution.
  2. Screenshots are welcome on Commons even if they are not likely to be used outside tewiki. Some screenshots may be usable for other te-projects like wikibooks, wikisource etc.
  3. If it is just an orphan userpage image then it should be deleted. If in use it is welcome on Commons with the template c:Template:Userpageimage.
No matter if the file stays on tewiki or are moved to Commons it should have a good description so users have a chance to see what the file show. So it would be a good idea to check all files manually. I an add {{Information}} with my bot but the bot can't tell if the description is good. If there is no description then it is possible to add the file name as description but it is only useful if the file name is good.
Personally I profer that once a file is checked and fixed then it is moved to Commons and deleted because that way it is super easy to see which files are checked. And also if the file is not usable then nominate it for deletion so it can be deleted. --MGA73 (చర్చ) 06:37, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hi @MGA73, I have finished the work on the files related to Telangana state. All these files can now be renamed to the new name mentioned in the "New name" column. You may do it either now or while transferring these files to Commons.
I request the other users to carry out this job on Andhra Pradesh related files.
Thanks.__ చదువరి (చర్చరచనలు) 07:18, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Wow that is awesome చదువరి! First I will add information template and put the files in Category:Files uploaded by Mpradeep. If a local admin transfer the files then the files can be deleted in the same process. If I or another non-admin move the files a {{NowCommons}} will be added. --MGA73 (చర్చ) 14:24, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
I will be involved as much as I can do helf in this project work యర్రా రామారావు (చర్చ) 07:34, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
I will be involved in this project work.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:58, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Many of the maps on వాడుకరి:MGA73/File_renaming have been fixed and is ready to rename and/or move to Commons. I can't rename the files locally. So either an admin rename them or we just move them to Commons with the new name. --MGA73 (చర్చ) 09:32, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73, pl move them to Commons. We will delete them after that. __ చదువరి (చర్చరచనలు) 09:39, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hello @Chaduvari and MGA73: Could you please have a look here వికీపీడియా:Files for deletion/2017 February 24, if you both somehow missed it. Thanks.--C1K98V (💬 ✒️ 📂) 12:44, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hi! As I understand it the map is/was not incorrect. It is just outdated. In that case I would keep so it can show a part of the history. --MGA73 (చర్చ) 13:03, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@C1K98V, the deletion proposal was rejected as the maps have historical value. __ చదువరి (చర్చరచనలు) 15:00, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you చదువరి. C1K98V can't reply atm. He told me on IRC that an autoblock prevent him from editing. Can you grant an IP exempt for C1K98V that is helping with the files? --MGA73 (చర్చ) 15:42, 25 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@C1K98V, @MGA73 Done.checkY చదువరి (చర్చరచనలు) 04:57, 26 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for the quick response. stay safe C1K98V (💬 ✒️ 📂) 04:59, 26 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Its been a busy day but I did have a little time to work on the maps. I have been changing he articles so they now use the files on Commons instead. So the maps that have been moved can now be deleted locally. I suggest to check the files manually. At least some of them to check that they info is correct.

There are 4 files that point to the same 2 file names on Commons. I imagine that it is a mistake. If there are 2 areas with the same name then they should be named (north) and (south) for example.

Since 109 files was deleted because they were incorredt (see వాడుకరి_చర్చ:Arjunaraoc#Working_on_files_with_bot) then there are now fewer files to worry about.

There are also files that are not maps in Category:All Wikipedia files with the same name on Wikimedia Commons and Category:All Wikipedia files with a different name on Wikimedia Commons. I added many of those there but it is safer to check manually before they are deleted. Just in case :-) --MGA73 (చర్చ) 19:06, 26 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73 gaaru, thanks for the update. I will delete the local copies of the moved files - after checking the same.
Also, Surprised to know that there are 109 incorrect files. __ చదువరి (చర్చరచనలు) 01:18, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Hi చదువరి. Sounds good. I do not know what the problem was with the 109 files. If they were just out of date they could be kept as historical but I guess there was another problem with them so they were never correct. --MGA73 (చర్చ) 07:15, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Hello again! A few users wrote above that they would like to help and that is great. Does anyone need help or input on how to get started on this? --MGA73 (చర్చ) 14:56, 9 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

If someone have a little time there is an easy task: The files in వర్గం:Files uploaded by Chavakiran need a description. Perhaps copy the text from where the files are used? Then move to Commons and if possible add a better category than the one I added. --MGA73 (చర్చ) 10:36, 12 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అంధ్రప్రదేశ్ మండలవ్యాసాల సమాచారపెట్టెలలోని లింకులులో దోషం[మార్చు]

అంధ్రప్రదేశ్ లోని 670 మండలవ్యాసాలలో ఏకరీతి సమాచారపెట్టెలు తాజా కూర్పు చేయబడినవి.అయితే దానిలో కూర్పు చేయబడిన రెండవ లింకు అన్ని మండలాలకు అదే లింకు చూపబడింది. కానీ ఆ లింకులను కొన్ని మండలాలలో పరిశీలిస్తే Not Found The requested URL /pca/pcadata/DDW_PCA2816_2011_MDDS with UI.xlsx was not found on this server. అని చూపుతుంది.దోషం తెలిసినవారు సవరించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:42, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పెనుగొండ మండలం (పశ్చిమ గోదావరి), తాడేపల్లిగూడెం మండలం పేజీల్లో చూసాను.. మూలాన్ని నొక్కినపుడు
"Not Found
The requested URL /pca/pcadata/DDW_PCA2815_2011_MDDS with UI.xlsx was not found on this server."
అని వస్తోంది. @Arjunaraoc గారూ పరిశీలించి, సవరించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 04:25, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari, @యర్రా రామారావు గార్లకు, మండలపేజీలలో జనగణన మూలానికి ఆర్కైవ్ లింకుకూడా చూపటం ద్వారా సమస్య పరిష్కరించాను. వికీడేటాలో మూలాలు చేర్చేటప్పుడు ఎక్కువ అంశాలలో వాడే మూలమైతే కేవలం "stated in" లక్షణం మాత్రమే వాడటం, ఆ మూలం గురించి పూర్తి వివరాలు దాని లక్ష్యమైన వికీడేటా అంశంలో (తెలుగు నామం(label), వివరణ(description), శీర్షిక, భాష, ఆర్కైవ్ లింకు లాంటి వివరాలు) చేర్చటం మెరుగు. లేకపోతే 'reference URL' తో పాటు 'archive URL' , 'archive date' చేర్చాలి. అప్పుడే మూలం వివరాలు సరిగా చూపెట్టబడతాయి. వికీడేటా మాడ్యూలు కోడ్ లో ఇంకా కొన్ని దోషాలుండటం గమనించి ఆంగ్లవికీపీడియా చర్చా పేజీలో చేర్చాను. అర్జున (చర్చ) 04:53, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా లో తెలుగు వ్యాసాలు[మార్చు]

తెలుగు వ్యాసాల్లో చాలా అక్షర దోషములు ఉన్నవి. స్వయంచాలక అనువాదములు, గూగుల్ అనువాదములు సరిదిద్ది ప్రచురించవలెను. తెలుగుభాష మీద పట్టు, ప్రావీణ్యము వాడురులకు వుండవలెను. చదువరులకు వ్యాసం చదివిన వెంటనే సంతృప్తి కలుగవలెను. వ్యాసనిర్మాణము పట్ల శ్రద్ధ వహించవలెను. మూలము లేని వ్యాసము ప్రచురించవద్దు. 07:09, 25 May 2022‎ భాను వారణాసి

తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం (2022, మే 29)[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశాల్లో భాగంగా మే 29న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్రభారతి రెండవ అంతస్తులోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం, శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. వికీ సభ్యులు, కొత్త వాడుకులు, ఔత్సాహిక రచయితలు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశంలో వికీ సభ్యులందరూ పాల్గొనేలా అవకాశం కలిగించడం కోసం సమావేశం జరిపే 3 గంటలలో గంటన్నరపాటు ఆఫ్లైన్ (రవీంద్రభారతి), గంటన్నరపాటు ఆన్లైన్ (జూమ్/గూగుల్ మీట్) పద్ధతిలో సమావేశం నిర్వహించబడుతోంది.

పాల్గొనే సభ్యులు కార్యక్రమ పేజీ తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం 2022, మే 29 లో తమ పేరును నమోదు చేయగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:04, 26 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రకాశం, కడప జిల్లాల మండలాల మ్యాపుల తొలగింపు[మార్చు]

@Arjunaraoc గారూ, ప్రకాశం, కడప జిల్లాల మండలాల మ్యాపులను తొలగించారని రచ్చబండలో చర్చలో దస్త్రాలపై పనిచేస్తున్న వాడుకరి రాయగా తెలిసింది. మీ వాడుకరి చర్చ పేజీకి వెళ్ళి అక్కడ తొలగింపు గురించి మీరు రాసినది చూసాను. "109 మ్యాపులు తప్పుగా ఉన్నాయా?" అని నాకు ఆశ్చర్యం కలిగింది. వాటిలో తప్పు ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది. ఆ తప్పుల గురించి, ఆ దస్త్రాల తొలగింపు గురించీ చర్చ ఎక్కడ జరిగిందో చూద్దామని వెతికాను కానీ నాకు దొరకలేదు. ఆ చర్చ ఎక్కడుందో, తొలగించాలని ఎక్కడ నిర్ణయించారో ఆ లింకులు ఇవ్వవలసినది. __ చదువరి (చర్చరచనలు) 01:28, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారు, దస్త్రంపై చర్చ:Prakasammandals.jpg, దస్త్రంపై చర్చ:Cudapah mandals.jpg చూడండి. ఈ లింకులు తొలగింపు చిట్టాలో కనబడే తొలగింపు సవరణలకు సారాంశ వ్యాఖ్యలలో గూడా చేర్చాను. నా వాడుకరి పేజీ చర్చలో భాగంగా కూడా ప్రకాశం మండలాల చర్చకు లింకు వున్నది. అర్జున (చర్చ) 01:35, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]