వికీపీడియా చర్చ:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి
వికీడేటాలో సవరణల సమన్వయం
[మార్చు]జిల్లాల పరిధులు మారినందున, మండలాల రెవిన్యూ డివిజన్, జిల్లా పేర్లలో మార్పులు జరిగాయి. చాలామండలాలకు గతంలో వికీడేటాలో రెవిన్యూ డివిజన్ చేర్చలేదు. కావున మండలాల వ్యాసాలలో పనిచేసేవారు, అలాగే జిల్లాలో కొత్త రెవిన్యూ డివిజన్ వారీగా మండలాలను చేర్చేవారు, గూగుల్ షీట్ లో నమోదు చేయటం ద్వారా సహకరించండి. జాబితా పూర్తయిన తర్వాత దీని అధారంగా వికీడేటా సవరణలు, దాని ఫలితంగా మండలాల సమాచారపెట్టెలు తాజా పడతాయి. ఏమైనా సందేహాలుంటే అడగండి.--అర్జున (చర్చ) 07:14, 4 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జనరావు గారూ గూగుల్ షీట్ లో నమోదు చేయటం ద్వారా సహకరించండి. అని అన్నారు.మరింత వివరంగా తెలుపగలరు. మీరు మాదిరిగా ఏమైనా చేసి చూపించగలరు.నాకైతే అర్థం కాలేదు. యర్రా రామారావు (చర్చ) 07:56, 4 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, నేను ఊహించని విధంగా కొత్త రెవిన్యూ విభాగాలేకాక, కొత్త మండలాలను కూడా జిల్లాల సవరణలో భాగంగా చేసినట్లున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా మండలాల మూసలో మీరు చేసిన సవరణలు చూస్తే, సీతమ్మధార, గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట కొత్త మండలాలు. వీటికి గూగుల్ షీట్ లో అడుగున కొత్త వరుసలలో సవరణలు చేశాను. గమనించండి. అలానే మిగతా వరుసలకు చేయాలి. అర్జున (చర్చ) 09:32, 4 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు,అవసరమైన మార్పులు (కొత్త మండలాల సృష్టింపు తప్పించి) OSM లో తాజాపరచిన సమాచారం ద్వారా పొందగలిగాను కాబట్టి, ఈ గూగుల్ షీట్ ఉపయోగం లేదు. గమనించండి. --అర్జున (చర్చ) 11:35, 9 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా వ్యాసం, సంబంధిత వ్యాసాల మార్పులు
[మార్చు]జిల్లా పేజీల సవరణలలో ప్రస్తుతం నలుగురే పాలుపంచుకుంటున్నారు. వికీపీడియా వ్యాసాల సంఖ్య ఎక్కువయ్యే సరికి చేయవలసిన మార్పులు కూడా ఎక్కువవుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాసాన్ని కాస్త విస్తరించి, సంబంధిత సవరణలు దాని చర్చాపేజీలో చేరుస్తున్నాను. తెలంగాణా జిల్లాల సవరణలలో కీలకపాత్ర పోషించిన యర్రా రామారావు, క్రియాశీలంగా వున్న @Ch Maheswara Raju, @Pkraja1234 గారలు, ఈ పనిలో పాలుపంచుకుందామనుకుంటున్నవారు ఇప్పటికి వరకు జరిగిన పని గురించి కాని, ఏ విధంగా ఈ పని పూర్తి చేయాలన్న దాని గురించి కాని అభిప్రాయాలు తెలపండి. అర్జున (చర్చ) 12:50, 5 ఏప్రిల్ 2022 (UTC)
- ధన్యవాదములు, నేను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పేజీలను మరో 2 లేదా 3 వారాల్లో తగు విధముగా విదేకరించగలను. Pkraja1234 (చర్చ) 18:01, 5 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జున గారు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలు అన్ని సృష్టించడం జరిగింది.వాటిలో సమాచారం రాస్తున్నాను. మొదట పార్వతీపురం మన్యం జిల్లా నుండి మొదలు పెట్టాను. జిల్లాల్లో పూర్తి సమాచారం ఇచ్చిన తరువాత మిగిలిన వ్యాసాలు పై దృష్టి పెడతానాండి.Ch Maheswara Raju☻ (చర్చ) 13:09, 6 ఏప్రిల్ 2022 (UTC)
- @Ch Maheswara Raju, @Pkraja1234 మీ స్పందనలకు ధన్యవాదాలు. మీ సూచనలు బాగానే వున్నాయి. నేను OSM పటాల పనిలో వున్నాను. ఆ పనిపూర్తయిన తరువాత, మండలాల సమాచారపెట్టెల పని చేస్తాను. బాట్ లేక AWB తో పనిచేయగలిగే సామర్ధ్యం పెంచుకోగలిగితే, చాలా మార్పులు వేగంగా చేయవచ్చు. చర్చ:బాపట్ల జిల్లాలో కొత్త జిల్లా వ్యాసాలకు సంబంధిత సవరణలు నేను గమనించినవి చేర్చాను. మీరు గమనించినవి కూడా చేర్చండి. అది సమగ్రం అనుకుంటే దానినుండి ఒక తనిఖీ మూస చేసి ఇతర కొత్త జిల్లాల చర్చాపేజీలలో చేర్చుదాము. అలాగే పాత జిల్లాలకు కూడా ఇంకో మూస తయారు చేయటం మంచిది. అర్జున (చర్చ) 01:31, 8 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జున గారు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలు అన్ని సృష్టించడం జరిగింది.వాటిలో సమాచారం రాస్తున్నాను. మొదట పార్వతీపురం మన్యం జిల్లా నుండి మొదలు పెట్టాను. జిల్లాల్లో పూర్తి సమాచారం ఇచ్చిన తరువాత మిగిలిన వ్యాసాలు పై దృష్టి పెడతానాండి.Ch Maheswara Raju☻ (చర్చ) 13:09, 6 ఏప్రిల్ 2022 (UTC)
Interwiki coordination to Andhra Pradesh and its related articles
[మార్చు]I have added a comment at Talk:Andhra_Pradesh#AP districts restructure on 2002-04-04 - Interwiki coordination for interwiki coordination. అర్జున (చర్చ) 05:43, 8 ఏప్రిల్ 2022 (UTC)
మండలాల వ్యాసాల్లో మూస మార్పులు
[మార్చు]@యర్రా రామారావు గారు, మండలాల వ్యాసాల్లో మూస మార్పులు చేయటం గమనించాను (ఉదాహరణ). ఇవి నేను బాట్ తో చేద్దామనుకుంటున్నాను. ఇప్పటికే బాపట్ల జిల్లాకు సంబంధించి చేశాను. మీరు ప్రస్తుతం చేస్తున్న పని ఏ జిల్లాకు సంబంధించినదో అంతవరకు పూర్తి చేయండి. మీరు ఇతర పనులు, ముఖ్యంగా జిల్లా వ్యాసాల అభివృద్ధి పై కృషి చేయగలిగితే వ్యాస నాణ్యత మరింత మెరుగవుతుంది అని నా అభిప్రాయం. పరిశీలించండి. అర్జున (చర్చ) 06:02, 8 ఏప్రిల్ 2022 (UTC)
మండల సమాచారపెట్టెల సవరణ
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లో దాదాపు సగం మండలాలకు జిల్లాలు మారాయి. జిల్లాల రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం మండల వ్యాసాల్లో వాడుతున్న సమాచారపెట్టెలో మండల పటం ఇకపై వాడలేము. కావున {{Infobox India AP Mandal}} వాడాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది ఇప్పటికే ప్రకాశం జిల్లా మండలాలలో వాడాము. పాత సమాచారపెట్టెలో నుండి అందుబాటులో వున్న అక్షాంశ రేఖాంశాలు వికీడేటాలో చేర్చాను. పునర్విభజనకు ముందున్న అన్ని మండలాలకు(670) అక్షాంశ రేఖాంశాలున్నాయి. ఇప్పటికే కనీసంగా మొత్తం జనాభా గణాంకాలు(2011నాటివి) వికీడేటాలో వున్నాయి. ఇక పాత సమాచారపెట్టెలో PIN ఒకటే ఇచ్చినందున అది మండల వ్యాసానికి అనువైనది కాదు. కావున దానిని వదిలి వేద్దామనుకుంటున్నాను. అక్షరాస్యత గణాంకాలు వికీడేటాలో చేరిస్తే అవికూడా కొత్త సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయవచ్చు. ఉదాహరణ పోలిక అడ్డతీగల మండలం వ్యాసం లో (పైన కొత్త సమాచారపట్టికి, క్రింద పాతసమాచారపట్టిక(మండలపటం తప్పించి) చూడండి. ఏమైనా సూచనలు చేయాలంటే రెండు రోజులలో తెలపండి. అర్జున (చర్చ) 12:24, 9 ఏప్రిల్ 2022 (UTC)
సందేహాలు
[మార్చు]దీని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి,-- యర్రా రామారావు (చర్చ) 17:21, 10 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, చర్చా విషయంపై స్పందనకు ధన్యవాదాలు. మెరుగైన చర్చ కొరకు మీ ప్రశ్నను ఉపవిభాగాలుగా చేసి స్పందన చేరుస్తున్నాను. వాటిలో అదనపు స్పందన చేయదలిస్తే అదే విభాగంలో చేర్చండి. --అర్జున (చర్చ) 23:00, 12 ఏప్రిల్ 2022 (UTC)
మండల పటం వాడుక
[మార్చు]ప్రస్తుత మండల వ్యాసాల్లో వాడుతున్న సమాచారపెట్టెలో మండల పటం ఇకపై వాడలేము.అని తెలిపారు.ఎందుకు వాడలేమో వివరిస్తే తెలుసుకోవాలని ఉంది. -- యర్రా రామారావు (చర్చ) 17:21, 10 ఏప్రిల్ 2022 (UTC)
- ప్రస్తుత మండల వ్యాసాల్లో వాడుతున్న సమాచారపెట్టెలో పటం సంబంధిత జిల్లాపటం లో మండలహద్దులు చేర్చి వాడుతున్న మండలపు హద్దులవరకు రంగు నింపిన స్థిర చిత్రం ఉదాహరణ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం. చాలా ఏళ్ల క్రిందట ఇటువంటి చిత్రాలను బహుశా మానవీయంగా చేసే తెవికీలో ఎక్కించారు. జిల్లా రూపురేఖలు మారినందున ఈ పటం వాడలేము. ఇలాగే ఎవరైన కొత్త జిల్లా రూపురేఖలతో పటాలు చేసి చేరిస్తే, నా పదిహేనేళ్ల పైగా వికీ అనుభవంప్రకారం, ప్రస్తుతం అటువంటి పని వేగంగా ఎవరైనా చేస్తారనిపించుటలేదు. ఆంగ్లవికీపీడియాలో పనిచేసేవారు ఆంధ్రప్రదేశ్ పటంలో కొత్త జిల్లాలకు అటువంటి మార్పులు చేసి ఎక్కించారు. అటువంటి తాజాపడిన పటాలు అదేపేరుతో కొనసాగుతున్న జిల్లావ్యాసాలలో చూడవచ్చు (ఉదా:ప్రకాశం జిల్లా). ఒక వేళ ఎవరైనా అలా చేసినప్పుడు ఆ పటం ప్రత్యామ్నాయ పటం కన్నా మెరుగనిపించితే కొత్త పటం మూసలో సవరణతో వాటిని వాడుకొనేటట్లు చేయవచ్చు. --అర్జున (చర్చ) 23:14, 12 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:10, 13 ఏప్రిల్ 2022 (UTC)
ప్రస్తుత సమాచారపెట్టెలో సమాచారం కొత్త సమాచారపట్టికలో చేర్చే అవకాశం
[మార్చు]- పాత సమాచారపెట్టెలో జనాభా వివరాలు మండల జనాభా వివరాలకు తోడు పురుషులు, స్తీలు వివరాలు ఉన్నాయి.కొత్త సమాచారపెట్టెలో ఇవి పూర్తిగా లేవు.వీటిని చేర్చేఅవకాశం ఉందా లేదా?
- పాత సమాచారపెట్టెలో మండలంలోని గ్రామాలు సంఖ్య నమోదై ఉంది. కొత్త సమాచారపెట్టెలో ఈ అవకాశం ఉందా లేదా?
- పాత సమాచారపెట్టెలో ప్రభుత్వం, మండలాధ్యక్షుడు వివరాలు నమోదు చేయటానికి అవకాశం ఉంది. కొత్త సమాచారపెట్టెలో ఈ అవకాశం ఉందా లేదా? -- యర్రా రామారావు (చర్చ) 17:21, 10 ఏప్రిల్ 2022 (UTC)
- నేను చర్చ తొలి వ్యాఖ్యలో "అక్షరాస్యత గణాంకాలు వికీడేటాలో చేరిస్తే అవికూడా కొత్త సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయవచ్చు." పేర్కొన్నట్లు, ఏ సమాచారమైనా వికీడేటాలో నమోదు చేసి, సంబంధిత మూసలో స్వల్ప సవరణ ద్వారా వాడుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:16, 12 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.అయితే మాదిరి అడ్డతీగల మండల వ్యాసం వికీ డేటాలో సాధ్యమైనన్ని వివరాలు చేర్చి, సంబందిత వ్యాసం సమాచారపెట్టె పూర్తి ఆకారం కనపడేటట్లుగా చేస్తే దాని పూర్తి స్వరూపం నాలాంటివారికి తెలుస్తుంది. ఈ భాధ్యతను పూర్తిగా చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 07:20, 13 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, సంబంధిత వికీడేటాను, సమాచారపెట్టెను సాధ్యమైనంతవరకు మరింత మెరుగు చేశాను. ప్రస్తుత సమాచారపెట్టెలలో అక్షరాస్యత గణాంకాలు 2001 జనగణన నాటివని గమనించాను. కొన్ని మండలాలలో 2011 జనగణన జనాభా గణాంకాలు మానవీయంగా తాజా చేసినా, కూడా ప్రస్తుత మూసలో లోపం వలన, అక్షరాస్యతకు కూడా 2011 అని చూపెడుతున్నది. (ఉదాహరణ, కావున ఇవి తాజా గణాంకాలు కానందున, తప్పు సూచికలవలన ఈ సమాచారంవలన వ్యాస నాణ్యత దెబ్బతింటున్నందున వదలివేయడమే మంచిది. నేను ఇటీవలి మండలాల విస్తీర్ణం వికీడేటాలో చేర్చడానికి ప్రతి ఒక్క పాత జిల్లా కరపుస్తకంలో ఆ పేజీ సమాచారాన్ని సేకరించి, దానిని వికీడేటాలో వాడగలిగే ఎక్సెల్ లేక (csv) తీరుకు మార్చి, వికీడేటాలోని సంబంధిత అంశాలతో అన్వయించి, చేర్చడానికి కొన్ని రోజులు పూర్తికాలం శ్రమపడవలసి వచ్చింది. వికీడేటాలో సమచారం పరికరాలతో చేర్చటానికి ఇంతకు ముందు పనిచేసిన వారు కూడా సహకరిస్తే, ఈ పని త్వరలో పూర్తి చేసి, 2011 నాటి అక్షరాస్యత సమాచారం కూడా సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయవచ్చు. మరిన్ని వివరాలు చూడండి. అర్జున (చర్చ) 22:23, 15 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.అయితే మాదిరి అడ్డతీగల మండల వ్యాసం వికీ డేటాలో సాధ్యమైనన్ని వివరాలు చేర్చి, సంబందిత వ్యాసం సమాచారపెట్టె పూర్తి ఆకారం కనపడేటట్లుగా చేస్తే దాని పూర్తి స్వరూపం నాలాంటివారికి తెలుస్తుంది. ఈ భాధ్యతను పూర్తిగా చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 07:20, 13 ఏప్రిల్ 2022 (UTC)
- నేను చర్చ తొలి వ్యాఖ్యలో "అక్షరాస్యత గణాంకాలు వికీడేటాలో చేరిస్తే అవికూడా కొత్త సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయవచ్చు." పేర్కొన్నట్లు, ఏ సమాచారమైనా వికీడేటాలో నమోదు చేసి, సంబంధిత మూసలో స్వల్ప సవరణ ద్వారా వాడుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:16, 12 ఏప్రిల్ 2022 (UTC)
కొత్త సమాచారపెట్టెలో సమాచారం చేర్చటం కష్టమైన పని
[మార్చు]- పాత సమాచారపెట్టెలో ఎవరైనా సవరించటానికి సులభమైన అవకాశాలు ఉన్నాయి.కొత్త సమాచారపెట్టెలో ఏది ఎక్కడ రాయలో, ఏది రాస్తే ఏమవుతుందో, అసలు ఆ సమాచారపెట్టెలో ఏదైనా ఎడిటు చేయటానికి అవకాశం ఉందో లేదో, దానిలో రాయవచ్చో, రాయకూడదో లేదా ఆ వ్యాసానికి చెందిన వికీడేటాలోనే కూర్పు చేయాలా... ఇత్యాది సందేహాలు చాలా ఉన్నాయి. ఒకవేళ వికీడేటాలో రాయవలసి వస్తే మానవీయంగా చేయటానికి అందరికి సాద్యపడే విషయమేనా ?బాటు నడిపేవారు ఒకరు ఇద్దరు తప్పితే లేరు. బాటు నడిపేవార్కి ఈ పనులుమీద ఇంట్రెస్టు లేకపోతే పరిస్థితి ఏమిటి? ఇవి అన్నిటికి ప్రత్యామ్నాయ మార్గం ఉండాలని నా అభిప్రాయం.దీనికన్నా పాతసమాచారపెట్టె బాగుందనే అభిప్రాయం రాకూడదుకదా.. -- యర్రా రామారావు (చర్చ) 17:21, 10 ఏప్రిల్ 2022 (UTC)
- పైన తెలిపినట్లు పాతసమాచారపెట్టెలో కనబడే సమాచారం అంతా వికీడేటాలో చేర్చటం ద్వారా కొత్త సమాచారపెట్టె ద్వారా కనబడేటట్లు చేయవచ్చు. వికీడేటాలో సమాచారం చేర్చటం గురించి ఎవరైనా ఒక అరగంటలో నేర్చుకొని చేర్చవచ్చు. మీరు కూడా వికీడేటాలో క్రియాశీలంగా వున్నందున నాతో ఏకీభవిస్తారని భావిస్తాను. అది సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయటానికి మూస సాంకేతికాలు, వికీడేటాను మూసలో వాడుకకు సాంకేతికాల గురించి తెలిసినవారు ఒకరిద్దరు వుంటే చాలు. ఒకవేళ అలా లేకున్నా ఆంగ్లవికీపీడియా లేక వికీడేటాలో సాంకేతిక నిపుణులను అభ్యర్ధించి అటువంటి సహాయం పొందవచ్చు.--అర్జున (చర్చ) 23:23, 12 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.వికీడేటాలో సమాచారం చేర్చటం గురించి ఎవరైనా ఒక అరగంటలో నేర్చుకొని చేర్చవచ్చు అని ఉన్నారు.ఇది ఎలా సాధ్యపడుతుంది.ఈ విషయంలో మీరు ఎలాంటి సహాయం చేయగలరు. ఈ విషయంలో నాసహకారం అందించటానికి నేను సిద్దం. యర్రా రామారావు (చర్చ) 07:29, 13 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, ఒక అంశం విలువ తప్పుగా వుందని తెలిసినపుడు, దానిని మార్చటానికి, వికీడేటా పై ప్రాథమిక అవగాహన వుంటే వికీవ్యాసంలో పాఠ్యంలోగల సమాచారం మార్చినంత తేలికగానే చేయవచ్చని నా అభిప్రాయం. ఈ విషయమై మీరు సహకారం అందించటానికి సంసిద్ధతను వ్యక్తం చేసినందులకు ధన్యవాదాలు. వికీడేటా పై సందేహాలు తీర్చడానికి నేను కూడా సిద్ధం. అర్జున (చర్చ) 22:30, 15 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.వికీడేటాలో సమాచారం చేర్చటం గురించి ఎవరైనా ఒక అరగంటలో నేర్చుకొని చేర్చవచ్చు అని ఉన్నారు.ఇది ఎలా సాధ్యపడుతుంది.ఈ విషయంలో మీరు ఎలాంటి సహాయం చేయగలరు. ఈ విషయంలో నాసహకారం అందించటానికి నేను సిద్దం. యర్రా రామారావు (చర్చ) 07:29, 13 ఏప్రిల్ 2022 (UTC)
- పైన తెలిపినట్లు పాతసమాచారపెట్టెలో కనబడే సమాచారం అంతా వికీడేటాలో చేర్చటం ద్వారా కొత్త సమాచారపెట్టె ద్వారా కనబడేటట్లు చేయవచ్చు. వికీడేటాలో సమాచారం చేర్చటం గురించి ఎవరైనా ఒక అరగంటలో నేర్చుకొని చేర్చవచ్చు. మీరు కూడా వికీడేటాలో క్రియాశీలంగా వున్నందున నాతో ఏకీభవిస్తారని భావిస్తాను. అది సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయటానికి మూస సాంకేతికాలు, వికీడేటాను మూసలో వాడుకకు సాంకేతికాల గురించి తెలిసినవారు ఒకరిద్దరు వుంటే చాలు. ఒకవేళ అలా లేకున్నా ఆంగ్లవికీపీడియా లేక వికీడేటాలో సాంకేతిక నిపుణులను అభ్యర్ధించి అటువంటి సహాయం పొందవచ్చు.--అర్జున (చర్చ) 23:23, 12 ఏప్రిల్ 2022 (UTC)
కొత్త సమాచారపెట్టె వలన చేరిన అదనపు వర్గాల వలన నాణ్యత దెబ్బతిన్నట్లున్నది
[మార్చు]- కొత్త సమాచారపెట్టెను ప్రయోగాత్మకంగా వాడిన అడ్డతీగల వ్యాసం పరిశీలించగా సమాచారపెట్టెను పెట్టిన తరువాత అదనంగా ఈ దిగువ వర్గాలు అదనంగా చేరాయి.
- ఈ వర్గాలు వ్యాసనాణ్యతను పెంచినట్గుగా పరిగణించాలా! లేక వ్యాస నాణ్యతను దెబ్బతీసినట్లుగా పరిగణించాలా! యర్రా రామారావు (చర్చ) 17:21, 10 ఏప్రిల్ 2022 (UTC)
- మీరు తెలిపిన అదనపు వర్గాలు నిర్వహణ వర్గాలు. ప్రస్తుత మూస ఆంగ్ల మూసను వాడుకొని చేసినందున అది అంత మంచిపద్ధతి కానందున ఇవి చేరుతున్నాయి. ఇవి సాధారణ పాఠకులకు, వికీపీడియాలో ఖాతాగల వాడుకరులు వారి అభిరుచులలో నిర్వహణ వర్గాలు చూపమని ఎంపిక చేయపోతే కనబడవు. ఈ దోషాలు పరిహరించుటకు మూసలో మార్పులు లేక ఆంగ్లమూసపై ఆధారపడని కొత్త మూస తయారు చేస్తే సరిపోతుంది. కావున వీటివలన నాణ్యత దెబ్బతిన్నది అనుకొనటం అపోహ మాత్రమే. అర్జున (చర్చ) 23:29, 12 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.ఇవి సాధారణ పాఠకులకు, వికీపీడియాలో ఖాతాగల వాడుకరులు వారి అభిరుచులలో నిర్వహణ వర్గాలు చూపమని ఎంపిక చేయపోతే కనబడవు అని అన్నారు. నిర్వహకులు కాకుండా సాధారణ వాడుకరులకు వారి అభిరుచులతో పనిలేకుండా ఇవి కనపడకుండా చేయుట సాధ్యమయ్యే పనికాదనుకుంటాను.ఈ దోషాలు పరిహరించుటకు మూసలో మార్పులు లేక ఆంగ్లమూసపై ఆధారపడని కొత్త మూస తయారు చేస్తే సరిపోతుంది అని అన్నారు.మీరు సాంకేతికంగా దీనికి ఏమైనా బాధ్యత వహించగల అవకాశం ఉందా? యర్రా రామారావు (చర్చ) 07:35, 13 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, నాకు తెలిసినంతవరకు అప్రమేయంగా ఈ నిర్వహణ వర్గాల ఎంపిక చేతనం కాదు. మూసల సాంకేతికాలతో క్లిష్టత వుంది. పదిహేనేళ్లుగా కృషి చేస్తున్నా నాకు కూడా పూర్తి పట్టు వుందనుకోను. కాని ఇవి వికీపీడియా నాణ్యతకు కీలకం కాబట్టి నాకు చేతనైనంతవరకు చేయటానికి ప్రయత్నిస్తున్నాను. కొత్త మూస తయారు చేయటం, దాని కూలంకషంగా తనిఖీ చేయడం, దానిని నిర్వహించడంతో వచ్చే లాభనష్టాలను, ఆంగ్లవికీలో నాణ్యతగల మూసను వాడటంలో గల లాభనష్టాలను బేరీజు వేసుకుంటే, ప్రస్తుతానికి ఆంగ్లమూస ఆధారిత మూస వాడడమే మెరుగని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 22:35, 15 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.ఇవి సాధారణ పాఠకులకు, వికీపీడియాలో ఖాతాగల వాడుకరులు వారి అభిరుచులలో నిర్వహణ వర్గాలు చూపమని ఎంపిక చేయపోతే కనబడవు అని అన్నారు. నిర్వహకులు కాకుండా సాధారణ వాడుకరులకు వారి అభిరుచులతో పనిలేకుండా ఇవి కనపడకుండా చేయుట సాధ్యమయ్యే పనికాదనుకుంటాను.ఈ దోషాలు పరిహరించుటకు మూసలో మార్పులు లేక ఆంగ్లమూసపై ఆధారపడని కొత్త మూస తయారు చేస్తే సరిపోతుంది అని అన్నారు.మీరు సాంకేతికంగా దీనికి ఏమైనా బాధ్యత వహించగల అవకాశం ఉందా? యర్రా రామారావు (చర్చ) 07:35, 13 ఏప్రిల్ 2022 (UTC)
- మీరు తెలిపిన అదనపు వర్గాలు నిర్వహణ వర్గాలు. ప్రస్తుత మూస ఆంగ్ల మూసను వాడుకొని చేసినందున అది అంత మంచిపద్ధతి కానందున ఇవి చేరుతున్నాయి. ఇవి సాధారణ పాఠకులకు, వికీపీడియాలో ఖాతాగల వాడుకరులు వారి అభిరుచులలో నిర్వహణ వర్గాలు చూపమని ఎంపిక చేయపోతే కనబడవు. ఈ దోషాలు పరిహరించుటకు మూసలో మార్పులు లేక ఆంగ్లమూసపై ఆధారపడని కొత్త మూస తయారు చేస్తే సరిపోతుంది. కావున వీటివలన నాణ్యత దెబ్బతిన్నది అనుకొనటం అపోహ మాత్రమే. అర్జున (చర్చ) 23:29, 12 ఏప్రిల్ 2022 (UTC)
నాణ్యత మెరుగుకు కొత్త సమాచారపెట్టె తోడ్పాటు
[మార్చు]కొత్త సమాచారపెట్టె వలన నాణ్యత మెరుగవుతుందా అనే విషయంలో ఇంకా సందేహాలున్నవారు గమనించవలసిన విషయాలు క్రింది విభాగాలలో చేర్చాను. సందేహాలుంటే అనువైన చర్చా విభాగంలో చేర్చండి. అటువంటిది లేకపోతే కొత్త విభాగంతో చేర్చుతూ ప్రతిస్పందించండి.--అర్జున (చర్చ) 23:40, 12 ఏప్రిల్ 2022 (UTC)
OSM గతిశీలపటం
[మార్చు]కొత్త సమాచారపెట్టెలో మండలాన్ని చూపుటకు వాడుతున్నది OSM గతిశీల పటం. దీనివలన మండల హద్దుల రూపమే కాక, మండలంలో గల ప్రాంతాల వివరాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, భౌగోళికంగా ఉపయోగంగా వుండే రహదారులు, రైలు మార్గాలు, నదులు లాంటివి కోరుకున్న జూమ్ తో చూడవచ్చు. ఈ కొత్త పటం OSM లో చేర్చే వివరాలతో ఎప్పటికప్పుడు తాజా పడుతుంది. OSM లో తెలుగు పేరులు చేరినప్పుడు ఆంగ్ల పేరు కాక తెలుగు పేరు కనబడుతుంది. ప్రస్తుతం వాడుతున్న పటం కంటె ఎన్నో రెట్లు మెరుగైనది. దీనిని మూసలో ఇంకొన్ని మార్పుల ద్వారా జిల్లాపటం హద్దులు కూడా కనబడేటట్లు చేయవచ్చు. ఈ పటం రూపంలో తాజాపడడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నా వాటిగురించి వికీమీడియా ఫౌండేషన్, వికీమీడియా చాప్టర్ జర్మనీ వార్లు కృషి చేస్తున్నందున, ముందు ముందు అవి తొలగే అవకాశముంది. --అర్జున (చర్చ) 23:40, 12 ఏప్రిల్ 2022 (UTC)
సమాచారపెట్టెలో వున్న వివరాల నాణ్యత నిర్వహణ
[మార్చు]పాత సమాచారపెట్టెలో మానవీయంగా ఒక పరామితికి విలువ చేర్చేవారు. ఇలా చేర్చినప్పుడు సంబంధిత వనరును మూలంగా పేర్కొనటం చాలా తక్కువ. పాత సమాచారపెట్టెలో ఉండవలసిన పరామితులు, తొలిగా మూస చేసిన వారి అవగాహన ప్రకారం వుంటాయి. అది సాధారణ వాడుకకు సంబంధించినది కావున వ్యాసపు రకానికి తగ్గట్లు నియంత్రించలేము. ఉదాహరణకు మండలం పిన్ కోడ్ కు సంబంధించి, మండలంలోని ప్రాంతాలకు అన్వయించే కోడ్ ల సంక్షిప్త రూపం చేర్చాలి, కాని ఒక్క పిన్ కోడ్ చేర్చటం వలన సమాచారపెట్టె నాణ్యత దెబ్బతింది. వీటిని సరిచేయడం మానవీయంగా కష్టమైనది, నాణ్యతగా చేయలేనిది. బాట్ ద్వారా చేయాలన్నా దోషాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
జిల్లా గణాంకాల పట్టికలో వందలకొద్ది పరామితులుంటాయి. వాటిలో వీలైనన్ని సమాచారపెట్టెలో ప్రదర్శించటం వలన నాణ్యత మెరుగుగా వున్నదనుకోవటం అపోహ మాత్రమే. ఉదాహరణకు నా అభిప్రాయంలో మండలానికి విస్తీర్ణం, జనాభా, జనసాంద్రత వివరాలు, ఉపయోగిత కొలబద్ద ప్రకారం హెచ్చు స్థాయిలో వుండగా, జనాభాలో పురుషులు, స్త్రీలు, గణాంకాలు తక్కువ స్థాయిలో వుంటాయి. ప్రస్తుత సమాచారపెట్టె వాడుకలో విస్తీర్ణం, జనసాంద్రత లేవు కాని పురుషులు, స్త్రీల గణాంకాలున్నాయి. అలాగే మండలాధ్యక్షుడు పరామితి వున్నంత మాత్రాన ఆ వివరాలను మూలంతో చేర్చడం, నాణ్యతగా నిర్వహించడం తెలుగు వికీలో క్రియాశీల సభ్యులు తక్కువ కావున మానవీయంగా సాధ్యమయ్యే పనికాదు. జిల్లా గణాంకాల అదనపు వివరాలు, మూలం ద్వారా ఆసక్తిగల వాడుకరులు పొందగలుగుతారు.
కొత్త సమాచారపెట్టెలో వికీడేటాద్వార మూలం వుంటేనే విలువ ప్రదర్శించేటట్లు చేయవచ్చు. వికీడేటా వలన సమాచారపెట్టె ద్వారా ప్రదర్శితమయ్యే విలువల వివరాలను తనిఖీ చేయ్యటం, అవసరమైన సవరణలు సూచించడం వికీడేటా క్వెరీల ద్వారా, సవరణలు చేయడం మానవీయంగా లేక వికీడేటా ఉపకరణాల ద్వారా వీలవుతుంది. కొత్త మూస వలన నిర్వహణ భారం కొంత పెరిగినా నాణ్యత నియంత్రణ సులభమవుతుంది. --అర్జున (చర్చ) 23:57, 12 ఏప్రిల్ 2022 (UTC)
మానవీయంగా చేర్చడానికి, సరిదిద్దడానికి తోడ్పాటు
[మార్చు]వికీడేటాలో బాట్ తో చేర్చిన వివరాలు నాణ్యంగా వుంటాయి. కొన్ని పరామితులు, మానవీయంగా నిర్వహించడానికి అనువైనవి, వాటిలో దోషాలున్నా నిర్ధారించుకోవటానికి సమస్య కాదు అని నిర్ణయిస్తే (ఉదాహరణకు డేటాబేస్ లో దొరకని జాలస్థలి వివరాలు) ఆ పరామితుల విలువ స్థానంలో పెన్సిల్ బొమ్మ కనబడేటట్లు చేయవచ్చు. ఆ బొమ్మ నొక్కి చేర్పులు, సవరణలు చేయవచ్చు. --అర్జున (చర్చ) 00:03, 13 ఏప్రిల్ 2022 (UTC)
నిర్వహణ పనికి సౌలభ్యం
[మార్చు]ప్రస్తుత సమాచారపెట్టెలో వికీపీడియా గురించి అవగాహన తక్కువ గలవారు, పరామితికి ఒక విలువ మూలం లేకుండా చేరుస్తారు. ఇటువంటి మార్పులు జరిగే వ్యాసాల సంఖ్య ఎక్కువగా వున్నందున, వాటిని తనిఖీ చేయడం, తొలగించడం లేక హెచ్చరికలు చేయడం, క్రియాశీల సభ్యులు తక్కువగా వున్నందున సమర్ధవంతంగా చేయదగిన పనికాదు. కొత్త సమాచారపెట్టెలో అటువంటి మార్పులకు అవకాశాన్ని తగ్గించినందున, వ్యాసంలో సమాచారపెట్టె నాణ్యమైన సమాచారంతో కొనసాగగలిగే వీలు ఎక్కువ.--అర్జున (చర్చ) 00:28, 13 ఏప్రిల్ 2022 (UTC)
ఇతర వికీప్రాజెక్టుల సభ్యుల సహకారంతో వేగంగా సవరణలు
[మార్చు]జిల్లాలలో సవరణలు, జనగణన తాజా గణంకాలు లాంటి వివరాలు మారినప్పుడు, పాత సమాచారపెట్టెతో తాజా చేయడానికి నెలలు లేక సంవత్సరాల పైగా సమయం పడుతుందన్నదని తెలంగాణాలో జిల్లాల సవరణ పనివలన తెలుస్తున్నది., ఆ పని మానవీయంగా జరిగితే నాణ్యత నియంత్రించడం కష్టం. ఆ పని నాణ్యతగా చేయడానికి ఆసక్తి వున్నవారు కూడా తక్కువని వికీపీడియాలో అనుభవాలు చెప్తున్నాయి. కొత్త సమాచారపెట్టెతో ఒక వారం రోజులలో సమాచారపెట్టెలు తాజాపడేటట్లు చేయవచ్చు. తెలుగు వికీపీడియా సభ్యులే కాక వికీడేటాలో ఇతర సభ్యుల కృషి కూడా ఈ పనిలో సహకరిస్తుంది. బొమ్మలకు కామన్స్ ఏ విధంగా సహాయంగా వుంటున్నదో, డేటాకు వికీడేటాకు ఆ విధంగా సహాయం పడుతుంది. --అర్జున (చర్చ) 00:34, 13 ఏప్రిల్ 2022 (UTC)
ఆటోమేషను చేద్దాం
[మార్చు]పైన జరిగిన చర్చను ముందు నుంచీ గమనించనందువలన, ఎవరి అభిప్రాయం ఏంటో తెలీకుండా పోయి నాకు కొంత గందరగోళంగా ఉంది. ఈ చర్చ, వికీడేటానుండి డేటాను తెచ్చుకుని ఇక్కడి సమాచారపెట్టెలో పెట్టడం గురించి అని అనుకుంటున్నాను. దానిపై నా అభిప్రాయం ఇది:
- వికీడేటా నుండీ డేటాను తెచ్చుకుని ఇక్కడ సమాచారపెట్టెలో పెట్టడం అనేది తెలివైన పని. దాని వలన మానవికంగా చేసే పని తగ్గుతుంది. మానవికంగా చెయ్యడం కంటే ఆటోమాటిగ్గా సెమీ ఆటోమాటిగ్గా చెయ్యడానికే నేణు మొగ్గు చూపుతాను, చేస్తూంటాను కూడా.
- సమాచారపెట్టెలో ఉన్న డేటా అంతా వస్తే - కనీసం ఇప్పుడు ఉన్న డేటా అంతా వస్తేనే - అలా చెయ్యడం సబబు. కొద్ది డేటా మాత్రమే వచ్చే పనైతే అది చెయ్యకూడదు. గతంలో చేసిన ప్రయత్నంలో కొంత డేటా మాత్రమే తేగలిగారని నాకు గుర్తు (కారణమేదైనా కావచ్చు).
ఇది నా అభిప్రాయం.
@Arjunaraoc గారూ, నేను ఇక్కడ రాసిన అభిప్రాయాలను విడదీయకండి. ఒక్కోదానికి విడివిడీగా స్పందించదలిస్తే వాటిని కాపీ చేసుకుని పెట్టండి -దీన్ని మాత్రం ఇలాగే ఉండనివ్వండి. పైన మీరు అలా చెయ్యడం వలన అసలు ఎవరు ఏం చెప్పారో స్పష్టత లేకుండా పోయింది.__ చదువరి (చర్చ • రచనలు) 09:29, 15 ఏప్రిల్ 2022 (UTC)
- @Chaduvari గారు, వికీడేటా ఆధారిత సమాచారపెట్టె వాడుకకు మీరు మద్దతిస్తున్నందులకు ధన్యవాదాలు. ప్రతి కీలకమార్పుకు కొన్ని లాభాలు, నష్టాలు వుంటాయి. లాభాలు నష్టాలకంటే మెరుగైనపుడు, ఆ మార్పుతో ముందుకు వెళ్లడమే మంచిదని నా అభిప్రాయం. చర్చలు మెరుగుగా జరగటానికి నేను చాలా చర్చలలో copy edit సవరణలు చేస్తుంటాను. అలాగే విషయం ఎవరైనా సులభంగా అర్ధం చేసుకోవటానికి నా సవరణలు దోహదపడతాయని నా అభిప్రాయం. మీరు కూడా కాస్త సమయం వెచ్చించి చర్చ చదివితే గందరగోళం పడే పరిస్థితే వుండదు. ఒకవేళ ఎక్కడైనా స్పష్టత కొరబడితే ఆ విభాగంలో స్పందించితే ఆ ఆస్పష్టత తొలగించడానికి నేను ఎప్పుడూ ప్రతిస్పందిస్తాను. అర్జున (చర్చ) 22:52, 15 ఏప్రిల్ 2022 (UTC)
- @Arjunaraoc గారూ, "చర్చలు మెరుగుగా జరగటానికి నేను చాలా చర్చలలో copy edit సవరణలు చేస్తుంటాను.." మీరు ఎందుకు చేసినా, అవి మాత్రం గందరగోళమౌతూంటాయి. గతంలో ఒక చర్చలో నేను రాసిన దాన్ని అలా మార్చేసి, చివరికి నా అభిప్రాయాన్నే గందరగోళ పరచారు. నేను మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా చెయ్యవద్దని మిమ్మల్ని అభ్యర్థించాల్సి వచ్చింది. అయినా మీరు అలా చెయ్యడం మానలేదు. ఈ సమాచారపెట్టెల మార్పులు కూడా అలా కాకుండా చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 23:17, 15 ఏప్రిల్ 2022 (UTC)
- @Chaduvari గారు, copy edit ప్రధానంగా ఉపవిభాగాల శీర్షికలు సృష్టించడానికి వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా చాలా అరుదుగా, అభిప్రాయ శీర్షిక కొంత వక్రీకరణకు గురయ్యే అవకాశముంది. దానికి copy edit చేసిన వారినే బాధ్యులుగా చేయడం సరికాదు. ఎందుకంటె తొలి వ్యాఖ్యలో అస్పష్టతకూడా వుండవచ్చు. ఏదో ఒకసారి వక్రీకరణ జరిగిందని, ప్రతీసారి అలాగే జరుగుతుందనే అభిప్రాయం కల్పించుకోవడం కూడా నా దృష్టిలో సరికాదు. వికీపీడియా వ్యాసాలు చాలావరకు copy edit చేయడంవలననే మెరుగుపడతాయి. అటువంటి ప్రక్రియనే చర్చలకు వాడటం మంచిది. చర్చలు చేసేవారు తక్కువై, చర్చా నైపుణ్యాలు తక్కువైన తెవికీ సముదాయంలో చర్చలు మెరుగుగా జరగటానికి ఇది చాలా ముఖ్యం. ఒక చర్చలో చాలా వేరు వేరు విషయాలు పేర్కొన్నప్పుడు, వాటికి స్పందించడానికి వాటిని మరల ఆ విషయాన్ని క్లుప్తంగా మరల పేర్కొనటంకంటె, చర్చను విడివిభాగాలగా కాపీ ఎడిట్ చేసినప్పుడు, విషయాన్ని మరల పేర్కొనకుండా, చర్చ సులభంగా సాగటానికి, అర్ధం చేసుకోవటానికి వీలుంటుంది. మీరు వాడుతున్న చర్చా విధానం కాగితాలమీద చర్చలకు, లేక ఈ మెయిల్ ఆధారిత చర్చలకు ( అనగా మార్పులు సులభంగా చేయలేని చర్చలకు) సంబంధించిన పాత విధానం అని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 23:23, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @Arjunaraoc గారూ, "చర్చలు మెరుగుగా జరగటానికి నేను చాలా చర్చలలో copy edit సవరణలు చేస్తుంటాను.." మీరు ఎందుకు చేసినా, అవి మాత్రం గందరగోళమౌతూంటాయి. గతంలో ఒక చర్చలో నేను రాసిన దాన్ని అలా మార్చేసి, చివరికి నా అభిప్రాయాన్నే గందరగోళ పరచారు. నేను మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా చెయ్యవద్దని మిమ్మల్ని అభ్యర్థించాల్సి వచ్చింది. అయినా మీరు అలా చెయ్యడం మానలేదు. ఈ సమాచారపెట్టెల మార్పులు కూడా అలా కాకుండా చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 23:17, 15 ఏప్రిల్ 2022 (UTC)
మండల వ్యాసాలకు ప్రాథమిక వికీడేటా సమాచార సంసిద్ధత
[మార్చు]వికీడేటాలో మండల వ్యాసాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం చేర్చటం, తనిఖీ చేసి సరిచేయటం చేశాను. ఈ పనిలో దీనికి ఆంగ్ల వికీపీడియాలోను,వికీడేటాలోను క్రియాశీలంగా వుండే Daxserver, OSM పనిలో Heinz సహకరించారు. వారికి నా ధన్యవాదాలు. ప్రస్తుతానికి సమాచారపెట్టెలో కనబడే సమాచారం:
- మండలం వున్న జిల్లా(లు).
కొత్త జిల్లాకు మారినట్లైతే పాతజిల్లాకు ముగింపు తేది, కొత్త జిల్లా ప్రారంభ తేది కనబడుతాయి.కొత్త జిల్లా కనబడుతుంది. - మండలానికి(అనగా మండలకేంద్రానికి) అక్షాంశ రేఖాంశ సమాచారం. ఇప్పటికే వున్న అక్షాంశ రేఖాంశాలు OSM లో సూచించిన అక్షాంశ రేఖాంశాలు పోల్చి, వాటి దూరం 1000మీటర్లు కంటే ఎక్కువైతే (దాదాపు 381 మండలాలకు) వికీడేటాలో OSM అధారిత అక్షాంశ రేఖాంశాలతో సవరించాను.
- మండల విస్తీర్ణం. ఇది పాత సమాచారపెట్టెలో లేదు. వికీడేటాలో చదరపు కిలోమీటరు కొలతతో, ప్రామాణిక మూలంతో సహా చేర్చాను. పాత డేటాలో కొన్ని చోట్ల హెక్టేరులలో, ఇంకొన్ని చోట్ల చదరపు కిమీలో వుండేది చాలావరకు వికీపీడియానే మూలంగా పేర్కొనటం జరిగింది.
- మండల జనాభా. దీనికి అవసరమైన గణన పద్ధతి వివరాలు నమోదు కాని చోట్ల సరిచేశాను. (2001,2011 కొరకు, మొత్తం జనాభా, పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్యవివరాలకు) సమాచారపెట్టెలో మొత్తం జనాభా మాత్రమే చూపుతాము. పురుషుల, స్త్రీల సంఖ్య చూపుటకు ఆధార మూసలో ఏర్పాటు లేదు. ఆ వివరాలను లింగ నిష్పత్తి అనే గణాంకంతో చూపుతున్నాను. వేరుగా పురుషుల, స్త్రీల సంఖ్యను చూపటంకంటే విషయం అర్ధం చేసుకొనటానికి ఇది మెరుగైనది.
- మండల జనసాంద్రత: పాత సమాచారపెట్టెలో లేదు, ఆధార మూస ద్వారా గణించబడి చూపుతుంది.
ప్రస్తుత సమాచారపెట్టె రూపం ప్రకాశం జిల్లా మండలాలలో, అడ్డతీగల మండలం లో చూడవచ్చు. వీటితో పాటు, ఆంధ్రప్రదేశ్ మండలాల వర్గీకరణలో నాలుగైదు యాధృచ్చిక మండలాలకు మండల పేజీలో వున్న సమాచారపెట్టె లేక వ్యాసంలో గల సమాచారంతో సంబంధిత వికీడేటా పేజీ (ఎడమప్రక్క పట్టీలో పరికరాలపెట్టె శీర్షికలో గల వికీడేటా అంశం పై నొక్కి) గల సమాచారంతో పోల్చి దోషాలేమైనా వుంటే రెండు రోజులలో తెలియచేయమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 09:58, 15 ఏప్రిల్ 2022 (UTC)
తొలగింపుకు గురయ్యే ప్రస్తుత సమాచారపెట్టెలో వున్న సమాచారం
[మార్చు]ప్రస్తుత సమాచారపెట్టెలో వున్నను, కొత్త సమాచారపెట్టె వాడుకతో కనబడని సమాచారం వివరాలు
- గ్రామాల సంఖ్య: ఇది వికీడేటాలో లేదు. రెవిన్యూ గ్రామాలకు మాత్రమే సంబంధించినది. గ్రామమంటే రెవిన్యూ గ్రామమే కాకుండా గ్రామ పంచాయితీలు కూడా కావచ్చు. రెవిన్యూ గ్రామాల జాబితా వ్యాసంలో తెలుపుతున్నాము.
- మండలాధ్యక్షుడు : ఇది నా పరిశీలనలో ఖాళీగానే వుంది.
- అక్షరాస్యత సమాచారం 2001 నాటిది, కొన్ని మండలాలలో 2011 అని చూపెడుతున్నా అది కేవలం 2011 జనాభా గణాంకాలను మాత్రమే తాజాపరచడంవలన, మూసలో లోపం వలన అలా కనబడుతున్నదని తెలిసింది (ఉదాహరణ). కావున దీనిని వదిలివేయడమే మెరుగు. వికీడేటాలో కృషి చేసేవారు పెరిగి, సహకరిస్తే వీలువెంబడి 2011 నాటి సమాచారం వికీడేటాలో చేర్చి ఆ తదుపరి కొత్త సమాచారపెట్టెలో కనబడేటట్లు చేయవచ్చు.
- పిన్ కోడ్ : సరైనది కాదు, చాలా చోట్ల చేర్చలేదు కూడా, కావున వదిలివేయడమైనది
--అర్జున (చర్చ) 23:01, 15 ఏప్రిల్ 2022 (UTC)
కొత్త మండల సమాచారపెట్టెలో ఇంకా పాటించవలసిన సవరణలు
[మార్చు]• ము అనుస్వారం బదులు సున్నా వాడాలి.
• కామాల తర్వాత స్పేసు ఉండాలి.
• పదం, బ్రాకెటు మధ్య స్పేసు ఉండాలి.
• లింగ నిష్పత్తి (1000 మంది పురుషులకు స్త్రీలు) ఇది సమాచారపెట్టెలో చూడగానే కొంత గంధరగోళంగా ఉంది.చూడగానే లింగ నిష్పత్తి (1000 993 మంది పురుషులకు స్త్రీలు) అని కంటిన్యూ గా కనపడుతుంది. బహుశా సమాచారపెట్టె ఎడమ వైపు వివరాలకు, కుడివైపు వివరాలకు మధ్యలో = లేదా : లాంటి గుర్తులు లేకపోవుటవలన అయిువుంటంది.లింగ నిష్పత్తి :ప్రతి 1000 మంది పురుషులకు 993 మంది స్త్రీలు ఉన్నారుఅని ఉంటే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 14:17, 16 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మండలాల వ్యాసాలవిషయంలో క్రియాశీలంగా తరచు స్పందిస్తున్నందులకు, సమాచారపెట్టె రూపంపై మీ స్పందనకు ధన్యవాదాలు. మీలాగా మరింతమంది స్పందిస్తే మరింత నాణ్యతతో ఈ పని పూర్తిచేయవచ్చు. సమాచారపెట్టెకు కొన్ని సవరణలు చేశాను గమనించండి.
- లింగనిష్పత్తి కి వివరణ లేకుండా వ్యాసానికి లింకు చేశాను.
- జిల్లా పేరు లేక మండలం పేరు అంతంలో 'ము' గురించి మీరు పేర్కొన్నట్లైతే, నేను చాలావరకు వికీడేటాలో Label వద్ద సవరించాను. వికీపీడియా వ్యాసంలో నైతే ఇప్పటికే సరియైన రూపంలో వున్నాయని అనుకుంటున్నాను. ఉదాహరణ పేజీ తెలపండి. ఇంకేమైనా మిగిలి వుంటే మరల సరిచేయడానికి ప్రయత్నిస్తాను.
- సంఖ్యలలో కామాలు వచ్చినప్పుడు నాకు తెలిసి స్పేసు వాడరు, కామాయే విరామ చిహ్నం కదా. అదీగాక, ఈ సమాచారపెట్టెలో వివరాన్ని ఇతరులు వాడుకోవలసివచ్చినప్పుడు సంఖ్యారూపంలో మార్చటానికి కామాని గుర్తించి అప్రమయేంగా మార్చే సాంకేతిక పరికరాలున్నాయి. మనం అనవసరంగా స్పేస్ చేరిస్తే ఇతర వాడకాలకు అవరోధం కలుగుతుంది. ఈ తీరు కొరకు మీడియావికీ సాంకేతికాలు వాడుతున్నందున, ప్రామాణీకరించిన విధంగా కనబడుతుంది.
- బ్రాకెట్ ముందు ఖాళీ అక్షరం వున్నది. అలా కాకుండా వున్న పేజీ గణాంక వివరాలు తెలపండి.
- ముఖ్యంగా, ఏ మండలానికైనా కొత్త జిల్లా పేరు చూపటంలో, లేక ఇతర మండలా గణాంకాలు వికీడేటాలో సరిగాలేనట్లు, మీ దృష్టికి వచ్చినట్లైతే తెలియచేయండి. ఇంకేమైనా సూచనలుంటే తెలియచేయండి. అర్జున (చర్చ) 01:43, 17 ఏప్రిల్ 2022 (UTC)
- నేను వివరించిన వాటిలో 4వ దానికి లింగనిష్పత్తి కి వివరణ లేకుండా వ్యాసానికి లింకు చేశాను. దీనికి లింకు ఇవ్వాల్సిన వ్యాసం ఇది కాదనుకుంటాను.దీనికి అనుగుణమైన వ్యాసం మానవ లింగ నిష్పత్తి (Human sex ratio) కి లింకు ఇవ్వాలనుకుంటాను.మీరు అనవచ్చు ఆంగ్లంలో ఇదే ఇచ్చారు.కొన్ని విషయాలలో వారు చేసినదానినే పాటించాల్సిన అవసరంలేదు.ఇది నాఅభిప్రాయంమాత్రమే.
- నేను వివరించిన వాటిలో 2 వదానికి కామాల తర్వాత స్పేసు ఉండాలి అనే దానికి నేను పదం తరువాత పెట్టిన కామా తరువాత స్పేసు ఉండాలి అని నా అభిప్రాయం. దానిని మీరు అంకెలకు అని అన్వయించుకున్నారు. అంకెలకు ఎవ్వరూ కామా తరువాత స్పేసు ఇవ్వరు.ఇది కామన్.
- నేను వివరించినవాటిలో 3 వ దానికి పదం, "బ్రాకెటు మధ్య స్పేసు ఉండాలి" అనే దానికి "బ్రాకెట్ ముందు ఖాళీ అక్షరం వున్నది" అని తెలిపారు.ఇది నాకు ఒక పట్టాన ఇంతవరకు అర్థం కాలేదు.నా అభిప్రాయం ప్రకారం ఉదాహరణ కొత్త సమాచారపెట్టెలో జనాభా(2011) అని ఉంది. అది అలాకాదు జనాభా (2011) ఇలా ఉండాలి. ఇలా ఉండాలి అని నాఅభిప్రాయం.ఇది ప్రామాణికం. అలాంటివి సమాచారపెట్టెలో పాటించాలని నా అభిప్రాయం.
- ము అనుస్వారం పై గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు.
- యర్రా రామారావు (చర్చ) 04:37, 17 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మీ వివరణకు ధన్యవాదాలు.
- లింగనిష్పత్తికి లింకు మీరు మార్పు చేయదలిస్తే చేయండి. నాకు అభ్యంతరం లేదు.
- జనాభా(2011) అనేది ఆంగ్ల మూస {{Infobox settlement}} వలన జరుగుతున్నది. ఇది ఆంగ్లం నుండి దిగుమతి చేసుకున్నది, తెలుగులో వీలైనన్ని తక్కువ మార్పులు అంటే కేవలం అనువాదాలు మాత్రమే చేసి వాడుకోవటం మంచిది. కావున సమాచారపెట్టెలకు సంబంధించి శైలికి మినహాయింపులా భావించమని కోరుతున్నాను. ఉదాహరణకు తేదీలకు శైలి నియమం వుంది కాని, మనకు గల సాంకేతికాల పరిమితులవలన పూర్తిగా పాటించటం లేదన్నది మీకు తెలిసినదే.-- అర్జున (చర్చ) 06:07, 17 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మీ వివరణకు ధన్యవాదాలు.
- ఏ మండలానికైనా కొత్త జిల్లా పేరు చూపటంలో, లేక ఇతర మండలా గణాంకాలు వికీడేటాలో సరిగాలేనట్లు నేను గుర్తిస్తే మీ దృష్టికి తీసుకురాగలను. యర్రా రామారావు (చర్చ) 04:39, 17 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా వ్యాసాల పురోగతి సూచికకు మూస
[మార్చు]సులభమైన మూసతో జిల్లా వ్యాసాల పురోగతిని సూచించవచ్చు. దీనికి {{taskp}} వాడండి. కొలబద్దకు ప్రాజెక్టు పేజీ విభాగం చూడండి. జిల్లా వ్యాసాలలో పనిచేన్తున్న వారు user:Ch Maheswara Raju, user:యర్రా రామారావు, user:పండు అనిల్ కుమార్, user:Pkraja1234, user:ప్రభాకర్ గౌడ్ నోముల,user:మురళీకృష్ణ ముసునూరి, user:Kkonduri2 ఈ స్థితిని మార్చుతూ వుండండి. చివరి మదింపు అనగా 100% పూర్తి అయినట్లు మాత్రమే ప్రధానంగా మార్పులు చేసినవారు కాక, ఇతరులు తనిఖీ చేసి చేయాలి. నేను ప్రకాశం, అనంతపురం, బాపట్ల, పల్నాడు,శ్రీసత్యసాయి జిల్లాలకు ప్రాథమిక పురోగతి మదింపు చేశాను చూడండి. సందేహాలుంటే అడగండి. ----అర్జున (చర్చ) 01:27, 18 ఏప్రిల్ 2022 (UTC)
మండల సమాచారపెట్టెలు సవరణ
[మార్చు]ఇప్పటికి వరకు వచ్చిన స్పందనల ప్రకారం, మండల సమాచారపెట్టె తీరులో సవరణలు పూర్తయినవి. వికీడేటాలో గణాంకాల గురించి ఎవ్వరూ స్పందించలేదు. కావున వికీడేటా సరిగానే వుందని భావించడమైనది. బాటుతో కొత్త సమాచారపెట్టెతో మార్చేపని ప్రారంభిస్తున్నాను. అర్జున (చర్చ) 05:11, 18 ఏప్రిల్ 2022 (UTC)
- మండల వ్యాసాలలో
- {{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటం}} అని ఉంది.ఇది ఎందుకు ఉంచుతున్నట్టు. సమాచారపెట్టెలో OSM మ్యాపు వస్తుంది గదా.దీనిని బాటు ద్వారా తొలగించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:26, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మండలపటానికి జూమ్ విలువ వికీడేటా ద్వారా వచ్చేటట్లు సరిచేశాను. అందుకని తాత్కాలికంగా మీకు దోషమేమైనా కనబడిందేమో. ఒకసారి కాషె పర్జ్ చేసి చూడండి. ఇంకా దోషం కనబడుతుంటే ఆ వ్యాసం లింకు తెలపండి. పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 05:32, 18 ఏప్రిల్ 2022 (UTC)
- అసలు ఈ లింకు అవసరం లేదని నేను అంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:35, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, కాస్త ఓపికగా అడిగిన దానికి ప్రత్యుత్తరమిస్తే నేను పరిశీలించి సరిచేస్తాను. మీకు దోషం కనబడుతున్న పేజీ వివరం తెలపండి. అర్జున (చర్చ) 05:52, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @Arjunaraoc గారూ, నేను వేంపల్లె మండలం పేజీని పరిశీలించాను. సమాచారపెట్టె (సపె) మొత్తమ్మీద బాగుంది. నేను గమనించినవివి:
- సపె లో OSM గతిశీల పటము ఉండడం బాగుంది. అయితే పేజీలో కూడా అది ఉండాల్సిన అవసరం ఉందా?
- సపె లో పురుషులు (P1540), స్త్రీల జనసంఖ్య (P1539) ఉంటే బాగుంటుంది. వాటిని తేవడంలో ఇబ్బందేమైనా ఉందా?
- __ చదువరి (చర్చ • రచనలు) 07:58, 18 ఏప్రిల్ 2022 (UTC)
- సపె లో OSM గతిశీల పటము ఉండడం బాగుంది. అయితే పేజీలో కూడా అది ఉండాల్సిన అవసరం ఉందా?
- నేను అదే ఉద్దేశ్వంతో అడిగాను.దానికి సూటిగా సమాధానం చెప్పకుండా,కాస్త ఓపికగా అడిగిన దానికి ప్రత్యుత్తరమిస్తే నేను పరిశీలించి సరిచేస్తాను. మీకు దోషం కనబడుతున్న పేజీ వివరం తెలపండి అని తెలిపారు. యర్రా రామారావు (చర్చ) 08:07, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, చర్చలలో మీ వ్యాఖ్యలు అర్ధం చేసుకోవటంలో ఇబ్బంది కలుగుతున్నందని గమనించండి. కాస్త పూర్తి వివరాలతో మీ చర్చా వ్యాఖ్యలు వ్రాసి, లేక స్పందనలకు మెరుగైన ప్రత్యుత్తరాలిచ్చి, చర్చలు సామరస్యకర వాతావరణంలో జరగడానికి సహకరించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 08:17, 18 ఏప్రిల్ 2022 (UTC)
- నేను అడిగినది అసలు ఈ లింకు అవసరం లేదని అన్నాను.నేరుగా సమాధానం చెప్పలేదు.మీరు ఏమి చెప్పారో ఒకసారి పైన గమనించండి.చర్చలలో పాల్గొనేవారిని గంధరగోళపర్చవద్దు.మీరు జరిపే చర్చలలో కూడా నాకు ఈ ఇబ్బంది ఉందని గ్రహించగలరు. ధన్యవాదాలు.చర్చలలో పాల్గొనేవార్కి సహకారమివ్వగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:24, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, నేను నాకు సాధ్యమైనంత సహకారాన్ని అన్ని చర్చలలో అందిస్తున్నానండి. అయినా అప్పుడప్పుడూ చర్చలలో ఒకరి అభిప్రాయం ఇంకొకరు అర్ధం చేసుకోవటానికి అదనపు సహకారం అవసరం. ఈ చర్చ విషయంలో ఏమి జరిగిందో ఇప్పుడు అర్ధమైంది. మీ వ్యాఖ్యలో మీరు వికీటెక్స్ట్ యథాతథంగా వాడారు. నాకు అది దోషంగా చర్చలో కనబడింది. అయితే మండలాల పేజీలలో దోషమేమి కనబడుటలేదు. అందువలన నేను సమాచార పెట్టె మూసలో ఇటీవల మార్పుల కారణంగా మీకు మండల వ్యాసాలలో తాత్కాలికంగా అలా కనబడిందేమో అన్న అనుమానం నాకు వచ్చింది. (ఒక్కోసారి అలా జరుగుతుంది) చర్చలో ప్రతిస్పందనకు చర్చా ఉపకరణాలు వాడుతున్నాను కాబట్టి సోర్స్ కోడ్ చూడకుండా స్పందించాను. ఇప్పుడు మీ వ్యాఖ్య గనక {{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటం}} (వికీటెక్స్ట్ అచేతనం చేసి) చూపినట్లైతే, నాకు సులభంగా అర్ధమయ్యివుండేది. లేక మీరు గనక ఈ దోషం అన్ని పేజీలలో వుందని సమాధానమిచ్చివుంటే నాకు మెరుగుగా అర్ధమయ్యి స్పందించేవాడిని. ఏది ఏమైనా, క్లిష్టవిషయాలైన చర్చలలో క్రియాశీలంగా వుండే అతి కొద్దిమందిలో మీరు ప్రముఖులు. మీరు చేసే చాలా సూచనలు, నా పని మెరుగు చేయడానికి తోడ్పడతాయి. కావున మీకు ధన్యవాదాలు. కాకపోతే మీ స్పందనలు, వ్యాఖ్యలు కాస్త మెరుగుగా వుంటే బాగుంటుంది. పై వివరణను బట్టి నేను ఈ చర్చలో మీ పట్ల పూర్తి గౌరవంతో స్పందించానని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు అలా భావించనట్లైతే మీకు నా క్షమాపణలు. అర్జున (చర్చ) 09:28, 18 ఏప్రిల్ 2022 (UTC)
- నేను అడిగినది అసలు ఈ లింకు అవసరం లేదని అన్నాను.నేరుగా సమాధానం చెప్పలేదు.మీరు ఏమి చెప్పారో ఒకసారి పైన గమనించండి.చర్చలలో పాల్గొనేవారిని గంధరగోళపర్చవద్దు.మీరు జరిపే చర్చలలో కూడా నాకు ఈ ఇబ్బంది ఉందని గ్రహించగలరు. ధన్యవాదాలు.చర్చలలో పాల్గొనేవార్కి సహకారమివ్వగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:24, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, చర్చలలో మీ వ్యాఖ్యలు అర్ధం చేసుకోవటంలో ఇబ్బంది కలుగుతున్నందని గమనించండి. కాస్త పూర్తి వివరాలతో మీ చర్చా వ్యాఖ్యలు వ్రాసి, లేక స్పందనలకు మెరుగైన ప్రత్యుత్తరాలిచ్చి, చర్చలు సామరస్యకర వాతావరణంలో జరగడానికి సహకరించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 08:17, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @Chaduvari గారు, మీ స్పందనకు, సమాచారపెట్టె తీరు మీకు నచ్చినందులకు ధన్యవాదాలు. నేను కొన్ని మండలాలు తనిఖీ చేశాను.
- వ్యాసంలో OSM గతిశీల పటం ద్వారా జూమ్ పెద్ద స్థాయిలో గల పటానికి నేరుగా వెళ్లగలుగుతారు. సమాచారపెట్టె లో పెద్దబొమ్మ చూపే గుర్తులు నొక్కటం ద్వారా సమాచారపెట్టెలో కనబడే జూమ్ స్థాయిలోనే పెద్దపటం చూపెడుతుంది. కావున, వాడుకరుల ఇష్టానికి అనుగుణంగా వాడుకోటానికి రెండు వుంచటం మంచిదని నా అభిప్రాయం.
- సమాచారపెట్టెలో పురుషులు, స్త్రీలు సంఖ్యని చూపించడానికి కొన్ని మార్పులతో అదనపు జనగణాంకాల శీర్షికలో కనబడేటట్లు చేయవచ్చు. అయితే దాదాపుగా జనాభాలో సగం పురుషులు, సగం స్త్రీలు వుంటారు కాబట్టి, ఈ సంఖ్యలను ప్రదర్శించటం ద్వారా సమాచారపెట్టెలో అదనపు వరుసలుండి చాలా డేటావుందనే భావం కల్గించటమే కాని అసలు విషయం లింగనిష్పత్తితో మాత్రమే తెలుస్తుంది. ఈ విషయం పై చర్చా విభాగాలలో చర్చించాను. ఈ మూసకు ఆధారమైన {{Infobox settlement}} లో పట్టణ, గ్రామీణ జనాభా గణాంకాలను నేరుగా చూపుటకు వీలున్నదని, పురుషులు, స్త్రీల సంఖ్యలు నేరుగా చూపటానికి వీలులేదని గమనించండి. లింగ నిష్పత్తి ఇప్పటికే చూపుతున్నందున, ఇవి కూడా చేర్చితే సమాచారపెట్టె కు అదనపు విలువచేకూరదని, అంతేకాక లింగనిష్పత్తిపై వుండవలసిన ధ్యాస తగ్గుతుందని నేను భావిస్తున్నాను కావున, చేర్చే అభిప్రాయం నాకు అంగీకారం కాదు. అర్జున (చర్చ) 08:12, 18 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జున గారూ మీ అనంగీకారాన్ని గమనించాను. అయితే, దానికి మీరిచ్చిన హేతువులు సరిగ్గా లేవు.
- "దాదాపుగా జనాభాలో సగం పురుషులు, సగం స్త్రీలు వుంటారు కాబట్టి" అలా అయితే లింగనిష్పత్తి కూడా దాదాపుగా వెయ్యి/వెయ్యే ఉంటుందిగా, మరి దాన్నీ తీసేద్దామా?
- "ఎక్కువ డేటా ఉందనే భావన కలించడం తప్ప ఉపయోగం లేదు" అనే వాదన కూడా సరికాదు. అదే అయితే సపె లో ఒక మ్యాపు పెట్టి, అదే మ్యాపును పేజీ బాడీలో పెట్టడం కూడా అదే అవుతుంది గమనించండి. zoom అనే పరామితి విలువను డిఫాల్టు నుండి పదికో పన్నెండుకో మారిస్తే సరిపోయే దానికి రెండు మ్యాపులు అవసరమా? అని ప్రశ్న వస్తుంది గదా!
- ఇది సాధించడంలో పెద్ద సాంకేతక ఛాలెంజి లేమీ లేవని నా ఉద్దేశం. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే చెప్పండి.
- __చదువరి (చర్చ • రచనలు) 05:27, 19 ఏప్రిల్ 2022 (UTC)
- @Arjunaraoc గారూ, నేను వేంపల్లె మండలం పేజీని పరిశీలించాను. సమాచారపెట్టె (సపె) మొత్తమ్మీద బాగుంది. నేను గమనించినవివి:
- @యర్రా రామారావు గారు, కాస్త ఓపికగా అడిగిన దానికి ప్రత్యుత్తరమిస్తే నేను పరిశీలించి సరిచేస్తాను. మీకు దోషం కనబడుతున్న పేజీ వివరం తెలపండి. అర్జున (చర్చ) 05:52, 18 ఏప్రిల్ 2022 (UTC)
- అసలు ఈ లింకు అవసరం లేదని నేను అంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:35, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మండలపటానికి జూమ్ విలువ వికీడేటా ద్వారా వచ్చేటట్లు సరిచేశాను. అందుకని తాత్కాలికంగా మీకు దోషమేమైనా కనబడిందేమో. ఒకసారి కాషె పర్జ్ చేసి చూడండి. ఇంకా దోషం కనబడుతుంటే ఆ వ్యాసం లింకు తెలపండి. పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 05:32, 18 ఏప్రిల్ 2022 (UTC)
- కొన్ని మండల వ్యాసాలలో {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం}} వాడకుండా {{infobox settlement}}, {{infobox settlement/sandbox}}, {{భారత స్థల సమాచారపెట్టె}} వాడినట్లు గమనించాను. కొన్నిటిలో సమాచార పెట్టె లేదు. అటువంటివన్ని సరిచేశాను. ఇప్పుడు జిల్లా పునర్వవస్థీకరణకు ముందున్న 670 మండలాలలో ఏకరీతి కొత్త సమాచారపెట్టె అందుబాటులోకి వచ్చింది. ఏవైనా దోషాలుంటే తెలపండి. అర్జున (చర్చ) 09:17, 18 ఏప్రిల్ 2022 (UTC)
- ర్యాండమ్ గా కొన్ని మండలాలు పరిశీలించగా ప్రస్తుతానికి ఏమీ దోషాలు కనపడలేదు. శ్ర్రమ తీసుకుని 670 మండలాలలో ఏకరీతి సమాచారపెట్టెలు కూర్పు చేసినందుకు ఈ సందర్బంగా అర్జునరావు గార్కి అభినందనలు, ధన్యవాదాలు.అలాగే తెలంగాణాలోని 594 మండలాలలో ఏకరీతి సమాచారపెట్టెలు అందుబాటులోకి తీసుకురాగలను ఆశిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:45, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, తనిఖీ చేసి నాణ్యత నిర్ధారించినందులకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ పనిని మెచ్చుకున్నందుకు సంతోషం. తొలినుంచి ఈ పనిలో స్పందిస్తూ , సహకరించినందులకు మీకు కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాల సంబంధిత సవరణలపై ధ్యాసతో పనిచేస్తున్నాను. వీలువెంబడి మీరు ప్రతిపాదించిన పని పరిశీలిస్తాను. తెవికీ సుస్థిర నాణ్యతకు ఇటువంటి పనులు చేయగలిగే సభ్యులు పెరగవలసిన ఆవశ్యకత వుంది. అర్జున (చర్చ) 23:07, 18 ఏప్రిల్ 2022 (UTC)
- ర్యాండమ్ గా కొన్ని మండలాలు పరిశీలించగా ప్రస్తుతానికి ఏమీ దోషాలు కనపడలేదు. శ్ర్రమ తీసుకుని 670 మండలాలలో ఏకరీతి సమాచారపెట్టెలు కూర్పు చేసినందుకు ఈ సందర్బంగా అర్జునరావు గార్కి అభినందనలు, ధన్యవాదాలు.అలాగే తెలంగాణాలోని 594 మండలాలలో ఏకరీతి సమాచారపెట్టెలు అందుబాటులోకి తీసుకురాగలను ఆశిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:45, 18 ఏప్రిల్ 2022 (UTC)
మండల సమాచారపెట్టెల్లో చెయ్యవలసిన పనులు
[మార్చు]అర్జున గారూ మండల సమాచార పెట్టెల్లో మార్పులను పూర్తి చేసారు. గతంలో లేని సమాచారాన్ని కూడా చేర్చినట్టు కొన్ని పేజీల్లో గమనించాను. ధన్యవాదాలు, అభినందనలు. ఇంకా చెయ్యవలసిన మార్పులు ఏమేం ఉన్నాయో ఒక జాబితా తయారు చేస్తే వీలు వెంబడి ఆ పనులు చేపట్టవచ్చు. కొన్ని మీకు అంగీకారం కాదని/ఉండకూడదనీ/చేర్చే వీలులేదనీ పైన చెప్పినట్టున్నారు. అయినప్పటికీ వాటన్నిటినీ ఒక జాబితాగా చేస్తే అవి ఎందుకు సముచితంగా ఉంటాయో, ఎందుకు అంగీకారంగా/అనంగీకారంగా ఉంటాయో పరిశీలిద్దాం. తదనుగుణంగా వాటిని చేర్చవచ్చు/మార్చవచ్చు.
యర్రా రామారావు గారూ, మీరు వీటిపై ఎక్కువగా పనిచేసి ఉన్నారు. ఈ విషయంలో మీకంటే బాగా తెలిసినవాళ్ళు తక్కువ మంది. పైగా మీరు మండలాల పేజీలకు, గ్రామాల పేజీలకూ చెక్‌లిస్టులు తయారు చేసి ఉన్నారు కూడా. మీరు ఈ జాబితాను పరిశీలించి ఇందులో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 19 ఏప్రిల్ 2022 (UTC)
- పురుషులు, స్త్రీల జనసంఖ్య వివరాలను చేర్చాలి
- "నిర్దేశాంకాలు" అంటూ రెండు నిర్దేశాంకాలు ఇచ్చారు. మండలం అనేది ఒక బిందువు కాదు, కాబట్టి ఇలా నిర్దేశాంకాలు ఇవ్వడం సరికాదు. వాటిని -
- తీసెయ్యాలి (లేదా)
- మండల కేంద్రపు నిర్దేశాంకాలు అని శీర్షిక పెట్టాలి.
అర్జున, చదువరి గార్లకు నమస్తే..గతిశీల పటము అనేది పైన పేరాలో కాక మరెక్కడైనా అంటే దిగువ పేరాల్లో ఉంచితే ఎలాఉంటుంది. టెక్స్ట్ బాక్స్ లో విస్తీర్ణం మొత్తం, జనాభా మొత్తం ఒకే పదాలు కదా.. నాకు రెండుగా ఒకదాని కింద ఒకటి కనిపిస్తున్నాయి. అంటే విస్తీర్ణం దానికింద బటన్ (*) తరువాత మొత్తం, అలాగే దాని కింద జనాభా మళ్ళీ కింద బటన్ (*) తరువాత మొత్తం ఇలా. ఇవి ఒకే లైన్ లో వస్తాయా.. * (బటన్) లేకుండా... అలాగే స్త్రీ పురుష జన సంఖ్య ఉండాలి అనెదే నా అభిప్రాయం. B.K.Viswanadh (చర్చ) 06:36, 29 ఏప్రిల్ 2022 (UTC)
- @B.K.Viswanadh గారూ, మీ సూచనలు బాగున్నై. నా అభిప్రాయాలివి:
- సమాచార పెట్టెలో ఉన్నది కూడా గతిశీల పటమే. దాన్ని నొక్కినా పెద్ద పటం కనిపిస్తుంది. పేజీలో మరోటి అవసరం లేదు.
- విస్తీర్ణం, మొత్తం అనేవి ఒకే పంక్తిలో ఉండాలి.
- జనాభా అనే శీర్షిక కింద మొత్తం, పురుష, స్త్రీ, లింగ నిష్పత్తి, సాంద్రత అనేవి దాని కింద ఉండవచ్చు.
- __ చదువరి (చర్చ • రచనలు) 08:12, 29 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా సంబంధిత వ్యాసాలలో సవరణల పురోగతి, నాణ్యత తనిఖీ కి చిట్టా
[మార్చు]{{New district checklist}} చిత్తు ప్రతి చేశాను. దీనిని పరిశీలించి రెండు రోజులలో ఆ మూస చర్చాపేజీలో ఏమైనా మార్పులు అవసరమనుకుంటే సూచించండి అర్జున (చర్చ) 12:51, 18 ఏప్రిల్ 2022 (UTC)
జనావాస వ్యాసాలకు వికీడేటాలో వివరణలో జిల్లా సవరణలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణం కారణంగా, జనవాస వ్యాసాలకు (నగరాలు, పట్ణణాలు, గ్రామాలు) అవసరమైన జిల్లా మార్పులు, సంబంధిత వికీడేటా అంశపు వివరణలో (description) సవరించాను. దీనివలన, వ్యాస పాఠ్యంలో పాత జిల్లా వివరాలు కనబడుతున్నా, మొబైల్ వాడుకరులకు, Short descr ఉపకరణం చేతనం చేసుకున్న డెస్క్ టాప్ వాడుకరులకు, వ్యాస శీర్షిక క్రింద క్లుప్త వివరణలో తాజా జిల్లా వివరం తెలుస్తుంది. ఇంకా ఏమైనా దోషాలు మిగిలివుంటే సవరించండి. చాలా ఎక్కువ దోషాలున్నట్లైతే నాకు తెలియచేయండి. నేను ఉపకరణాల ద్వారా సవరించే ప్రయత్నం చేస్తాను. అర్జున (చర్చ) 04:54, 18 మే 2022 (UTC)
మూడు నెలల కాలంలో పురోగతి
[మార్చు]జిల్లా పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చి మూడు నెలలు గడిచింది. ఈ కాలంలో 15 కొత్త, పాత జిల్లాల వ్యాసాలకు (అనగా 58 శాతం), వాటిలో లింకులున్న వ్యాసాలకు, అందుబాటులో వున్న సమాచారం మేరకు సవరణలు పూర్తయ్యాయి. అయితే తెలుగు వికీపీడియా ప్రాజెక్టులలో ప్రధానలోపమైన, నాణ్యత తనిఖీ పని ఈ ప్రక్రియలో ప్రధాన అంశంగా చేసినా, కేవలం ఒకరే ప్రధానంగా కృషి చేస్తున్నందున జరగలేదు. అయితే కృషికి సంబంధించిన చర్చలలో ప్రధానంగా ముగ్గురు పాల్గొన్నారు. జిల్లా పేరుల వరకే సవరణ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినా, పలు నగరాల, పట్టణాల వ్యాసాలు ఆదర్శ వ్యాసాలుగా వుండక డైరెక్టరీ సమాచారంతో వున్నందున, అటువంటి వ్యాసాలను సరిచేయటం, అలాగే ఇతర లింకైన వ్యాసాలను కాపీ ఎడిట్ చేయడం కూడా చేపట్టటం జరిగింది. ఇదే వేగంతో పని ముందుకు సాగితే, ఇంకో మూడు నెలల లోపు కనీసం సవరణల పని పూర్తయ్యే అవకాశం వుంది. జిల్లా వ్యాసాలకు, జిల్లా వ్యాసంలో లింకైన వ్యాసాల తనిఖీ ప్రక్రియలో, ఆయా జిల్లాలలో నివసించే, లేక అయా జిల్లాలతో అనుభవం కలవారిని పాల్గొనమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 11:45, 4 జూలై 2022 (UTC)
జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి ఇతర చర్చాపేజీలలో ప్రస్తావనలు
[మార్చు]జిల్లాల పునర్వ్యవస్థీకరణ సవరణల గురించి ఈ పేజీలో, సంబంధిత వ్యాస చర్చాపేజీలలో చాలావరకు సరిగానే సాగాయి. చాలావరకు ఏకాభిప్రాయం కుదిరింది. అయితే రచ్చబండలో, ఇతర చర్చలలో జిల్లా వ్యాసాల మెరుగుకు సంబంధించినవి అప్పుడప్పుడు ప్రస్తావనకు వచ్చాయి. నా పేరు ప్రస్తావించిన చోట నేను కొంతవరకు స్పందించడం జరిగింది. అయినా ఇంకొన్ని సందేహాలకు స్పందన ఇవ్వవలసివున్నందున, ఇప్పుడు నా అభిప్రాయం వివరంగా తెలియదల్చుకున్నాను. వీటిపై చర్చను స్వాగతిస్తాను.--అర్జున (చర్చ) 12:30, 4 జూలై 2022 (UTC)
పాత జిల్లా వ్యాసాలలో మండలాల తొలగింపు, చేర్చు వివరాలు
[మార్చు]నా పదిహేనేళ్లపైబడిన వికీఅనుభవంలో, వికీ వ్యాసాన్ని వికీ చదువరుల దృష్టికోణంతో చూసి ఆదర్శవ్యాసానికి దగ్గరి స్థాయిలో రూపు దిద్దగలిగినవారు చాలా కొద్దిమంది. తమకు తట్టిన ఆలోచనతో వ్యాసాన్ని విస్తరించటమే ప్రధానంగా కృషి జరగటం నేను గమనించాను. వాటిని ఎవరైనా విమర్శించినా, దానికి స్పందించి సాధ్యమైనంతవరకు ఏకాభిప్రాయం సాధించి వ్యాసాన్ని తగువిధంగా సవరించటంలో సహకరించినవారు దాదాపు అరుదని చెప్పవచ్చు. నా దృష్టిలో జిల్లా చరిత్రలో ప్రధానంగా జిల్లా స్థాయిలో వచ్చిన మార్పులు వివరించడం, సంబంధిత మండల చరిత్రలో జిల్లా లేక రెవిన్యూ డివిజన్ మార్పులను వివరించడం, వ్యాసం చదివేవారికి అనుకూలంగా వుంటుంది. అలా కాకుండా, మండల స్థాయిలో మార్పులను జిల్లా వ్యాసంలో పేర్కొనటం, అదీ చరిత్ర విభాగంలోనే కాక, ఇతర విభాగాలలో పేర్కొనటం, వ్యాస ఆకృతికి, చదివే వారి ఆసక్తికి ప్రతికూలంగా వుంటుందని ఒక వికీని చదివేవానిగా నా అభిప్రాయం. ఈ మండలాల మార్పు చేర్పులు, జిల్లా వ్యాసంలో కూడా వుండాలనడం వికీపీడియా అనేది ఒక లింకులు గల విజ్ఞానసర్వస్వమనే అవగాహనలో లోపంగా నేను భావిస్తాను. అయినా ఏకాభిప్రాయ సాధనకి తోడ్పాటుగా, ఆ వివరాలు జిల్లా వ్యాసాలలో చరిత్ర విభాగంలో చేర్చడాన్ని నేను వ్యతిరేకించుటలేదు.--అర్జున (చర్చ) 12:30, 4 జూలై 2022 (UTC)
ప్రాజెక్టు గా చేపట్టకుండా, పరస్పర సహకార నిర్వహణగా చేపట్టటం
[మార్చు]సాంప్రదాయక వికీప్రాజెక్టుల నిర్వహణలో లోపాలున్నందున పరస్పర సహకార నిర్వహణగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పని ప్రారంభించాను. దీనికి సభ్యుల సహకారం చాలావరకు లోపించిందనే చెప్పాలి. అయితే ప్రాజెక్టుగానే నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేసేవారికి నేను చెప్పదలచుకొన్నవిషయాలు.
- ప్రాజెక్టు సక్రమంగా నిర్వహించడానికి, ప్రాజెక్టు విషయంపై నిబద్ధతతో, నేర్చుకొనే దృక్పథంతో కృషిచేయగల సభ్యుల సంఖ్య పెరగలేదు, కావున సాంప్రదాయక ప్రాజెక్టు వలన ఉపయోగంలేదు.
- కొత్త ప్రక్రియలో పాలుపంచుకొనేవారికి, కృషి సమన్వయం చేసుకోవటం, పురోగతి గణాంకాలు పొందడం సులభమవుతుంది.
- కొత్తదనాన్ని స్వాగతించే స్వభావం మానవ సహజం కాదు. కాని తెవికీలాంటి క్రియాశీలత్వం బలహీనంగా వున్న వికీపీడియాలు కొత్త దనాన్ని స్వాగతించకపోతే సుస్థిర నిర్వహణకు దూరమై, వేగంగా వాటి విలువను కోల్పోతాయి అని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 12:30, 4 జూలై 2022 (UTC)
జిల్లా వ్యాసాలు, వాటినుండి లింకులు గల ప్రధాన వ్యాసాల సవరణలు పూర్తి
[మార్చు]జిల్లా వ్యాసాలు, వాటినుండి లింకులు గల ప్రధాన వ్యాసాల సవరణలు సమాచారం లభ్యతమేరకు, నా శక్తికొలది పూర్తి చేశాను. వీటిని మరింత మెరుగు చేయడానికి, మిగిలిపోయిన దోషాలు సవరించటానికి సహాయపడమని, ఈ ప్రక్రియలో ప్రధానంగా పాల్గొన్న (2022 ఏప్రిల్ 4 నుండి కనీసం 5 సవరణలు చేసిన) సహసభ్యులను user:Ch Maheswara Raju, user:యర్రా రామారావు, user:Pkraja1234, user:B.K.Viswanadh, user:పండు అనిల్ కుమార్, user:Chaduvari, user:K.Venkataramana, user:ప్రభాకర్ గౌడ్ నోముల గార్లను, ఇతర సభ్యులను కోరుచున్నాను. భవిష్యత్ కృషికి ఉపయోగం కొరకు, పనిపై స్పందనలు, సమీక్షలు, ప్రక్రియ మరింత మెరుగుగా చేయడానికి సూచనలు తెలపమని, చర్చించమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 06:25, 9 ఆగస్టు 2022 (UTC)
- జిల్లా వ్యాసాలే కాక జిల్లాల వర్గంలో వ్యాసాలనుండి లింకైన వ్యాసాల సవరణ గణాంకాలను పరిశీలించిన మీదట, కనీసం 5 మార్పులు 23 మంది సభ్యులు చేశారు. user:యర్రా రామారావు, user:Ch Maheswara Raju, user:Batthini Vinay Kumar Goud, user:Chaduvari, user:Pkraja1234, user:K.Venkataramana, user:Muralikrishna m, user:Inquisitive creature, user:పండు అనిల్ కుమార్, user:Pranayraj1985, user:B.K.Viswanadh, user:Shashank1947, user:Thirumalgoud, user:PARAMESWARA REDDY KANUBUDDI, user:Naveen Kancherla, user:Orsusanjeevarao, user:ప్రభాకర్ గౌడ్ నోముల, user:Nrahamthulla, user:రవిచంద్ర, user:Alugu1948, user:Kasyap, user:Nagarani Bethi గార్లకు ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు ప్రక్రియ ఉపపేజీ చూడండి. అర్జున (చర్చ) 14:13, 17 ఆగస్టు 2022 (UTC)
- అవును.జిల్లాలతో పాటు జోనుల ఏర్పాటు పై సమాచారం పెట్టండి. Nrahamthulla (చర్చ) 01:09, 24 అక్టోబరు 2022 (UTC)
జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిపై అర్జున అనుభవాలు
[మార్చు]జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిపై అర్జున అనుభవాలు చూడండి. సభ్యులందరు దీనిపై స్పందించి చర్చిస్తే భవిష్యత్ కృషికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 13:17, 10 ఆగస్టు 2022 (UTC)
జిల్లా వ్యాసాల లింకుల నాణ్యతా నియంత్రణ
[మార్చు]జిల్లాల పునర్వ్యవస్థీకరణ -2022 సవరణల ప్రక్రియలో మూడవ పక్షంచే సవరణల నాణ్యత తనిఖీ జరగలేదు. ప్రత్యామ్నాయంగా, జిల్లా వ్యాసాలలోని లింకులు సేకరించి, 20220404 నాటినుండి సవరణలు జరగనివాటిని పరిశీలించి అవసరమైతే సవరణలు( ప్రక్రియలో పొరబాటున జరగనివి) గుర్తించి సరిచేశాను. మొత్తంలింకైన వ్యాసాలు 2077 కాగా, 1640 పేజీలలో సవరణలు జరిగాయి. 437 పేజీలకు సవరణలు అవసరంలేదు. అలాగే మునుజూపులోపాలున్న చాలా వ్యాసాల ప్రవేశికలు, వ్యాసాలను, తప్పు లింకులను సరిదిద్దాను. అర్జున (చర్చ) 05:06, 27 ఆగస్టు 2022 (UTC)