Jump to content

వాడుకరి చర్చ:Pkraja1234

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Pkraja1234 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Pkraja1234 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Ch Maheswara Raju గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Ch Maheswara Raju గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 11:03, 17 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల్లో అనవసర మార్పులు

[మార్చు]

@Pkraja1234 గారూ, ఒక వాడుకరి ఒక కొత్త వ్యాసం మొదలుపెట్టి రాస్తున్నప్పుడు వెంటనే ఆ వ్యాసంలో ఇతర వాడుకరులు దిద్దుబాట్లు చేయకూడదు. అలా చేస్తున్నప్పుడు దిద్దుబాటు ఘర్షణ ఏర్పడి రాస్తున్న పాఠ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఇతరుల వ్యాసాల్లో అత్యుత్సాహం చేపించకుండా మీ పని మీరు చేసుకోండి. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:51, 28 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రణయ్‌రాజ్ వంగరి, మన్నించండి , చాల రోజుల అయింది అనుకున్నాను Pkraja1234 (చర్చ) 05:53, 28 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీకాకుళం జిల్లా మండలాలు మూసలో మీ మార్పులు గురించి

[మార్చు]

@Pkraja1234 గారూ, శ్రీకాకుళం జిల్లా మండలాలు మూసలో మీ సవరణలకు ధన్యవాదాలు.శ్రీకాకుళం జిల్లా మండలాలు మూసలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నాలుగు మండలాలు చేర్చారు.దానిని నేను త్రిప్పికొట్టాను.గమనించగలరు.ఇంకొకటి ఇటివల మార్పులలో చురుకుగా జరుగుచున్న పేజీలలో మీరు తొందరపడి సవరణలు చేయవద్దు. దానివలన దిద్దిబాట్లు ఘర్షణ జరుగుతుంది.అవతలి వారి విలువైన సమయాన్ని మీరు వృథాచేయద్దని మిమ్మల్ని కోరుచున్నాను.కాస్త ఓపికపట్టండి.లేదూ మీరు మర్చిపోతారనుకుంటే ఆ వ్యాసం చర్చాపేజీలో మీ అభిప్రాయం, లేదా సవరణల తప్పులను ఎత్తి చూపండి. పర్వాలేదు.ఇందులో ఏమీ అనుకునేపనిలేదు.ధన్యవాదాలు.