వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Experience sharing by Arjunaraoc

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలి ప్రతి(చిత్తు) తేది: 2022-08-10
ఖరారు ప్రతి తేది: 2022 -08-12
రచయిత:Arjunaraoc

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం -2022

2022 ఏప్రిల్ 4 న అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తగినట్లు వికీపీడియాలో అవసరమైన మార్పులు చేసే పనిలో తొలి ఘట్టం అనగా అధిక వీక్షణలు పొందే వ్యాసాల సవరణల కృషిలో నేను చేపట్టిన పనికి 2022 ఆగష్టు 10 న ముగింపు పలుకుతున్నాను. ఈ నాలుగు నెలల ఆరు రోజుల కృషిపై నా అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకుంటున్నాను. భవిష్యత్తు కృషికి ఈ వ్యాసం ఉపయోగపడుతుందని భావిస్తాను. వికీకి విస్తారంగా మార్పులు అవసరమయ్యే పరిస్థితులను ఎదుర్కొనడానికి ఈ వ్యాసంలో తెలిపిన ప్రక్రియ, పనిముట్లు, తెలివిడులు ఉపయోగపడవచ్చు.

కృషి ప్రాముఖ్యత[మార్చు]

15ఏళ్లపాటు జరిగిన కృషితో వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ సంబంధిత వ్యాసాలు ఒక ముఖ్యమైన స్థితికి చేరుకున్నాయి. తొలిగా కేవలం నగర వ్యాసాలతో ప్రారంభమైన కృషి క్రమేపి జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు, రాజకీయ నియోజకవర్గాలకు, పర్యాటక ఆకర్షణలకు, ప్రముఖ వ్యక్తులకు ఇంకా ఇతర ప్రత్యేక వ్యాసాలకు విస్తరించింది. అయితే మంచి నాణ్యత గల వ్యాసాలు తక్కువే అని చెప్పాలి. మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయటానికి ప్రాజెక్టు ప్రక్రియతో అడపదడపా కొన్ని ముఖ్యమైన వర్గాల వ్యాసాల లక్ష్యంతో జరిగింది. అయితే వికీపై మంచి అవగాహన వుండి పాల్గొనకలిగే క్రియాశీలక సభ్యులు చేతి వేళ్లమీద లెక్కింపు మాత్రంలోనే వుండడంతో ఈ కృషి మంచి ఫలితాలనివ్వలేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో దాదాపు వికీలో 25% శాతం వ్యాసాలు భౌగోళికంగా ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించలేకపోతాయి కావున, దీనిని సరిదిద్దటానికి జరగవలసిన కృషి చాలా కీలకమైనది. ఇది పూర్తికాకపోతే, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధిత వ్యాసాలు అసత్యాలుగా మిగిలే ప్రమాదం వుంది.

ఉయోగించిన ప్రక్రియ[మార్చు]

ఈ 15 ఏళ్లలో, క్రియాశీలక సభ్యులు పెరగకపోవటం, పనిచేసే సభ్యుల అవగాహన చాలావరకు పరిమితంగానే వుండడం, నేను నిర్వహించిన కొన్ని ప్రాజెక్టుల బలహీనతలు తెలిసినందున, వికీకి కొత్త ప్రక్రియ అవసరమని భావించాను. దీనికి వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు అని పేరు పెట్టాను. ఇటువంటి దానిని గతంలో ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధికి ప్రయోగాత్మకంగా వాడాను. ఆ తరువాత జిల్లాల పునర్వ్యస్థీకరణ సవరణలకు వాడటం జరిగింది.

ఈ పని వలన ఏమి ఉపయోగం?[మార్చు]

ఈ పని ఏ విధంగా జరిగిందనే వివరించటానికి ముందు ఈ పనిలో ప్రభావితమైన పేజీల వలన వికీపీడియా చదివేవారికి లాభాలేంటో పరిశీలిద్దాం

  • కనీసం సగటున రోజుకు 1 వీక్షణ పొందే 1500-2000 వ్యాస పేజీలలో భౌగోళిక అంశాల గురించి తాజా సమాచారమే కాకుండా, మెరుగైన వికీపీడియా వ్యాసం ద్వారా, వికీపీడియా వ్యాసం ఎలా వుండాలనే దానిపై అవగాహన మెరుగవుతుంది. వీటిలో జిల్లా, నగర, పట్టణ, మండల, నియోజకవర్గాలు, పర్యాటక ఆకర్షణల వ్యాసాలు ప్రధానంగా వుంటాయి.
  • ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాలలో భౌగోళిక సోపానక్రమంలో మార్పులున్నప్పుడు, కనీసం తాజా సమాచారం క్లుప్త వివరణ ద్వారా 90% మంది వీక్షకులు(మొబైల్) అందుతుంది. డెస్క్ టాప్ వాడుకరులు short description గేడ్జెట్ వాడుకొని అదే సాకర్యం పొందవచ్చు.
  • చాలా భౌగోళిక వ్యాసాలలో ముఖ్యంగా మండల వ్యాసాలలో OSM పటాలు(Maps) వాడడం జరిగింది. దీనివలన వాడుకరులకు వ్యాస విషయం గురించి మెరుగైన భౌగోళిక సమాచారం అందుతుంది.
  • వికీలో ఆధారాలు లేకపోయినా ఏదైనా రాయవచ్చనే తొలినాటి వికీ అవగాహన నుండి ఈ వ్యాసాలు చదివే వారికి కనీసం ఆధారాలతో వ్రాయాలనే అవగాహన మెరుగుపడవచ్చు. అవసరమైన చాలా చోట్ల {{Citation needed}} మూస వాడడం జరిగింది.
  • వికీని ఒక డైరెక్టరీగా భావించి చేర్చిన సమాచారం చాలావరకు తొలగించటం లేక కుదించడం జరిగింది. అందువలన వికీగురించిన అవగాహన మెరుగయ్యే అవకాశముంది.
  • లింకులు చేర్చడం లేక సరిచేయడం (ఉదాహరణకు శాసనసభ నియోజకవర్గాల వ్యాసాలలో మండలాలు ఏర్పడకముందు లింకులు లేకుండా, లేక ఊర్ల పేర్లకు లింకులతో ఉన్నాయి) చేర్చటం సరిచేయటం వలన వ్యాసాల నాణ్యత మెరుగై, వికీ పై సదభిప్రాయం మెరుగయ్యే అవకాశముంది.
  • జిల్లా వ్యాసాలలో,నియోజకవర్గ వ్యాసాలలో, ఇతర మూసలలో అంశాల జాబితా చాలావరకు అకారాది క్రమంలో అమర్చడం వలన వాడుకరులు కోరుకున్న వ్యాసాన్ని సులభంగా చేరుకోగలుగుతారు.

పని జరిగిన విధం, పనిముట్లు[మార్చు]

  • జిల్లా వ్యాసాలను అభివృద్ధి చేయడం, జిల్లావ్యాసంనుండి లింకైన జిల్లా సంబంధిత వ్యాసాలను అభివృద్ధి చేయడం చేశాము.
  • పాల్గొనే వారి కృషి సమన్వయానికి , పురోగతి పంచుకోవటానికి కేవలం ఒక పేజీ కాకుండా ప్రక్రియ పేజీని, జిల్లా వ్యాసాల చర్చాపేజీలను (ఉదాహరణ) వాడడం జరిగింది. దీనికొరకు సచిత్ర పురోగతి ఫలకం (dashboard) వాడడం జరిగింది
  • కృషిని సులభం చేయడానికి, పురోగతి తెలుసుకొనడానికి వికీడేటా క్వెరీలు,OSM క్వెరీలు, క్వారీ క్వెరీలు, పెట్ స్కాన్ క్వెరీలు వాడడం, వాటిలో ఉపయోగకరమైనవాటిని కనీసం నెలకొకసారి తాజా చేయడం జరిగింది.
  • కృషికి OSM, వికీడేటా తో ఆంగ్ల, తెలుగు వికీపీడియాల అనుసంధానంతో పాటు, ఆయా ప్రాజెక్టులలో పనిచేసే వారి సహకారం తీసుకొనడం జరిగింది. ఆయా ప్రాజెక్టులలో కూడా మార్పులు చేయటం, వాటికి తగిన పనిముట్లు వాడడం ( గూగుల్ స్ప్రెడ్ షీట్, వికీడేటాలో క్విక్ స్టేట్మెంట్స్). తద్వారా తెలుగు వికీ వాడుకరులకు ఉపయోగపడే సమచారపెట్టెలు, క్లుప్త వివరణ మెరుగు చేయడం జరిగింది.
  • కృషికి అనువైన వాటికి నా బాట్ ఖాతా వాడడం జరిగింది.

ఇంకా జరగవలసిన పని[మార్చు]

  • జరిగినపనిలో జిల్లా వ్యాసాలకు చాలావరకు లింకైన వ్యాసాలను మాత్రమే సవరించడం, అభివృద్ధి చేయడం జరిగింది. జిల్లా వ్యాసాల వర్గ వృక్షాలలో పని పాక్షికంగా జరిగినివాటిని (ఉదాహరణకు పుణ్యక్షేత్రాలు, రైల్వే స్టేషన్లు లాంటివి) తనిఖీ చేసి, భౌగోళిక మార్పులు అవసరమైన వ్యాసాలలో మార్పులు చేయడం చేయాలి. బాపట్ల, పల్నాడు జిల్లాలకు, వాటి మాతృ జిల్లాలైన గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ విధమైన కృషి చేయడం జరిగింది.
  • గ్రామాల వ్యాసాలలో భౌగోళిక సంబంధిత సవరణలు చేయాలి. ప్రస్తుతానికి అవసరమైన సవరణలు క్లుప్త వివరణలో కనిపిస్తాయి. భవిష్యతులో నిర్వహణ సౌలభ్యానికి మండలాలకు వికీడేటా ఆధారిత సమాచార పెట్టెలు వాడినట్లుగా , గ్రామాలకు కూడా వాడడం మెరుగు. జిల్లా వ్యాసాలనుండి పర్యాటక ఆకర్షణల ద్వారా గ్రామం వ్యాసం లింకైవుంటే చాలావరకు ఆ మార్పులు చేశాను.
  • కొన్ని కొత్త, పాత జిల్లాలకు మాత్రమే జిల్లా గణాంకాల పుస్తకం అందుబాటులోకి వచ్చింది. 2022 సంవత్సరాంతానికి అన్ని జిల్లాలకు సమగ్ర జిల్లా గణాంకాల పుస్తకం విడదలవుతుంది. అప్పుడు జిల్లా వ్యాసాలలో ఉమ్మడి జిల్లా విభాగాలుగా వుంచిన వాటిని సవరించాలి.

భవిష్యత్ కృషికి సూచనలు[మార్చు]

వ్యాసాల అభివృద్ధి[మార్చు]

  • జిల్లా వ్యాసాల అంశాల ప్రామాణికతను, క్రమాన్ని మరల సమీక్షించాలి.
    • పదేళ్ల క్రిందట ఒక కూర్పు వాడినా, ప్రస్తుత పరిస్థితులకు అనువు కాదు. ఉదాహరణకు విద్యా సంస్థలు, విద్యా సౌకర్యాలు అనే శీర్షిక పేర్లు డైరెక్టరీ అంశాలు చేర్చటాన్ని ప్రోత్సహించవచ్చు. విద్యా వ్యవస్థ లేక విద్య అనేది మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు.
    • వ్యాసాలలో ప్రముఖులు అనే విభాగం కొన్ని వ్యాసాలలో మరీ విస్తారంగా వుంది. వాటిని వికీపీడియా వ్యాసాలున్న వ్యక్తులకు కుదించాను. కానీ ఈ విభాగానికి సరైన ప్రాతిపదికలేకపోవటంతో విపరీతంగా విస్తరించే ఆస్కారమున్నందున, ఈ విభాగం తొలగించి, ప్రధానమైన వ్యక్తుల గురించి వ్యాసంలోనే లింకులుగా చేర్చటం మెరుగు.
  • కొన్ని వ్యాసాలలో రైలు సమయాల పట్టికలు, బస్సు రూటు వివరాలు లాంటివి చేర్చడం గమనించాను. ఇవి వికీపీడియాకు అనువైనవి కావు. వీటిని తొలగించాలి.
  • కొన్ని జిల్లాలలో ప్రతి రైలు స్టేషనుకు ఒక వ్యాసం చేర్చటం జరిగింది. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్యను విపరీతంగా విస్తరించడం, క్రియాశీలక సభ్యులు పెరగనందున సుస్థిర నిర్వహణ వీలవదు. అత్యవసరమనుకుంటేనే కొత్త వ్యాసాలు తయారు చేయడం, ఉన్న వ్యాసాలలో అధిక వీక్షణలు పొందే వాటి నాణ్యతను మరింతగా మెరుగు చేయడం, వికీ చదువరులకు, సుస్థిర నిర్వహణకు ఉపయోగం.
  • పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, శాసనసభ నియోజక వర్గాల పేజీలు సృష్టించినపుడు, ఆయా పదాలకు స్వల్ప తేడాలతో పేజీలు ఏర్పడ్డాయి. (ఉదాహరణకు నగర పంచాయతీ, నగర పంచాయితీ). వీటిని తగిన దారిమార్పుల ద్వారా ఏకరూపతకు తేవాలి.
  • కొత్త పేజీలు సృష్టించేటప్పుడు ఒకే సమాచారాన్ని మరల మరల చేర్చడం గమనించాను. అటువంటి సమాచారాన్ని ఒకే చోట తగిన వ్యాసంలో చేర్చడం మెరుగు. (ఉదాహరణ రెవెన్యూ డివిజన్ వ్యాసాలలో పరిపాలన విభాగం)
  • సాధ్యమైనంతగా సమాచారం వికీలో ఒకే చోట చేర్చి, దానిని ఇమడ్చటం ద్వారా ఇతర చోట్ల ప్రతిబింబించేటట్లు చేస్తే, నిర్వహణ సులభమవుతుంది. ఈ ప్రక్రియను శాసనసభ నియోజకవర్గాల పేర్లను జిల్లా పేజీలో అనువైన చోట్ల వాడాను.
  • పుస్తక సమాచారాన్ని ఎక్కువ చోట్ల మూలాలుగా వాడవలసినప్పుడు {{sfn}} మూసతో వేరు వేరు పేజీలు పేర్కొంటూ వాడడం మెరుగు.

నిర్వహణ[మార్చు]

  • అనామక వ్యక్తుల దుశ్చర్యలు వికీలో సర్వసాధారణంగా కొనసాగుతూనే వుంటుండటంతో నిర్వాహకులకు, నిర్వహణలో సహాయపడే సభ్యులకు వాటిని సరిదిద్దడానికి శ్రమపడాల్సివస్తుంది. ఈ వత్తిడికి లోనైనప్పుడు కొంతమంది అనామక ఐపిలపై దీర్ఘకాలం లేక అనంతంగా నిరోధం విధించడం గమనించాను. ఈ ఐపిలు తాత్కాలికం కావున దీనివలన పెద్ద ఉపయోగం వుండదు. కావున నిర్వాహకులు, సభ్యులు వారి వారి ప్రాధాన్యతల ప్రకారం అధిక ప్రాధాన్యతలో వున్న వ్యాసాలపై దుశ్చర్యలను సరిదిద్దడంపై దృష్టి పెట్టి సుస్థిర నిర్వహణకు తోడ్పడాలి.

తెలివిడులు(Learnings)[మార్చు]

  • ఇటువంటి కృషికి సముదాయం అంతగా స్పందనల ద్వారా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. కృషిలో ప్రధానంగా ముగ్గురు పాల్గొన్నారు. చర్చలలో కూడా నలుగురైదుగురు మాత్రమే పాల్గొన్నారు, కాని ఏకాభిప్రాయదిశగా చర్చలు కొన్నిసార్లు సాగలేదు. అందువలన నాకు కూడా ఈ కృషిపై మధ్యలో విరక్తి కలిగి మానేద్దామని అనిపించినా, ప్రారంభించిన కృషి ముగింపుకు తేవడం మంచిదని కొనసాగించాను.
  • OSM పటాల వినియోగం పెంచడం ఆహ్వానించదగినదైనా, WMF వారు తాజా OSM సమాచారాన్ని ఎప్పటికప్పుడు వికీపీడియాలో తాజా చేయటంలో సమస్యలు తలెత్తటంతో, పాత OSM పటాలు వివరాలు మాత్రమే కనబడుతున్నాయి. ఈ సమస్య మొదలై నాలుగు నెలలైంది. గతంలో సమస్య ఏర్పడినా కనీసం నెలకొకసారి తాజా చేసేవారు. ఇప్పడు అదికూడా చేయలేదు. నేను WMF వారిని హెచ్చరించినా సమస్య పరిష్కరింపబడలేదు.[1]

ధన్యవాదాలు[మార్చు]

కృషిలో ప్రధానంగా సహకరించిన తెలుగు వికీపీడియా సభ్యులైన Ch Maheswara Raju, యర్రా రామారావు, Pkraja1234, B.K.Viswanadh, పండు అనిల్ కుమార్, Chaduvari, K.Venkataramana, ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు, OSM లో సహకరించిన Heinz Vieth గారికి, వికీడేటాలో సహకరించిన DaxServer గారికి, ఇంకా ఇతరత్రా సహకరించిన స్వేచ్ఛా వినియోగ వనరుల సభ్యులకు ధన్యవాదాలు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Missing OSM geometry Bapatla district 13998258 relation". Wikimedia Phabricator. Retrieved 2022-08-10.