వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వాడుకరి పేజీ సృష్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి పేజీని సృష్టించుకోవడం

వికీపీడియాలో ఖాతా తెరిచిన లేదా లాగిన్ అయిన ప్రతి వాడుకరికి, ఒక వాడుకరి పేజీ ఉంటుంది. మీరు ఏదైతే పేరుతో ఖాతా తెరిచారో అదే పేరుతో వికీపీడియా సైటులో పైమధ్యభాగంలో ఎర్రరంగులో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. ముందుగా మనం వాడుకరి పేజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1. వాడుకరి పేజీ అంటే ఏమిటి?

వాడుకరి యొక్క సమాచారం రాసుకోవడానికి ఉపయోగపడే పేజీని వాడుకరి పేజీ అంటారు.

2. వాడుకరి పేజీ ఎందుకు?

మీ వాడుకరి పేజీలో మీకిష్టమైతే మీ గురించి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనుల గురించిన సమాచారాన్ని రాసుకోవచ్చు. సమాచారం రాసుకోవడం మీకిష్టం లేకపోతే, దీన్ని మీ వాడుకరి చర్చ పేజీకి దారిమార్పు చెయ్యవచ్చు లేదా ఆ పేజీని ఖాళీగా వుంచవచ్చు. ఖాళీగా ఉంటే మీ వాడుకరిపేరుకు ఉండే లింకు ఎర్రగా కనిపిస్తుంది. వాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో వాడుకరి పేజీలు ఉపయోగపడతాయి.

3. వాడుకరి పేజీలో ఏంఏం రాసుకోవచ్చు?

మీ వాడుకరి పేజీలో మీ గురించి కొంత రాసుకొని, మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి రాసుకోవచ్చు. వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరిస్తే, దాన్ని మీ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. వికీపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా వాడుకరి పేజీలో పెట్టకండి. మీ వాడుకరి పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.

4. ఒకరి వాడుకరి పేజీలో ఇంకొకరు మార్పులు చేయవచ్చా? ఏలాంటి మార్పులు చేయవచ్చు?

వాడుకరి అభ్యర్థిస్తే తప్ప, ఇతరుల వాడుకరి పేజీలో దిద్దుబాట్లు చెయ్యకూడదు. తమ వాడుకరి పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు వాడుకరులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడకపోవచ్చు. టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దవచ్చు.

5. నేను వికీని వదిలివేసినపుడు నా వాడుకరి పేజీ ఏమవుతుంది?

మీరు వికీపీడియాను వదిలివేసినపుడు వాడుకరి పేజీ అలానే ఉంటుంది. వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ వాడుకరి పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు.

6. వాడుకరి ఉపపేజీలు అంటే ఏమిటి? అవి ఎందుకు ఉపయోగపడుతాయి?

వాడుకరి పేజీలకు అనుబంధంగా తయారుచేసుకునే పేజీలను వాడుకరి ఉపపేజీలు అంటారు. ప్రయోగశాలలు, పరీక్షాత్మక పేజీలు వంటి పేజీలను మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉప పేజీలుగా తయారు చేసుకోవచ్చు. మీరు ఏదైనా వ్యాస ప్రయెగానికి గానీ, మీ పాత చర్చాపేజీలను నిక్షిప్తం చేసుకోవడానికి కానీ, ఇతర ప్రయోగాలు చేయడానికి కానీ ఈ ఉపపేజీలు ఉపయోగపడుతాయి.

7. వాడుకరి స్థలం అంటే ఏమిటి?

వాడుకరి పేజీ, వాడుకరి చర్చాపేజీ, వాడుకరి ఉపపేజీలను కలిపి వాడుకరి స్థలం అంటారు.

8. వాడుకరి పేజీలు దుశ్చర్యలకు గురవుతుంటే ఏం చేయాలి?

వ్యాసాల పేజీల్లాగానే, వాడుకరి పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, వాడుకరి పేజీని సంరక్షించుకోవచ్చు.

9. వాడుకరి పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది?

మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, "పేజీ చరితం", "చర్చ" వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "వాడుకరి రచనలు" అనే లింకు నొక్కి సదరు వాడుకరి చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు. అలాగే "ఈ వాడుకరికి ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు వాడుకరికి ఈమెయిలు పంపవచ్చు.

ఇక, వాడుకరి పేజీని సృష్టించుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఏదైతే పేరుతో ఖాతా తెరిచారో అదే పేరుతో వికీపీడియా సైటులో పైమధ్యభాగంలో ఎర్రరంగులో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే వాడుకరి: పేజీని సృష్టిస్తున్నారు అనే పాఠ్యంలో మరో పేజీ ఓపన్ అవుతుంది. ఆ పేజీలోని బాక్సులో మీకు సంబంధించిన విషయాలు రాసి, కింద నీలిరంగు బాక్స్ లో ఉన్న ‘‘పేజీని ప్రచురించు’’ అనేది నొక్కితే, వాడుకరి పేజీ సృష్టించబడుతుంది.

వీడియో పాఠ్యం

[మార్చు]

ఏదైనా ఒక వెబ్సైటులోగానీ, సోషల్ మీడియాల్లో మనం లాగిన్ అయినపుడు మనకంటూ ఒక యూజర్ పేజీ ఉంటుందికదా, అలాగే వికీపీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి యూజర్ కి ఒక యూజర్ పేజీ ఉంటుంది. వికీపీడియాలో దాన్ని వాడుకరి పేజీ అంటారు. వికీపీడియాలో మీరు ఏదైతే పేరుతో అకౌంట్ ఓపన్ చేశారో, అదే పేరుతో వికీపీడియా సైటులో పైన మధ్యభాగంలో రెడ్ కలర్ లో పేరు కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. అదే వాడుకరి పేజీ. అయితే, ముందుగా మనం వాడుకరి పేజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వాడుకరి పేజీ అంటే ఏమిటి, ఆ పేజీ ఎందుకు, అందులో ఏంఏం రాసుకోవచ్చు అనే సందేహాలు మీకు వస్తుంటాయి.

యూజర్... అంటే, వాడుకరి తన గురించిన సమాచారం రాసుకోవడానికి ఉపయోగపడే పేజీని వాడుకరి పేజీ అంటారు. మీ వాడుకరి పేజీలో మీకిష్టమైతే మీ గురించి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనుల గురించిన సమాచారాన్ని, మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి వంటివి కూడా రాసుకోవచ్చు. వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.... వాడుకరి పేజీ అనేది మీ స్వంత హోమ్ పేజీ కాదు. వికీపీడియన్ గా మీ పేజీ మాత్రమే. కాబట్టి వికీపీడియాకు సంబంధం లేని విషయాలనుగానీ, కాపీరైట్స్ లేని ఫోటోలను గానీ మీ వాడుకరి పేజీలో పెట్టకండి. అలాంటి ఫోటోలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.

వాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో వాడుకరి పేజీలు ఉపయోగపడతాయి. ప్రతి వాడుకరి పేజీకి ఒక చర్చాపేజీ ఉంటుంది. ఈ చర్చాపేజీల ద్వారా వికీపీడియా రచనకు సంబంధించి ఇతర వాడుకరులు మనతో చర్చలు జరపుతారు.

ఇక, వాడుకరి పేజీని సృష్టించుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వికీపీడియాలో మీరు ఏదైతే పేరుతో అకౌంట్ ఓపన్ చేశారో, అదే పేరుతో వికీపీడియా సైటులో పైన మధ్యభాగంలో రెడ్ కలర్ లో పేరు కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేస్తే వాడుకరి: పేజీని సృష్టిస్తున్నారు అనే పాఠ్యంతో మరో పేజీ ఓపన్ అవుతుంది. ఆ పేజీలోని బాక్సులో మీకు సంబంధించిన విషయాలు రాసి, కింద బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న ‘‘పేజీని ప్రచురించు’’ అనేది నొక్కితే, వాడుకరి పేజీ సృష్టించబడుతుంది.

ఇదండీ, వాడుకరి పేజీ సృష్టించుకునే విధానం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.