Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 56

వికీపీడియా నుండి

పాత చర్చ 55 | పాత చర్చ 56 | పాత చర్చ 57

alt text=2017 అక్టోబరు 28 - 2018 జనవరి 27 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2017 అక్టోబరు 28 - 2018 జనవరి 27

తెలంగాణ ప్రభుత్వ శాఖతో సీఐఎస్-ఎ2కె అవగాహన ఒప్పందం

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖలోని డిజిటల్ మీడియా విభాగం సీఐఎస్-ఎ2కె అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. డిజిటల్ మీడియా విభాగ డైరెక్టర్ కొణతం దిలీప్ తో గత కొన్నాళ్ళుగా సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీపీడియన్లు జరిపిన చర్చలు, సమాలోచనల ఫలితంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అంశంపై గతంలో తెలుగు వికీపీడియాలో జరిగిన చర్చలు సముదాయానికి విదితమే. తెలంగాణలో వికీమీడియా ఉద్యమం అభివృద్ధిని ప్రోత్సాహకరంగా పనిచేయడం, అది కొనసాగడానికి మద్దతునివ్వడం, అంతర్జాలంలో తెలుగు, ఉర్దూ భాషల్లో సమాచారాన్ని అభివృద్ధి చేయడంలో కృషిచేయడం, తెలంగాణలో స్వేచ్ఛా విజ్ఞానాన్ని, దాన్ని అభివృద్ధి చేసే కార్యకలాపాలను పెంపొందించడం వంటివి దీని ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వం నుంచి విలువైన ఫోటోలను, అవసరమైన సమాచారాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి తీసుకురావడం, ప్రభుత్వాధికారులకు (ప్రధానంగా పీఆర్వోలకు) స్వేచ్ఛా నకలు హక్కుల ప్రాధాన్యత, వికీమీడియా ప్రాజెక్టుల గురించి కార్యశాల నిర్వహించడం, పై లక్ష్యాలను సాధించేందుకు ఉమ్మడి కార్యప్రణాళిక రూపకల్పన చేయడం వంటివి చేపట్టనున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో సీఐఎస్-ఎ2కెని ప్రాతినిధ్యం వహిస్తూ సంస్థ కమ్యూనిటీ అడ్వొకేట్ పవన్ సంతోష్, ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ సంస్థ డైరెక్టర్ కొణతం దిలీప్ సంతకం చేశారు. కార్యక్రమంలో నాటకరంగ పరిశోధకుడు, వికీపీడియన్ ప్రణయ్ రాజ్ పాల్గొన్నారు. సూచనలు అందించిన వికీపీడియన్లకు, చర్చలకు సహకారం అందించినవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిజిటల్ మీడియా విభాగంతో ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలప్రదం చేసేందుకు, దీని నుంచి తెలుగు వికీపీడియా మౌలిక లక్ష్యాలకు లాభం కూర్చేందుకు సముదాయ సభ్యులు సూచనలు, సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:42, 28 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మంగళగిరిలో తెలుగు వికీపీడియా పై అవగాహన మరియు శిక్షణ

[మార్చు]

నమస్కారం! సుమారు 100 మంది యువతీయువతులు పాల్గొంటున్న ఒక డిజిటల్ శిక్షణా శిబిరంలో వికీపీడియా మరియు తెవికీ పై అవగాహన మరియు శిక్షణనివ్వడానికి (స్వచ్ఛందంగా) నాకు ఆహ్వానం వచ్చింది. నాకు ఇచ్చిన సమయం తక్కువ కనుక శిక్షణ కంటే అవగాహన మీదే ఎక్కువ శ్రద్ద చూపాలనుకొంటున్నాను. ఈ శిక్షణలో భాగంగా తెవికీపై ఆసక్తితో ఎవరైన కొత్తవాడుకరులు వస్తే వారికి సముదాయ సభ్యులు మార్గదర్శకులుగా వుంటారని ఆశిస్తూ...--విష్ణు (చర్చ) 07:44, 28 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సహకారం అందించగలం Nrgullapalli (చర్చ) 07
54, 28 అక్టోబరు 2017 (UTC)
విష్ణు గారు, నమస్కారము. ప్రస్తుతం అంతర్జాలం ద్వారా సహకరించ గలనండి. నాకు చేతనయిన విషయములు తెలియజేయ గలను. మార్గదర్శకునిగా ఉంటాను. JVRKPRASAD (చర్చ) 13
29, 28 అక్టోబరు 2017 (UTC)
విష్ణు గారు సమయం, తేదీ తెలియచేయలేదు. సముదాయ సభ్యుల వీలుకు.

ధన్యవాదాలు విష్ణు సార్. సముదాయ సభ్యునిగా కొత్తవాడుకరులకు మార్గదర్శకునిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారికి నా సహాయం అందజేయగలను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:16, 31 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విష్ణు గారూ ఆహ్వానానికి ధన్యవాదాలు. నేను నాకు అవగాహన ఉన్నంత చేయగలినంత సహకారం అందించగలనని ఆనందంగా తెలియజేస్తున్నాను.T.sujatha (చర్చ) 07:56, 3 నవంబర్ 2017 (UTC)

గ్రామ వ్యాసాలు అభివృద్ధి

[మార్చు]

గ్రామ వ్యాసాలు అభివృద్ధి అనే పని ఎడతెరపి లేని ఒక కార్యక్రమములా తయారయిందేమో అన్న సందేహము చాలా మందికి కలగ వచ్చును. ఇప్పటికైననూ వికీ పెద్దలు ఇప్పుడు తయారు అవుతున్న పుటలను పరిశీలించి వెంట వెంటనే ఇప్పుడు పని చేస్తున్న వారికి తగు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే ఒక దారికి వస్తాయి. మాలాంటి వారు మీ విన్నపాలు అర్థం కాకపోతే చేస్తున్న ఈ పని మాత్రం ఆపేయమని చెప్పండి. మళ్ళీ మళ్ళీ ఇదే పని అంటూ దీని మీద ఉన్న కొందరము ఉంటే వికీ అభివృద్ధి కాస్త కుంటు పడి ముందుకు సాగడము లేదు. నా భాష, భావం అర్థం కాకపోతే దయచేసి ఇంతటితో వదలి వేయండి, పెద్దలతో నేను చర్చించ లేను. JVRKPRASAD (చర్చ) 04:43, 5 నవంబర్ 2017 (UTC)

తెవికీ అభివృద్ధిదృష్ట్యా చేసే ప్రతిస్పందించినలకు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు సాగే సభ్యులు కరువయ్యారండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:37, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter August September 2017

[మార్చు]

Hello,
CIS-A2K has published their newsletter for the months of August and September 2017. Please find below details of our August and September newsletters:

August was a busy month with events across our Marathi and Kannada Focus Language Areas.

  1. Workshop on Wikimedia Projects at Ismailsaheb Mulla Law College, Satara
  2. Marathi Wikipedia Edit-a-thon at Dalit Mahila Vikas Mandal
  3. Marathi Wikipedia Workshop at MGM Trust's College of Journalism and Mass Communication, Aurangabad
  4. Orientation Program at Kannada University, Hampi

Please read our Meta newsletter here.

September consisted of Marathi language workshop as well as an online policy discussion on Telugu Wikipedia.

  1. Marathi Wikipedia Workshop at Solapur University
  2. Discussion on Creation of Social Media Guidelines & Strategy for Telugu Wikimedia

Please read our Meta newsletter here: here
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

Sent using --MediaWiki message delivery (చర్చ) 04:23, 6 నవంబర్ 2017 (UTC)

నవంబరు నెలలో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితా

[మార్చు]

నవంబరు 2017లో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాను. అలాగే గత నెల చేసిన పని తాలూకూ ప్రగతి ఇక్కడ పరిశీలించవచ్చు. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:39, 8 నవంబర్ 2017 (UTC)

నవంబర్ ఏషియన్ నెల-2017

[మార్చు]

నవంబర్ నెలలో తెలుగు వికీపీడియా సహా ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియాల్లో వికీపీడియా ఏషియన్ నెల ఎడిటథాన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో నవంబర్ ఏషియన్ నెల-2017 ఎడిటథాన్ నిర్వహిస్తున్నాం. ఎడిటథాన్లో పాల్గొని 5 వ్యాసాలను భారతదేశం కాక మరి ఏ ఇతర ఆసియా దేశాలకు సంబంధించిన అంశాలపై నిబంధనలకు, పాలసీలకు అనుగుణమైన వ్యాసాలు రాస్తే పాల్గొంటున్న దేశాల్లో ఒక దేశపు ఏషియన్ నెల సముదాయం నుంచి స్నేహ సూచకంగా ముద్రించిన పోస్టు కార్డు లభిస్తుంది. ఇది కాక ఇతర సబ్-ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. కనుక ఆసక్తి ఉన్నవారు వికీపీడియా ఏషియన్ నెల పేజీకి వెళ్లి పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 02:11, 16 నవంబర్ 2017 (UTC)

[మార్చు]

On behalf of Wikimedia India, I hereby announce the Featured Wikimedian for November 2017.

Balaji Jagadesh is one of the top contributors from the Tamil Wikimedia community. Though he started contributing since 2009, he was quite active after his participation in WikiConference India 2011. Initially he started contributing to Tamil Wikipedia, but was later attracted towards Tamil Wikisource, Tamil Wikitionary, and Wikidata. His global contributions count to whooping 2,50,000 edits. He is an admin on Tamil Wikitionary.

After his interaction with Mr. Loganathan (User:Info-farmer), Balaji was very much motivated to contribute to Wikimedia projects. He says, "When I was editing in Tamil Wikipedia, I used to translate science articles from English to Tamil. But faced problem in finding equivalent Tamil words. The English to Tamil dictionaries were inadequate. Hence I felt the need to work in the Tamil Wikitionary. After a while there was a collaboration with Tamil Wikisource and Tamil Nadu Government through Tamil Virtual University through 2000 CC0 books were uploaded".

As an active contributor to Wikidata, he says that the vision of Wikimedia movement is, "Imagine a world in which every single human being can freely share in the sum of all knowledge", but with Wikidata we can make it, "Imagine a world in which every single human being and every single machine can freely share in the sum of all knowledge". Apart from regular contributions, he also created templates to Tamil Wikimedia projects, and also maintains Tamil Wikisource's official Twitter handle.

Balaji hails from Coimbatore, Tamil Nadu, and is a post-graduate is Physics. He currently works as a Senior Geophysicist in Oil and Natural Gas Corporation Limited (ONGC).

Any editor can propose a fellow to be a Featured Wikimedia at: http://wiki.wikimedia.in/Featured_Wikimedian/Nominations

MediaWiki message delivery (చర్చ) 09:59, 10 నవంబర్ 2017 (UTC)

తెలంగాణ కొత్త జిల్లాల, కొత్త మండలాల ప్రాజెక్టు

[మార్చు]

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాడ్డాయి. పాతవి మార్పులకు గురయ్యాయి. ఈ మార్పుచేర్పులన్నీ వాటివాటి వికీపీడియా పేజీల్లో కూడా చెయ్యాలి. అందు కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు అనే ప్రాజెక్టు పేజీ తయారుచేసాను. పై పనులను ఈ ప్రాజెక్టు పేజీ ద్వారా సమన్వయం చెయ్యాలనేది ఉద్దేశం. ఆసక్తి ఉన్న వాడుకరులు ఈ పనిలో పాలుపంచుకోగలరు. __చదువరి (చర్చరచనలు) 05:42, 15 నవంబర్ 2017 (UTC)

New print to pdf feature for mobile web readers

[మార్చు]

CKoerner (WMF) (talk) 22:07, 20 నవంబర్ 2017 (UTC)

ట్రైన్ ద ట్రైనర్ (టీటీటీ) 2018

[మార్చు]

అందరికీ నమస్కారం, సీఐఎస్‌-ఎ2కె నిర్వహణలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ (టీటీటీ) 2018 కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో 2018 జనవరి 26-28 తేదీల్లో జరగనుంది.

టీటీటీ అంటే ఏమిటి?

ట్రైన్‌-ద-ట్రైనర్‌ లేక టీటీటీ అన్నది రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం. ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయం సభ్యుల్లో (ఆంగ్ల వికీపీడియా సహా) నాయకత్వ నైపుణ్య అభివృద్ధి చేయడాన్ని లక్ష్యం చేసుకుని రూపకల్పన చేసినది. గతంలో టీటీటీ 2013, 2015, 2016, 2017ల్లో నిర్వహించాము.

ఎవరు చేరవచ్చు?

కార్యశాలలు, GLAM, ఎడిటథాన్‌లు, ఫోటోవాక్‌లు తదితర ఆఫ్‌-వికీ మరియు ఆన్‌లైన్‌ వికీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆసక్తి కల వాడుకరులు.
ఏ భారతీయ భాషా (ఇండిక్ లాంగ్వేజ్‌) వికీమీడియా ప్రాజెక్టులోనైనా కృషిచేస్తున్న చురుకైన వికీపీడియన్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
దరఖాస్తు చేసుకునే వాడుకరికి 2017 నవంబరు 1 నాటికి 500కు పైగా గ్లోబల్ ఎడిట్లు ఉండాలి.
గతంలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

సముదాయం నుంచి అర్హత కలిగిన వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించమని, అర్హులైన వికీపీడియన్లు పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నాం. ఇతర వివరాల కొరకు దయచేసి మెటా-వికీలో ఈ పేజీని చూడగలరు.- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:20, 1 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు. ఇది చాలా ఉపయోగకరమైన కార్యశాల. 2016, మార్చి నుండి తెలుగు వికీపీడియాలో తనవంతు కృషిచేస్తున్న అజయ్ ఈ కార్యశాలలో పాల్గొంటే బాగుంటుంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:19, 1 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

Greetings, on behalf of Wikimedia India, I, Krishna Chaitanya Velaga introduce you to the Featured Wikimedian of the Month for December 2017, Hrishikes Sen.

Hrishikes Sen is one of the most active contributors from the Bengali community. Though he started editing English and Bengali Wikipedia in 2007, he had to take a long break due to professional constraints. Later he started working on Bengali Wikisource from 2012, and ever since, he has been an active contributor, and expanded to English Wikisource as well. With more than 45,000 global edits, he is an admin on English Wikisource.

As a child, Hrishikes always found reading books as a fascinating task. He says that he finds reference books as interesting as mystery novels. That interest, over years motivated him to contribute to Wikisource. The journey and motivation behind his contributions to Wikisource can be read from a post on WMF's blog, Why I contribute to Wikisource?. He says that till date he's been only active online, but he plans to do outreach in the coming future. He hopes that attending the 10th Anniversary Celebratory Workshop of Bengali Wikisource in Kolkata on 10 December may be a harbinger to his future offline activities.

Hrishikes believes that Wikisource will one day emerge as of the top digital libraries in the world, and says that as a store-house for primary and secondary source materials for Wikipedia, the importance of Wikisource is steadily becoming invaluable. Much of his time, Hrishikes spends working around Indian works, with a special focus on the works of Bankim Chandra Chattopadhyay, Jagadish Chandra Bose, and Rabindranath Tagore. Apart from being a proofreader, he uploaded more than 750 books spreading over five languages to Wikimedia Commons.

Hrishikes hails from Kolkata, but is presently based in Lucknow. By profession, he is a doctor serving in paramilitary forces. To his Bengali friends, he welcomes them to contribute to Bengali Wikisource which has more than 676,000 that have completed Optical Character Recognition and are waiting to be proofread.

Nomination can be made at: http://wiki.wikimedia.in/Featured_Wikimedian/Nominations

MediaWiki message delivery (చర్చ) 13:09, 1 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter October 2017

[మార్చు]

Hello,
CIS-A2K has published their newsletter for the months of October 2017. The edition includes details about these topics:

  • Marathi Wikipedia - Vishwakosh Workshop for Science writers in IUCAA, Pune
  • Bhubaneswar Heritage Edit-a-thon
  • Odia Wikisource anniversary
  • CIS-A2K signs MoU with Telangana Government
  • Indian Women Bureaucrats: Wikipedia Edit-a-thon
  • Interview with Asaf Bartov

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. Sent using --MediaWiki message delivery (చర్చ) 05:44, 4 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు వికీపీడియన్లకు విశేష ఆహ్వానం

[మార్చు]

అందరకి నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో 2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 నిర్వహించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగుకు సంబంధించిన నూతన విధానాలగురించి చర్చించడంకోసం డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ గారి ఆహ్వానంమేరకు వీవెన్ గారు, కశ్యప్ గారు, రహ్మానుద్దీన్ గారు, నేను, (పవన్ సంతోష్ గారు చరవాణి ద్వారా) ఈరోజు ఉదయం దిలీప్ గారి ఛాంబర్లో సమావేశమవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలుగు వికీపీడియన్లకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి విశేష ఆహ్వానం ఉంటే బాగుంటుందని కోరడం జరిగింది. దానికి దిలీప్ గారు ఆమోదం తెలిపి 25మంది తెలుగు వికీపీడియన్ల జాబితాను పంపించమని చెప్పారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభల చర్చలలో పాల్గొని ఆ విషయాలు కూడా తెలుగు వికీపీడియాలో పొందుపరచవచ్చని సూచించారు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:28, 5 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఏషియన్ నెల

[మార్చు]

గత నెలలో నిర్వహించిన వికీపీడియా ఏషియన్ నెల లో నేను, పవన్ కొన్ని వ్యాసాలు రాశాం. పవన్ ఆ వ్యాసాలు ఆమోదించి క్లోజ్ చేసేయండి.--రవిచంద్ర (చర్చ) 13:38, 5 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగతంగా నేను అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన ఆలస్యం ఇది. ఈ వారంలో చేసేస్తానండీ. చురుకుగా పాల్గొని తెవికీకి మరికొన్ని వ్యాసాలు అందించినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 02:28, 10 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Supporting Indian Language Wikipedias Program: Needs Assessment Survey

[మార్చు]
Please translate this message if possible

Hello,
We are extremely delighted to inform that the Wikimedia Foundation and CIS-A2K have come together in a partnership with Google to launch a pilot project Supporting Indian Language Wikipedias Program to address local online knowledge content gaps in India. In order to engage and support active Wikipedia volunteers to produce valuable new content in local Indian languages, we are conducting a needs assessment survey. The aim of this survey is to understand the needs of the Indic Wikimedia community and ascertaining their infrastructure requirements that we can fulfill during the course of this project.

Please help us by participating in the survey here.

Your opinion will help to make the program better. Kindly share this survey across your communities, user groups and network of fellow Indic Wikimedians. -- m:User:Titodutta, sent using MediaWiki message delivery (చర్చ) 08:51, 8 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర లొయోలా కళాశాల, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కళాశాలల్లో కార్యక్రమాలు

[మార్చు]

12 డిసెంబరు 2017న (ఈరోజు) విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాల, గుంటూరు వాసిరెడ్డి వెంకటాద్రి కళాశాలల్లో వికీపీడియా విద్యా కార్యక్రమం గురించి కార్యక్రమాలు జరుగనున్నాయి. వికీమీడియా ఫౌండేషన్‌లో వికీపీడియా విద్యా కార్యక్రమం విభాగ ప్రోగ్రాం ఆఫీసర్ నికోల్ సాద్ తమ భారత దేశ పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆంధ్ర లొయోలా కళాశాలలో నికోల్ సాద్ "సంప్రదాయ విద్యా విధానాల్లో వికీపీడియా విద్యా కార్యక్రమం తీసుకువచ్చే మార్పుల" గురించి మాట్లాడనున్నారు. కార్యక్రమంలో సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం మేనేజర్ తన్వీర్ హాసన్, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, వికీమీడియా ఇండియా కార్యనిర్వాహక సభ్యుడు వెలగా కృష్ణచైతన్య పాల్గోనున్నారు. కార్యక్రమంలో గత కార్యక్రమాలపై సమీక్ష, భావి కార్యక్రమాల ప్రస్తావన వంటివి ఉంటాయి. దీనిపై నివేదిక కార్యక్రమం పూర్తైన తర్వాత వీలైనంత త్వరలో అందజేయగలను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:35, 10 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ భాషల వికీపీడియాలకు మద్దతు కార్యక్రమం: అవసరాల అంచనా సర్వే

[మార్చు]

నమస్కారం,
భారతదేశంలో అంతర్జాలంలో స్థానిక భాషల్లో సమాచారం, విజ్ఞానాల లభ్యత పెంపొందించేందుకు వికీమీడియా ఫౌండేషన్, సీఐఎస్‌-ఎ2కె కలసి గూగుల్‌తో భాగస్వాములై భారతీయ భాషల వికీపీడియాలకు మద్దతునిచ్చే ప్రయోగాత్మక స్థాయి కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. స్థానిక భారతీయ భాషల్లో కొత్త సమాచారాన్ని, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు క్రియాశీలంగా ఉన్న వికీపీడియన్లకు మద్దతునిచ్చేందుకు, సహకరించేందుకు మేం అవసరాలను అంచనా వేసే సర్వే చేస్తున్నాం. భారత వికీమీడియా సముదాయం అవసరాలు అవగాహన చేసుకుని, మేం ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తిచేయగల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాలను నిర్ధారించడం ఈ సర్వే లక్ష్యం.

దయచేసి ఈ సర్వేలో పాల్గొనడానికి ఈ లింకు అనుసరించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:53, 11 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు ప్రపంచమహాసభల బొమ్మలు

[మార్చు]

ప్రపంచ తెలుగు మహాసభలకు సంభందించిన బొమ్మలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.


https://commons.wikimedia.org/wiki/Category:Telugu_Mahasabhalu,_world_telugu_conference_2017

వాటిని తగిన వ్య్సాసాల్లో వాడుకొనవచ్చును...--Viswanadh (చర్చ) 14:50, 20 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్ గారూ, చాలా థాంక్సండీ. నేను ఆల్రెడీ వాడకం మొదలుపెట్టాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:10, 22 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Local branch of The Wikipedia Library

[మార్చు]

The Wikipedia Library (TWL) is a place for editors to find and do research more easily and collaboratively. Every language community can adapt the Wikipedia Library model to their own community's needs. Many new branches will start small and grow in different directions than English TWL. While each branch will be unique, you are not alone in setting it up. The Wikipedia Library team is ready to help you with setup, communications, outreach, organization, management, and building a network of collaborators. TWL helps the community members to have the following facilities:

  • Have a place for editors to trade or share online resources
  • Helps to buy or send books to editors
  • Have collaborations with journals or research databases to give editors access
  • Help with digitizing books or journals
  • Pages listing available free/open access resources
  • Community outreach portal for librarians, archivists, or GLAM professionals
  • Have relationships with universities or university libraries through education programs in your region
... and many more

As Telugu Wikipedia is one of the vital Indic-language Wikipedias, I wish to see a working local branch of the TWL for the Telugu Wikimedia Community. If the Community is willing to set-up one, I am ready to help in each and every possible aspect. I welcome each and every Telugu Wikipedian to share thoughts and support the initiative if it looks good for you. Once there is enough community consensus, we can proceed with further technicalities.

గౌరవంతో, Krishna Chaitanya Velaga (talkmail) 15:45, 20 డిసెంబరు 2017 (UTC), Patrner coordinator, The Wikipedia Library[ప్రత్యుత్తరం]

Call for Wikimania 2018 Scholarships

[మార్చు]

Hi all,

We wanted to inform you that scholarship applications for Wikimania 2018 which is being held in Cape Town, South Africa on July 18–22, 2018 are now being accepted. Applications are open until Monday, 22 January 2018 23:59 UTC.

Applicants will be able to apply for a partial or full scholarship. A full scholarship will cover the cost of an individual's round-trip travel, shared accommodation, and conference registration fees as arranged by the Wikimedia Foundation. A partial scholarship will cover conference registration fees and shared accommodation. Applicants will be rated using a pre-determined selection process and selection criteria established by the Scholarship Committee and the Wikimedia Foundation, who will determine which applications are successful. To learn more about Wikimania 2018 scholarships, please visit: wm2018:Scholarships.

To apply for a scholarship, fill out the multi-language application form on: https://scholarships.wikimedia.org/apply

It is highly recommended that applicants review all the material on the Scholarships page and the associated FAQ before submitting an application. If you have any questions, please contact: wikimania-scholarships at wikimedia.org or leave a message at: wm2018:Talk:Scholarships. Please help us spread the word and translate pages!

Best regards, David Richfield and Martin Rulsch for the Scholarship Committee 19:25, 20 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Please join in Wikipedians (India) Google Group

[మార్చు]

To

Respected elders, brothers and sisters of Wikipedia (Telugu).

I am here to express my inner feeling and thoughts that initiated from my heart. We are all Telugu People. Some people may be Telugu known people. We have joined in Wikipedia to be editors of Wikipedian articles; as our aim is to provide good and brief information to the Wikipedia users. It is a good thing and happiest happening that fills our heart with joy and satisfaction. As editing and creating articles give us the satisfaction that we are doing something good to the society.

Being solo for the mission may be good. But if people with common goal join together, it will be more fruitful and bring joy in society.

In order to make that, I have created a Google Group naming "Wikipedians (India)." Please check the link. Actually, I want to make Wikipedians (Telugu) page. But, I didn't get good URL for that, hence I adopted this.

I request you to join the above group and make it a grand success by discussions and sharing opinions and reach our common goals.

Thanking you,

--కృప వర ప్రసాద్ (చర్చ) 04:04, 21 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

User group for Military Historians

[మార్చు]

Greetings,

"Military history" is one of the most important subjects when speak of sum of all human knowledge. To support contributors interested in the area over various language Wikipedias, we intend to form a user group. It also provides a platform to share the best practices between military historians, and various military related projects on Wikipedias. An initial discussion was has been done between the coordinators and members of WikiProject Military History on English Wikipedia. Now this discussion has been taken to Meta-Wiki. Contributors intrested in the area of military history are requested to share their feedback and give suggestions at Talk:Discussion to incubate a user group for Wikipedia Military Historians.

MediaWiki message delivery (చర్చ) 10:46, 21 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మనకోసం ఓ రెండు వందల ఫోటోలు

[మార్చు]
శివ కుమార్ తీసిన ఫోటోల్లో కొన్ని
ఆదిత్య పకిడె కామన్స్ లో చేర్చిన కొన్ని చారిత్రక, పర్యాటక ప్రదేశాల చిత్రాలు

అందరికీ నమస్కారం,
#100Wikidays గురించి మనకు ఇప్పటికే సముదాయ సభ్యులు ప్రణయ్, మీనా గాయత్రి, పవన్ సంతోష్ వంటివారి వందేసి రోజుల వ్యాసాల వల్ల తెలిసిందే. దీన్ని ప్రణయ్ వెయ్యి రోజులకూ తీసుకుపోతున్నారు. ఐతే రోజుకు ఒక వ్యాసం చొప్పున వందరోజులు వంద వ్యాసాలు రాసి వికీపీడియాను సుసంపన్నం చేసినట్టే, రోజుకొక ఫోటో చొప్పున వందరోజులు వంద ఫోటోలు చేర్చి వికీమీడియా కామన్స్, తద్వారా ఇతర భాషల్లో వికీపీడియా పేజీల్లో ఫోటోలు అభివృద్ధి చేసే ప్రయత్నం #100WikiCommonsDays.
శివ కుమార్ అన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ను ఈ ఛాలెంజిలో చేరేందుకు నేను గత మూడు నెలల క్రితం ప్రోత్సహించాను. ఆరోజు నుంచి ఆయన గతంలో తీసిన పోటోల్లో రోజుకు ఒకటి వికీమీడియా కామన్సులో చేరుస్తూ పోయారు. మొన్న డిసెంబరు 22 తేదీ నాటికి ఆయన 100 రోజులూ పూర్తిచేసుకుని వందకు మించిన ఫోటోలు శివ అందించారు. శివ కుమార్ మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడంతో జంతువులు, పక్షుల ఫోటోలు, ఒడిశా ఆదివాసీల ఫోటోలు ఎక్కించారు. విశేషం ఏమంటే - ఆయన అన్ని ఫోటోలకు సుదీర్ఘమైన వివరణలతో, ఆయా జంతువులు, పక్షుల సాధారణ నామాలు, శాస్త్రీయ నామాలు, లక్షణాలు సహా చేర్చారు.
ఆదిత్య పకిడె అన్న ఔత్సాహిక చరిత్రకారుడు వికీపీడియా గురించి నేర్చుకోదలిచినప్పుడు, కొద్దిరోజులకు ఆయన ఆసక్తిని గమనించి తాను తిరిగే చారిత్రక ప్రదేశాల్లో ఫోటోలు తీసి కామన్సులోకి రోజుకు ఒకటి చేర్చవచ్చని నేర్పించాను. అలానే ఆయన తీసి చేరుస్తున్నారు. ఆయన హైదరాబాద్ చెరువులు, చారిత్రక ప్రదేశాలు, ఇతర తెలంగాణ ప్రాంతాల్లోని చారిత్రక ప్రదేశాలు, ఆయన వెళ్ళిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటిలో చోటుచేసుకుంటున్నాయి.
వీరిద్దరూ చక్కని ఫోటోలు చేరుస్తూండడం మాత్రమే కాకుండా వాటికి సవివరమైన వివరణలు కూడా చేరుస్తున్నారు. ఈ రెండు ప్రయత్నాలను తెలుగు వికీపీడియాలో పలు వ్యాసాల్లో ఫోటోలు చేర్చి వ్యాసాల నాణ్యత పెంచడానికి పనికివస్తాయని వివరాలు అందిస్తున్నాను.

  • శివకుమార్ 100రోజుల ఫోటోలు- ఇక్కడ
  • ఆదిత్య పకిడె ఫోటోలు - ఇక్కడ

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:34, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

శివ కుమార్, ఆదిత్య గార్ల కృషికి జేజేలు. --రవిచంద్ర (చర్చ) 08:53, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
గొప్ప ప్రయత్నం. వారికి అభినందనలు.--నాయుడు గారి జయన్న (చర్చ) 14:03, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కొన్నీ ఫోటోలను వ్యాసాలలో చేర్చడం మొదలు పెట్టాను.--స్వరలాసిక (చర్చ) 14:36, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అధ్బుతమైన చిత్రాలు..శివ కుమార్, ఆదిత్య గార్లకు అభినందనలు..Viswanadh (చర్చ) 05:19, 27 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
శివకుమార్, ఆదిత్య గార్లకు ధన్యవాదాలు.T.sujatha (చర్చ) 15:52, 27 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అధ్బుతమైన బొమ్మలు. వారికి నా నెనరులు.Bhaskaranaidu (చర్చ) 11:46, 29 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అధ్బుతమైన చిత్రాలు చేర్చిన శివ కుమార్, ఆదిత్య గార్లకు అభినందనలు.--కె.వెంకటరమణచర్చ 14:12, 30 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ పుస్తక సంబరాల్లో తెలుగు వికీపీడియా స్టాల్

[మార్చు]

అందరికీ నమస్కారం,
విజయవాడ పుస్తక సంబరాలు జనవరి 1 (1న ప్రారంభ వేడుకలు) నుంచి 11 వరకూ జరుగనున్నాయి. ఈ పుస్తకాల పండుగలో తెలుగు వికీపీడియా కోసం ప్రత్యేకించి స్టాల్ ఇవ్వనున్నారు. ఇందుకు మనకు సౌజన్యం అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టు వారి కృషికి ధన్యవాదాలు. గత సంవత్సరం విజయవాడ పుస్తకాల పండుగలో ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో ఇచ్చిన స్టాల్ ను సముదాయ సభ్యులు ప్రణయ్ రాజ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం స్టాల్ నిర్వహణ పూర్తిగా తానే చూసుకోవడం సాధ్యపడకున్నా ఆసక్తి గల సభ్యులు ముందుకు వస్తే వ్యక్తిగతంగా స్టాల్ వివరాలు చూపించి సహకరించేందుకు అక్కడ తాను సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నేను మొదటి కొద్దిరోజుల పాటు స్టాల్ నిర్వహణలో పాలుపంచుకుంటాను. గత కొద్దిరోజుల క్రితం నిర్వాహకులు స్టాల్ ను పంచుకోవాల్సి వస్తుందన్న సూచనలు వచ్చాయి, అయితే తెలుగు వికీపీడియాకు ప్రత్యేకించి స్టాల్ ఇవ్వనున్న విషయం ఈనాడు స్పష్టంగా తెలియడంతో వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్వహణలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఇతర వికీపీడియన్లు తమ అందుబాటు వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:52, 31 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ముక్కనుమ

[మార్చు]

పెద్దపండగలో భోగి, సంక్రాంతి, కనుమ వ్యాసాలు ఉన్నాయి కాని నాల్గవ నాటి ముక్కనుమ వ్యాసం లేదు. సమాచార లభ్యతను బట్టి అది మొదలు పెట్టి అభివృద్ది చేద్దామా. సీజన్ బట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది...--Viswanadh (చర్చ) 13:58, 6 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన. తప్పకుండా వ్రాయండి. ఈ పండుగను జరుపుకొనుటలో ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు వుంటాయి. అన్ని వ్రాయ వచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనుమ నాటి సాంప్రదాయాలే నాల్గవ రోజు కూడ అనుసరిస్తారు. ఏ కారణం చేతనైనా కనుమ రోజు నిర్వహించని కార్య క్రమాలు ఈ నాల్గవ రోజున నిర్వహిస్తారు. Bhaskaranaidu (చర్చ) 08:19, 8 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Wikigraphists Bootcamp (2018 India)

[మార్చు]

Greetings,

It is being planned to organize Wikigraphists Bootcamp in India, please fill out the survey form to help the organizers. Your responses will help organizers understand what level of demand there is for the event (how many people in your community think it is important that the event happens). At the end of the day, the participants will turn out to have knowledge to create drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and get to know to how to tune the images to meet the QI and FP criteria. For more information and link to survey form, please visit Talk:Wikigraphists Bootcamp (2018 India). MediaWiki message delivery (చర్చ) 12:43, 15 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీడేటా కార్యశాల

[మార్చు]

అందరికీ నమస్కారం,
2018 జనవరి నాలుగ వారం (20, 21 తేదీల్లో) విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో భౌతిక శాస్త్ర విద్యార్థులకు వికీడేటాపై కార్యశాల జరుగనుంది. ప్రత్యేకించి లేబుళ్ళు, వివరణలు (డిస్క్రిప్షన్లు) తెలుగులోకి అనువదించే పని నేర్పించడంతో పాటు, స్ట్రక్చర్డ్ డేటా ద్వారా సమాచారం, విజ్ఞానం ఎలా అభివృద్ధి చేయవచ్చన్న అంశం గురించి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. దయచేసి సూచనలు తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:39, 17 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలపై పనిచేయడానికి మరోమారు ఆహ్వానం

[మార్చు]

అందరికీ నమస్కారం,
జనగణన సమచారాన్ని గ్రామ వ్యాసాల్లో చేర్చే ప్రాజెక్టులో భాగంగా చదువరి గారూ, భాస్కరనాయుడు గారూ, నేనూ, యర్రా రామారావు గారూ, జేవీఆర్కే ప్రసాద్ గారూ, వెంకటరమణ గారూ, తదితరులు చేసిన కృషి ఫలితంగా దాదాపు 16000 గ్రామాల వ్యాసాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్లు, తాగునీరు, సాగు వంటి సమాచారం చేరింది. ఇది సగానికి పైగా జరిగిన పని. మిగతా పనిలో కృషిచేసేందుకు మరికొంతమంది కూడా అవసరమే. కాబట్టి ఆసక్తికలిగిన వాడుకరులు ఈ పనిలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:35, 17 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కూడా ఒక జిల్లా గ్రామాలను పంపిస్తే కృషి చేయగలను ...Nrgullapalli (చర్చ) 01:14, 25 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా గుళ్ళపల్లి గారూ, ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 13:35, 27 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]