Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 72

వికీపీడియా నుండి

పాత చర్చ 71 | పాత చర్చ 72 | పాత చర్చ 73

alt text=2020 ఫిబ్రవరి 3 - 2020 మార్చి 1 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 ఫిబ్రవరి 3 - 2020 మార్చి 1

నాణ్యత లేని భాష రాస్తూనే ఉన్నారు

[మార్చు]

"ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి."

పై వాక్యం 2020 జనవరి 28 వ తేదీన ప్రచురించిన ఒక వ్యాసం లోనిది. ఈ వాక్యం అర్థం ఏమై ఉంటుందో ఆలోచించమని నేను అడగడం లేదు. భాష నాణ్యత పెంచడం గురించి ఓ పక్కన మనం ఆలోచిస్తోంటే, మరో వైపు ఇలాంటి ప్రచురణలు సాగిపోతూనే ఉన్నాయని గమనించమంటున్నాను. దీన్ని అడ్డుకునే సంగతిని ఆలోచించమని కోరుతున్నాను. వెంకటరమణ గారు చూసి తొలగింపు మొదలుపెట్టారు కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు మనందరం చెయ్యాల్సిన పనులు:

  1. ఆ తొలగింపు పేజీలో వ్యాఖ్యలు రాయడం.
  2. ఇటీవలి మార్పులు పేజీలో ఎప్పటికప్పుడు దిద్దుబాట్లను గమనిస్తూ, సందేహాస్పదంగా ఉన్నవాటిని గుర్తించి తగు చర్య తీసుకుంటూ ఉండడం.
  3. వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ పేజీలో అభిప్రాయాలు రాసి, దాన్ని ముగించి, చర్యలు తీసుకోవడం.

__చదువరి (చర్చరచనలు) 00:44, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే చేద్దాం చదువరి గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:47, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, చర్చా పేజీలో నాకు తోచిన సూచన రాశాను.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 13:57, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల తొలగింపు

[మార్చు]

గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలను తొలగించాలని పైన తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 5 న వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు (1772 వ్యాసాలు), వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు మెరుగుపరచాల్సిన (41 వ్యాసాలు) వర్గాల్లోని వ్యాసాలను మూకుమ్మడిగా తొలగిస్తాను. మొత్తం తొలగించబోయే వ్యాసాల సంఖ్య: 1813 (1772 + 41) వివిధ పేజీల నుండి వాటికి ఉన్న లింకులు, దారిమార్పు లింకులను తీసివేయను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:11, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి నిర్ణయం.స్వాగతిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:17, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:21, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుకెళ్ళండి! — వీవెన్ (చర్చ) 04:14, 8 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరులు చేష్టలు గమనించండి

[మార్చు]

రాణి పద్మావతి వ్యాసాన్ని వాడుకరి:T.sujatha గారిచే 2018 నవంబరు 12 సృష్టించి కష్టపడి అభివృద్ది చేయబడింది.దానిని అజ్ఞాత వాడుకరి 2019 జనవరి 16న నాలుగు వికృత చేష్టలతో ఎలా చేసాడో గమనించండి.అజ్ఞాత వాడుకరులు అందరూ అలా కాక పోవచ్చు.ఇలాంటివి నేను కాదు, మన గౌరవ వికీపీడియన్లు చాలా గమనించి త్రిప్పికొట్టిన సందర్బాలు ఉంటున్నాయి.సుజాత గార్కి మెయిల్ వచ్చే ఉండవచ్చు.పని వత్తిడిలో గమనించక పోవచ్చు.అజ్ఞాత వాడుకరులు సేవలు వలన వికీపీడియాకు జరిగే మంచికన్నా, వీళ్లు చేసే తుంటరి పనులే ఎక్కువగా ఉన్నాయని నేను భావిస్తున్నాను.ఈ వ్యాసం ప్రత్యేక పేజీలలోని వర్గీకరించని పేజీలు పరిశీలించుచున్న సందర్బంగా గమనించుట జరిగింది. వ్యాసం చూడగానే తొలగింపు మూస పెట్టాలనిపిస్తుంది.చూడబట్టి తెలుస్తుంది.గమనించకపోతే ఇంతే సంగతులా?తప్పు చేసినాక నియంత్రించే కంటే, తప్పు జరుగకుండా నియంత్రించే మార్గం మేలుకదా అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:15, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి మార్పులను, కొత్త పేజీలను కూడా, తనిఖీ చేస్తూండడమే దీనికి పరిష్కారం. ఈ పేజీని సవరించాను. __చదువరి (చర్చరచనలు) 07:48, 3 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు చెప్పినట్టు ప్రతిఒక్కరు విరివిగా తనిఖీలో పాల్గొనాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:04, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా సదస్సు 2020 - ఆహ్వానం

[మార్చు]

ఐఐఐటి హైదరాబాద్, భారత భాషలలో వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమము లో భాగంగా “తెలుగు వికీపీడియా సదస్సు 2020” ను శనివారం తేదీ 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. భారతీయ భాషలలో (తెలుగు మరియు హిందీపై దృష్టి సారించడం) వికీపీడియా కంటెంట్ను రాబోయే 5 సంవత్సరాలలో అనేక వేల రెట్లు పెంచే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మేము చేపట్టాము. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డుగ్రహీత, చైర్మన్ ఐఐఐటి హైదరాబాద్, డా.జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, మరియు శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు. .

కార్యక్రమము వివరాలు

వేదిక - కే ఆర్ బి ఆడిటోరియమ్ , 4వ అంతస్తు కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్

సమయం - ఉదయం 9 గంటలనుండి మధ్యాన్నం 1 గంట వరకు.

Dollyrajupslp (చర్చ) 08:37, 4 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Dollyrajupslp గారు, ఐఐఐటీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలకోసం తెవికీలో ఉన్న ఐఐఐటీ ప్రాజెక్టు పేజీకి ఉప పేజీలను పెట్టి అందులో ఆయా కార్యక్రమ ముందస్తు వివరాలు, కార్యక్రమం అయిపోయిన తరువాత ఫోటోలతో కార్యక్రమ నివేదికను రాయండి. ఇలా చేయడంవల్ల ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల విషయాలు ఇతర వికీపీడియన్లకు, మిగతా వారికి తెలుస్తాయి. ఈ విషయంలో మీకు సహకారం అందించడానికి తెవికీ సభ్యులు అందుబాటులో ఉంటారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:53, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ యంత్రికానువాద వ్యాసాలను తొలగించాను

[మార్చు]

రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వర్గం లోని 1767 వ్యాసాలను, వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు మెరుగుపరచాల్సిన‎ వర్గంలోని 41 వ్యాసాలనూ తొలగించాను. తొలగించక ముందు ఉన్న గణాంకాలు ఇవి:

విషయపు పేజీలు 71,949
పేజీలు(ఈ వికీలోని అన్ని పేజీలు (చర్చా పేజీలు, దారిమార్పులు, మొదలైనవన్నీ కలుపుకొని).) 2,66,565
ఎక్కించిన దస్త్రాలు 12,721
మార్పుల గణాంకాలు
వికీపీడియా మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు 28,28,692
పేజీకి సగటు మార్పులు 10.61

వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో సంఖ్యాశాస్త్రం అనే పేజీ ఉండిపోయింది. ఎందుకో తెలీదు, పరిశీలించి దాన్నీ తొలగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 06:07, 5 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:20, 6 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మంచిది. చప్పట్లు! ఒక దరిద్రం వదిలిపోయిందన్నమాట. వికీపీడియాలో ఉన్నాయి కదా అని వీటిని యంత్రానువాద అల్గారిథములు ప్రామాణికం అనుకునే ప్రమాదం ఉండింది. — వీవెన్ (చర్చ) 04:23, 8 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరులకు చర్చా పేజీ పరిచయం

[మార్చు]
ఖాతాలను సృష్టించుకునే పేజీలో చర్చాపేజీల గురించి కుడివైపు ఒక చిత్రాన్నైనా, డూడుల్ అయినా పెట్టగలితే కొత్తవారికి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది

కొత్తగా వాడుకరి ఖాతా సృష్టించుకున్న వారిలో దాదాపు 90% మందికి (అంచనా) వారి చర్చా పేజీని చూడడం తెలియదు. దీనికి నిదర్శనం సహచర వికీపీడియన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు కొత్తవారికి చేరకపోవడం. అదే ఖాతా సృష్టించుకునే సమయంలోనే వారికి చర్చా పేజీ గురించి సరైన అవగాహన సమకూర్చగలిగితే కొత్త వాడుకరులు మనమిచ్చే సలహాను సులభంగా చూడగలుగుతారు.--IM3847 (చర్చ) 17:07, 8 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు

  • మద్దతునిస్తున్నాను. కొత్తవారిని వాడుకరులుగా చేర్చుకోవడం, నిలుపుకోవడం మనకు ముఖ్యమైన విషయం కాబట్టి ఆ దిశగా ఈ ప్రయత్నం ప్రయోజనకారి అని భావిస్తున్నాను. ఎందుకంటే- కేవలం ప్రధాన పేరుబరిలో మార్పుచేర్పులు మాత్రమే ఒకరిని వికీపీడియన్‌ని చేయవు. చర్చా పేజీలు, మరీ ముఖ్యంగా వారి వాడుకరి చర్చా పేజీ వారు ముందుకు వెళ్ళడానికి చాలా ముఖ్యమైనది. పైగా ఈ పేజీ దాకా వచ్చినవారెవరూ సాధారణ పాఠక వాడుకరులు కాదు. వికీపీడియాలో ఒక ఖాతా (ఎందుకో అందుకు) ఉండాలని భావించిన వారు. కాబట్టి, ఇలాంటి సమాచారాన్ని మనం ప్రయత్నపూర్వకంగా ఖాతా సృష్టించుకుంటున్న వాడుకరులకు ఇవ్వడం మేలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:07, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • Support నాకు సమ్మతమే. చర్చ పేజీ గురించి ఇతర విధాలుగా తెలియజేస్తున్నప్పటికీ, ఇలా కూడా తెలియజేస్తే నష్టమేమీ లేదు. ఆ పేజీ ఉందని కొత్తవారు తెలుసుకునేందుకు ఇదొక అదనపు చేర్పు. వేరే ఇబ్బందులేమీ (ఉదా: సాంకేతికం) లేకపోతే ఈ అంశాన్ని చేర్చవచ్చు. __చదువరి (చర్చరచనలు) 10:49, 15 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • Support మద్దతు. చర్చాపేజీతో పాటు ఇతర సహయాలు, వికీ నియమాల గురించిన లింకులు కూడా ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:14, 15 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తటస్థం

వ్యతిరేకం

చర్చ

IM3847 గారికి, కొత్త వాడుకరులకు వారి చర్చా పేజీలో స్వాగతం సందేశాలు చేరుస్తున్న సంప్రదాయం వుంది కదా. అప్పుడు వారికి సందేశం కూడా అందుతుంది. తెలియకపోవటం అనే సమస్యలేదు. కాకపోతే చాలా ఆసక్తివున్న వారు తప్పించి, మిగతావారు ఆ స్వాగత సందేశంలో వివరాలు చదివి మరింత తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే మనమేం చేయగలము?--అర్జున (చర్చ) 04:38, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, విశాఖపట్నానికి చెందిన ఒక కొత్త వాడుకరి చర్చా పేజీని మీరు ఇక్కడ చూడగలరు. మేము అతనిని సోషల్ మేడియా ద్వార సంప్రదించినప్పుడు, తెసుకున్నది ఏమనగా అతనికి చర్చా పేజీ గురించి అవగాహన లేదంట. యూట్యూబులో ఉన్న బెల్లును పోలి ఉండడంతో ప్రకటనలు అనుకుని పొరబడ్డారని తెలుసింది. ఒకవేళ అతనికి వికీపీడియాపై మక్కువ లేకపోతే 1,000 పైగా మార్పులు చేసే అవకాశమే లేదు. చర్చా పేజీ గురించి మనం అకౌంటు తయారు చేసికునే సమయంలోనే సమాచారమివ్వగలిగితే మీరు అన్నట్లే చాలా ఆసక్తి ఉన్నవారే కాకుండా, ఒకవేళ ఆసక్తి తక్కువగా ఉన్నా వికీపీడియా సభ్యలతో కలిసి పనిచేయడంతో ఇక్కడే స్థిరపడేవారు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలలో వికీపీడియా కోసం పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారు చాలా తక్కువ, కొత్తవారికి మనం శిక్షణ ఇచ్చినా వారు నిలదొక్కుకోలేని సంఘటణలు చాలా ఉన్నాయి. కావున, మన ప్రమేయం లేకుండా స్వయంగా వికీపీడియాకు పరిచయమయ్యేవారికి ఖాతా తెరిచే సమయంలోనే వీలైనంత సమాచారం ఇవ్వగలిగితే బాగుంటుంది. అనంతరం వారి మార్పులు తొలగింపబడినా వారు నిరుత్సాహపడకుండా, మరలా అదే తప్పు చేసి బ్లాక్ అవకుండా నేరుగా చర్చా పేజీకి వచ్చే అవకాశం ఉంటుంది. వికీ ఖాతా తెరుస్తున్నారు అంటేనే వారికి వికీపీడియాపై మక్కువ ఉంది అని అర్ధం, లేకపోతే వారు నేరుగా ఐ.పీ. అడ్రస్సు తోనే దిద్దుబాటు చేశేవారు. ఇప్పుడు చర్చా పేజీని చూసేవారికంటే కనీసం ఒకరిద్దరైనా పెరిగి సహాయం కావాలీ మూసను వాడినా ఇంతక ముందుకన్నా ఎక్కువ వాడుకరులను మనం తెవికీలో నెల్కొల్పే అవకాశముంటుంది.--IM3847 (చర్చ) 05:15, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
IM3847 చేసిన సూచన బాగుంది. దీనివల్ల కొత్త వాడుకరులకు సులభంగా అర్థం అవుతుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:58, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల్లో నాణ్యత మెరుగుదల కోసం

[మార్చు]

యాంత్రికానువాద వ్యాసాల్లో నాణ్యతను మెరుగుపరచడం కోసం వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ లో చేసిన నిర్ణయం మేరకు కింది చర్యలు తీసుకున్నాను:

  1. "మరియు" ఉన్న వ్యాసం అనే వడపోతను సృష్టించాను. అనువాద పరికరం ద్వారా ప్రచురించే కొత్త వ్యాసాల్లో "మరియు" అనే పదం ఉంటే, ఈ వడపోత హెచ్చరించి, ప్రచురణను ఆపేస్తుంది. నేరుగా ప్రచురించే వ్యాసాలను ఇది పట్టించుకోదు. దీన్ని పరీక్షించాను, బాగానే పనిచేస్తోంది. ఏమైనా సమస్యను గమనిస్తే, రచ్చబండలో రాయగలరు.
  2. అనువాద పరికరం ద్వారా ప్రచురించేటపుడు మానవిక అనువాదం కనీసం 40% ఉండేలా పరిమితి విధించమని సంబంధిత డెవలపరును కోరాను.

పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 09:31, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి చదువరి గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:01, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యంత్ర సహాయం అవసరం

[మార్చు]

@Veeven: మొన్న జరిగిన ఐఐఐటి వారి సదస్సులో వికీపీడియాకు అవసరమైన బాట్‌ల వంటి యంత్ర సహాయాలను తాము చేస్తామని కొందరు ముందుకు వచ్చారు. యాంత్రికంగా దిద్దుబాట్లు చేసేందుకు ఏయే అవసరా లున్నాయో మనం వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో రాసాం. అలాంటి యంత్రిక దిద్దుబాట్ల అవసరాలు ఇంకా ఏమైనా ఉంటే ఆ పేజీలో రాయవలసినది. వాడుకరి:Dollyrajupslp గారూ, ఈ పేజీ గురించి ఆసక్తి చూపించిన ఐఐఐటీ సాంకేతికులకు తెలియజేయగలరు. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 01:16, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

డా. కె. నాగేశ్వర్ గారి ప్రసంగంలో

[మార్చు]

ఐఐఐటీలో ఫిబ్రవరి 8 వ తేదీ, శనివారం నాడు జరిగిన సదస్సులో డా. కె. నాగేశ్వర్ గారు ప్రసంగిస్తూ వికీపీడియాలో రాస్తున్న భాష గురించి ఇలా వ్యాఖ్యానించారు (సరిగ్గా ఇవే మాటల్లో కాదు, కానీ వాడవద్దని చెప్పిన పదాలు మాత్రం ఇవే):

"మరియు", "యొక్క", "బడు" (కర్మణి వాక్యం) అనేవి తెలుగు భాషకు స్వాభావికమైనవి కాదు. వికీపీడియాలో వాటిని రాయవద్దు.

__చదువరి (చర్చరచనలు) 16:22, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నాగేశ్వర్ గారు ఆ పదాల గురించి చెప్పగానే మనం తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:59, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు ప్రణాళిక తెవికీలో ప్రకటించాలి

[మార్చు]

ఐఐఐటీ, హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు విషయమై సముదాయానికి ప్రణాళిక పూర్తి స్వరూపం తెలిసేలాంటి డాక్యుమెంటేషన్ జరగలేదు. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు రచ్చబండలో జరిగిన చర్చల్లో (వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#తెలుగు_వికీపీడియా_ప్రాజెక్ట్_in_IIIT_-_Hyderabad_(తెలుగు_వికీపీడియా_మరియు_ఇతర_భారతీయ_భాషల_వికీపీడియా_మెరుగు_పరుచుటకు_ప్రాజెక్ట్)) అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూడా వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదనలో సరైన వివరణ లేదు. ఆపైన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో స్టాల్ సహితంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటి విషయంలో సరైన కార్యక్రమ పేజీలు ముందుగా రూపొందించడం, సముదాయంలో కార్యక్రమ ప్రణాళిక చర్చకు పెడితే మన వైపు నుంచి సూచనలు అందడం, వారు చర్చించి ఓ రూపానికి తీసుకురావడం వంటివి జరిగి ఉంటే తెలుగు వికీపీడియా సముదాయం భాగస్వామ్యం వహించినట్టు అయ్యేది. కానీ, అదేమీ జరగలేదు. దీనికి అంతటికీ గల ముఖ్యమైన కారణం సరైన విధానం తెలియకపోవడం (ఇది జరగాలి అని ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ పలుమార్లు సముదాయ సభ్యులు చెప్పారు. ఆ పరంగా సముదాయం ఎప్పుడూ వోకల్ గానే ఉంది. ఐనా ఇలా చెయ్యండి అని లింకులు ఇవ్వలేదు అన్న ఒక్క కారణం ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నాను) అని నేను మంచి విశ్వాసంతో భావించి అసలు నమూనా ప్రాజెక్టు ప్రణాళిక ఎలా ఉంటుంది? నమూనా ఈవెంట్ పేజీ ఎలా ఉంటుంది? వంటివి ఈ కింద ఇస్తున్నాను.

  • ఒక వార్షిక ప్రాజెక్టు నిర్వహించాలని భావించేవారు ఇచ్చే సమాచారం ఇంత వివరంగా ఉంటుంది. ఉదాహరణలు:
  • గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇందులోని ఏదోక మోడల్ ఎంచుకోవచ్చు, లేదంటే దీన్ని కేవలం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సమాచార విస్తృతిని వివరించడానికే ఈ ఉదాహరణలు పనికి వస్తాయి. డాచ్ లాండ్ వారి ప్రణాళికలో ఆబ్జెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి, ప్లానింగ్ కూడా (అంటే ఎలా చేస్తారు అన్నది) ఉంటే వివరంగా ఉంటుందని, లేదంటే అవే అంశాలపై ప్రశ్నలు వస్తాయనీ గ్రహించగలరు.
  • సముదాయ సభ్యులు చేసిన ఆఫ్‌లైన్ సూచనలు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించడం ఇలా చేయవచ్చు: వికీపీడియా చర్చ:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017
  • కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన మూడు దశలు.
  • ప్రణాళిక: కార్యక్రమ ప్రణాళిక దశలో కార్యక్రమం ఎలా జరుగుతుంది, అందులో ఏమేం అంశాలు ఉంటాయి, ఏ క్రమంలో జరుగుతాయి అన్న విషయాలతో కార్యక్రమ పేజీ సృష్టించడం మంచిది. కేవలం బీజ ప్రాయంగా ఒక కార్యక్రమం చేద్దామనుకుంటున్నాం, లక్ష్యాలు ఇవి అని కూడా మొదలుపెట్టవచ్చు. క్రమేపీ ప్రణాళిక అభివృద్ధి చెందే కొద్దీ దాన్ని అప్‌డేట్ చేయొచ్చు. కార్యక్రమానికి కనీసం వారం, పది రోజుల ముందు రచ్చబండలో విభాగం సృష్టించి ఆ కార్యక్రమం గురించి క్లుప్తంగా రాసి పేజీకి లింకు ఇచ్చి సముదాయ సభ్యుల సూచనలకు ఆహ్వానించడం మంచిది. ఒకవేళ పెద్ద కార్యక్రమం నెలలకు ముందు ప్రణాళిక వేసుకునేదైతే అప్పుడే రచ్చబండలో చర్చ మొదలుపెట్టాలి. సముదాయ సభ్యులు చర్చ పేజీల్లో సూచనలు ఇస్తారు, సాయం చేస్తారు. నచ్చినవి స్వీకరించవచ్చు, లేదూ మనం ఆలోచించింది సరి అనుకుంటే వివరణ ఇవ్వవచ్చు. ఉదాహరణకు: ఈ కార్యక్రమ ప్రతిపాదన 2018 మార్చి 11 నాటికి ఎలా ఉందో చూడండి. ఆపైన meta:Grants_talk:Conference/WikiConference_India_2020।చర్చ పేజీలో శ్యామల్ అనే వ్యక్తి చేసిన సూచనలు, చర్చ పూర్తి వ్యతిరేకంగా ఉన్నా గ్రాంట్ ప్రతిపాదించిన కృష్ణచైతన్య వెలగా అవి మంచి సూచనలు కావడంతో స్వీకరించి పూర్తిగా తిరగరాసి meta:Grants:Conference/Krishna Chaitanya Velaga/Wikigraphists Bootcamp (2018 India)।ఈ రకంగా రూపొందించారు. వికీమీడియా సముదాయంతో కలిసి పనిచేయడం అంటే ఇలా ఆన్‌లైన్‌లో పబ్లిక్ స్క్రూటినీకి నిలబడడానికి ఇష్టపడడం.
  • పైన చూపించింది ఈవెంట్ గ్రాంట్ పేజీ. అంతలా కాక తేలికగా ఒక పెద్ద ఈవెంట్ పేజీ రూపొందించాలంటే, ఈ పేజీ నమూనాగా తీసుకోవచ్చు.
  • చిరు సమావేశం అయితే ఈ ఉదాహరణ చూడండి.
  • నివేదిక: కార్యక్రమం పూర్తయ్యాక సాధ్యమైనంత వివరంగా నివేదిక రాయాలి. ఇందులో భాగంగా ఏం చేశాం, ఏం వచ్చింది, ఏం నేర్చుకున్నామన్నవీ ఉంటూంటాయి.

వీటి కోసం వేర్వేరు పేజీలు ఎలా సృష్టించాలన్నది కావాలన్నా ఇక్కడే అడగవచ్చు. దానిపైనా వివరణ ఇస్తాం. ఇంత వివరంగా చెప్తున్నది ఎందుకంటే- ఐఐఐటీ తెవికీ ప్రాజెక్టు కోసం జరుగుతున్న ప్రణాళిక సముదాయ సభ్యులకు తెలియాలి. సముదాయం ఆమోదమో, దానిపై చర్చోపచర్చలో, ఏదోక ఫలితం రావాలి. అప్పుడే ఈ ప్రాజెక్టులో సముదాయం పాలుపంచుకున్నట్టు అవుతుంది. అలానే, మీరు చెప్పిన విషయాల్లో కొన్ని చేయడం సాధ్యమై కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అలానే దీని ఫైనాన్సులు ప్రకటించనూ అక్కరలేదు. (పైన ఇచ్చిన ఉదాహరణల్లో కొన్ని వికీమీడియా ఫౌండేషన్‌కు అప్లై చేసుకున్న గ్రాంట్స్ కాబట్టి అలా ఫైనాన్సెస్ బహిరంగంగా ప్రకటిస్తారు) మీరిప్పుడు ప్రణాళిక వేస్తున్నారు/వేశారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకూ సవివరమైన ప్రణాళిక ప్రకటించగలరు. అలా ప్రకటించి, అలా చర్చ జరిగి, ఏకాభిప్రాయానికి వచ్చేవరకూ తెలుగు వికీపీడియా సముదాయంతో పనిచేస్తున్నామని అనుకోవడం సాధ్యం కాదని మరీ మరీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అలానే ఈ విషయాన్ని టీం దృష్టికి తీసుకురావాల్సిందిగా, అంటే అవసరమైన వారిని ఇక్కడ టాగ్ చేయాల్సిందిగా, @Kasyap: గారిని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:57, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • మీ సూచనకు నెనర్లు పవన్ సంతోష్ గారు , @Dollyrajupslp: , @Newwikiwave: . దయచేసి ఒక్క విషయం గమనించండి ఐఐఐటీ, హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న indicwiki ప్రాజెక్టు లో తెలుగు వికీపీయా అభివృద్ది ఒక భాగము మాత్రమే ఇది ఇంకా ప్రాధమిక దశలోనే వున్నది ఇందులో మిగిలిన సంస్థల భాగస్వామ్యం కూడా వున్నది, ఈ ప్రాజెక్టుద్వారా ఒకవేళ WMF వికీమీడియా ఫౌండేషన్‌కు సంస్థలను నుండి గ్రాంట్ వంటి ఆర్ధిక సహకారం, ఇంకా ఏమైనా సహకారం అవసరం అయినప్పుడు వారికి కావలసిన మోడల్ నే అనుసరించ వలసినదిగా ప్రాజెక్టు సభ్యులకు తెలియచేస్తాను, అంతేకాక తెలుగు వికీపీడియాలో జరగబోయే ఏమైనా ఎన్నదగిన అంశాలు తప్పకుండా తెలుగు వికీపీడియన్ సమూహంతో పంచుకొని వారిని భాగస్వామ్యం చేస్తూ , వారి సూచనలు పరిగణలోకి తీసుకొనటానికి నావంతు ప్రయత్నం చేస్తాను Kasyap (చర్చ) 17:33, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • //దయచేసి ఒక్క విషయం గమనించండి ఐఐఐటీ, హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న indicwiki   ప్రాజెక్టు లో తెలుగు వికీపీయా అభివృద్ది ఒక భాగము మాత్రమే ఇది ఇంకా ప్రాధమిక దశలోనే వున్నది// తెలుగు వికీపీడియా పేరిట పుస్తక సంబరాల్లో స్టాల్ పెట్టడం, రాజకీయ, పత్రికా ప్రముఖుల్లో నలుగురిని పిలిచి తెలుగు వికీపీడియా సదస్సు నిర్వహించడం అన్నది ప్రాథమిక స్థాయి కాదండీ. తెలుగు వికీపీడియాను పత్రికాముఖంగానూ ఐఐఐటీ వారు రిప్రజెంట్ చేస్తున్నారు. భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవేమీ చిన్న చిన్న పనులు కాదు, వికీలో సవివరంగా రాయకుండా, ప్రణాళిక ఏమిటో తెలియకుండా ముందుకు పోవడానికి. మీరనుకుంటున్న బృహత్ కార్యక్రమానికి ఇది ప్రాథమిక దశేమో కానీ తెలుగు వికీపీడియా వరకూ ఇదేమీ ప్రాథమిక స్థాయి కాదు.
  • //ఈ ప్రాజెక్టుద్వారా ఒకవేళ WMF వికీమీడియా ఫౌండేషన్‌కు సంస్థలను నుండి గ్రాంట్ వంటి ఆర్ధిక సహకారం, ఇంకా ఏమైనా సహకారం అవసరం అయినప్పుడు వారికి కావలసిన మోడల్ నే అనుసరించ వలసినదిగా ప్రాజెక్టు సభ్యులకు తెలియచేస్తాను// కేవలం ఆర్థిక సహకారం మాత్రమే సహకారం కాదు. అంతకన్నా విలువైనవి ఉన్నాయి. తెలుగు వికీపీడియాతో, లేదంటే తెలుగు వికీపీడియా సముదాయంతో కలిసి పనిచేస్తున్నామని ఎప్పటికప్పుడు ప్రకటించుకునేప్పుడు, అవసరమైనప్పుడల్లా సభ్యుల సలహా సూచనలు స్వీకరించేప్పుడు తెలుగు వికీపీడియా పద్ధతిలో ప్రాజెక్టు వివరాలు అందివ్వడమేమీ అసంబద్ధం కాదు. కాబట్టి, నేను సూచించిన పద్ధతిలో కానివ్వండి, మీదైన కొత్త విధానంలో కానివ్వండి సుస్పష్టంగా ప్రాజెక్టు లక్ష్యాలు, మార్గాలు తెలియజేసినాకే తెలుగు వికీపీడియాతో భాగస్వామ్యం వహిస్తున్నామనో, తెలుగు వికీపీడియాకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్నామనో ముందుకువెళ్ళడంలో ఒక సార్థకత ఉంటుంది.
  • //తెలుగు వికీపీడియాలో జరగబోయే ఏమైనా ఎన్నదగిన అంశాలు తప్పకుండా తెలుగు వికీపీడియన్ సమూహంతో పంచుకొని వారిని భాగస్వామ్యం చేస్తూ , వారి సూచనలు పరిగణలోకి తీసుకొనటానికి నావంతు ప్రయత్నం చేస్తాను// ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి- 1. భవిష్యత్ కార్యక్రమాల విషయం తీసుకుంటే- ఇది ప్రాజెక్టు. వనరుల లభ్యతను బట్టి ప్రణాళిక అమలు, ఆలస్యం ఉంటుందేమో కానీ - అసలు ప్రణాళిక లేకుండా ఎప్పటికప్పుడు ఏదోక కార్యక్రమం చేయడం ప్రాజెక్టు అన్నదానిలో జరగదు. కాబట్టి, ప్రాజెక్టు విషయమై మీకున్న మాత్రపు స్పష్టత సముదాయానికి ఇవ్వమని అడుగుతున్నాను. అందుకు నేను పైన ఎలా చేయవచ్చో ఉదాహరణలు ఇచ్చాను. అవన్నీ ఫ్లెక్సిబుల్ ప్రాజెక్టులే తప్పించి ఖచ్చితంగా ఇలాగెందుకు చేయలేదు అని అడిగే రకాలు కావు. అవి క్రమేపీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 2. ఇప్పటికే చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చాలా జరిగాయి. వాటి విషయమై కార్యక్రమ పేజీలు రూపొందించి డాక్యుమెంటేషన్ చేయవచ్చు. నిజానికి, నేననేది ఏమంటే - తెలుగు వికీపీడియాతో కలిసి పనిచేయడం అంటే సముదాయానికి ఆన్‌లైన్‌లో ముందుగా ఆలోచన తెలియబరిచి సముదాయంతో కలిసి దాన్ని అభివృద్ధి చేసి నిర్వహించడం. గతం గతః కాబట్టి కనీసం దాని డాక్యుమెంటేషన్ అయినా కావాలని అడుగుతున్నాను.
మీరేదో పనిచేస్తుంటే తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులమన్న హక్కుతో మేము తీరికూర్చుని మిమ్మల్ని ఇవన్నీ అడుగుతున్నామని భావించనూ వద్దు (ఆమాట మీరనలేదు లెండి, నేనే ప్రశ్న వేసుకుని జవాబిస్తున్నాను) ఎందుకంటే- నేను, చదువరి, వీవెన్ వంటివారం ఇప్పటికే సాధ్యమైనన్ని రకాలుగా సూచనలు, సలహాలు ఇవ్వడానికి మా స్వచ్ఛంద సమయాన్ని ఖర్చుచేశాం. నేను వచ్చి ఐఐఐటీ ప్రాజెక్టు సభ్యులకు అనారోగ్యంతో బాధపడుతూ కూడా తెలుగు వికీపీడియా మీద మౌలిక అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాను. అంతకన్నా ముఖ్యంగా నేను ఇప్పటికే ఐఐఐటీ వారికి ఆమోదయోగ్యమైతే "వికీమీడియా ప్రాజెక్టుల్లో బయటి సంస్థలు పనిచేయడం ఎలా" అన్నదానిపై ఒక పూర్తిస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని (ట్రైన్-ద-ట్రైనర్ తరహాలో) భారతీయ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల మీద పనిచేసిన అనుభవజ్ఞులను ఆహ్వానించి ఇప్పిస్తాననీ, అందుకు అవసరమైన వనరులనూ ఏదోక విధంగా నేనే సేకరిస్తాననీ కూడా మాట ఇచ్చాను. అందువల్ల ఈ ప్రాజెక్టు విషయంలో ఈ సూచనలు ఇవ్వడానికి సమకట్టానని మరోమారు గుర్తుచేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పేదేమంటే - ఆన్‌వికీ డాక్యుమెంటేషన్, ముందస్తుగా ఆన్‌లైన్‌లో సముదాయంతో సంప్రదింపుల ద్వారా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం వంటి ఇతర పద్ధతులు పాటించకుండా పనిచేసినప్పుడు అది తెలుగు వికీపీడియాతో కానీ, తెలుగు వికీమీడియా సముదాయంతో కాని కలిసి పనిచేయడం అవ్వదు. ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వంత ఆసక్తుల మీద స్వచ్ఛందంగా హాజరుకావడం తెలుగు వికీమీడియా సముదాయంతో కలిసి పనిచేయడం ఒకటి కానేరదు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 05:50, 22 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటీ ప్రాజెక్టుపై అభిప్రాయాలు

[మార్చు]
  • పైన జరిగిన చర్చలు పూర్తిగా పరిశీలించిన పిదప పవన్ సంతోష్ గారు వెల్లడించిన అభిప్రాయాలు, సూచనలతో నేను ఏకీభవిస్తున్నాను.ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు పోవాలంటే ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు, తెలుగు వికీపీడియా నిర్వహకుల మధ్య తలెత్తిన సందేహాలు, అనుమానాలు అభిప్రాయలు నివృత్తి చేసుకోవాలి.వాటిని పూర్తిగా నివృత్తి చేసుకొని ఉభయులు ఒక ఏకాభిప్రాయనికి వస్తేనే ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలరని నా అభిప్రాయం.అటువంటి వాతావరణం ఇద్దరి మధ్య ఏర్పడాలంటే తరుచూ ఇతరులతో నిమిత్తం లేకుండా (అంటే ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో కాకుండా) ప్రత్యేక సమావేశాలు జరగాలి.అవి జరగకుండా ఏకాభిప్రాయానికి రావటానికి అవకాశం లేదు.ఏకాభిప్రాయనికి రాకుండా ప్రాజెక్టు ముందుకు పోవటంఅనేది తెలుగు వికీపీడియా అనే బండిని చెరొకవైపుకు లాగినట్లుగా ఉంటుందని నా అభిప్రాయం.ఈ విషయం మీద ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు నిర్వహకులు @Dollyrajupslp: , @Newwikiwave:, గారు, కో ఆర్డినేటరు, సీనియర్ తెలుగు వికీపీడియన్ Kasyap గారు చొరవతీసుకుని,  పవన్ సంతోష్, వాడుకరి:Chaduvari, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Veeven, వాడుకరి:C.Chandra Kanth Rao, వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:K.Venkataramana ఇంకా ఉదహరించని తదితర గౌరవ సీనియర్ వికీపీడియా నిర్వహకులుతో ప్రత్యేక సమావేశాలు జరుపగలందులకు నాకు తోచినసలహా క్షమాపణలతో మీ ముందుంచుతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:39, 29 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రత్యక్ష ముఖాముఖి సమావేశంలో ప్రాజెక్టు తెలుగు వికీకి సంబంధించిన విషయాలను సముదాయ సభ్యులతో చర్చించినాకానీ, ఆన్-వికీ పెట్టాలన్నది తెవికీ నియమం కాబట్టి ఆ దిశగా ఈ ప్రాజెక్టు సంబంధించినవి ఆన్-వికీ ద్వారా పంచుకోవాలని కోరుతున్నాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:43, 29 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
    1. "..తెలుగు వికీపీడియాలో జరగబోయే ఏమైనా ఎన్నదగిన అంశాలు తప్పకుండా తెలుగు వికీపీడియన్ సమూహంతో పంచుకొని వారిని భాగస్వామ్యం చేస్తూ , వారి సూచనలు పరిగణలోకి తీసుకొనటానికి నావంతు ప్రయత్నం చేస్తాను" అని కశ్యప్ గారన్నారు, సంతోషం.
    2. "WMF వికీమీడియా ఫౌండేషన్‌కు సంస్థలను నుండి గ్రాంట్ వంటి ఆర్ధిక సహకారం, ఇంకా ఏమైనా సహకారం అవసరం అయినప్పుడు వారికి కావలసిన మోడల్ నే అనుసరించ వలసినదిగా ప్రాజెక్టు సభ్యులకు తెలియచేస్తాను, .." అని కూడా అన్నారాయన. ఫౌండేషను డబ్బులు వాడుకున్నపుడు మాత్రమే కాదు. వారి వెబ్ సైటును వాడుకుంటున్నపుడు ఆ వెబ్ సైటు పద్ధతులను అనుసరించాల్సిందే - వాళ్ళ గ్రాంటు పొందినా పొందకున్నా.
    3. వికీపీడియాకు సంబంధించి బాధ్యత వహించే వర్గాలు రెండున్నై.. వికీపీడియాను స్థాపించి, దానికవసరమైన సాధన సంపత్తిని చేకూర్చి నిర్వహిస్తున్న సంస్థ ఒకటి, వికీపీడియాలో అనేకానేక వ్యాసాలను రాసి దాన్ని ఇక్కడి దాకా తీసుకు వచ్చిన వేలాది వాడుకరుల కృషి రెండోది. గతంలో రాసి మానేసిన వాడుకరులు, మనమూ, కశ్యప్ గారితో సహా, అందరూ ఈ రెండో దానిలో భాగమే. ఐఐఐటీ గానీ, మరొక సంస్థ గానీ, ఎవరైనా వ్యక్తి గానీ (నేను గానీ, నువ్వు గానీ, మరెవరైనా గానీ) వికీపీడియాను వాడుకుంటూంటే, ఫౌండేషను కృషి ఫలితాన్నీ, మనందరి కృషి ఫలితాన్నీ వాడుకుంటున్నట్లే. వికీపీడియా పేరు వాడుకుంటూ ఎవరైనా ఏ పనైనా చేస్తూ ఉంటే అది వికీ విధానాలకు అనుగుణంగా, వికీ పద్ధతుల్లోనే చెయ్యడం వారిబాధ్యత.
__చదువరి (చర్చరచనలు) 02:34, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గరనుండి వీకీపీడియన్ లతో , ఇంకా రచ్చబండలో సభ్యుల దృష్టికి నవంబరు 2019 నుండి తెస్తూనే ఉన్నాము వికీపీడియా చర్చ:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన ఈ సమావేశాలలో పవన్ సంతోష్, వాడుకరి:Chaduvari, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Veeven వంటివారు పాల్గొని వారి విలువైన సమయం కేటాయించారు , ఇంకా ప్రాజెక్టు పురోగతికి తగుసూచలను చేశారు కూడా , వారికి ధన్యవాదముల, తెలుగువికీ సదస్సు 2020 గురించి ప్రాజెక్టు పేజీలో పెట్టివున్నాన ,ఇక హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2019 నిర్వాహణ ఖర్చులు తెలంగాణా ప్రభుత్వ ఆదర్వ్యంలో లో జరిగాయి వారి Pranayraj Vangari నుండి నివేదిక అడిగాము , ఇది కూడా పాజెక్టు పేజీలో నివేదిస్తాము . వెబ్ సైటు , వారి లోగో వారి పాలసీ ప్రకారం [ఐఐఐటి హై 1] ఉపయోగిస్తున్నాం ఇంకా వికీపీడియా లో oauth authorization in wikipedia నుండి ఇండిక్ వికీ సాండ్ బాక్స్ లో వాడేందుకు అనుమతి కూడా పొంది ఉన్నాము[ఐఐఐటి హై 2] . భారతదేశం నుండి గుర్తింపు పొందిన Wikimedia India - India చాఫ్టర్ ఇప్పడు derecognized[ఐఐఐటి హై 3] అవటం వలన, ఇక indiwiki ప్రాజెక్టు గురించి WMF వారితో ఇతర భాగస్వామ్య సంస్థల తో కలసి సంప్రదింపులు జరుపుతున్నాము. వికీమీడియా ప్రాజెక్టుల్లో బయటి సంస్థలు పనిచేయడం ఎలా" అన్నదానిపై ఒక పూర్తిస్థాయి శిక్షణా కార్యక్రమం తప్పకుండా చేయాల్సినది ఒక్కసారి తేదీలు ఖారారు అయిన తరువాత సముదాయ సభ్యులకు తెలియచేస్తాను, నెనర్లు -- Newwikiwave (చర్చ) 04:36, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Newwikiwave గారు... బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నివేదిక పూర్తిచేసి, తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా ప్రతినిధులుగా నరేందర్ గారు, నేను ఆ నివేదికను మీ పరిశీలనుకు పంపి దాదాపు 25 రోజులు అవుతుంది. దానిమీద మీరు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు. అదీకాకుండా, తెవికీ స్టాల్ నివేదిక కోసం ప్రాజెక్టు పేజీలో ఒక ఉపపేజి పెట్టి, ఆ నివేదికలో ఉన్నది అక్కడి రాయండి, ఎవైనా మార్పులు ఉంటే తరువాత చేద్దాం అని ఫిబ్రవరి 12వ తేదీన కో ఆర్డినేటరు, సీనియర్ తెలుగు వికీపీడియన్ Kasyap గారికి చెప్పాను. ఫిబ్రవరి 21న ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు నిర్వహకులు @Dollyrajupslp: విభా గారికి చెప్పాను. చేస్తామన్నారు కానీ ఇంతవరకు అది జరగలేదు. ప్రాజెక్టు పేజీలో ఉపపేజి పెట్టి నివేదికను అక్కడ పెట్టడమే మిగిలివుంది. పరిశీలించగలరు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:20, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari గారు చెపుతున్న నివేదిక గురించి నాకు సమాచారం రాలేదు,@Dollyrajupslp: ;లేదా కశ్యప్ ఈమెయిలు కు కూడా రాలేదు దీని విషయం మీద ఈ ప్రణయ్ గారితో మాట్లాడాను,వారు ఈ రోజు 17:30 కి గూగుల్ డాక్ ను కశ్యప్ మెయిల్ లో షేర్ చేశారు,దాని ఆధారంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ( డిసెంబర్ 23 2019 నుండి 1 జనవరి 2020 వరకు లో తెలుగు వికీపీడియా స్టాల్ ఏర్పాటు నిర్వహణ పై నివేదికను వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు/హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్ ఇక్కడ పంచుకొంటున్నాను . @Pranayraj1985: గారూ ఏమైనా మార్పులు,చేర్పులు ఉంటే పంచుకోగలరు.నెనర్లు -- Newwikiwave (చర్చ) 13:20, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిబ్రవరి 8న జరిగిన సదస్సులో నరేందర్ గారు ప్రాజెక్టు లీడ్ చేస్తున్న వాసుదేవ వర్మగారికి నివేదిక హార్డ్ కాపీ అందిచడంతోపాటు, నివేదక పిడిఎఫ్ ను వాట్సప్ ద్వారా పంపించి ఏదైన మార్పులు ఉంటే సూచించమని అడిగారట. కానీ, ఎలాంటి ఫీడ్‌బ్యాక్ రాలేదు. నివేదిక కోసం పేజీ పెట్టండి అని నేను గత కొన్ని రోజులుగా కశ్యప్ గారిని, విభా గారిని అడుగుతున్నప్పుడన్నా నివేదక రాలేదన్న సంగతి నా దృష్టికి తేలేదు. నన్ను అడిగినా నేను పంపించేవాడిని. ఇదంతా కమ్యూనికేషన్ లోపం వల్ల వచ్చిన చిక్కు. మున్ముందు ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడుదాం. పేజీలో నేను తగిన మార్పులు చేస్తాను. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:37, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విభాగంలో చూపిన మూలాలు

[మార్చు]
  1. "Trademark policy - Wikimedia Foundation Governance Wiki". foundation.wikimedia.org. Retrieved 2020-03-01.
  2. "List OAuth applications - Meta". meta.wikimedia.org. Retrieved 2020-03-01.
  3. "Wikimedia chapters - Meta". meta.wikimedia.org (in ఇంగ్లీష్). Retrieved 2020-03-01.

"మరియు" వడపోత

[మార్చు]

అందరికీ నమస్కారం. "మరియు" పదం కలిగి ఉండే వ్యాసాలను అనువాద పరికరం నుండి ప్రచురించడాన్ని నిరాకరించే వడపోతను సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9 న సృష్టించిన ఈ వడపోత ఇప్పటి వరకు (5 పరీక్షలు పోను) 6 పేజీల్లో, 25 సార్లు పని చేసింది.

ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ పేజీని ప్రచురించేందుకు 12 సార్లు ప్రయత్నించారు. మరో పేజీని 5 సార్లు, రెండు పేజీలను 3 సార్లు, రెండింటిని ఒక్కొక్కసారి ప్రచురించేందుకు ప్రయత్నించారు. వడపోత ఆ ప్రయత్నాలన్నిటినీ అడ్డుకుంది. వీటిలో రెండు పేజీలను సరిచేసేందుకు ప్రయత్నించకుండా వదిలేసారు. మిగతా వాటిలో ఒకదాన్ని (టెస్లా,ఇంక్) సరిచెయ్యకుండా, అనువాద పరికరం నుండి యాంత్రికానువాదాన్ని కాపీ చేసి తెవికీలో పేస్టు చేసి ప్రచురించినట్లుగా తెలుస్తోంది. (ఆ కృతక వాక్యాలు, "మరియు"లు, అనువాద దోషాలూ.. అన్నీ అలాగే ఉన్నాయి.) కింది పరిశీలనలను గమనించగలరు:

  • టెస్లా,ఇంక్ వ్యాసంలో 18 "మరియు" లున్నాయి.
    • వ్యాసంలోని ఒక వాక్యం: "2003 లో GM తన అన్ని EV1 ఎలక్ట్రిక్ కార్లను గుర్తుచేసుకుని, వాటిని నాశనం చేసిన తరువాత సంస్థను ప్రారంభించడానికి వ్యవస్థాపకులు ప్రభావితమయ్యారు, మరియు అధిక పనితీరు మరియు తక్కువ మైలేజ్ మధ్య సాధారణ సహసంబంధాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశంగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ కార్ల యొక్క అధిక సామర్థ్యాన్ని చూడటం." వాక్యం లోని కృతకత్వాన్ని ఎలాగూ చూస్తారు. ఇక్కడ "గుర్తుచేసుకుని" అనే పదాన్ని చూడండి. ఈ పదం అనువాదం పరమ తప్పు అని మూలం లోని పదం చూస్తే (రికాల్ - సమస్యలున్న కార్లను వెనక్కి తెప్పించుకుని వాటిని నాశనం చేసారంట, ఆ కంపెనీ వారు. దానికి గుర్తుచేసుకుని అని అనువదించారు) ఎవరికైనా అర్థం అవుతుంది. యాంత్రిక అనువాదం ఎలా ఉందో పరిశీలించేందుకు వాడుకరి ఆసక్తి చూపినట్లు అనిపించడం లేదు.
    • మరొక వాక్యం: "టెస్లా యొక్క మూడవ రౌండ్లో గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ & లారీ పేజ్, మాజీ ఈబే ప్రెసిడెంట్ జెఫ్ స్కోల్, హయత్ వారసుడు నిక్ ప్రిట్జ్‌కేర్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల నుండి పెట్టుబడులు ఉన్నాయి మరియు జెసి మోర్గాన్ చేజ్ చేత నిర్వహించబడుతున్న విసి సంస్థలైన డ్రేపర్ ఫిషర్ జుర్వెట్సన్, మకర నిర్వహణ మరియు ది బే ఏరియా ఈక్విటీ ఫండ్‌ను చేర్చారు." "మకర నిర్వహణ" అనే పదాన్ని గమనించండి. కాప్రికార్న్ మేనేజ్‌మెంట్ అనే సంస్థ పేరును యంత్రం అలా తెలుగు లోకి అనువదించి పారేస్తే, దాన్ని ఈ వాడుకరి కాపీ చేసి తెవికీలో పేస్టు చేసి పారేసారు.
  • ఇక, ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ ను ప్రచురించడానికి ప్రయత్నించినపుడు 12 సార్లు విఫలమైంది. అప్పుడు "మరియు" స్థానంలో "ఇంకా" పెట్టేసి (ఫైండ్ రీప్లేస్ కొట్టేసి ఉంటారు, బహుశా) ప్రచురించేసారు. అంతేగానీ, భాషను సవరించుదామని గానీ, నాణ్యమైన పని చేద్దామని గానీ అనుకున్నట్లుగా కనిపించడంలేదు. ఆ వ్యాసంలోని కొన్ని వాక్యాలు:
    1. మాస్ట్రో I సాఫ్ట్‌లాబ్ మ్యూనిచ్ నుండి ఉత్పత్తి ,సాఫ్ట్‌వేర్ కోసం ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ .
    2. మాస్ట్రో 1970 ,1980 లలో ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిస్సందేహంగా ఉన్నారు. (మాస్ట్రో అంటే మనిషా ఏంటి అని సందేహం వచ్చింది, ఇది చదివాక. ఇంగ్లీషు వ్యాసం చూసి, అది ఒక సాఫ్టువేరు అప్లికేషనేనని ధృవపరచుకున్నాను)

పై ఉదాహరణలు చూపించడంలో నా ఉద్దేశం..

  • వడపోత పెడితే, భాషను సరిచెయ్యడం మానేసి, వడపోతను ఎలా తప్పించాలో చూస్తున్నారని
  • ఈ వ్యాసాలను సరి చేసేందుకు/తొలగించేందుకు మనం ఎంతో సమయాన్ని ఖర్చు చేస్తున్నామని
  • వ్యాసాలను తీసేస్తాం, కానీ ఆయా వ్యాసకర్తలతో ఎలా వ్యవహరించాలో ఆలోచించమని

సముదాయంలోని వాడుకరులందరి దృష్టికీ తెస్తున్నాను. వికీపీడియా పట్ల సీరియస్‌నెస్‌ లేని అలాంటి వాడుకరుల విషయంలో మన చర్యలు ఎలా ఉండాలో అభిప్రాయాలు రాయండి. దాన్ని బట్టి నిర్ణయించుకుందాం. మీమీ స్పందనల కోసం ఎదురు చూస్తూంటాను. __చదువరి (చర్చరచనలు) 15:34, 15 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

భాష విషయంలో మనం కోరుకుంటున్న నాణ్యత తెవికీకి ఎంత విలువైనదో, ఏదో ఒక విధంగా వ్యాసం ఉండాలి అనే భావనతో రాసే వాడుకరులకు తెలుసుకునే దాకా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. రవిచంద్ర (చర్చ) 18:20, 15 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
భాష విషయంలో చదువరి గారు తెలిపిన ఆవేదన చూస్తుంటే, వ్యక్తిగతంగా మనకు ఎవరికైనా నష్టంవాటిల్లినప్పుడు పడే భాధకన్నా ఎక్కువ భాధతో వ్యక్తీకరించినట్లుగా అనిపిస్తుంది.తెలుగు భాష, వికీపీడియా మీద ఉండే అభిమానం అలాంటింది.ఆంగ్లభాష నుండి పై రెండు పద్దతులలో మూడు,లేక అంతకంటే ఎక్కువసార్లు ప్రచురించేటప్పుడు/ప్రయత్నించేటప్పుడు ఆ వాడుకరి స్వయంప్రవర్తక క్రియ (ఆటోమాటిక్) ద్వారా నిరోధానికి గురిఅయ్యే సదుపాయానికి అవకాశం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 14:39, 17 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు ఇలా "మరియు" ను "ఇంకా"గా మర్చి వ్రాయడం అతి సులభం కదా, వ్యాసం అనువదించాక ఫైండ్ రీప్లెస్ చేస్తే అయిపోతుంది. మనం వడపోతకు ఏ పదాన్ని తీసుకున్నా భవిష్యత్తులో వాళ్ళు అదే చేస్తారు. నా సూచనలు 1, కొత్త వ్యాసాలపై ఒక కన్నేసి అలా ప్రచురించిన వ్యాసకర్తలను ఆటొమెటిగ్గా బ్లాక్ చేయడాం కంటే, వివరణతో నాలుగైదు నెలలు బ్లాక్ చేయడం 2, శ్రమ అయినా కూడా కొందరు వాడుకరులు ఇలాంటి వ్యాసాలను తొలగిస్తూ పోవడం. 3, ఇప్పటి నుండి రాయబడే అన్ని కొత్తవ్యాసాలను ఒక కేటగిరీకి తగిలించడం.. ..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 06:27, 18 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మాతృభాష దినోత్సవం సందర్భంగా Edit-a-Thon

[మార్చు]

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు ఈ సందర్భంగా తెలుగు వికీపీడియన్లలు అయిన మనమంతా ఆ రోజున 21 ఫిబ్రవరి 2020 న ఇరవై నాలుగు గంటల {శివరాత్రి జాగరణ} లేదా మూడు రోజుల ఎడిట్ థాన్ నిర్వహించుకోంటే బాగుంటుంది అని నా ఆలోచన. దయచేసి సూచనలు , సలహాలు ఇవ్వగలరు Kasyap (చర్చ) 11:06, 17 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఎడిటథాన్ లో రాసిన వ్యాసాలు

[మార్చు]
__చదువరి (చర్చరచనలు) 07:19, 22 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ క్రింది వ్యాసాలు సృష్టించాను.

ఈ క్రింది వ్యాసాలు అభివృద్ధి చేశాను.

--స్వరలాసిక (చర్చ) 06:49, 23 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Overviewకు సరైన తెలుగు పదం సూచించండి

[మార్చు]

విశ్వభారతి విశ్వవిద్యాలయం వ్యాసం ఆంగ్లం నుండి తెలుగుకు అనువాదం చేసే క్రమంలో Overview అనే హెడ్డింగ్‌ను తెలుగులోని అనువదించాల్సి వచ్చింది. ఈ పదానికి స్థూలదృష్టి, పైపై పరిశీలన, సమీక్ష అనే అర్థాలు నిఘంటువు సూచిస్తున్నాయి. ఐతే ఈ పదాలేవీ ఈ వ్యాసంలో Overview అనే హెడ్డింగుకు న్యాయం చేకూర్చవని నా భావన. దయచేసి ఎవరైనా సరైన తెలుగు పదం సూచించగలరు. --స్వరలాసిక (చర్చ) 05:42, 23 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవలోకనం.__చదువరి (చర్చరచనలు) 05:54, 23 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ధన్యవాదాలు.--స్వరలాసిక (చర్చ) 06:39, 23 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం కోరబడిన వ్యాసాలు పరిస్థితిపై పరిశీలన

[మార్చు]

గౌరవ వికీపీడియన్లు అందరికి నమస్కారం. అనువాదము కోరబడిన పేజీలు వర్గంలో ఈ రోజుకు 197 పేజీలు ఉన్నవి.వాటిలో వికీపీడియా నిర్వహణకు సంబందించినవి 70 పేజీలుకాగా, మిగిలిన 127 పేజీలు మొదటి పేరుబరిలో సృష్టించిన వ్యాసాలకు చెందినవి. ఇవి సుమారు 10 సంవత్సరంల క్రిందట నుండి సృష్టించబడి ఇప్పటివరకు అలాగే ఉన్నవి.ఈ వ్యాసాలలో కొన్ని10% నుండి 50% వరకు, కొన్ని 50% నుండి 90% వరకు పైబడి ఆంగ్ల భాషలోనే ఉన్నవి.కొన్ని దాదాపు పూర్తిగా అనువదించినప్పటికీ వివిధ మూసలు తగిలించి అసంపూర్తిగా ఉన్నవి.ఈ వ్యాసాలలో చురుకైన గౌరవ వికీపీడియన్లు, నిర్వాహకులు సృష్టించిన వ్యాసాలు సుమారు 75 ఉండగా, మిగిలిన వ్యాసాలు ఇతర వికీపీడియన్లు సృష్టించిన వ్యాసాలు. ఒకసారి అనువాదము కోరబడిన పేజీలు వర్గంలోని వ్యాసాలు ఎవరికి వారు తాము సృష్టించిన వ్యాసాలు పరిశీలించి వాటికి అనువాదము కోరబడిన పేజీలు వర్గం నుండి తప్పించవలసినదిగా గౌరవ వికీపీడియన్లును కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:20, 24 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, పై పేజీల్లో నేను సృష్టించిన వాటిని పరిశీలించి అనువాదం చెయ్యడానికో, ఇంగ్లీషులో ఉన్నదాన్ని తీసెయ్యడానికో ప్రయత్నిస్తాను. రెండు రోజుల్లో నేనాపని చెయ్యకపోతే, ఆయా పేజీలపై మీ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి. అంతేకాదు, 75% కంటే ఎక్కువ ఇంగ్లీషు ఉంటే ఆ పేజీని తొలగించేసెయ్యండి. తొలగించేందుకు ప్రతిపాదన, చర్చ ఇలాంటివి చెయ్యనక్కర్లేదు. నేరుగా తొలగించెయ్యండి. నాకు చెప్పనక్కర్లేదు, నన్ను అడగనే అక్కర్లేదు. ఇదంతా ప్రధాన పేరుబరి లోని వాటికే, నేను సృష్టించిన వాటికే. వికీపీడియా, మూస పేరుబరిలో ఉన్నవాటిని - ఎవరు రాసినవైనా సరే - ఏమీ చెయ్యకండి, అలాగే ఉండనివ్వండి, నష్టమేమీ లేదు. కొన్నైతే లేకపోతేనే నష్టం.
మీరు వికీని మెరుగుపరచడంపైన, నిర్వహణ పనులపైనా చాలా శ్రద్ధ పెడుతున్నారు సార్, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 00:50, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వర్గంలో అనువాదం కాబడి మూసను తొలగించని వ్యాసాలు కూడా ఉన్నాయి. కొన్నింటిలో మూసను తొలగించాను. కొన్ని వ్యాసాలు 100% అనువాదం కాకుండా ఉన్నాయి. అటువంటి వ్యాసాలను తొలగించవచ్చు. చురుకైన వికీపీడియన్లు, నిర్వాహకులు సృష్టించిన వ్యాసాల అనువాదం గూర్చి వారి చర్చా పేజీలో ముందుగా తెలియజేయండి. కొన్ని వ్యాసాలు 50% అనువాదం కాబడినవి. అందులో అనువాదం కాని భాగాన్ని "హైడ్" చేస్తే సరిపోతుంది. వాటిని తొలగించనవసరంలేదు. అనువాదం మూసను ఉంచి చాలాకాలం అయినందున ఆ వ్యాసాల అభివృద్దిని మరచిపోయినందున నేను సృష్టించిన, విస్తరిస్తున్న అనువాద వ్యాసాలను దయచేసి తొలగించకండి. నాకు చర్చాపేజీలో తెలియజేయండి. నేను అనువదిస్తాను. --కె.వెంకటరమణచర్చ 01:47, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాదం కోరబడిన వ్యాసాలు పరిస్థితిపై చర్చను ప్రారంభించినందుకు యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. ఏయే వాడుకరి ఏయే వ్యాసాలు సృష్టించారో తెలియడంకోసం అనువాదం కోరబడిన వ్యాసాల జాబితా పేజి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:31, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారి సూచన మేరకు వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన వ్యాసాలలో అనువదించవలసిన వ్యాసాల గణాంకాలు పేజీని తయారు చేసాను.@వెంకటరమణ @సుజాత @స్వరలాసిక గారలు ఇప్పటికే స్పందించి తగిన చర్యలు చేపట్టుచున్నందుకు ధన్యవాదాలు.ఇంకా స్పందించవలసిన గౌరవ వాడుకరులు ఒక వారం రోజులలోపు పరిశీలించి ఆ వ్యాసాలకు అనువాదము కోరబడిన పేజీలు వర్గం నుండి విముక్తికి (తప్పించగలందులకు) తగిన చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నాను. నిర్వహకుని భాధ్యతలు నెరెవేర్చటంలో భాగంగా మీ దృష్టికితీసుకొని రావటం జరిగింది. ఇందులో ఎవరిని ఎత్తి చూపటానికి మాత్రంకాదని సవినయంగా తెలుపు చున్నాను.పెద్ద మనసుతో అర్థం చేసుకొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:43, 3 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Additional interface for edit conflicts on talk pages

[మార్చు]

Sorry, for writing this text in English. If you could help to translate it, it would be appreciated.

You might know the new interface for edit conflicts (currently a beta feature). Now, Wikimedia Germany is designing an additional interface to solve edit conflicts on talk pages. This interface is shown to you when you write on a discussion page and another person writes a discussion post in the same line and saves it before you do. With this additional editing conflict interface you can adjust the order of the comments and edit your comment. We are inviting everyone to have a look at the planned feature. Let us know what you think on our central feedback page! -- For the Technical Wishes Team: Max Klemm (WMDE) 14:15, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మనమసలు చర్చల్లో పాల్గొనమని, చర్చ పేజీల్లో దిద్దుబాటు ఘర్షణలు వచ్చే అవకాశం దాదాపుగా లేదనీ పాపం పై పెద్దమనిషికి తెలియదు. __చదువరి (చర్చరచనలు) 02:47, 1 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]