Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 18

వికీపీడియా నుండి

పాత చర్చ 17 | పాత చర్చ 18 | పాత చర్చ 19

alt text=2013 ఫిబ్రవరి 3 - 2013 మార్చి 3 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 ఫిబ్రవరి 3 - 2013 మార్చి 3

"imperial units" కు సరైన తెలుగు పేరు

[మార్చు]

తెవికీ సహోదరులకు నమస్కారం.
గణీత శాస్త్రంలో వివిధ ప్రమాణాలను విస్తరించదలిచితిని. "imperial units" కు సరియైన తెలుగు పేరు సూచించగలరు.( కె.వి.రమణ- చర్చ 01:46, 3 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తెలుగు అకాడమీ వారి భౌతిక శాస్త్ర పారిభాషిక పదకోశంలో చూడండి. ప్రస్తుతానికి రాచరిక కొలమానము అని వాడితే బాగుంటుందేమో. అన్నట్లు ఇటువంటి సందేహాలను వికీపీడియా:సహాయ_కేంద్రం వాడడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 09:36, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గణితశాస్త్రానికి రాచరికానికి సంబంధం ఏమిటో? కేవలం పదాలను బట్టి దాని అర్థం చెప్పలేము, సందర్భం బట్టి అర్థం మారవచ్చు. పై వాటి అర్థం అధికారిక కొలమానం అయి ఉండవచ్చు. అయిననూ సందర్భం, వాక్యం, పేరా, ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేవి లేనిదే సరిగ్గా అనువదించడం అన్ని సందర్భాలలొ కుదరదు. 106.66.81.73 14:37, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది

[మార్చు]

గమనిక: తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది పేజీలో వ్రాసిన విషయాన్ని ఇక్కడకు తరలించాను. — వీవెన్ (చర్చ) 03:57, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారం ఉన్న వ్యాసాలను నిర్వాహకులు తొలగించినప్పుడు ఆ సమాచారం ఎక్కడకు చేరుతుంది. వాటి లింకులను మరికొన్ని వివరాలను తెలియజేయగలరు. ఈ వ్యాసంపు చర్చా పేజీలో వ్రాయగలరు. తొలగించిన సమాచారం తెలుసుకోవడం నాకు కష్టంగా ఉంది మీరు తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 17:45, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించిన సమాచారం డాటాబేసులో ఉంటుంది. దాన్ని నిర్వహాకులు చూడగలరు. అవసరమైతే పునఃస్థాపితం చెయ్యగలరు కూడా. — వీవెన్ (చర్చ) 04:01, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారి వ్యాసాల్ని వేటినీ నేను పూర్తిగా తొలగించలేదు. వాటిలోని సమాచారాన్ని మరొక వ్యాసంలో విలీనం చేశాను. మీరు చేర్చిన సమాచారం భద్రంగానే ఉన్నదని గమనించండి.Rajasekhar1961 (చర్చ) 08:41, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సోము గారు ఉద్ధేశ పూర్వకంగా నేను ప్రారంభించిన వ్యాసాలను మాత్రమే విలీనం చేయమని, తొలగించమని కోరుతున్నారు, సోము గారు కోరిన వెంటనే కొంపలు మునిగిపోతున్నట్టు నిర్వాహకులు వెను వెంటనే విలీనం చేయడం, తొలగించడం చేస్తున్నారు, వికీపీడియా తొలగింపు విధానాన్ని తెలపగలరు, ఇంతకు ముందు నేను ప్రారంభించిన వ్యాసాలు ఎవరి పేరుతో ఎక్కడకి తరలిపోయాయో, ఇంకెవరి పేరుకి తరలిపోతాయో తెలియటం లేదు, ఒకరు ప్రారంభించిన వ్యాసాన్ని అదే సమాచారంతో నిర్వాహకులు కొత్త పేజి సృష్టించి ఆ సమాచారాన్ని అందులోకి మార్చుకొన్న తరువాత ఆ వ్యాసాన్ని తొలగించవచ్చా. వికీపీడియాలో సోము గారికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేయగలరు. ఇంకా ఎన్నో సందేహలు... YVSREDDY (చర్చ) 12:04, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి గార్కి,

నేను విషయ ప్రాదాన్యతను పరిశీలించి తొలగింపు, విలీనం ప్రతిపాదనలు చేస్తున్నాను. నేను ఏక వాక్య వ్యాసాల వ్యతిరేకినని గమనించాలి. వ్యవసాయ పంచాంగం ఉండగా దానిలో 27 కార్తెలకు లఘు వ్యాసాలు అవసరమా! మీరు ఒక సంవత్సరం నుండి ఇప్పటివరకు విస్తరణకు కూడా గురి కాని ఏక వాక్య వ్యాసాలు, అర వాక్య వ్యాసాలు ఉండగా వాటిని వదిలి కొత్త వ్యాసాలపై దృష్టి పెట్టడం ఎందుకు. తెవికీ నాణ్యత గల వ్యాసాల భండాగారంగా ఉండటం మీకు ఇష్టం లేనట్లు ఉన్నది. తెవికీ లో ఫలానా తేదీ లోగా యిన్ని వ్యాసాలు చేర్చాలని నియమం ఏదైనా ఉంటే తెలుపగలరు. విక్షణరీ లో ఉండవలసిన అర్థాలు కూడా వ్యాసాలైతె తెవికీ ఎవరికి ఉపయోగపడుతుంది. ఇచ్చట వ్యాసాలు ఏ ఒక్కరి స్వంతం కాదని గమనించాలి. "నేను ప్రారంభించిన వ్యాసాలు" అంటున్నారు కాని "నేను విస్తరించిన వ్యాసాలు" అనే స్థితికి రండి. నేను ఉద్దేశపూర్వకంగా చేయటం లేదు. అన్ని వ్యాసాలను పరిశీలిస్తున్నాను. మీరు తెవికీని "కల్పవృక్షం"గా చూడాలనుకుంటున్నారా, లేదా విషయం లేని వ్యాసాలతో "విష వృక్షంగా" చూడాలనుకుంటున్నారా, మీ అభిప్రాయం ఈ రచ్చబండలో తెలియజేయండి.(Somu.balla (చర్చ) 12:19, 5 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఈ క్రింది వాటిలో నేను ప్రారంభించిన పేరు వేరు, అందులోని సమాచారం మరొక చోటకి విలీనం చేసిన తరువాత పేరు వేరు, ఉదాహరణకు రూపం నుంచి రూపముకు, ఆకారం నుంచి ఆకారము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..... YVSREDDY (చర్చ) 12:55, 5 ఫిబ్రవరి 2013 (UTC) (తేడాలు • చరితం) . . సమ్మె‎; 12:37 . . (+106)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . ఔషధ మొక్క‎; 12:37 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . ధర్మో రక్షతి రక్షితః‎; 12:35 . . (+124)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పుట్టిన రోజు‎; 12:34 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పుట్ట గొడుగు‎; 12:33 . . (+79)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . గృహవైద్యం‎; 12:32 . . (+26)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విస్తరణ గూర్చి అభ్యర్థన) (తేడాలు • చరితం) . . తులసి‎; 12:31 . . (+1)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎పురాణాలలో తులసి: ) (తేడాలు • చరితం) . . వైద్య నిపుణులు‎; 12:29 . . (+22)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వాడుకరి చర్చ:Rajasekhar1961‎; 12:28 . . (+493)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎వ్యాస విలీనం గూర్చి: ) (తేడాలు • చరితం) . . శెలవు‎; 12:23 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వికీపీడియా:రచ్చబండ‎; 12:19 . . (+2,677)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది: ) (తేడాలు • చరితం) . . ఆకారము‎; 12:10 . . (+9)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . రూపము‎; 12:09 . . (+9)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . అరంగేట్రం‎; 12:05 . . (+138)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . వికీపీడియా:రచ్చబండ‎; 12:04 . . (+1,758)‎ . . ‎YVSREDDY (చర్చ • రచనలు)‎ (→‎తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది: ) (తేడాలు • చరితం) . . చెక్క‎; 12:03 . . (+33)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . బెరడు‎; 12:02 . . (+92)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . మైనం‎; 12:01 . . (+89)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . మంజిష్ఠ‎; 11:59 . . (+73)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (అర వాక్యం వ్యాసం తొలగించు) (తేడాలు • చరితం) . . పూతకొమ్మ‎; 11:57 . . (+16)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పోతువెదురు‎; 11:55 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . కేసరము‎; 11:54 . . (+70)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . కామాక్షి‎; 11:53 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . తెల్లబూరుగ‎; 11:52 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . చర్చ:ఏనుగదంత‎; 11:51 . . (+298)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . చరణాలు‎; 11:50 . . (+44)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగించు) (తేడాలు • చరితం) . . అనుపల్లవి‎; 11:49 . . (+82)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . చర్చ:పల్లవి‎; 11:48 . . (+157)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పేము‎; 11:47 . . (+50)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . కనప‎; 11:46 . . (+26)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . గారచెట్టు‎; 11:45 . . (+160)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . శాస్త్రీయ నామం‎; 11:43 . . (+134)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వృక్షో రక్షతి రక్షితః‎; 11:42 . . (+132)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . డెంకాడ‎; 11:42 . . (-170)‎ . . ‎115.113.235.82 (చర్చ)‎ (→‎మండలంలోని పట్టణాలు: ) (తేడాలు • చరితం) . . గోరి‎; 11:41 . . (+6)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . గారడి‎; 11:40 . . (+36)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . ఖడ్గ యుద్ధం‎; 11:39 . . (+39)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . దూరదర్శిని‎; 11:36 . . (+167)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . భవిష్యత్తు‎; 11:34 . . (+1)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . భవిష్యత్తు‎; 11:34 . . (+14)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . వాడుకరి చర్చ:Rajasekhar1961‎; 11:30 . . (+1,097)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎వ్యాస విలీనం గూర్చి: కొత్త విభాగం)[ప్రత్యుత్తరం]

మీకు చేతనైతే మీరు సృష్టించిన వ్యాసాలను విస్తరించండి. ఒక వాక్యంతో ఆపకండి. మీకు చేతనైతే నేను చేసిన ప్రతిపాదనలపై చర్చించడి. అంతే గాని మీ స్వంత ఆస్థి పోతున్నట్లు ఎందుకింత బాధ పడిపోతున్నారు.ఒక వ్యాసానికి మీరు మాత్రమే వ్యాస కర్తగా ఉండాలనుకోవటం తెవికీ లో జరుగదు. ప్రతి వ్యాసం సమిష్టి కృషి అని గమనించాలి. మీకు అంత బాధ కలిగితే పై వ్యాసాలను విస్తరించు చూపండి. లేదా మీరొక స్వంత బ్లాగు పెట్టుకుని మీ యిష్టం వచ్చినట్లు రాసుకోండి. తెవికీ లో రాయాలంటే విషయ నాణ్యత గల వ్యాసాలు రాయండి. సహసభ్యులు సంతోషిస్తారు. మీరు విస్తరించకుండా ఎన్ని సార్లు మూసలు తొలగించినా అన్ని సార్లు తొలగింపు,విలీనం మూసలు ఉంచుతానని గమనించాలి.Somu.balla (చర్చ) 13:07, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక నిర్వాహకుడు ఏకపక్షంగానే చేస్తున్నారు అని చెప్పాలి. ఎవరో ఒకలు కొన్ని వ్యాసాలు తొలిగించు అని చెప్పిన వెంటనె ఒక నిర్వాహకుడు అవే వ్యాసాలు తొలిగించడం లేదా వేరే వాటిలో కలపడం తప్పు అని చెప్పాలి. కొందరి పైన విచక్షణతో చేయడం తప్పు అని చెప్పాలి. వికీలో వేలకొదిగా అతిచిన్న వ్యాసాలున్నాయి ఇది నిర్వాహకులు తెలుసుకొవాలి. అయినప్పటికి ఒక సభ్యుడు వ్యాసంలో తోలిగించు మూసలు పెట్టగా ఒకనిర్వాహకుడు అతని అనుకూలంగా ప్రవర్తించడం తప్పు అని చెప్పాలి. చర్చ ఇంకా జరుగుతున్నది అది కంప్లీట్ కాకుండానే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తించడం తప్పు అని చెప్పాలి. ఎవరైనా ఏమైనా రాయవచ్చు అందరూ పెద్దపెద్ద వ్యాసాలు రాయలేరు అని తెలుసుకోవాలి. ఒకేఓక్క వ్యాసం ఉంటే తొలిగించాలి కాని అంతకంటె ఎక్కువ వాక్యాలు ఉన్నా కూడా ఎందుకు తొలిగిస్తారు అని ఎవరు ఎందుకు చెప్పరు. చిన్న వ్యాసాలు నచ్చని వాల్లు వికి మొత్తం జల్లెడ పట్టి చిన్నవ్యాసాలు తొలించమనవలె కాని ఆ పని చేయలేరు. ఎందుకు. నిర్వాహకులు ఉదాసీనంగా ఉన్నందుకే ఇలా జరిగుతున్నది అని చెప్పాలి. బాగా తెలిసిన నిర్వాహకులు ఈ విశయం పట్టించుకొన నందున ఇలా జరుగుతుందని చెప్పాలి. ఒకనిర్వాహకుడు చిన్న వ్యాసాలు తొలిగిస్తే ఎప్పుడు తొలిగించాలి, అది చేర్చిన వెంటనా, విస్తరించనప్పుడా ఆలోచించమని చెప్పారు. మరి ఈ నిర్వాహకుడు ఎవరిని చెప్పకుండా తొలిగించడం , కల్పడం తప్పు అని చెప్పాలి. 49.14.93.100 14:54, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అనామక సభ్యులు చర్చా పేజీలో చేర్చిన విషయాలు పరిగణింపబడవు. మీరు మీ సభ్య నామముతో చర్చలలో పాల్గొనండి. తెవికీ సంరక్షణ చర్యలను స్వాగతించడి. మీరు బహువాక్య వ్యాసాలకు వ్యతిరేకిలా ఉన్నారు. ఏ సభ్యుడైనా విషయం లేని వ్యాసాల ల పట్ల చర్చించవచ్చు. తొలగింపు ప్రతిపాదనలు, విలీన ప్రతిపాదనలు చేయవచ్చు. నిర్వాహకులపై అభాండాలు వేయడం సభ్యులకు తగదు. "బొంగరాలు" , "బొంగరాల ఆట" లకు రెండు వ్యాసాలు అవసరమా! ఆ రెంటినీ కలిపి మహోన్నతంగా మంచి వ్యాసం తయారు చేస్తే అది తప్పు ఎలా అవుతుంది. దానిని ఎవరైనా స్వాగతించాలి. రెడ్డిగారు ఉక్రోషంతో మరల బొంగరాల ఆట అనే వ్యాసం ప్రారంభించటం సబబా! వికీలో వేలకొలది వ్యాసాలుండవచ్చు. అలా అని ఎవరూ పట్టించుకోకుండా వదిలివేయాలా! మనకి తారస పడిన తప్పులను నిర్వాహకుల దృష్టికి తీసుకునివెళ్ళటం తప్పా! తొలగింపు మూసలు, విలీనం మూసలు ఉంచినపుడు వాటిపై చర్చించమని రెడ్డి గారికి చెప్పండి. ఎవరైనను ఏమైలా వ్రాయవచ్చు అన్నారు. అలా తెవికీలో రాయకూడదు. అందుకు ఒక నియమావళి ఉంటుంది. మీ యిష్టం వచ్చినట్లు వ్రాసుకోవాలంటే మీరు స్వంత బ్లాగు పెట్టుకోవాలి. ఏమైనా రాసుకోవచ్చు అన్నారు. అంటే అశ్లీలత గూర్చి కూడా చేరుస్తారా! స్వంత ఫొటోలను చేరుస్తారా. చిత్రాలకు ఇచ్చే నామంలో స్వంత పేరును వినియోగిస్తారా.అందరూ పెద్దపెద్ద వ్యాసాలు వ్రాయలేరు అన్నారు. విషయం కొంతయినా ఉండాలి కదా! ఏక వాక్యం, అరవాక్యం, పావు వాక్యం తో వ్యాసాలు వ్రాస్తారా! మీకు వ్యాసం అంటే ఏమిటో తెలియనట్లుంది. చిన్న వ్యాసాలను జల్లెడ పట్టినా తొలగించలేరనే మీ వాదన వ్యర్థమైనది. మన పరిధిలో గల కొన్ని వ్యాసాలైనా నిర్వాహకుల కు తెలియజేయవలసిన భాద్యత తెవికీ సభ్యులకు లేదా? ఇలా చేస్తే కొన్ని సంవత్సరాలకైనా తెవికీ బాగుపడదా! ఉదాసీనంగా అన్నారు. నిర్వాహకులు చూసీ చూడనట్లు ఉంటే పరవాలేదా. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకుడు ఉదాసీనంగా ఉన్నట్లా. ఏ నిర్వాహకుడు పట్టించుకోక పోటే యిలా ఏక, అర, పావు వాక్య వ్యాసాల సంఖ్య మితి మీరిపోతుంది.కాని ఒక విషయం రచ్చబండలో ఏకవాక్య వ్యాసాల గూర్చి చర్చ జరిగినది కనుక వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలు, ఎప్పుడు తొలగించాలి. అనే నియమాలు ఓటింగ్ పెట్టడం మంచిది. కాని నిర్వాహకులను తప్పుపట్టడం అవివేకంSantu (చర్చ) 15:57, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అనామక వాడుకరుల అభిప్రాయాలు పరిగణించబడవు అన్న నియమమేదీ వికీపీడియాలో లేదు. గమనించండి. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే మెంబరు రకరకాల పేర్లతో వచ్చి రాస్తున్న దాన్ని నిర్వాహకులు ఎందుకు పట్టించుకొరు. దానిపై విచారన చేయాల. వ్యాసాలను తొలిగిస్తున్న నివాహకుడిది తప్పు. సభ్యుడుపై నిశెదం పెట్టడం తప్పు అని చెప్పాల. విచారణ చెసి ఒకే మెంబరు ఎక్కువ పెర్లతొ చర్చలు చెస్తె అతనిపై నిశేదం విధంచాల. మిగిత నిర్వహకులు ఎక్కడ పోయారు. 49.14.255.61 16:31, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే వ్యక్తి అని మీకు ఎలా తెలిసింది లేదా నేను ఎలా తెలుసుకోగలను? నిర్వాహకులు విధానాలకు తగినట్టు వారివారి వీలును బట్టీ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్న వాటిని చేయాలని నిర్వాహకులకు చెప్పనవసరం లేదు. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ, ఇలా అన్నింటినీ కలగట్టి చూసే బదులు, ఒక్కో వీలీన/తొలగింపు ప్రతిపాదనపై లేదా జరిగిన చర్యపై అదెందుకు కూడదో/చెయ్యాలో విషయపరంగా ఆయా చర్చా పేజీలలో చర్చించండి. వికీపీడియాకు ఇక్కడ సమాచారం చేరడం ముఖ్యం. అలానే సమిష్టి కృషి, వాడుకరుల మధ్య సహకారం, శాంతియుత చర్చలు ముఖ్యం. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)క్[ప్రత్యుత్తరం]

నిర్వహకునిది తప్పు అయితె అతనిపై చర్య తిసుకొవలె. ఒకరు తాన అంటె నిర్వహకుదు తందాన చెప్పదం నెరం. 27.97.94.41 13:07, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా దిద్దుబాట్లు చేస్తున్న సభ్యుడిపై నిషేధం వేయడం అనేది చాలా అరుదుగా చేయాలి, అదీ ముందస్తు హెచ్చరిక చేస్తూ. కేవలం నిర్వాహకులను విమర్శించినంతమాత్రనా వేటు వేయడం తగదు. రాజశేఖర్ గారు చురుకైన సభ్యుడికి కూడా ఎలాంటి హెచ్చరిక లేనిదే నిషేధం వేయడం తప్పు. 106.66.55.100 12:08, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]



వ్యవసాయ పంచాగం

[మార్చు]

వ్యవసాయ పంచాంగం వ్యాసం బాగుంది. కాని అందులోని సమాచారాన్ని మల్లీ 20 పైగా చిన్న వ్యాసాలుగా విభజించి రెడ్డిగారు పేజీలను తయారుచేశాను. వీటి గురించి సభ్యుల అభిప్రాయాల్ని తెలియజేస్తే మంచిది.Rajasekhar1961 (చర్చ) 07:55, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తి వ్యాసం 40 కిబైట్లకు లోపే వున్నప్పుడు దానిలోని విషయాలతో ‌‌చిన్న వ్యాసాలుగా విభజించడం అంత వుపయోగకరం కాదు. --అర్జున (చర్చ) 09:39, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యవసాయ పంచాంగం వ్యాసం లో రెడ్డిగారు వ్రాసిన 27 కార్తెలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందువలన దీనికి ఉప వ్యాసాలు అవసరం లేదని నా అభిప్రాయం. 27 కార్తెలలోని విషయాన్ని ఒకే వ్యాసంగా విలీనం చేస్తే విషయమంతా ఒకేదగ్గర లభిస్తుంది.( కె.వి.రమణ- చర్చ 12:59, 7 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కార్తె అనే మరొక వ్యాసం ఉన్నదని తెలిసింది. అలాగే ఆయా నక్షత్రాలకు వేర్వేరు వ్యాసాలున్నాయి. వీటిని ఎలా విలీనం చేస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:10, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కార్తె అనే వ్యాసం నందు కార్తెల లక్షణాలు ఉంటాయి. వ్యవసాయ పంచాంగం లో కార్తెల లో ఎలాంటి పంటలు వేయాలో ఉండాలి. అందువల్ల 27 కార్తెలలో పంటలకు సంబంధించిన వ్యాసాలను వ్యవసాయ పంచాంగం లో విలీనం చేస్తే బాగుంటుంది. Somu.balla (చర్చ) 10:12, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల మొలకల గురించి ...

[మార్చు]

గ్రామ వ్యాసాల గురించి సభ్యులు అడపా దడపా అక్కడా ఇక్కడా ఒక వాక్యం వ్యాసాలు, అనవసరం, తొలగించాలి అని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాల గురించి ఈ వ్యాసాలు చాలా అమూల్యమైనవి. ఒక్క వాక్యం ఉన్నా గానీ, ఈ గ్రామ వ్యాసాలను మిగతా ఒక్క వాక్య వ్యాసాలతో పోల్చకూడదు. రెండూ వేరు వేరు. గ్రామ వ్యాసాల మొలకలు తొలగించడం సమస్యకు సమాధానం కాదు. గ్రామ గ్రామాన వికీ కాంట్రిబ్యూటరును ఏర్పాటు చేసుకోవడం సమాధానం. కానీ కనుచూపు మేరలో ఆ లక్ష్యం దరిచేరేట్టు కనిపించడం లేదు. అప్పటి వరకు తొందరపడి ఈ గ్రామ వ్యాసాలు తొలగిస్తారేమో అని ఈ వ్యాఖ్య. అప్ కోర్స్ అంతిమ నిర్ణయం వికీ యాక్టివ్ సభ్యులదే అనుకోండి. Chavakiran (చర్చ) 16:51, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలానా జిల్లా ఫలానా మండలంలో ఫలానా గ్రామం ఉందని తెలియజేస్తే అది ఖచ్చితంగా వ్యాసమే. సంగ్రహంగా అది సమాచారమే. ఆ ఊరికి సంబంధించిన 'ప్రత్యేకతలు' తెలిసినవారు - ఆ విషయాన్ని జోడించేందుకు అవకాశం కల్పించడమే...! అందులో సందేహం లేదు...! ఏకవాక్య వ్యాసాలు ఎలా ఉంటున్నాయో చెప్పడం కోసమే - ఏవిధమైన సమాచారం లేకుండా 'డిక్షనరీ' పదాలతో వ్యాస సృష్టి జరుగుతోందని తెలియజేసే 'ఆతృత'లో - ఫలానా ఊరు ఫలానా జిల్లాలో ఉంద'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....! - అని పేర్కొనడం జరిగిందని గమనించ ప్రార్థన. ...Malladi kameswara rao (చర్చ) 08:30, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలను మొలకల కిందికి పరిగణించరాదని ఎన్నేళ్ళో క్రితం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏకవాక్య వ్యాసాలకు, గ్రామ వ్యాసాలకు సంబంధం లేదు. నిజమైన తెవికీ అభివృద్ధి కోసం పాటుపడేవారెవరూ గ్రామవ్యాసాల తొలిగింపుకు గాని దానికి వ్యతిరేకంగా గాని వ్యాఖ్యానించరు. 106.66.81.73 14:16, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలు మరియు ఏక వాక్య వ్యాసాలు మొలకలు విస్తరణ మరియు తొలగింపు గూర్చి ఇదివరకే చర్చ జరిగింది.వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత ప్రతిపాదనలు 4. అందులో గల చర్చల సారాంశాన్నిబట్టి కాసుబాబు గారు కొన్ని ప్రతిపాదనలు చేయటం జరిగింది.( కె.వి.రమణ- చర్చ 03:52, 14 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తెవికీలో మొలక వ్యాసాల నిర్థారణకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్నాయా? లేదా నిర్వాహకుల / సభ్యుల విచక్షణపై ఆయా వ్యాసాలు మొలకలుగా నిర్థారింపబడతాయా? ఎవరైనా సభ్యుల వద్ద సమాచారం ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:25, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటివరకైతే అలాంటి నిర్దేశిత ప్రమాణాలేవీ లేవండి ఖాదర్ గారు, మీరనుకుంటున్నట్లు అవి సభ్యుల విచక్షణపైనే ఆధారపడతాయి కాని ఒక్కో సభ్యునికి ఒక్కో రకమైన విచక్షణ ఉంది/ఉంటుంది. సాధారణంగా 2 కెబిలు అని చాలా సభ్యులన్నట్లు చర్చలలో నమోదైంది. మీరడిగే సమాచారం ఏమిటో అర్థం కాలేదు, పైన అడిగినదేనా? లేదా మొలకలను విస్తరించడానికి కావలసిన సమాచారమా? గ్రామవ్యాసాలను విస్తరించడానికి మాత్రం (మొత్తం 26వేల గ్రామాలకు సంబంధించి) నా వద్ద పూర్తి సమాచారం ఉంది. 106.77.116.28 15:09, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండి. నేను కొత్తగా వ్రాస్తున్న కొన్ని వ్యాసాల పరిమాణం 5000 కెబిల పైన ఉన్నప్పటికీ కొందరు సభ్యులు వాటిని మొలకలుగా పేర్కొనటం గమనించాను. వికీ ప్రమాణాలు పాటించినప్పటికీ ( మూసలు, లంకెలు , మూలాలు పేర్కొనడం) ఇలా జరగడం చూసి. ఇంకా ఏవైనా నిర్దేశిత ప్రమాణములు ఉన్నాయేమో అని అడిగాను. మరొక్కసారి ధన్యవాదములు. మీ పేరు తెలియకలోవడం వలన పేర్కొనడం కుదరలేదు. క్షంతవ్యడను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:59, 15 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం. చావా కిరణ్ గారి వ్యాఖ్య చదివాక గ్రామ వ్యాసాలను ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంటే నా మట్టి బుర్రకు కొన్ని చిన్న ఆలోచనలు తట్టాయి. 1) ప్రతి గ్రామానికి PIN Code ఆంత్రర్జాలంలో దొరుకుతుంది. దీనిని చేరిస్తే ఉపయుక్తంగా ఉంటుందేమో. 2) google maps ద్వారా ఆ గ్రామం ఎక్కడ వుంటుందో కొంత వరకు వ్రాయ వచ్చు. నేను చేసిన ప్రయోగం ఒకటి ఇది చిరతపూడి. మిత్రులు సలహాలిస్తారని ఆశిస్తున్నాను -- విష్ణు (చర్చ)16:33, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలకు చెందిన కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. ఉదా: పిన్ కోడ్ కు సంబంధించిన పోస్టల్ డిపార్ట్‍మెంట్; పాఠశాలకు చెందిన ప్రభుత్వ వెబ్ సైటు; భౌగోళిక విషయాలకు చెందినదొకటి, జనాభాకి సంబంధించినది ఒకటి; గ్రామీణ రోడ్లకు చెందిన సైటు; నీటిపారుదల శాఖవారి వెబ్ సైటు; రైల్వే వారి టైం టేబుల్; రోడ్డు రవాణా శాఖ వారిది ఇలా వాటికి గ్రామాల ప్రాజెక్టు కేంద్రంగా అందరికీ అందుబాటులోకి తెస్తే అందరూ కలిసి గ్రామాల వ్యాసాల్ని విస్తరించవచ్చును. అప్పుడు ఈ కార్యక్రమం; చర్చ అమలుకు నొచుకొంటుంది. ఈ మార్చి నెల మహిళలకు చెందిన వ్యాసాల విస్తరణకు కేటాయించాము కాబట్టి; ఏప్రిల్ నెల గ్రామాల అభివృద్ది కోసం నిర్దేశించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:23, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు మంచి సలహా ఇచ్చారు. మీరన్నట్టుగా దీనిని ఏప్రిల్ నెలలో చేపడదాం. ఇంతలో ఈ డేటా సమకూర్చడానికి ఒక చోట చేర్చడానికి నా వంతు ప్రయత్నిస్తాను విష్ణు (చర్చ) 07:56, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా సర్వసభ్య సమావేశం - ఒక ప్రతిపాదన

[మార్చు]

తెలుగు వికీపీడియా మరింతగా అభివృద్ధి చెందడానికి వీలుగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే బావుంటుందేమో అన్నది నా సూచన. ఈ సమావేశంలో తెవికీ రచనలు, రచనా వ్యాసాంగానికి సంబంధించి సమగ్ర చర్చతో బాటు, మెరుగైన సేవలందిస్తున్న వ్యాసకర్తలకు ఉత్సాహంగా ఉండేందుకు ప్రశంసా పత్రాలను (ప్రింటెడ్ సర్టిఫికెట్లు) అందిస్తే - కొత్త రచయితలు వికీకి చేరువ కాగలరన్నది నా సూచన. ఈ సమావేశం మన తెలుగువారి తొలి వెలుగైన ఉగాది రోజున తెలుగు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో జరిపితే బావుంటుంది. నిర్వాహకులతో ముఖాముఖీగా జరిగే ఇష్టాగోష్టి చాలారకాల అపోహలను, ఆభిప్రాయ బేధాలను తొలగించి, వికీ నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు దోహదకారి కాగలదని నా ఆభిప్రాయం. పరిశీలించవలసిందిగా నా విన్నపం. ...Malladi kameswara rao (చర్చ) 15:40, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లాదిగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నను. అయినా ఇది ఆచరణ సాధ్యమా అన్నది ఆలోచించతగిన విషయం. --t.sujatha (చర్చ) 03:05, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా మంచి ఆలోచన. మల్లాదివారు తలుచుకొంటే చేయగలరని నా నమ్మకం. ఇది వికీపీడియాలో కృషి చేస్తున్న సభ్యులకు వ్రాత పూర్వకంగా ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం (ఇప్పుడు మనం ఇస్తున్న చక్రాల కన్నా) చాలా బాగుంటాయి. మీడియాలో అందర్నీ ఆహ్వానించి వికీపీడియాకి వారి అవసరాన్ని, వారికి మన అవసరాన్ని తెలియజేస్తే ఇద్దరికీ ఉపయోగం. వికీపీడియా స్థాపన నుండి విశేష కృషి చేసిన వైజాసత్య వంటి ములస్తంభాల వంటి వారిని సన్మానిస్తే, వారిని మనం గుర్తించినవారమౌతామనిపిస్తుంది. దీనికి భారతీయ వికీమీడియా (బెంగుళూరు) వారి నుండి అనుమతి తీస్కొని, అవసరమైన నిధుల్ని సమకూర్చమని కోరవచ్చును. ఈ కార్యక్రమాన్ని ఉగాదినాడు నిర్వహించితే తెలుగుతనం వస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:27, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది ఒకళ్ళిద్దరు కలసి చేసేది కాదు. మనం అందరం కలసి తప్పకుండా చేద్దాం. సభ్యుల పూర్తి సహాయ సహకారాలు, సూచనలు సలహాలు ఉన్నప్పుడే ఇది విజయవంతం కాగలదు. ఇకపోతే... ఈ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నాము కాబట్టి... ముందుగా హైదరాబాద్ లోని వికీపీడియన్లు కలసి కూర్చుని మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. అందుకోసం సంప్రదిద్దామంటే మన సభ్యుల ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్ లు నాకు తెలియదు. కనుక నేను చేసుకోను విన్నపం ఏమిటంటే--- నా ఈ-మెయిల్ (malladikr@gmail.com)కు తెవికీలో తెలుగు వ్యాసాలు అందిస్తున్న పెద్దలు (ఒక్క హైదరాబాద్ లోనే మాత్రమే కాకుండా మన రాష్ట్రం లోనూ, దేశ విదేశాలలో ఉన్న తెవికీ సభ్యులు) తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు మెయిల్ చేసినట్లయితే అందరితో వ్యక్తిగతంగా సంప్రదించి, సూచనలు సలహాలు పొందవచ్చును. . కావున, గౌరవ సభ్యులు తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు ( పూర్తి చిరునామాతో సహా) మెయిల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కలసి వికీపీడియా సర్వసభ్య సమావేశం విజయవంతంగా నిర్వహించి తెవికీని మరింత బలోపేతం చేద్దాము. పెద్దల, నిర్వాహకుల, సభ్యుల సహకారంతో వికీపీడియా సర్వసభ్య సమావేశ విజయానికి నా వంతు కృషి నేను చేయగలను. సదా తెవికీ సేవలో... .... Malladi kameswara rao (చర్చ) 13:12, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే... గౌరవ సభ్యులు వికీపీడియా సర్వ సభ్య సమావేశ ప్రతిపాదనపై స్పందించి, తమ ఆలోచనలను, ఆకాంక్షలను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.... ...Malladi kameswara rao (చర్చ) 13:20, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఆలోచన ముందుకు పోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నది. కొందరు సభ్యుల ఈ-మెయిల్ మరియు ఫోను నంబర్లు వారి సభ్య పేజీలో ఉంటాయి. లేనివారివి వ్యక్తిగతంగా తీసుకోవలసివుంటుంది. నా నంబరు: 9246376622; e-mail: nationalpathlab@yahoo.co.in. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:51, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా నా విజ్ఞాపనకు స్పందించిన సుజాతగారు, విశ్వనాథ్ గారు, రాజశేఖర్ గార్లకు ధన్యవాదాలు. అభ్యంతరం లేనివారు తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు ( పూర్తి చిరునామాతో సహా) వివరాలను ఈ రచ్చబండలోనే చేర్చవచ్చు. తమ ఫోను తదితర వివరాలు బహిర్గతం కావడం సమ్మతం లేనివారు దయచేసి తమ వివరాలు నాకు మెయిల్ చేయ ప్రార్థన. మార్చి మూడవతేదీ ఆదివారం రోజున హైదరాబాద్ తెవికీ మిత్రులు కలసి - సర్వసభ్య సమావేశ నిర్వహణ, ఏర్పాట్లు తదితర వివరాలు చర్చించుకుంటే కార్యక్రమం వేగవంతం కావడానికి అవకాశం వుంటుంది. సమయం తక్కువగా వున్నందున త్వరితగతిన స్పందించవలసినదిగా కోరుకొనుచున్నాను. ...Malladi kameswara rao (చర్చ) 06:31, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాంతీయ వికీ సమావేశాలను ప్రోత్సహించడం భారతీయ వికీ సంఘానికి ఒక ప్రాధాన్యతగా వుండేది. క్రిందటి సంవత్సరాలలో వికీ జన్మదినాన్ని జరుపుకొని, వికీలోకృషిచేసిన వారిని చిన్నస్థాయిలో గుర్తించడం జరిగింది. ప్రతిపాదన ఫలించాలని కోరుతున్నాను. వికీకి సంబంధించి సాధ్యమైనంతవరకు చర్చలు పారదర్శకంగా జరుగుతాయి కాబట్టి ఈ ప్రతిపాదనకి సంబంధించి పేజీని (ఉదా: వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం సృష్టించి చర్చలను ఆ పేజీలోనే కొనసాగించడం మంచిది --అర్జున (చర్చ) 09:56, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికి నమస్కారం. మల్లాదిగారు మంచి ప్రతిపాదన చేశారు. అర్జునగారు సూచించిన విధంగా భారతీయ వికీ సంఘానికి ఈ ప్రతిపాదన తెలియజేస్తే బాగుంటుంది. అలాగే Access to Knowledge-CIS, బెంగుళూరు నుండి మేము ఏ విధంగానైనా తోడ్పటానికి సిద్ధంగా వున్నాము. నా ఇ-మెయిల్ vishnu@cis-india.org, మొబైల్-+౯౧౯౮౪౫౨౦౭౩౦౮. విష్ణు (చర్చ)Vishnu 15:12, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యత పెంచుటకు పనులు

[మార్చు]

వికీపీడియా నాణ్యతను పెంచటానికి అవసరమైన పనులను సంఖ్యాపరంగా తెలియచేసే పేజీ గణాంకాలు కాకుండా ఇంతవరకు చేయబడలేదు. దానిని నేను రెండు చోట్ల ప్రారంభించాను. వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు మరియు వికీపీడియా:సముదాయ_పందిరిలో చేయవలసిన పనుల జాబితాలో గణాంకాలు చేర్చడం. దీనిని విస్తరించి సభ్యులు తమసమయంలో కొంత భాగాన్ని నాణ్యతని పెంచడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 06:42, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ నిర్వహణ స్థితి

[మార్చు]

మొదటిపేజీ నిర్వహణ స్థితి మూసని ఈ పేజీలో పై భాగంలో చేర్చడమైనది. ఎర్ర లింకుల వారాలున్నప్పుడు, నాలుగైదు వారాల పైగా తెవికీలో మార్పులు చేసిన అనుభవంగల సభ్యులు ఆయా ఎర్రలింకుగల వారాలకి వ్యాసాలు,బొమ్మలు సిద్ధంచేసి నిర్వహణలో తోడ్పడమని మనవి. దీని నిర్వహణని కొంతకాలంపాటు ఎవరైనా చేపట్టితే మరీమంచిది. ----అర్జున (చర్చ) 12:39, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

PDF కింద దిగుమతించు తొలగించడానికి ప్రతిపాదన.

[మార్చు]

PDF కింద దిగుమతించు లింకు వ్యాసాలకు ఎడమపక్క పట్టీలో వస్తుంది. ఇది తొలగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

కారణం: అది తెలుగు భాషకు పనిచెయ్యడం లేదు. గుణింతాలు సరిగ్గా రెండర్ అవ్వడం లేదు. ఆ దోషం సరిఅయ్యేంతవరకూ ఈ లింకు ఎడమ పక్కపట్టీలో చూపడం తెవికీ క్వాలిటీ ఔట్ లుక్ ను హీనం చేస్తుంది. Chavakiran (చర్చ) 16:29, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదేశ వరసలు కలెక్షన్ ఎక్సటెన్షన్ వలన కనపడుతున్నాయి. పిడిఎఫ్ మునుజూపు పీడియాప్రెస్ వారి సైటులో సరిగానే కనబడుతున్నా ఇక్కడ లోపముంది.ఇంతకు ముందు ఈ విషయమై నేను వికీసాంకేతిక నిపుణులతో చర్చించాను, బగ్ రాశాను. ఈ ఎక్సెటెన్షన్ కి మార్పులు జరిపే వుద్దేశ్యములేదని ముందు కొత్త సాంకేతికాలతో పుస్తక సేకరణ చేయబడుతుందని తెలిపారు. అంతవరకు ఈ ఆదేశ వరుస కనబడకుండా చేయడం సమర్థనీయమే. --అర్జున (చర్చ) 01:41, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి మూస పరిధి విస్తరణ

[మార్చు]

{{సహాయం కావాలి}} ని ఏ చర్చాపేజీలోనైనా వాడేటట్లుగా మార్చాను. దీనికి సంబంధించిన గణాంకాలు, తద్వారా లింకులు సముదాయపందిరిలో చేతిలోవున్న పనులు రచ్చబండ మరియు సముదాయపందిరి లో ప్రత్యేక పెట్టెలలో కనబడతాయి. తెవికీలో క్రియాశీల సభ్యులు తక్కువ కాబట్టి, ఏ చర్చా పేజీలలో సహాయం అవసరమైనా అక్కడే ఈ మూసని వాడితే చర్చ సరియైన స్థానంలో వుంటుంది. అనుభవమున్న వికీ సభ్యుని చర్చా పేజీలో నేరుగా సంప్రదించవలసిన పనిలేదు. అందరు సభ్యులు సముదాయపందిరి గమనించితే బాగుంటుంది. ముందు ముందు అవసరమైతే దీని స్థితిని రచ్చబండను చేర్చవచ్చు గమనించితే బాగుంటుంది. ఈ చర్య తెవికీ అభివృద్ధికి దోహదపడ్తుందని భావిస్తాను. --అర్జున (చర్చ) 01:11, 11 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లోగో మార్పుకు ప్రతిపాదన

[మార్చు]

తెవికీ లోగో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. కొత్త ఖతులు వచ్చాక ఇంకా పాత ఖతులలో సరిగా ఆనటం లేదు. నేను ఒక కొత్త లోగో రూపొందించాను.

Wikipedia-logo-v2-te-changed font

దయచేసి సూచనలు తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:56, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లోగో పెద్దగా స్పష్టంగా ఉన్నది. పాతదాన్ని మార్చండి.Rajasekhar1961 (చర్చ) 06:19, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
"వి" అక్షరం చిన్నదిగా కనిపిస్తోంది, తొలి అక్షరం చిన్నగా ఉండడం బాగుగా అనిపించదు. "వికీపీడియా" మాత్రం పాతఖతే బాగుంది. రెండో వరస మారిస్తే ఫరవాలేదు. రాజశేఖర్ గారు చెప్పినట్లు ఈ లోగో పెద్దగా, స్పష్టంగా అని చెప్పడానికి వీలుండదు. తయారుచేసిన లోగో ఎంతపెద్దగా ఉన్నా ఆ స్థానంలో పెడితే ఇప్పుడున్న సైజులోనే ఉండి స్పష్టత తగ్గిపోవచ్చు. సైజు పెంచితే సైడ్ బార్ వెడల్పు పెరుగుతుంది, తద్వారా తక్కువ వెడల్పు గల కంప్యూటర్లలో ఎడిట్ బాక్సు పరిమాణం చాలా చిన్నది అయిపోతుంది. 106.66.81.73 14:04, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు దీన్ని "లోగో మార్పు"గా చెప్పలేము. ఎందుకంటే లోగోను మార్చే అధికారం తెవికీకి లేదు. ఇక్కడ మార్చేది లోగో కింది అక్షరాలు మాత్రమే. అలాంటప్పుడు లోగో స్పష్టంగా ఉంది అనే చెప్పే అవకాశమే లేదు, కాకుంటే కొత్త ఖతుల వల్ల అక్షరాలు మాత్రం స్పష్టంగా ఉండవచ్చు. 106.66.81.73 14:26, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోత్సాహం కావాలి

[మార్చు]

కొత్త సభ్యులకు, కొత్త వ్యాసాలకు ప్రోత్సాహమివ్వండి విశ్వనాధ్ గారు

[మార్చు]

బాదంపాలు వ్యాసం ఆంగ్లంలో ఉన్నందున నేను ఆ వ్యాసాన్ని ప్రారంభించాను, ఈ వ్యాసాన్ని నేను విస్తరణ చేస్తుంటే విశ్వనాథ్ గారు వ్యక్తిగత కారణాల వలన తొలగిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు అంటే ఈ క్రింది విషయాన్ని చదివితే మిగతా నిర్వాహకులకు, సభ్యులకు అర్థమవుతుంది.

చిత్రలేఖనం వ్యాసంలో మీరు వ్రాసిన సమాచారం ఒక లైన్ మాత్రమే - ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం చిత్రలేఖనం. ఈ కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని చిత్రకారులు అంటారు.

సమగ్ర చిత్రలేఖనం లో YVSREDDY వ్రాసిన సమాచారం ప్రస్తుతం నాలుగు లైన్ లు - చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి యూరప్ మరియు అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి మరియు ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.

చిత్ర రచన లో YVSREDDY వ్రాసిన సమాచారం ప్రస్తుతం నాలుగు లైన్ లు - ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. (ఫోటో లోని సమాచారం తో సహా) అయితే వీటిని నేను ఇంకా అభివృద్ధి పరుస్తున్న సమయంలో సమగ్ర చిత్రలేఖనం, చిత్రరచన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందని ఎలా తొలగిస్తావు - YVSREDDY (చర్చ) 22:16, 12 అక్టోబర్ 2012 (UTC)

ఎవరిని విమర్శించే ఉద్ధేశ్యం లేనప్పటికి నేను ప్రారంభించిన వ్యాసాలను రక్షించుకోవటానికి కారణాలు తెలియజేస్తున్నాను, మిగతా నిర్వాహకులు సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాను. మీ YVSREDDY (చర్చ) 08:52, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాసాలను అభివృద్ధి చెందే దాక, మీ సభ్యపేజీకి ఉపపేజీలుగా ప్రారంభించితే వాటిజోలికి వేరెవరూ వెళ్లరు. పరిశీలించండి. బాదంలో బాదం పాలు విలీనం గురించిన చర్చలో పాల్గొనండి. --అర్జున (చర్చ) 11:03, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో చర్చలు జరిగేటప్పుడు అవి వ్యక్తిగత అభిప్రాయాలకు కారణం కారాదు. తెవికీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక వ్యాసం పాఠకులకు అర్థమయ్యేటట్లు ఉండాలి. రెడ్డిగారు వ్రాసిన వ్యాసాలు సంగ్రహంగా ఉన్నప్పుడు అవి విలీనం చేస్తే తప్పు యేమిటి? విలీనం ప్రతిపాదనలు ఉన్నప్పుడు వాటిపై చర్చ జరగాలి. ఆపై నిర్వాహకులు ఏది సరియైనదైతే అదే చేస్తారు. కాని నిర్వాహకులపై వ్యక్తిగత దూషణలు చేయటం సరియైనది కాదు. ఇదివరకు రాజశేఖర్ గారిని కూడా యిలానే విమర్శిస్తున్నారు. మీ అభిప్రాయాలను తెలియజేయాలి కాని దూషణలు చేయకూడదు. పైన మీరు తెలియజేసిన వ్యాఖ్యలో విశ్వనాథ్ గారిని "సమగ్ర చిత్రలేఖనం, చిత్రరచన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందని ఎలా తొలగిస్తావు" అని వ్రాసారు. నిర్వాహకుల పైనా లేదా సహ సభ్యుల పైనా ఏకవచన ప్రయోగం చేస్తారా. ఇతరుల అభిప్రాయాలను, ఇతరులను గౌరవించాలని రెడ్డిగారు తెలుసుకోవాలి. మీరు సృష్టించిన బాదం,బాదం పాలు ల విలీనంపై చర్చలో పాల్గొనండి. లేదా మీరు సృష్టించిన వ్యాసాలు సరియైనవనిపిస్తే వాటిని విస్తరించండి.( కె.వి.రమణ- చర్చ 11:36, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తెవికీలో కోందరు నిర్వాహకులు, సభ్యులు అందరూ కలిసి ఒక చురుకైన సభ్యుడిపై దాడి చేయడం సమంజసం కాదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇప్పటికే సదరు సభ్యుడిపై అనాలోచితంగా ఒక నిర్వాహకుడు నిషేధం విధించాడు. అసలు తప్పు ఆ నిర్వాహకునిపైనే ఉంది. చర్చ జరుగుతున్నప్పుడే, అది పూర్తి కానిదే రెడ్డిగారు సృష్టించిన చాలా వ్యాసాలను ఇతర వ్యాసాలలో విలీనం చేయడమైనది. ఎలాంటి కారణం లేకుండా, చర్చ ఫలితం లేకుండా అలా విలీనం చేసిన వ్యాసాలను తిరిగి సృష్టించడాన్ని తప్పుపట్టే అవసరం లేదు. ఒకవేళ చిన్న వ్యాసాలను తొలిగింపు లేదా విలీనం చేయదలిస్తే తెవికీలో ఇప్పటికే వేలాది వ్యాసాలపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు. రాజశేఖర్ గారు సృష్టించిన వందల వ్యాసాలలో ఎటువంటి సమాచారం లేదు. అవి సృష్టించి రెండేళ్ళకు పైగా సమయం అయిననూ అవి ఎటువంటి పురోగతి లేకుండా అలానే ఉన్నాయి. మరి వాటి సంగటేంటీ? ఇక్కడ నిర్వాహకులకు ఒక న్యాయం, సభ్యులకు మరో న్యాయమా? చాలా రోజుల నుంచి ఉన్న చిన్న వ్యాసాలను తొలిగిస్తూ వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కొత్తవ్యాసాలను మాత్రం సృష్టించరాదని రెడ్డి గారికి చెప్పవచ్చు. ఇప్పుడు చిన్న వ్యాసాలను తొలిగించే వారు రెడ్డిగారు చిన్న వ్యాసాలను సృష్టించే సమయంలోనే ఎందుకు చెప్పలేరు? వందల వ్యాసాలు సృష్టించిన పిదప ఇప్పుడు అభ్యంతరం ఉంటే, వాటిని తొలిగించడానికి మరికొంతసమయం వేచిచూడాల్సిందే. అప్పటికీ అభివృద్ధి పర్చకుంటే మాత్రం తప్పకుండా తొలిగించవచ్చు, అదీ సీనియారిటీ ప్రకారమే కాని కేవలం ఈ ఒక్క సభ్యునిపై మాత్రమే దృష్టి పెట్టడం వివక్షగా పరిగణించబడుతుంది. ఈ వ్యాసాలను అభివృద్ధి పరుస్తానని రెడ్డిగారు చెబుతున్ననూ పట్టుపట్టి తొలిగించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా! ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ నిర్ణయం కాదు. ఐదుగురు కలిసి ఒక సభ్యునిపై వివక్షతో అతని వ్యాసాలను తొలిగించాలని మెజారిటీ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్య పద్దతినే అపహాస్యం పాలు చేసినట్లవుతుంది. మరోవిషయం ఈ సభ్యుడిపై మాత్రమే దృష్టిసారించిన సోముబల్లా అనే సభ్యుడు ఎవరనే విషయం ఆరా తీయాలి. స్టీవార్డులను సంప్రదిస్తే ఈ విషయం చాలా సులభంగానే తెలిసిపోతుంది. అది సాక్పిప్పెట్ సభ్యత్వం అయితే శాశ్వత నిషేధం విధించి, అసలు సభ్యునిపై కూడా పరిమితకాలం నిషేధం విధించవచ్చు. అసలు బాదంపాలుపై చర్చ జరుగుతునప్పుడే ఆ వ్యాసాన్ని నిర్వాహకులు ఎందుకు తొలిగించారు. చర్చాపేజీ కూడా తొలిగించడానికి అధికారం ఉందా? ఇలాంటి పనుల వల్ల నిర్వాహక హోదాను దుర్వినియోగపర్చినట్లుగా ఎందుకు పరిగణించరాదు. చర్చలతో సంబంధం ఉన్న నిర్వాహకులే వ్యాసాలనూ, చర్చాపేజీలను తొలిగించడం, సభ్యులపై నిరోధం విదించడం లాంటివిచేస్తే మామూలు సభ్యుల ఎదుట తమ నిర్వాహక హోదా ప్రతాపాన్ని చూపించినట్లుగా ఎందుకు భావించరాదు? నిర్వాహక హక్కులనేవి తమకు అనుకూలంగా ఉపయోగించడం తప్పు కాదా? కొందరు నిర్వాహకులు అలా చేస్తున్నప్పుడు మిగితా నిర్వాహకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకు గుర్తున్న ఒక ఉదాహరణ చెబుతాను- సెప్టెంబరు 15, 2008 నాడూ రాజశేఖర్ గారు అలవాటుగా మరో అతిచిన్న వ్యాసం ప్రారంభించారు. చూడండి అది అతిచిన్న వ్యాసం (ఏకవాక్యం) మాత్రమే కాకుండా కేవలం ఊహ ప్రకారం రాసిన విషయ పరిజ్ఞానం లేని వాక్యం. అయిననూ నేను వాటిని తొలిగించకుండా రాజశేఖర్ గారి చర్చా పేజీలో వ్రాశాను (చూడండి) ఆ చర్చలో కాసుబాబు గారు చెప్పిన విషయాలు మాత్రం గుర్తించుకోవాలి. దాని ప్రకారం చెప్పాలంటే వ్యాసం ప్రారంభించినవారే సమగ్రవ్యాసంగా తీర్చిదిద్దాలనేది ఏమీ లేదు. విషయ పరిజ్ఞానం లేకున్నా వ్రాసే అధికారం అందరికీ ఉంది. మొలకలు లేకుండా వృక్షాలు పెరగవు గనుక మొలక వ్యాసాలు మొదలు పెట్టడం అవసరమేనని కూడా కాసుబాబు చెప్పారు. అయితే ఆ వ్యాసాన్ని వెంటనే కాసుబాబు మరియు నేను కలిసి విస్తరించామే కాని తొలిగింపునకు ఎటువంటి ప్రయత్నం చేయలేమని గుర్తించుకుంటే మంచిది. "వికీ పట్ల ఉన్న తపనతో ఒక తపస్విలా రాజశేఖర్ చాలా వ్యాసాలు సృష్టించారు కాని అవి అతి అయినాయని నాకు అనిపిస్తుంది" అని కాసుబాబు గారు రాజశేఖర్ గారినుద్దేశించి (సున్నితంగా చురక అంటిస్తూ) చెప్పారు కాని ఎలాంటి చర్యలు తీసుకోలేరు. ఇప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేక భావన రాజశేఖర్ గారు రెడ్డి గారిపై చూపిస్తున్నారనిపిస్తుంది. అంతకు ముందే అంటే మే 2, 2008 నాడే రాజశేఖర్ గారి చర్చాపేజీలో చిన్న వ్యాసాలు వద్దండీ అని చెప్పానే కాని తొలిగింపుకు ప్రతిపాదన చేయలేను. ఇప్పుడు రెడ్డిగారు సృష్టించిన చిన్న వ్యాసాల కంటే కొన్ని రెట్లు అధికంగా రాజశేఖర్ గారు అతిచిన్న వ్యాసాలు సృష్టించినప్పుడు లేని వివాదం ఇప్పుడెలా వచ్చింది. ఇదివరకు చిన్నవ్యాసాలు సృష్టించిన రాజశేఖర్ గారు వాటిని పూర్తిచేయకుండానే ఇపుడు ఈ వివాదంలో రెడ్డిగారిపై నిష్కారణంగా చర్యలను తీసుకోవడం సమంజసమేనా? ఈ వివాదం ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? ఇప్పటికే ఇంతవరకు ఏ చర్చా జరగనంత సుధీర్ఘంగా దీనిపై జరిగింది. కొందరు ఉదాసీనంగా వ్యవహరించడం, మరికొందరు దుడుకుగా వ్యవహరించడం సరైనదేనా? తెవికీలో వ్యాసాలు వ్రాయడం దిద్దిబాట్లు చేయడం ఎంత అవసరమో నిర్వహణ పనులు చేయడం అంతకన్నా అవసరం అని ఎందుకు గుర్తించడం లేదు. నియమాలు స్పష్టంగా లేకున్ననూ సభ్యులపై తీవ్ర చర్యలు తీసుకొనడం సమంజసమేనా? రెడ్డిగారు ఎవరిపై విమర్శలు చేయకుండా, తనపై చర్యలు తీసుకున్నా మౌనంగానే ఉంటూ వ్యాసాల అభివృద్ధికై కృషిచేస్తుంటే అతని(వ్యాసాల)పై నలువైపులా అందరూ దాడికి పూనుకోవడం ఒక సభ్యుని దిద్దుబాట్ల హక్కులను భంగం కలిగించినట్లు కాదా? ఈ వివాదాన్ని స్వస్తి పలకడానికి ఏకైకమార్గం రెడ్డిగారికి ప్రస్తుతమున్న చిన్న వ్యాసాలు వృద్ధిపర్చడానికి వీలుకల్పిస్తూ కొత్త వ్యాసాలు సృష్టించరాదని తెలియపర్చడమే. దీనిపై మరెవరూ మళ్ళీమళ్ళీ అతని దిద్దుబాట్లుకు భంగం కలిగించరాదు. చివరగా నా అభిప్రాయం చెప్పాలంటే నేనూ చిన్న వ్యాసాలకు వ్యతిరేకినే. ఇదే విషయం ఎందరికో చెప్పాను. నియమాలు స్పష్టంగా లేకుండుటచే ఎలాంటి చర్యకు వీలుకలుగలేదు. ఇప్పుడూ అవే నియమాలున్ననూ చర్యలు తీసుకోవడం, నిషేధం విధించడం బాగుండదు. అలాగే ఏకవచన ప్రయోగం తప్పుకాదని తెలియజేస్తున్నాను. ఇక సెలవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:23, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, చాలా కాలం తర్వాత రచ్చబండలో మీ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు.తెవికీలోని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే దిశగా నిర్వాహకులు మరియు సభ్యులు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎవ్వరూ అధికులు కారు. తమ తమ విషయ పరిగ్నాగ్నానాన్ని ఇతరులతో పంచుకోవాలనే తెవికీ లక్ష్యానికి సభ్యులందరూ తోడ్పడాలని కోరుకొంటున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:01, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దిగజారటం మొదలైంది కనుక నేనూ దిగజారిపోవాలని నిర్ణయించుకొన్నాను అదీ చంద్రకాంతరావు దయవలన అతడికి ఏకవచనం తప్పుకాదు కనుక ఇలా రాస్తున్నాను. ఒక సభ్యుని తప్పులను సరిదిద్దుతూ అతనికి సహాకారము అందించుట సీనియర్ సభ్యుల భాద్యత. రెడ్డి పై మొదట్లో ఎవరికీ ఏ భావమూ లేదు కొంతవరకూ అందరూ సహకరించారు. కాని ఎందరు సరిదిద్దలని ప్రయత్నించినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం వలన ఈ సమస్య తలెత్తింది. అతడు చెప్పినా ఎందుకు చేయడం లేదు అనేదే సమస్య. తెలియనపుడు నేర్చుకోవడం అనేది మమూలే కాని ఎందరు రాసినా చూడనట్టుగా తనపని తాను చేసుకు వెళ్ళడం ఇతర సభ్యులను అగౌరవపరచడం అవుతుంది. సభ్యులు వీటి గురించి అతడి సభ్యపేజీలో రాసిన సమాచారము అంతా చెరిపేయడం చేస్తాడని నీకు తెలియనట్టున్నది. నాకెందుకులే వదిలేద్దాం అనుకోవడానికి ఇది నాదీ నీదీ రెడ్డి యొక్క సొంత సైట్ కాదు. నాకు అతడు ఎవరో తెలియదు. రెండు వ్యాసలకు సంభందించిన సమాచారం ఒకేవిధంగా ఉండుట వలన విలీనం చేసాను. దానిని అతడు మళ్ళీ సృష్టించాడు. నేను విలీనం చేసాను అని చెప్పి మళ్ళీ సృష్ట్ంచవద్దని మళ్ళీ తొలగించాను అతడు మళ్ళీ సృష్టించాడు. ఇదేమన్నా ఆటా పనీ పాటా లేకుండా చేస్తూ పోవడానికి. వ్లీనం చేసిన వ్యాసాన్నే ఎందుకు అభివృద్ది పరచకూడదు. అలా జరిగితే అతడు నువ్వు అనే అవసరమే ఉండదు. ఎవరినైనా సమర్ధించాలనుకొన్నపుడు అతడు ఏం చేస్తున్నాడు అని చూసి మొదట అతడికి చెప్పి నీమాట వింటే అపుడు సమర్ధించు. కనుక అతడిని సంస్కరించే పనిలో ఉండు.విశ్వనాధ్ (చర్చ) 13:03, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగానే దిగజారినందులకు చాలా సంతోషం. పూర్తిగా దిగజారిన సభ్యునికి ఇక చెప్పడం అంటూ ఏమీ ఉండదు. తెవికీ సమాజానికి నేను చెప్పదలుచుకున్నదేమంటే అసలు ఈ చర్చ ఇన్ని నెలలు సుధీర్ఘకాలం జరిగిందంటే అది ఎలా మొదలైంది అనేది పరిశీలిస్తే కేవలం ఒక్క ఏకవచనం పదం వల్లనే. నెలల తరబడి సభ్యునిపై దాడులపై దాడులు విషయం అందరికీ తెలుసు కాని ముగింపు కావడం లేదు. నిర్వాహకులు వారికి తోడు కొందరు కొత్త సభ్యులు (?) జతకావడంతో సమస్య మరింత ముదిరిపోయింది. చివరగా నేను చెప్పిన అభిప్రాయాలలో రెడ్డిగారికి ఏకోశాన మద్దతు పలకడం కాని, అతను చేసింది సరైనదేనని ఎక్కడా చెప్పలేను. నిర్వాహకులు, కొందరు సభ్యులు కలిసి పదేపదే దాడి చేయడాన్ని మాత్రం తప్పుపట్టాను. నిర్వాహకహోదా దుర్వినియోగపర్చడాన్ని తప్పుపట్టాను. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారికి మద్దతు ఇవ్వకపోవడమే నేను చేసిన తప్పు!! కొందరి పొరపాటు వల్ల సభ్యుడు తన వ్యాసాలను రక్షించుకోవడానికి దీనంగా నిర్వాహకుల సహాయం అర్థింస్తుంటే, తప్పు చేస్తున్నవారికి మీది తప్పు అనడమే సరైనది కాకుంటే ఇది నిరంకుశమే తప్ప ప్రజాస్వామ్యమనిపించుకోదని అర్థం చేసుకోని వారికి నేను చెప్పేదేమీ ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:37, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త సభ్యులకు ప్రోత్సాహం ఇవ్వండి విశ్వనాద్ గారు అని హెడ్డింగ్ పెట్టి మరీ మొదలెట్టారు. 2006 నుండి నేను వికీలో పని చేస్తున్నాను. ఇంతవరకూ ఏ సభ్యుడినీ నేను ఇబ్బంది పెట్టిన సంధర్భం లేదు. ఉంటే చూపించండి నేను తెవికీ నుండి తప్పుకుంటాను శాశ్వతంగా. ఇక అదే 2006 నుండి ఇప్పటి వరకూ ఎందరినో సభ్యులను చూసాను ఎవరూ ఎవరినీ ఏకవచనంతో రాయడం జరగలేదు. మరి మీ ఇద్దరే ఎందుకు చేస్తున్నారు. ఎవరు ముందుగా దిగజారినట్టు. నువ్వా నేనా. చాలా రోజుల ముందు రెడ్డి సభ్య పేజీలో ఇదే విషయం రాసాను. దయచేసి ఏకవచనంతో సంభోదించకండి అని (దించకం'డీ అని) అతడు మళ్ళీ అదే చేసాడు. అప్పుడు అది నీకు చాలా బావున్నట్టున్నది. ఇక నుండి అందరూ మర్యాద లేకుండా ఎవరిని బడితే వాళ్ళను ఎలాగైనా సంభోదించవచ్చునని నువ్వు శెలవిచ్చావు, కాదు నువ్వు మరియు రెడ్డి కలిసి వికీలో ఒక సరికొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. రెడ్డి యొక్క ఒక వ్యాసాన్ని విలీనం చేసినందుకే నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ రెడ్డి గురించి ఇలా రాసావు" దీనిపై మరెవరూ మళ్ళీమళ్ళీ అతని దిద్దుబాట్లుకు భంగం కలిగించరాదు. అని ఇదేమైనా రూలా చంద్రకాంతరావూ. అంటే ఇక ఏ సభ్యుడూ రెడ్డి ఏం రాసినా దానికి అభ్యంతర పెట్టకూడదా. అంతేనా ఇంకా మరేమైనా రూల్సు ఉన్నాయా.నీకు మాత్రమే తెల్సినవి. తెలియచేస్తే మేమంతా పాఠిస్తాం.విశ్వనాధ్ (చర్చ) 15:56, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నాపై ఏకవచన ప్రయోగం చేసినా నాకేమి ఇబ్బంది లేదు. నా దృష్టిలో అది తప్పేమి కాదు కాని తప్పు అనుకుంటూ కూడా ఏకవచనం ప్రయోగం చేయడం అతడి విచక్షణకే వదిలివేస్తున్నాను. తనకు వ్యతిరేకంగాఒక్క ఏకవచనవ్యాఖ్య చేసినందుకు కక్ష్యగా తీసుకొని (దీనితర్వాత ఏమైందీ చెప్పడం చర్వితచరణమే) సభ్యుడి ముసుగు తొలిగిపోయి నిజస్వరూపం బయటపడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:27, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

"అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు" అనే వాక్యంలో ఏకవచన ప్రయోగం తప్పు కాదు అంటే, అమ్మ గారిని, నాన్న గారిని ఏకవచనంతో పిలవమని కాదు. మీ YVSREDDY (చర్చ) 00:20, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరైనా నీ నాన్నను బయటకు రమ్మను అని పిల్చేదానికీ, మీ నాన్న గారిని బయటకు రమ్మనండి అని పిలిచేదానికీ చాలా వ్యత్యాసం ఉంది. నీ మీ ల మద్య అంతరం నీకు తెలియదు అది నీకు అర్ధం కాకనే ఏకవచనాలు మొదలెట్టావు నీపేజీలో తోటి సభ్యులను గౌరవించండి అని నేను రాస్తే అది చెరిపేసావు. ఎవరైనా దేనిగురించైనా రాస్తున్నా చెరిపేసుకుంటున్నావు. మంచిగా ఉండేవి మాత్రమే ఉంచుకొంటూ అలాటి వాటిని చెరిపేయడం ద్వారా కొత్తగా నీ పేజీ చూసేవాళ్ళను తప్పుదోవ పట్టించి ఈయన మీద అందరూ కలసి దాడి చేస్తున్నారు అనిపించేలా చేయడం అంత మంచిది కాదు. తప్పులు చేయడం సహజం సరిదిద్దుకోవడం అంతే సహజం. వికీలో ప్రవేశించిన మొదట్లో ప్రతి ఒక్కరికీ జరిగేదే ఇది. దీనిగురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు.విశ్వనాధ్ (చర్చ) 07:19, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గత20 రోజులుగా నేను నెట్‍కు అందుబాటులో(13,14,15 తేదిలు మినహ)లేకపోవటం వలన చర్చపై స్పందన రాయలేక పోయాను

మొదట్లో ఎకవాక్య వ్యాసాలపై సృహ్రుద్భావ వాతవారణంలో మొదలైన చర్చలు,క్రమంగా సభ్యులమధ్య,నిర్వహకుల మధ్య వ్యక్తిగత విమర్సలకు వెళ్లటం విచారించదగ్గ విషయం.చర్చపై నాఅభిప్రాయలు,ఏవ్యక్తిపట్ల ద్వాషంతోకాని,లేదా ఒక నిర్హహకుని పట్ల అభిమానంతోకాకుండ నా అభిప్రయాలను వెళ్ళడిస్తున్నాను.

  • ఏకవాక్య వ్యాసాలు ఇంతకుముందుకూడా వ్రాసారు,అప్పుడు లేని చర్చైప్పుడెండుకని;నిజమే అప్పుడు స్పందించటానికి తగినంత సభ్యులు లేకపోవడం కారణమై వుండవచ్చును.ఏకవాక్యవ్యాసాలు వ్రాసిన సభ్యుడు కూడా ఇతర సభ్యులసూచనమేరకు మానివేసినట్లు,,ప్రస్తుతం తను వాటికి వ్యతిరేకినని చెప్పాడు.అలాగే గతములో జరిగిన తప్పునే కొనసాగించాలనిలేదుకదా?అవకాశం వచ్చింది, సరిద్దిద్దె ప్రయత్నంచెయ్యడం తప్పుకాదనుకుంటాను.ఇంతంతా వికిని మెరుగుపరచే ప్రయత్నం తప్ప,వ్యక్తిగతద్వేషంతో మాత్రంకాదు.ఇక్కడసభ్యులెవ్వరు ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియదు.కక్ష్యకట్టెతంత అవసరం కనిపించడంలేదు.
  • ఏకవాక్య వ్యాసాలు రాసిన సదరు సభ్యుడను మొదటలోనే ఎందుకు నిరోధించలేదని;ఇతర సభ్యులు సదరు సభ్యుడు వ్రాస్తున్న వ్యాసాలపై మొదటనుంచి అతని చర్చాపేజిలో సూచనలిచ్చారు. సూచనలిచ్చేకొలది,పెడసరంగా ఎకవాక్యవ్యాసాలలను పెంచుతూ,అగ్నిని ఆజ్యం పోసినట్లు అసభ్యుడు ప్రవర్తించడమేకాకుండ,అంతవరకు వ్యాసాలనాణ్యతపై ఇచ్చిన సలహాలన్ని,చర్ర్చాపీజినుండి తొలగించి,మునుముందు తనపేజిలో సలహాలను పోస్టుచెయ్యవద్దంటూ వ్యాఖ్య పెట్టడం సబబుకాదు.అంతేకాదు అతని వ్యాసాలలోని తప్పులను ఆధారాలతో చూపించినప్పుడు,తనతప్పును సరిద్దుకొనేప్రయత్నంచెయ్యకపోగా ఆదే తప్పును వ్యాసంలో కొనసాగించడం సబబుకాదు కదా.ఉదా:చంద్రకాంతిలో(చంద్రకళలు)ఎచ్చుతగ్గులు చంద్రునికి,సూర్యునికి మధ్యలో భూమి అడ్దుగా రావటమని వ్రాసిన విషయంలో ని తప్పును,నేనువివరణతో ఆయన దృష్టికి తెచ్చినప్పుడు,తాను రాసిన విషయాన్ని చదివి,తప్పుసరిచేసేప్రయత్నం చెయ్యకుండ,మరోసభ్యుని చర్చాపేజిలో పాలగిరిచెప్పింది తప్పని, వ్రాసాడు. వెంటనే నేను నేను చెప్పిన దానికి ఆధారంగా లింకుపీజినిచ్చినను ,దాన్ని సవరించె ప్రయత్నంచెయ్యలేదు,మరోసభ్యుడు సవరించాడడు.ఆ సభ్యుడు మీద కోపంతో నేను చెప్పడంలేదు.తనతప్పును మేము సహృదయంతో తనదృష్ట్కి తెచ్చిననను,తాపట్టిన కుందేటికి మూడేకాళ్లంటే ఎలాగా?
  • ఏకవాక్యవ్యాసాలకు నేనూకూడా వ్యతిరేకమంటూ ఒక సినియరు సభ్యుడంటే,నేను బహువాక్యవ్యాసాలకు వ్యతిరేకమంటూవెంటనే ,ఒకచిన్న వ్యాసాలన్ని, కార్తెలపేరుమీద పదులసంఖ్యలో సృష్తించడం ఏవిధంగా సబబు అని పిస్తుంది.ఇలాంటి పిచ్చి పనులు నిరోధించేప్రయత్నం వ్యక్తిగత ద్వేషంతో చేసినట్లు ఎలాగవుతుంది.
  • ప్రస్తుతం సదరు సభ్యుడు తన వ్యాసాలను విస్తరించడం ప్రారంభించాడు.ఇదిచాలా సంతోషకరమైన విషయం.అతనినుండి మునుముందు ఇలాంటిదే ఆశిస్తున్నాము.
  • సదరు సభ్యుని రచన విధానంపై,ఒక్క విశ్వనాధ్ గారే కాదు,చాలామంది సభ్యులు సలహలివ్వడం,వాటిని సహృదంతో స్వేకరించకుండ,పెడసరంగా సమాధాలిచ్చాడు.అందువలన విశ్వనాధ్ గారో,రాజశేఖర్ గారో పనికట్టుకొని చేసిందని భావించడం సరికాదని నాభావన,వారిద్దరితో నాకు వ్యక్తిగతంగా సంబంధాలులేవు,వికిపరంగా తప్ప.
  • ఒకే వ్యక్తి బినామి పేర్లతో చర్చచెయ్యడం;ఒకవేళ అలాసరిగివున్నచో,అది సరియైనదికాదూ.అలాగైనచో ప్రతివ్యక్తి బినామి పేర్లతో తనవాదనను బలపరచే ప్రయత్నం మొదల్వౌతుంది.దీన్ని నిరోధించాలి.

పాలగిరి (చర్చ) 04:58, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తికాలం నిషేధం ఎందుకు విధించాలి?

[మార్చు]

చంద్రకాంతరావు గార్కి నమస్కారములు,

మీకు నేసు చేసిన చర్యలు దుశ్చర్యలుగా భావించినట్లయితే మీరుకూడా నిర్వాహకులే కదా! నన్ను కారణం చూపి పూర్తి కాలం నిషేధించండి. తెవికీకి మీరే శాశ్వత సభ్యులుగా ఉండండి. సంతోషిస్తాను. నేను ఏఒక్కరి వ్యాసాల పైనావివక్ష వహించడం లేదు. ఎన్నో పూర్తిగా విషయం లేని వ్యాసాలను తెలియజేశాను.అజ్ఞాత వాడుకరులు సృష్టించిన అనవసర పేజీలలో తొలగింపు మూసలుంచాను. వ్యాసాలలో తప్పులను తెలియజేశాను. అలా తెలియజేయతం తప్పంటారా! నేను ఏనాడు ఏ ఒక్క వ్యాసాన్ని గాని, వ్యాస భాగాన్ని గాని తొలగించటం చేయలేదని గమనించగలరు. చాలా మంది సభ్యుల వ్యాసాల పై అభిప్రాయాలను తెలియ జేశాను. మీరు నా రచనలు లో చూసి పరిశీలించండి. నాకు "తొలగింపు", "విలీనం","విస్తరణ " , "అనువాదం" మూసలు ఉంచే హక్కు లేదంటారా? నేను ప్రతిపాదన చేసిన తర్వాత దానిపై చర్చ జరిగి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. నేను తొలగించమంటే మీ నిర్వాహకులు తొలగిస్తారా? దానిపై చర్చ అవసరం లేదా! అటువంటి మూసలు ఉంచటం తప్ప నేను తెవికీ ప్రమాణాలను, నాణ్యతను ఏ విధంగా దిగజార్చలేదని మీరు గమనించాలి. అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి. నేను ప్రతిపాదన చేసిన తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీరెవరూ చర్చలో పాల్గొనకుండా తొలగించి ఆ తప్పు, వివక్ష నాపై జల్లడం భావ్యమా! మీకు పైన నేను తెలిపిన చర్యలు యిష్టం లేనట్లయితే నన్ను నిషేధించండి. నిషేధించే ముందు ఈ రచ్చబండలో నేను చేసిన తప్పులను తెలియజేయండి. యిక సెలవు.(Somu.balla (చర్చ) 14:49, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నాపై గౌరవనీయ నిర్వాహకులు చంద్రకాంతరావు గారు చేసిన వ్యాఖ్యకు స్పందించండి.నిర్వాహకులు,సహసభ్యులు నేను చేసిన విధానం తప్పు అంటే తప్పుకుంటాను.(Somu.balla (చర్చ) 14:49, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
సోము గారు. మీరు చేసింది, నేను చేస్తున్నది. వికీ అభివృద్ధి కోసం. ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కావు. మీలాంటి కృషిచేస్తున్న వారు వికీపీడియాకు చాలా అవసరం. ఒక్క రెడ్డిగారిని నియంత్రించడం ఒక్కటే మన పని కాదు. ఇంకా చాలా ఉన్నది. దయచేసి దయచేసి తప్పుకోవద్దు.Rajasekhar1961 (చర్చ) 15:28, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నా వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారు. సాక్పిప్పెట్ అయితేనే పూర్తికాలం నిషేధం అన్నాను కాని మాటిమాటికి ఒక సభ్యుని జోక్యం చేసుకున్న మాత్రానికే పూర్తినిషేధం అనలేను. అయిననూ ఒక సభ్యునికి వ్యతిరేకంగా మరీ ఇంతగా అతని దిద్దుబాట్ల విషయంలో జోక్యం చేసుకోవడం అవసరమా అని మీరే ఆలోచించండి. చిన్న వ్యాసాల సమస్య అనేది మొదట నుంచే ఉన్నది. సంవత్సరాల నుంచీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి కాని ఏ ఒక్క సభ్యునిపై ప్రత్యేకించి ఇలాంటి వ్యతిరేక భావనలు రాలేవు. ఆ సంగతి వదిలేయండి. ఇక మీ విషయానికి వస్తే మీరు ఏ సభ్యునికీ సాక్పిప్పెట్ కాకపోతే మీకు అభ్యంతరం ఎందుకు? ఒకవేళ సోముబల్లా, రోజారాణి, సంతు కొత్త సభ్యపేర్లు సాక్పుప్పెట్ అయితే సంబంధిత సభ్యులు ముందే ఒప్పుకోవడం మంచిది. మెటావికీలో స్టీవార్డులను సంప్రదిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇదివరకే ఒక సభ్యత్వం ఉండి ఉద్దేశ్యపూర్వకంగా మరో సభ్యత్వంతో ఇతరులను ఇబ్బందిపరిస్తే మాత్రం తప్పకుండా పూర్తికాలం నిషేధం విధించాల్సిందే. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలాగే మీరు పైన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు సమంజసంగా లేవు. "అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి" అనడం తెవికీ వ్యవస్థ పైనే దాడిచేయడం లాంటిది. మూసలున్నంత మాత్రాన ఎలా ఉపయోగించాలో మరీ చెప్పే అవసరం లేదనుకుంటాను. కత్తిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అంత మాత్రాన దుర్వినియోగపర్చినందుకు తెలియజేస్తే కత్తి ఎందుకు తయారుచేశారు అని అనగలమా? సి. చంద్ర కాంత రావు- చర్చ 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారిని నియంత్రించడమే పనికి పెట్టుకున్నారా? సి. చంద్ర కాంత రావు- చర్చ 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చాలా మంది సభ్యుల విషయం లేని వ్యాసాలపై వ్యాఖ్యానించాను. నేను "రెడ్డిగారి వ్యాసాలు" "X గారి వ్యాసాలు" అని భావించడంలేదు. తెవికీ వ్యాసాలుగా భావిస్తున్నాను. నేను విస్తరణ కొరకు సలహాలిస్తే సభ్యునికి నియంత్రించినట్లా! నేను ఏక, అర,పావు,అసలు విషయం లేని వ్యాసాలలో మాత్రమే తొలగింపు మూసలుంచాను. గాని ఉపయోగకరమైన వ్యాసాలలో ఉంచలేదని గమనించాలి. నేను మూసలను దుర్వినియోగ పరచడం లేదని తెలియ జేస్తున్నాను. ఒక సభ్యుని వేరొక సభ్యుడు నియంత్రించగలడా! ఆయన వ్యాసాలు విస్తరిస్తే అందరికీ సంతోషదాయకం.(Somu.balla (చర్చ) 15:57, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
సభ్యునికి నియంత్రించినట్లు మీకు చెప్పలేను. "ఒక్క రెడ్డిగారిని నియంత్రించడం ఒక్కటే మన పని కాదు" అని పలికిన సభ్యునికి ఉద్దేశించి చెప్పినది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:01, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సోము గారు, తెవికీకి మీలాంటి చురుకైన సభ్యుల తోడ్పాటు ప్రస్తుతం చాలా అవసరం. నాణ్యమైన వ్యాసాల కొరకు మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. దయచేసి చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ కృషిని ఇలాగే కొనసాగించి తెవికీ వ్యాసాలను మరింత మెరుగు పర్చాలని కోరుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:14, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ మనవి

[మార్చు]

ప్రస్తుతం వికీపీడియాలో క్రియాశీలకంగా మార్పులు చేస్తున్న అందరు సభ్యులకీ ఒక చిన్న మనవి. ఒక పది నిమిషాలు ఆగి ఈ మూడు పేజీలు చదవండి ప్లీజ్ (Deletionism, Exclusionism, Inclusionism). మూడింటిలో ఒక్క సిద్ధాంతాన్ని ఖరాఖండిగా వికీపీడియా పాటించదు. వికీపీడియన్లు పలు రకాలు. అలాగే తెవికీ సభ్యులు కూడాను. వారి వారి స్వభావ రీత్యా ఒక్కొక్కొరు ఒక దాని వైపు మొగ్గుచూపుతారు. అలా అన్ని రకాల సభ్యుల కృషి వళ్ల జరిగే కలగాపులగమే వికీపీడియా :-) టేకిట్ ఈజీ ఫ్రెండ్స్ --వైజాసత్య (చర్చ) 13:41, 17 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగత వ్యాసాలు తొలగింపు

[మార్చు]

షర్మిల అనే వ్యాసములో సదరు వ్యక్తి వ్యక్తిగత సమాచారం ఉన్నది. ఈమెకు ఎటువంటి ప్రభుత్వ పదవి లేదు. వ్యాసంలో రచయిత సదరు వ్యక్తిని స్థుతిస్తూ వ్రాయడం జరిగింది. ఈ వ్యాసం తొలగించాల్సిందిగా నిర్వాహకులకు మనవి. లేకపోతే ఇలాంటివి మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది.--గండర గండడు (చర్చ) 04:48, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారో ఆ వ్యాసం యొక్క పేజీ చర్చలో వ్రాయండి. తొలగించవచ్చు కానీ దానికి సరైన కారణాలుండాలి. వికీపీడియాలో వ్యాసం ఉండటానికి ప్రభుత్వ పదవులే ఉండనక్కర లేదు. ఒక సులువైన పరీక్ష ఏమిటంటే. వికీపీడియా, బ్లాగులు మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కాకుండా, వార్తాపత్రికలు, మేగజిన్సు, పుస్తకాలలో ఈ వ్యక్తి గురించిన సమాచారముంటే వికీపీడియాలో పేజీ ఉండటానికి అభ్యంతరము లేదనుకుంటా --వైజాసత్య (చర్చ) 07:01, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యాగారూ, అలాగైతే అఫ్జల్ గురు మరియు కసబ్ ల గురించి కూడా తెవికీలో రాయవచ్చునా?--గండర గండడు (చర్చ) 10:58, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గండడు గారు, వ్రాయవచ్చు. Chavakiran (చర్చ) 11:06, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్మల్ కసబ్ చూడండి. Chavakiran (చర్చ) 11:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చావా గారు మరియు సత్య గారు... చాలా ధన్యవాదాలండి.--గండర గండడు (చర్చ) 11:58, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

‌‌విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్దతి గడువు: 23 ఫిభ్రవరి 2013 00:00

[మార్చు]

వికీపీడియా_చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి చర్చా గడువు ఇంకా మూడురోజులే వుంది. ఇప్పటికే కెవి రమణ గారు, చంద్రకాంతరావు గారు స్పందించారు. ఇతర సభ్యులు, నిర్వాహకులు త్వరలో స్పందించమని మనవి.--అర్జున (చర్చ) 02:15, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందించిన అందరికి ధన్యవాదాలు. స్పందనలప్రకారం అందరి సమ్మతితో ఈ ‌విధానంలో అవసరమైన మార్పులు చేయబడినవి. ఇక దీనిని ముందు వాడుకొని అవసరమైతే మరల మార్పులు చేయవచ్చు. --అర్జున (చర్చ) 16:25, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ట్వింకిల్ ఉపకరణం స్థాపన

[మార్చు]

వికీపీడియా నిర్వహణ సౌలభ్యానికి ట్వింకిల్ ఉపకరణం స్థాపన చాలా వరకు పూర్తయ్యింది. దీనిని మీ అభిరుచుల పేజీలో చేతనం చేసినతరువాత,(Wikipedia:హాట్‌కేట్లాగా) మీరు పేజీలు చూసేటప్పుడు వెతుకు పెట్టెకు ముందు "TW" అనే టాబ్ కనబడుతుంది. దాని ద్వారా పేజీలను తొలగింపుకి ప్రతిపాదించడం, తొలగింపు చేయడం (నిర్వాహకులు లేక అధికారులైతే) లాంటివి సునాయాసంగా చేయవచ్చు. దీనికి సంబంధించిన మూసలు వర్గాలు ఇంగ్లీషులోనే వుంచితే దీని ముందు రూపాంతరాలు ఇంగ్లీషు నుండి తెచ్చుకోవడం సులభం. దీనిని వాడటానికి ఇంగ్లీషు కొద్దిగా తెలిసి వుండాలి. దీనిని వాడుకలో దోషాలను ట్వింకిల్ చర్చా పేజీ లో రాయండి.--అర్జున (చర్చ) 04:27, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Wikidata phase 1 (language links) coming to this Wikipedia

[మార్చు]

Sorry for writing in English. I hope someone can translate this locally.

Wikidata has been in development for a few months now. It is now time for the roll-out of the first part of it on your Wikipedia. Phase 1 is the support for the management of language links. It is already being used on the Hungarian, Hebrew, Italian and English Wikipedias. The next step is to enable the extension on all other Wikipedias. We have currently planned this for March 6.

What is Wikidata?

[మార్చు]

Wikidata is a central place to store data that you can usually find in infoboxes. Think of it as something like Wikimedia Commons but for data (like the number of inhabitants of a country or the length of a river) instead of multimedia. The first part of this project (centralizing language links) is being rolled out now. The more fancy things will follow later.

What is going to happen?

[మార్చు]

Language links in the sidebar are going to come from Wikidata in addition to the ones in the wiki text. To edit them, scroll to the bottom of the language links, and click edit. You no longer need to maintain these links by hand in the wiki text of the article.

Where can I find more information and ask questions?

[మార్చు]

Editors on en:wp have created a great page with all the necessary information for editors and there is also an FAQ for this deployment. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata

[మార్చు]

To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages. You can see previous editions here.

--Lydia Pintscher 16:18, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

లెట్స్ ఫోకస్

[మార్చు]

నా భావాలను మరింత స్పష్టంగా వ్యక్తీకరించేంత తెలుగు వస్తే బాగున్ను. ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్న సభ్యులందరికీ నమస్కారం. ఇది వరకు నేను క్రియాశీలకంగా తెవికీలో కొన్నాళ్లు నిర్వాహకత్వం వహించాను. ఇటీవలే మళ్లీ తెవికీలో వ్రాయటం ప్రారంభించాను. నాకు చారిత్రక విషయాలపై చక్కగా, సమగ్రంగా పరిశోధన చేసి వ్యాసాలు వ్రాయటం ఇష్టం. కానీ ఇక్కడ జరుతున్న చర్చల స్థాయిని చూసి నాకు ఇష్టం లేకపోయినా నిర్వహణా చర్చల్లో తలదూర్చాల్సి వచ్చింది. కొంత సమయం వెచ్చించి ప్రస్తుత తెవికీ పరిస్థితిని కొంత సమీక్షించాను. ఇది ఆదేశమూ కాదు, మార్గదర్శకము కాదూ. ప్రధాన విషయాలకు పెద్దపీట వేయమని చిన్న సూచన మాత్రమే.

మనం వ్యాసాలు విస్తరించడం, వాటి నాణ్యత పెంచడం కంటే ఇతర నిర్వహణా వ్యవహారాలలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని నాకనిపిస్తోంది. నిర్వహణ ముఖ్యమే. కొత్త సభ్యులను ఆహ్వానించడం, వారికి సహాయం అందిచడం ఇలాంటివి తప్పకుండా చేయాల్సినవే. ఇక వ్యాసపు నాణ్యత పెంచే పనులు - శుద్ధి చేయటం, వికీకరించడం, చెత్తరాతలను తొలగించడం, మూలాలు చేర్చటం వంటి పనులు ఉన్నవే. మన స్థాయి వికీకి కావలసి నిర్వహణా పద్ధతులు, మార్గదర్శకాలు, పరికరాలు ఇప్పటికీ ఉన్నవే. నిజానికి కొన్ని పద్ధతులను తొలగించడం మంచిది. ఉదాహరణకు ఈ వారపు బొమ్మ, ఈ వారపు వ్యాసం వంటి శీర్షికలను కొన్నాళ్ళు నిలిపివేసినా నష్టమేమీ లేదు. వీటి నిర్వహణకు ఒకరిద్దరు సభ్యులు సమయం కేటాయించాల్సి వస్తుంది. వీటివళ్ళ మన మూల లక్ష్యమైన విజ్ఞాన సర్వస్వపు తయారీకి ప్రస్తుతం ఒరిగే లాభమేమీ లేదు. ఆంగ్ల వికీ మొదటి పేజీని ఒక మేగజిన్ తరహాలో నడిపిస్తారు. వాళ్లకా సామర్ధ్యం ఉంది. మనకదో పెద్ద భారం. ఆంగ్ల వికీని అచ్చుగుద్దినట్టు మనం అనుకరించాల్సిన అవసరం లేదు. వాళ్ల పాలసీలను చదివి ఎంతో నేర్చుకోవచ్చు. కానీ వాళ్ల పద్ధతులన్నీ మన చిన్న వికీలో అమలుపరచలేము. మన సముదాయం, వికీ పెరుతున్న కొద్ది ఈ కొత్త కొత్త ప్రక్రియలు వస్తాయి. అలా అని అన్ని మార్పులు, కొత్త పద్ధతులు తేకూడదని కాదు. (ఉదాహరణకు అర్జునరావు గారు ఇక్కడున్న లిప్యాంతరీకరణ బదులు నరయం పొడిగింతను వ్యవస్థాపించడం ఒక మంచి పద్ధతి) ఐదేళ్ల క్రితం ఎంతమంది క్రియాశీలక సభ్యులున్నారో ఇప్పుడూ అంతేమంది సభ్యులున్నారు. అలాంటప్పుడు మరిన్ని నిర్వహణా పద్ధతులు సభ్యులను వ్యాసరచన నుండి దూరం చేస్తాయి. వీలైనంతగా వ్యాసరచనకు, వ్యాసాల నాణ్యతను అభివృద్ధికి దోహదం చేయని నిర్వహణా ప్రక్రియలను తొలగించి మన ప్రధాన లక్ష్యమైన విజ్ఞాన సర్వస్వపు కృషిపై దృష్టి కేంద్రీకరిద్దాం. జిల్లాల ప్రాజెక్టువంటి మరిన్ని సమిష్టి కృషి కార్యక్రమాలు చేపడదాం. ఏమంటారు? సలహాలు, సూచనలు?? --వైజాసత్య (చర్చ) 07:03, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభిప్రాయాలు చాలా బాగున్నవి. అర్జునరావు, వీవెన్, రహ్మానుద్దీన్ లాంటివారు ఒకరిద్దరు నిర్వహణ చేస్తుంటే మిగిలినవారు వ్యాసాల విస్తరణ మీద దృష్టి చేస్తుంటే తెలుగు వికీ అభివృద్ధిచెందుతుంది. రమణ, పాలగిరి లాంటి వారి విలువైన సమయాన్ని వ్యాసరచన మీద కేంద్రీకరించడం చాలా ముఖ్యం. సభ్యుల మధ్య చర్చలు ముఖ్యమే. కాని చర్చల గురించి చాలా విలువైన సమయం వృధాఅవుతున్నట్లున్నది. ప్రతి రచయిత వ్యాసాల్ని ప్రారంభించడమే కాకుండా; విస్తరించడం మీద కేంద్రీకరించాల్సినదిగా కోరుతున్నాను. దీనికి మంచి ఉదాహరణ ఆంధ్రుల దుస్తులు మరియు సంబంధ విషయాల విస్తరణ. ఇలాగే మన తెలుగువారికి సంబంధించిన వ్యాసల విస్తరణ జరగాలి. నాకు చిరకాలంగా కుటుంబం గురించి అందరు సభ్యుల పాత్ర గురించి కొన్ని వ్యాసాల్ని విస్తరించాలని కోరిక. ఇప్పుడు కొరవడుతున్న కుటుంబ వ్యవస్థలోని విషయాల్ని తెలియజేస్తే వచ్చేకాలంలో మన పిల్లలకు అవి ప్రమాణికంగా ఉంటాయి.Rajasekhar1961 (చర్చ) 07:45, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చెప్పినట్టుగా మొదటిపేజీ నిర్వహణ వలన తెవికీలో కొంత వత్తిడి నెలకొంటున్నది. మొదటి పేజీలో ఈవారం వ్యాసం, బొమ్మ లాంటి వాటిని 15 రోజులకు ఒక సారిగా మార్చడం మేలని నా అభిప్రాయం. దానివలన సభ్యులకు కొంత సమయం దొరకుతుంది. కొన్ని వ్యాసాలు బొమ్మలూ కూడా లబిస్తాయి. అలానే మిగిలిన వాటినీ కూడా చేస్తే మేలు. అలానే ఏదో ఒక వ్యాసం పట్టూకొని కొందరు పూర్తి చేయడం బాగుంటుంది. రాజశేఖర్ గారు చెప్పిన ఆంద్రుల దుస్తులు లాంటివి. అలా కొన్ని వ్యాసలపై దృష్టి పెట్టి వాటిని విస్తరించుకొంటూ వెళ్ళటం బావుంటుంది. ఇక చాలా విషయాలలో కొందరు ఆంగ్లవికీని ఉదహరిస్తూ ఇక్కడ జరిగేవాట్కి దాన్ని ఆపాదించడం వలన కొంత పని కుంటుపడుతున్నది. విశ్వనాధ్ (చర్చ) 15:10, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చెప్పినవన్నీ అక్షరసత్యాలు. వారి భావాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నను. సంయమనంతో అందరినీ కలుపుకుని పోగలిగిన మృదుహృదయులైన వారి నాయకత్వం తెవీకీకి ఎంతో అవసరం.--t.sujatha (చర్చ) 15:24, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారి సూచనలకు ధన్యవాదాలు. వారన్నట్లు నేను కూడా పెద్దగా నిర్వహణ చేయాలన్న అసక్తితో తెవికీలోకి రాలేదు. అయితే నేను క్రియాశీలమైన కొన్నాళ్లకు తెవికీ స్థితి బలహీనమవటం( ప్రశ్నలడిగేవారికి సమాధానాలలో విపరీతమైన ఆలస్యం ఒక వుదాహరణ), నిర్వహణ బలహీనపడడంతో (ఈ వారం వ్యాసాల నాణ్యత తగ్గిపోవడం ఒక ఉదాహరణ), నేను స్వచ్ఛందంగా వాటిపై దృష్టిపెట్టి నిర్వాహకుడిగా తరువాత అధికారిగా ఎంపిక కాబడి నా వంతు కృషి చేయడం జరిగింది. అలాగే క్రియాశీలక సభ్యులను పెంచడానికి ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో కొంత కృషి చేయడం జరిగింది. అన్నట్లు నరయం పొడిగింతను వ్యవస్థాపించడం లో వీవెన్ ది కీలకపాత్ర. నేనేదో కొంత పరీక్షించడంలో సహాయం పడ్డాను. అయితే వైజాసత్యగారి నిర్వహణను ప్రాధాన్యతలో రెండవస్థాయికి చేర్చే ప్రతిపాదనతో నేను ఏకీభవించలేను. వికీ అభివృద్ధి అనేది బహుముఖీనం. మొదటిపేజీ కాని, నిర్వహణకాని, వ్యాసాల నాణ్యత అభివృద్ధికాని, వికీప్రచారం కాని, క్రియాశీలక సభ్యుల పెంపుదల కాని దాదాపు సమాన ప్రాధాన్యతగలఅంశాలు. ఒకదానిలో అభివృద్ధి ఇంకొకదానిని అభివృద్ధిపరచేదిగా వుంటుందని నా అభిప్రాయం. మనమెంత వ్యాసాల నాణ్యతను అభివృద్ధి పరచినా వాటిని మొదటిపేజీలో ప్రదర్శించే అవకాశం వదలుకుంటే దాని వలన ఉపయోగం వుండదు. నిర్వహణ ప్రక్రియను సులభతరం చేయడం ఎక్కువమంది దీనిలో పాల్గొనేటట్లు చేయడం బాగుంటుంది. ఇటీవల ప్రవేశపెట్టిన మొదటి పేజీ నిర్వహణ స్థితి పెట్టె, ట్వింకిల్ స్థాపన (అంతకుముందలి హాట్ కేట్ స్థాపన) ఈ దిశలో ఉపయోగకరమైనవనుకుంటాను. అయితే ఏ కార్యక్రమమైనా ఎక్కువమంది సహకారంతో మరియు పాలుపంచుకొనడం ద్వారా జరపడం చాలా ముఖ్యం. దీనికి నాకు వీలైనంతలో నా సహాయం అందజేస్తాను. --అర్జున (చర్చ) 16:44, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ, మీరు తెవికింటా బయటా చేసి కృషి ఎంతో అభినందించదగినది. అందరూ చొరవ తీసుకోవాలి. అదే వికీ నైజం. ఇక చర్చ విషయానికొస్తే నిర్వహణ ఎప్పుడూ రెండవ స్థానంలో ఉండేదే. ఇది నేనంటున్నది కాదు. en:Wikipedia:Product, process, policy మొదటి వాక్యంలోనే ఉన్నది. నేను నిర్వహణకు వ్యతిరేకిని కాదు. అదీ ముఖ్యమైనదే. నిర్వహణను సులభతరం చేయాలనే నా ఆలోచన కూడానూ. మొదటి పేజీలో కొత్త పద్ధతిని నేనింకా పరిశీలించలేదు. మనకున్న వనరులు చాలా తక్కువ, అందునా వికీ స్వచ్ఛంద కృషి (ఎవరినించి ఏదీ డిమాండు చెయ్యలేం) కాబట్టి వీలైనంతగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడితే బాగుంటుంది కదా. నేను ఈ వారం వ్యాసం తొలగించిమనట్లేదు. ప్రతి వారం అదో తప్పని సరి అయిన పనిలాగా మార్చకుండా, విశ్వనాథ్ గారు చెప్పినట్టు నిడిపి పెంచడమో, మంచి వ్యాసం తయారైనప్పుడు ప్రదర్శించడమో చెయ్యెచ్చు అనుకుంటున్నా. మళ్ళీ వికీ ఊపందుకున్న తర్వాత ప్రతి వారం కాకపోతే ప్రతి రోజూ మార్చుకోవచ్చు. లేదూ, ఏవరైనా ఒక సభ్యుడు ప్రతివారం తప్పనిసరిగా మారుస్తానని స్వచ్చందంగా పూనుకుంటే నాకే అభ్యంతరం లేదు. పైన నా వ్యాఖ్యలో కూడా అన్ని నిర్వహణా పనులు ఆపి వెయ్యమనలేదు. ఉదాహరణకి ఇటీవల గమనించిన ఒక చిన్న విషయం ద్వారా నేను ఎలాంటి నిర్వహణను వద్దంటున్నానో మీకు తెలియజేస్తాను. ఎవరో ఒక సభ్యుడు / సభ్యురాలు, ఆంగ్ల శీర్షికతో ఒక విషయంలేని ఏక వాక్య పేజీని ఆంగ్లంలో సృష్టించారు. దానిని గమనించిన మీరు త్వరిత తొలగింపు మూసను అంటించారు. అందులో తొలగించడానికి ఇతర సభ్యులు వ్యతిరేకించడానికి, చర్చలకు, వాదనలు, ప్రతివాదనలకు. ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా అని మీరు ఆ పేజీని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అభ్యంతర పరిస్తే వాదనలూ ప్రతివాదనలు, ఏవీ జరగపోతే మళ్లీ మీరు కొన్నాళ్ళాగి వచ్చి చూసి దాన్ని ఒకరో ఒక నిర్వాహకుడు తుడిచెయ్యాలి. ఒక్క నొక్కుతో తుడిచేసే వ్యాసానికి ఇంత ప్రాసెస్ అవసరమా?? అన్నదే నా ప్రశ్న. ఈ ఉదాహరణలో మీరు చేసిన ఈ చిన్న పనిని విమర్శనాత్మక దృష్టితో విశేష్లిస్తున్నానే కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడంలేదని గమనించగలరు. లక్షలాది మంది పాల్గొనే ఆంగ్ల వికీలో అలాంటి పద్ధతి సమంజసమైనదే. కానీ తెవికీలో అది ఆచరణీయం కాదు. మన వికీ పెరుగే కొద్దీ ప్రాసెస్‌లు మరింత క్లిష్టంగా తయారవుతాయి. అది తప్పదు. కానీ ప్రస్తుత మన పరిస్థితిలో కొన్నింటిని సులభతరం చెయ్యటం ముఖ్యం. మరో విషయం, ఇప్పటికిప్పుడే ఈ చర్చ ఒక నిర్ణయానికి రావాలని ఈ చర్చను ప్రారంభించలేదు. కేవలం ఆ దిశగా ఆలోచింపచెయ్యటానికే ప్రారంభించబడినది. --వైజాసత్య (చర్చ) 05:39, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • లింకు తెలియచేసినందులకు ధన్యవాదాలు. దానిని నిశితంగా పరిశీలించినమీదట అది ఒక వ్యాసమని (కొందరి అభిప్రాయాలగురించిన వివరం) దానికి విరుద్ధంగా ఇతర అభిప్రాయాలున్నాయని దానిచర్చాపేజీద్వారా తెలిసింది. అయితే తెవికీలో మొదటి పేజీలో ప్రదర్శన విషయాల తాజా చేయు అంతరాన్ని పెంచితే ( (ఉదా:వారం నుండి రెండు వారాలకి)తెవికీపురోగతికి ప్రతికూలంగా వుంటుందని నేను భావిస్తాను. గూగుల్ ద్వారా దాదాపు 1000వ్యాసాలు చేరినవిగనుక మొదటిపేజీ పుటన రోజువారీగా తాజా చేయటానకి గొప్ప అవకాశంవున్నప్పుడు ఈ ఆలోచన నాకు సమర్ధనీయంగా లేదు. ఇక మీరు వుల్లేఖించిన నిర్వహణ ఉదాహరణ కొత్త ట్వింకిల్ ఉపకరణం పరీక్ష చేయడానికి నేను సాధారణ సభ్యుడుగా చేస్తున్న పని. ఇది ఎలా వాడాలో కొత్త సభ్యులు కూడా తెలుసుకోవాలన్నది ఒక వుద్దేశ్యము. ఇంకా దానివలన కూడా కొత్తగాతెవికీలో పనిచేసేవారికి కొంత వుపయోగంగా వుంటుంది. తెవికీ నిబంధలకు సరిపోని వ్యాసాలను వెంటనే తొలగించేబదులు ట్వింకిల్ వాడి వ్యాఖ్య చేర్చడంద్వారా, వారు తెవికీనియమాలు అర్ధంచేసుకోవడానికి వుపయోగంగా వుంటుంది. మీరు చర్చను ప్రారంభించటంలో వుద్దేశాన్ని స్పష్టంచెయ్యడం సంతోషం. నేను మీతో చర్చలలో పాల్గొన్నది అంత లేదుకనుక, చాలా అనుభవం వున్న సభ్యులే స్పందించారు కాబట్టి, ఇతర అభిప్రాయాలుకూడా వుంటాయి అన్నది తెలియచేయడానికి, చర్చను నిజమైన అర్ధవంతమైనదిగా చేయటానికి వుద్దేశించినదిగా నా స్పందనని గమనించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:52, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యము జేసెను నిర్వహ
ణ మంచిగన్, అరుజునుండు జూసెను పిదపన్
బహుచక్కగ జేయుమిపుడు
ఎవరయినన్, నిలబెటుమ్ము ఎత్తున తెవికిన్

—సి.చంద్ర కాంత రావు

వైజాసత్య గారు ప్రారంభించిన చర్చను కొందరు సభ్యులు సరిగా అర్థం చేసుకొనక ఆధిపత్యం కొరకేనని భావించిన తరుణంలో నేనీ పద్యము రచించితిని. ఇది ఎవరికి అనుకాలం గాదు, ప్రతికూలమూ కాదని అర్థంచేసుకొనగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:17, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • చంద్రకాంతరావు గారు కవియని ఈ వ్యాఖ్యద్వారా ఇప్పడే తెలిసింది. బహుశా తెవికీ క్రియాశీలక సభ్యులలో ఈ నైపుణ్యంగలవారు వీరు వొక్కరేమో. వారి స్పందనను పద్యరూపంగా తెలిపినందులకు నేను చేసిన కృషిని గుర్తించినందులకు నా హృదయపూర్వక అభివందనలు. ఇక వారి రెండవ వ్యాఖ్య (ఆధిపత్యం గురించి) నా వ్యాఖ్యకు సంబంధించినదైతే వారు పొరబడ్డారనుకుంటాను. తెవికీలో నా కృషిని వ్యక్తిగత కారణాలవలన తగ్గించుకుంటున్నానని అందరికి తెలిసినదే. ఈ తరుణంలో చాలా అనుభవమున్న వీకీపీడియన్లు క్రియాశీలం కావటం నాకు ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అలా జరగకపోతే తెవికీని అలా వదిలేసి వెళ్లానన్న బాధవుండేది. చంద్రకాంతరావుగారు కూడా నాతో ఏర్పడిన చర్చలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తిగతంకాదు కనుక వాటిని మరచి తెవికీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను. వారిని వుద్దేశ్యపూర్వకంగా కాకపోయినా నొప్పించినందులకు నా క్షమాపణలు తెలియచేస్తున్నాను. --అర్జున (చర్చ) 14:07, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జుననరావుగారూ ! మీకు ఆదిపత్య ధోరణి అసలు లేదు. అనుభవస్తులైన సభ్యులను తిరిగి క్రియాశీలకం చేసిన ఘనత మీదే. తెవీకీలో అధికారి లోపించిన తరుణంలో చొరవతీసుకుని బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు. మాకు మీ నాయకత్వం తప్పక అవసరం. దయచేసి తెవీకీకి దూరం కాకండి. మీ ఇద్దరి మద్య సుహృద్భావం చోటు చేసుకున్నందుకు ఆనందించే వారిలో నేను మొదటి స్థానంలో ఉన్నానని చెప్పడానికి ఆనందిస్తున్నాను.--t.sujatha (చర్చ) 15:32, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారు, "ఆధిపత్యం కొరకు కొందరు సభ్యులు భావించినట్లు" అని చెప్పినది మీ వ్యాఖ్య గురించి కాదండి. వైజాసత్యగారు ప్రారంభించిన చర్చకు అసలు సమాధానం ఎవరూ ఇవ్వలేరు, తలో రకంగా చర్చ ఉద్దేశ్యాన్ని భావించి ఒక్కోరకంగా వ్యాఖ్యచేశారు. అందరి చర్చలను పరిశీలించి కొందరి ఉద్దేశ్యాన్ని గమనించే నేను అలా చెప్పవలసి వచ్చింది. ఈ చర్చలో నేను తలదూర్చరాదనుకున్ననూ చివరకు మళ్ళీ తప్పలేదు. అలాగే నా పద్యాన్ని గుర్తించినందులకు కృతజ్ఞతలు. నేను ఇప్పుడిప్పుడే తెవికీలో క్రియాశీలం కావడం కూడా కుదరదు. మీతో ఇదివరకు జరిగిన అభిప్రాయబేధాలు కూడా చర్చలలో భాగమే కాబట్టి దీనికి క్షమాపణలు కూడా అవసరం లేదు. ఎందుకనే విషయం మీకు తెలిసే ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:08, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అజమాయిషి నొక్కరు ని
క్కడ జేసిరనిన్ నెనున్ జెప్పిన విషయంబున్
మీకున్ భావింపదగన్
జెప్పినదితరులు కనుంబు చర్చన్ అర్జున

—సి.చంద్ర కాంత రావు

ఇదివరకే నేను చేసిన వ్యాఖ్యకు ఇది పద్యరూపం మాత్రమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:11, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం జరుగుతున్నది ఏ కార్తె అని తెలుసుకోవడం ఎలా?

[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్నది ఏ కార్తె అని తెలుసుకోవడం ఎలా?, సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు, సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడో క్యాలెండర్ చూసి తెలుసుకోవడమెలా? ఉదాహరణకు క్యాలెండర్ లో జనవరి నెలకు సంబంధించిన పేజీలో 24 శ్రవణకార్తె ఉ.7.07 అని ఉంది, అంటే జనవరి నెల 24 వ తేదిన ఉదయం 7 గంటల 7 నిమిషాలకు శ్రవణకార్తె ప్రారంభమయినట్టా, పూర్తయినట్టా, వివరంగా తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 02:00, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ రచ్చబండ లో ఏ విషయం అయినా చర్చించవచ్చా! తెవికీ కి సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించాలా!తెలుపగలరు.106.206.176.93 03:06, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ కి సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించాలి. Chavakiran (చర్చ) 07:42, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారూ, జనవరి నెల 24 వ తేదిన ఉదయం 7 గంటల 7 నిమిషాలకు శ్రవణకార్తె పూర్తయినట్టు భావించ వలెను.106.206.21.21 03:15, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మహిళా దినోత్సవం సందర్భంలో

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న కొన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు కూడా మహిళా దినోత్సవ సంబంధిత వ్యాసాలను మెరుగు పరచటం ఇంకా సృష్టించటం చేయవచ్చు, భారతదేశంలో జరిగే వివిధ కార్యక్రమాల వివరాలు: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details రహ్మానుద్దీన్ (చర్చ) 10:52, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సందర్భంగా ఈ నెల రోజులు వికీపీడియాలో ఆంగ్లమే కాకుండా, తెలుగుతో సహా అన్ని భారతీయ భాషలలొ మహిళలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధిచేయడం లేనివి ప్రారంభించడానికి నడుం బిగించింది. సుజాత లాంటి సీనియర్ సభ్యులు ఈ విషయంలో కొంత మార్గదర్శకులుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియాలో నడిపించాలని, దానికి మిగిలిన రచయితలు సహకరించవలసినదిగా మనవి చేసుకొంటున్నాను.Rajasekhar1961 (చర్చ) 07:07, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రహ్మానుద్దీన్ గారు మరియు రాజశేఖర్ గారు. http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details లో t.sujathaగారు మరియు వైజాసత్యగారు 'Suggested Articles' లో కొన్ని తెలుగు అంశాలను సూచిస్తే చాలా బావుంటుంది. వారు దీనికి నడుం బిగించి మిగితా సభ్యులకు ప్రోత్సాహం కలిగిస్తారని ఆశిస్తూ...విష్ణు (చర్చ) 14:43, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలోని మహిళలకు సంబంధించిన అన్ని వర్గాల్ని భారతీయ మహిళలు అనే వర్గానికి మార్చి దానికి ఆంగ్ల వికీ లింకు ఇచ్చాను. మీరంటున్నది తెలుగు మహిళల పేర్లను ఈ జాబితాలో చేర్చమనా. లేదా వేరుగా తెలుగు మహిళల జాబితా తయారుచేయాలా. తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 14:56, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు మీరు చేసింది బావుందండి. అలాగే 'Suggested Articles' లో తెలుగుకి ఒక సబ్ సెక్షన్ (5.2) చేసి అందులో కొన్ని అంశాలు (తెలుగులో) సూచిస్తే బావుంటుందేమో. మీరేమంటారు? విష్ణు (చర్చ) 16:07, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన. మీరంటున్నది నేను సరిగా అర్ధం చేసుకుని ఉంటే.. ఈ ఆంగ్ల వికీ పేజీలో తెలుగు విషయాలు జోడించాలా?? వికీపీడియా:సముదాయ పందిరిలో ప్రకటించి తెవికీలోనే కొన్ని వ్యాసాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందేమో? ఆంగ్ల వికీకి వచ్చిన కొరతేమీ లేదండి. భావి తెలుగు జాతంతా చదివేది, వ్రాసేది ఆంగ్లంలోనే కదా. కాబట్టి ఎప్పుడో ఒకసారి అక్కడ వ్యాసాలు చేరుస్తారులే. --వైజాసత్య (చర్చ) 04:47, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు మీరు అన్నట్టుగా వికీపీడియా:సముదాయ పందిరిలో ప్రకటించడం ఉత్తమం. అలాగే ఆంగ్ల వికీ పేజీలోనూ పెడితే National Visibility మరియు కొత్త వారిని ఆకర్షించ వచ్చేమోనని చిన్న ఆశ -- విష్ణు (చర్చ) 07:36, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అందరం దుర్గాబాయి దేశ్‌ముఖ్ వ్యాసాన్ని విస్తరిద్దాం ఏవంటారు? మరేమైనా ప్రతిపాదనలు --వైజాసత్య (చర్చ) 06:00, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు... నేను సరోజినీ నాయుడు & సురభి కమలాబాయి వ్యాసాలను విస్తరించడానికి నా వంతు కృషి చేస్తానండి విష్ణు (చర్చ) 07:46, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, మేధాపాట్కర్ మరియు మరికొన్ని విశిష్ట మహిళల జీవిత చర్రిత్రలను మహిళా దినోత్సవం లోపు పూర్తిగా విస్తరిస్తాను.(  కె. వి. రమణ. చర్చ 13:11, 1 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
ఈ కింది వ్యాసాలను పరిశీలించండి. ఇంకా మీకు తోచిన వ్యాసాలను చేర్చండి. మహిళాదినోత్సవ వ్యాసాలు :- సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, మొల్ల

, ఝాన్సీ లక్ష్మీబాయి , రుద్రమదేవి , ఫ్లారెన్స్ నైటింగేల్ , మదర్ తెరెసా , శోభానాయుడు , మార్గరేట్ థాచర్ , మేరీ క్యూరీ , సిరిమావో బండారినాయకి , ఎం. ఎస్. సుబ్బలక్ష్మి , ఇందిరా గాంధీ , మేధాపాట్కర్ , పి.సుశీల , ఎస్.జానకి , భానుమతి రామకృష్ణ , పసుపులేటి కన్నాంబ , కస్తూరిబా గాంధీ , జానంపల్లి కుముదినీ దేవి , గ్యాన్ కుమారీ హెడా. ఆంగ్ల వికీపీడియాలో 41 మంది మహిళా నోబెల్ పురస్కార విజేతల గురించి వ్యాసాలున్నాయి. లింకు: en:Category:Women Nobel laureates వీటిలో అన్నింటిని కాకపోయినా సుకీ, మేరీ క్యూరీ, మదర్ తెరెసా వంటి కొంతమంది గురించి తెలుగు వికీలో వ్యాసాల్ని అనువదించితే చాలా మంది విద్యార్ధులకు, యువతకు మార్గదర్శకులవుతారు. జేన్ ఆడమ్‍స, కోరీ, గ్రీడర్, క్యూరీ, మొంటాల్సినీ, జోడీ విలియంస్, యాలో, యోనాత్ వ్యాసాలు బాగున్నాయి.Rajasekhar1961 (చర్చ) 13:31, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చొరవ విజయవంతంకావాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 14:37, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]