బాదంపాలు
బాదం పాలు అనునది బాదం పప్పు నుండి తయారు చేయ బడిన పానీయం. ఇది పాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. జంతువుల పాల వలె బాదం పాలు క్రొవ్వులు, పాల చక్కెర లను కలిగి ఉండవు. ఇది జంతువుల యొక్క ఉత్పత్తులను కలిగియుండనందువల్ల శాఖాహారులకు, పాల ఉత్పత్తులను వాడని వారికి ఉపయోగకరమైనది. వాణిజ్యపరంగా బాదంపాల ఉత్పత్తులు సాధారణ, వెనీలా, చాక్లెట్ రుచులను కలిగి ఉంటాయి.కొన్ని సందర్భాలలో విటమినులు తో కూడి ఉంటాయి. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా. గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా మరియు చక్కెరలను రుచి కోసం కలుపుతారు.[1]
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
విషయ సూచిక
తయారు చేసే విధానమును తెలుపు చిత్రాలు[మార్చు]
చరిత్ర[మార్చు]
మధ్య యుగాల నాడు బాదం పాలు ఇస్లామిక్ ప్రపంచం మరియు క్రిస్టియన్ రాజ్యముల లో బాగా ప్రాచుర్యం లో కలవి. ఉపవాస దీక్షలో ఉన్నపుడు వారు బాదం చెట్ల నుండి వచ్చెడి బాదం పప్పు నుండి తయారుచేసిన పానీయమును ఉపయోగించెడివారు. ఎందువలనంటే ఆవు పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము కనుక.
చరిత్రలో బాదం పాలను amygdalate అనికూడా పిలుస్తారు. ఇది ఒక మతం వల్ల ఐబేరియన్ ద్వీపం నుండి తూర్పు ఆసియా వరకు విస్తరణ అంతరించిపోయినది.[2]
14 వ శతాబ్దంలో ఔషధములు చేయు విధానములను సేకరించినపుడు ఉపవాసం చేయునపుడు బాదంపాలను జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని సిఫారసు చేయబడినది.[ఆధారం చూపాలి]
ఆహారం[మార్చు]
బాదం పాలు అనేది రెండు సంవత్సరములు లోపు పిల్లలకు యిచ్చెడి తల్లి పాలకు,ఆవుపాలకు,లేదా చర్మ వ్యాథులు గల పిల్లలకు యిచ్చే హైడ్రోలైజ్డ్ సూత్రములు గల పాలకు ప్రత్యామ్నాయం కాదు. ఎందువలనంటే అది తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. [3]
యివి కూడా చూడండి[మార్చు]
సూచికలు[మార్చు]
- ↑ "Silk Pure Almond". Silk Pure Almond. Retrieved 2012-02-16.
- ↑ "Vegetarians in Paradise/Almond History, Almond Nutrition, Almond Recipe". Vegparadise.com. Retrieved 2012-02-16.
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
బయటి లింకులు[మార్చు]
- Karen Knowler (2007-05-13). "The Raw Food Coach: Almond Milk". YouTube. Retrieved 2008-01-23.
- James L. Matterer (2000). "Almond Milk". Gode Cookery. Archived from the original on 6 April 2009. Retrieved 2009-04-12. External link in
|work=
(help) - Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).