చిరతపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?చిరతపూడి
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°23′02″N 81°32′38″E / 16.3838°N 81.5440°E / 16.3838; 81.5440Coordinates: 16°23′02″N 81°32′38″E / 16.3838°N 81.5440°E / 16.3838; 81.5440
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) తూర్పుగోదావరి జిల్లా
కోడులు
పిన్‌కోడు
వాహనం

• 533229
• AP 06


చిరతపూడి
—  రెవిన్యూ గ్రామం  —
చిరతపూడి is located in Andhra Pradesh
చిరతపూడి
చిరతపూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°23′02″N 81°32′38″E / 16.3838°N 81.5440°E / 16.3838; 81.5440{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అంబాజీపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,349
 - పురుషులు 1,686
 - స్త్రీలు 1,663
 - గృహాల సంఖ్య 936
పిన్ కోడ్ 533 229
ఎస్.టి.డి కోడ్

చిరతపూడి / (ఆంగ్లములో: Chirata Pudi), ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామము.[1]. దీని తపాలా ఇండెక్స్ సంఖ్య (అనగా PIN Code) 533 229. అయినవిల్లి, కొత్తపేట మరియు కపిలేశ్వరపురం దీని సమీపంలో వున్న మండలాలు. ఈ గ్రామము. రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే దారిలో వస్తుంది. కోనసీమ ప్రాంతంలో వున్న ఈ గ్రామంలో వరి ప్రధాన పంట. కూరగాయలు పండించడంతో పాటు చిరాతపూడిలో అరటి మరియు కొబ్బరి తోటలు ఎక్కువగా కానవస్తాయి. చిరతపూడి గ్రామ పంచాయతీ కోడ్ 201792.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

చిరతపూడి గ్రామముపూర్వ కాలమునుండి కోనసీమలోని పంచకేశవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్దిపొంది యుండెడిది. ఈ గ్రామములో పెద్దాపురం మహారాజావారు అయిన శ్రీ వత్సవాయి తిమ్మజగపతి రాజా వారిచే నిర్మించబడిన రెండు ప్రసిద్ధ దేవాలయములు ఉన్నాయి. ఒకటి శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయము మరియు పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయము. ఇవి చాల పురాతన దేవాలయములు. కాని, ముస్లిముల దండయాత్రల సమయములో స్వామివారి విగ్రహము ఖండమయినది అని, తరువాత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము నిర్మించారు. ఈ వేణుగోపాలస్వామిని దర్శించుకున్నవారికి వారు కోరుకోకుండానే వారికి కలిగిన ఆపదలు, కోరికలు తీరుస్తాడని, అదేవిధంగా ఈ స్వామి కళ్యాణగోపాలుడని అంటారు. వివాహముకానివారు ఈ స్వామికి అభిషేకము, అర్చన చేసినంతనే వారికి వివాహము జరుగుతుందని, వివాహము జరిగిన పిదప సతీసహితముగ స్వామివారికి కళ్యాణము నిర్వహించితే వారి దాంపత్యము సుఖసౌఖ్యాలతో ఉంటుందని ప్రతీతి. 1996 కోనసీమలో సంభవించిన తుఫాను సమయములో పై రెండు దేవాలయములలోని ధ్వజ స్తంభములు పడిపోయినవి. శివాలయములోని ధ్వజ స్తంభమును పునరుద్దరించారు. కాని, ఎండోమెంట్ వారి నిర్లక్ష్యము కారణంగా, వేణుగోపాల స్వామి వారి ఆలయములో ధ్వజస్తంభమును పునరుద్దరించలేదు. సదరు దేవాలయమునకు ఆదాయమున్నను, ఆలయమును సరిగా నిర్వహించుటగాని చేయుటలేదు. తగిన శ్రద్ధ తీసుకొమ్మని, ధ్వజస్తంభమును పునరుద్దరించమని ప్రజలు ఎండోమెంట్ వారిని కోరుచున్నారు.

శివాలయమునందు వెలసిన పార్వతీ బ్రహ్మేశ్వరస్వామి వారు సర్వగ్రహపీడలను తొలగిస్తాడని, స్వామికి సోమవారము అభిషేకము చేయించిన వారికి గ్రహబాధలు తొలగి, రోగపరిహారము కలుగుతుందని పెద్దల మాట. ప్రతి సంవత్సరము కనుమ పండుగరోజు ప్రభల ఉత్సవము, తీర్ధము కన్నుల పండుగగా నిర్వహిస్తారు. చుట్టుప్రక్కల గ్రామల ప్రజలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు. మరియు, 2011 మే 23 వ తేదీన గ్రామములో సాయిబాబా ఆలయము కూడా నిర్మించారు. గ్రామము, పచ్చని కొబ్బరి తోటలతో, వరి చేలతో, కళకళ లాడుతూ, దేవాలయములతో ఆధ్యాత్మికతతో నిరంతరము భాసిల్లుతున్నది. గ్రామములోని, గోపాలస్వామి ఆలయము, శివాలయము, సాయిబాబా గుడి, వనుములమ్మ గుడి చూడదగిన స్థలములు.

గ్రామ జనాభా[మార్చు]

అక్షాంశ రేఖలు : 16°38'38"ఉత్తరం 81°54'40"తూర్పు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,349 - పురుషుల సంఖ్య 1,686 - స్త్రీల సంఖ్య 1,663 - గృహాల సంఖ్య 936

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,273.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,633, మహిళల సంఖ్య 1,640, గ్రామంలో నివాస గృహాలు 860 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://panchayatdirectory.gov.in/adminreps/viewpansumSQL.asp?selstate=4870&parenttype=B&ptype=V
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14




మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చిరతపూడి&oldid=2736404" నుండి వెలికితీశారు