వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతిపాదనపై చర్చ

[మార్చు]

ప్రారంభించబడింది. 23పిభ్రవరి2013 00:00(UTC) లోపల అభ్యంతరాలు లేకపోతే వచ్చినఅభ్యంతరాలను పరిష్కరించబడితే ఈ ప్రతిపాదన అమలులోకి వస్తుంది. ఇది ఓటింగు కు సంబంధించినది కాబట్టి పూర్తిసమ్మతికొరకు ప్రయత్నించడంజరుగుతుంది.--అర్జున (చర్చ) 03:30, 15 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన బాగున్నది. దీనిపై యే అభ్యంతరం లేదు.( కె.వి.రమణ- చర్చ 13:13, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
ఓటింగ్ హక్కుకు గణాంకాల జాబితా ప్రకారం దిద్దుబాట్లు పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తాను. గణాంక జాబితా అనేది ఎప్పటికప్పుడు తాజాకరణ చేయరు. అలాంటప్పుడు రెండు, మూడు నెలల క్రితానికి సంబంధించిన గణాంకాల ఆధారంగా ఓటుహక్కు కల్పిస్తే ఈ మధ్యన వచ్చి చురుకుగా దిద్దిబాట్లు చేస్తున్న సభ్యులకు అవకాశం కల్పించనట్లవుతుంది. అసలు ఏ ఓటింగులోనైనా అప్పుడు చురుకుగా ఉన్న సభ్యులకే ఆ విషయంపై మంచి అవగాహన ఉంటుంది. అంతేకాకుండా 100 దిద్దుబాట్లు అంటే ఏ దిద్దుబాట్లు స్పష్టంగా తెలియజేయాలి. కేవలం వ్యాసపు దిద్దుబాట్లేనా లేదా వ్యాసేతర దిద్దుబాట్లు కూడా కలుపుకొని పరిగణించాలా? మరోముఖ్యమైన ఆక్షేపణ ఏమిటంటే గణాంకాల జాబితాలో ఉన్న పేర్లు కేవలం ఆ నెలలో దిద్దుబాట్లు చేసిన 50 సభ్యులకు మాత్రమే సంబంధించి ఉంటాయి. చురుగ్గా లేని మరో 20 సభ్యుల గణాంకాలు వాటికింద ఇస్తారు. కాని 100 దిద్దుబాట్లు చేసి ఆ నెలలో చురుగ్గా లేని సభ్యుని ఎలా అంచనా వేయాలి? ఉదా:కు డిసెంబరు 2012 మాసపు గణాంకాల జాబితా ప్రకారం 108వ ర్యాంకు సభ్యుడు కూడా 112 దిద్దుబాట్లు చేశాడు. క్రింద ఇచ్చిన చురుకుగా లేని సభ్యుల గణాంకాలు 36వ ర్యాంకు (896 దిద్దుబాట్లు)తోనే అంతమైనాయి. మరి 37 నుంచి 108వ ర్యాకు లోపు సభ్యులెవరూ? ఆ ర్యాంకులోపు ఉన్న సభ్యుడికి ఓటు హక్కు ఎలా వర్తించాలి? ఒక సభ్యుడు ఒక్క రోజులో 100 అతిచిన్న దిద్దుబాట్లు చేయగలడు, మరో సభ్యుడు రోజూ ఆలోచించి ఒకటి రెండూ దిద్దుబాట్లు మాత్రమే చేసిననూ పెద్దపెద్ద దిద్దుబాట్ల ద్వారా మంచి వ్యాసాలను తయారుచేస్తాడు. మూడు మాసాలు గడిచిననూ విషయపరిజ్ఞానమున్న సభ్యుని దిద్దుబాట్లు 100 మించవు కాని అదే కాలంలో కొందరు నాలుగంకెల దిద్దుబాట్ల సంఖ్యను చేరవచ్చు. ఇలాంటప్పుడు కేవలం సంఖ్య ఆధారంగానే ఓటుహక్కు కల్పించడాన్ని ఆలోచించాలి. దానికి మరోమార్గం ఏమిటంటే సభ్యత్వం సీనియారిటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కనీసం ఇన్ని సభ్యులు పాల్గొనాలని ఉన్ననూ అందులో కనీసం కొందరు (2 లేదా 3) నిర్వాహకులు కూడా పాల్గొని ఉండాలి అని ఉంటే బాగుంటుంది. అలాగే మిగితా పాయింట్లలో కూడా స్పష్టత లేదు. ఇలాంటివి తర్వాత మళ్ళీ వాదనలు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:03, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందనలకు ధన్యవాదాలు. నిర్వాహకుల కనీస సంఖ్య సూచన బాగుంది. ఇద్దరు నిర్వాహకులు కనీసం పాల్గొనాలి అనేదీ నాకు అంగీకారమే. ఇక మార్పులు అనేది తెవికీలో మొత్తం మార్పులు అనే అభిప్రాయంతో వాడాను. వికీమీడియా ఫౌండేషన్ గణాంకాలపై ప్రత్యేకశ్రద్ద చూపిస్తున్నది. (దీనికి ప్రత్యామ్నాయమైన ప్రతి నెల తాజాపరిచే జాబితా చాలా నెలలనుండి క్రియాశీలంగా లేదు.) ఇక గణాంకాల జాబితా నెల లేక రెండు నెలలక్రితానివి కాబట్టి, సభ్యత్వ సీనియారిటీ నేరుగా పేర్కొనకుండా ఉపయోగించబడింది. చురుకుగా పనిచేస్తున్న వారే సామాన్యంగా చర్చలో పాల్గొంటారు కాబట్టి, గణాంకాల జాబితా వుపయోగంగా వుంటుంది. ఒకవేళ వేరే వారు పాల్గొంటే ప్రత్యేక ఉపకరణాల ద్వారా మొత్తము మార్పులు తెలుసుకొని మరియు వారి ఇటీవలి రచనలను పరిశీలించి గణాంకాలజాబితా తేదీన వారి మార్పులు లెక్కకట్టి వారి అర్హతను నిర్ణయించవచ్చు. ఈ ప్రతిపాదన చిత్తు ప్రతిపాదనగానే చూడండి. అందరి సహకారంతో మెరుగు చేద్దాం. ఇంకేదైనా సూచనలుంటే తెలియజేయండి.--అర్జున (చర్చ) 12:00, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అభ్యంతరం లేదు.పాలగిరి (చర్చ) 02:49, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మరల చదివిన తరువాత నియమం "ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, ఆరునెలలు ఆదే విషయంపై ఓటు పెట్టకూడదు." ఇబ్బందికరమైనదనిపిస్తున్నది. ఎందుకంటే ఓటింగు లో స్వల్పమార్పులు ఎవరైనా ప్రతిపాదించి అది వీగిపోతే మార్పులు చేయటానికి ఇది ప్రతిబంధకమవుతుంది. అందుకని దీనిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:07, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగైనచో కాలవ్యవధిని తగ్గించవచ్చును.పాలగిరి (చర్చ) 04:12, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదించిన పిదప వారి ప్రతిపాదన వీగిపోతే అది మళ్ళీ కొత్తగా ప్రతిపాదించడానికి సమయం అవసరమే. అది 6 నెలలు అవసరం లేదు కాని 60 లేదా 90 రోజులైనా ఉండాలి. లేనిచో మళ్ళీమళ్ళీ అదే విషయాన్ని ప్రతిపాదించడంతో సభ్యుల విలువైన సమయము వృధాకావడమే కాకుండా వ్యాసరచనలపై నుంచి దృష్టి ప్రతిపాదనలపై చర్చించడానికే మరులుతుంది. అలాంటి నిబంధన లేనిచో తర్వాత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ప్రతిపాదించిన సభ్యునికి వద్దని చెప్పడానికి కూడా వీలుండదు. భవిష్యత్తులో అలాంటి సభ్యులు కాని, అలాంటి అవకాశం కాని, అలాంటి సందర్భంకాని రాదని చెప్పలేము కాబట్టి ముందే జాగ్రత్తపడాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:22, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతారావు గారుచెప్పినట్లు కాలవ్యవధిని 60లేదా 90 రోజులకు తగ్గించి,వరుసగా మూడుసార్లు ప్రవేశపెట్టి వీగిపోతే అట్టి ప్రతిపాదనను మళ్ళిప్రవేశపెట్టుటకు కాలవ్యవధిని పెంచిన బాగుంటుందేమో?పాలగిరి (చర్చ) 03:10, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీసూచనలు బాగున్నాయి. ప్రతిసారి ప్రతిపాదనకి కొంత తేడావుండాలి. రెండు సార్లు ఏకాభిప్రాయంలో విఫలమైతే, వెంటనే మరల అదే విషయంపై ప్రతిపాదన ఎవరూ చేయరనుకుంటాను. మరల ప్రతిపాదన చేయటానికి కాలవ్యవధిని 60 రోజులకు తగ్గిద్దాం.
ప్రతిపాదన సవరించబడింది. --అర్జున (చర్చ) 03:49, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చకు కాస్త లేటుగా వచ్చాను. ఏం జరుగుతుందో అర్ధం చేసుకునే భాగంగా కొన్ని ప్రశ్నలు. ఈ ఓటింగు పద్ధతిని నియమాల అవసరం ఎందుకు వచ్చింది? వికీపీడియాలో ఓటింగు ప్రక్రియకు పరిధులేంటో అర్ధం చేసుకోవాలి. (వికీపీడియా ప్రజాస్వామ్యం కాదు అన్న మార్గదర్శకం కూడా ఉన్నది) ఇది వరకు కొన్ని ఓటింగులు జరిగాయి. వాటిని తిరగేస్తే కొన్ని అనుభవాలను నుండి నేర్చుకొవచ్చు --వైజాసత్య (చర్చ) 05:47, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గత సంవత్సరము వున్న నియమాలను పాటించడానికి సంబంధించి చర్చలలో పాల్గొంటున్న కొద్ది మందిలో అభిప్రాయ భేదాలు వెల్లడయ్యాయి. వాటిని పరిష్కరించడానికి నియమాలను మెరుగుచేద్దామనుకున్నా మరల అభిప్రాయభేదాలు కనబడ్డాయి. వీటిని పరిష్కరించడానికి మరియు కొత్త నియమాలు చేయడానికి పాటించిన గత పద్ధతులు నా పరిశీలనలో (వ్యాసాల తొలగింపు చర్చలు,లేక నిర్వాహకులు నియామకఎన్నికలు) కనబడలేదు. తెవికీలో కొన్ని నియమాలు (ఉదా: నిర్వాహకులు క్రియశీలంగా లేకపోయినా వారి నిర్వాహకత్వాన్ని తొలగించటం గురించి) ఏర్పడలేదు. ఇది ఇలాగే కొనసాగితే తెవికీ ప్రగతికి అవరోధంకాగలదు. అందుకని ఇంగ్లీషు వికీలో పద్ధతులను పరిశీలిస్తే ఏ ప్రతిపాదనకైనా ఏకాభిప్రాయంకొరకై ప్రయత్నించినమీదట వ్యతిరేఖతను ఓటింగ్ ప్రక్రియ ద్వారా అంచనావేసే పద్ధతి వున్నట్లు తెలిసింది. అయితే అది కూడా నిర్దిష్టంగా లేదు. ఒక నిర్దిష్టమైన పద్దతి వుంటే కొత్త నియమాలు చేయడం సులభమవుతుంది. అలాగే దీనిని వివాదాలు ఏర్పడినప్పడు పరిష్కరించడానికి వీలైతే వాడుకోవచ్చు. --అర్జున (చర్చ) 08:34, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఓటింగు పద్దతిని వికీపీడియాలో అరుదుగా మాత్రమే ఉపయోగిస్తారు. అది కూడా ఏకాభిప్రాయాన్ని అంచనా వేయటానికి మాత్రమే కానీ ఏకాభిప్రాయం సాధించటానికి కాదు. తెవికీలో ఏకాభిప్రాయం సాధించడానికే కావలిసిన సభ్యులుండరు ఇక ఓటింగు ప్రక్రియకు సరేసరి. తెవికీలాంటి చిన్న వికీల్లో నిర్వాహకుల చర్యలు ఏకపక్ష నిర్ణయాల్లాగా కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. మిమ్మల్ని నిరుత్సాహపరచడం నా ఉద్దేశ్యం కాదు కానీ తెలుగు వికీ ఓటింగు పద్ధతులు అవలంభించే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నించాలి. en:Wikipedia:Polling is not a substitute for discussion చూడండి --వైజాసత్య (చర్చ) 05:06, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అవును. ఏకాభిప్రాయంలో సాధించడంలో తక్కువమంది పాల్గొన్నా ఎంతకూ తెగని విభేదాలను పరిష్కరించడానికి ఓటింగు పెడితే ఎక్కువ మంది పాల్గొంటారని నాకనిపిస్తుంది. అందుకనే ఈ విధానం ప్రతిపాదించడమైనది. దీని వాడుకను విధానం పేజీ లోను, చర్చలలోను తెలియపరచాను. విధానంపేజీ మరల చదివి మార్పులేవైనా సూచించగలరు.--అర్జున (చర్చ) 05:35, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నీ అనుకున్న సమయానికి తెగాల్సిన అవసరం లేదనుకుంటా. ఎంతకూ తెగని విభేదాలన్నాయంటే అక్కడ స్పష్టంగా ఏకాభిప్రాయం లేనట్టే కదా. అలాంటప్పుడు ఓటింగు నిర్వహించే అవసరం లేదని నా అభిప్రాయం. ఒకసారి తెగని విషయాలను మళ్లీ కొంత కాలం తర్వాత ప్రతిపాదించవచ్చు. కానీ మీరు ఓటింగు పెడితే చాలామంది పాల్గొంటారంటున్నారు కాబట్టి ప్రయోగించి చూద్దాం. కానీ ఎందుకో దీని వళ్ల సమస్యలు మరింత పెద్దవి అయితాయే కానీ పరిష్కారం కావనీ నాకు అనిపిస్తోంది. నిజానికి మనకిప్పటికే సముదాయపు స్థాయికి తగ్గ ప్రాసెస్ మానేజిమెంట్ పరికరాలు ఉన్నాయి. మరిన్ని నిర్వహణా పద్ధతులకు చొప్పించడం అనవసరం లేదు. (నిర్వహణ ఎక్కువైందని అనటం లేదు). సభ్యులు ఈ పద్ధతిని అమలుపరిచే పక్షంలో ఓటింగు గడువును కనీసం రెండు వారాలైనా ఉంచండి --వైజాసత్య (చర్చ) 06:11, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక తెగని విభేదం సమస్య నుండి మరొక తెగని విభేదం సమస్యస్థితి చేరుతున్నా సభ్యులకు నిరుత్సాహమే. చర్చలో పాల్గొనే వారు కొద్దిమంది కావటంతో సమస్య పరిష్కారం కష్టమవుతున్నది. మీ సలహా ప్రకారం మరియు తరువాత ఇతర స్పందనలు లేవుకాబట్టి ఓటింగు గడువుని రెండు వారాలుగా నిర్ణయిద్దాం. దీనివలన సభ్యుల క్రియాశీలత తక్కువగా వున్నందున, ఎక్కువమంది పాల్గొనడానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 16:13, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్ అర్హతకు నియమాలలో స్పష్టత

[మార్చు]

ఇంతకు ముందు జరిగిన చర్చల ప్రకారం మరింత స్పష్టతకోసం, అర్హతను నిర్ణయించడానికి ఓటింగు ప్రారంభం తేదీ నెల కి ముందలి రెండు నెలలు కాక అంతకు ముందు నెలగణాంకాల ప్రకారం కనీసం తెవికీలో ఏవైనా 100మార్పులు చేసినవారు ఓటింగుకు అర్హులు. ఉదా ఓటింగు ఫిభ్రవరిలో ప్రారంభమైతే , నవంబరు నెల గణాంకాలు (నవంబరు నెల చివరితేదివరకు) పరిశీలించబడతాయి.--అర్జున (చర్చ) 09:40, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన సవరించబడింది.--అర్జున (చర్చ) 04:49, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సవరించిన ప్రతిపాదనపై మార్పులు

[మార్చు]

{{సహాయం కావాలి}} సవరించేటప్పుడు స్పష్టతకు పై చర్చావిషయాలతోపాటు కొన్ని పైపై మార్పులు చేయడం జరిగింది. వీటిపై ఏవైనా అభ్యంతరముంటే 25 పిభ్రవరి 2013 23:59 UTCలోగా స్పందించవలసినదిగా కోరడమైనది. --అర్జున (చర్చ) 03:49, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ ఓటింగ్ చేఉడానికి అర్హత విషయంలో కొంత మార్పులు చేస్తే బాగుంటుంది. అనుభవం ఉన్న సభ్యులు ఒక్కోసారి క్రియాశీలకంగా ఉండరు.
మార్పుల సంఖ్య పెరిగినా పరవాలేదు. మొత్తం మార్పులను దృష్టిలో పెట్టుకుని అర్హత ఇస్తే బాగుంటుంది. ఒకసారి ఓటింగ్ అర్హత ఇస్తే అది శాశ్వతంగా ఉండేలా చేయవచ్చు. ఇలా చేస్తే అర్హత గురించిన చర్చలను నివారించవచ్చు, అప్పుడప్పుడూ అర్హత గురించి పరిశీలించవలసిన అవసరం ఉండదు, అనుభవం ఉన్న సభ్యుల సహకారం లభిస్తుంది.
ఓటుహక్కు పొందిన సభ్యుల పేర్లను జాబితా తయారు చేస్తే కొత్తగా అర్హత వచ్చిన వారు ఆ జబితాలో చేరుతూ ఉంటారు. ఉదాహరణకు అర్హత 500-1000 మార్పులు అని నిర్ణయిస్తే. వారి ఓటుహక్కు శాశ్వతంగా ఉంటుందన్నమాట. --t.sujatha (చర్చ) 04:26, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతిపాదనలో కనీస మార్పులు 100గా సూచించాము. ఒకసారి అర్హతపొందితే అది శాశ్వతమే, అది సభ్యునిపై ఏదైనా నిరోధం విధించితే తప్ప. మీరు సూచించిన జాబితా సలహా బాగుంది. వీలు వెంబడి దానిని తయారుచేయవచ్చు. --అర్జున (చర్చ) 04:47, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతిపాదనలు బాగున్నాయి. 100 మార్పులు ఒక నెలరోజులలో బాగుంటుంది. ఈ ఓటింగ్ ప్రతి చర్చకు వర్తించదు. చర్చలో ఏకాభిప్రాయం లేనప్పుడు; మరియు అంశం చాలా ప్రాముఖ్యత కలిగినది అయితేనే ఇది అవసరం అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 08:52, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • మీరన్నట్లు ఏకాభిప్రాయం కుదరనప్పడు మాత్రమే ఇది అవసరమవతుంది. ప్రాముఖ్యత ను ప్రత్యేకంగా ప్రస్తావించనవసరంలేదనుకుంటాను. ఎందుకంటే భిన్నాభిప్రాయాలున్నప్పుడు ఐదుమందికూడా పాల్గొనకపోతే ప్రతిపాదన వీగిపోతుంది. మార్పులకు కాలపరిమితి జోడించకుండా కనీసం రెండునెలల క్రిందట 100మార్పులు చేసిన వారే అర్హులని స్పష్టం చేశాం. లేక మీరు చెప్పినట్లైతే అర్హులా కాదా నిర్వహించడానికి మరల శ్రమపడాల్సివస్తుంది. --అర్జున (చర్చ) 09:37, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మద్దతు లెక్కించేటప్పుడు తటస్థంగా ఓటు చేసినవారిని మద్దతు లెక్కలో చేర్చుకొనవచ్చు" వాక్యం భవిష్యత్తులో సంఘర్షణలకు కారణమౌతుంది. అది ఎలాగంటే, ఒక ఉదాహరణ చూడండి - ఒక ప్రధాన చర్చలో 10 సభ్యులు పాల్గొంటే కేవలం ఒక్కరే మద్దతు ప్రకటించారనుకుందాం, అదే సమయంలో వ్యతిరేకంగా ఇద్దరు, తటస్థంగా 7గురు వ్యవహరించారనుకుంటే పై వాక్యం (నిబంధన) ప్రకారం మద్దతు+తటస్థం కలిపి 80% అయిననూ వాస్తవంగా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించేవారికన్నా వ్యతిరేకత వ్యక్తంచేసినవారే ఎక్కువగా ఉన్నారనే విషయం గమనార్హం. ఇలాంటప్పుడు తటస్థంగా ఉన్నవారిని మద్దతు కిందికి ఎందుకు పరిగణించాలి? తటస్థులంటే ఎటూ కాకుండా మధ్యస్థంగా ఉన్నవారికిందే లెక్క. వారిని అలాగే వదిలివేయాలి కాని మద్దతు కిందికి పరిగణించే అవసరం ఏమిటి? అలాంటప్పుడు వారిని వ్యతిరేకత కిందికి ఎందుకు పరిగణించరాదు? మద్దతు ఇవ్వకున్ననూ మద్దతు కిందికి పరిగణించడం సమంజసమేనా? మౌనం అర్థాంగికారం అంటారు కాని ఇక్కడ మాత్రం పూర్తి అంగీకారమనే భావన కిందికి వస్తోంది. అసలు ఎవరూ మద్దతు ప్రకటించకున్ననూ (పై ఉదా:లో 1+2+7 బదులు 0+2+8 అని ఊహించుకోండి) ప్రతిపాదన నెగ్గినట్లేనా! ఈ విషయం వినడానికే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి పరిస్థితి భవిషత్తులో ఎదురుకాదని అనుకోలేము కాబట్టి నియమాలు రూపొందించునప్పుడే మనం ఆలోచించాలి. ఈ విషయంలో నేను వివరణ కోరదలిచాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:10, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • తటస్ధముగా వేసిన ఓట్లను లెక్కలోకి తీసుకొనకపోవటమే మంచిది.మద్దతు నిర్ణయములో అనుకూల,వ్యతిరేక ఓట్లను మాత్రమే గణనకు తీసుకొనడం సముచితము అనినా అభిప్రాయము.అలాగే తటస్ధ ఓట్లను లెక్కించనందున మద్దతుశాతమును 80శాతమునుండి తగ్గించవలసి వున్నది. పాలగిరి (చర్చ) 00:30, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీ నైజం నిరంతర మార్పులు కాబట్టి తటస్థంగా వుండేవారిని లెక్కకొరకు మద్దతిచ్చినవారిలో చేర్చాలనుకొని ప్రతిపాదన చేయడమైనది. చంద్రకాంతరావుగారి పాలగిరిగారి సూచనల ప్రకారం తటస్థులను వోటింగ్ లో పాల్గొన్నవారిలెక్కవరకే తీసుకొని ఆధిక్యత నిర్ణయించడంలో వదలివేయటం నాకు సమ్మతమే.--అర్జున (చర్చ) 05:38, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మార్గదర్శకాలకు సులువైన పద్ధతి

[మార్చు]

వికీపీడియా:శైలి లో వుండే విషయాలు లాంటి మార్గదర్శకాలకు ఈ పద్ధతి ని అమలు పరచడం కష్టమైనదిగా నాకు అనిపిస్తుంది. వాటికి సులభమైన పద్ధతి వుంటే మంచిది. ఆ దిశగా ఈ పద్ధతికి సవరణలు చేపట్టాలి. --అర్జున (చర్చ) 05:05, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దానికే కాదు, అసలు ఈ పద్ధతి దేనికీ సరైనది కాదు. ప్రాథమికంగానే ఈ పద్ధతిలో లోపం ఉంది. వికీపీడియాలో "ఎన్ని" వోట్లు వేసారనేది కాదు, వోటు "ఎందుకు" వేసారనేది ముఖ్యం. "ఎందుకు" అనేది అంకెలకు అందేది కాదు, అది వివరణాత్మకం. (ఈ కారణం వల్లనే.., చర్చను ముగిస్తూ నిర్ణయం తీసుకోవడమనేది చాలా ముఖ్యమైన, విలువైన అంశం. వచ్చిన అభిప్రాయాల్లో ఏవి వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నాయో నిర్ధారించుకుని, తదనుగుణంగా నిర్ణయం కూడా వికీ విధానాలకు అనుగుణంగా ఉండేలా.. తీసుకోవాలి. ఇది చిన్న విషయమేమీ కాదు.) అంచేత ఈ విధానాన్ని పునస్సమీక్షించాలని భావిస్తున్నాను. అభిప్రాయపడుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:37, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ అవగాహన లో లోపాలున్నాయి. ఈ పద్ధతిలో ఎందుకు అనే వివరణాత్మకాలను విధానం ముసాయిదా రూపు దిశలోనే పరిగణించబడుతుంది. పద్ధతిని సమీక్షించటం మంచిదే, కాకపోతే ఒకసారైనా వాడి సమీక్షించితే ఫలితాలు మెరుగుగా వుంటాయి. --అర్జున (చర్చ) 04:18, 4 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకునే పనైతే ఇక వోటింగు ఎందుకు? అయా అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని నిర్ణయం చేసెయ్యొచ్చు గదా! వివిధ అభిప్రాయాలు మన ఎదురుగా ఉన్నపుడు, వికీ విధానాల పట్లా మౌలిక సూత్రాల పట్లా అవగాహన ఉన్నవారికి ఇక నిర్ణయం చెప్పడంలో కష్టమేముంది? నిర్ణయం ప్రకటించేవారికి అంతటి వికీ విజ్ఞత లేని పక్షంలో మాత్రమే ఈ వోటింగు పనికొస్తుంది. అదొక్కటే వోటింగు ఉపయోగం. ఆ సందర్భంలో కూడా, వోటింగుతో "ఎందుకు" అనేది తేలదు కాబట్టి సరైన నిర్ణయం రాకపోయే అవకాశం ఉంది. __చదువరి (చర్చరచనలు) 06:26, 4 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, తెవికీ లాంటి వృద్ధిచెందుతున్న వికీపీడియాలలో నాకెదురైన ప్రధాన సమస్య విధాన చర్చలకు చాలా తక్కువ మంది 2-4 మంది పాల్గొనటం, ఆ చర్చలపై నిర్ణయం చేయటం కష్టమై చాలా సార్లు నిర్ణయాలు వదలివెయ్యడం గమనించాను. ఎక్కువమంది ఎందుకు పాల్గొనటం లేదనేదానికి కారణాలు వెతికితే చాలావాడుకరులకు వికీవిజ్ఞత లేకపోవడం, చర్చలలో పాల్గొనే నైపుణ్యాలు తక్కువగా వుండడం లాంటివి వుంటాయి. కాని విధానాలు సభ్యులందరిని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం చాలా ముఖ్యం. వివరణ, ఓటు ఒకేసారి జరగటంతో విధానంపై స్పష్టత కూడా వుండదు. అందుకని విధానంపై స్పష్టత కొరకు వివరణ, ఖరారైన విధానం సమ్మతి ఆధిక్యత వుందో లేదో తెలియటానికి వోటు పద్ధతి ప్రవేశపెట్టడమైనది. దీనిని ఒకసారి తప్ప ఎవరూ వాడకపోవడంతో దీని వలన ఫలితాలు మెరుగయ్యాయా అని చెప్పటానికి తగినంత సమాచారం లేదు. కాకపోతే ఇటీవల సాంప్రదాయ పద్ధతులలో చేసిన విధానం ప్రతిపాదించిన మీకే సంతృప్తినివ్వకపోవటం గమనించాను.-- అర్జున (చర్చ) 07:01, 5 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, వికీ విజ్ఞత లేనందువల్ల (ఇది ఒక కారణం) ఇక్కడ చర్చల్లో పెద్దగా పాల్గొనరు, అందుచేత వోటింగు పెడతాను అనడం చాలా అసంబద్ధంగా ఉంది. అలాంటి వారు వోట్లు మాత్రం ఎలా వేస్తారు? ప్రస్తుతానికి మనం ఈ చర్చను పక్కన పెట్టేద్దామండి. మీరన్నారే.. "వికీవిజ్ఞత లేకపోవడం" - దీని గురించి ఆలోచిద్దాం.
వికీ విధానాలు, నియమాలు, పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడం అనేది ఒక సమస్య అని మీరు అన్నారు. చర్చల్లో పాల్గొనకపోవడానికి, తమ అభిప్రాయాలు చెప్పకపోవడానికీ ఇదే కారణం అయి ఉండవచ్చు. ఇక్కడ చర్చల్లో పెద్దగా పాల్గొనరనేది నిజమే (నాకూ అంతగా అవగాహన లేదు కానీ చర్చల్లో పాల్గొనడానికి మాత్రం ముందుంటాను). అయితే మనం చేపట్టవలసినది అందరికీ వికీ విధానాల పట్ల అవగాహన కలిగించడం. దీనిపై మీవంటి సీనియర్లు కృషి చెయ్యాలని నా సూచన. నా సూచనను స్వీకరిస్తారా? __చదువరి (చర్చరచనలు) 07:36, 5 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, చర్చని కొనసాగించాలని కాదుగాని, పద్ధతి అసంబద్ధంగా వుందన్న మీ వ్యాఖ్యకు స్పందన ఇస్తున్నాను. చర్చలో పాల్గొనడానికి కావలసిన నైపుణ్యాలు, జరిగిన చర్చ పర్యవసానంగా ఏర్పడిన విధానాన్ని అర్ధంచేసుకొని స్పందించడానికి కావలసిన నైపుణ్యాల మధ్య అంతరం చాలా వుంటుంది. అందువలన ఎక్కువమంది పాల్గొంటారని ఈ పద్ధతిలో తొలిగా అమోదించిన విధాన వివరాలు చూస్తే తెలుస్తుంది. ఏ విషయంలోనైనా పాలు పంచుకొనడానికి ఇదే సులువైన మార్గం.( ఉదా:ప్రజాస్వామ్యం లో ఓటు కాని, సర్వేలలో పాల్గొనటం). అలా పాల్గొనే వారు వీలువెంబడి చర్చలలో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువవుంటుందని నా అభిప్రాయం.
ఇక వికీవిధానాల పట్ల అవగాహన కలిగించడం గురించి, నా ఆలోచనలు. ఇది ప్రాథమికంగా వికీ సంపాదకుల రాశి పై ఆధారపడింది. ఎక్కువమంది వికీసంపాదకులు క్రియాశీలకంగా వున్నప్పుడు, వారిలో సహజంగా వికీ విధానాలపై అవగాహన కోరుకునేవారు, పెంచుకునే వారు ఎక్కువవుతారు. చర్చలు సామరస్యకరమైన వాతావరణంలో జరుగుతుంటే ఎక్కువమంది పాల్గొనే అవకాశం వుంటుంది. అయితే క్రియాశీలక వికీసంపాదకుల సంఖ్యను పెంచాలనే గతకాలపు చర్యలు సత్ఫలితాలనివ్వలేదు. నాకు వీలైనంతలో వికీ అభివృద్ధికి సహకారం అందిస్తాను. వికీ ప్రచార కార్యక్రమాలలో వికీవిధానాలపై ధ్యాస పెట్టడం మంచిది. అయితే ప్రస్తుతం వ్యక్తిగతమైన పరిమితులతో ప్రత్యక్ష కార్యక్రమాలలో నేను పాల్గొనలేను. పరోక్షంగా నా సహకారాలుంటాయి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:49, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఆన్‌లైన్లోనే చెయ్యండి. వికీలోనే చెయ్యండి. ఒక ప్రాజెక్టుగా పెట్టి చేస్తే తరువాతి కాలంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక ఆసక్తి అంటారా.. ఒక్కరు పాల్గొన్నా ఫలితం వచ్చినట్టే. మిమ్మల్ని బలవంతపెడుతున్నానని అనుకోవద్దు.. ఇది అవసరం అని నా భావన. దాని వలన మరో ఉపయోగం ఉంది. మన విధానాలు, మార్గదర్శకాల పేజీలన్నిటినీ ఒకసారి చూసి, ఏమేం ఉన్నాయో ఏవి అవసరమో, వేటిని అనువదించాలో బేరీజు వెయ్యవచ్చు, అవసరమైన చర్యలు తీసుకోనూ వచ్చు. మరో ప్రయోజనం -విధానాలు తెలిసిన వారికి పునశ్చరణ చేసుకునే అవకాశం ఇది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 04:58, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ సలహాకి ధన్యవాదాలు. ప్రాజెక్టు రూపంలో చేయడానికి కనీస పరిస్థితులు (కనీస క్రియాశీలకంగా పాల్గొనే వారి సంఖ్య, వికీ ప్రాధాన్యతలు లాంటివి) ప్రస్తుతం తెవికీలో లేవని నా అభిప్రాయం. ముందు పరిస్థితులు మెరుగైతే పరిశీలిస్తాను. అప్పటివరకు విధానాల మార్పు చేర్పులకు ప్రామాణీకరించిన పద్ధతి వాడేవారికి తగినంతగా సహాయపడతాను. --అర్జున (చర్చ) 04:04, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ విజ్ఞత ఉన్నవారుకూడా అంతగా పాల్గొనుట లేదు.కారణం అంతుపట్టడం లేదు.పాల్గొనాలని మనసులో ఉన్నా, ఒక రకమైన భయం వారిలో దాగి ఉందనుకుంటాను.ఎందుకంటే చర్చలో అంతా అనుభవజ్ఞలు పాల్గొంటారుఅనే ఒక అభిప్రాయం ఉండటానికి అవకాశం ఉంది. మనం పాల్గొని ఏది రాస్తే ఏమైందో, మరలా దానికి తిరిగి సమాధానం ఇవ్వాలి.ఇది అంతా ఎందుకు రిస్కు అనే ఆలోచన ఉండవచ్చు.చర్చలలో పాల్గొనని వాడకరులు చర్చలు మాత్రం చదువుచున్నట్లు కొంతమంది ద్వారా నేను స్యయంగా తెలుసుకున్నాను.చర్చలు చదివే వారికి భయం కలిగిస్తున్నట్లుగా ఉన్నవి అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:55, 5 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
జంకు వీడాలి
యర్రా రామారావు గారు చెప్పింది నిజం అండీ ...
అంతా అనుభవజ్ఞలు 2005 లో వికీపీడియాలోకి అడుగు పెట్టిన చదువరి గారు , అర్జున గారు, లాంటి వారితో చర్చల్లో పాల్గొనటమా!, అంత రిస్కు ఎందుకు అనే భావన నాకు ఉంటుంది... నిజానికి మేము అనుభవజ్ఞలు అనేది వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ చూపరు. అది వాళ్ళు గొప్పతనం, పైగా ఇక్కడ అందరు సమానమే అంటూ, ఇప్పుడు చేరిన సభ్యునికి కూడ మంచి మంచి సలహాలు ఇస్తూంటారు. దాంతో నేను ఈ మద్య చర్చల్లో పాల్గొనటం జరుగుతుంది. మిగతా సభ్యులు కూడ చర్చల్లో పాల్గొనటానికి జంకు వీడాలని నా బావన. ప్రభాకర్ గౌడ్ నోముల 10:29, 5 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు , ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు, మీ అభిప్రాయాలు పంచుకున్నందులకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:51, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, యర్రా రామారావు గారు చెప్పిన "జంకు" ఒక కారణం కావచ్చును. కానీ జంకూ గొంకూ లేకుండా ముందుకు దూసుకు పోవడానికి ఉదాహరణలు మీరిద్దరూ. __చదువరి (చర్చరచనలు) 05:04, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, యర్రా రామారావు గారూ, పైన అర్జున గారు చెప్పినది చాలా ముఖ్యమైన విషయం. విధానాలపై అవగాహన కలిగితే ఈ జంకు చాలావరకు తగ్గుతుందని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 05:07, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చల్లో నేను ఎక్కువగా పాల్గొనకపోవడానికి కారణం నాకు సమయం లేకపోవడమే. వృత్తి రీత్యా నాకు ఏర్పడ్డ చిక్కు ఇది. కానీ నేను సమయం చిక్కినప్పుడల్లా కాస్తోకూస్తో చర్చలు చేస్తూనే ఉంటాను. కొన్ని చర్చల్లో నేను పాల్గొనకపోవడానికి కారణం అవి సామరస్య పూర్వకంగా లేకపోవడం, ఇక్కడ మనం లేవనెత్తిన అంశాలను కొంతమంది సభ్యులు వ్యక్తిగతంగా తీసుకోవడం. అసలు విషయం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి కొన్ని చర్చలు. సూటిగా నడవవు ఇవి. ఇలాంటి వాటిలో పాల్గొని సమయం వృధా చేసుకోవడం ఎందుకు? దాని బదులు వ్యాసాలను సృష్టించడానికి, మెరుగుపరచడానికి వాడితే మేలుగదా అనిపించడం వల్ల కొన్నిసార్లు చర్చలో పాల్గొనను. - రవిచంద్ర (చర్చ) 05:14, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.చర్చలలో ఎవరికి వారు లోతుకు పోకుండా ఉండాలని భావిస్తే బాగుంటుంది. ఏకీభవిస్తున్నాను లేదా వ్యతిరేకిస్తున్నాను అని అంటే బాగుంటుదేమో!--యర్రా రామారావు (చర్చ) 05:06, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలకు ఫలితం నిర్ణయించడం

[మార్చు]

YesY సహాయం అందించబడింది


తెలుగు వికీలో మెరుగైన విధాన నిర్ణయాలకు ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఒక్క విధానానికి మాత్రమే దీనిని వాడాము. ఇప్పుడు మరో విధానానికి దీనిని వాడటానికి చర్చ ( కొత్త యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ విధానం ప్రతిపాదనలు ) జరుగుతున్నది. ఈ చర్చలలో ఒకటి కంటె ఎక్కువ ప్రతిపాదనలకు నిర్ణయం చేయవలసిన అవసరం వున్నందున స్పష్టత కొరకు ఈ చర్చ ప్రారంభిస్తున్నాను.

  • ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలున్నప్పుడు సభ్యులు విడి విడిగా ప్రతి ప్రతిపాదనకు ఓటు చేయాలి.
  • కేవలం ఒక్క ప్రతిపాదనకు మాత్రమే మద్దతు ఇవ్వవచ్చు. తటస్థంగా, లేక వ్యతిరేకత ఎన్ని ప్రతిపాదనలకైనా చేయవచ్చు. ఒకటికంటే ఎక్కువ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించితే ఆ వోటు చెల్లదు.
  • 80% కన్నా ఎక్కువ ఆధిక్యత సాధించిన ప్రతిపాదనలలో ఏది ఎక్కువ ఆధిక్యత సాధించితే ఆ ప్రతిపాదన గెలిచినట్లు.
  • ఆధిక్యత సాధించిన ప్రతిపాదనలకు ఆధిక్యతలో తేడాలేకపోతే ఆ ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు.

సహసభ్యులు వారంరోజులలోగా స్పందించవలసినదిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:42, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

{{tl|సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. అర్జున (చర్చ) 22:27, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విభాగం గురించి చర్చలలో ఉటంకించబడుతున్నందున , కొంత వివరణ అవసరం కావున ఈ వ్యాఖ్య చేరుస్తున్నాను.
విధాన నిర్ణయాల చర్చలు నిర్మాణాత్మకంగా, ఏకాభిప్రాయ దిశగా సాగితే ఒకటే ప్రతిపాదన ఓటు ప్రక్రియకు చేరుతుంది. అయితే రెండవసారి అమలు ప్రయత్నంలో జరిగిన చర్చలో ఒకటి కంటే ఎక్కువ అమలు చేయగలిగే ప్రతిపాదనలు ఓటు చేయాల్సిన అవసరం చదువరి గారి స్పందన తరువాత ఏర్పడే దిశగా చర్చ సాగింది. (రూపంలో ప్రతిపాదన 4 విభాగం చూడండి) కావున ఎక్కువ ప్రతిపాదనలు ఓటు ప్రక్రియ నిర్వహించాలంటే స్పష్టత కొరకు ఈ చర్చ ప్రారంభించడం జరిగింది. అయితే చదువరి గారు నేను అపార్ధం చేసుకున్నానని ఆ ప్రతిపాదనను రద్దు చేసి, ఆయన వ్యాఖ్యలను కూడా సవరించారు. కావున అటువంటి పరిస్థితి రాలేదు. కావున బరిలో నిలిచింది ఒక్క ప్రతిపాదనే కావున ఓటు ప్రక్రియ ఈ చర్చ ముగించకుండానే చేపట్టటం జరిగింది. దీనిపై చర్చకు సభ్యులు స్పందించలేదు. వారం గడువు తర్వాత {{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను.--అర్జున (చర్చ) 00:31, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ రెండు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వెయ్యాలి అంటూ అర్జున గారు అడిగిన ప్రశ్న ప్రశ్న గానే ఉండిపోయింది. దానికి సమాధానం రాలేదు. ఈ ప్రశ్న ఇక్కడ అడిగాక, సమాధానం కోసం వేచి ఉండకుండానే, అసలు ఈ చర్చ ముగియకుండానే అక్కడ రెండు ప్రశ్నలు పెట్టి వోటింగు మొదలు పెట్టేసారు. ఇక్కడ ఈ ప్రశ్నకు, ఈ చర్చకూ అర్థమే లేకుండా చేసారు. వాడుకరులు ఈ చర్చలో పాల్గొనే ఆసక్తే లేకుండా చేసారు. __చదువరి (చర్చరచనలు) 01:44, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్పందన, ఇతర చర్చలలో అనుభవజ్ఞులు నిర్వాహకులు అప్పటి చర్చలలో పాల్గొన్న కొంత మంది స్పందనలు చూస్తే పద్ధతి స్పూర్తి అర్ధమైనట్లుగా లేదు. తొలిగా చేర్చిన ప్రతిపాదన ఒక వ్యక్తి చేర్చివుండవచ్చు. చర్చ ద్వారా మెరుగైన ప్రతిపాదన సముదాయ ప్రతిపాదన క్రిందకు వస్తుంది. చర్చలు ఏకాభిప్రాయం దిశగా సాగనందున గతంలో ఏర్పడిన నిర్ణయం పట్ల నిర్హేతుక పక్షపాత ధోరణే ఓటు ప్రక్రియ చర్చా పేజీలోను కనబడుతుంది. అంతకన్నా నేను చెప్పగలిగినదేదిలేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:22, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ,
  1. ఆ చర్చలో మెజారిటీ సభ్యులు వెలిబుచ్చిన నికర అభిప్రాయం - 30% పరిమితిని మార్చకూడదనీ, దాన్ని అలాగే ఉంచాలనీ. కానీ మీరు వోటింగుకు ఆ అంశాన్ని పెట్టలేదు.
  2. రెండు అంశాలను పెట్టి ఒకే వోటు వెయ్యమని అడగడానికి పద్ధతి ఎలాగో తెలియకుండానే, అది తెలుసుకోవడం కోసం పెట్టిన ఈ చర్చ ముగియకుండానే వోటింగును ఎలా మొదలుపెట్టారు?
  3. అసలు రెండో అంశాన్ని మెజారిటీ సభ్యులు అడగనపుడు, అసలు దానిపై చర్చే జరగనపుడు అది మెరుగైన ప్రతిపాదన ఎలా ఔతుంది? దాన్ని ఎలా చేర్చారు?
వోటింగు పేజీ చర్చలో ఈ ప్రశ్నలు ఇప్పటికే మిమ్మల్ని నేను అడిగాను. ఇతర సభ్యులూ అడిగారు. ఇంతవరకూ సమాధానాలు లేవు. ఇక్కడేమో, చర్చలో పాల్గొన్నవారందరికీ పక్షపాత ధోరణి అంటగడుతున్నారు. నాకు పద్ధతి స్ఫూర్తి లేదంటున్నారు. మీరు ఇలా నిందించినా పర్లేదు. కానీ నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి చెప్పకుండా తప్పించుకోకండి. __చదువరి (చర్చరచనలు) 00:53, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, స్పందన కొంత ఉపయోగంగా వుండవచ్చు. --అర్జున (చర్చ) 22:26, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ, ఆ స్పందన ఏ కాస్తా ఉపయోగకరంగా లేదు. మీకు సూటి ప్రశ్న వేస్తున్నాను సూటిగా సమాధానం చెప్పండి. ఉదాహరణకు పార్లమెంటు సభ్యులను, అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఒకే పోలింగ్ బూత్‌లో ఎన్నిక జరిగితే జరగవచ్చు గాక, ఒకే ఓటు ఇద్దరికీ కలిపి వేయమని ఎక్కడా ఎవరూ అడగరు. రెండు వేర్వేరు అంశాలను చర్చలో పెట్టి ఒకే ఓటు వేయవచ్చో లేదో మీకే సందేహమనీ, ఆ సందేహం ఎవరూ తీర్చలేదనీ (లేదంటే తీర్చలేకపోయారనీ) పైన మీ రాతల వల్లనే తెలుస్తోంది. అలాంటప్పుడు ఏ లెక్కన రెండు అంశాలను కలిపి ఒకే ఓటు వేయమని ఓటింగ్‌కి వెళ్ళారు? అక్కడ చర్చనీ, ఓటింగ్ జరిగిన పద్ధతినీ తిట్టకుండా సూటిగా ఈ నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పండి. ముఖ్యంగా ఈ సందేహం తీరకుండా. --పవన్ సంతోష్ (చర్చ) 15:54, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, నేను రెండు అంశాలు విరుద్ధమైనవి కావు, రెండవది చర్చప్రకారం చేరిన అంశం అయినపుడు ఒకే ప్రతిపాదన అని నేను అంటున్నప్పుడు, మీరు అవి వేరు అంటున్నప్పుడు మనం ఎంత చర్చచేసినా ఉపయోగం లేదు. పద్ధతి స్పూర్తి, పద్ధతిని తయారుచేయటంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి కన్నా మీరే బాగుగా అవగాహన చేసుకొని నిర్ధారించగలిగే నైపుణ్యత మీకు ఉన్నది అనుకుంటున్నప్పుడు నేను ఇంతకు మించి చెప్పగలిగనది లేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:38, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పదిమందికి ఒక రకంగా అర్థమై, మీకు మాత్రమే వేరే రకంగా అర్థమైతే, అర్థం చేసుకోవడంలో లోపం ఎవరిలో ఉన్నట్టో చెప్పనక్కర్లేదు అర్జున గారూ. మీ ప్రతిపాదనను వ్యతిరేకించిన వారు ఎలాగూ వ్యతిరేకించారు. మీ ప్రతిపాదనను గట్టిగా సమర్ధించి, వోటు కూడా అనుకూలంగా వేసిన ఒక వాడుకరి కూడా రెండు అంశాల వోటింగును వ్యతిరేకించారు. ఆయన ఇలా చెప్పారు: "ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను.". ఈ వోటింగు జరిగిన పద్ధతి, అందులో దొర్లిన దోషాల గురించి చెప్పడానికి ఇది మరో ఉదాహరణ, అంతే. __చదువరి (చర్చరచనలు) 00:41, 28 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీరు రాసినది చూస్తే నేను చెప్పింది సరిగ్గా అర్థమైనట్టు లేదనిపిస్తోంది. మనం ఇక్కడ మాట్టాడుకుంటున్నది విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి గురించి కాదు, అనువాదాల శాతాన్ని మార్చేందుకు మీరు జరిపిన వోటింగు పద్ధతి గురించి. ఈసరికే వోటింగు ముగిసిపోయింది, జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. కాబట్టి దాన్ని ఇక మార్చేదేమీ ఉండదు. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 07:14, 29 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ, నేను రెండు అంశాలు విరుద్ధమైనవి కావు, రెండవది చర్చప్రకారం చేరిన అంశం అయినపుడు ఒకే ప్రతిపాదన అని నేను అంటున్నప్పుడు, మీరు అవి వేరు అంటున్నప్పుడు మనం ఎంత చర్చచేసినా ఉపయోగం లేదు. - రెండు అంశాలూ ఒకే ప్రతిపాదన తప్పించి రెండూ వేర్వేరు కాదంటారు. ఐతే, ఉదాహరణకు - ఎవరైనా ఒక వ్యక్తికి "భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి." అన్నది కరెక్ట్ అనిపించి, "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." సరికాదని అభిప్రాయపడ్డారనుకుందాం. వారు అనుకూలంగా ఓటు వేయాలా? ప్రతికూలంగా ఓటువేయాలా? ఒకవేళ అనుకూలంగా ఓటు వేస్తే, వారి అభిప్రాయానికి భిన్నంగా కొత్త సభ్యుల మీద నియంత్రణ వస్తుంది. ఒకవేళ ప్రతికూలంగా వేస్తే వారు ఆశిస్తున్నట్టు పరిమితి తొలగింపును కలిపి వ్యతిరేకించినవారు అవుతారు. అలాంటి సందేహం ఉన్నవారు చర్చలో రాయాలి అనవద్దు. చర్చలో రాశారనే తీసుకోండి ఈ సంభావ్యతను. అప్పుడు మీరేం సలహా ఇచ్చేవారు? ఈ విధంగా చూస్తే నిస్సందేహంగా ఇవి రెండు వేర్వేరు విషయాలే కాదా? --పవన్ సంతోష్ (చర్చ) 04:58, 28 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, నేను రెండో అంశం గురించి ఇంతకు ముందే వివరణ ఇచ్చాను.(పాత చర్చ) రెండవ అంశం చర్చలో వ్యక్తం చేసిన అభ్యంతరాలను కొంతవరకు పరిష్కరించటంలో సహాయపడడానికి చేర్చబడింది. కావున దానిని వ్యతిరేకించేవారు వుండరనే నా నమ్మకం. ఒకవేళ వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా వుంటే వారు చర్చని, ఆ తరువాత ఈ విషయంపై స్పందనలను సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. దీనికి కారణాలు అనేకం వుండవచ్చు. వారి అవగాహన స్థాయి తక్కువవుండవచ్చు. ప్రధాన చర్చలు, వివరణ చర్చలలో ఏమైనా లోపాలు వుంటే వుండవచ్చు. కొత్తగా ఓటు వేసేవారికి, తగిన సమయం వెచ్చించి చర్చలలో పాల్గొనవారికి చర్చలు స్పష్టత కలిగించలేకపోయివుండవచ్చు. ఇక అలా మొదటి అంశానికి అనుకూలం, రెండో అంశానికి వ్యతిరేకం గల వారు ప్రతిపాదనని వ్యతిరేకించటమే మంచిది. ఒకవేళ ఎక్కువ మంది అదే విషయం గురించి వ్యతిరేకించి వుంటే 60 రోజుల తర్వాత మరింత స్పష్టతతో ఇంకొక ప్రతిపాదన వోటు ప్రక్రియకు చేరే అవకాశముంది. --అర్జున (చర్చ) 06:56, 29 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలిగడువు తర్వాత స్పందనలున్నందున, ఈ పద్ధతి రెండవసారి వాడినప్పుడు వచ్చిన అభిప్రాయాలను సమీక్షించి ఈ పద్ధతిని సమగ్రంగా మెరుగు చేయాల్సినందున ఈ విభాగంలో {{సహాయం కావాలి-విఫలం}} కు బదులుగా {{సహాయం చేయబడింది}} చేర్చాను. --అర్జున (చర్చ) 22:13, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్హులైన వాడుకర్లను నిర్ణయించడం

[మార్చు]

గణించే తేదీనాటికి ప్రత్యక్షంగా వున్న వాడుకరి రచనలు వాడుకరి రచనలు సంఖ్య మాత్రమే అర్హత నిర్ణయించేటట్లుగా పద్ధతిని ఇంతవరకు వాడటం జరిగింది. కనీస ఎడిట్లు తక్కువగా 100 వున్నందున, తొలగించబడిన రచనలు కూడా కనిపించేవి నిర్వహణ సంబంధిత అంశాలు అనగా తరలింపులు, తొలగింపులు కావున వాటిని లెక్కించనవసరం లేదు. కనీస ఎడిట్లు పరిమితి పెంచితే వాటినికూడా గణించవచ్చు.--అర్జున (చర్చ) 23:08, 22 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటు ప్రక్రియ కాలంలో ప్రతిపాదనపై చర్చలు నిషేధించాలి

[మార్చు]
  • ఈ పద్ధతిలో చర్చ, ఓటు వేరుచేయబడినవి. అందువలన ఎక్కువ మంది పాల్గొని మెరుగైన నిర్ణయాలు చేయబడేవీలుంది. అయితే ఈ పద్ధతి రెండవసారి వాడినపుడు ప్రక్రియని బలహీనపరచేటట్లు పద్ధతిని వ్యతిరేకించడం, చర్చలను కొనసాగించడం కొంతమంది సభ్యులు చేశారు. అలా చేయటం ఫలితంపై ప్రభావం చూపే వీలుంది. అసలైన ముందుగా జరిగిన చర్చలు చదవకుండా, ప్రస్తుత చర్చలలో ఒకే అభిప్రాయానికి అనుకూలంగా పాల్గొనే చర్చలు చూసి ఫలితం ప్రభావితమయ్యే అవకాశముంది. కావున ఓటు ప్రక్రియ కాలంలో చర్చలు నిషేధించాలి. దానిని ఉల్లంఘించిన వారి వ్యాఖ్యలు తొలగించడంతో పాటు, వారిపై ఓటు ప్రక్రియ కాలంవరకు వారిని నిషేధించాలి. --అర్జున (చర్చ) 00:04, 23 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఒకవేళ అటువంటి వారు ఓటు వేసినా ఆ ఓటు చెల్లనిదిగా పరగణించాలి. --అర్జున (చర్చ) 00:07, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • వోటింగు అంశాన్ని నిర్ణయించడం లోను, వోటింగును నిర్వహించడం లోనూ నిర్వాహకుడు వికీ నియమాలను, మెజారిటీ సభ్యుల అభిప్రాయాలనూ పరిగణించని సందర్భాల్లో చర్చ జరగాలి. జరగకపోతే వోటింగు నిర్వాహకుడి తప్పులు ససముదాయం భరించాల్సి వస్తుంది. ఆ ఒక్కరి అభీష్టాన్ని సముదాయం మోయాల్సి వస్తుంది. అలాంటి నిర్వాహకులు చర్చలనూ, చర్చ చేసేవారినీ నిషేధించాలని కోరుకున్నా సముదాయం ఒప్పుకోరాదు.
  • సముదాయ అభీష్టానికి వ్యతిరేకంగా తప్పు అంశాలను వోటింగుకు పెట్టి, తప్పు పద్ధతుల్లో వోటింగును నిర్వహించడమే కాకుండా అది గెలిపించుకోవాలంటే ఆ తప్పులను ఎదిరించిన వారిని వోటింగులో పాల్గొనకుండా చేస్తే తప్ప సాధ్యపడదు. అంచేత తాము చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించిన వాడుకరులను వోటింగులో పాల్గొననీయకుండా చేసే అవకాశం ఉంది. సముదాయం అలాంటి నిర్వాహకుల పట్ల జాగరూకతతో ఉండాలి. అలాంటి వోటింగు హక్కుల కత్తిరింపు ప్రతిపాదకుల పట్ల మరింత మెళుకువగా ఉండాలి. వారి కాంక్షలను నెరవేరనీయకూడదు. __చదువరి (చర్చరచనలు) 01:12, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదకుడిపై చర్య, ఓటు ప్రక్రియ రద్దు

[మార్చు]

ప్రతిపాదనపై జరిగిన చర్చల్లో (చర్చ 1, చర్చ 2 లలో) మెజారిటీ సభ్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన తరువాత, 'చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి' అన్న నిబంధనను ఉల్లంఘించి చర్చల ఫలితంగా బరిలో నిలిచిన ప్రతిపాదనల పై ఓటు ప్రక్రియ పేరుతో ఓటింగ్ ప్రారంభించారు. ఇలా చేయడం వికీ నియమాలకు విరుద్ధం. మునుముందు కూడా ఇలా చేసే అవకాశం ఉంది. కాబట్టి అలా చేసిన ప్రతిపాదకునిపై చర్య తీసుకోవాలి, ఆ ప్రతిపాదన ఓటు ప్రక్రియ రద్దు చేయాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:03, 23 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పైన ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఉదహరించిన వికీపీడియా:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2 అనే వోటింగు ప్రక్రియ పెద్ద తప్పుల తడకగా తయారైంది. అందులో దొర్లిన కొన్ని తప్పులివి:
  1. వోటింగు నిర్వహించడానికి భూమికే లేదు దానికి. ఈ మార్గదర్శకం లోని "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి అనే మొట్టమొదటి పాయింటునే ఉల్లంఘించింది.
  2. రెండు అంశాలను కలిపేసి వోటింగు ఎలా పెట్టాలో అవగాహన లేకుండానే రెండు అంశాలను జతచేర్చి ఒకటే వోటు వెయ్యమన్నారు. వోటింగులో ప్రతిపాదనకు అనుకూలంగా వోటేసిన వాడుకరి ఒకరు "ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను." అని వోటింగు పూర్తయ్యాక జరిగిన చర్చలో రాసారు.
  3. వోటింగు జరుగుతూండగా వోటింగు గురించి ఎంచుకున్న కొందరికి ఈమెయిళ్ళు పంపించారు. దాని గురించి ప్రశ్నించినపుడు అలా రాయడం ఒప్పేనని, అది ప్రచారం కాదనీ వాదించారు.
  4. వోటింగులో ఎవరో అజ్ఞాతలు వాడుకరుల పేర్లు, టైమ్‌స్టాంపులూ వేసి వోట్లు వేస్తే దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. "కనీస అర్హత 100 వోట్లుగా వున్నందున వికీసంతకం గురించి అవగాహన తక్కువగా వుండడం వలన కొంత మంది చర్చలలో పాల్గొనకపోవటం, లేక కొత్తగా ఓటు ప్రక్రియలో పాల్గొంటున్నందున, సాధారణంగా చర్చా పేజీలలో మాత్రమే వికీసంతకం చేయాలనే సూచనలున్నందున కూడా ఇలా జరిగి వుండవచ్చు" అని అన్నారు. మరి లాగినవడం కూడా తెలీదా?
  5. వోటింగు ఫలితాన్ని లెక్కవేసేటపుడు అంతా సవ్యంగా జరిగిందా లేదా అనేది చూసుకుని ప్రకటించలేదు. అంచేత ఫలితాన్ని ప్రకటించిన తరువాత తిరిగి సవరించాల్సి వచ్చింది.
  6. వోట్లు వేసిన వాళ్లలో కొందరికి ఈ అంశానికి సంబంధించి ఎంత అవగాహన ఉంది అనే విషయం బహుర్గతం కాలేదు. ఎందుకంటే వాళ్ళు చర్చలో పాల్గొనలేదు, తమ అభిప్రాయం చెప్పనూ లేదు. వికీలో వోటు కంటే అభిప్రాయానికే ఎక్కువ విలువ ఉంటుందని చెప్పే వికీ మార్గదర్శకానికి వోటింగు పద్ధతి చుక్కెదురు. ఈ వాస్తవాన్ని ఈ వోటింగు బట్టబయలు చేసింది.
వోటింగు ఎలా నిర్వహించకూడదు అనే దానికి ఒక నమూనాగా దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన బాధ్యత వోటింగు ప్రతిపాదకుడు/నిర్వాహకుడు వహించాలి. అసలు ఈ వోటింగు పద్ధతినే పునస్సమీక్షించాలి. __చదువరి (చర్చరచనలు) 17:06, 23 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటు ప్రక్రియలో ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు

[మార్చు]

పద్ధతిని రెండవసారి అమలు చేసినప్పుడు. ఓటు ప్రక్రియలో ఎక్కువమంది పాల్గొనేలా ప్రక్రియ నిర్వహించే బాధ్యత వున్న వ్యక్తిగా అనువాదాల ఉపకరణం వాడినా చర్చలలో పాల్గొనని వారికి, గతం 30 రోజులలో చురుకుగా వున్న చర్చలలో పాల్గొనని వారికి ఓటు ప్రక్రియ గడువు గురించి, ఓటు ప్రక్రియలో పాల్గొనమని విషయం గల అభ్యర్ధన ఈ మెయిల్ వున్న వాడుకరులకు సందేశం పంపడం జరిగింది. అలాగే ఓటు ప్రక్రియ రెండు వారాల సుదీర్ఘ కాలం నడుస్తున్నందున నాలుగు రోజుల ముందు రచ్చబండలో దీనిగురించి హెచ్చరించి అర్హులైన పాల్గొనని వారిని హెచ్చరించి పాల్గొనమని అభ్యర్ధించడం జరిగింది. ఓటు ప్రక్రియలో ఎక్కువగా పాల్గొన్నప్పుడే సముదాయాన్ని ప్రభావితం చేసే విధానాలు పై విస్తృత సముదాయానికి అమోదమయ్యే నిర్ణయం చేయడం జరుగుతుంది కావున అలా చేయడం జరిగింది. అయితే ఇది సరికాదని అభ్యంతరాల చర్చలు జరిగాయి. దీనిగురించి సముదాయం ఒక అభిప్రాయానికి వచ్చి పద్ధతిని మెరుగుపరచడానికి ఈ అంశం చర్చలో చేర్చడమైనది. --అర్జున (చర్చ) 00:03, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఎంచుకున్న కొందరికే ఈమెయిలు పంపడం పద్ధతి కాదు. ఈమెయిల్లో నాకు వోటెయ్యమని అభ్యర్ధించకపోయినా, కొందరికే ఈమెయిలు పంపడం తప్పు. ఈ మెయిలు అందుకున్న వాడుకరి వోటింగుకు వచ్చి చూసినపుడు, ఈమెయిలు పంపిన వాడుకరి అక్కడ వోటు వేసి ఉంటారు. సహజంగా ఈమెయిలు అందుకున్న వాడుకరి దానితో ప్రభావియమయ్యే అవకాశం ఉంటుంది. మరొక సంగతి.. ఈమెయిలు పంపిన వాడుకరి ప్రతిపాదన చేసినవారూ, తన అభిప్రాయాన్ని బలంగా చెప్పినవారూ అయినపుడు, ఆ ఈమెయిలును అందుకున్నవారు సహజం గానే పంపినవారి అభిప్రాయాన్ని కూడా అన్యాపదేశంగా అందుకుంటారు. అది కూడా వారి వోటు నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. అందుచేత ఎంచుకున్న కొందరికే ఈమెయిలు పంపడం నిషిద్ధం -ఈమెయిలు అందుకునేవారిని ఎంపిక చేసిన క్రైటీరియా ఏదైనప్పటికీ. కీంది పట్టిక సముచిత, అనుచిత ఈమెయిళ్ళపై చూపు ప్రసరింపజేస్తుంది.
  Scale   Message   Audience   Transparency
Appropriate Limited posting AND Neutral AND Nonpartisan AND Open
Inappropriate Mass posting OR Biased OR Partisan OR Secret
Term Excessive cross-posting ("spamming")   Campaigning   Votestacking   Stealth canvassing

వోటింగు తరువాత జరిగిన చర్చలో ఈమెయిళ్ళు పంపడంపై అర్జున గారు వివరణ ఇస్తూ, తాను ఒక పద్ధతి ప్రకారం వాడుకరులను ఎంచుకుని ఈమెయిలు పంపించాను అది తప్పేం కాదు అని అన్నారు. పైన నేను రాసిన కారణాల వల్ల ఎంచుకున్న వాడుకరులకు ఈమెయిలు పంపడం తప్పు. మరో సంగతి, అసలు తాను ఎంచుకున్న క్రైటీరియాకు చెందనివారికి కూడా ఆయన ఈమెయిలు పంపారు. పైన అర్జునరావు గారు ఈ చర్చను ఉదహరించారు కాబట్టి నేను ఈ పేరా రాసాను. లేదంటే రాసేవాణ్ణి కాదు.__చదువరి (చర్చరచనలు) 01:32, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహాలకు సమాధానాలు ఎలా?

[మార్చు]

సర్, మంచి టాపిక్. మీరు సీరియస్ గా చర్చిస్తున్నప్పుడు, నాలాంటివారికి పాల్గొనాలనే ఆసక్తి వున్నా ఇప్పటివరకూ వికీలో అమలవుతున్న , అమలైన విధానాలపై పరిశీలనా అనుభవం తగినంతగా లేకపోవడంతో, సవాలక్ష డౌట్స్ (ఎంతో చిన్న చిన్నవి కూడా) రేకెత్తుతాయి. ఎవరిని అడగాలో తెలియదు. ఒక చిన్న ప్రయత్నం. సీరియస్ గా చర్చ సాగుతున్నప్పుడు మధ్యలో ఆయా టాపిక్ లపై నాకు కలుగుతున్న చిన్న చిన్న సందేహాలను (బులెట్ గుర్తు పెట్టి) అడుగడానికి ప్రయత్నం చేస్తాను అదీ కూడా మీకు అంగీకారం అయితేనే. నా డౌట్స్ "సలహా కేంద్రంలో " అడిగేటటువంటివి కావు. ఈ చర్చలకు సంబందించినవిగానే ఉంటాయి. నివృత్తి ఏవరైనా చేయవచ్చు. మీరిచ్చే చిరు సమాధానంతో (వీలైతే -మీకు వీలైతేనే -- ఆ సందేహాన్ని కవర్ చేసే నివృత్తి, ఏ వికీ పేజీలో quote చేయబడివుందో ఒక చిన్న hyperlink పెట్టినా చదివి, interpretation ద్వారా) నా అవగాహనను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తాను. మీరు ద్వారా అయ్యే నివృత్తులు ప్రస్తుత చర్చలోనే కాదు తదుపరి చర్చలలో కూడా నా అవగాహనా పరిధి పెరగడానికి మరింత దోహదం చేస్తాయి. చదువరి, అర్జున, సభ్యుడు:C.Chandra Kanth Rao, కె.వెంకటరమణ, ..... అందరికీ ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. --Vmakumar (చర్చ) 15:42, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారు, మీ వ్యాఖ్యకి శీర్షికను మరింత అర్ధవంతంగా సవరించాను. గమనించండి. వికీలో చేరే ప్రతివ్యక్తి సముదాయ ప్రతిస్పందనలతోనే అవగాహన పెంచుకొనగలుగుతారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మీ వాడుకరి పేజీలో చర్చ ప్రారంభించి {{సహాయం కావాలి}} మూస చేర్చితే సహ సభ్యులు స్పందిస్తారు. లేక మీ ప్రస్తుత అవగాహనతో ఏ చర్చలో పాల్గొనినా, ఇతర సభ్యుల ప్రతిస్పందనలద్వారా మీ సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు. సందేహాల గురించి మీరు సంకోచించవద్దు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:17, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రక్రియ నిర్వహణకు స్వతంత్ర నిర్వాహకుడు అవసరం

[మార్చు]

ప్రక్రియ నిర్వహణకు చర్చలలో, ఓటు ప్రక్రియలో పాల్గొనకుండా స్వతంత్రంగా వ్యవహరించే నిర్వాహకుడు వుంటే, ప్రక్రియ మరింత సమర్ధవంతంగా నిర్వహించటానికి అవకాశాలున్నాయని పద్ధతి రెండవసారి అమలు చేసినప్పటి చర్చల ఫలితంగా నా కనిపిస్తుంది. వికీలోకాని వికీ బయటకాని సంఘర్షణ గల అంశాలను నిరపేక్షంగా ఏకాభిప్రాయదిశకు మళ్లించగలిగేలా తగినంత అనుభవం వున్న నిర్వాహకులు తగినంతగా వుంటే, లేక అలాంటి వారిని పెంచగలిగితే ఇలా చేయటం బావుంటుంది..--అర్జున (చర్చ) 07:07, 29 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

హఠాత్తుగా సహాయం విఫలం నుంచి సహాయం చేయబడిందికి మారిన స్థితి

[మార్చు]

ఈ పేజీలోనే పైన "ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలకు ఫలితం నిర్ణయించడం" అన్న విభాగంలో అర్జున గారు గతంలో ఒక సందేహాన్ని లేవనెత్తి, సహాయం కావాలి అన్న మూస పెట్టి, కొన్నాళ్ళకు 2020 సెప్టెంబరులోనే దాన్ని సహాయం విఫలం అన్న మూసతో మార్చారు. అంటే ఆ సందేహానికి సహాయం విఫలం అయిందన్నమాట. ఈరోజున హఠాత్తుగా అర్జున రావు గారే కనీసం ఒక నోట్ కూడా లేకుండా సహాయం చేయబడింది అని మార్చేశారు. ఇదేమీ చిన్న సంగతి కాదు. ఈ చర్చ తర్వాత చాలా చిక్కు సమస్యలు వచ్చాయి. ఇక్కడ చర్చ లేవనెత్తి, దానిలో ఒక ఫలితం అంటూ లేకుండా మీరెలా రెండు ప్రతిపాదనలు కలిపికట్టుగా ఓటింగ్‌కు పెట్టారని ఆయనను తర్వాత నిలదీయడం కూడా ఇదే చర్చల్లో గమనించవచ్చు. అలాంటిది, ఈరోజు ఏ రకమైన నోటీసు లేకుండా దీన్ని మార్చడం మామూలుగా చూస్తే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. ఐతే, ఈ పనిచేసింది అర్జున రావు గారు కాబట్టి నేను బహుశా ఇది అనుకోకుండా ఆయన చేసివుంటారని భావిస్తూ ఆ మార్పును తిరగ్గొట్టాను. @Arjunaraoc: గారూ, ఇంతకీ ఇది అనుకోకుండా జరిగిన పొరబాటేనా? --పవన్ సంతోష్ (చర్చ) 13:25, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s: గారు, ఇదే రోజు నేను చేసిన ఇలాంటి ఇతర సవరణలను పరిశీలిస్తే అనుకోకుండా చేసినది కాదని మీకు అర్ధమయ్యేది. తొలిగా (సాధారణంగా వారం రోజులలో) స్పందనలు లేనప్పుడు {{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. ఆ తరువాత, ఆ చర్చలో మరల స్పందనలు వచ్చినందున {{సహాయం చేయబడింది}} కి మార్చాను. అలా చేయటం వలన చర్చ ముగిసి నిర్ణయం వెలువడిందని అర్ధం కాదు. చర్చ ముగిసి నిర్ణయం వెలువడితే అటువంటి వ్యాఖ్యలు వుంటాయని గమనించండి. కావున మీ రద్దుని తిరిగి రద్దు చేస్తున్నాను. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 21:48, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ "సహాయం విఫలం" మూసను తీసేసి, "సహాయం చేయబడింది" అని మార్చడం సబబు కాదు అని నా ఉద్దేశం. కింది కారణాలు:
  1. సహాయం విఫలమైందన్న వాస్తవం మీద ఆధారపడి ఎంతో చర్చ జరిగింది. వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 పై జరిగిన చర్చలో నేను చేసిన వాదనకు మూలాధారమైన వాటిలో ఇదొకటి. దాన్ని ఇప్పుడు మార్చెయ్యడం అనుచితమైన చర్య. దీంతో నా వాదన పూర్వపక్షమై పోయింది. నేను దీనిపై @Arjunaraoc గారికి నా నిరసన తెలియజేస్తున్నాను.
  2. చర్చలో జరిగిపోయిన విషయాలను మార్చరాదు. ఇలా మార్చడం వికీపద్ధతులకు విరుద్ధం.
విఫలం చేసాక, మళ్ళీ చర్చ జరిగింది కాబట్టి మూసను మార్చాను అనే అర్జున గారి వాదన సరైనది కాదు. అలా చెయ్యదలిస్తే ఆ ముసను అలాగే ఉండనిచ్చి, ఆ చర్చ కింద తన వ్యాఖ్య రాసి ఉండాల్సింది. అంతే తప్ప ఇలా మూస మార్చరాదు. @Pavan santhosh.s గారి చర్యను నేను సమర్ధిస్తున్నాను. అర్జున గారు తీసుకున్న చర్యను రద్దు చెయ్యాలని అభిప్రాయపడుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 03:57, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, చర్చలో మూసను మార్చడం, చర్చను మార్చడం కాదు. చర్చలో మూస చర్చలు మెరుగుగా జరగటానికి ఉపయోగపడాలి. ఈ మూస అలానే వుంచితే ఇంకా ఎవరోవచ్చి అభిప్రాయలు చేర్చే అవకాశంలేదు. అలా చేర్చే అవకాశం వున్న చర్చావిభాగాలలో నేను సవరించలేదని గమనించండి. మూసను మార్చడంవలన అసలు స్పందన రాని చర్చలు ప్రాధాన్యతను ఇచ్చినట్లవుతుంది. వ్యాఖ్య రాయడం గురించి మీ సూచన నచ్చింది. ఇప్పుడు మూస మార్చటం గురించి వ్యాఖ్య వ్రాశాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:19, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, వ్యాఖ్య రాస్తే చాలు. ఈ చర్చలో మీరు మూసను మార్చడమంటే అక్కడి చర్చ స్వరూపాన్ని, దాని మౌలిక ప్రాతిపదికనూ మార్చడమే. ఆ మూస మార్పును రద్దు చేయాలి. వికీపీడియా నియమాలకు మిరు చేసిన పని విరుద్ధం.__ చదువరి (చర్చరచనలు) 00:59, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, పవన్ గారలకు ఈ విషయం పై చర్చను అవసరం అనుకుంటే మూస_చర్చ:సహాయం_కావాలి#సహాయం_xxxx_తో_ప్రారంభమయ్యే_మూసల_మార్పు లో కొనసాగించండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:31, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, అక్కర్లేదు, మీరు తప్పు చేసినది ఇక్కడ. ఆ తప్పును ఇక్కడే సవరించాలి. __ చదువరి (చర్చరచనలు) 01:00, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, నేను చేసిన మార్పును అప్పటి మూసవాడుక విధానం ప్రకారమే చేశాను అని గమనించండి. పై చర్చలో వివరణ ఇచ్చాను. ఇకపై వాడుక వివరాల స్పష్టతకు మూసకు సవరణ చేశాను. గమనించండి. ఇంకను మీరు "నేను చేసింది తప్పు" అని అనుకుంటే, మీతో విభేదించక తప్పట్లేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 21:53, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]